Sankranthiki Vasthunam Movie
-
ఈసారి సంక్రాంతి నాదే అంటున్న వెంకీ మామ
-
పెదవుల పైన మెరుపులు మెరిశాయే...
‘‘నా లైఫ్లోనున్న ఆ ప్రేమ పేజీ తీయనా... పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా..’ అంటూ మొదలవుతుంది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘మీనూ...’ పాట. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఇందులో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ భార్యగా ఐశ్వర్యా రాజేశ్, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటించారు. ఈ ట్రయాంగిల్ క్రైమ్ కామెడీ సినిమాను ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘మీనూ...’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘చిరు చిరు జల్లుల్లో పెదవులు తడిశాయే... తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిశాయే... ఉరుముల చప్పుడులో ఉరకలు మొదలాయే...’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ వహించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ప్రణవీ ఆచార్యతో కలిసి ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాడారు. -
సంక్రాంతి కోసం ప్రేమ పేజీలు ఓపెన్ చేసిన వెంకీ
హీరో వెంకటేష్ కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి మరో అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..' అనే పాట బాగా పాపులర్ అయింది. సోషల్‌మీడియాలో భారీగా రీల్స్ రూపంలో వైరల్ కూడా అవుతుంది. ఇప్పుడు మీను.. అంటూ సాగే ఈ పాట కూడా మ్యూజికల్ హిట్‌గా నిలవనుంది.అనంత శ్రీరామ్ రచించిన ఈ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య ఆలపించారు. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న రిలీజ్ కానుంది. -
ఆ గ్యాప్‌ను ఫిల్ చేయాలనుకుంటున్నాను: రమణ గోగుల
‘‘ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ చాలా అద్భుతమైన పాటలు, సంగీతం అందిస్తున్నారు. అయితే ఓ న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్కు ఎక్కడో చిన్న గ్యాప్ ఉందనిపిస్తోంది. ఆ గ్యాప్‌ను ఫిల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు కొన్ని కొత్త ఐడియాస్ ఉన్నాయి. మంచి కథ, హీరో, దర్శక–నిర్మాతలు, సరైన సమయం... ఇలా అన్నీ కుదిరితే కచ్చితంగా సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అన్నారుసంగీత దర్శకుడు, గాయకుడు రమణ గోగుల. వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది.సంగీత దర్శకుడు, గాయకుడు రమణ గోగుల దాదాపు పన్నెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘గోదారి గట్టు..’ పాటను పాడారు. ఈ సందర్భంగా రమణ గోగుల చెప్పిన విశేషాలు. ⇒ వెంకటేశ్‌గారి ‘ప్రేమంటే ఇదేరా..’ సినిమాతో సంగీత దర్శకుడిగా నా కెరీర్ మొదలైంది. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత వెంకటేశ్‌గారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని పాటతో తిరిగి ఇండస్ట్రీకి వచ్చాను. ఇదంతా చూస్తుంటే లైఫ్ ఫుల్ సర్కిల్ అవ్వడం ఇదేనేమో అనిపిస్తోంది. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఫోన్ చేసి, ‘గోదారి గట్టు..’ పాట పాడాలని కోరారు. నేనేమో ఇప్పటివరకు వేరే సంగీత దర్శకుల పాటలను పాడింది లేదు.సరే... ఓసారి పాట విందామని విన్నాను. చాలా నచ్చింది. పాటలో ఓ హార్ట్ ఉందనిపించి, ఒప్పుకున్నాను. మధుప్రియ నాతో కలిసి చాలా బ్యాలెన్సింగ్‌గా పాడారు. భాస్కరభట్లగారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి, భీమ్స్ ఈ పాట పాడేందుకు నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. వెంకటేశ్‌గారు నాకు లవ్లీ ఫ్రెండ్. ఆయన ఫోన్ చేసి, అభినందించారు. పాట రిలీజైన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు 27 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఎవరో ఓ వ్యక్తి మాది గుంటూరు అంటూ ఫోన్ చేసి, ‘గోదారి..’ పాట బాగుందని మాట్లాడాడు. చాలా హ్యాపీ ఫీలయ్యాను. ⇒ నాకు మ్యూజిక్‌తో పాటు టెక్నాలజీ అంటే ఇష్టం. దీంతో అబ్రాడ్‌లో ఓ మల్టీనేషనల్ కంపెనీకి వర్క్ చేశాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డాటా ఎనలిటిక్స్ వంటి అంశాలపై పని చేశాను. అలాగని సంగీతానికి దూరంగా లేను. నాకు ఇష్టమైనప్పుడు మా ఇంట్లో పియానోను, గిటార్‌ను ప్లే చేస్తూనే ఉంటాను. ఏఐతో సాంగ్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ హ్యూమన్ టచ్ ఉన్నప్పుడే సాంగ్స్ బాగుంటాయి. ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నా నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఈ గ్యాప్‌లో దాదాపు వంద సినిమాలు రిజెక్ట్ చేసి ఉంటాను. నాకు ఇష్టం అయితేనే సాంగ్స్ కంపోజ్ చేస్తాను. -
వెంకటేష్ బర్త్‌డే కానుక.. రెండో సాంగ్ ప్రోమో అదిరిపోయింది
హీరో వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ యూనిట్ నుంచి శుభాకాంక్షలు చెబుతూ రెండో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..' అనే పాట బాగా పాపులర్ అయింది. సోషల్‌మీడియాలో భారీగా రీల్స్ రూపంలో వైరల్ కూడా అవుతుంది. ఇప్పుడు మీను.. అంటూ సాగే పాట నుంచి ప్రోమో రిలీజ్ అయింది. పూర్తి సాంగ్ త్వరలో విడుదల కానుంది.వెంకటేష్ తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో ఈ చిత్రంలో నటిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌తో సంక్రాంతి రేసులో ఉన్న ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. -
స్టయిలిష్‌గా...
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా గురువారం (డిసెంబరు 12) వెంకటేశ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి ఆయన స్టయిలిష్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాలోని రెండో పాట ‘మీనూ... ప్రోమోను నేడు రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. -
18 ఏళ్ల తర్వాత 'సంక్రాంతి' కోసం సాంగ్ పాడిన రమణగోగుల
టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేశ్ ఈసారి సంక్రాంతి రేసులో ఉన్నారు. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా పేరు ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఈ పాటను ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 2025 సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. -
గోదారి గట్టు మీద...
వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్ లొకేషన్స్‌లో జరుగుతోంది. వెంకటేశ్, మీనాక్షీ చౌదరి కాంబినేషన్లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను డిసెంబరు 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్‌ను రిలీజ్ చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటను రమణ గోగుల పాడారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
మాజీ ప్రేయసితో పాట
హ్యాపీగా ప్రేయసితో వెంకటేశ్ డెహ్రాడూన్‌లో పాట పాడుకుంటున్నారు. వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని లొకేషన్లలో వెంకటేశ్, మీనాక్షీ చౌదరి పాల్గొనగా ఓ పాట షూట్ చేస్తున్నారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
కన్ఫ్యూజన్ తీరింది.. వెంకటేష్ కూడా సంక్రాంతికే
విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వలో ఓ సినిమా చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. కొన్నిరోజుల క్రితం డబ్బింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఈ చిత్రానికి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతోపాటు రిలీజ్ ఎప్పుడనేది కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)రాబోయే సంక్రాంతికి రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా ఉంది. దీన్ని నిర్మించిన దిల్ రాజు.. వెంకీ 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా ప్రొడ్యూస్ చేశారు. చరణ్ మూవీ వస్తున్నందున వెంకీ మూవీ వాయిదా పడే ఛాన్స్ ఉందని గత కొన్నిరోజులుగా రూమర్స్ వచ్చాయి. కానీ అలాంటిదేం లేదని ఇప్పుడు టైటిల్ పోస్టర్‌తో క్లారిటీ వచ్చేసింది.ఇల్లాలు, ప్రియురాలు తరహా కాన్సెప్ట్‌తో వెంకీ కొత్త సినిమా తీసినట్లు తెలుస్తోంది. ఇందులో వెంకటేశ్ మాజీ పోలీస్‌గా కనిపిస్తారు. అతడి భార్యగా ఐశ్వర్యా రాజేశ్, ప్రియురాలిగా మీనాక్షి చౌదరి నటించారు. భీమ్స్ సంగీతమందించారు. సంక్రాంతి రిలీజ్ అని చెప్పారు గానీ తేదీ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. మరి ఇప్పుడు చెప్పినట్లు పండక్కి వస్తారా? చివరి నిమిషంలో ఏమైనా వాయిదా అని చెప్పి షాకిస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'క' సినిమా ధమాకా.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?)