‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్విటర్‌ రివ్యూ | Sankranthiki Vasthunam Movie Twitter Review | Sakshi
Sakshi News home page

Sankranthiki Vasthunam X Review : ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్విటర్‌ రివ్యూ

Jan 14 2025 7:30 AM | Updated on Jan 14 2025 7:49 AM

Sankranthiki Vasthunam Movie Twitter Review

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్‌ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది.  భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు కొన్ని చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. 

సంకాంత్రికి వస్తున్నాం సినిమా కథ ఏంటి..? ఎలా ఉంది..? వెంకీ, అనిల్‌ కాంబో ఖాతాలో హ్యాట్రిక్‌ హిట్ పడిందా లేదా..? తదితర అంశాలను ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి.  ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.

ఎక్స్‌లో సం‍క్రాంతికి వస్తున్నాం సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. రొటీన్‌ కథ అయినప్పటికీ కామెడీ బాగా వర్కౌట్‌ అయిందని చెబుతున్నారు. 

 

 ఇప్పుడే సినిమా చూశాను. సెకండాఫ్‌ హిలేరియస్‌. అవకాయ ఎపిసోడ్‌ అదిరిపోయింది. అయితే కొన్ని సీన్లు సాగదీతగా ఉన్నాయి. చివరి 30 నిమిషాలు అనిల్‌ రావిపూడి చక్కగా హ్యాండిల్‌ చేశాడు. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా ఇది అంటూ ఓ నెటిజన్‌ 3.5 రేటింగ్‌ఇచ్చాడు.

 సంక్రాంతికి వస్తున్నాం టైంపాస్‌ కామెడీ సినిమా. పండక్కి వినోదాన్ని అందించే చిత్రం. ఎఫ్‌2 మాదిరే హిలేరిస్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు అనిల్‌ రావిపూడి. పార్టులుగా చూస్తే కామెడీ బాగా వర్కౌట్‌ అయింది. ప్రొడక్షన్‌ క్యాలిటీస్‌ అంతగా బాగోలేవు. సినిమాలో పెద్ద కథ కూడా ఉండదు. లాజిక్స్‌ గురించి పట్టించుకోవద్దు. వెంకటేశ్‌ తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. క్లైమాక్స్‌ ఆకట్టుకుంటుంది. ఈ పండక్కి ఫ్యామిలీస్‌కి ఈ సినిమా మంచి ఛాయిస్‌ అంటూ మరో నెటిజన్‌ 2.75 రేటింగ్‌ ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement