‘‘సంక్రాంతి పండగకి నిజాయతీగా ఓ ఫ్యామిలీ సినిమా ఇవ్వాలనుకున్నాం. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆదరించారు. హిట్ కాదు... ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. మా సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam). మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలైంది.
గురువారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెంకటేశ్(Venkatesh) మాట్లాడుతూ– ‘‘అనిల్‌తో నేనో ఫ్రెండ్‌లానే ఉంటాను. మేము చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాం.. అందుకే రిజల్ట్ ఇంత పాజిటివ్‌గా ఉంటుంది. ఐశ్వర్య అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. తనకి మంచి రోల్ దొరికింది. తను చాలా అనుభవం వున్న నటి. ఈ జోనర్ చేయడం తనకి కొత్త. అనిల్ చాలా చక్కని పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. ఇక నా సినిమా ఇన్ని కోట్లు వసూలు చేయాలని నేనెప్పుడూ అడగను... వచ్చింది తీసుకోవాలి. ఇప్పటికే మా సినిమా రూ. 230 కోట్లు వసూలు చేయడం అనేది బోనస్.. ఇంతకంటే ఏం కావాలి’’ అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ–‘‘సినిమాకి కాస్త దూరమైన ప్రేక్షకులు కూడా మా ‘సంక్రాంతికి వస్తున్నాం’ కోసం థియేటర్‌కి రావడం ఆనందంగా ఉంది. రెవెన్యూ సైడ్ కూడా మేం ఊహించినదానికంటే అద్భుతంగా రావడం హ్యాపీ’’ అని చె΄్పారు. ‘‘వెంకటేశ్‌గారి ‘కలిసుందాం రా’ సినిమా పాటలని ప్రేక్షకులు ఎంత గుండెల్లో పెట్టుకున్నారో... ‘సంక్రాంతికి వస్తున్నాం’ సాంగ్స్‌ని కూడా అదే స్థాయిలో ఆస్వాదించడం సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు భీమ్స్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment