Aishwarya Rajesh
-
పెదవుల పైన మెరుపులు మెరిశాయే...
‘‘నా లైఫ్లోనున్న ఆ ప్రేమ పేజీ తీయనా... పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా..’ అంటూ మొదలవుతుంది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘మీనూ...’ పాట. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఇందులో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ భార్యగా ఐశ్వర్యా రాజేశ్, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటించారు. ఈ ట్రయాంగిల్ క్రైమ్ కామెడీ సినిమాను ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘మీనూ...’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘చిరు చిరు జల్లుల్లో పెదవులు తడిశాయే... తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిశాయే... ఉరుముల చప్పుడులో ఉరకలు మొదలాయే...’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ వహించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ప్రణవీ ఆచార్యతో కలిసి ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాడారు. -
సంక్రాంతి కోసం ప్రేమ పేజీలు ఓపెన్ చేసిన వెంకీ
హీరో వెంకటేష్ కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి మరో అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..' అనే పాట బాగా పాపులర్ అయింది. సోషల్‌మీడియాలో భారీగా రీల్స్ రూపంలో వైరల్ కూడా అవుతుంది. ఇప్పుడు మీను.. అంటూ సాగే ఈ పాట కూడా మ్యూజికల్ హిట్‌గా నిలవనుంది.అనంత శ్రీరామ్ రచించిన ఈ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య ఆలపించారు. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న రిలీజ్ కానుంది. -
వెంకటేష్ బర్త్‌డే కానుక.. రెండో సాంగ్ ప్రోమో అదిరిపోయింది
హీరో వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ యూనిట్ నుంచి శుభాకాంక్షలు చెబుతూ రెండో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..' అనే పాట బాగా పాపులర్ అయింది. సోషల్‌మీడియాలో భారీగా రీల్స్ రూపంలో వైరల్ కూడా అవుతుంది. ఇప్పుడు మీను.. అంటూ సాగే పాట నుంచి ప్రోమో రిలీజ్ అయింది. పూర్తి సాంగ్ త్వరలో విడుదల కానుంది.వెంకటేష్ తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో ఈ చిత్రంలో నటిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌తో సంక్రాంతి రేసులో ఉన్న ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. -
18 ఏళ్ల తర్వాత 'సంక్రాంతి' కోసం సాంగ్ పాడిన రమణగోగుల
టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేశ్ ఈసారి సంక్రాంతి రేసులో ఉన్నారు. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా పేరు ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఈ పాటను ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 2025 సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. -
గోదారి గట్టు మీద...
వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్ లొకేషన్స్‌లో జరుగుతోంది. వెంకటేశ్, మీనాక్షీ చౌదరి కాంబినేషన్లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను డిసెంబరు 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్‌ను రిలీజ్ చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటను రమణ గోగుల పాడారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
మాజీ ప్రేయసితో పాట
హ్యాపీగా ప్రేయసితో వెంకటేశ్ డెహ్రాడూన్‌లో పాట పాడుకుంటున్నారు. వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని లొకేషన్లలో వెంకటేశ్, మీనాక్షీ చౌదరి పాల్గొనగా ఓ పాట షూట్ చేస్తున్నారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతి వస్తున్నాం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
గోదారి గట్టు మీద...
హీరో వెంకటేశ్, సంగీత దర్శకుడు రమణ గోగుల కాంబినేషన్ 18 ఏళ్ల తర్వాత మళ్లీ కుదిరింది. వెంకటేశ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘లక్ష్మి’కి సంగీతం అందించిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్‌ని అందించారు. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘గోదారి గట్టుమీద...’ అంటూ సాగే తొలి పాట త్వరలో రిలీజ్ కానుంది. ‘‘ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. రెగ్యులర్ ప్లేబ్యాక్ సింగర్‌తో కాకుండా పెక్యులియర్ వాయిస్‌తో ఈ పాట పాడించాలని అనిల్ రావిపూడి చెప్పారు. దీంతో రమణ గోగులతో పాడించాం. ఆయన ప్రత్యేకమైన వాయిస్‌తో పాడిన ఈ సాంగ్ మూవీకి ఎక్స్ట్రా మ్యాజిక్ యాడ్ చేయడం ఖాయం. త్వరలో ఈ పాటను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, వీకే నరేశ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: సమీర్ రెడ్డి. -
హేమా కమిటీలు మాకొద్దు: ఐశ్వర్య రాజేశ్
సినిమా పరిశ్రమలో నటీమణుల లైంగిక వేధింపుల వ్యవహారంపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని నివేదికను ఎప్పుడైతే కేరళ ప్రభుత్వం విడుదల చేసిందో, అప్పటి నుంచే నటీమణుల్లో ఒక ధైర్యం, తెగింపు వచ్చినట్లుంది. ఒక్కొక్కరూ తమ చేదు అనుభవాలను బహిరంగంగా చెప్పడం మొదలెట్టారు. అది ఇప్పుడు కోలీవుడ్ వరకూ పాకింది. దీంతో కోలీవుడ్‌లోనూ హేమా కమిషన్ తరహాలో ఒక కమిటీ కావాలనే డిమాండ్ రావడంతో, దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) అలాంటి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, అలాంటి కమిటీ తమిళ చిత్రపరిశ్రమకు అవసరం లేదనే అభిప్రాయాన్ని నటి ఐశ్వర్యరాజేశ్ పేర్కొనడం ఆసక్తిగా మారింది. నటిగా చిన్నస్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన నటి ఐశ్వర్యరాజేశ్. ఆదిలో చిన్న చిన్న పాత్రలు పోషించి స్వశక్తితో ఎదిగిన ఐశ్వర్యరాజేశ్ ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ పాత్రలనే కాకుండా దక్షిణాది ప్రముఖ నటిగా రాణిస్తున్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె ఇటీవల ఒక భేటీలో హేమా కమిటీ గురించి స్పందిస్తూ తనకు అలాంటిదేమీ జరగలేదు అన్నారు. అలాంటివి జరగకూడదనే కోరుకుందాం అన్నారు. అంతేకాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికి అలాంటి ఒక విషయం జరగలేదు. అందువల్ల తమిళ చిత్రపరిశ్రమలో హేమా కమిషన్ లాంటిది అవసరం లేదని పేర్కొన్నారు. ఒక వేళ ఏదైనా జరిగితే దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని, అందుకు కారకులైన వారిపై కఠినశిక్ష వేయాలని పేర్కొన్నారు. మహిళల రక్షణే ముఖ్యం అని నటి ఐశ్వర్యరాజేశ్ అన్నారు. -
పొల్లాచ్చికి పోదాం
పొల్లాచ్చికి పోదాం అంటున్నారట హీరో వెంకటేశ్. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సిని మాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఓ మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, అతని మాజీ ప్రేయసి... ఇలా మూడు పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ్రపారంభమైంది. అయితే హీరో వెంకటేశ్ పాల్గొనని సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. కాగా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల రెండో వారంలో పొల్లాచ్చిలో ్రపారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో వెంకటేశ్‌తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ కూడా పాల్గొంటారట. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. -
Aishwarya Rajesh: కైపెక్కించే చూపులతో మతిపోగొడుతున్న ఐశ్వర్య రాజేశ్ (ఫోటోలు)
-
గ్లామరస్ పాత్రలలో ఎందుకు నటించనంటే..: ఐశ్వర్య రాజేశ్
ఐశ్వర్య రాజేశ్... దక్షిణాది సినిమాలో స్టార్ హీరోయిన్. చిన్నచిన్న పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగి లేడీ ఓరియంటెండ్ కథా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగారు. యంగ్ ఏజ్‌లోనే కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి ఆ పాత్రకు జీవం పోశారు. ఆ చిత్రమే ఐశ్వర్య రాజేశ్ కేరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది. అయితే, సినిమా అనేది గ్లామర్ ప్రపంచం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్లను గ్లామర్‌గా చూపించడానికే దర్శక నిర్మాతలు యత్నిస్తుంటారు. ఇక చాలామంది హీరోయిన్లు గ్లామర్‌నే నమ్ముకుంటారన్నది వాస్తవం. అయితే, అందుకు భిన్నంగా ఉండే అతికొద్ది మంది హీరోయిన్లలో నటి ఐశ్వర్యరాజేశ్ ఒకరు. కోలీవుడ్‌లో ఐశ్వర్యరాజేశ్‌కు అంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఉమెన్స్ సెంట్రిక్ కథా పాత్రల్లో నటిస్తూ వరుసగా చిత్రాలు చేసిన ఈమె ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో నటించడంతో తమిళంలో చిత్రాలు తగ్గాయి. కాగా ఇటీవల విదేశాలకు వెళ్లిన ఐశ్వర్యరాజేశ్ అక్కడ నుంచి గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీంతో ఐశ్వర్య రాజేశ్ కూడా గ్లామర్‌కు మారిపోయారనే ప్రచారం హల్చల్ చేస్తోంది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ గ్లామర్ పాత్రల్లో నటించమని తనకు చాలా అవకాశాలు వచ్చాయన్నారు. కానీ, తాను అలాంటి పాత్రల్లో నటించడానికి అంగీకరించలేదన్నారు. తనకు తగిన పాత్రల్లో నటించడమే తనకు ఇష్టం అని పేర్కొన్నారు. గ్లామరస్‌గా నటించడం తనకు తగదన్నారు. అందుకే గ్లామరస్ పాత్రల్లో నటించడానికి మొగ్గు చూపడం లేదన్నారు. తనకు కుటుంబ కథా చిత్రాలే కావాలనీ, అందులోనూ నటనకు అవకాశం ఉండాలనీ కోరుకుంటు న్నాని నటి ఐశ్వర్యరాజేశ్ పేర్కొన్నారు. కాగా ఈమె కన్నడంలో శివరాజ్ కుమార్‌కు జంటగా నటించిన ఉత్తరఖాండ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈమె నటించిన తొలి కన్నడ చిత్రం ఇదే కావడం గమనార్హం. -
Miami: వేకేషన్లో బ్యూటీ.. లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసిన ఐశ్వర్య రాజేశ్ (ఫోటోలు)
-
భార్య–భర్త–మధ్యలో మాజీ ప్రేయసి
‘ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హీరో వెంకటేశ్–దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ కాంబినేషన్లో కొత్త సినిమా షురూ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందుతున్న 58వ చిత్రమిది. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌కి జోడీగా మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. వెంకటేశ్–మీనాక్షీ చౌదరిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ‘‘హీరో, అతని భార్య, మాజీ ప్రేయసి... ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందుతోంది. హీరో– దర్శక–నిర్మాతల కాంబినేషన్లో ఇప్పటికే రెండు బ్లాక్బస్టర్లు రావడంతో మూడో చిత్రం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులకు మునుపెన్నడూ కలగని అనుభూతిని అందించడానికి టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు’’ అన్నారు మేకర్స్. ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, వీకే నరేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: సమీర్ రెడ్డి. -
హీరో వెంకటేష్ భార్యగా ‘ఐశ్వర్య రాజేష్’ (ఫొటోలు)
-
వెంకీ సరసన క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా?
ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో సైంధవ్ మూవీతో ప్రేక్షకులను టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్. శైలేశ్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం వెంకీ అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది.అయితే ఈ వెంకీ సరసన మరో హీరోయిన్ కనిపించనుంది. తాజాగా కోలీవుడ్ భామ ఐశ్వర్య రాజేశ్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఫుల్ యాక్షన్ కథాచిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. Welcoming on board, the talented @aishu_dil as the EXcellent Wife in #VenkyAnil3 ❤️Victory @VenkyMama #DilRaju #Shirish #BheemsCeciroleo @YoursSKrishna @SVC_official #SVC58 pic.twitter.com/YQy5RlmMDp— Anil Ravipudi (@AnilRavipudi) July 2, 2024 -
ఐశ్వర్యా రాజేశ్ మత్తెక్కించే పోజులు.. రోజురోజుకీ అందంగా! (ఫొటోలు)
-
Aishwarya Rajesh: సోయగంతో కవ్విస్తున్న ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)
-
అతి మంచి పనికిరాదని నాన్న నుంచే నేర్చుకున్నా: హీరోయిన్
ఐశ్వర్య రాజేశ్... దక్షిణాది సినిమాలో స్టార్ హీరోయిన్. చిన్నచిన్న పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగి లేడీ ఓరియంటెెడ్ కథా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగారు. యంగ్ ఏజ్‌లోనే కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి ఆ పాత్రకు జీవం పోశారు. ఆ చిత్రమే ఐశ్వర్య రాజేశ్ కేరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది.తండ్రి అతి మంచి వల్లఈ హీరోయిన్ ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా తన కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను, అమ్మ పడ్డ బాధలను వివరించారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడానికి తన తండ్రి ష్యూరిటీ ఇచ్చి రుణాలు ఇప్పించారన్నారు. అయితే ఆనారోగ్యం కారణంగా తన తండ్రి మరణిస్తే అప్పులు ఎగ్గొట్టిన వారి రుణ భారం అంతా తల్లిపై పడిందన్నారు. దీంతో తమకు ఉన్న ఒకే ఒక్క ప్లాట్‌ను విక్రయించి ఆ అప్పును తీర్చినట్లు చెప్పారు. అమ్మ ఏ లోటూ లేకుండాఅంత కష్టంలోనూ అమ్మ తమను మంచి పాఠశాలలో చదివించారని, ఏ లోటూ లేకుండా చూసుకున్నారన్నారు. తన అన్నయ్యలు ఇద్దరూ చదువు పూర్తి చేసి ఉద్యోగం చేయడానికి సిద్ధమైన సమయంలో ఒక ప్రమాదంలో మరణించారన్నారు. అప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్న అమ్మను ఆ సంఘటన మరింత కుంగదీసిందన్నారు. అయినా తను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని తెలిపారు. అమ్మ నుంచే నేర్చుకున్నావృత్తిపరంగా తాను ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నా, ధైర్యంగా ముందుకు సాగే గుణాన్ని తన తల్లి నుంచే నేర్చుకున్నట్లు చెప్పారు. అలాగే అతి మంచికి పోకూడదన్నది తన తండ్రి జీవితం నుంచి నేర్చుకున్నట్లు ఐశ్వర్య రాజేశ్ చెప్పారు. -
అక్కడ అదృష్టం పరీక్షించుకోనున్న హీరోయిన్!
బుల్లితెర నుంచి వెండి తెరకు ప్రవేశించి ఆరంభంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు ఐశ్వర్య రాజేశ్. ఇప్పుడు కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్నారు. కాక్కాముట్టై చిత్రం ఐశ్వర్య రాజేష్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించారు. అలాగే ధనుష్ కథానాయకుడిగా నటించిన వడచెన్నై చిత్రంలో బోల్డ్ పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలూ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తూ బహుభాషా కథానాయికగా పేరు తెచ్చుకున్నారు.తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. కన్నడంలో సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, బాలి ధనుంజయ కలిసి నటిస్తున్న ఉత్తరాఖాండ అనే భారీ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఇందులో ఆమె నటుడు బాలి ధనుంజయకు జంటగా దుర్గి అనే ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రాన్ని రోహిత్ పడకి దర్శకత్వంలో కేఆర్జీ స్టూడియోస్ పతాకంపై కార్తీక్‌గౌడ, యోగి జి రాజ్ కలిసి నిర్మిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బీజాపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కాగా ఐశ్వర్య రాజేష్ జీవి ప్రకాష్‌కుమార్‌తో కలిసి నటించిన డియర్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తమిళంలో కరుప్పర్ నగరం, మోహన్ దాస్, తీయవర్ కులైగల్ నడుంగా చిత్రాలతో పాటు మలయాళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) చదవండి: -
DeAr Movie Review : గురక కాన్సెప్ట్‌తో వచ్చిన ‘డియర్’ ఎలా ఉందంటే?
టైటిల్: డియర్నటీనటులు: జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్, ఇలవరసు, రోహిణి, కాళి వెంకట్, తలైవసల్ విజయ్, నందిని, గీతా కైలాసం తదితరులునిర్మాతలు: జీ పృథ్వీ కుమార్, అభిషేక్ రామిశెట్టి, వరుణ్ త్రిపురనేనిదర్శకత్వం: ఆనంద్ రవించంద్రన్సంగీతం: జీవీ ప్రకాశ్విడుదల తేది: ఏప్రిల్ 12, 2024అర్జున్(జీవీ ప్రకాశ్ కుమార్) ఓ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్. ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అవ్వాలనేది అతని కల. కానీ అతని అన్నయ్య చరణ్(కాళి వెంకట్), అమ్మ లక్ష్మీ(రోహిణి) మాత్రం అర్జున్‌కి పెళ్లి చేయాలని ఫిక్స్ చేస్తారు. ఓ మంచి సంబంధం చూస్తారు. అమ్మాయి పేరు దీపిక(ఐశ్వర్య రాజేష్). ఆమెకు గురక పెట్టే అలవాటు ఉంటుంది. ఈ విషయాన్ని దాచి అర్జున్‌ని పెళ్లి చేసుకుంటుంది. అర్జున్‌కి ఏమో నిద్రపోయినప్పుడు చిన్న శబ్దం వినిపించినా.. లేచి కూర్చునే అలవాటు. వీరిద్దరికి ఉన్న విభిన్నమైన అలవాట్లు.. వారి కాపురంలో కలతలు తెచ్చిపెడతాయి. అర్జున్ ఉద్యోగానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? భార్య పెట్టే గురక వల్ల అర్జున్‌కి ఎలాంటి సమస్యలు వచ్చాయి? విడాకుల వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కొత్త పాయింట్‌తో ఓ సినిమా వచ్చి..అది సూపర్ హిట్ అయిన తర్వాత అలాంటి కాన్సెప్ట్‌తోనే మళ్లీ సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? పాత కథే అయినా తెరపై కొత్తగా చూపిస్తే కొంతలో కొంత ఆదరించే అవకాశం ఉంటుంది. కానీ హిట్ సినిమా కాన్సెప్ట్ తీసుకొని.. అతి సాధారణంగా కథనాన్ని నడిపిస్తే ఎలా ఉంటుంది? ‘డియర్’ మూవీలా ఉంటుంది. గురక సమస్యతో అల్రేడీ ‘గుడ్‌నైట్’ అనే సినిమా వచ్చి.. ప్రేక్షకులను మనసును దోచుకుంది. అలాంటి కాన్సెప్ట్‌తోనే తెరకెక్కిన మూవీ ‘డియర్’.‘గుడ్‌నైట్’లో హీరోకి గురక సమస్య ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌కి ఉంటుంది. అంతే తేడా. కానీ గుడ్‌నైట్ సినిమాలో వర్కౌట్ అయిన ఎమోషన్ ఈ చిత్రంలో కాలేదు.. కథనాన్ని అటు వినోదాత్మకంగాను..ఇటు ఎమోషనల్‌గాను మలచడంతో దర్శకుడు ఘోరంగా విఫలం అయ్యాడు. సినిమాలో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. గురక సమస్యను అధిగమించేందుకు హీరో తీసుకునే నిర్ణయం సిల్లీగా అనిపిస్తుంది. ఆ సమస్యను పరిష్కరించేందుకు చాలా మార్గాలే ఉన్నా.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమా అనిపిస్తుంది. పైగా మధ్యలో హీరో పేరేంట్స్ సంబంధించిన స్టోరీని తీసుకొచ్చారు.పోనీ అదైనా కొత్తగా ఉందా అంటే.. అరగదీసిన ఫార్ములానే మళ్లీ వాడేశారు. ఏ దశలోను కథనం ఆసక్తికరంగా సాగదు. హీరోహీరోయిన్లకు ఉన్న సమస్యలను చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. హీరోయిన్‌కి గురక పెట్టే సమస్య.. హీరోకి పెన్సిల్ కిందపడిన శబ్దం వినించినా నిద్రలేచే అలవాటు. ఈ ఇద్దరికి ఉన్న సమస్యల మధ్య బోలెడంత కామెడీ పండించొచ్చు. కానీ దర్శకుడు ఆ దిశగా సన్నివేశాలను రాసుకోలేకపోయాడు. పోనీ ఎమోషనల్‌గా అయినా చూపించారా అంటే అదీ లేదు. తమకున్న సమస్యలను దాచి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అసలు విషయం తెలియడం.. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయడం.. ఇవన్నీ రొటీన్‌గా ఉంటాయి. ఇక హీరో ఉద్యోగం పోవడానికి గల కారణం బాగున్నా..దానికి సంబంధించిన సన్నివేశాలు అయితే సిల్లీగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ కాస్త ఆస్తకరంగా అనిపించినా.. సెకండాఫ్ మరింత సాగదీతగా ఉంటుంది. పేరెంట్స్‌ని కలిపే ఎపిసోడ్ మెయిన్ కథను పక్కదారి పట్టిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. గుడ్‌నైట్ సినిమా చూడనివారిని ఈ సినిమా కాస్త అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. అర్జున్‌గా జీవీ ప్రకాశ్ చక్కగా నటించారు. అయితే ఆయన పాత్రను బలంగా తిర్చిదిద్దడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. దీపిక పాత్రలో ఐశ్వర్య రాజేశ్ ఒదిగిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించింది. హీరో తల్లిగా రోహిణిది రొటీన్ పాత్రే. కాళీ వెంకట్, ఇళవరసుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. జీవీ ప్రకాశ్ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటలు సోసోగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
యాక్షన్ మూవీలో యంగ్ హీరోయిన్.. పెద్ద ఆఫరే!
పేరుకే తెలుగమ్మాయి కానీ తమిళ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలోనే వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటివరకు హీరోయిన్ ఓరియెంటెడ్ కథల్లో నటించిన ఈ బ్యూటీ.. తొలిసారి ఓ యాక్షన్ మూవీలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: పుకార్లకు చెక్.. 'పుష్ప 2' తర్వాత బన్నీ సినిమా ఫిక్స్) డిఫరెంట్ పాత్రల్లో కనిపించిన నేను.. ఇప్పుడు యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నానని ఐశ్వర్యా రాజేశ్ చెప్పుకొచ్చింది. చైన్నెలోని ఆదివారం జరిగిన ఓ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేసింది. ప్రతి సినిమాలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను తెలుసుకుని మరీ సినిమాలను ఎంపిక చేసుకుంటానని ఐశ్వర్యా రాజేశ్ చెప్పింది. సహజంగా నటించేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటానని అందుకే ఈ మూవీ అవకాశం దక్కిందని తెలిపింది. (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) -
అర్జున్‌కి కనెక్ట్ అయ్యా!
‘‘ఓపెన్ చేస్తే వైజాగ్‌లో అందమైన ఇల్లు...’’ అంటూ నాగచైతన్య ఇచ్చిన వాయిస్ ఓవర్‌తో మొదలైంది ‘డియర్’ చిత్రం ట్రైలర్. జీవీ ప్రకాశ్‌కుమార్, ఐశ్వర్యా రాజేశ్ నటించిన చిత్రం ‘డియర్’. తమిళంలో ఈ నెల 11న, తెలుగులో 12న ఈ చిత్రం విడుదల కానుంది. వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి. పృథ్వీరాజ్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆంధ్రాలో అన్నపూర్ణ స్టూడియోస్, తెలంగాణలో ఏషియన్ సినిమాస్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. భార్య (ఐశ్వర్యా రాజేశ్) గురక కారణంగా భర్త (జీవీ ప్రకాశ్) సతమతమవుతుంటాడు. ఆ గురక కారణంగా వారి అనుబంధంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది ‘డియర్’ కథాంశం. ‘‘ఈ ప్రపంచంలో నాకు బాగా నచ్చేది ఏంటో తెలుసా? రాత్రిపూట మంచి నిద్ర. ఈ కథను (‘డియర్’కి ఇచ్చిన వాయిస్ ఓవర్‌ని ఉద్దేశించి) నెరేట్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. అర్జున్ (జీవీ ప్రకాశ్ పాత్ర) భయానికి నేను కనెక్ట్ అయ్యాను. మీరూ కనెక్ట్ అవుతారనుకుంటున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో ‘డియర్’ ట్రైలర్‌ని షేర్ చేశారు నాగచైతన్య. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. -
భార్య గురక పెడితే... ఫన్నీగా సినిమా ట్రైలర్
జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా 'డియర్'. తమిళంలో ఏప్రిల్ 11న, తెలుగులో ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. నాగ చైతన్య వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రయిలర్ నూతన వధూవరుల పాత్రల్లో జివి ప్రకాష్ కుమార్ , ఐశ్వర్య రాజేష్ లైఫ్ లో స్నీక్ పీక్ ఇస్తుంది. గుడ్‌నైట్ సినిమాలో భర్తకు గురక ఉంటే ఇక్కడ భార్యకు గురక ఉంది. ఈమె గురక అలవాటు కారణంగా రిలేషన్ షిప్ కాంప్లికేటెడ్ గా మారిన కథాంశం సరికొత్తగా అనిపిస్తుంది. నాగ చైతన్య వాయిస్ ఓవర్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. జగదీష్ సుందరమూర్తి కెమెరా బ్రిలియంట్ గా వుంది. జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కామిక్ కోణాన్ని ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేయనుండగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ ప్రాంతంలో విడుదల చేయనుంది. డియర్‌లో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని కీలక పాత్రలలో నటించారు. -
ఐశ్వర్య రాజేష్ సినిమాలో ఇండియన్ స్టార్ క్రికెటర్
నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్, నటి ఐశ్యర్య రాజేశ్ జంటగా నటించిన చిత్రం డియర్. నటి రోహిణి, ఇళవరసు, తలైవాసల్ విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నట్‌మగ్ ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిఫేక్ రామిశెట్టి, జీ.పృధ్వీరాజ్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చే సుకుని, ఈ నెల 11వ తేదీన తెరపైకి రానుంది. టీమిండియా స్టార్ ఆటగాడు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలిసారిగా ఈ సినిమాలో భాగమయ్యారు. క్రికెట్లో స్పిన్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న అశ్విన్.. ఇప్పుడు వెండితెరపై కూడా కనిపించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. తమిళంలో వస్తున్న 'డియర్' సినిమాలో అతిథి పాత్రలో అశ్విన్ నటించారట. ఈ సినిమా ట్రైలర్ కూడా తాజాగా విడుదలైంది. కానీ సినిమాలో ఆయన లుక్ రివీల్ చేయలేదు. ఈ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నట్లు క్రికెటర్ అశ్విన్ స్వయంగా తన ఎక్స్ పేజీలో వెల్లడించారు. అశ్విన్‌తో హీరోయిన్ ఐశ్వర్యకు ఇదే తొలి చిత్రం. ఈ చిత్రాన్ని ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 11న విడుదల కానున్న డియర్ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేయగా దానిని అశ్విన్ కూడా తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. అశ్విన్ వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 'డియర్' చిత్రంలో దీపిక, అర్జున్ పాత్రలలో ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ నటించారు. కొత్తగా పెళ్లయిన జంట మధ్య జరిగే సమస్యల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమా గురించి జీవీ.ప్రకాశ్‌కుమార్ మాట్లాడుతూ నటి ఐశ్వర్యరాజేశ్ ఒకసారి విమానంలో కలిసినప్పుడు ఒక మంచి కథ ఉంది చే స్తారా? అని అడిగారన్నారు. ఆ చిత్రంలో ఈమె నటిస్తున్నారంటే తన పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదని భావించానన్నారు. అయినప్పుటికీ అందులో తను నటించకూడదనే భావనతోనే దర్శకుడిని కథ చెప్పమని అడిగానన్నారు. ఆ తరువాత దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ తనను కలిసి కథ చెప్పడంతో చాలా ఇంట్రస్ట్‌గా ఉందని పించిందన్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం ఎంతగానో ఆకట్టుకోవడంతో తాను నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. Excited to unveil the #DeAr trailer!🎉 Happy to have played a small part in it 😁. Check it out and let me know what you think ❤️ ▶️ https://t.co/bqvULPCmRi#DeArTrailer #DeArFromApril11 @NutmegProd @tvaroon #AbhishekRamisetty #PruthvirajGK @mynameisraahul #RomeoPictures… pic.twitter.com/tB1S6KXYUI — Ashwin 🇮🇳 (@ashwinravi99) April 5, 2024