Aishwarya Rajesh Comments On Star Heroes And Directors Over Movie Offers, Deets Inside - Sakshi
Sakshi News home page

Aishwarya Rajesh: నాతో అలా ప్రవర్తించారు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్

Published Fri, Jul 7 2023 10:35 AM | Last Updated on Fri, Jul 7 2023 11:11 AM

Aishwarya Rajesh Comments On Star Heroes - Sakshi

హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ తెలుగమ్మాయే కానీ టాలీవుడ్‌లో రెండే సినిమాలు చేసింది. విజయ్ దేవరకొండ, నానితో కలిసి నటించిన ఆ చిత్రాలు ఘోరంగా ఫెయిలయ్యాయి. ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయాయి. తప్పు ఎక్కడ జరిగిందనేది పక్కన బెడితే.. ఈ భామకు తెలుగులో మరో అవకాశం రాలేదు. అలా అని తమిళంలో పెద్ద పెద్ద సినిమాలు చేస్తుందా అంటే అదీ లేదు. ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ మధ్య చెన్నైలోని ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఐశ్వర్య.. ఇండస్ట్రీ, స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 

(ఇదీ చదవండి: Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ)

నన్ను గుర్తించట్లేదు
'తమిళంలో 'కాకా ముట్టై' సినిమాలో చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఆ చిత్రం చేసినప్పుడు ఇండస్ట్రీ మొత్తం నన్ను మెచ్చకుంది. అంతా బాగా జరుగుతుంది అనుకునేలోపు ఆఫర్స్ రాకపోవడం షాకయ్యేలా చేసింది. దాదాపు రెండేళ్లు ఒక్కరు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. నా కెరీర్ చూసుకుంటే ధనుష్, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, దుల్కర్ సల్మాన్ లాంటివాళ్లు తప్ప స్టార్ హీరోలు వాళ్ల మూవీస్ లో ఛాన్సులు ఇవ్వట్లేదు. ఇక్కడ సమస్య.. హీరో హీరోయిన్ కి మధ్య ఉన్న ఓ విషయం'

నా సినిమాకు నేనే హీరో
'మార్కెట్ విలువ, డిజిటిల్, శాటిలైట్, ఓటీటీ.. ఇలా అన్నీ చూసుకుని హీరోయిన్ ని తీసుకుంటున్నారు. మనం ఆశించిన స్థాయిలో ఉండాలంటే దేనికైనా రెడీ అవ్వాలి. అందుకే నేను స్టార్ హీరోల సినిమాల్లో కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నాను. ఇప్పటివరకు అలాంటివి 15 వరకు చేశాను. కానీ ఇప్పటికీ ఏ స‍్టార్ హీరో నాకు అవకాశం ఇవ్వట్లేదు. అసలు ఎందుకు పిలవట్లేదో కూడా తెలియదు. అయితేనేం నేను సంతోషంగానే ఉన్నాను. నా సినిమాకు నేనే హీరోగా చేస్తాను. స్టార్ హీరోల సినిమాలు చేయట్లేదని బాధలేదు. ఎందుకంటే నాకంటూ అభిమానులున్నారు' అని ఐశ్వర్యా రాజేశ్ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: 'సలార్' టీజర్ సరికొత్త రికార్డ్.. ఏకంగా టాప్‌లోకి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement