star heroes
-
టాలీవుడ్ ముందుకు... కథలు వెనక్కి..!
తెలుగు సినిమా వెయ్యి కోట్ల వసూళ్లతో ముందు ముందుకెళుతోంది. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి’ వంటి చిత్రాలు ఇందుకు నిదర్శనం. ఇలా వసూళ్ల పరంగా ముందుకు వెళుతున్న టాలీవుడ్ కథల పరంగా వెనక్కి వెళుతోంది. అవును... ఇప్పుడు పలువురు స్టార్ హీరోలు పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పదికి పైగా పీరియాడికల్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. 20వ శతాబ్దపు కథలతో రూపొందుతున్న ఆ చిత్రాల్లో నటిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.ఓ వైపు రాజాసాబ్...మరోవైపు ఫౌజీ యుద్ధానికి సరికొత్త నిర్వచనం ఇవ్వనున్నారు ప్రభాస్. ఇందుకోసం ఈ హీరో దాదాపు 80 ఏళ్లు వెనక్కి వెళ్లనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటించనున్నారు. 1940 నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లోప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రం పోస్టర్‌పై కనిపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’, ‘హైదరాబాద్ చార్మినార్’, ‘ఆపరేషన్ జెడ్’, ‘పవిత్రాణాయ సాధూనాం’ వంటి అంశాలు సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి. కొన్ని వాస్తవ ఘటనలకు కొంత కాల్పనికతను జోడించి ఈ సినిమా కథ తయారు చేశారట హను రాఘవపూడి. మాతృభూమి కోసం పోరాడే ఓ యోధుడి నేపథ్యంలో సాగే సినిమా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ‘ఆధిపత్యం కోసమే యుద్ధాలు జరుగుతున్న సమయం అది. అలాంటప్పుడు ఆ యుద్ధానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు ఓ యోధుడు’’ అంటూ ఈ సినిమా కథ గురించి ఇటీవల పేర్కొన్నారు హను రాఘవపూడి. జయప్రద, మిధున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2026ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా 1990 నాటి కథేనని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్‌ను చూపించ నున్నట్లుగా చిత్రయూనిట్ చెబుతోంది. ఇందులో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధీ కుమార్ మరో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలిసింది. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.ఇటు డ్రాగన్... అటు దేవరఎన్టీఆర్ను ‘డ్రాగన్’గా మార్చారట ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 8న ఈ సినిమాప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ ఆసక్తికరంగా మారింది. పోస్టర్‌పై 1969, గోల్డెన్ ట్రయాంగిల్, చైనా, భూటాన్, కోల్‌కతా అని పేర్కొంది చిత్రయూనిట్.దీంతో 1969 నేపథ్యంలోనే ఈ సినిమా కథనం ఉంటుందని, ఆ సమయంలో జరిగిన ఓ వాస్తవ ఘటనకు కల్పిత అంశాలను జోడించి, ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అంతేకాదు... ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుంది. ఇటీవల జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఎన్టీఆర్ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కె. హరికృష్ణ నిర్మించనున్న ఈ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ కానుంది. అలాగే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న మరో చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దేశంలో విస్మరణకు గురైన తీరప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమాను కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపిస్తారు. రెండు భాగాలుగా ‘దేవర’ రిలీజ్ కానుంది. తొలి భాగం సెప్టెంబరు 27న విడుదల కానుంది.పెద్ది!రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారని, ఇందులో అన్నదమ్ముల్లా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. కొంచెం బరువు పెరగాలనుకుంటున్నారు. రా అండ్ రస్టిక్‌గా ఆయన లుక్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదిలోనేప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం.రాయలసీమ నేపథ్యంలో...హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘టాక్సీవాలా’ హిట్ మూవీగా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత విజయ్, రాహుల్‌ల కాంబినేషన్లో మరో సినిమా రానుంది. రాయలసీమ నేపథ్యంలో 1854–1878 మధ్య కాలంలో జరిగే కథగా ఈ చిత్రం రానుంది. ఈ పీరియాడికల్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుగా విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని, ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే విజయ్ హీరోగా రవికిరణ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ సినిమా నిర్మించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది.అసాధారణ ప్రయాణంఓ సాధారణ వ్యక్తి జీవితంలో జరిగిన అసాధారణ ఘటనల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘లక్కీ భాస్కర్’. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన సినిమా ఇది. 1980 నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా ఉంటుంది. ఇందులో ఓ బ్యాంక్ క్యాషియర్‌గా దుల్కర్ సల్మాన్ కనిపిస్తారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబరు 31న రిలీజ్ కానుంది.క.. సస్పెన్స్కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడికల్ యాక్షన్ అండ్ సస్పెన్స్ డ్రామా ‘క’. దర్శకత్వ ద్వయం సుజిత్– సందీప్ తెరకెక్కిస్తున్నారు. కృష్ణగిరి పట్టణం, అక్కడ ఉన్న ఓ పోస్ట్‌మేన్, అతని జీవితంలోని మిస్టరీ ఎపిసోడ్ అంశాల నేపథ్యంలో ‘క’ సినిమా కథనం ఉంటుంది. చింతా గోపాలకృష్ణా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘క’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్నాయి.బచ్చల మల్లి ‘బచ్చల మల్లి’గా మారిపోయారు ‘అల్లరి’ నరేశ్. ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. సుబ్బు మంగాదేవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ ఓ ఊరి చుట్టూ ఉంటుందని తెలిసింది. ఇందులో ట్రాక్టర్ డ్రైవర్ మల్లి పాత్రలో కనిపిస్తారు ‘అల్లరి’ నరేశ్. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.ఎదురు చూపు ఓప్రాంతం ఒకతని కోసం ఎదురు చూస్తోంది. అతని పేరు సాయి దుర్గాతేజ్. 1940 నేపథ్యంలో సాగే ఓ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌లో సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్నారు. ‘హను–మాన్’ నిర్మాతలు చైతన్య, నిరంజన్‌రెడ్డి దాదాపు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రోహిత్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కష్టాలు పడుతున్న ఓప్రాంత వాసుల జీవితాలు ఓ వ్యక్తి రాకతో ఎలా మారతాయి? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.24 సంవత్సరాలు హీరో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో నటిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వైజాగ్ నేపథ్యంలో గ్యాంబ్లింగ్ అంశాలతో ‘మట్కా’ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. 1958 నుంచి 1982... అంటే ఇరవై నాలుగు సంవత్సరాల టైమ్ పీరియడ్‌లో ‘మట్కా’ సినిమా కథనం ఉంటుంది. ‘పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
విద్యార్థులే కానీ... వేసవి సెలవులు లేవు
వేసవి వస్తే విద్యార్థులు రిలాక్స్ అవుతారు. వేసవి సెలవులను ఆస్వాదిస్తారు. కానీ.. ఈ విద్యార్థులకు మాత్రం వేసవి సెలవులు లేవు. కాలేజీలకు వెళుతున్నారు. ఎందుకంటే వీళ్లు రియల్ స్టూడెంట్స్ కాదు.. రీల్ స్టూడెంట్స్. కొందరు స్టార్స్ ప్రస్తుతం స్టూడెంట్స్‌గా నటిస్తున్నారు. షూటింగ్ సెట్స్‌లో క్లాసులకు హాజరు అవుతున్నవారు కొందరైతే.. ప్రిపరేషన్ స్టూడెంట్స్ మరికొందరు. ఈ విద్యార్థుల గురించి తెలుసుకుందాం. ► కెరీర్లో పలు చిత్రాల్లో కాలేజ్ స్టూడెంట్‌గా నటించారు హీరో సూర్య. కానీ ఐదు పదుల వయసుకి చేరువ అవుతున్న టైమ్‌లో కూడా కాలేజ్‌కి వెళ్లెందుకు రెడీ అవుతున్నారు. ‘సూరరై ΄ోట్రు’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్లో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. స్టూడెంట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారే ఓ వ్యక్తి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. స్టూడెంట్ రోల్ కోసం ప్రస్తుతం సూర్య బరువు తగ్గుతున్నారని సమాచారం. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. ►కాలేజీ స్టూడెంట్ రోల్ హీరోయిన్ రష్మికా మందన్నాకు బాగా కలిసి వస్తుందని చె΄÷్పచ్చు. ఆ మాటకొస్తే... నటిగా రష్మికా మందన్నా కెరీర్ మొదలైంది కన్నడ హిట్ క్యాంపస్ డ్రామా ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతోనే. అంతేకాదు...రష్మికా మందన్నా తెలుగు ఎంట్రీ మూవీ ‘ఛలో’లోనూ, రెండో మూవీ ‘గీత గోవిందం’లోనూ ఆమెది కాలేజీ స్టూడెంట్ రోల్. ఇలా కాలేజీ స్టూడెంట్‌గా రష్మికా మందన్నా చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్. తాజాగా ఈ కోవలో రష్మికా మందన్నా చేస్తున్న చిత్రం ‘ది గాళ్‌ఫ్రెండ్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా పీజీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రోల్లో కనిపిస్తారని తెలిసింది. ఆమె బాయ్ ఫ్రెండ్‌గా దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఓ కాలేజీ స్టూడెంట్ తన ప్రేమను నెగ్గించుకునే క్రమంలో పడిన సంఘర్షణ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ‘చి..ల..సౌ’తో దర్శకుడిగా తొలి సినిమాతోనే హిట్ కొట్టిన రాహుల్ రవీంద్రన్ ‘ది గాళ్ ఫ్రెండ్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజయ్యే చాన్స్ ఉంది. ► కాలేజీలో ఓ ఫెయిల్యూర్ స్టూడెంట్‌గా తెరపై శ్రీ విష్ణు కనిపించిన ప్రతిసారీ ఆయనకు మంచి పేరు వచ్చింది. ‘నీదీ నాది ఒకే కథ’, ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాల్లో శ్రీ విష్ణు స్టూడెంట్‌గా నటించారు. మళ్లీ ఈ తరహా పాత్రలో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణుతో పాటు ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, ప్రియదర్శి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఓ యూనివర్సిటీలోని ముగ్గురు పీహెచ్డీ స్కాలర్స్ జీవితాలు ఓ ఘటనతో సడన్‌గా ఏ విధంగా మలుపు తిరిగాయి? అనే కోణంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా ఫస్టాఫ్‌లో కాలేజీ సీన్స్ ఉంటాయి. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వి సెల్యూలాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. స్టూడెంట్‌గా ఇన్నాళ్లూ సెట్లో బిజీగా ఉన్న శ్రీవిష్ణు ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటున్నారు. ► ‘ఏవండీ.. (మృణాల్ ఠాకూర్).. రామచంద్రా.. (చిన్న వాయిస్‌తో విజయ్ దేవరకొండ).. నేను కాలేజ్‌కి వెళ్లాలి.. కొంచెం దించేస్తారా? (మృణాల్ ఠాకూర్),.. ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..’ (విజయ్ దేవరకొండ)...‘ఫ్యామిలీస్టార్’ సినిమాలోని డైలాగ్ ఇది. సో.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కొన్ని సన్నివేశాల్లో కాలేజ్‌కి వెళతారని కన్ఫార్మ్ చేసుకోవచ్చు. ‘గీత గోవిందం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో రూ΄÷ందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. బాలీలో ఓ పాట చిత్రీకరిస్తే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ► ‘ఇగై’ సినిమా కోసం లా పాయింట్స్ చెబుతున్నారు అంజలి. ఎందుకంటే ఈ సినిమాలో అంజలి లా స్టూడెంట్. అశోక్ వేలాయుదం దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు అంజలి. చిత్రీకరణ ్రపారంభమైంది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నటీనటులే కాక.. మరికొందరు కూడా కాలేజీ స్టూడెంట్ రోల్స్ చేస్తున్నారు. -
వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోలు వీరే!
సినిమా అంటే కొన్ని పరిమితులుంటాయి. వెబ్ సిరీస్‌లకు హద్దులు లేవు. రొమాన్స్, వయొలెన్స్, సెంటిమెంట్.. ఏదైనా కొంచెం ఓవర్‌గా చూపించొచ్చు. ఈ నేపథ్యంలో సినిమా స్టార్స్ తమ ఇమేజ్‌కి భిన్నమైన క్యారెక్టర్లు, కథలు ఒప్పుకుని వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది వెబ్ వరల్డ్‌లోకి వేంచేసిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ హీరోలలో ఒకరైన వెంకటేశ్ ఓటీటీ వరల్డ్ కోసం కొత్త ట్రాక్‌లోకి వచ్చారు. కాస్త అడల్ట్ కంటెంట్ ఉన్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ చేశారు. అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్ ’ ఆధారంగా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తీశారు దర్శక ద్వయం సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ . వెంకటేశ్‌తో పాటు రానా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, సుచిత్రా పిళ్లై కీలక పాత్రలు చేశారు. కథ విషయానికొస్తే.. సెలబ్రిటీల సమస్యలను పరిష్కరించే రానా నాయుడు (రానా)కు అతని తండ్రి నాగ నాయుడు (వెంకటేశ్) అంటే ద్వేషం. పదిహేనేళ్ల జైలు జీవితం తర్వాత తిరిగొచ్చిన నాగ నాయుడుతో రానా నాయుడు తిరిగి కలుస్తాడా? నాగ నాయుడు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? అనే అంశాలతో ఈ సిరీస్ సాగుతుంది. పది ఎపిసోడ్ల ఈ సిరీస్‌కి డైలాగ్స్ పరంగా విమర్శలు వచ్చినప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా ఈ ఏడాది మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ‘రానా నాయుడు’ సెకండ్ సీజన్ కూడా ఉంటుంది. ► ‘దూత’గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య. ఆయన హీరోగా ‘మనం’, ‘థ్యాంక్యూ’ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కె. కుమార్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ ‘దూత’కు దర్శకుడు. ఎనిమిది ఎపిసోడ్స్‌గా సాగే ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియాభవానీ శంకర్, పశుపతి కీలక పాత్రలు పోషించారు. పాత్రికేయ విలువల కన్నా ధనమే ముఖ్యమని భావించే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాగర్ వర్మ (నాగచైతన్య పాత్ర) ‘సమాచార పత్రిక’కు చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు. సాగర్‌కు దొరికే పేపర్ క్లిప్పింగ్‌లో ఉన్నవారు చనిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? సాగర్ ఏం చేశాడు? అన్నది ‘దూత’ సిరీస్‌లో చూడొచ్చు. డిసెంబరు 1 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ► ‘హనుమాన్ జంక్షన్ ’, ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో..’, ‘చెప్పవే చిరుగాలి’, ‘గోపీ గోపికా గోదావరి’ వంటి సినిమాల్లో నటించిన వేణు తొట్టెంపూడి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. వెండితెరపై కాస్త స్లో అయిన వేణు డిజిటల్ తెరపై సత్తా చాటాలని హారర్ థ్రిల్లర్ జానర్లో సాగే ‘అతిథి’ వెబ్ సిరీస్‌లో నటించారు. అవంతికా మిశ్రా, అదితీ గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. వైజీ భరత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్స్‌గా సాగుతోంది. దెయ్యాలు ఉన్నాయని ప్రచారం సాగే దెయ్యాల మిట్ట అనే ప్రాంతానికి సమీపాన సంధ్య నిలయం అనే పెద్ద భవంతిలో రచయిత రవివర్మ (వేణు తొట్టెంపూడి), అతని భార్య సంధ్య (అదితీ గౌతమ్) నివసిస్తుంటారు. అయితే దెయ్యాలు లేవని నమ్మే యూట్యూబర్ సవారి (వెంకటేశ్ కాకుమాను) అక్కడికి వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని ఘటనలకు భయపడి సంధ్య నిలయంకు వెళ్తాడు. తన కంటే ముందే సంధ్య నిలయంకు వచ్చిన మాయ (అవంతిక మిశ్రా) చనిపోతుందని తెలుసుకుంటాడు సవారి. మరి.. ప్రచారంలో ఉన్నట్లుగా దెయ్యాల మిట్టలో దెయ్యాల సంచారం ఉందా? మాయ చావుకు కారణం ఎవరు? ఫైనల్‌గా సవారి ఏం తెలుసుకుంటాడు? అన్నది క్లుప్తంగా ‘అతిథి’ సిరీస్ కథ. ఈ ఏడాది సెప్టెంబరు 10 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ► నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఈ ఏడాది వెబ్ వరల్డ్‌లో డబుల్ ధమాకా ఇచ్చారు జేడీ. ఆయన టైటిల్ రోల్ చేసిన వెబ్ సిరీస్ ‘దయా’. ఈ సిరీస్‌కు పవన్ సాధినేని దర్శకుడు. ఈషా రెబ్బా, పృథ్వీరాజ్, రమ్యా నంబీసన్ , కమల్ కామరాజు కీలక పాత్రలు పోషించారు. చేపలు ట్రాన్స్పోర్ట్ చేసే ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ దయా (జేడీ చక్రవర్తి). అతని భార్య అలివేలు (ఈషా రెబ్బా) నిండు గర్భిణి. ఓ రోజు దయా పని మీద కాకినాడకు బయలుదేరతాడు. అయితే తన వ్యాన్ లో శవం ఉందని తెలుసుకుని షాక్ అవుతాడు. ఆ శవం దయా బండిలోకి ఎందుకు వచ్చింది. ఈ ఘటనకు, జర్నలిస్ట్ కవిత (రమ్యా నంబీసన్)కు సంబంధం ఏంటి? అనేది సిరీస్‌లో చూడాలి. ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్ ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే జేడీ చక్రవర్తి ఓ ముఖ్య పాత్రలో నటించిన మరో వెబ్ సిరీస్ ‘తాజా ఖబర్’ జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ► ఆది సాయికుమార్ నటించిన వెబ్ సిరీస్ ‘పులిమేక’. ఈ సిరీస్‌కు కె. చక్రవర్తి రెడ్డి దర్శకుడు. లావణ్యా త్రిపాఠి ఓ లీడ్ రోల్ చేశారు. కథ విషయానికొస్తే...హైదరాబాద్‌లో జరుగుతున్న పోలీసుల వరుస హత్యల మిస్టరీని చేధించేందుకు రంగంలోకి దిగుతారు కిరణ్ ప్రభ (లావణ్యా త్రిపాఠి). ఫోరెన్సిక్ హెడ్ ప్రభాకర్ శర్మగా పోలీ సులకు హెల్ప్ చేస్తుంటాడు ఆది సాయికుమార్. మరి.. కిల్లర్‌ను కిరణ్ ప్రభ పట్టుకున్నారా? అతను పోలీసులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అనేది ‘పులి మేక’ సిరీస్ కథాంశం. ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్ ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. -
బాక్సాఫీస్ పై దండయాత్రకు టాప్ స్టార్స్ రెడ్డి
-
వాళ్లు నాకు ఛాన్సులు ఇవ్వడం లేదు: హీరోయిన్ ఐశ్వర్య
హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ తెలుగమ్మాయే కానీ టాలీవుడ్లో రెండే సినిమాలు చేసింది. విజయ్ దేవరకొండ, నానితో కలిసి నటించిన ఆ చిత్రాలు ఘోరంగా ఫెయిలయ్యాయి. ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయాయి. తప్పు ఎక్కడ జరిగిందనేది పక్కన బెడితే.. ఈ భామకు తెలుగులో మరో అవకాశం రాలేదు. అలా అని తమిళంలో పెద్ద పెద్ద సినిమాలు చేస్తుందా అంటే అదీ లేదు. ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ మధ్య చెన్నైలోని ఓ ఈవెంట్లో పాల్గొన్న ఐశ్వర్య.. ఇండస్ట్రీ, స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి: Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ) నన్ను గుర్తించట్లేదు 'తమిళంలో 'కాకా ముట్టై' సినిమాలో చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఆ చిత్రం చేసినప్పుడు ఇండస్ట్రీ మొత్తం నన్ను మెచ్చకుంది. అంతా బాగా జరుగుతుంది అనుకునేలోపు ఆఫర్స్ రాకపోవడం షాకయ్యేలా చేసింది. దాదాపు రెండేళ్లు ఒక్కరు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. నా కెరీర్ చూసుకుంటే ధనుష్, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, దుల్కర్ సల్మాన్ లాంటివాళ్లు తప్ప స్టార్ హీరోలు వాళ్ల మూవీస్ లో ఛాన్సులు ఇవ్వట్లేదు. ఇక్కడ సమస్య.. హీరో హీరోయిన్ కి మధ్య ఉన్న ఓ విషయం' నా సినిమాకు నేనే హీరో 'మార్కెట్ విలువ, డిజిటిల్, శాటిలైట్, ఓటీటీ.. ఇలా అన్నీ చూసుకుని హీరోయిన్ ని తీసుకుంటున్నారు. మనం ఆశించిన స్థాయిలో ఉండాలంటే దేనికైనా రెడీ అవ్వాలి. అందుకే నేను స్టార్ హీరోల సినిమాల్లో కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నాను. ఇప్పటివరకు అలాంటివి 15 వరకు చేశాను. కానీ ఇప్పటికీ ఏ స్టార్ హీరో నాకు అవకాశం ఇవ్వట్లేదు. అసలు ఎందుకు పిలవట్లేదో కూడా తెలియదు. అయితేనేం నేను సంతోషంగానే ఉన్నాను. నా సినిమాకు నేనే హీరోగా చేస్తాను. స్టార్ హీరోల సినిమాలు చేయట్లేదని బాధలేదు. ఎందుకంటే నాకంటూ అభిమానులున్నారు' అని ఐశ్వర్యా రాజేశ్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'సలార్' టీజర్ సరికొత్త రికార్డ్.. ఏకంగా టాప్‌లోకి) -
హీరోయిన్స్‌గా రాణిస్తున్న స్టార్ హీరోల కూతుళ్లు (ఫోటోలు)
-
నెగిటివ్ రోల్స్ కి సై అంటున్న స్టార్ హీరోస్
-
బాలయ్య సినిమాలు చూసి షాక్ అవుతున్న స్టార్ హీరోలు
-
చూపు... రీమేక్ వైపు...
ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలు మరో భాషలో రీమేక్ కావడం సాధారణమే. అయితే పాన్ ఇండియా ఫార్ములా వచ్చిన తర్వాత కూడా రీమేక్ మంత్రం వెండితెరపై వినిపిస్తోంది కొందరు తారలు రీమేక్ చిత్రాలను చేసేందుకు రెడీ అవుతున్నారు. రీమేక్ చిత్రాలవైపు ఓ చూపు చూస్తున్న ఆ స్టార్స్‌పై ఓ లుక్ వేయండి. మలయాళ హిట్ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్‌ఫాదర్’లో ఇటీవల చిరంజీవి నటించిన విషయం తెలిసిందే. మరో రీమేక్ ‘బోళా శంకర్’లో కనిపించనున్నారాయన. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్గా తమన్నా, చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. 2015లో అజిత్ హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌గా ‘బోళా శంకర్’ తెరకెక్కుతోందని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలను కుంటున్నారు. మరోవైపు మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ (2019) తెలుగు రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారు హీరో–నిర్మాత మంచు విష్ణు. మోహన్‌బాబు మెయిన్ లీడ్ రోల్లో ఈ సినిమా తెరకెక్క నుందని సమాచారం. అలాగే మరో మలయాళ చిత్రం ‘పొరింజు మరియం జోస్’ (2019) తెలుగులో రీమేక్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నాగార్జున హీరోగా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకత్వం వహిస్తారట. ఇక హీరో పవన్ కల్యాణ్ కెరీర్‌లోని రీమేక్ చిత్రాల్లో తమిళ చిత్రం ‘తేరి’ కూడా చేరనుందని టాక్. ఈ సినిమాకు దర్శకుడిగా తొలుత సుజిత్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల హిట్ సాధించిన తమిళ చిత్రాల్లో ఒకటైన ‘మానాడు’ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దగ్గర ఉన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తారని ప్రచారం జరిగినా, ఆ తర్వాత రవితేజ, సిద్ధు జొన్నలగడ్డల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ నిర్మాణ భాగస్వామిగా ‘లక్కీ కీ’ అనే సౌత్ కొరియన్ మూవీ తెలుగు తెరపైకి రానుంది. ఇందులో సమంత ఓ లీడ్ రోల్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా మలయాళ హిట్ ఫిల్మ్ ‘హెలెన్’ తెలుగులో ‘బుట్ట బొమ్మ’గా రూపొందుతోంది. అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ హీరోలుగా నటిస్తున్నారు. శౌరి చంద్ర శేఖర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. ఇంకా తమిళ హిట్ ఫిల్మ్ ధనుష్ ‘కర్ణన్’ తెలుగులో రీమేక్ కానున్నట్లు, ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించ నున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలు ‘నాయట్టు’, ‘డ్రైవింగ్ లైసెన్స్’, ‘బ్రో డాడీ’, తమిళ చిత్రం ‘వినోదాయ చిత్తమ్’, హిందీ ‘డ్రీమ్ గాళ్’, ‘దే దే ప్యార్ దే’ ‘బదాయీ దో’ వంటివి కూడా తెలుగులో రీమేక్ అయ్యే అవకాశం ఉంది. ఇవే కాదు.. ఈ రీమేక్ జాబితాలో మరికొన్ని చిత్రాలు చేరతాయి. -
స్టార్ హీరో...యంగ్ డైరెక్టర్...
-
లక్ అంటే ఈ డైరెక్టర్లదే.. అప్పుడే స్టార్ హీరోలతో సినిమాలు!
స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఏ దర్శకుడు అయినా అనుకుంటారు. ఈ సువర్ణావకాశం కోసం కొందరు దర్శకులు చాలాకాలం ఎదురుచూస్తుంటారు. కానీ కొందరు డైరెక్టర్లకు మాత్రం తక్కువ సమయంలోనే స్టార్ హీరోకి ‘స్టార్ట్ యాక్షన్’ చెప్పే చాన్స్ వస్తుంది. ఇప్పుడలాంటి కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి. ‘స్టార్ హీరో’లు ‘యంగ్ కెప్టెన్’ (డైరెక్టర్లను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు)ల కాంబినేషన్లో సెట్ అయిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. సిల్వర్ స్క్రీన్‌పై రజనీకాంత్ క్రేజ్ ఏంటో ప్రేక్షకులకు తెలుసు. ఇంతటి స్టార్డమ్ ఉన్న హీరోతో సినిమా చేయాలని ఏ దర్శకుడు అయినా ఆశపడుతుంటారు. ఈ చాన్స్ కనీసం మూడు సినిమాలను కూడా తెరకెక్కించని ఓ దర్శకుడికి లభిస్తే అది కాస్త ఆశ్చర్యమే. తమిళ చిత్రం ‘డాన్’తో దర్శకుడిగా పరిచయమైన సిబీ చక్రవర్తికి చాన్స్ ఇవ్వనున్నారు రజనీకాంత్. ఆల్రెడీ ఈ సూపర్ స్టార్‌ను కలిసి సీబీ చక్రవర్తి ఓ లైన్ వినిపించారు. పూర్తి కథను రెడీ చేసి, నరేషన్ ఇస్తే సినిమా చేస్తానని సీబీ చక్రవర్తికి మాట ఇచ్చారట రజనీ. ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రదర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా యువదర్శకుడే కావడం విశేషం. నెల్సన్ కెరీర్లో ‘జైలర్’ చిత్రం నాలుగోది. చిరంజీవి స్టార్డమ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ మెగాస్టార్ రీసెంట్గా యువదర్శకుడు వెంకీ కుడుములకు అవకాశం ఇచ్చారు. ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే ‘ఛలో’, ‘భీష్మ’ వంటి చిత్రాలతో మంచి హిట్స్ సాధించిన జోష్‌లో వెంకీ కుడుముల ఉన్నా రన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, ‘బోళా శంకర్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల షూటింగ్స్ ఓ కొలిక్కి వచ్చాక వెంకీ కుడుములతో చేసే సినిమా ఆరంభమయ్యే అవకాశం ఉంది. ∙‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు హీరో ప్రభాస్. ఈ స్టార్ హీరో 25వ సినిమాకి దర్శకత్వం వహించే చాన్స్‌ను దక్కించుకున్నారు సందీప్‌రెడ్డి వంగా. ‘స్పిరిట్’ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తో దర్శకుడిగా హిట్ సాధించిన సందీప్ రెడ్డి వంగా ఇదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్‌తో ‘కబీర్ సింగ్’గా తీసి, అక్కడా హిట్ సాధించారు. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చాన్స్‌ను దక్కించుకున్నారు. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నారు సందీప్. కెరీర్లో పాతిక సినిమాలు చేసి, అగ్రహీరోల జాబితాలో కొనసాగుతున్నారు హీరో ఎన్టీఆర్. అయితే జస్ట్ ఒకే ఒక సినిమా ‘ఉప్పెన’తో ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకున్న బుచ్చిబాబు సనకి అవకాశం ఇచ్చారు. రెండో సినిమానే యంగ్ టైగర్‌తో చేసే అవకాశం బుచ్చిబాబుకి లభించడం విశేషం. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ ఓ సినిమా కమిట్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ నవంబరులో ప్రారంభం అవుతుంది. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎనీ్టఆర్. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఎన్టీఆర్–బుచ్చిబాబు సినిమా సెట్స్‌కి పైకి వెళుతుందట. ∙ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఖాతాలో ఓ భారీ సినిమానే ఉంది. ఈ సినిమాకి శంకర్ దర్శకుడు. ఈ చిత్రం తర్వాత చరణ్ నెక్ట్స్ మూవీ తెలుగులో ‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ వంటి హిట్ సినిమాలను తీసిన యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో తెరకెక్కాల్సి ఉంది. అయితే ఈ సినిమా కంటే ముందు రామ్‌చరణ్ మరో యువ దర్శకుడితో సినిమా చేయనున్నారనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. కన్నడంలో ‘మఫ్తీ’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై సూపర్ హిట్ సాధించిన నార్తన్యే ఈ దర్శకుడు. రామ్‌చరణ్ కోసం నార్తన్ ఓ కథను రెడీ చేశారట. ఇది చరణ్‌కు కూడా నచ్చిందట. దీంతో శంకర్ ప్రాజెక్ట్ తర్వాత రామ్‌చరణ్ హీరోగా చేయబోయేది నార్తన్ దర్శకత్వంలోనే అనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదు.. కోలీవుడ్ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా రామ్‌చరణ్‌కు ఓ కథ వినిపించారు. అయితే ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. దర్శకుడిగా రెండు సినిమాలే (తెలుగులో ‘తొలిప్రేమ’, ‘రంగ్ దే’) చేసిన వెంకీ అట్లూరి ప్రస్తుతం ధనుష్‌తో ‘సార్’ (తమిళంలో ‘వాత్తి’) అనే సినిమా చేస్తున్నారు. అలాగే తమిళంలో 2021లో వచి్చన ‘రాకీ’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు అరుణ్ మాథేశ్వరన్. ఆ తర్వాత ‘సాని కాయిదమ్’ (తెలుగులో ‘చిన్ని’) అనే సినిమా చేశారు. ప్రస్తుతం మూడో సినిమానే ధనుష్‌తో చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు అరుణ్. వీరిద్దరి కాంబినేషన్లో ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. వీరే కాదు.. తొలి చిత్రం ‘జాతిరత్నాలు’తో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన కేవీ అనుదీప్ ఇటీవల విక్టరీ వెంకటేశ్‌కు, ‘రన్ రాజా రన్’, ‘సాహో’ చిత్రాల ఫేమ్ సుజిత్‌కి పవన్ కల్యాణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కిందని టాక్. ఇంకా యువ దర్శకులతో సినిమాలు చేసే టాప్ హీరోల జాబితా పెరిగే అవకాశం ఉంది. -
స్టార్ హీరోలపై సంచలన కామెంట్స్ చేసిన హీరోయిన్
Kriti Sanon Sensational Comments on Star Heroes: అందం, అభినయంతో తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కృతి సనన్. ‘1నేనొక్కడినే’ చిత్రం ద్వారా టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా అక్షయ్‌కుమార్‌తో కలిసి ఆ అమ్మడు నటించిన బచ్చన్ పాండే మూవీ ఈనెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న కృతి తాజాగా స్టార్ హీరోల గురించి సంచలన కామెంట్స్ చేసింది. హీరోలకు సమానంగా హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత ఉండటం లేదని పేర్కొంది. సినిమాల్లో హీరోయిన్‌కి 60శాతం ఇంపార్టెన్స్ ఉండి, హీరో పాత్రకి 40 శాతమే ఇంపార్టెన్స్ ఉంటే.. అందులో పేరున్న హీరోలెవరూ నటించడానికి ఆసక్తి చూపించరు. ఈ కారణంగానే గతంలో నేను నటించిన చిత్రాల్లో పలువురు స్టార్స్ నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ ధోరణి మారాలిని కోరుకుంటున్నా అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం కృతి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఇక ఆత్రంగి రే చిత్రంలో పాత్ర చిన్నదైనా అక్షయ్ కుమార్ నటించడానికి ఒప్పుకున్నాడని, ఇది చాలా మంచి విషయమని చెప్పుకొచ్చింది. -
చిరంజీవి నుంచి బాలకృష్ణ వరకు యాంకర్స్‌గా మారిన స్టార్ హీరోలు
ఇంత కాలం కేవలం సినిమా హీరోలుగానే ఉన్న మన స్టార్స్ ఈ మధ్య కాలంలో టీవీ చానల్ యాంకర్స్‌గా మారిపోయి తమ సత్తా చూపిస్తున్నారు. టెలివిజన్‌లో కూడా తమ అభిమానులను అలరిస్తూ వారి మనసులు గెలుచుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి చిన్న సినిమా హీరోల వరకు అందరూ ఇప్పుడు హోస్ట్ అవ్వడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. పైగా సినిమాలకు ఏ స్థాయి రెమ్యునిరేషన్ తీసుకుంటారో అంతే పారితోషికం తీసుకుని యాంకరింగ్ చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే చాలా మంది హీరోలు టీవీ చానల్ హోస్టులు అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా నటరత్న నందమూరి బాలకృష్ణ కూడా ఈ జాబితాలో చేరాడు.ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం అన్‌స్టాపబుల్ NBK అనే టాక్ షోను బాలకృష్ణ చేయబోతున్నారు. అయితే మరి ఈయన కంటే ముందు హోస్టులుగా మారిన హీరోలెవరో ఓ సారి చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి స్టార్ మా చానల్‌కు 'మీలో ఎవరు కోటీశ్వరుడు'తో హోస్టుగా మారి తన అభిమానులను అలరించారు. కింగ్ నాగార్జున బిగ్ బాస్ (స్టార్ మా), మీలో ఎవరు కోటీశ్వరుడు (స్టార్ మా)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 (స్టార్ మా), ఎవరు మీలో కోటీశ్వరులు (జెమినీ)తో హోస్టుగా మారి తన అభిమానులను అలరించారు. రానా దగ్గుబాటి నెంబర్ వన్ యారీ (జెమినీ)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. నాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్ 2 (స్టార్ మా)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. సాయికుమార్ వావ్, మనం (ఈటీవీ)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. జగపతిబాబు హోస్టుగా మారి కో అంటే కోటి టీవీ షోతో ప్రేక్షకులను అలరించారు. -
మన స్టార్ హీరోహీరోయిన్లు ఏం చదివారో తెలుసా?
సినీ పరిశ్రమలో స్టార్ హీరోహీరోయన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని పరిశ్రమలో ఓ వెలుగువెలుగుతున్నారు. చదువుతో సంబంధం లేకుండా స్టార్లుగా ఎదిగిన మన హీరోహీరోయిన్లు ఏం చదివారనేది తెలుకోవాలని అందరికి ఆసక్తిగా ఉంటుంది. అయితే ఈ పరిశ్రమలో రాణించాలంటే చదవును పక్కన పెట్టాలనేది ప్రతిఒక్కరి ఉద్దేశం. అయితే మన స్టార్లలో చదువును మధ్యలో ఆపేసి పరిశ్రమలో సెటిలైయిపోయిన వారు కొందరు ఉంటే డిగ్రీ పట్టాలు పుచ్చుకుని ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగిన వారున్నారు. మరీ మన స్టార్ హీరోహీరోయిన్లు ఏఏ డిగ్రీలో పట్టాలు తీసుకున్నారో ఇక్కడ ఓ లుక్కేయండి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా నటుడిగా మారిన ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈశ్వర్ మూవీతో హీరోగా వెండితెరకు పరిచయమైన ప్రభాస్ హైదరాబాద్‌లో నలంద కాలేజీలో ఇంటర్మిడియట్ చదివాడు. అనంతరం హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీ నుంచి బీటేక్‌లో డిగ్రీ పట్టా పొందాడు. అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్‌గా టాలీవుడ్లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ గంగోత్రి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దీనికంటే ముందు మేనమామ మెగాస్టార్ చిరంజీవి డాడీ చిత్రంలో నటుడిగా పరిచమైన ఈ ఐకాన్ స్టార్ చెన్నైలోని ఎంఎస్ఆర్ కాలేజీ నుంచి బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) పూర్తి చేశాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో కృష్ణ ఘట్టమనేని వారసుడిగా, బాలనటుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు చెన్నైలోని లయోలా కాలేజీలో బ్యాచిలర్ ఆప్ కామర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత హీరోగా మారి టాలీవుడ్లో సూపర్ స్టార్‌గా ఎదిగాడు. నాగార్జున్ అక్కినేని అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలో వన్ ఆఫ్ ది లీడ్ యాక్టర్‌గా మారిపోయాడు నాగార్జున. అయితే నాగార్జున నటనకు ముందు అమెరికాలో జాబ్ చేసిన సంగతి తెలిసిందే. అమోరికాలోని మిచిగాన్ యూనివర్శిటీలో ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుమేషన్ పూర్తి చేశాడు. కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం మూవీతో తెలుగు తెరపై మెరిసింది కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్. ఆ తర్వాత వెంటనే చందమామ, మగధీర వంటి చిత్రాల్లో నటించి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన కాజల్ ముంబైలోని కేసీ కాలేజీ నుంచి మాస్ మీడియాలో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ స్పెషలైజేషన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. శ్రుతీ హాసన్ విలక్షణ నటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. ఆ తర్వాత నటిగా, గాయనీగా, మ్యూజిక్ కంపోజర్‌గా ఇక్కడ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న శ్రుతి ముంబైలోని సెయింట్ ఆండ్రీవ్ కాలేజీ నుంచి సైకాలజీలో పట్టా అందుకుంది. సాయి పల్లవి తెలుగు, తమిళ, మలయాళంలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సాయి పల్లవి నటనకు ముందు జార్జియాలోని బిలిసి మెడికల్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొంతకాలం ట్రైనీ డాక్టర్ కూడా ఆమె పనిచేసింది. రకుల్ ప్రీత్ సింగ్ అటూ బాలీవుడ్, ఇటూ టాలీవుడ్లో హీరోయిన్గా సత్తా చాటుతోన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీ సంబంధించిన జీసస్ అండ్ మేరీ కాలేజీ నుంచి మేథమెటిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. దుల్కర్ సల్మాన్ మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశాడు. పర్డ్యూ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న దుల్కర్ సల్మాన్ సినిమాల్లోకి రాకముందు బిజినెస్ మేనేజర్‌గా పనిచేశాడు. -
అజిత్ చేపలకూర సూపర్
నటుడు అజిత్ వంట పాక శాస్త్రంలో ఆరితేలినట్లున్నారు. ఇప్పటి వరకూ బిరియానీ వండి వార్చడంలోనే సిద్ధహస్తుడని తెలుసు. చేపల కూర కూడా సూపర్‌గా వండగలరని చాలా మందికి తెలియని విషయాన్ని నటి శ్రుతీహాసన్ బట్టబయలు చేశారు. శ్రుతీ భారతీయ సినీ పరిశ్రమలో హాట్‌హాట్‌గా వినిపిస్తున్న పేరు ఇది. తమిళం, తెలుగు, హిందీ ఇలా మూడు భాషల్లో ఏక కాలంలో టాప్ కథాయికగా వెలుగొందటం అంత సులభమైన విషయం కాదు. అలాంటిది శ్రుతీహాసన్ సుసాధ్యం చేసుకోగలిగారు. ఆదిలో ఈమె నట జీవితం కాస్త నత్తనడకన నడిచినా ఇప్పుడు శ్రుతీ సక్సెస్‌కు చిరునామాగా మారారు. క్రేజ్ అన్న పదానికే క్రేజీగా మారారు. స్టార్ హీరోలు శ్రురతీహాసన్ను తమకు జంటగా నటించాలని కోరుకుంటున్నారు. అపజయాలను ఎదురొడ్డి విజయాలను వర్తింపజేసుకుంటున్న శ్రుతీహాసన్‌తో చిన్న భేటీ ప్ర: సినీ జీవితం ఎలా సాగుతోంది? జ: చాలా సంతోషంగా, ఉత్సాహంగా సాగుతోంది. విజయ్‌తో పులి చిత్రాన్ని పూర్తి చేశాను. ఇందులో నాకు బాగా నచ్చిన పాత్ర చేశాను. ప్రస్తుతం అజిత్‌కు జంటగా నటిస్తున్నాను.త్వరలో సూర్య సరసన సింగం-3లో నటించనున్నాను. ప్ర: విజయ్, అజిత్, సూర్యతో నటిస్తున్న అనుభవాల గురించి? జ: 2006లో సూర్యకు జంటగా 7ఆమ్ అరివు చిత్రంతో తమిళంలో నా నట జీవితం ఆరంభమయ్యింది. కఠినమైన శ్రమతోనే ఇలా ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలను అందుకోగలుగుతున్నాను. వీరి నుంచి సినిమాకు సంబంధించిన చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. ఇవన్నీ మంచి అనుభవాలేగా. ప్ర: గ్లామర్ విషయంలో హిందీలో యమ హాట్‌గా, తెలుగులో కొంచెం హాట్‌గా తమిళంలో మరీ మడి కట్టుకుని నటిస్తున్నారని బాధపడే వారికి మీరిచ్చే బదులు? జ: ఈ అంశంపై ఇది వరకే ఒకసారి ప్రస్థావించాను. ఇప్పటికీ గ్లామర్ అన్నదానికి అర్థం నాకు తెలియలేదు. ఏది గ్లామర్, దాని పరిధి ఏమిటి? అన్నదీ నాకు తెలియదు. హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో నటించిన రామయ్యా వస్తావయ్యా చిత్రం తెలుగు చిత్రం నువ్వొస్తానంటే నేనొద్దంటానాకు రీమేక్. అంతకంటే హోమ్లీ పాత్ర ఇప్పుటి వరకూ తమిళంలోనూ, తెలుగులోనూ చెయ్యలేదు. దీనికేమంటారు?. ఏ విషయమయినా కథ, పాత్రలే నిర్ణయిస్తాయి. ప్ర: మీ అమ్మానాన్నల నుంచి మీరు నేర్చుకోవాలనుకుంటున్నది? జ: నాన్న నుంచి సమయ పాలన, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం, ఆయన మనోధైర్యం నచ్చుతాయి. ఇక అమ్మ విషయానికొస్తే తను చిన్నతనం నుంచి నటిస్తున్నారు. పలు పోరాటాలను ఎదుర్కొన్నారు. ఆమె సహనం నచ్చుతుంది. ఇవన్నీ నేర్చుకోవాలని ఆశ. ప్ర: మీరు ఒక చిత్రాన్ని అంగీకరించడానికి కథ, కథానాయకుడు, దర్శకుడు, పారితోషికం వీటిలో ఏ అంశానికి ప్రాధాన్యత నిస్తారు? జ: ముందుగా కథకు ప్రాధాన్యత నిస్తాను. ఆ తరువాత దర్శకుడెవరన్నది చూస్తాను. ఆపై చిత్ర నిర్మాణ సంస్థ గురించి ఆలోచిస్తా. పారితోషికమూ ముఖ్యమే. అయితే అన్ని చిత్రాలకు ఇలా చెప్పడం కుదరదు. సందర్భానుసారాన్ని బట్టి ఉంటుంది. ప్ర: కథ బాగుంటే పారితోషికం తక్కువైనా నటిస్తారా? జ:తప్పకుండా.. ఇప్పటికే ఒకటి రెండు చిత్రాల్లో అలా నటించాను. ప్ర: మీరు అందరితో సర్దుకుపోతారా లేక వారినే సర్దుకుపోయేలా చేస్తారా? జ: సర్దుకుపోవడం అనేది పరిస్థితులను బట్టి ఉంటుంది. ప్ర: మీరు నటిగా కోరుకునే రంగప్రవేశం చేశారా? జ: నిజం చెప్పాలంటే అనాలోచనగానే నటినయ్యాను. అసలు నాకు దర్శకత్వం, సంగీతం పైనే ఆసక్తి. నా చిన్న నాటి స్నేహితుడు ఇమ్రాన్‌ఖాన్ లక్ అనే చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. మంచి యాక్షన్ స్క్రిఫ్ట్ నువ్వు నటిస్తావా? అని నన్ను అడిగారు. సరే ప్రయత్నిస్తానని అందులో నటించాను. అప్పటి ఆ నిర్ణయమే నన్ను పూర్తి స్థాయి నటిగా మార్చేసింది. ప్ర: వంట గది వైపు కన్నెత్తి చూసిన సందర్భాలున్నాయా? జ: అందుకు సమయం ఉండేది కాదు. అయితే వంట పాకంపై ఆసక్తి ఉంది. ముంబయిలో ఉన్నప్పుడు సాంబారు, బంగాళాదుంపల కూర లాంటివి బాగా చేసేదాన్ని. నా స్నేహితులు వచ్చి తినేవారు. మీకో విషయం చెప్పాలి. అజిత్ వంటకాలు ఇష్టంగా తింటాను. ఆయన చేపలకూర వంటకం భలే చేస్తారు. ఆ చేపలకూర తినాలని ఆశ. సమయం దొరికినప్పుడు అజిత్ వద్ద వంటకాల టిప్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్ర: మీకు పోటీ ఎవరని భావిస్తున్నారు? జ: నేనెవర్నీ పోటీగా భావించను. నాకు నేనే సరైన పోటీ. నా ప్రస్తుత చిత్రం కంటే తదుపరి చిత్రంలో ఇంకా ఎంత బాగా నటించాలని ఆలోచిస్తాను. -
బిజీ బిజీ
మన స్టార్ హీరోల్లో చాలామంది ప్రస్తుతం షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. మరికొందరు ప్రీ-ప్రొడక్షన్లో పాలుపంచుకుంటూ, నెక్ట్స్ మంత్ సెట్స్‌కి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ విశేషాల్లో కొన్ని మీ కోసం.... ఒకటికి రెండు! సీనియర్ స్టార్ హీరో నాగార్జున చాలా బిజీగా ఉన్నారు. నూతన దర్శకుడు కల్యాణకృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ చేస్తున్నారు. ఆ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 26న హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించి మరో షెడ్యూలు మొదలుకానుంది. ఇది కాక, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ హీరో కార్తీతో కలిసి నాగ్ నటిస్తున్న మరో చిత్రం కూడా చిత్రీకరణ దశలో ఉంది. జూలై 10 తర్వాత ఈ సినిమా షెడ్యూలు ఉంటుందని సమాచారం. మహారాష్ట్ర టు గుజరాత్ పవన్‌కల్యాణ్ కూడా కొత్త సినిమా షూటింగ్‌కు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మిస్తున్న ‘గబ్బర్‌సింగ్2’ (ఇది వర్కింగ్ టైటిల్. అసలు పేరింకా ఖరారు కాలేదు) ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. మహారాష్ట్రలోని పుణేకు సమీపంలో ఇటీవలే కొద్దిరోజులు చిత్రీకరణ జరిపారు. త్వరలోనే రెండో షెడ్యూల్ గుజరాత్లో ప్రారంభం కానుంది. మొన్నటి దాకా బెంగుళూరు పరిసరాల్లో జిమ్‌కు వెళుతూ కనిపించిన పవన్ ఆ షెడ్యూల్‌కు తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. ఒకటి చివర్లో..! మరొకటి మొదట్లో..! స్టార్ హీరో మహేశ్ ఇప్పుడు ‘శ్రీమంతుడు’ చిత్రం పూర్తి చేసే హడావిడిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుదిఘట్టంలో ఉంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణా ఏడెకరాల్లో వేసిన గాజుల దుకాణాల స్ట్రీట్ సెట్లో చిత్రీకరణ సాగుతోంది. మహేశ్‌తో పాటు శ్రుతీహాసన్, తదితరులు షూటింగ్లో పాల్గొంటున్నారు. మహేశ్ పుట్టిన రోజు (ఆగస్టు 9) కానుకగా, ఆగస్టు 7న ‘శ్రీమంతుడు’ విడుదల కానుంది. ఈ సినిమా ఇలా చివరలో ఉండగానే, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మోత్సవం’కి ఇప్పటికే పూజాకార్య క్రమాలు జరిపారు. ‘శ్రీమంతుడు’ పూర్తవుతూనే, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్లో మహేశ్ పాల్గొంటారు. విదేశాలకు... రెడీ ‘టెంపర్’ తర్వాత ఎన్టీఆర్ స్పీడు పెంచారు. వరుసపెట్టి సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా కమిటయ్యారు. ఈ నెలాఖరు నుంచి యూరప్‌లో భారీ షెడ్యూలు జరగనుంది. ఇప్పటికే సుకుమార్, ఛాయా గ్రాహకుడు విజయ్ కె. చక్రవర్తి యూరప్‌లో లొకేషన్ల ఎంపిక పూర్తిచేశారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తారని కృష్ణానగర్ కబురు. జోరు... మాస్ ఎంటర్టైనర్ల హోరు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా చేసిన ‘కిక్2’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటోంది. కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులతో పాటు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రవితేజ, మరోపక్క సంపత్ నంది దర్శకత్వంలో రాధా మోహన్ నిర్మిస్తున్న ‘బెంగాల్ టైగర్’తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంతో సాగుతోంది. ఆర్.ఎఫ్.సి.లో భారీ షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో రవితేజతో పాటు బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ, తదితర నటీనటులు పాల్గొంటున్నారు. ఏకకాలంలో రెండు షూట్స్ రామ్ శరవేగంతో రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ రెండూ స్రవంతి మూవీస్ సంస్థలోనే తయారవుతున్నాయి. ఈ రెండు సినిమాల ద్వారా ఇద్దరు కొత్త దర్శకులు పరిచయమవుతుండడం విశేషం. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శివం’ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. గతవారం రోజులుగా ఊటీలో షెడ్యూలు జరుపుకుంది. సెప్టెంబరులో ఈ చిత్రం విడుదలవుతుంది. ఇక మరో చిత్రం కథ ‘హరికథ’ కూడా కొంత చిత్రీకరణ జరుపుకొంది. కిశోర్ తిరుమల దర్శకుడు. ఈ రెండు చిత్రాలకూ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. ఫీల్‌గుడ్ మూవీలో! గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మన్జిమా మోహన్, నాగచైతన్య జంటగా తయారవుతున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్లో ఉంది. గతంలో ఒకే కథ వేర్వేరు హీరోలతో తమిళంలో ‘విన్నై తాండి వరువాయా’, తెలుగులో ‘ఏం మాయ చేశావే’ చేసి, విజయం సాధించినట్లే, ఇప్పుడు ఈ సినిమాను గౌతమ్ మీనన్ రూపొందిస్తున్నారు. ఈ తెలుగు - తమిళ ద్విభాషా చిత్రంలో తెలుగు వెర్షన్లో నాగచైతన్య హీరో అయితే, తమిళంలో శింబు కథానాయకుడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తమిళనాట సాగుతోంది. యాక్షన్ హంగామా అక్కినేని అఖిల్ పరిచయ చిత్రం షూటింగ్ దేశవిదేశాల్లో జరుగుతోంది. ఇటీవలే స్పెయిన్‌లో కీలక ఎపిసోడ్స్ చిత్రీకరణ చేసివచ్చారు. కొద్దిరోజుల్లోనే బ్యాంకాక్‌లో షూటింగ్ చేయడానికి చిత్ర బృందం బయలుదేరి వెళ్తోంది. అక్కడ పాటలు, ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తారు. వి.వి. వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ నిర్మిస్తున్నారీ చిత్రాన్ని. ముచ్చటగా మూడు! దేవ కట్టా దర్శకత్వంలో ‘డైనమైట్’ చిత్రంతో మంచు విష్ణు బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూలై రిలీజ్ కోసం సన్నాహాలు జరుపుకొంటూ ఉండగానే, ఆయన మరో రెండు సినిమాలు ఎనౌన్స్ చేశారు. నూతన దర్శకుడు హనుమాన్ నిర్దేశకత్వంలో ఒక సినిమా, తనికెళ్ళ భరణి దర్శకత్వంలో పౌరాణిక గాథ ‘కన్నప్ప కథ’కు కసరత్తులు చేస్తున్నారు. ప్రత్యేకించి, ‘కన్నప్ప కథ’ కోసం లుక్ నుంచి అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్, గోపీచంద్ తదితర కథానాయకుల కొత్త చిత్రాలు కూడా ఇప్పటికే ముహూర్తాలు జరుపుకొన్నాయి. వచ్చే నెలలో పూర్తి స్థాయిలో సెట్స్ మీదకు వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. -
స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్న అనిరుధ్
-
సెంటిమెంట్‌ను నమ్ముకున్న స్టార్ హీరోలు
-
వాళ్లతో యాక్ట్ చేయడం నాకు చాలా ఇష్టం
‘‘స్టార్ హీరోల పక్కన సినిమాలు చేయడం చాలా అడ్వాంటేజ్. కానీ కొంతమంది మాత్రం ‘మీకేం పేరొస్తుంది. మొత్తం క్రెడిట్ అంతా హీరోలకే దక్కుతుంది కదా’ అంటారు. అయితే స్టార్ హీరోలతో సినిమా చేయడం హీరోయిన్లకు చాలా ప్లస్ అన్నది నా అభిప్రాయం’’ అంటున్నారు తమన్నా. ఈ మిల్క్‌బ్యూటీ ఇప్పటివరకు చేసినవన్నీ దాదాపు కమర్షియల్ చిత్రాలే. కథానాయిక ప్రాధాన్యం ఉన్న అరుంధతి, వేదంలాంటి చిత్రాలు చేయలేదు. ఆ విషయంలో మీకేమైనా బాధ ఉంటుందా? అని తమన్నాని అడిగితే -‘‘ఏమాత్రం బాధ లేదు. ఒకవేళ ఆ తరహా చిత్రాలొస్తే తప్పకుండా చేస్తా. లేకపోతే మాత్రం బాధపడను. ఎందుకంటే, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడం చాలా కష్టం. ఆ తరహా సినిమాలు దాదాపు హీరోల చుట్టూనే తిరుగుతాయి. హీరోయిన్ తెరపై కనిపించేది పాటల్లో, కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కాబట్టి మా పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. అందుకని తక్కువ సమయంలోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అది ఒక రకంగా సవాల్ అనే చెప్పాలి. అదే హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనుకోండి.. సినిమా మొత్తం మా చుట్టూనే తిరుగుతుంది కాబట్టి నిరూపించుకోవడానికి బోల్డంత అవకాశం ఉంటుంది. ఏదేమైనా స్టార్స్‌తో యాక్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వారి సినిమాలకు ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అందులో నటించేవాళ్లందరూ ప్రేక్షకుల దృష్టిలో పడతారు.తెరపై కనిపించిన తక్కువ టైమ్‌లోనే ఆకట్టుకోగలిగామనుకోండి.. అప్పుడు వారి అభిమానాన్ని పొందవచ్చు. అందుకే కమర్షియల్ చిత్రాలను ఇష్టపడి చేస్తాను’’ అని చెప్పారు.