విద్యార్థులే కానీ... వేసవి సెలవులు లేవు | Star heroes went college on summer holidays | Sakshi
Sakshi News home page

విద్యార్థులే కానీ... వేసవి సెలవులు లేవు

Published Thu, Mar 14 2024 4:54 AM | Last Updated on Thu, Mar 14 2024 4:54 AM

Star heroes went college on summer holidays - Sakshi

 వేసవి వస్తే విద్యార్థులు రిలాక్స్‌ అవుతారు. వేసవి సెలవులను ఆస్వాదిస్తారు. కానీ.. ఈ విద్యార్థులకు మాత్రం వేసవి సెలవులు లేవు. కాలేజీలకు వెళుతున్నారు. ఎందుకంటే వీళ్లు రియల్‌ స్టూడెంట్స్‌ కాదు.. రీల్‌ స్టూడెంట్స్‌. కొందరు స్టార్స్‌ ప్రస్తుతం స్టూడెంట్స్‌గా నటిస్తున్నారు. షూటింగ్‌ సెట్స్‌లో క్లాసులకు హాజరు అవుతున్నవారు కొందరైతే.. ప్రిపరేషన్‌ స్టూడెంట్స్‌ మరికొందరు. ఈ విద్యార్థుల గురించి తెలుసుకుందాం.

► కెరీర్‌లో పలు చిత్రాల్లో కాలేజ్‌ స్టూడెంట్‌గా నటించారు హీరో సూర్య. కానీ ఐదు పదుల వయసుకి చేరువ అవుతున్న టైమ్‌లో కూడా కాలేజ్‌కి వెళ్లెందుకు రెడీ అవుతున్నారు. ‘సూరరై ΄ోట్రు’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్‌లో ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా తెరకెక్కనుంది. స్టూడెంట్‌ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారే ఓ వ్యక్తి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. స్టూడెంట్‌ రోల్‌ కోసం ప్రస్తుతం సూర్య బరువు తగ్గుతున్నారని సమాచారం. 2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌  త్వరలో ఆరంభం కానుంది.

►కాలేజీ స్టూడెంట్‌ రోల్‌ హీరోయిన్‌ రష్మికా మందన్నాకు బాగా కలిసి వస్తుందని చె΄÷్పచ్చు. ఆ మాటకొస్తే... నటిగా రష్మికా మందన్నా కెరీర్‌ మొదలైంది కన్నడ హిట్‌ క్యాంపస్‌ డ్రామా ‘కిర్రిక్‌ పార్టీ’ సినిమాతోనే. అంతేకాదు...రష్మికా మందన్నా తెలుగు ఎంట్రీ మూవీ ‘ఛలో’లోనూ, రెండో మూవీ ‘గీత గోవిందం’లోనూ ఆమెది కాలేజీ స్టూడెంట్‌ రోల్‌. ఇలా కాలేజీ స్టూడెంట్‌గా రష్మికా మందన్నా చేసిన సినిమాలన్నీ దాదాపు  సూపర్‌ హిట్స్‌. తాజాగా ఈ కోవలో రష్మికా మందన్నా చేస్తున్న చిత్రం ‘ది గాళ్‌ఫ్రెండ్‌’.

ఈ చిత్రంలో రష్మికా మందన్నా పీజీ గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్‌ రోల్‌లో కనిపిస్తారని తెలిసింది. ఆమె బాయ్‌ ఫ్రెండ్‌గా దీక్షిత్‌ శెట్టి నటిస్తున్నారు. ఓ కాలేజీ స్టూడెంట్‌ తన ప్రేమను నెగ్గించుకునే క్రమంలో పడిన సంఘర్షణ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ‘చి..ల..సౌ’తో దర్శకుడిగా తొలి సినిమాతోనే హిట్‌ కొట్టిన రాహుల్‌ రవీంద్రన్‌ ‘ది గాళ్‌ ఫ్రెండ్‌’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజయ్యే చాన్స్‌ ఉంది.

► కాలేజీలో ఓ ఫెయిల్యూర్‌ స్టూడెంట్‌గా తెరపై శ్రీ విష్ణు కనిపించిన ప్రతిసారీ ఆయనకు మంచి పేరు వచ్చింది. ‘నీదీ నాది ఒకే కథ’, ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాల్లో శ్రీ విష్ణు స్టూడెంట్‌గా నటించారు. మళ్లీ ఈ తరహా పాత్రలో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’. శ్రీవిష్ణుతో పాటు ఈ చిత్రంలో రాహుల్‌ రవీంద్రన్, ప్రియదర్శి ఇతర లీడ్‌ రోల్స్‌ చేశారు. ఓ యూనివర్సిటీలోని ముగ్గురు పీహెచ్‌డీ స్కాలర్స్‌ జీవితాలు ఓ ఘటనతో సడన్‌గా ఏ విధంగా మలుపు తిరిగాయి? అనే కోణంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా ఫస్టాఫ్‌లో కాలేజీ  సీన్స్‌ ఉంటాయి.  శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వి సెల్యూలాయిడ్, సునీల్‌ బలుసు నిర్మించిన  ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. స్టూడెంట్‌గా ఇన్నాళ్లూ సెట్‌లో బిజీగా ఉన్న శ్రీవిష్ణు ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటున్నారు.

► ‘ఏవండీ.. (మృణాల్‌ ఠాకూర్‌)..
రామచంద్రా.. (చిన్న వాయిస్‌తో విజయ్‌ దేవరకొండ).. నేను కాలేజ్‌కి వెళ్లాలి.. కొంచెం దించేస్తారా? (మృణాల్‌ ఠాకూర్‌),.. ఒక లీటర్‌ పెట్రోల్‌ కొట్టిస్తే దించేస్తా..’ (విజయ్‌ దేవరకొండ)...‘ఫ్యామిలీస్టార్‌’ సినిమాలోని డైలాగ్‌ ఇది. సో.. ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ కొన్ని సన్నివేశాల్లో కాలేజ్‌కి వెళతారని కన్ఫార్మ్‌ చేసుకోవచ్చు. ‘గీత గోవిందం’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు పరశురామ్‌ కాంబినేషన్‌లో రూ΄÷ందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ఇది. బాలీలో ఓ పాట చిత్రీకరిస్తే ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.

► ‘ఇగై’ సినిమా కోసం లా పాయింట్స్‌ చెబుతున్నారు అంజలి. ఎందుకంటే ఈ సినిమాలో అంజలి లా స్టూడెంట్‌. అశోక్‌ వేలాయుదం దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ సినిమాలో మెయిన్‌ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు అంజలి. చిత్రీకరణ ్రపారంభమైంది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.
ఈ నటీనటులే కాక.. మరికొందరు కూడా కాలేజీ స్టూడెంట్‌ రోల్స్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement