Surya
-
కంగువ కిక్ ఇచ్చింది: శివ
‘‘సిల్వర్ స్క్రీన్స్ పై కొత్త ప్రపంచాలను, సరికొత్త నేపథ్యాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆ తరహా సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కుంతోంది. ఈ అంశాలే నన్ను ‘కంగువ’ సినిమా చేసేలా ప్రేరేపించాయి. ‘కంగవ’ పూర్తిగా కల్పిత కథ. ప్రతి ఒక్కరి లోపల ఓ యుద్ధం ఉంటుంది. అలాగే బయట పరిస్థితులతోనూ యుద్ధం చేస్తుంటారు. ఈ రెండు యుద్ధాలను బ్యాలెన్స్ చేసిన ఓ యుద్ధవీరుడి కథే ‘కంగువ’’ అని దర్శకుడు శివ అన్నారు.సూర్య, దిశా పటానీ జోడీగా నటించిన చిత్రం ‘కంగవ’. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ మాట్లాడుతూ–‘‘కంగువ, ఫ్రాన్సిస్’ అనే రెండు పాత్రల్లో సూర్య కనిపిస్తారు. వెయ్యేళ్ల క్రితం నాటి పాత్ర కంగువ. ప్రస్తుత పాత్ర ఫ్రాన్సిస్. నాన్స్ –లీనియర్ స్క్రీన్స్ ప్లేతో ఈ కథ రెండు డిఫరెంట్ టైమ్‌లైన్స్ లో జరుగుతుంది.ఈ రెండు టైమ్‌లైన్స్, క్రియేటివ్ స్పేస్, కమర్షియల్ అంశాలు.. ఇవన్నీ ‘కంగువ’లో పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయడం ఓ దర్శకుడిగా నాకు కిక్ ఇచ్చింది. ఈ సినిమా కోసం సూర్య చాలా కష్టపడ్డారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ప్రోత్సాహంతోనే ఇంత పెద్ద సినిమా చేయగలిగాను. ‘యానిమల్’ సినిమాకి ముందే బాబీడియోల్గారు మా చిత్రంలో భాగమయ్యారు. ఓ షాడో కాప్‌గా దిశాపటానీ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా దగ్గర కొన్ని కథలున్నాయి. అవకాశం వస్తే తెలుగు హీరోలతో చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని తెలిపారు. -
ముంబైకి షిఫ్ట్ కావడంపై తొలిసారి స్పందించిన సూర్య
కోలీవుడ్‌లో బెస్ట్ జోడిగా ఉన్న సూర్య-జ్యోతిక ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. గతేడాదిలో వారు చెన్నై నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అయితే, అంశం గురించి గతంలో పలు రకాలుగా రూమర్స్ వచ్చాయి. వారు కుటుంబంతో విడిపోయారంటూ వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. అయితే, ఈ జంట ముంబైలో ఫ్యామిలీ పెట్టడానికి గల కారణాన్ని కంగువ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో సూర్య చెప్పారు.తమ కుటుంబం కోసం జ్యోతిక చాలా వదులుకొని వచ్చిందని సూర్య ఇలా చెప్పారు. 'తనకు 18 ఏళ్ల వయసులో చెన్నైకి జ్యోతిక వచ్చింది. మా వివాహం అయిన తర్వాత అందరం కలిసే చెన్నైలోనే ఉన్నాం. నా కుటుంబం కోసం ఆమె చాలా త్యాగాలు చేసింది. ఒకదశలో సినిమా ఛాన్సులు వచ్చినా ఆమె వదులుకుంది. ముంబైలో పుట్టి పెరిగిన జ్యోతిక అక్కడ తన స్నేహితులను దూరం చేసుకుంది. అయితే, కొవిడ్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ముంబైకి షిఫ్ట్ కావాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఆమె కెరిర్ మళ్లీ మొదలైంది. సరికొత్తదనం ఉన్న ప్రాజెక్ట్‌లలో జ్యోతిక పనిచేస్తుంది. తను ఎప్పుడూ కూడా కొత్త దర్శక, నిర్మాతలతో కలిసి పనిచేయాలని ఆలోచిస్తుంది. బాలీవుడ్లో శ్రీకాంత్, కాదల్- ది కోర్, సైతాన్ వంటి విభిన్నమైన సినిమాల్లో ఆమె మెప్పించింది. మహిళలకు కూడా అన్ని విషయాల్లో స్వాతంత్య్రం ఇవ్వాలని నేనే కోరుకుంటాను. అందరిలా వారికి కూడా స్నేహితులు ఉంటారు. ప్రస్తుతం జ్యోతిక తన కుటుంబంతో పాటు పాత స్నేహితులతో టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలో నేను కూడా రెగ్యూలర్‌గా ముంబై వెళ్తుంటాను. కుటుంబం కోసం ప్రతి నెలలో పదిరోజులకు పైగానే కేటాయిస్తాను.' అని ఆయన పేర్కొన్నారు. -
నవంబరులో స్టార్ట్
సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ రూపుదిద్దుకోనుంది. సూర్య కెరీర్లో 45వ సినిమాగా రూపొందనున్న ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను నవంబరులో ప్రారంభించి, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ‘‘ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్‌లో ఆర్జే బాలాజీ బిజీగా ఉన్నారు. ఈ కథపై ఆయన ఏడాదిగా వర్క్ చేస్తున్నారు. చిత్రీకరణకు అనువైన లొకేషన్ల సందర్శన కూడా చేస్తున్నారాయన’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్ . -
'కర్ణుడి'గా సూర్య..! బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్..
-
కర్ణ ఆగడు
‘‘ఇక ‘కర్ణ’ లేనట్లే... ఆగిపోయింది’’ అంటూ ప్రచారంలో ఉన్న వార్తలకు బ్రేక్ పడేలా ఫ్లాష్ న్యూస్ ఇచ్చారు దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా. సూర్య టైటిల్ రోల్లో రాకేశ్ ఓంప్రకాశ్ ‘కర్ణ’ అనే సినిమాని తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర క్రితమే ఈ సినిమా గురించిన వార్త వచ్చింది. ఆ తర్వాత అప్డేట్ లేకపోవడంతో ‘కర్ణ’ ఆగిపోయిందనే వార్త తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘‘కర్ణ’ ఆగడు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి’’ అని తాజాగా పేర్కొన్నారు ఓంప్రకాశ్. మహాభారతం నేపథ్యంలో రూపొందనున్న ‘కర్ణ’లో కర్ణుడిగా సూర్య నటించనున్నారు.కర్ణుడి భార్యపాత్రకు జాన్వీ కపూర్‌ని తీసుకోవాలనుకుంటున్నారట. సంగీతదర్శకత్వానికి ఏఆర్ రెహమాన్‌ని సంప్రదించారని సమాచారం. ఈ చిత్రాన్ని హిందీ, తమిళంలో చిత్రీకరించి, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అనువదించి, విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ విషయాల గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇక రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రానికి రచయిత ఆనంద్ నీలకంఠన్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. హిందీలో సూర్యకి ఇదే తొలి చిత్రం అవుతుంది. -
తమిళ సినిమాని వదిలేస్తున్న సూర్య
-
ప్రభాస్ పాత్రలో సూర్య..?
-
రెండు దశాబ్దాల తర్వాత...
రెండు దశాబ్దాల తర్వాత హీరోలు విక్రమ్, సూర్య కలిసి నటించే అవకాశం కనిపిస్తోంది. తమిళ రచయిత ఎస్యు వెంకటేశన్ రాసిన ‘వీరయుగ నాయగన్ వేళ్‌పారీ’ నవల హక్కులు ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద ఉన్నాయి. ఈ నవల ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారట శంకర్. ఈ సినిమాను ఆయన రెండు భాగాలుగా తీయనున్నారని, ఇందులో విక్రమ్–సూర్య హీరోలుగా నటించనున్నారని కోలీవుడ్ టాక్.2003లో వచ్చిన ‘పితాగమన్’ (తెలుగులో ‘శివపుత్రుడు’) చిత్రం తర్వాత సూర్య, విక్రమ్ కలిసి నటించలేదు. మరి... 21ఏళ్ల తర్వాత శంకర్ సినిమా కోసం వీరిద్దరూ కలిసి మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. అలాగే ఆయన దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్ 3’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల తర్వాతనే ‘వీరయుగ నాయగన్ వేళ్‌పారీ’ నవలను సినిమాగా తీసే పనులపై శంకర్ పూర్తి స్థాయి దృష్టి పెట్టాలనుకుంటున్నారని కోలీవుడ్ భోగట్టా. -
ఒకే మూవీలో నటించబోతున్న కార్తి-సూర్య!?
-
ఒకే మూవీలో ప్రభాస్, సూర్య..ఇక బాక్సాఫిస్ షేక్ అవ్వాల్సిందే..
-
ప్రతిభ చూపి అమెరికాకు!
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన బందిల సూర్యతేజశ్రీ విద్యలో చూపిన ప్రతిభ కారణంగా అమెరికాలో ఉచిత విద్యను అభ్యసించే అరుదైన అవకాశాన్ని సాధించింది. నిరు పేద కుటుంబానికి చెందిన సూర్యతేజశ్రీ తల్లి నాగమణి.. ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. విజయవాడ ఈడ్పుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఐఐటీ అండ్ నీట్ గురుకులంలో సూర్యతేజశ్రీ ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తిచేసింది. గతేడాది అమెరికా ఫీల్డ్ సరీ్వసెస్ సంస్థ(ఏఎఫ్ఎస్) కెన్నెడి లూగర్ యూత్ ఎక్సే్ఛంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఆన్లైన్ టెస్ట్ నిర్వహించింది.12 విభాగాల్లో నిర్వహించిన ఈ టెస్ట్‌లో 17 ఏళ్ల సూర్యతేజశ్రీ పాల్గొని ప్రతిభ చూపింది. దీంతో అమెరికా మిషిగన్ రాష్ట్రంలోని హోప్కిన్లో ఏడాది పాటు ఉచితంగా డిప్లమో కోర్సును అభ్యసించేందుకు అర్హత సాధించింది. ఉచిత శిక్షణతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా ఏఎఫ్ఎస్ సంస్థ భరించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సూర్యతేజశ్రీ అమెరికా వెళ్లనుంది. ఏపీ ప్రతినిధిగా ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాలను అక్కడ తెలియజేయడం, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడానికి ఆమెకు అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నుంచి రూ.లక్ష నగదు, ల్యాప్‌టాప్‌ను సూర్యతేజశ్రీ అందుకుంది. -
ట్రైబల్ కథల్
ఒక సింహాసనం కోసం రెండు తెగలు పోటీ పడతాయి... సముద్ర తీరంలో ఉండే ఆదివాసీల కోసం ఓ వ్యక్తి పోరాటం చేస్తాడు... తమ హక్కుల కోసం పోరాటం చేస్తాడు ఓ గిరిజన తెగ నాయకుడు... ఓ తెగకు చెందిన వ్యక్తి శివభక్తుడిగా మారతాడు... సినిమా పాయింట్ ఏదైనా ఈ సినిమాలన్నింటిలోనూ కామన్ పాయింట్ ‘ట్రైబల్’ నేటివిటీ. ఇలా ట్రైబల్ కథల్తో రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.⇒ ‘కాన్సార్ ఎరుపెక్కాలా...’ అంటూ ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రంలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్‌కి అటు అభిమానులు ఇటు ప్రేక్షకుల కేకలు, అరుపులతో థియేటర్లు దద్దరిల్లాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్’. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా మొదటి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత ఏడాది విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాన్సార్ సింహాసనం కోసం శౌర్యాంగ, ఘనియార్ తెగలు పోటీపడటం, వారికి దక్కకుండా తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం మన్నార్ తెగకు చెందిన రాజ మన్నార్ చేసే ప్రయత్నం... ఈ మూడు తెగలు ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచించడం మొదటి భాగంలో చూశాం. చివరికి ఏ తెగవారు కాన్సార్ సింహాసనం చేజిక్కించుకున్నారనేది తెలియాలంటే మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’ విడుదల వరకూ ఆగాల్సిందే. ఇంకా సెకండ్ పార్ట్ షూటింగ్ ఆరంభం కాలేదు. ⇒ ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ‘దేవర’ కోసం ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ సినిమా బ్యాక్‌డ్రాప్ ఏంటో చెప్పింది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. భారతదేశంలో విస్మరణకు గురైన సముద్ర తీర ్రపాంతాలకు చెందిన ఆదివాసీల కోసం దేవర చేసే పోరాటమే ఈ సినిమా అని సమాచారం. ఈ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ⇒ ‘చావుని ఎదిరించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం’ అంటూ ‘తంగలాన్’ మూవీ ట్రైలర్లో హీరో విక్రమ్ చెప్పిన డైలాగ్ పవర్‌ఫుల్‌గా ఉంది. పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాలతో ఈ చిత్రం రూపొందింది. బంగారు గనుల తవ్వకాన్ని వ్యతిరేకించే గిరిజన తెగ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఆ తెగ నాయకుడి పాత్రలో విక్రమ్ నటించారట. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ⇒ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. శివ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాలో సూర్య ఆటవిక జాతికి చెందిన ఓ తెగ నాయకుడిగా నటించారు. ఓ దట్టమైన అడవిలో రెండు ఆటవిక జాతుల మధ్య పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది. అలాగే ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓ గిరిజన యోధుడైన కంగువ 1678 నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు. ఓ మహిళా సైంటిస్ట్ సాయంతో తన మిషన్‌ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏంటి? ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేశాడు? అనే నేపథ్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో ఈ సినిమా కథ సాగుతుందని టాక్. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. ⇒ మంచు విష్ణు నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ఓ తెగకు చెందిన తిన్నడు (ఆ తర్వాత శివ భక్తుడు కన్నప్పగా మారారు) పాత్ర చేస్తున్నారు మంచు విష్ణు. ఈ చిత్రంలో తిన్నడు వాడిన విల్లు విశిష్టత గురించి ఇటీవల మేకర్స్ తెలిపారు. తన బిడ్డ తిన్నడు ధైర్యసాహసాలకు ముగ్దుడైన నాద నాథుడు ప్రత్యేకమైన విల్లును తయారు చేస్తాడు. ఆ విల్లును ఉపయోగిస్తూ తన తెగను, అడవిలో సమతుల్యతను తిన్నడు ఎలా కాపాడాడు? అనే నేపథ్యంలో సాగే సీన్స్ ఆసక్తిగా ఉంటాయట. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందట. -
అభిమానులతో పాటు మంచి మనసు చాటుకున్న సూర్య
కోలీవుడ్‌లో హీరో సూర్యకు భారీగానే అభిమానులు ఉన్నారు. ఆయన పుట్టినరోజు వస్తుదంటే చాలు వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ క్రెడిట్‌ను సూర్యకు ఇచ్చేస్తారు. తమిళనాడులో ఏమైన విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అండగా కట్టకట్టుకుని నిలబడతారు. కోలీవుడ్‌లో సూర్యకు ఎంత గుర్తింపు ఉందో ఆయన అభిమానులకు కూడా సామన్యప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. జులై 23న సూర్య పుట్టినరోజు రానుంది. ఈ క్రమంలో వారు పలు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకొచ్చారు.సూర్య పుట్టినరోజు సందర్భంగా గతేడాది 2000 మంది అభిమానులు రక్తదానం చేశారు. ఆ విషయం తెలుసుకున్న సూర్య చలించిపోయారు. అప్పుడు 2024లో నిర్వహించే రక్తదాన శిబిరానికి తాను కూడా వస్తానని అభిమానులకు సూర్య మాటిచ్చారు. ఆయన చెప్పినట్టుగానే తాజాగా చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో సూర్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. అభిమానులతో పాటుగా సూర్య కూడా రక్తదానం చేశారు. ఆయనతో పాటు సుమారు 500 మందికి పైగా అభిమానులు బ్లడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమం మరో పదిరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరుపుతామని ఆయన ఫ్యాన్స్ తెలిపారు.సుమారు ఏడేళ్ల క్రితం హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ...చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించిన పిల్లలకు బంగారపు ఉంగరాలను అందించారు. అప్పట్లోనే అన్నదానాలు, రక్తదానాలతో పాటు పలు సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. అలా ఆయన అభిమానులు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటారు. గత ఏడాది డిసెంబర్ నెలలో తమిళనాడును మిచాంగ్ తుపాను ముంచెత్తింది. ఆ సమయంలో సూర్య పిలుపు మేరకు నష్టపోయిన వారికి అండగా ఫ్యాన్స్ నిలిచారు. పరిస్థితులు చక్కపడ్డాక వారందరినీ భోజనానికి సూర్య ఆహ్వానించారు. వారందరితో కొంత సమయం పాటు ఆయన సరదాగ గడిపారు. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. -
దిష్టి తగిలేంత అందంగా సూర్య - జ్యోతిక.. సూపర్ జోడీ! (ఫొటోలు)
-
దసరాకి కంగువ
దసరా పండక్కి థియేటర్స్‌కు వస్తున్నాడు ‘కంగువ’. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ అండ్ టైమ్ ట్రావెల్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్ గా నటించగా, బాబీ డియోల్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న సినిమా ఇది. తాజాగా ‘కంగువ’ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల చేస్తున్నట్లుగా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు సూర్య. రిలీజ్ డేట్‌ని బట్టి ‘కంగువ’ దసరా పండగ సందర్భంగా విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇక ‘కంగువ’ సినిమా డిఫరెంట్ టైమ్‌లైన్స్ లో ఉంటుందని, సూర్య ఐదారు గెటప్స్‌లో కనిపిస్తారని, ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
Jalaja, Devika and Surya: లారీలో దేశాన్ని చుట్టేస్తున్నారు!
ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు జలజ, దేవిక, సూర్య హెవీ వెహికిల్ డ్రైవింగ్ నేర్చుకొని, లైసెన్స్ పొందారు. లారీలో ఫ్లైవుడ్, ఉల్లి, అల్లం లోడ్‌ను తీసుకెళుతూదేశంలోని 22 రాష్ట్రాలలో ప్రయాణించారు. జలజ, దేవిక తల్లీకూతుళ్లు. జలజ తోడికోడలు సూర్య. ఈ ముగ్గురూ ఆసక్తితో నేర్చుకున్న ట్రక్కు డ్రైవింగ్‌తో తమ ప్రయాణ విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. కేరళవాసులైన ఈ ముగ్గురు మహిళలు చేస్తున్న సాహస ప్రయాణం చాలామందిలో కొత్త ఉత్సాహం నింపుతోంది.కేరళలోని ఎట్టుమనూరుకు చెందిన రతీష్ పుథెట్ లారీ ట్రాన్స్పోర్ట్ యజమాని. అతని ట్రాన్స్పోర్ట్ సంస్థలో 30 లారీలు ఉన్నాయి. రతీష్ 19వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య జలజకు తన ట్రక్కు తాళాలను ఇచ్చాడు. రెండేళ్ల క్రితం ఫిబ్రవరిలో ఆమె రతీష్‌తో కలిసి ట్రక్కులో కాశ్మీర్‌కు బయల్దేరింది. ఆ సమయంలోనే తనకూ డ్రైవింగ్ చేయాలనే ఆసక్తి కలిగింది. 2014లో ఫోర్ వీలర్ లైసెన్స్ తీసుకున్నా ఆ తర్వాత నాలుగేళ్లకు 2018లోనే జలజ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. మొదటిసారి పెరుంబవూరు నుండి ఫ్లైవుడ్ తీసుకొని లారీలో పుణేకి మొదటి ప్రయాణం చేసింది. అక్కడ నుంచి కశ్మీరుకు ఉల్లిపాయల లోడు తీసుకెళ్లింది. ‘ఈ ప్రయాణాలు నాలో ధైర్యాన్ని నింపాయి. ఒక మహిళ డ్రైవింగ్ సీట్లో ఉండటంతో ఇతర డ్రైవర్లు, పోలీసు అధికారులు గౌరవంగా చూసేవారు. స్థానికులు కూడా ఆసక్తిగా చూసేవారు. కాశ్మీర్ ప్రయాణానికి ఆరు రోజులు వెళ్లడానికి, మరో ఆరు రోజులు తిరిగి రావడానికి సమయం పట్టింది. మధ్యలో కొండచరియలు విరిగిపడటంతో లారీలు వెళ్లేందుకు వీలు కాలేదు. లారీలన్నింటికీ ఇతర రాష్ట్రాల డ్రైవర్లు ఉన్నారు. ఏ సమస్యా రాలేదు. దేశవ్యాప్తంగా వివిధ రకాల వ్యక్తులు, వారి జీవనశైలి, ఆహారపుటలవాట్లు... ఇలా ప్రతిదానినీ అర్ధం చేసుకోవడానికి ఈ ప్రయాణాలు నాకు బాగా తోడ్పడుతున్నాయి. వివిధ రాష్ట్రాల భాష ముఖ్యంగా హిందీ నేర్చుకుంటున్నాను’ అని చెబుతోంది జలజ. కాశ్మీర్ వరకు జలజ ట్రక్ డ్రైవింగ్ చేయడంతో ఇంట్లో మరో ఇద్దరు మహిళలు డ్రైవింగ్ పట్ల ఆసక్తి చూపారు. జలజ కూతురు దేవిక డిగ్రీ చదువుతోంది. రతీష్ తమ్ముడి భార్య సూర్య. వీళ్లూ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. దీంతో రతీష్ కూడా చాలా ఆనందించాడు. వీరు ముగ్గురూ కలిసి పుథెట్ ట్రాన్స్పోర్ట్ వ్లాగ్‌ను ్రపారంభించారు. ముగ్గురు మహిళలూ తాము చేసే లారీ ప్రయాణాల వివరాలను అందులో ఉంచుతున్నారు. దేవిక లడఖ్ ప్రయాణంలో 5,900 కిలోమీటర్లు ట్రక్కును నడిపింది. లారీ డ్రైవింగ్‌తో కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణం చేసిన జలజ ఆ తర్వాత మహారాష్ట్ర, నేపాల్‌కు వెళ్లింది. హరిద్వార్, రిషికేశ్‌లో పర్యటిస్తున్నప్పుడు రతీష్ తల్లి లీలాను వెంట తీసుకెళ్లింది. దేవిక ఎర్నాకులం రాజగిరి కాలేజీలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ఏకైక స్టూడెంట్‌గా పేరొందింది. కోడలు గోపిక లైసెన్స్ కోసం ఎదురుచూస్తోంది. రతీష్, జలజ లది ఉమ్మడి కుటుంబం. పాతికేళ్లక్రితమే ఎట్టుమనూరుకు వలస వచ్చాడు. ఒకే ఇంట్లో ఉంటున్న జలజ, సూర్య, దేవిక కిందటి మే నెలలో లక్నో, షిల్లాంగ్ ట్రిప్పులలో డ్రైవర్లుగా ఉన్నారు. వీరికి తోడుగా సూర్య పిల్లలు గోపిక, మరో ముగ్గురు పిల్లలూ చేరారు. లారీ క్యాబిన్లో ఏసీని అమర్చారు. పడుకోవడానికి, కూర్చోవడానికి, రోడ్డు పక్కన వంట చేసుకోవడానికి అవసరమైన వస్తువులను తీసుకెళతారు. ‘ఎక్కడా ఇబ్బంది కలగకుండా లారీని ఇల్లులా తయారు చేసుకున్నాం’ అని చెబుతారు ఈ ముగ్గురు మహిళలు. ట్రక్కులలో లోడ్లను గమ్యస్థానాలకు తరలించడమే కాదు, కుటుంబం అంతా కలిసి యాత్రలు చేస్తుంటారు. ఈ యాత్రలో జలజ, సూర్యల కుటుంబసభ్యులు ఉంటారు. తమ యాత్ర వీడియోలను, ఫొటోలను సోషల్‌మీడియా ద్వారా పోస్ట్ చేస్తుంటారు. వీరికి దాదాపు మూడున్నర లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ మహిళా లారీ డ్రైవర్లకు ఉన్న అభిమానుల్లో విదేశీయులూ ఉన్నారు. -
I20 Movie: స్త్రీల గౌరవం పెంచేలా ‘ఐ 20’
సూర్యరాజ్, మెరీనా సింగ్ జంటగా నటించిన తాజా మూవీ "ఐ - 20", బివేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనేది ఉప శీర్షిక. సూగూరి రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పతాకంపై పి.బి.మహేంద్ర నిర్మించారు. ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మంచి సందేశం ఉన్న చిత్రం. ఈ చిత్రం జూన్ 14న విడుదల అవుతుంది.ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ "మన దేశం లో స్త్రీ లను ప్రత్యేకంగా గౌరవీస్తాం. వాళ్ళ గౌరవం గురించే ఈ చిత్రాని నిర్మించాం. కథ చాలా బాగా వచ్చింది. మంచి రొమాన్స్ ఉంది, కామెడీ అయితే అద్భుతంగా వచ్చింది.ఇప్పటికి విడుదలైన పాటలు, టీజర్ , ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ వచ్చింది, మొదటగా జూన్ 7 న విడుదల చేద్దాం అనుకున్నాం కానీ ఆ రోజు నా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి అని జూన్ 14 విడుదల చేస్తున్నం. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాలని ఎప్పుడూ ఆదరిస్తారు, అందులో మా సినిమా డిఫరెంట్ కాన్సెప్టుతో ఉంది కావున మా సినిమా పక్కాగా విజయం సాధిస్తుంది" అని అన్నారు. -
పడమ్ బిగిన్స్
కొత్త సినిమా షురూ చేశారు సూర్య. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జోజూ జార్జ్, జయరామ్, కరుణాకరన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అండమాన్‌లో ఆరంభమైంది.సూర్య కెరీర్‌లోని ఈ 44వ చిత్రం చిత్రీకరణ మొదలైనట్లుగా చెబుతూ, ‘పడమ్ బిగిన్స్’ (సినిమా ఆరంభమైంది) అంటూ చిన్న వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజ్. ప్రేమ, యుద్ధం, నవ్వు అంశాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలోని సూర్య లుక్‌ని బట్టి ఇది పీరియాడికల్ మూవీ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. -
అండమాన్‌లో యాక్షన్
కొద్ది రోజుల పాటు అండమాన్‌కు మకాం మార్చనున్నారు హీరో సూర్య. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగానే సూర్య అండమాన్ వెళ్లనున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ అండమాన్‌లో ప్రారంభం కానుంది.నవ్వు, యుద్ధం, ప్రేమ అంశాల నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాను జూన్‌లో ప్రారంభించనున్నట్లు ‘ఎక్స్’లో ఓ వీడియోను షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజ్. అండమాన్‌లో ఆరంభించే ఈ తొలి షెడ్యూల్లో ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. -
ఆగిపోయిన సూర్య & సుధా కొంగర కొత్త సినిమా
-
కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇల్లు పోలీసుల రక్షణలో ఉంది. ఇలా రెండున్నరేళ్ల నుంచి ఆయన ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో పోలీసు రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై తమిళనాట చర్చ జరుగుతుంది. సూర్య కుటుంబం ప్రస్తుతం చెన్నైలో లేదు.. అయినా కూడా ఆ ఇంటికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలుసుకుందాం.జై భీమ్‌తో వివాదంసూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్ కలిసి నిర్మించిన చిత్రం జై భీమ్. 2021లో అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదలైంది. జైభీమ్‌లోని కొన్ని సన్నివేశాలు తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని 'రుద్ర వన్నియర్ సేన' సంఘం ఆరోపించింది. ఇరులార్ కమ్యూనిటీ (ఆదివాసీలు) సభ్యులకు కస్టోడియల్ టార్చర్ వెనుక తమ వర్గానికి చెందిన సభ్యులు ఉన్నట్లు సినిమాలో చూపించడాన్ని వారు తప్పుపట్టారు. సూర్యపై దాడి చేసిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని ఆ సంఘం తెలిపింది. 'రుద్ర వన్నియర్ సేన' సంఘానికి సూర్య బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో టీ నగర్‌లోని సూర్య ఇంటి వెలుపల ఐదుగురు సాయుధ పోలీసులను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇప్పటికీ పోలీసుల రక్షణ ఎందుకు..?జై భీమ్ సినిమా సమస్య కొన్ని నెలల తర్వాత ముగిసినప్పటికీ, సూర్య ఇంటికి గత రెండున్నరేళ్లుగా నలుగురు పోలీసులు రక్షణగా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో సూర్య కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. వారందరూ ఇప్పుడు ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. అయినా ఆ ఇంటికి పోలీసుల రక్షణ ఎందుకు అనే ప్రశ్న తలెత్తింది. ఈ పరిస్థితిలో, నటుడు సూర్య ఇంటికి పోలీసు రక్షణ ఎవరి ఆదేశాల మేరకు కొనసాగుతుందని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించారు. పోలీస్ కమిషనర్ వివరణపోలీస్ కమిషనర్ ఆదేశం మేరకు నవంబర్ 15, 2021న తాత్కాలిక భద్రత కల్పించామని, సూర్యకు ముప్పు పొంచి ఉన్నందున భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం మేరకు భద్రతను ఇప్పటికీ కొనసాగిస్తున్నామని సమాధానమిచ్చారు. సాధారణంగా బెదిరింపులకు గురైన వ్యక్తులకు పోలీసు రక్షణ కల్పించినప్పుడు సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా పోలీసు శాఖకు రుసుము చెల్లించాలి. అలా అయితే, ప్రస్తుత పోలీసు రక్షణ కోసం సూర్య ఏమైనా డబ్బు చెల్లిస్తున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తింది, దానికి సమాధానం లేదు. దీంతో గత రెండున్నరేళ్లుగా సూర్య ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పిస్తున్నట్లు తేలింది. ఇది ఎంతవరకు న్యాయమని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఇందులో తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆయన అన్నారు. -
ఇంటర్లో టాప్ మార్కులతో అదరగొట్టిన సూర్య కూతురు
సౌత్ ఇండియాలో బ్యూటిఫుల్ కపుల్స్‌గా సూర్య- జ్యోతిక జంట ఉంటుంది. చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన జోడీగా వీరికి గుర్తింపు ఉంది. వీరి కుమార్తె దియా ఇటీవల ముగిసిన 12వ తరగతి సాధారణ పరీక్షలో మంచి మార్కులు సాధించినట్లు సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, ఈ దంపతలులకు దియా అనే 17 ఏళ్ల కుమార్తెతో పాటు దేవ్ అనే 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు.సూర్య కుటుంబం మొత్తం సినిమా రంగంలో ఉన్నప్పటికీ దియా, దేవ్ ఇద్దరు కూడా సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. దియా టెన్నిస్, ఫుట్‌బాల్ ఆటలపై దృష్టి సారిస్తుంటూ.. దేవ్ కరాటే వైపు అడుగులు వేస్తున్నాడు. చదువుతో పాటుగా ఆటలపై కూడా వారు ఆసక్తి చూపుతున్నారు.ఇంటర్లో అదరగొట్టిన దియాసూర్య కూతురు దియా ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు రాసింది. తాజాగా ఫలితాలు కూడా విడుదలయ్యాయి. దియా మంచి మార్కులతో పాస్ అయినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె సాధించిన మార్కులు ఇవే అంటూ కోలీవుడ్‌లో వైరల్ అవుతుంది. తమిళంలో 100కి 96, ఇంగ్లిష్‌లో 97, గణితంలో 94, ఫిజిక్స్‌లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్‌లో 97 మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించినట్లు సమాచారం. దియా ఇన్ని మార్కులు సాధించినందుకు కుటుంబ సభ్యులు ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారట. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఈ సమాచారం ఎంత వరకు నిజమో తెలియదు.2022లో టెన్త్‌లో కూడా సత్తా చాటిన దియా10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా దియా టాప్ మార్క్‌లు సాధించింది. తమిళంలో 95, ఆంగ్లంలో 99, గణితంలో 100, సైన్స్‌లో 98, సోషల్‌లో 95 మార్కులు సాధించింది. 500 మార్కులకు గాను 487 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. -
sri rama navami 2024: బాలరాముడికి సూర్య తిలకం
అయోధ్య: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య బాలరాముడికి సూర్య భగవానుడు స్వయంగా తిలకం దిద్ది ఆశీస్సులందించాడు. సరిగ్గా నుదుటిన చుంబించి రఘుకుల పురుషోత్తముడి పట్ల ఆతీ్మయత చాటుకున్నాడు. భవ్య రామమందిరంలోని గర్భాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత తొలిసారిగా కనిపించిన ఈ అద్భుత దృశ్యాలను భక్తులు కనులారా తిలకించి పరవశించిపోయారు. జైశ్రీరామ్ అంటూ నినదించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో దర్శించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత సూర్యతిలకం ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ సమయంలో గర్భగుడిలో అర్చకులు ప్రత్యేక హారతి ఇచ్చారు. అరుదైన వజ్రాలు, రత్నాలు పొదిగిన కిరీటంతోపాటు ప్రత్యేక ఆభరణాల అలంకరణతో బాలరాముడు మరింత సుందరంగా మెరిసిపోయాడు. ప్రతిఏటా శ్రీరామనవమి సందర్భంగా రాముడికి 58 మిల్లీమీటర్ల పరిమాణంలో సూర్యతిలకం దిద్దేలా ఆలయంలో దర్పణాలు, కటకాల సాయంతో ప్రత్యేక ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సూర్యతిలకం దృశ్యం 4 నుంచి 5 నిమిషాల పాటు కొనసాగిందని ఆలయ ప్రతినిధి ప్రకాశ్ గుప్తా చెప్పారు. సూర్యకిరణాలు నేరుగా బాలరాముడి విగ్రహం నుదుటి భాగంపైకి ప్రసరించాయని వెల్లడించారు. ఈ సమయంలో భక్తులను గర్భాలయంలోకి అనుమతించలేదని అన్నారు. వారు బయటి నుంచే దర్శించుకున్నారని తెలిపారు. మరోవైపు, అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రాణప్రతిష్ట తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఉత్సవాలు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది దర్శనం కోసం బారులు తీరారు. భావోద్వేగపూరిత క్షణం: ప్రధాని మోదీ దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి తనకెంతో ఆనందంగా కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ రోజు కోస మే కోట్లాది మంది ఎదురుచూశారని వెల్లడించారు. అస్సాంలోని నల్బారీలో ఎన్నికల ప్రచారం అనంతరం ప్రధాని మోదీ హెలికాప్టర్లో ప్రయాణిస్తూ బాలరాముడి సూర్యతిలకం ఘట్టాన్ని ఆన్లైన్లో వీక్షించి, భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యాన్ని చూసి తరించానని చెప్పారు. కోట్లాది మంది ప్రజల్లాగే తనకు కూడా ఇది భావోద్వేగపూరిత క్షణమని వెల్లడించారు. -
‘సూర్య తిలక్’ వేడుక.. ట్యాబ్‌లో వీక్షించిన ప్రధాని
గువహతి:అయోధ్య బాలరాముని నుదుట సూర్యుడు తిలకం దిద్దిన ‘సూర్య తిలక్’ వేడుకను ప్రధాని నరేంద్రమోదీ అస్సాంలో తిలకించారు. బుధవారం నల్బరీ జిల్లాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని సభలోని వారందరినీ సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ ఆన్ చేసి కాసేపట్లో జరిగే సూర్యతిలక్ ఉత్సవానికి సంఘీభావం తెలపాలని కోరారు. సెల్‌ఫోన్‌లైట్ కిరణాలు కూడా పంపాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ‘దేశ వాసుల 500 ఏళ్ల కల ఇన్నాళ్లకు నెరవేరింది. అయోధ్యలో రాముని ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇది తొలి రామ్ నవమి. కాసేపట్లో సూర్యతిలక్ వేడుక జరగనుంది. మీరందరూ మీ సెల్‌ఫోన్ లైట్లను వెలిగించండి.. జై శ్రీరామ్, జై శ్రీరామ్ నినాదాలివ్వండి’అని ప్రధాని కోరారు. ర్యాలీ తర్వాత ప్రధాని తన వద్ద ఉన్న ట్యాబ్‌లో సూర్యతిలక్ వేడకను వీక్షించారు. ఈ దృశ్యాలను ఆయన తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్టు చేశారు. #WATCH | PM Narendra Modi watched the Surya Tilak on Ram Lalla after his rally in Nalbari, Assam "Like crores of Indians, this is a very emotional moment for me. The grand Ram Navami in Ayodhya is historic. May this Surya Tilak bring energy to our lives and may it inspire our… pic.twitter.com/hA0aO2QbxF — ANI (@ANI) April 17, 2024 ఇదీ చదవండి..బాలరాముడికి సూర్య తిలకం -
కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం
తమిళ నూతన సంవత్సరాది (ఏప్రిల్ 14) సందర్భంగా కోలీవుడ్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. స్టార్ హీరో సినిమాల కొత్త లుక్‌లు, సరికొత్త అనౌన్స్మెంట్లతో తమిళ చిత్ర పరిశ్రమ కళకళలాడింది. ఈ విశేషాలపై కథనం.. భారతీయుడు వస్తున్నాడు భారతీయుడు మళ్లీ వస్తన్నాడు. హీరో కమల్‌హాసన్ , దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా 1996లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను రూ΄÷ందించారు కమల్‌హాసన్ , శంకర్. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’) చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మే నెలాఖరులో ‘ఇండియన్ 2’ ట్రైలర్, జూన్ లో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు మేకర్స్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ‘ఇండియన్ 2’ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్, ఎస్జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ ఏడాదే కంగువ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమాలో దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానున్నట్లు చిత్రయూనిట్ స్పష్టం చేసింది. డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో జరిగే ఈ చిత్రంలో సూర్య నాలుగైదు గెటప్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. విజిల్ పోడు విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్ పోడు..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మదన్ కర్కే లిరిక్స్ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్‌ప్రభు, యువన్ శంకర్ రాజా, ప్రేమ్గీ ఆలపించారు. ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. రాయన్ రెడీ ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాసు జయరాం లీడ్ రోల్స్ చేయగా, సెల్వరాఘవన్, ప్రకాష్‌రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, త్వరలోనే పాటలను రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. సన్‌పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ధనుష్ కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘రాయన్’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని కోలీవుడ్ సమాచారం. డబుల్ ధమాకా తమిళ కొత్త సంవత్సరంలో జోష్ పెంచారు రాఘవా లారెన్స్. ఆయన హీరోగా రెండు కొత్త సినిమాలను ప్రకటించారు. వాటిలో ఒక మూవీకి ‘హంటర్’ అనే టైటిల్ ఖరారైంది. రాఘవా లారెన్స్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్‌కు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తారు. గోల్డ్‌మైన్ టెలీ ఫిలింస్, మనీష్ షా, సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ‘బెంజ్’ అనే కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లారెన్స్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు కథ అందించారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని సుధన్ సుందరం, లోకేష్ కనగరాజ్, జగదీష్ పళనిస్వామి నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని మరికొన్ని సినిమాల అప్డేట్స్ కూడా వచ్చాయి.