
ఇటీవల యంగ్ హీరోయిన్, మలయాళ భామ మమితా బైజు పేరు వార్తల్లో తెగ వైరలవుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన చిత్రం ప్రేమలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మలయాళంలో హిట్ కావడంతో తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఓ డైరెక్టర్ తనపై అనవసరంగా చేయి చేసుకున్నారంటూ మమితా ఆరోపించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ దర్శకుడు బాల తెరకెక్కించిన వనంగాన్ సినిమా షూటింగ్ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పలువురు రాసుకొచ్చారు.
(ఇది చదవండి: డైరెక్టర్ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్)
అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై మమితా బైజు స్పందించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నాపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టి పారేసింది. బాలతో ‘వనంగాన్’ సినిమా కోసం ఏడాది పాటు పని చేసినట్లు తెలిపింది. కానీ ఆయన చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి అని.. నన్ను ఏ రకంగాను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది. అతను నాపై ఎప్పుడూ చేయి చేసుకోలేదని.. కొన్ని కమిట్‌మెంట్స్ ఉండడం వల్లే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు మమితా వివరించింది. కాగా.. ప్రేమలు సినిమా తెలుగు రైట్స్ రాజమౌళి తనయుడు కార్తికేయ దక్కించుకున్నారు. ఈ నెల 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలై రూ.50కోట్లకు పైగా వసూలు చేసింది.
కాగా.. వణంగాన్ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్ విజయ్‌ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్, సముద్రఖని, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment