డైరెక్టర్‌ తిట్టడమే కాదు, కొట్టాడు కూడా!: ప్రేమలు హీరోయిన్‌ | Mamitha Baiju: Director Bala Beating During Vanangaan Movie Shoot | Sakshi
Sakshi News home page

Mamitha Baiju: ఆ సినిమాలో డైరెక్టర్‌ నన్ను తిట్టి, అందరిముందే కొట్టాడు..

Published Wed, Feb 28 2024 4:51 PM | Last Updated on Wed, Feb 28 2024 5:52 PM

Mamitha Baiju: Director Bala Beating During Vanangaan Movie Shoot - Sakshi

మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది ప్రేమలు మూవీ. ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్‌ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రేమలు చిత్రంలో హీరోయిన్‌గా నటించింది మమిత బైజు. ఈ మూవీ కంటే ముందు వణంగాన్‌ సినిమాలో నటించే ఛాన్స్‌ వచ్చింది. అయితే చిత్రీకరణ సమయంలో దర్శకుడు తనను దూషించడంతో పాటు కొట్టాడని వెల్లడించింది హీరోయిన్‌.

ఎక్స్‌పర్ట్‌లా యాక్ట్‌ చేయాలి..
ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమిత బైజు మాట్లాడుతూ.. వణంగాన్‌ మూవీలో ఓ సంగీతపరికరాన్ని వాయించే సన్నివేశం ఉంటుంది. నేను అప్పటికే ప్రాక్టీస్‌ చేసిన అమ్మాయిలా నటించాలా? లేదంటే మొదటిసారి దాన్ని ప్రయత్నిస్తున్నట్లు యాక్ట్‌ చేయాలా? అని అడిగాను. డైరెక్టర్‌ బాలా.. అనుభవం ఉన్న కళాకారిణిగా నటించమన్నాడు. అప్పుడు నేను డ్రమ్స్‌ వాయిస్తూ అనుభవం ఉన్న అమ్మాయిగా పాట పాడాలి అంతేగా అనుకున్నాను.

కొన్నిసార్లు డైరెక్టర్‌ తిట్టాడు..
కానీ ఇంతలో ఆయన నన్ను ఆపి నా వెనకాల ఉన్న అమ్మాయిని చూపించి అలా చేయమన్నాడు. ఇంతలోనే రెడీ అన్నాడు. నేను షాకయ్యాను. ఎందుకంటే వాళ్లు ఏం పాడుతున్నారో నాకసలు అర్థం కావట్లేదు. మూడు టేకులయ్యాయి. మధ్యలో కొన్నిసార్లు డైరెక్టర్‌ తిట్టాడు. అయితే సెట్‌లో ఎప్పుడైనా కోప్పడతానని, దాన్ని సీరియస్‌గా తీసుకోవద్దని నాకు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి నేను దానికి మానసికంగా రెడీ అయ్యే సెట్‌లోకి వచ్చాను. కానీ ఆయన దూషణతో ఆగిపోలేదు, కొట్టాడు కూడా!

తిట్టడమే కాదు కొట్టాడు కూడా!
హీరో సూర్య సర్‌కు ఇదంతా తెలుసు. వారు ఎంతోకాలంగా కలిసి పని చేస్తున్నారు. వారి మధ్య ఆ అనుబంధం ఉంది. కానీ నాకిదంతా కొత్త కదా' అని చెప్పుకొచ్చింది. కాగా వణంగాన్‌ మూవీ నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు వచ్చేశారు. దీంతో దర్శకుడు అరుణ్‌ విజయ్‌ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. రోషిణి ప్రకాశ్‌, సముద్రఖని, మిస్కిన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చిలో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement