Mollywood
-
మా అక్కను చూశాక పెళ్లంటేనే భయమేస్తోంది: నటి
మలయాళ నటి, సింగర్ అమృత సురేశ్.. నటుడు బాలాను 2010లో పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు కూడా పుట్టింది. కుటుంబంలో గొడవలు మొదలవడంతో 2019లో అమృత-బాలా విడిపోయారు. విడాకుల తర్వాత కూడా తనతో పాటు, కూతుర్ని వేధించాడని అమృత ఫిర్యాదు చేయగా పోలీసులు బాలను అరెస్ట్ చేశారు. అదృష్టం కూడా ఉండాలితర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్నాడు. అమృత మాత్రం ఒంటరిగానే ఉంటోంది. ఇదంతా చూశాక తనకు పెళ్లంటేనే భయమేస్తోందంటోంది అమృత సోదరి, నటి అభిరామి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'విడాకులే లేని పెళ్లి కావాలి. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ.. అందుకు అదృష్టం కూడా కలిసిరావాలి. పెళ్లి అంటేనే భయంపెళ్లికి నేను విరుద్ధం కాదు. కానీ మా అక్క పడ్డ కష్టాలు చూశాక వివాహమంటేనే భయమేస్తోంది. ఆ భయం వల్లే ఇంకా పెళ్లి చేసుకోలేదు. అలా అని ఎప్పటికీ సింగిల్‌గానే ఉండిపోను. ఏదో ఒకరోజు కచ్చితంగా మూడు ముళ్లు వేయించుకుంటాను. అయితే గుడ్డిగా తప్పుడు వ్యక్తితో ప్రేమలో పడటం కంటే ప్రమాదకరం మరొకటి లేదు. మా అక్క పెళ్లయినప్పటినుంచి అంటే దాదాపు 14 ఏళ్లుగా మా కుటుంబం బాధ అనుభవిస్తూనే ఉంది' అని అభిరామి చెప్పుకొచ్చింది.చదవండి: ‘మట్కా’ మూవీ రివ్యూ -
కూలీ పనికి వెళ్తున్న స్టార్ హీరో తనయుడు!
మలయాళంలో ఆయనో ఓ పెద్ద స్టార్ హీరో. మాలీవుడ్‌లో రికార్డులు సృష్టించాలన్నా.. ఉన్న రికార్డులను బద్దలు కొట్టాలన్నా ఆయన తర్వాతే అందరు. వందల సినిమాలు తీసి వేల కోట్ల ఆస్తిని కూడా కూడబెట్టాడు. కొడుకుని హీరోగా ఇండస్ట్రీగా పరిచయం చేసి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందించాడు. కట్ చేస్తే..ఆ వారసుడు ఇప్పుడు కూలీగా మారాడు. తండ్రి సంపాదించిన వేల కోట్ల ఆస్తిని వదిలేసి.. గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ తనయుడి పేరే ప్రణవ్ మోహన్ లాన్. తండ్రి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. మోహన్ లాల్ కొడుకు కూలీ పని చేయడం ఏంటని షాకవుతున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.ఆల్ రౌండర్ ప్రణవ్మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్క్రీన్‌ప్లే రైటర్‌గా మారాడు. కొన్నాళ్లకు మళ్లీ హీరోగా వెండితెరపై మెరిశాడు. ఆయన తీసిన ‘హృదయం’ మూవీ అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన తర్వాత ఆయన నటించిన ‘వర్షంగళ్కు శేషం’ మూవీ కూడా ప్రణవ్‌కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. హీరో కంటే ముందు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు. ఇలా ఒకవైపు నటనతో పాటు మిగిలిన విభాలన్నింటిలోనూ ప్రణవ్ మంచి పట్టు సాధించి ‘ఆల్ రౌండర్’గా గుర్తింపు పొందాడు. ఇలా కెరీర్లో దూసుకెళ్తున్న ప్రణవ్..సడెన్‌గా గ్యాప్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైపోయాడు.స్పెయిన్‌లో కూలీగా..‘వర్షంగళకు శేషం’ తర్వాత ప్రణవ్ కాస్త గ్యాప్ తీసుకొని స్పెయిన్ వెళ్లాడు. స్టార్ హీరో కాబట్టి ఏ వివాహారానికో, ఎంజాయ్ చేయడానికి ప్రణవ్ విదేశాలకు వెళ్లలేదు. స్పెయిన్ వెళ్లి కూలీ పని చేస్తున్నాడు. అక్కడ ఓ ఫామ్ హౌస్‌లో ఉంటూ గొర్రెలు, గుర్రాల కాపరిగా చేరాడట. ఇందుకుగాను జీతం ఏమి లేదట. కేవలం భోజనం పెట్టి, షెల్టర్ ఇస్తారట.కష్టమైన పని చేయడం ఇష్టంప్రణవ్ కూలీ పనిచేయాల్సిన అవసరం లేదు. ఏ పని చేయకున్నా.. తండ్రి మోహన్ లాన్ సంపాదించిన ఆస్తితో జీవితాంతం కూర్చొని తినొచ్చు. అలా ఉండడం ఇష్టం లేకపోయినా.. తనలో మంచి టాలెంట్ ఉంది. హీరోగానూ రాణించాడు. ఆయన నటిస్తే చాలు కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. ఇలాంటి లగ్జరీ లైఫ్‌ని వదిలేసి.. కూలీ పని చేయాల్సిన అవసరం ఏంటి? అంటే.. ప్రణవ్‌కి అలాంటి పని చేయడం ఇష్టం అట. గొర్రెలు, గుర్రాలను చూసుకునే పనిని ఆస్వాదిస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రణవ్ తల్లి, మోహన్ లాల్ సతీమణి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ‘కష్టమైన పని చేయడం ప్రణవ్‌కి ఇష్టం. కానీ నాకు మాత్రం ప్రణవ్ హీరోగా మరిన్ని సినిమాలు చేయాలని ఉంది’ అని ప్రణవ్ తల్లి అన్నారు. రంగుల ప్రపంచం(చిత్ర పరిశ్రమ) నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇలా సాధారణ జీవితం గడపడడం నిజంగా గొప్ప విషయమే. View this post on Instagram A post shared by Pranav Mohanlal (@pranavmohanlal) -
ప్రేమమ్ నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. పోలీసులు ఏం తేల్చారంటే?
ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలీపై గతంలోనే లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. సినిమాల్లో అవకాశం పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ యువ నటి ఫిర్యాదు చేసింది. దుబాయ్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురిపై యువతి ఆరోపణలు చేసింది. దీంతో అప్పట్లోనే నివిన్ పౌలీతో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు నటులపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.అయితే ఆ తర్వాత జరిగిన విచారణలో నటుడు నివిన్ పౌలీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. తాజాగా ఈ కేసులో నివిన్ పౌలీకి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. యువతి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సంఘటన జరిగిన సమయంలో నివిన్ పౌలీ అక్కడ లేరని గుర్తించినట్లు తెలిపారు. అతను లైంగికంగా వేధించినట్లు స్పష్టమైన ఆధారాలు తమకు లభించలేదని కొత్తమంగళం కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు. దీంతో ఆరో నిందితుడిగా ఉన్న ఆయన పేరును తొలగించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే మిగిలిన నిందితుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా.. నివిన్ పౌలీ మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ప్రేమమ్ చిత్రంలో నటించారు. -
నా మొదటి భార్య అలాంటిది.. అందుకే రెండో పెళ్లి: నటుడు
ఈ రోజుల్లో బట్టతల, బయటకు తన్నుకొచ్చిన పొట్ట కామన్ అయిపోయింది. కానీ పెళ్లి చేసుకునేవరకైనా ఆ రెండింటినీ అడ్డుకోవాలని లేదా కవర్ చేసుకోవాలని ప్రయత్నించేవాళ్లు బోలెడు. అయితే మలయాళ బుల్లితెర నటుడు క్రిస్ వేణుగోపాల్ మాత్రం నెరిసిన గడ్డం, బట్టతలతోనే పెళ్లి చేసుకున్నాడు. ముసలాడిగానే పెళ్లిపీటలపై కూర్చుని ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేశాడు. పిల్లల ఎదుటే రెండో పెళ్లి చేసుకున్నాడు.దంపతులపై ట్రోలింగ్ఇది చూసిన జనం నోరెళ్లబెట్టారు. సోషల్ మీడియా వేదికగా వేణుగోపాల్‌ను, నటి దివ్య శ్రీధర్‌ను తిట్టిపోస్తున్నారు. ఈ వయసులో రెండో పెళ్లేంటని విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌తో కొత్త జంట ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దివ్య శ్రీధర్ స్పందిస్తూ.. తమ వయసు మరీ ఎక్కువేమి కాదని పెదవి విప్పింది. తన వయసు 40, క్రిస్ వయసు 49 అని పేర్కొంది. తాము శారీరక వాంఛ కోసం పెళ్లి చేసుకోలేదని, ఒకరికొకరం తోడు కోరుకున్నామని వెల్లడించింది.కుటుంబానికి కూడా దూరంక్రిస్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. మొదటి భార్యతో నేను సంతోషంగా లేను. నా స్వేచ్ఛను దూరం చేసింది. ఆమె నా కుటుంబంతో కూడా మాట్లాడనిచ్చేదికాదు. ఎన్నో షరతులు విధించేది. ఎవరూ మా ఇంటికి వచ్చేవారు కాదు. కనీసం ఫోన్లో మాట్లాడేందుకు కూడా ఒప్పుకునేది కాదు. నేను మనిషిలా కాకుండా ఒక పెంపుడు జంతువులా ఉండేవాడిని. జీవితంపైనే విరక్తి వచ్చింది. దాని నుంచి విముక్తి కోరుకున్నాను.అందుకే రెండో పెళ్లి2019లో విడాకులకు దరఖాస్తు చేయగా 2022లో మంజూరయ్యాయి. కానీ కొన్ని నెలలకు ఏ తోడూ లేకుండా బతకడం కష్టంగా అనిపించింది. అందుకే దివ్యను పెళ్లి చేసుకున్నాను. చాలామంది మా రెండో పెళ్లి గురించి తప్పుగా మాట్లాడుతుంటే బాధగా ఉంది అన్నాడు. కాగా క్రిస్ వేణుగోపాల్, దివ్య శ్రీధర్.. ఇద్దరికీ ఇది రెండో వివాహమే! క్రిస్ వేణుగోపాల్ పాతరమట్టు సీరియల్లో తాతగా నటించాడు. పలు సీరియల్స్‌లో యాక్ట్ చేసిన ఇతడు పల్లు రైజింగ్, తెలివు, సంబవస్తలతు నిన్నుమ్ వంటి చిత్రాల్లోనూ నటించాడు.చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన హర్షసాయి.. కేసు గురించి.. -
లేటు వయసులో పెళ్లి.. 'తండ్రి దొరికినందుకు పిల్లలు హ్యాపీ'
బుల్లితెర నటుడు క్రిస్ వేణుగోపాల్ పెళ్లి చేసుకున్నాడు. 49 ఏళ్ల వయసులో నటి దివ్య శ్రీధర్‌తో ఏడడుగులు వేశాడు. కేరళలోని గురువాయూర్‌లో మంగళవారం వీరి వివాహం జరిగింది. వీళ్లిద్దరూ పాతరమట్టు అనే సీరియల్లో కలిసి నటించారు.ఫస్ట్ ప్రపోజ్ ఎవరంటే?ఈ వివాహం గురించి నటి దివ్య మాట్లాడుతూ.. నాకు మొదట ప్రపోజ్ చేసింది అతడే.. పెళ్లి చేసుకోవాలనుందని చెప్పాడు. నాకేమీ అర్థం కాలేదు. తీరా.. అతడు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అందుకు నన్ను ఒప్పించాడు కూడా! దీని గురించి నా కూతురు, కొడుక్కి చెప్తే వాళ్లు ఎంతగానో సంతోషించారు. తమకు తండ్రి దొరికాడని ఖుషీ అయ్యారు అని తెలిపింది.ఇద్దరూ నటులేకాగా క్రిస్ వేణుగోపాల్ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తుంటాడు. దివ్య శ్రీధర్.. మలయాళ సీరియల్స్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో అలరిస్తూ ఉంటుంది. -
మలయాళ రాక్‌స్టార్ పెళ్లి.. హాజరైన సెలబ్రిటీలు
మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ సుశిన్ శ్యామ్ పెళ్లి పీటలెక్కాడు. ప్రేయసి, సింగర్ ఉత్తర కృష్ణన్ మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇకపోతే నటుడు పార్వతీ జయరామ్ చుట్టాలమ్మాయే ఉత్తర. బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి ప్రేమికులుగా..పార్వతి జయరాం కూతురి పెళ్లిలోనే సుశిన్-ఉత్తర ప్రేమాయణం బయటపడింది. మొదట బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న వీళ్లు తర్వాత ప్రేమికులుగా మారారు. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి భార్యాభర్తలుగా ఓ అడుగు ముందుకు వేశారు. ఈ వివాహానికి సినీనటులు ఫహద్ ఫాజిల్, నజ్రియా, జయరామ్, దర్శకుడు అన్వర్ రషీద్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మ్యూజిక్ కెరీర్..సుశిన్ విషయానికి వస్తే.. దీపక్ దేవ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మొదట శిక్షణ తీసుకున్నాడు. లార్డ్ లివింగ్స్టన్ 700 కండి, కిస్మత్ వంటి చిత్రాలకు బీజీఎమ్ అందించాడు. వరథాన్, కుంబలంగి నైట్స్ సినిమాలతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. భీష్మ పర్వం, మిన్నాల్ మురళి, రోమాంచం, మంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, బోగిన్ విల్లా వంటి పలు చిత్రాలకు సంగీతం అందించాడు. Sensational Malayalam music director #SushinShyam got married to AD and singer #UtharaKrishnan ❤️ #fahadhfaasil and wife #Nasriya , #Jayaram were present at this very private ceremony pic.twitter.com/CHR41ApcXL— sridevi sreedhar (@sridevisreedhar) October 30, 2024 చదవండి: అతనితో హీరోయిన్ డేటింగ్.. మొత్తానికి తెలిసిపోయింది! -
అనుమానాస్పద రీతిలో 'కంగువ' ఎడిటర్ మృతి
సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కంగువ'. భారీ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రాన్ని నవంబర్ 14న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఇంతలో విషాదం జరిగిపోయింది. ఈ సినిమాకు పనిచేసిన ఎడిటర్ నిషాద్ యూసఫ్ (43).. అనుమానాస్పద రీతిలో చనిపోయి కనిపించాడు. ఇప్పుడీ వార్త అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.(ఇదీ చదవండి: నా ఉద్దేశం అదికాదు.. 'బిగ్‌బాస్ 8' వివాదంపై మెహబూబ్ వీడియో)కేరళకు చెందిన నిషాద్ యూసఫ్.. ఎడిటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తల్లుమలా, ఉండా, వన్, సౌదీ వెళ్లక్క, అడియోస్ అమిగోస్ తదితర చిత్రాలకు పనిచేశాడు. ఇవన్నీ గత రెండు మూడేళ్లలోనే రిలీజయ్యాయి. నిషాద్ పనిచేసిన లేటెస్ట్ మూవీ 'కంగువ'. ఇంతలో ఇలా మృతి చెందడంపై తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.బుధవారం వేకువజామున 2 గంటలకు నిషాద్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లోని తన అపార్ట్మెంట్ శవమై కనిపించాడు. మృతికి కారణాలు ఇంకా తెలిసిరాలేదు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా మరో 15 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని.. ఇలా ఎడిటర్ చనిపోవడం 'కంగువ' టీమ్‌కి కూడా షాకే.(ఇదీ చదవండి: టాలీవుడ్ సీనియర్ నిర్మాత కన్నుమూత) -
పెళ్లి కాని వాళ్లకు నన్ను చూస్తేనే అసూయ: నటుడు
సమాజంలో పెళ్లికాని ప్రసాదులూ ఉన్నారు.. ముచ్చటగా మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లూ ఉన్నారు. ఈ మధ్యే మలయాళ నటుడు బాల (బాలకుమార్) సైతం నాలుగో వివాహం చేసుకున్నాడు. చుట్టాలమ్మాయి కోకిల మెడలో మూడు ముళ్లు వేశాడు. వీరిద్దరికీ దాదాపు 18 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అయితే చాలామంది తనను చూసి కుళ్లుకుంటున్నారంటున్నాడు బాల. రాజులా బతుకుతున్నా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు బాల మాట్లాడుతూ.. 'ఇప్పుడు నా వయసు 42 ఏళ్లు, కోకిలకు 24 ఏళ్లు. అయినా మా సంసార జీవితం సంతోషంగా సాగుతోంది. నేను రాజులా బతుకుతున్నా.. భార్యను రాణిలా చూసుకుంటున్నా.. త్వరలోనే మాకు ఓ బుజ్జి బాబు/పాపాయి రానుంది. ఇదంతా చూసి మీరు అసూయ చెందితే దానికి నేనేం చేయలేను. తప్పులు వెతకడమే మీ పనిమీ దగ్గర డబ్బు లేకనే ఏ అమ్మాయి దొరకడం లేదు. అయినా నా నాలుగు పెళ్లిళ్లపై ఏడుస్తారేమో! ప్రతిదాంట్లో తప్పులు వెతకడమే మీలాంటివారి పని' అని కౌంటరిచ్చాడు. కోకిల మాట్లాడుతూ.. చాలాకాలంగా మామ ఒంటరిగానే ఉంటున్నాడు. ఇప్పుడు నేను అతడికి తోడుగా ఉన్నాను. చిన్నప్పటినుంచి అతడు అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. అది చూసే నేను ప్రేమలో పడ్డాను అని చెప్పుకొచ్చింది.పెళ్లి హిస్టరీ..ఇకపోతే బాల.. కంగువ మూవీ డైరెక్టర్ శివకు తమ్ముడవుతాడు. కాగా బాల 2008లో చందన సదాశివ అనే అమ్మాయిని పెళ్లాడాడు. ఏడాదికే ఆమెకు విడాకులిచ్చేసి 2010లో మలయాళ సింగర్ అమృతా సురేశ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. తర్వాత పొరపచ్చాలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. 2021లో డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్‌ను పెళ్లాడగా ఆమెతోనూ సుదీర్ఘ ప్రయాణం చేయలేదు. పోయిన ఏడాదే విడిపోయాడు. ఈ మధ్యే కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. -
పాపులర్ యాంకర్, టీవీ నటి మెటర్నిటీ ఫోటోషూట్
-
కలల పంటకోసం ఎదురు చూపులు : అందమైన మెటర్నిటీ షూట్
టీవీ సీరియల్స్, టెలివిజన్ డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ జూనియర్ 2 ద్వారా పాపులర్ అయిన మలయాళ కుట్టి మాళవిక కృష్ణదాస్ త్వరలో తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా భర్తతో కలిసి మెటర్నిటీ ఫోటో షూట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మాళవిక క్లాసికల్ డేన్సర్ కూడా. నటనతోపాటు, శాస్త్రీయ నృత్యంలో కూడా అనేక అవార్డులు రివార్డులుగెల్చుకుంది. 2023లో ‘నాయికా నాయకన్’ కో-కంటెస్టెంట్ తేజస్ జ్యోతిని వివాహం చేసుకుంది. ఇపుడు ఈ జంట తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతోంది. -
మరో ఓటీటీకి వచ్చేసిన సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ లెవెల్ క్రాస్. జూలైలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ నెల 13 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలో దర్శనమిచ్చింది.తాజాగా ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఆసిఫ్ అలీ హీరోగా నటించారు. ఈ మూవీకి అర్బాజ్ అయూబ్ దర్శకత్వం వహించారు. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు లెవెల్ క్రాస్ సినిమా చూసేయండి.Unlikely love. Shattered trust. Eternal consequences. Stream #LevelCross on #Aha ▶️https://t.co/NCGmg0REO0 pic.twitter.com/0H57F28kFt— ahavideoin (@ahavideoIN) October 15, 2024 -
ఆ కారణం వల్లే బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది: దుల్కర్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నుంచి సినిమా వచ్చి ఏడాదిపైనే అవుతోంది. గతేడాది ఆగస్టులో కింగ్ ఆఫ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తర్వాత కల్కి 2898 ఏడీ మూవీలో చిన్న పాత్రలో మెరిశాడు. తర్వాత ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను బ్రేక్ తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.అందుకే గ్యాప్ వచ్చిందినా గత సినిమా అంతగా ఆడలేదు. అందులో ఎవరి తప్పూ లేదు. అయితే నాకు చిన్న బ్రేక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. అందుకే గతేడాది ఒకే ఒక్క సినిమా చేయగలిగాను. నేను ఆరోగ్యంపై శ్రద్ధ చూపించలేదు. అది నా తప్పే అని చెప్పుకొచ్చాడు.సినిమాల విషయానికి వస్తే..దుల్కర్ ప్రధాన పాత్లలో నటించిన ఈ నెల 31న విడుదల కానుంది. అలాగే ఇతడు పీరియాడికల్ ఫిలిం కాంత సినిమా చేస్తున్నాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. . 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అలాగే పవన్ సాధినేని డైరెక్షన్లో ఆకాశంలో ఒక తార సినిమా చేస్తున్నాడు. -
ప్రముఖ నటుడు అరెస్ట్.. అదే కారణం!
ప్రముఖ మలయాళ నటుడు బైజు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ తన కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరువనంతపురంలోని మ్యూజియం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నటుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.కాగా.. కారులో బైజూ కుమార్తె కూడా అతనితో ఉన్నట్లు తెలుస్తోంది. బైజు సంతోష్ దాదాపు 40 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన మొదట అధవ మణియన్ పిల్ల (1981) చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత పుతన్ పనం (2017), మేరా నామ్ షాజీ (2019) చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్నారు. కాగా.. ప్రస్తుతం సంతోశ్ పృథ్వీరాజ్ సుకుమారన్ చిత్రం ఎల్2 ఎంపురన్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
మాజీ భార్య ఫిర్యాదు.. ప్రముఖ నటుడు అరెస్ట్
మలయాళ ప్రముఖ నటుడు బాల అరెస్ట్ అయ్యాడు. కొచ్చిలోని అతడి ఫ్లాట్‌లో ఉండగా.. సోమవారం ఉదయం పోలీసులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ భార్య అమృత సురేశ్ ఫిర్యాదు చేయడంతోనే ఇదంతా జరిగింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.బాల తమిళ-మలయాళ సినిమాలు చేసే నటుడు. 'కంగువ' దర్శకుడు శివ ఇతడికి అన్నయ్య అవుతాడు. 2006 నుంచి బాల.. నటుడిగా కొనసాగుతున్నాడు. 2010లో సింగర్ అమృత సురేశ్‌ని పెళ్లి చేసుకున్నాడు. 2012లో వీళ్లకు పాప కూడా పుట్టింది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. 2019లో విడాకులు తీసుకున్నారు. బాల మరో పెళ్లి చేసుకుని ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)ఈ మధ్య సోషల్ మీడియాలో, పలు ఇంటర్వ్యూల్లో తమ పరువు తీసేలా బాలా ప్రవర్తిస్తున్నాడని.. ఇతడి మాజీ భార్య అమృత తాజాగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కూతురి వెంటపడటంతో పాటు వేధిస్తున్నాడని పేర్కొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కొచ్చిలో బాలాతో పాటు అతడి మేనేజర్, ఫిల్మీ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానెల్ యజమానికి కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లని వేధించిన కారణంగా జువైనల్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.బాలా తనని వేధిస్తున్నాడని చెప్పి అమృత.. గతంలో రెండు మూడుసార్లు గృహ హింస కేసు పెట్టింది. ఇప్పుడు విడాకుల నిబంధనని మీరి తమని వేధిస్తున్నాడని అమృత కేసు పెట్టడంతో ఈ గొడవ కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఆస్పత్రిలో ఉంటే ఎవరు సాయం చేయలేదు: చలాకీ చంటి) -
ప్రముఖ మలయాళ నటుడు కన్నుమూత
ప్రముఖ మలయాళ నటుడు టీపీ మాధవన్ (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో మంగళవారం నాడు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి కేరళ సీఎం పినరయి విజయన్ సహా పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.సినిమా..కాగా టీపీ మాధవన్ 40 ఏళ్ల వయసులో సినీ కెరీర్ ఆరంభించారు. దాదాపు 600 చిత్రాల్లో నటించారు. 2016లో వచ్చిన మాల్గుడి డేస్ సినిమాలో చివరిసారిగా నటించారు. వెండితెరతో పాటు బుల్లితెరపైనా సీరియల్స్‌లో విలన్, కమెడియన్, సహాయక నటుడిగా మెప్పించారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'అమ్మ'కు మొట్టమొదటి జనరల్ సెక్రటరీగా పని చేశారు.చదవండి: రానాకి ఇంతకంటే బెటర్ ప్రశంస ఉండదేమో? -
బెస్ట్ ఫ్రెండ్‌తో పెళ్లి రద్దు.. మరొకరితో నటి ఏడడుగులు
మలయాళ నటి శ్రీ గోపిక గుడ్‌న్యూస్ చెప్పింది. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. వరుణ్దేవ్తో ఏడడుగులు వేశానని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి ఫోటోలు షేర్ చేసింది. అందులో నటి ఎంతో సింపుల్‌గా, క్యూట్‌గా ఉంది.జూన్‌లో ఎంగేజ్మెంట్కాగా గోపిక.. గతంలో తన బెస్ట్ ఫ్రెండ్ వైశాఖ్ రవితో పెళ్లికి రెడీ అయింది. వీరిద్దరికీ ఈ ఏడాది జూన్‌లో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం ఇరువురూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. కానీ పెళ్లి చేసుకునేలోపే ఇద్దరూ విడిపోయారు. నిశ్చితార్థం ఫోటోలను సైతం డిలీట్ చేశారు. ఇంతలోనే శ్రీగోపిక పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ జంట కలకాలం కలిసుండాలని కోరుకుంటున్నారు.వైశాఖ్‌తో శ్రీగోపిక ఎంగేజ్మెంట్ ఫోటోసినిమా, సీరియల్స్కాగా శ్రీ గోపిక.. 90 ఎమ్ఎల్ అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. రూల్ నెంబర్ 4, వోల్ఫ్ వంటి తమిళ చిత్రాలతో పాటు నాన్సెన్స్ అనే మలయాళ మూవీలోనూ మెరిసింది. బుల్లితెరపై ఉయిరే సీరియల్‌తో క్రేజ్ తెచ్చుకుంది. చదవండి: Bigg Boss Tamil: ఎలిమినేషన్లో కొత్త ట్విస్ట్ ఇచ్చిన తమిళ బిగ్‌బాస్ -
ఎంత ప్రేమించానో తెలుసా?: హీరోయిన్ ఎమోషనల్
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పుట్టెడు దుఃఖంలో ఉంది. పెంపుడు శునకం చనిపోవడంతో ఆ బాధ నుంచి బయటపడలేకపోతోంది. పెట్ డాగ్‌తో ఆడుకున్న క్షణాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయింది. 'థియో.. ఈ వారమే నన్ను వదిలేసి వెళ్లిపోయింది. తన మరణవార్త నా గుండెను ముక్కలు చేసింది. చూడటానికి చిన్నగా ఉన్నా దానికి ఎంతో ఎనర్జీ ఉండేది. తన ఇంట్లోనే మేమున్నాం..మేము దాన్ని ఇంటి యజమాని అని పిలిచేవాళ్లం. ఎందుకంటే ఇది తనిల్లు.. తన ఇంట్లోనే మేము నివసిస్తున్నాం. అదొక సిల్లీ వాచ్డాగ్ కూడా! స్టూడియో బయట కూర్చోవడం దానికెంతో ఇష్టం. ప్రతి వేసవిలో దానికి హెయిర్ కట్ చేసేవాళ్లం. దానితో చివరిసారి ఉన్నప్పుడు గట్టిగా పట్టుకుని ప్రేమగా ముద్దుపెట్టుకోవాల్సింది. దానిపై ప్రేమ కురిపించిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.ఎంతో ప్రేమించా..అలాగే అది లేదన్న నిజం తట్టుకోలేక డీలా పడిపోయిన నన్ను ఓదార్చి ధైర్యంచెప్పినవారికి కూడా థాంక్స్. థియో.. గత కొన్నేళ్లుగా నీతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. కానీ నువ్వు చాలా మంచి అబ్బాయివి. నిన్ను ఎంతో గాఢంగా ప్రేమించానో అర్థం చేసుకో.. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు థియోతో కలిసున్న ఫోటోలు జత చేసింది.కాగా కల్యాణి ప్రియదర్శన్ తెలుగులో హలో, చిత్రలహరి, రణరంగం వంటి చిత్రాల్లో కథానాయికగా నటించింది. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తమిళ డైరెక్టర్ అందరిముందు నన్ను కొట్టాడు: హీరోయిన్
ఓ తమిళ దర్శకుడు తనను అందరిముందే కొట్టాడంటోంది హీరోయిన్ పద్మప్రియ జానకిరామన్. కేరళలోని కోజికోడ్‌లో ఓ ఈవెంట్‌కు వెళ్లిన ఆమె ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. ఓ దర్శకుడు షూటింగ్ పూర్తయ్యాక సెట్లో అందరిముందే నాపై చేయి చేసుకున్నాడు. అసత్య ప్రచారంకానీ నేనే అతడిని కొట్టానని మీడియాలో తప్పుగా ప్రచారం చేశారు. అదే నిజమైతే ఆ దర్శకుడిపై సినిమా అసిసోయేషన్కు నేనెందుకు ఫిర్యాదు చేస్తాను? అతడు చేసిన తప్పును నాపై రుద్దాలని ప్రయత్నించారు. కానీ నా ఫిర్యాదు వల్ల ఆ దర్శకుడిని 6 నెలలపాటు సినిమాలు చేయకుండా నిషేధించారు. ఇదే సమస్యతప్పు ఎవరివైపు ఉందని కూడా ఆలోచించకుండా ఆడవారినే దోషులుగా నిలబెట్టాలని చూస్తారు.. ఈ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద సమస్య ఇదే అని చెప్పుకొచ్చింది. కాగా పద్మప్రియ.. మలయాళంలో టాప్ హీరోయిన్. సీను వాసంతి లక్ష్మి అనే తెలుగు చిత్రంతో 2004లో కెరీర్ మొదలుపెట్టింది. అందరి బంధువయ, పటేల్ సర్ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈమె తమిళ, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది.చదవండి: మోసం చేశారంటూ తృప్తి డిమ్రీపై ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన టీమ్! -
అత్యాచార కేసులో ప్రముఖ నటుడికి అరెస్ట్ వారెంట్
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ సినిమా పరిశ్రమలో మహిళలపై ఎలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయో ఈ కమిటీ బయటపెట్టింది. ఇందులో ప్రముఖ హీరోలు, నటులు, దర్శకులు ఇరుక్కున్నారు. ప్రముఖ నటుడు సిద్ధిఖీపైన కూడా ఓ మహిళ అత్యాచార ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ కేసులోనే సదరు నటుడికి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పటికే ముందస్తు బెయిల్ కోసం సిద్ధిఖీ ప్రయత్నించగా.. దాన్ని కోర్టు తిరస్కరించింది.(ఇదీ చదవండి: కాపీ కొట్టారంటూ డైరెక్టర్ శంకర్ కామెంట్.. 'దేవర' గురించేనా..?)కేసు ఏంటి?మాజీ నటి ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం.. ఓ తమిళ సినిమాలో అవకాశమిస్తానని సిద్ధిఖీ చెప్పాడు. అందుకోసం లైంగిక అవసరాలు తీర్చమన్నాడు. కుదరదనే సరికి బలవంతంగా ఓ హోటల్లో అత్యాచారం చేశాడు. 2016లో తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ ఘటన గురించి గతంలో ఇదే నటి మాట్లాడుతూ.. తనతో సిద్ధిఖీ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.ఇప్పుడే ఎందుకు?తాజాగా హేమ కమిటీ రిపోర్ట్ రిలీజ్ చేయడంతో పలువురు నటీమణులు తమపై జరిగిన అఘాయిత్యాలని బయటపెడుతున్నారు. అలా సదరు నటి.. నటుడు సిద్ధిఖీపై పోలీస్ కేసు పెట్టింది. ఈ క్రమంలోనే విచారించిన కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కానీ సిద్ధిఖీ ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకునే పనిలో ఉన్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్) -
పనిమనిషిపై దాడి.. హీరోయిన్‌పై కేసు నమోదు
మలయాళ హీరోయిన్ పార్వతి నాయర్‌పై కేసు నమోదైంది. దొంగతనం నెపంతో తనపై దాడి చేసిందని ఆమె పనిమనిషి సుభాష్ చంద్రబోస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పార్వతితోపాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.అసలేం జరిగిందంటే?సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి కేజేఆర్ స్టూడియోలో హెల్పర్‌గా పని చేసేవాడు. 2022 నుంచి పార్వతి నాయర్ ఇంట్లో పనిమనిషిగా చేరాడు. అదే ఏడాది అక్టోబర్‌లో చెన్నైలోని పార్వతి నాయర్ ఇంట్లో దొంగతనం జరిగింది. రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, రూ.1.5 లక్షలు విలువైన ఐఫోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్‌టాప్ చోరీకి గురైంది. తన పనిమనిషి సుభాషే ఈ దొంగతనం చేశాడని పార్వతి ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సుభాష్‌ను అరెస్ట్ చేశారు. తర్వాత కొద్దిరోజులకు అతడిని విడుదల చేశారు.స్టూడియోలో రభసతర్వాత సుభాష్.. తిరిగి కేజేఆర్ స్టూడియోలో పనిలో చేరాడు. అయితే స్టూడియోలోనే ఉన్న పార్వతి తనను కొట్టిందని ఆరోపించాడు. ఆమెతోపాటు ఉన్న మరో నలుగురు వ్యక్తులు తనను తీవ్రంగా దుర్భాషలాడారని చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సైదాపేట్ 19 ఎమ్ఎమ్ కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు పార్వతితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.సినిమా..కాగా మలయాళ కుటుంబానికి చెందిన పార్వతి సొంతభాషలోనే కాకుండా కన్నడ, తమిళ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. పాప్పిన్స్, స్టోరీ కాతే, డి కంపెనీ, యాంగ్రీ బేబీస్ ఇన్ లవ్, ఉత్తమ విలన్, వాస్కోడిగామ, కొడిత్త ఇదంగళై నిరప్పుగ, 83, ధూమం, గోట్.. తదితర చిత్రాల్లో నటించింది.చదవండి: 'దేవర'ఈవెంట్ రద్దుకు కారణం ఇదే.. ఆర్గనైజర్ల వివరణ -
సీనియర్ నటి కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం
మలయాళ ప్రముఖ నటి కవియూర్ పొన్నమ్మ (79) తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఈమె.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. దాదాపు ఆరు దశాబ్దాల నుంచి మలయాళ చిత్రాల్లో ఈమె పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇలా ఈమె మృతి చెందడంపై స్టార్ హీరోహీరోయిన్లతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా)'తల్లి పాత్రలతో మలయాళ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న కవియూర్ పొన్నమ్మ మృతి పట్ల ప్రగాఢ సంతాపం. ఆమె జీవితం సినిమాకే పరిమితం కాదు. థియేటర్, టెలివిజన్ రంగాలకు కూడా విస్తరించింది' అని ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.ఇకపోతే పొన్నమ్మ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. కలమస్సేరి మున్సిపల్ టౌన్ హాల్లో ప్రజల సందర్శనార్ధం ఆమె పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. గాయనిగా పొన్నమ్మ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత నాటకరంగంలోకి ప్రవేశించి, అనంతరం నటిగా మారారు. అలా దాదాపు 1000 సినిమాల్లో నటించారు. ఈమె చేసిన తల్లి పాత్రలతో అందరికీ దగ్గరైపోయారు. అలానే విలన్ తరహా పాత్రల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.ప్రతికూల పాత్రలతో సహా విభిన్న పాత్రలను పోషించింది. మేఘతీర్థం చిత్రాన్ని కూడా నిర్మించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) -
కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్
తెలుగులో అప్పట్లో అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లో అమలాపాల్ హీరోయిన్గా చేసింది. కానీ ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైపోయింది. మధ్యలో రెండో పెళ్లి చేసుకుంది. 2023లో పెళ్లి జరగ్గా.. ఈ జూన్‌లో కొడుకు పుట్టాడు. తాజాగా ఓనం పండగ సందర్భంగా కొడుకు ముఖాన్ని రివీల్ చేసింది. అలానే క్యూట్ ఫొటోలకు పోజులిచ్చింది.(ఇదీ చదవండి: ఏడు నెలల క్రితం నాకు బ్రేకప్: మృణాల్ ఠాకుర్)తమిళ సినిమాలతో హీరోయిన్గా పరిచయమైన అమలాపాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల బంధం నిలబడలేదు. మూడేళ్లకే విడిపోయారు. అలా 2017 నుంచి ఒంటరిగానే ఉంది. గతేడాది మాత్రం జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జూన్‌లో కొడుకు పుట్టాడు. అతడికి ఇళయ్ అని పేరు పెట్టింది.ఓనం సందర్భంగా కొడుకు ఫేస్ రివీల్ చేసింది అమలాపాల్. నదిలో పడవలో కొడుకు-భర్తతో కలిసి క్యూట్ పోజులిచ్చింది. అలానే భర్తని ముద్దాడింది. ఈ ఫొటోలన్నింటినీ ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫ్యామిలీని చూస్తుంటేనే చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
త్రిష బాటలో మరో హీరోయిన్ రీఎంట్రీతో దుమ్మురేపుతున్న బ్యూటీ
-
మాలీవుడ్ సినీ చరిత్ర: దళిత నటి ఇంటినే తగులబెట్టేశారు!
మలయాళంలో హేమ కమిటి రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కొన్ని రోజులుగా కేరళ సినిమా రంగంలో మహిళలపై దురాగతాలు బయటికి వస్తుండటంతో మాలీవుడ్ వణుకుతోంది. అయితే మహిళలపై దురాగతాలు, వేధింపులు ఇప్పుడే కాదు.. మాలీవుడ్ పరిశ్రమ ఏర్పడినప్పటి నుంచే ఉన్నాయి. అప్పట్లోనే స్త్రీలపై దాడులు జరిగాయి. చాలా మంది కుల వివక్షకు గురయ్యారు. మలయాళ తొలి హీరోయిన్‌కి అయితే కేరళను వదిలి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలేంటో చూద్దాం. మలయాళ ఇండస్ట్రీ 1920లో ఏర్పడింది. తొలి సినిమా విగతకుమారన్. ఈ చిత్రంలో పికె రోసీ హీరోయిన్గా నటించింది. మలయాళ తొలి హీరోయిన్, భారతీయ సినిమాల్లోనే మొదటి దళిత నటి రోసీ.ఓ దళిత కుటుంబంలో పుట్టడమే రోసీకి శాపంగా మారింది. ఆమె విగతకుమారన్ చిత్రంలో నాయర్(పెద్ద కులం) మహిళగా నటించడాన్ని ఓ వర్గం ప్రజలు సహించలేకపోయారు. సినిమా విడుదలను అడ్డుకున్నారు. థియేటర్‌పై రాళ్ల దాడి చేశారు. అంతేకాదు ఆమె ఇంటిని కూడా తగులబెట్టేశారు. అగ్ర వర్ణాలా వేధింపులు తట్టుకోలేక..ప్రాణ భయంలో రోసీ మలయాళ ఇండస్ట్రీని వదిలి వెళ్లింది.సమాజంలోని అనేక వర్గాలలో, ముఖ్యంగా మహిళలకు సాంస్కృతిక కళలలో పెద్దగా ప్రవేశంలేని రోజుల్లోనే రోజీ సినిమాల్లోకి వచ్చి పెద్ద సాహసమే చేసింది. అంతేకాదు తొలి సినిమాలోనే అగ్రవర్ణ మహిళగా నటించి కుల వివక్షకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. రోసీ చేసిన ప్రయత్నం చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది. అయితే ఆ సినిమాలో నటించిన కారణంగా రోజీ జీవితాంతం అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది.మలయాళంలో ఇప్పటికీ కుల వివక్ష ఉందని చాలా మంది నటీనటులు చెబుతున్న మాట. కులం చూసి అవకాశం ఇచ్చే దర్శక నిర్మాతలు ఉన్నారట. తమ కులం వాడు అయితే ఒక పాత్ర.. తక్కువ కులం వాడు అయితే మరో పాత్రలు ఇస్తూ వివక్ష చూపించడం ఇంకా కొనసాగుతుంది.ఇక మహిళలపై జరుగుతున్న దురాగతాలు అంతా ఇంతా కాదు. అయితే నటీమణులెవరు తమకు వస్తున్న వేధింపులపై అంత త్వరగా స్పందించరు. ‘మీటూ’లో భాగంగా ఆ మధ్య కొందరు తమకు వచ్చిన లైంగిక వేధింపులపై పెదవి విప్పారు. ఇప్పుడు ‘హేమా కమిటీ’ వల్ల చాలా మంది తారలు ధైర్యంగా తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు.2017లో మలయాళ నటి భావనా మీనన్‌పై లైంగిక దాడి జరిగింది. ఆ దాడి వెనుక సూత్రధారి మలయాళ హీరో దిలీప్ అని ప్రచారం జరిగింది. దీంతో అప్పటి ప్రభుత్వం జడ్జి హేమ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయించింది. ఆ కమిటీ రిపోర్ట్ ఆలస్యంగా 2024 ఆగస్టులో బయటకు వచ్చింది. అయితే అప్పట్లో మహిళలు కుల వివక్షకు గురైతే..ఇప్పుడు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. సినిమా చాన్స్‌లు రావాలంటే కాంప్రమైజ్, అడ్జస్ట్ కావాల్సిందే. హేమ కమిటీ రిపోర్ట్‌తోనైనా మాలీవుడ్ మారిపోయి మంచి పరిశ్రమగా ఎదగాలని కోరుకుందాం. -
జైలర్ నటుడు అరెస్ట్.. కానిస్టేబుల్‌ను కొట్టడం వల్లే!
సాక్షి, హైదరాబాద్: జైలర్ నటుడు వినాయకన్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామికా భద్రత దళం) కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్.. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనపై స్పందించిన వినాయకన్ తానే తప్పూ చేయలేదంటున్నాడు. ఎయిర్‌పోర్టు అధికారులే తనను గదిలోకి తీసుకెళ్లి వేధించారంటున్నాడు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చెక్ చేసుకోమని చెప్తున్నాడు. అసలు తనను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని మీడియాతో వాపోయాడు. కాగా మలయాళ నటుడు వినాయకన్.. రజనీకాంత్ జైలర్ సినిమాలో వర్మ పాత్రతో మరింత పాపులర్ అయ్యాడు. గతేడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తన వల్ల జైలుపాలయ్యాడు.