
కన్నడ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కాంతార. రిషబ్ హీరోగా, దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా 2022లో రికార్డులు సృష్టించింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాదు, ఉత్తమ నటుడు, ఉత్త పాపులర్ ఫిలిం విభాగంలో రెండు జాతీయ అవార్డులు అందుకుంది.
కాంతార ప్రీక్వెల్‌లో మోహన్‌లాల్?
ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1 తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల కానుంది. అయితే ఈ ప్రీక్వెల్‌లో మలయాళ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) కీలక పాత్రలో నటించనున్నట్లు ఆ మధ్య ఓ రూమర్ తెగ వైరల్ అయింది. తాజాగా ఈ రూమర్‌పై మోహన్‌లాల్ స్పందించాడు. దయచేసి నన్ను కాంతార సినిమాలో భాగం చేయమని మీరే అడగండి. నాకు ఒక పాత్ర ఇవ్వండి. నాకు తెలిసి నేనేమీ చెడ్డ నటుడిని కాదు అని సరదాగా వ్యాఖ్యానించాడు.
ఎంపురాన్ సినిమాతో మరో హిట్
ఇకపోతే మోహన్‌లాల్ హీరోగా నటించిన ఎల్2: ఎంపురాన్ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ మూవీ లూసిఫర్ చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టింది.