Mohanlal
-
గతం నిశ్శబ్దంగా ఉండదు!
మలయాళంలో హీరో మోహన్‌లాల్(Mohanlal), దర్శకుడు జీతూ జోసెఫ్‌ల కాంబినేషన్లోని ‘దృశ్యం’ ఫ్రాంచైజీ బ్లాక్‌బస్టర్. ఈ మలయాళ ‘దృశ్యం’ ఫ్రాంచైజీలోని సినిమాలు భారతదేశ ఇతర భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ భాషల్లో కూడా రీమేక్ అయ్యాయి. రీమేక్ అయిన ప్రతి భాషలోనూ ఈ చిత్రం హిట్ కావడం విశేషం. ‘దృశ్యం’ సినిమాకు ఇంతటి క్రేజ్ ఉంది. కాగా కొన్ని రోజులుగా ‘దృశ్యం 3’ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందనే టాక్ మాలీవుడ్‌లో వినిపిస్తూనే ఉంది.ఫైనల్‌గా గురువారం ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేశారు మోహన్‌లాల్. ‘దృశ్యం 3’(Drishyam 3)సినిమా కన్ఫార్మ్ అని, ‘ఎక్స్’లో ఓ ఫొటోను షేర్ చేశారు. ‘ఎక్స్’లో మోహన్‌లాల్ పేర్కొన్న పోస్ట్‌లో ‘ది పాస్ట్ నెవర్ స్టేస్ సైలెంట్’ (గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు) అనే క్యాప్షన్ కూడా ఉంది. ‘దృశ్యం, దృశ్యం 2’ సినిమాలను నిర్మించిన ఆంటోనీ పెరుంబవూర్ ‘దృశ్యం 3’ సినిమానూ నిర్మించనున్నారు.త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుంది. మరోవైపు అనూప్ మీనన్‌తో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని ఇటీవల ప్రకటించారు మోహన్‌లాల్. ఆయన సోలో హీరోగా అనూప్ మీనన్ మూవీని పూర్తి చేసిన తర్వాత ‘దృశ్యం 3’ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక మమ్ముట్టీ, మోహన్‌లాల్‌ల కాంబినేషన్లో ఓ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే మోహన్‌లాల్ సోలో హీరోగా నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ చిత్రం మార్చి 28న రిలీజ్ కానుంది. -
‘కన్నప్ప’కోసం ప్రభాస్, మోహన్‌లాల్ ఎంత తీసుకున్నారంటే..
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’(Kannappa). అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించిన ఈమూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ని ముమ్మరం చేశారు మేకర్స్. ప్రతి సోమవారం ఈ చిత్రం నుంచి ఒక అప్డేట్ ఇస్తున్నారు. దీంతో పాటు మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నప్ప సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా కోసం ఏడేళ్లుగా పని చేస్తున్నామని, దాదాపు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించామని చెప్పాడు. ఇందులో నటీనటులు పారితోషికాలతో కలిపి చూస్తే.. ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరగాల్సింది. కానీ చాలా మంది నటీనటులు డబ్బులు తీసుకోకుండానే నటించారట. మోహన్ లాల్, ప్రభాస్ అయితే ఒక్క రూపాయి తీసుకోకుండానే నటించారట. ఈ విషయాన్ని మంచు విష్ణునే చెప్పారు.‘ఈ చిత్రంలో ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Mohanlal) పోషించిన పాత్రలు చాలా కీలకం. వాళ్లను కథ చెప్పగానే ఒప్పుకున్నారు.ఈ సినిమా కోసం వాళ్లిద్దరూ ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోలేదు. నాన్నగారిపై(మోహన్ బాబు)పై ఉన్న అభిమానంతో వారిద్దరు నటించారు. మోహన్‌లాల్ దగ్గరకు వెళ్లి కథ చెప్పిన తర్వాత పారితోషికం గురించి మీ మేనేజర్‌తో మాట్లాడమంటారా అని అడిగితే..‘అప్పుడే అంత పెద్ద వాడివయ్యావా?’ అన్నాడు. ఇక ప్రభాస్ నాకు మంచి స్నేహితుడు. అతని వల్ల నాకు స్నేహంపై నమ్మకం పెరిగింది. నా కోసం ప్రభాస్ ఇందులో నటించాడు. అలాగే అక్షయ్ కుమార్ పోషించిన పాత్ర కూడా కీలకమే. శివుని పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తే.. రెండు సార్లు సున్నితంగా తిరస్కరించాడు. తర్వాత వేరే దర్శకుడితో చెప్పించి ఆయనను ఒప్పించాం. చాలా అద్భుతంగా నటించాడు’ అని విష్ణు చెప్పుకొచ్చాడు.అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుద్రగా ప్రభాస్, పార్వతీదేవిగా కాజల్ నటిస్తున్నారు. శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
కొచ్చి టు ఢిల్లీ
మోహన్‌లాల్(Mohanlal), మమ్ముట్టి(Mammootty) హీరోలుగా మలయాళంలో ఓ భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్, కుంచకో బోబన్, ఆసిఫ్ అలీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. కాగా ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో హీరోయిన్ నయనతార(Nayanthara) నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కొచ్చిలో జరుగు తోంది.ఈ మూవీ షూటింగ్లో నయనతార జాయిన్ అయ్యారని మేకర్స్ ఆదివారం ప్రకటించారు. అలాగే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఢిల్లీలో జరుగనుందని, ఈ షెడ్యూల్‌తో మేజర్ షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. మరోవైపు గతంలో ‘తస్కరవీరన్ (2005), రప్పకల్ (2005), భాస్కర్ ది రాస్కెల్ (2015), పుతియ నియమం (2016)’ వంటి చిత్రాల్లో మమ్ముట్టి–నయనతార స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
మోహన్‌లాల్ మూవీలో..?
మోహన్‌లాల్ హీరోగా సత్యన్ అంతికాడ్ దర్శకత్వంలో ‘హృదయపూర్వం’(Hridayapoorvam) అనే మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆంటోనీ పెరుంబవుర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా మాళవికా మోహనన్(Malavika Mohanan)కు అవకాశం లభించిందని మాలీవుడ్ సమాచారం.కథ నచ్చడం, పైగా మోహన్‌లాల్(Mohanlal) మూవీ కూడా కావడంతో ఈ సినిమాకు మాళవికా మోహనన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానుందని, నాలుగు రోజుల తర్వాత ఈ మూవీ షెడ్యూల్లో మోహన్‌లాల్ జాయిన్ అవుతారని తెలిసింది. -
మోహన్‌లాల్ 'లూసిఫర్2' మూవీ టీజర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
నిన్ను ఆదుకునేది ఒకే ఒక్కడు.. మోహన్‌లాల్ 'లూసిఫర్2' టీజర్
మలయాళ టాప్ హీరో మోహన్‌లాల్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ 'లూసిఫర్' (2019). ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఓ చిన్న రోల్లో నటించారు పృథ్వీరాజ్ సుకుమారన్. కాగా 'లూసిఫర్' సినిమాకు సీక్వెల్‌గా 'ఎల్2: ఎంపురాన్'ను( L2E Empuraan) తెరకెక్కించారు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. తెలుగు వర్షన్లో మీరు చూడాలంటే.. వీడియో దిగువన రైట్‌సైడ్ ఉండే సెట్టింగ్స్ వద్ద క్లిక్ చేసి ఆడియో ఆప్షన్లో తెలుగు భాషను ఎంచుకోవచ్చు.లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో 'ఎల్2: ఎంపురాన్' (రాజు కన్నా గొప్పవాడు) చిత్రాన్ని సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. ఇందులో టొవినో థామస్, మంజు వారియర్, నందు కీలక పాత్రలు చేస్తున్నారు. సినిమా 2025 మార్చి 27న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్(Mohanlal), ఆయనకు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కనిపించనున్నారు. -
పడుచు హీరోయిన్లతో సీనియర్ హీరోల రొమాన్స్.. 'తప్పేముంది?'
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు కానీ హీరోలు మాత్రం అలాగే ఉంటారు. ఒక్కసారి స్టార్ ఇమేజ్ వచ్చిందంటే వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తారు. ఈ క్రమంలో వారి వయసుకు తగ్గ కథానాయికలతో కాకుండా కుర్ర హీరోయిన్లతోనూ స్టెప్పులేస్తున్నారు. అయితే ఇందులో తప్పే లేదంటున్నాడు మలయాళ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal).అందులో తప్పేం లేదుతాజాగా ఓ ఇంటర్వ్యూలో మోహన్‌లాల్ మాట్లాడుతూ.. ఈ పద్ధతి ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. ఎప్పటినుంచో మన ఇండస్ట్రీ ఇలాగే ఉంది. తెలుగు (Tollywood), తమిళంలోనూ ఇదే కొనసాగుతోంది. నువ్వు ఆరోగ్యంగా ఉంటే వంద ఏళ్లు వచ్చినా సరే యాక్ట్ చేయొచ్చు. ఎలాంటి పాత్రల్ని ఎంచుకుంటున్నావనేది నీ చేతిలో ఉంటుంది. నీకు అసౌకర్యంగా అనిపిస్తుందంటే అలాంటి అవకాశాలను వదిలేసుకోవడమే మంచిది. కానీ జనాలు మిమ్మల్ని ఆయా పాత్రల్లో ఇష్టపడుతుంటే వాటిని అంగీకరించడంలో తప్పేం లేదు. యాక్టింగ్ అనేది ఒక పర్ఫామెన్స్ అంతే! దానికి వయసుతో సంబంధం లేదు. కేవలం అక్కడ ఎటువంటి పాత్ర చేస్తున్నావన్నది నీపై ఆధారపడి ఉంటుంది అన్నాడు.చదవండి: 2025 ప్రారంభంలో ఓటీటీలో రిలీజయ్యే కొత్త సినిమాలు, సిరీస్‌లు ఇవే!ఏదీ ఆలోచించలేదుభవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు.. ఏదీ చేయాలనుకోవడం లేదు. నా జీవితంలో అన్నీ వాటికవే జరిగిపోతున్నాయి. ఇప్పుడు సినిమాలు (Movies) చేస్తున్నాను. కాబట్టి ఇంకా దేని గురించీ ఆలోచించట్లేదు. ఒకవేళ ఏదైనా జరగాల్సి ఉంటే అదే జరుగుతుంది. జీవితం అనేది ఒక ప్రవాహం.. అది ఎటు తీసుకెళ్తే అటు సాగిపోతూ ఉండాలి అని చెప్పుకొచ్చాడు.అదే పెద్ద మార్పుసినిమా ఇండస్ట్రీలో వచ్చిన మార్పులపై స్పందిస్తూ.. కాలం వేగంగా గడుస్తోంది. అన్నీ మారిపోతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ.. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ఏఐ, వీఎఫ్ఎక్స్ వల్ల సినిమాల్లో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇదే అన్నింటికంటే పెద్ద మార్పు. కానీ ఏ గ్యాడ్జెట్ కూడా ఎమోషన్స్‌ను మార్చలేవు. మన ఎమోషన్స్ మన చేతిలోనే ఉన్నాయి అని మోహన్‌లాల్ చెప్పుకొచ్చాడు.చదవండి: టాలీవుడ్ ప్రముఖ హీరో కుమారుడు.. సినిమా ఎంట్రీకి రెడీ -
మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ
స్వతహాగా మలయాళీ హీరో అయిన్ మోహన్ లాల్ (Mohanlal).. 'దృశ్యం' సినిమాలతో మంచి పాపులరిటీ సొంతం చేసుకున్నారు. తెలుగులో 'జనతా గ్యారేజ్' మూవీలోనూ చేశారు. అలా తెలుగు ప్రేక్షకులకు ఈయన సుపరిచితుడే. 400కి సినిమాల్లో నటించిన ఈయన తొలిసారి 'బరోజ్' (Barroz Movie) అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఇందులో ఈయనే హీరోగానూ నటించారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? మోహన్ లాల్ డైరెక్టర్‌గా హిట్ కొట్టారా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. ఆయన నిధిని అంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు. భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా కాపాలా కాస్తూనే ఉంటాడు. అలా డి గామా వంశంలోని 13వ జనరేషన్‌కి చెందిన ఇసబెల్లా (మాయా రావ్) గోవా వస్తుంది. ఆమె బరోజ్‌ని శాపవిముక్తుడిని చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధి అప్పగించాడా లేదా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ఇసబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?మనలో చాలామంది చిన్నప్పుడు చందమామ కథలు చదివే ఉంటారు. హాలీవుడ్ కార్టూన్ డబ్బింగ్ మూవీస్ కూడా చూసే ఉంటారు. అయితే అవి డబ్బింగ్ మూవీస్ కాబట్టి ఆ మైండ్ సెట్‌తోనే చూస్తాం. అర్థం కాకపోయినా సరే ఎంజాయ్ చేస్తాం. ఇలాంటి సినిమానే మన దగ్గర తీస్తే.. మనకు రిలేట్ అవుతుందా లేదా అనేది మాత్రం అబ్జర్వ్ చేస్తాం. కానీ 'బరోజ్' మాత్రం పేరుకే మలయాళ మూవీ కానీ.. ఏదో ఇంగ్లీష్ మూవీ చూస్తున్నామా అనిపిస్తుంది. రెండున్నర గంటల నిడివి అయినప్పటికీ నాలుగు గంటల మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది.మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో 'బరోజ్' మొదలవుతుంది. ఫాదో గీతంతో ఈ మూవీని ప్రారంభిద్దామని అంటారు. అసలు ఫాదో గీతం అంటే ఏంటి అనుకునేలోపు.. సడన్‌గా పోర్చుగీస్ పాట ప్లే అవుతుంది. దీని మీనింగ్ ఏంటో అర్థం కాదు. ఇదొక్కటే కాదు మూవీ అంతా దాదాపు ఇదే కన్ఫ్యూజన్. నిధిని కాపాడే భూతంగా బరోజ్ ఎంట్రీ.. అసలు ఈ నిధి సంగతేంటి? దెయ్యంగా ఎందుకు మారాడు? ఈ నిధిని ఎవరికి అప్పగించాలి అనే అంశాలే సినిమా కథ.నిధికి కాపలాగా భూతం ఉండటం.. 400 ఏళ్లుగా ఒకే గదిలో ఈ భూతం ఉండిపోవడం.. లైన్ చూస్తుంటే మంచి హాస్యం పుట్టించొచ్చు. నిధిని ఎవరైనా కొట్టేయడానికి వస్తే ఆ సీన్లని అడ్వెంరెస్గా తీయొచ్చు. కానీ 'బరోజ్'లో అలాంటి సన్నివేశాలే ఉండవు. హీరోగా నటించి దర్శకత్వం వహించింది మోహన్ లాల్ కదా. అంతా ఆయన కనిపిస్తాడనుకుంటే.. అడపాదడపా కనిపిస్తాడు. ఈయన పాత్ర భూతం కదా. జీనీలా అద్భుతాలు చేయొచ్చు. తర్వాత ఏం జరుగుతుందో అనే ఆత్రుతని కలిగించొచ్చు. కానీ మోహన్ లాల్ అలా చేయలేకపోయారు. సినిమా ప్రారంభం నుంచి ఈయన మార్క్ చూపించే, అరె భలే ఉందే అనిపించే సీన్ ఒక్కటీ ఉండదు. మోహన్ లాల్ కాకుండా మిగిలిన సీన్లలో మనకు ఏ మాత్రం పరిచయం లేని విదేశీ నటులు వచ్చిపోతుంటారు. ఒకరు తెలుగులో మాట్లాడితే మరొకరు పోర్చుగీస్‌లో మాట్లాడుతుంటారు. ఇది ఇబ్బందిగా అనిపించింది.హాలీవుడ్ సినిమాలని చూసిన మోహన్ లాల్.. వాటి స్ఫూర్తితో సినిమా చేద్దామని ఫిక్సయ్యారు. కానీ ప్రాంతీయ ప్రేక్షకులని ఆకట్టుకునేలా తీయలేకపోయారు. నేటివిటీ లేక ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయ్యారు. ఇలాంటి పాయింట్ కోసం పోర్చుగీస్ కథల వరకే వెళ్లాల్సిన అవసరం లేదు. మన జానపదాలు వెతికితే ఎన్నో అద్భుతమైన కథలు కనిపిస్తాయి. ఆ దిశగా మోహన్ లాల్ ఆలోచించి ఉంటే లోకల్ ఆడియెన్స్‌కి సినిమా ఇంకా నచ్చి ఉండేది. దర్శకుడిగా త్రీడీ మూవీ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని తపించిన మోహన్ లాల్.. కంటెంట్‌పై సరిగా దృష్టి పెట్టలేదు. దీంతో మూవీ అటోఇటో అన్నట్లు సాగుతూ వెళ్తుంది.ఎవరెలా చేశారు?బరోజ్గా టైటిల్ రోల్ చేసిన మోహన్ లాల్.. పాత్రలో సరిగ్గా సరిపోయారు. హీరో కమ్ డైరెక్టర్ నేనే కదా అని అనవసర ఎలివేషన్ల జోలికి పోలేదు. పాత్రకు ఎంత కావాలో అంత ఇచ్చారు. కానీ ఇంకాస్త థ్రిల్లింగ్, ఎంటర్టైనింగ్గా బరోజ్ పాత్రని రాసుకుని ఉంటే బాగుండేది. ఇషా పాత్ర చేసిన మాయారావు చూడటానికి బాగుంది. యాక్టింగ్ ఓకే ఓకే. మిగిలిన విదేశీ నటీనటులు బాగానే చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫీ బాగుంది. అండర్ వాటర్ త్రీడీ విజువల్స్ ఔట్పుట్ మాత్రం అనుకున్నంతగా రాలేదు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలే గుర్తొస్తాయి. నిర్మాణ విలువల మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. ఖర్చు విషయంలో అసలు వెనుకాడలేదు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ బాగుంది.ఓవరాల్‌గా చెప్పుకొంటే మోహన్ లాల్ 'బరోజ్'తో కష్టపడ్డారు గానీ కంటెంట్ పరంగా తడబడ్డారు. దీంతో సగటు ప్రేక్షకుడు.. ఇది మా కోసం తీశారా? పోర్చుగీసు వాళ్ల కోసం తీశారా అని సందేహపడటం గ్యారంటీ.-చందు డొంకాన -
మోహన్ లాల్ 'బరోజ్' మూవీ ప్రెస్‌మీట్ (ఫోటోలు)
-
బంగారాన్ని కాపాడే భూతం 'బరోజ్'.. తెలుగు ట్రైలర్
మోహన్‌లాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బరోజ్’. ఫ్యాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 25న పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ విడుదల కానుంది.బరోజ్ కథ నచ్చడంతో తొలిసారిగా మోహన్‌లాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర కూడా చాలా ఆసక్తిగా ఉంది. వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్ లాల్ నటిస్తున్నాడు. వాస్కోడిగామాకి చెందిన అపార సంపద (బంగారం,వజ్రాలు) బరోజ్ అనే ఒక భూతం 400 ఏళ్ళగా కాపాడుతూ వస్తుంది. ఆయనకు సంబంధించిన నిజమైన వారసులకు ఆ సంపదని అప్పగించాలని ఆ భూతం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌తో సినిమా ఉండనుంది.తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'బరోజ్' చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయన నిర్మించారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న తెలుగు,హిందీ,తమిల్,కన్నడ,మలయాళంలో బరోజ్ సినిమా విడుదల కానుంది. -
కన్నప్పలో 'కిరాట'గా మలయాళ స్టార్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని కిరాట పాత్రలో మోహన్‌లాల్ నటిస్తున్నారని వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘కన్నప్ప’ సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు మోహన్‌బాబు. -
పదహారేళ్ల తర్వాత...
మోహన్‌లాల్, మమ్ముట్టి కాంబినేషన్లో దాదాపు యాభైకి పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే 2008లో రిలీజైన ‘ట్వంటీ 20’ చిత్రం తర్వాత మోహన్‌లాల్, మమ్ముట్టి కలిసి ఓ పుల్ లెంగ్త్ సినిమా చేయలేదు. పదహారేళ్ల తర్వాత మోహన్‌లాల్, మమ్ముట్టి ఓ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో ‘మాలిక్, టేకాఫ్, సీ యూ సూన్’ వంటి సినిమాలతో దర్శకుడిగా పేరు సంపాదించుకున్న మహేశ్ నారాయణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్ ఓ కీలకపాత్రలో నటిస్తుండగా, మరో కీలకపాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ శ్రీలంకలో మొదలైంది. మమ్ముట్టి, మోహన్‌లాల్, కుంచాకోల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... మమ్ముట్టి హీరోగా నటించిన ‘కాదల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ (2013) చిత్రంలో మోహన్‌లాల్ నటించారు. కానీ ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ది అతిథిపాత్ర. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న తాజా ఫుల్ లెంగ్త్ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. -
మోహన్ లాల్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'బరోజ్' ట్రైలర్ విడుదల
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్' చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. ఇందులో ఆయనే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు కూడా.. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.మైథలాజికల్ థ్రిల్లర్‌గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ ఇందులో కనిపించనున్నాడు. అయితే, ఆ సందను ఆయన ఎందుకు రక్షిస్తున్నాడు. చివరగా దానిని ఎవరికి అందించాలని ఆయన ప్రయత్నం చేస్తాడనేది ఈ చిత్ర కథ అని తెలుస్తోంది. ఎక్కువ వీఎఫ్ఎక్స్తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబరు 25న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం,హిందీలో ఈ మూవీ రిలీజ్ కానుంది. వాస్తవంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 3న విడుదల చేయాలని ఇది వరకే ప్రకటించారు. కానీ, నిర్మాణంతర పనులు పెండింగ్ ఉండటం వల్ల విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. -
కూలీ పనికి వెళ్తున్న స్టార్ హీరో తనయుడు!
మలయాళంలో ఆయనో ఓ పెద్ద స్టార్ హీరో. మాలీవుడ్‌లో రికార్డులు సృష్టించాలన్నా.. ఉన్న రికార్డులను బద్దలు కొట్టాలన్నా ఆయన తర్వాతే అందరు. వందల సినిమాలు తీసి వేల కోట్ల ఆస్తిని కూడా కూడబెట్టాడు. కొడుకుని హీరోగా ఇండస్ట్రీగా పరిచయం చేసి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందించాడు. కట్ చేస్తే..ఆ వారసుడు ఇప్పుడు కూలీగా మారాడు. తండ్రి సంపాదించిన వేల కోట్ల ఆస్తిని వదిలేసి.. గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ తనయుడి పేరే ప్రణవ్ మోహన్ లాన్. తండ్రి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. మోహన్ లాల్ కొడుకు కూలీ పని చేయడం ఏంటని షాకవుతున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.ఆల్ రౌండర్ ప్రణవ్మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్క్రీన్‌ప్లే రైటర్‌గా మారాడు. కొన్నాళ్లకు మళ్లీ హీరోగా వెండితెరపై మెరిశాడు. ఆయన తీసిన ‘హృదయం’ మూవీ అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన తర్వాత ఆయన నటించిన ‘వర్షంగళ్కు శేషం’ మూవీ కూడా ప్రణవ్‌కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. హీరో కంటే ముందు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు. ఇలా ఒకవైపు నటనతో పాటు మిగిలిన విభాలన్నింటిలోనూ ప్రణవ్ మంచి పట్టు సాధించి ‘ఆల్ రౌండర్’గా గుర్తింపు పొందాడు. ఇలా కెరీర్లో దూసుకెళ్తున్న ప్రణవ్..సడెన్‌గా గ్యాప్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైపోయాడు.స్పెయిన్‌లో కూలీగా..‘వర్షంగళకు శేషం’ తర్వాత ప్రణవ్ కాస్త గ్యాప్ తీసుకొని స్పెయిన్ వెళ్లాడు. స్టార్ హీరో కాబట్టి ఏ వివాహారానికో, ఎంజాయ్ చేయడానికి ప్రణవ్ విదేశాలకు వెళ్లలేదు. స్పెయిన్ వెళ్లి కూలీ పని చేస్తున్నాడు. అక్కడ ఓ ఫామ్ హౌస్‌లో ఉంటూ గొర్రెలు, గుర్రాల కాపరిగా చేరాడట. ఇందుకుగాను జీతం ఏమి లేదట. కేవలం భోజనం పెట్టి, షెల్టర్ ఇస్తారట.కష్టమైన పని చేయడం ఇష్టంప్రణవ్ కూలీ పనిచేయాల్సిన అవసరం లేదు. ఏ పని చేయకున్నా.. తండ్రి మోహన్ లాన్ సంపాదించిన ఆస్తితో జీవితాంతం కూర్చొని తినొచ్చు. అలా ఉండడం ఇష్టం లేకపోయినా.. తనలో మంచి టాలెంట్ ఉంది. హీరోగానూ రాణించాడు. ఆయన నటిస్తే చాలు కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. ఇలాంటి లగ్జరీ లైఫ్‌ని వదిలేసి.. కూలీ పని చేయాల్సిన అవసరం ఏంటి? అంటే.. ప్రణవ్‌కి అలాంటి పని చేయడం ఇష్టం అట. గొర్రెలు, గుర్రాలను చూసుకునే పనిని ఆస్వాదిస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రణవ్ తల్లి, మోహన్ లాల్ సతీమణి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ‘కష్టమైన పని చేయడం ప్రణవ్‌కి ఇష్టం. కానీ నాకు మాత్రం ప్రణవ్ హీరోగా మరిన్ని సినిమాలు చేయాలని ఉంది’ అని ప్రణవ్ తల్లి అన్నారు. రంగుల ప్రపంచం(చిత్ర పరిశ్రమ) నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇలా సాధారణ జీవితం గడపడడం నిజంగా గొప్ప విషయమే. View this post on Instagram A post shared by Pranav Mohanlal (@pranavmohanlal) -
తుదిదశలో ఎంపురాన్
మోహన్‌లాల్ హీరోగా నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘లూసిఫర్’ (2019). ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఓ చిన్న రోల్లో నటించారు పృథ్వీరాజ్ సుకుమారన్. కాగా ‘లూసిఫర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో కూడా మోహన్‌లాల్ హీరోగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మేజర్ పార్టు చిత్రీకరణ పూర్తయింది. తాజాగా ‘ఎల్ 2 :ఎంపురాన్’ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని, ఫైనల్ షెడ్యూల్ మొదలైందని పృథ్వీరాజ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ప్యాచ్ వర్క్స్‌తో సహా డిసెంబరులోపే మొత్తం చిత్రీకరణను పూర్తి చేయాలన్నది పృథ్వీరాజ్ టార్గెట్ అని మాలీవుడ్ సమాచారం. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ నిర్మిస్తున్న ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా 2025 మార్చి 25న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. -
బాలూగారిపాట మనసుని హత్తుకుంది: మోహన్‌లాల్
అక్షయ్, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘డియర్ కృష్ణ’. దినేష్ బాబు దర్శకత్వంలో పీఎన్ బలరామ్ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాలోని ‘చిరు్రపాయం చేసుకున్న దోషమేంటో దైవమా...’ అంటూ సాగేపాట లిరికల్ వీడియోను మోహన్‌లాల్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘లెజండరీ సింగర్ బాలూగారు (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం)పాడిన ఈపాట నా మనసును హత్తుకుంది.ఈపాటలాగే ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘హృదయాన్ని బరువెక్కించే ఓ వాస్తవ ఘటనతో ఈ సినిమాని రూపొందించాం’’ అని తెలిపారు పీఎన్ బలరామ్. ‘చిరు్రపాయం..’పాటకు గిరిపట్ల లిరిక్స్ అందించారు. ఈ సినిమాకు హరిప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. -
ఖురేషీకి రైట్ హ్యాండ్
మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ చిత్రం ‘లూసిఫర్’ (2019) బ్లాక్ బస్టర్ అయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎల్ 2 ఎంపురాన్’ మూవీ రూపొందుతోంది. ఇందులో మోహన్‌లాల్ హీరోగా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. టొవినో థామస్, మంజు వారియర్, నందు కీలక పాత్రలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే... బుధవారం (అక్టోబర్ 16) పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఎల్ 2 ఎంపురాన్’లో ఆయన పోషిస్తున్న జయేద్ మసూద్ పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘ఎల్ 2 ఎంపురాన్’లో ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్, ఆయనకు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. 2025లో మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
రిషబ్ శెట్టి తండ్రిగా మోహన్ లాల్.. కాంతారా 2 నుంచి లేటెస్ట్ అప్డేట్..
-
పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో...
మలయాళ సినీ పరిశ్రమలో దిగ్గజ హీరోలైన మమ్ముట్టి, మోహన్ లాల్ దశాబ్దం తర్వాత మళ్లీ కలిసి నటించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేయనున్నారు. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలో త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. మమ్ముట్టి కంపెనీ, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నాయి. 30 రోజుల పాటు శ్రీలంకలో ఈ చిత్రాన్ని షూట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.మూవీ స్టోరీలైన్‌కి తగ్గట్టు షూటింగ్ లొకేషన్ పర్మిషన్ కోసం నిర్మాతలు శ్రీలంక ప్రధానమంత్రితో కూడా చర్చలు జరిపినట్టు కేరళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువ శాతం షూటింగ్ శ్రీలంకలోనూ మిగతాది కేరళ, ఢిల్లీ, లండన్‌లోనూ జరిపేలా ప్లాన్ చేస్తున్నారు. మమ్ముట్టి, మోహల్ లాల్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నారు దర్శకుడు మహేశ్ నారాయణ్. 50 చిత్రాల్లో భిన్న పాత్రల్లో కలిసి నటించి, ప్రేక్షకులను మెప్పించిన మమ్ముట్టి, మోహన్‌లాల్ చివరిగా 2013లో ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ అనే చిత్రంలో సిల్వర్ స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు. -
మాలీవుడ్ ను నాశనం చేయకండి అంటున్న మోహన్ లాల్.. సమంత సెన్సేషనల్ స్టేట్ మెంట్..
-
మలయాళ ఇండస్ట్రీని నాశనం చేయకండి: మోహన్‌లాల్
మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడులకు సంబంధించి కేరళ ప్రభుత్వానికి హేమా కమిటీ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 17 మంది మలయాళ సినీ ప్రముఖులపై కేసులు నమోదైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అధ్యక్షుడు మోహన్‌లాల్, ‘అమ్మ’ కమిటీ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఈ వివాదంపై మోహన్‌లాల్ మాట్లాడలేదు. హేమా కమిటీ నివేదిక, ఇండస్ట్రీలో జరుగుతున్న తాజా పరిణామాల గురించి కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్‌లాల్ ఈ విధంగా మాట్లాడారు. ఏ పవర్ గ్రూప్‌లోనూ లేను: హేమా కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. నేను కూడా కమిటీ ముందు హాజరై, నాకు తెలిసిన అన్ని విషయాలను పంచుకున్నాను. వాటిని ఇక్కడ చర్చించలేను. అలాగే కమిటీ నివేదికలో పేర్కొన్న ఏ పవర్ గ్రూప్‌లోనూ నేను లేను. అయినా నివేదికలో చాలా అంశాలు ఉన్నాయి. అన్నింటికీ ‘అమ్మ’నే కారణం అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదు. మలయాళ పరిశ్రమ అంతా కలిసి స్పందించాల్సి ఉంది (ఇండస్ట్రీలో ఉండే పలు విభాగాల దర్శక–నిర్మాతలు, నటీనటులు వంటి సంఘాలు). నిజంగా తప్పులు చేసిన వారిని కోర్టు శిక్షిస్తుంది. ప్రభుత్వం, పోలీసులు నివేదిక అంశాల పైనే పని చేస్తున్నారు.అందుకే కేరళ నుంచి బయటకు వెళ్లాను: సమాజంలో సినిమా అన్నది ఓ భాగమే. హేమా కమిటీ నివేదిక ప్రస్తావనల పైనే దృష్టి సారిస్తూ మలయాళ పరిశ్రమను నాశనం చేయకండి. మద్రాసులో ఉండి నేను సినిమాలు చేసే సమయంలో సరైన సౌకర్యాలు కూడా లేవు. చిన్న పరిశ్రమగా మొదలైన మలయాళ ఇండస్ట్రీ ఎదుగుతోంది. ఇతర భాషల్లో మలయాళ చిత్ర పరిశ్రమ కళకు గుర్తింపు లభిస్తోంది. దక్షిణాది సినిమాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తోంది.ఇలాంటి తరుణంలో ఇండస్ట్రీ నాశనం కాకూడదు. చాలామంది ఉపాధి కోల్పోతారు. కొందరు ‘అమ్మ’ ఇలా చేయకూడదు.. అలా చేయకూడదు అంటున్నారు. ‘అమ్మ’ కోసం జరిగే ఎన్నికల్లో సభ్యులెవరైనా పోటీ చేయొచ్చు. ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేసిన తర్వాత మీడియాకు కావాలని దూరంగా ఉన్నానన్న వార్తలు అవాస్తవం. నా భార్య సర్జరీ, నేను హీరోగా చేసిన సినిమాకు చెందిన పనుల్లో బిజీగా ఉండి కేరళ నుంచి బయటకు వెళ్లాను. -
మాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని చోట్లా ఉంది: భానుప్రియ సిస్టర్
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదికపై టాలీవుడ్ నటి శాంతి ప్రియ స్పందించారు. ఇలాంటి వేధింపులు కేవలం మాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని చోట్లా జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునవరావృతం కాకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. మన భవిష్యత్ తరాలకు భరోసానిచ్చేలా చర్యలు ఉండాలని సూచించారు.అంతేకాకుండా మలయాళం మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం అధ్యక్ష పదవికి మోహన్‌లాల్ రాజీనామా చేయడం ఎంతవరకు సబబు అని శాంతి ప్రియ ప్రశ్నించారు.హేమ కమిటీ నివేదిక తర్వాత ఆరోపణలు వస్తున్న సమయంలో తప్పుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే బాధితులకు న్యాయం చేసేందుకు అండగా నిలబడాల్సిందని అన్నారు. బాధితులకు భరోసా కల్పించే బాధ్యత అమ్మ సభ్యులపై ఉందని ఆమె గుర్తు చేశారు. తనకెప్పుడు ఎదురవ్వలేదు..అయితే తనకు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురు కాలేదని.. తన అదృష్టమని శాంతి ప్రియ వెల్లడించారు. నేను భానుప్రియ సోదరురాలిని అయినందువల్లే ఎవరూ టచ్ చేయలేదని తెలిపింది. ఎందుకంటే ఇండస్ట్రీలో మా కుటుంబానికి ఉన్న గౌరవమేంటో అందరికీ తెలుసున్నారు. కాగా.. కాబోయే అల్లుడు తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శాంతి ప్రియ తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించింది. 1980-90ల్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. కాగా.. హేమ కమిటీ నివేదిక బయటకొచ్చాక మలయాళం మూవీ ఆర్టిస్ట్‌ల సంఘాన్ని రద్దు చేశారు. ఇందులో సభ్యులుగా ఉన్న 17 మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన దర్యాప్తు ప్రారంభించింది. -
మాలీవుడ్ సూపర్ ‘హీట్’.. ‘అమ్మ’ రాజీనామా!
కేరళ సినిమా రంగంలో భూకంపం పుట్టింది. నటీనటుల సంఘం ‘అమ్మ’ కార్యవర్గం పూర్తిగా రాజీనామా చేసింది. వీరిలో మోహన్‌లాల్ ఉన్నారు. గత కొన్ని రోజులుగా కేరళ సినిమా రంగంలో మహిళలపై దురాగతాలు బయటికి వస్తుండటంతో పరిశ్రమ వణుకుతోంది. కొందరు తమ పదవులకు రాజీనామాలు చేస్తుంటే మరికొందరు ముఖం చాటేస్తున్నారు. ఈ దావానలం బాలీవుడ్ వరకు పాకితే మరింత ప్రక్షాళనం జరగవచ్చు.మలయాళ సినీ పరిశ్రమలో గొలుసుకట్టు ఘటనలు జరుగుతున్నాయి. 2017లో మలయాళ నటి భావనా మీనన్‌పై లైంగిక దాడి జరగడం (కొచ్చి శివార్లలో కారులో కొందరు వ్యక్తులు చేశారని ఆరోపణ) వెనుక సూత్రధారి మలయాళ హీరో దిలీప్ అని రేగిన కార్చిచ్చు అక్కడి ప్రభుత్వం చేత జడ్జి హేమ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయించింది. అయితే ఆ కమిటీ రి΄ోర్టు ఆలస్యంగా 2024 ఆగస్టులోగాని బయటకు రాలేదు. అది వచ్చిన వెంటనే మలయాళ పరిశ్రమలో కొంతమంది మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పసాగారు. దాంతో మలయాళ పరిశ్రమ కుదుపులకు లోనవుతోంది.నటుడు సిద్దిఖీ పై ఆరోపణమలయాళంలో టాప్ కేరెక్టర్ ఆర్టిస్ట్, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు జనరల్ సెక్రటరీ అయిన సిద్దిఖీ పై రేవతి సంపత్ అనే జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచార ఆరోపణలు చేసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఆమె తన ఆరోపణలను మరోసారి మీడియా ముందుకు తెచ్చింది. ‘2016లో అతను కొచ్చిలోని ఒక హోటల్లో నా పై అత్యాచారం చేశాడు. అప్పుడు నాకు 21 ఏళ్లు ఉంటాయి. నాకు సినిమా రంగం ఆసక్తి ఉందని తెలిసి హోటల్‌కు పిలిపించి హఠాత్తుగా లైంగికదాడి చేశాడు’ అని ఆమె చెప్పింది. ఈ ఆరోపణలు ఆమె 2019లో చేసినా ఇప్పుడు మళ్లీ శక్తి పుంజుకుని సిద్దిఖీని విమర్శల వలయంలో నిలబెట్టాయి. దాంతో అతడు ‘అమ్మ’ పదవికి రాజీనామా చేశాడు. అయితే అతడు తాజాగా ఆ జూనియర్ ఆర్టిస్టు తనపై లేని΄ోని అభాండాలు వేస్తోందని కేరళ డి.జి.పికి ఫిర్యాదు చేశాడు.ఎం.ఎల్.ఏ పేరుమరోవైపు నటుడు ముకేష్ (ఇతను సి.పి.ఎం ఎం.ఎల్.ఏ) పై కూడా టెస్ జోసఫ్ అనే కాస్టింగ్ డైరెక్టర్ అమర్యాదకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. ‘అతను ఔట్‌డోర్‌లో తన రూమ్ పక్కన నా రూమ్ ఉండేలా కుట్ర చేశాడు. నా రూమ్ తలుపు పదే పదే కొట్టాడు’ అని ఆమె తెలియచేసింది. అయితే ముకేష్ ఇదంతా రాజకీయ కుట్ర అని అంటున్నాడు. ఈ దుమారం ఇలా ఉంటే ప్రభుత్వ చలచిత్ర అకాడెమీ ప్రస్తుత చైర్మన్, దర్శకుడు రంజిత్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంతో అతనూ రాజీనామా చేశాడు. దీంతో ప్రభుత్వం సినిమా పరిశ్రమలో వస్తున్న ఫిర్యాదులపై విచారణకు 4 మహిళా ముగ్గురు పురుష ఐపిఎస్‌లతో ‘సిట్’ ఏర్పాటు చేసింది. ఈ ‘సిట్’ తనకు తానుగా ఫిర్యాదులు నమోదు చేయదని, ఫిర్యాదులను పరిశీలిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో అంతా మసిపూసి మారేడుకాయ చేసే వ్యవహారంగా ఇది మిగలనుందని విమర్శలు వస్తున్నాయి.మేము న్యాయపోరాటాలు చేయలేంఫిర్యాదులు చేస్తున్న మహిళలు ‘మేము కేసులు పెట్టి కోర్టులు చుట్టు తిరగలేం’ అని చెప్పడం గమనార్హం. ‘మేం అంత పెద్దవారిని ఎదుర్కోలేం’ అని వారు అంటున్నారు. మలయాళ ఇండస్ట్రీలో ఉన్న 15 మంది శక్తిమంతులు పరిశ్రమలో ఎవరో పైకి రావాలో, ఎవరు వెనుక ఉండిపోవాలో నిర్ణయిస్తున్నారని హేమ కమిషన్ తెలియచేసింది. వీరు చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో మనలేని పరిస్థితి ఉందని కమిషన్ పేర్కొంది. ‘స్త్రీలను ఎందుకు ఇబ్బంది పెడతారు? అని ప్రశ్నించే పురుషులను కూడా బ్యాన్ చేస్తున్నారు’ అని తెలపడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ కందిరీగల తుట్టె ఏ మేరకు ఎవరిని కుట్టనుందో వేచి చూడాలి.కాంప్రమైజ్ – అడ్జస్ట్ఒక నటి సినిమా చేయడానికి అంగీకరించే ముందు మలయాళ పరిశ్రమలో వినిపించే రెండు పదాలు కాంప్రమైజ్, అడ్జస్ట్. వేషం తె ప్రొడక్షన్ మేనేజర్లు ‘రాజీ పడాలని’, ‘సర్దుకుపోవాలని’ కోరుతారు. ‘సరే’ అంటే వేషం. లేకుంటే లేదు. అంతటితో వదిలితే ఫరవాలేదు. కాని హేమా కమిషన్ ప్రకారం ఏ మహిళా ఆర్టిస్ట్ అయినా నో అంటే వెంటనే ఇండస్ట్రీ అంతటా వ్యాపిస్తుంది. ఆమెను ‘దారి’కి తెచ్చే పని ఇండస్ట్రీ అంతా తీసుకుంటుంది. ‘మా సారు (ఏ పెద్ద స్టారో దర్శకుడో ప్రొడ్యూసర్) అడిగితే కాదంటావా?’ అని ఎవరూ వేషం ఇవ్వరు. పస్తులతో మాడేలా చేస్తారు. అందుకే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ముందుకొచ్చి‘మహిళలు చేసే ఏ ఫిర్యాదునైనా సీరియస్‌గా తీసుకోవాలి’ అని బహిరంగంగా మాట్లాడాడుఫ్యాన్స్ ఆర్మీలైంగిక దుశ్చర్యలు ఎదుర్కొన్న మహిళలు బయటకు చెప్పేందుకు భయపడటానికి మరో కారణం ఈ పెద్ద నటులు ఫ్యాన్స్ ఆర్మీలను దాడికి పురిగొల్పుతుండటమే. ఏ హీరోను ఎవరేమన్నా వారి అభిమానులు సోషల్ మీడియాలో బూతులు జోడిస్తూ మీమ్స్ తయారు చేస్తుండటంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. కొన్నిసార్లు భౌతికంగా దాడి చేస్తారనే భయం కూడా సృష్టిస్తున్నారు. అందుకే హేమా కమిషన్ ఫ్యాన్స్‌ను కట్టడి చేయాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా సూచించింది.తలుపు విరిగేలా బాదుతారు‘ఔట్‌డోర్ షూటింగ్లో అర్ధరాత్రి తాగేసి వచ్చి తలుపు విరిగేలా బాదుతారు. అందుకే ఔట్‌డోర్‌లో కుటుంబ సభ్యులను తోడు తీసుకొని వెళ్లాల్సి వస్తోంది’ అని చాలామంది మహిళా ఆర్టిస్టులు హేమా కమిషన్‌కు చెప్పారు. వేషం ఇచ్చేటప్పుడే ‘అడిగితే అంగీకరించాలనే’ డిమాండ్ ప్రోడక్షన్ మేనేజర్ చల్లగా చెపాడని తెలియచేశారు.మోహన్‌లాల్ రాజీనామా30 ఏళ్ల చరిత్ర కలిగిన ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (అమ్మ) అధ్యక్ష పదవికి నటుడు మోహన్‌లాల్ రాజీనామా చేశారు. మలయాళ పరిశ్రమలో స్త్రీలపై సాగుతున్న లైంగిక దోపిడిని జస్టిస్ హేమా కమిషన్ బయట పెట్టాక వినవచ్చిన ఆరోపణల్లో ‘అమ్మ’ జనరల్ సెక్రటరీ సిద్దిఖీతో పాటు మరికొందరి పేర్లు ఉన్న దరిమిలా నైతిక బాధ్యత వహిస్తూ మొత్తం 17 మంది సభ్యులున్న కార్యవర్గం రాజీనామా చేసింది. హడావిడిగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ మీటింగ్‌లో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘మమ్మల్ని విమర్శకు, దిద్దుబాటుకు లోను చేసినందుకు కృతజ్ఞతలు’ అని రాజీనామా లేఖలో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ మోహన్‌లాల్, మమ్ముట్టి తదితర సూపర్స్టార్లు హేమా కమిషన్ గురించి ఏమీ మాట్లాడక΄ోవడాన్ని ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ (డబ్లు్యసిసి) తప్పుబట్టింది. మలయాళ రంగంలోని మహిళా నటీమణులు ‘అమ్మ’తో విభేదించి ఈ గ్రూపును నియమించుకున్నారు. హేమా కమిషన్ రిపోర్టును బయటపెట్టమని ΄ోరాడింది వీరే. ‘తంగలాన్’ నటి ΄ార్వతి తిరువోతు ఈ గ్రూప్‌లో చురుగ్గా పని చేస్తోంది. మెంబర్‌షిప్‌కు వెళ్లినా‘మూడు సినిమాల్లో నటిస్తే అమ్మలో మెంబర్షిప్ తీసుకోవచ్చు. దానికోసం నేను ఫోన్ చేస్తే ఆ పనులు చూసే సభ్యుడు తన ఫ్లాట్‌కు రమ్మన్నాడు. నేను ఫ్లాట్‌కు వెళ్లి ఫామ్ ఫిలప్ చేస్తుంటే వెనుక నుంచి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఔట్‌డోర్ షూటింగ్ లో ఒక నటుడు నా రూమ్‌కు వచ్చి తలుపు తీసిన వెంటనే మంచం మీదకు లాగే ప్రయత్నం చేశాడు. ఇంకో నటుడు రెస్ట్రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడూ వదల్లేదు. కావలించుకున్నాడు. ‘అడ్జస్ట్’ అవమని అందరూ చెప్పడమే. ఎంత అడ్జస్ట్ అవుదామని చూసినా ఇది భరించలేనంతగా ఉండటం వల్ల మలయాళ ఇండస్ట్రీ వదిలిపెట్టి చెన్నైకి మారి΄ోయాను’ అని నటి మీను మునీర్ ఫేస్బుక్లో రాసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఈమె ఈ వివరాలు తెలిపింది. – ఫ్యామిలీ డెస్క్ -
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ రాజీనామా
హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటులు, డైరెక్టర్స్‌పై పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో ఇండస్ట్రీ పెద్దలు చక్కదిద్దే పనిలో పడ్డారు. తాజాగా సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్పై (AMMA) మండిపడ్డారు. ఈ నివేదికపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్పై (AMMA) తీవ్రమైన విమర్శలు రావడంతో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మోహన్‌లాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. ఇప్పటికే ఈ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక విషయంలో సీఎం పినరయి విజయన్ పోలీసు అధికారులతో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నివేదికపై దర్యాప్తు చేయడానికి ఏడుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా.. ఇప్పటికే దర్శకుడు రంజిత్ చలనచిత్ర అకాడమీకి రాజీనామా చేయగా.. నటుడు సిద్ధిక్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ పదవి నుంచి నుంచి వైదొలిగారు. -
వయనాడ్‌లో పర్యటించిన మోహన్ లాల్
-
వయనాడ్ సహాయక చర్యల్లో మన్యం పులి.. రియల్ ‘హీరో’ అంటూ ప్రశంసలు (ఫొటోలు)
-
ఇండస్ట్రీ అంతా ఒక్క వెబ్ సిరీస్‌లో... ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో క్రేజీ అంటే క్రేజీ వెబ్ సిరీస్ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. ఇది ఎందుకు అంతలా స్పెషల్ అంటే.. ఏదైనా సినిమాలో గానీ సిరీస్‌లో మహా అయితే ఒకరిద్దరు స్టార్స్ నటిస్తారు. కానీ దీని కోసం మాత్రం దాదాపుగా ఇండస్ట్రీనే కదిలొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సిరీస్‌లో అంతమంది స్టార్స్ ఉన్నారు. అసలు దీని సంగతేంటి? తాజాగా రిలీజైన ట్రైలర్ ఎలా ఉంది?(ఇదీ చదవండి: మ్యూజీషియన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)ఈ ఏడాది ఏ ఇండస్ట్రీకి లేనంత సక్సెస్ రేట్ మలయాళ చిత్రపరిశ్రమ దక్కించుకుంది. మంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, భ్రమయుగం, ప్రేమలు.. ఇలా వరసపెట్టి సినిమాలు హిట్ కొట్టాయి. వందల కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్నాయి. స్వతహాగా మలయాళ సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఈ భాషలోని స్టార్ హీరోలైన మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ పాజిల్.. ఇలా టాప్ సెలబ్రిటీలు చాలామంది 'మనోరథంగల్' అనే వెబ్ సిరీస్ చేశారు.రెండేళ్లుగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సిరీస్.. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగస్టు 15 నుంచి జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళ స్టార్ రైటర్ ఎమ్టీ వాసుదేవర్ నాయర్ రాసిన స్టోరీతో ఈ సిరీస్ తీశారు. 9 భాగాల అంథాలజీని 8 మంది డైరెక్టర్స్ తెరకెక్కించారు. ఇందులో మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, కమల్ హాసన్, బిజు మేనన్, పార్వతి తిరువత్తు, అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సిద్ధిఖీ.. ఇలా దాదాపు టాప్ సెలబ్రిటీలు అందరూ నటించడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
ఖురేషిగా ఎందుకు మారాడు?
ఖురేషి అబ్రమ్‌గా స్టీఫెన్ నెడుంపల్లి ఎందుకు మారాడు? ‘లూసిఫర్’ సినిమా చూసిన ప్రేక్షకులకు ఈ సందేహం కలగడం సహజం. ఈ సందేహానికి ‘లూసిఫర్ 2’లో సమాధానం దొరకనుంది. స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ‘లూసిఫర్’ (2019). హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ కాంబినేషన్లోనే ‘లూసిఫర్’కి సీక్వెల్‌గా ‘ఎల్2 ఎంపురాన్’ రూపొందుతోంది.ఈ చిత్రాన్ని లైకా ప్రోడక్షన్స్ సుభాస్కరన్, ఆశీర్వాద్ సినిమాస్ ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. మంగళవారం (మే 21) మోహన్‌లాల్ బర్త్ డే సందర్భంగా ‘ఎల్ 2 ఎంపురాన్’లో ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్ లుక్‌ను విడుదల చేశారు. స్టీఫెన్ నెడుంపల్లి అసలు ఖురేషి అబ్రమ్‌గా ఎలా మారాడు? అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. 2025లో మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
'లూసిఫర్2'లో మాఫియా డాన్‌గా మోహన్‌లాల్ లుక్ రివీల్
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నేడు (మే 21) 64వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా లూసిఫర్ సీక్వెల్ నుంచి ఆయన లుక్‌ను రివీల్ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ లూసిఫర్ 2 పోస్టర్‌ను డైరెక్టర్, హీరో పృథ్వీరాజ్ పోస్ట్ చేశాడు.మలయాళ ప్రముఖ హీరో పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం లూసిఫర్.. 2019వ విడుదలైన ఈ సినిమా రూ. 200 కోట్లు రాబట్టింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా 'లూసిఫర్2: ఎంపురాన్(రాజు కన్నా గొప్పవాడు)' అనే టైటిల్‌తో ఈ ఏడాదిలో విడుదల చేయనున్నారు. సీక్వెల్ కోసం మురళీ గోపి అందించగా పృథ్వీరాజ్‌నే దీనికి కూడా దర్శకత్వం వస్తున్నారు. గతేడాదిలోనే షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌తో పాటు మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.'లూసిఫర్'లో స్టీఫెన్ గట్టుపల్లి అనే రాజకీయ నాయకుడిగా మోహన్‌లాల్ కనిపించాడు. అయితే, ఆయన రాజకీయ ప్రవేశానికి ముందు ఈ ప్రపంచాన్నే శాసించే మాఫియాకు అధినేతగా ఉంటారు. మాఫియా డాన్ అబ్రహాం ఖురేషి సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి అంత స్థాయికి ఎలా చేరుకున్నాడు. రాజకీయాలకు ముందు ఆయన ఏం చేశాడు..? ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు..? అనేది తెలియాలంటే లూసిఫర్2 వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్‌ఫాదర్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) -
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
ఇరవయ్యేళ్ల తర్వాత యాభైఆరవ చిత్రంలో...
మాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ హిట్ పెయిర్ మోహన్‌లాల్, శోభనల జోడీ రిపీట్ కానుంది. మోహన్‌లాల్ హీరోగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఎమ్. రంజిత్ ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాలో భాగమైనట్లుగా సోషల్ మీడియాలో శోభన ఓ వీడియో షేర్ చేశారు. ‘‘మోహన్‌లాల్‌గారి ఈ 360వ సినిమాలో నేను నటించనున్నాను. నాకు గుర్తు ఉన్నంతవరకు ఆయనతో నేను కలిసి చేయబోతున్న 56వ చిత్రం ఇది’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు శోభన. ఇక 1985లో వచ్చిన మలయాళ చిత్రం ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’లో తొలిసారి కలిసి నటించారు మోహన్‌లాల్, శోభన. ఆ తర్వాత ఈ ఇద్దరూ ‘మణిచిత్ర తాళు’ (ఈ సినిమా ఆధారంగానే ‘చంద్రముఖి’ తీశారు), ‘నాడోడిక్కట్టు’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 1994లో వచ్చిన మలయాళ చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’లో మెహన్‌లాల్, శోభన లీడ్ రోల్స్‌లో నటించారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మోహన్‌లాల్, శోభన కలిసి నటించనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. 2009లో వచ్చిన మలయాళ చిత్రం ‘సాగర్ ఆలియాస్ జాకీ రీలోడెడ్’లో మోహన్‌లాల్ హీరోగా నటించగా, శోభన ఓ అతిథి పాత్ర చేశారు. -
డైరెక్ట్‌గా ఓటీటీ స్టార్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ స్టార్ మోహన్‌లాల్ నటించిన చిత్రం తాజా చిత్రం మలైకొట్టై వాలిబన్. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని షాకిచ్చింది. మోహన్‌లాల్, లిజో కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచింది. మోహన్‌లాల్ కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం రూ.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే థియేటర్లలో ఈ మూవీ కేవలం మలయాళం భాషలో మాత్రమే రిలీజైంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలోనే రిలీజ్‌కు మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. మార్చి 1 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ హిస్టారికల్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని లేటేస్ట్ టాక్. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో.. మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్లో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది. మోహన్ లాల్ కెరీర్లో మలయాళంలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది, కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
'నెరు' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలో ఓ మలయాళ డబ్బింగ్ సినిమా అదరగొడుతోంది. మూవీ పేరు 'నెరు'. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మోహన్ లాల్, ప్రియమణి ఇందులో లాయర్లుగా నటించారు. కోర్టు రూమ్ డ్రామా కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ.. మలయాళంలో 'సలార్'కి పోటీగా రిలీజై ఏకంగా రూ.100 కోట్ల మేర వసూళ్లు సాధించాయి. అంతలా ఈ సినిమాలో ఏముంది? నిజంగా అంత బాగుందా? అనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) 'నెరు' కథేంటి? సారా మహమ్మద్ (అనస్వర రాజన్)కి కళ్లు కనిపించవు. ఓ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈమెపై ఓ వ్యక్తి అత్యాచారం చేస్తాడు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి పోలికల్ని గుర్తుంచుకున్న సారా.. అతడి రూపాన్ని మట్టితో శిల్పంలా చేస్తుంది. దీంతో ఈ విగ్రహానికి దగ్గర పోలికలున్న మైకేల్ (శంకర్ ఇందుచూడన్)ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ అతడి బడా పారిశ్రామికవేత్త కొడుకు కావడంతో.. ఎలాంటి కేసు అయినా సరే గెలిచేసే లాయర్ రాజశేఖర్ వల్ల బెయిల్ వస్తుంది. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్ విజయ్ మోహన్ (మోహన్ లాల్)ని ఆశ్రయిస్తారు. చాన్నాళ్ల నుంచి అసలు కోర్టుకే రాని విజయ్ మోహన్.. సారా తరఫున నిలబడి న్యాయం చేశాడా? లేదా? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఎలా ఉందంటే? 'నెరు' సినిమా కథ చూస్తే అస్సలు కొత్తది కాదు. ఓ సాధారణ అమ్మాయి.. ఊహించని విధంగా ఆమెపై బలత్కారం.. కేసు వేసినా సరే న్యాయం జరుగుతుందా అనే డౌట్.. ఇలాంటి టైంలో లాయర్ అయిన హీరో ఎంట్రీ.. వాదప్రతివాదనలు.. చివరకు న్యాయం గెలిచిందా లేదా అనేది క్లైమాక్స్. అయితే మూవీ చూస్తున్నప్పుడు తెలిసిన కథలానే అనిపిస్తుంది కానీ ప్రతి నిమిషం ఓ మంచి సినిమా చూస్తున్నామే అనుభూతి కలిగిస్తూ ఉంటుంది. స్టోరీ బాగుంది అనుకునేలోపు.. అద్భుతమైన నటనతో నటీనటులు విజృంభిస్తుంటారు. ఈ రెండు సూపర్ అనుకునేలోపు దర్శకుడు.. తన స్క్రీన్ ప్లే మేజిక్ చూపిస్తుంటాడు. అంత బాగుంటుంది ఈ సినిమా. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) హీరో బిల్డప్పులు.. ఎంట్రీ సాంగ్.. ఇలాంటి పనికిమాలిన రొటీన్ సీన్స్ ఏం లేకుండానే 'నెరు' కథని మొదలుపెట్టేశారు. కళ్లు కనిపించని అమ్మాయిపై అత్యాచారం జరగడం, దీంతో ఆమె తల్లిదండ్రులు కోర్టులో కేసు వేయడం.. అనుమానితుడు అయినా కుర్రాడిని అరెస్ట్ చేసి జైల్లో వేయడం.. అతడు తండ్రి కోటీశ్వరుడు కావడంతో ఫేమస్ క్రిమినల్ లాయర్ రంగంలోకి దిగడం.. అమ్మాయి తరఫు లాయర్ కన్ఫ్యూజన్.. దీంతో రేప్ చేశాడనే అనుమానమున్న కుర్రాడికి బెయిల్ రావడం.. ఇలా సీన్స్ అన్నీ చకాచకా పరుగెడుతుంటాయి. సరిగా అప్పుడు అమ్మాయి తరఫున వాదించేందుకు లాయర్ విజయ్ మోహన్ రంగంలోకి దిగుతాడు. అప్పటి నుంచి సినిమా మరింత థ్రిల్లింగ్‌గా మారుతుంది. చివరి వరకు అదే టెంపో మెంటైన్ చేస్తారు. ఇదే సినిమా విజయానికి కారణమైంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ దర్శకుడు జీతూ జోసెఫ్ వాటిని రాసుకున్న విధానం మాత్రం వేరే లెవల్ ఉంటుంది. ఈ రోజుల్లో సాంకేతికతని ఎలా దుర్వినియోగపరుస్తున్నారు. తద్వారా నిందితుల్ని ఎలా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారనేది క్లియర్ కట్‌గా చూపించారు. ఒకప్పటిలా కాకుండా అమ్మాయిలు ఇప్పుడు తమపై బలత్కారం జరిగితే ఎలా నిర్భయంగా ఎలా చెప్పగలుగుతున్నారో అనే సీన్ ఒకటి ఉంటుంది. చూస్తుంటే మీకు గూస్ బంప్స్ తో పాటు ఓ హై వస్తుంది. ఇక కేసు గెలిచిన తర్వాత విజయ్ మోహన్ ముఖాన్ని సారా తన చేతులతో తడిమి చూసే సీన్ కావొచ్చు. చివర్లో తన ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీసి ధైర్యంగా బయటకు నడుచుకుంటే వచ్చే సీన్స్ కావొచ్చు. ఇలా బోలెడన్ని సన్నివేశాల మిమ్మల్ని విజిల్ వేసేలా చేస్తాయి. ఎవరెవరు ఎలా చేశారు? ఇందులో హీరోహీరోయిన్ అని ఎవరూ ఉండరు. నటించిన వాళ్లందరూ జస్ట్ పాత్రధారులంతే. మోహన్ లాల్ లాంటి స్టార్ ఉన్నప్పటికీ.. సారా పాత్రలో నటించిన అనస్వర రాజన్ ఆయన్ని డామినేట్ చేసేసింది. కళ్లు లేని అమ్మాయిగా అద్భుతమైన నటనతో చించి అవతల పడేసింది. సినిమా చూసిన తర్వాత మీరు కచ్చితంగా ఆమెతో ప్రేమలో పడిపోతారు. అంతా బాగుంది మరి. ఇక డిఫెన్స్ లాయర్స్‌గా నటించిన సిద్ధిఖ్, ప్రియమణి కూడా ఉన్నంతలో డీసెంట్‌గా చేశారు. మిగిలిన వాళ్లకు పెద్దగా చెప్పుకోదగ్గ సీన్స్ ఏం లేవు. చివరగా రైటప్ అండ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ గురించి చెప్పుకోవాలి. 'దృశ్యం' సినిమాలతో అందరికీ బుర్రతిరిగిపోయేలా చేసిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు 'నెరు' మూవీతో కోర్టు రూమ్ డ్రామా సినిమాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. చివరగా ఒక్కమాట.. మన పవర్ రీమేక్ స్టార్ ఈ సినిమాని రీమేక్ చేసి చెడగొట్టే ముందే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 'నెరు' చూసేయండి. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) -
ఓటీటీలో మోహన్‌లాల్ సూపర్ హిట్ మూవీ.. నెలరోజులకే..
ఓటీటీలు వచ్చాక ఇక్కడి సినీప్రియులు తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలనూ ఆదరిస్తున్నారు. అటు సినిమా మేకర్స్ కూడా తమ చిత్రాన్ని ఓటీటీలో వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఫలితాలతో సంబంధం లేకుండా కొన్ని చిత్రాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా తమిళ, మలయాళ సినిమాలు చూసేందుకు జనాలు గత కొంతకాలంగా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో అనేక సినిమాలు ఇక్కడ కూడా డబ్ అవుతున్నాయి. ఓటీటీలోకి నేరు తాజాగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'నేరు' మూవీ ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియమణి, అనస్వర రాజన్, శాంతి మాయాదేవి, సిద్దిఖి జగదీష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన నేరు గతేడాది డిసెంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. ఓటీటీలో రిలీజ్ ఇప్పటివరకుప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. థియేటర్లో రిలీజైన నెలరోజులకు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జనవరి 23 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) చదవండి: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణ చెప్పిన నయనతార -
PM Modi: గురువాయూరు గుడిలో ప్రధాని మోదీ పూజలు.. నూతన దంపతులకు ఆశీర్వాదం (ఫొటోలు)
-
సూపర్‌స్టార్ కొత్త మూవీ.. టీజర్ మాత్రం అదుర్స్!
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన కొత్త సినిమా 'మలైకోట్టై వాలిబన్'. లిజో జోస్ పల్లిచోలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్ మేరీ క్రియేటివ్, సెంచరీ ఫిలిమ్స్, మ్యాక్స్ ల్యాబ్, సరిగమ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. పీరియాడికల్ డ్రామాగా తీసిన ఈ చిత్ర షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. మొత్తంగా 33 రిలీజ్!) ఈ సినిమాని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ.. దర్శకుడి అద్భుత పనితనమని హీరో మోహన్ లాల్ చెప్పుకొచ్చారు. టీజర్లో చూపించిన సన్నివేశాలకు ఏమాత్రం తగ్గకుండా మూవీ ఉంటుందని అన్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
సూపర్ హిట్ మూవీ సీక్వెల్లో పాక్ నటి.. ఫోటో వైరల్!
ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన పాకిస్తాన్ నటి మహీరా ఖాన్. ఆమె త్వరలోనే మాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటిస్తోన్న ఎల్2: ఎంపురాన్‌లో ఆమె హీరోయిన్గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా.. మహీరా ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్ సరసన కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈనేపథ్యంలో పృథ్వీరాజ్‌తో ఉన్న మహీరా పాత ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఎల్2: ఎంపురాన్ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. 2019లో విడుదలైన లూసిఫర్ పార్ట్-2గా ఎల్2: ఎంపురాన్ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా.. మహీరా ఖాన్ విషయానికొస్తే.. 2017 బాలీవుడ్ చిత్రం రయీస్‌లో షారుఖ్ ఖాన్ సరసన ప్రధాన పాత్ర పోషించింది. అయితే 2016 యూరీ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ఆరిస్టులను ఇండియాలో పని చేయకుండా నిషేధించారు. దీంతో నిషేధం తర్వాత ఆమె ఇండియాలో ఏ సినిమాలోనూ కనిపించలేదు. అయితే ఇటీవలే పాకిస్థానీ కళాకారులపై ఉన్న నిషేధాన్ని ముంబై హైకోర్టు ఎత్తివేసింది. దీంతో మహీరా ఖాన్ మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సిందే. Is this an old photo?#PrithvirajSukumaran with #Mahirakhan pic.twitter.com/SvVMQG5MQD — AKV (@AnandKr13834547) November 26, 2023 View this post on Instagram A post shared by Mahira Khan (@mahirahkhan) -
శివకార్తికేయన్ సినిమా.. రంగంలోకి పాన్ ఇండియా స్టార్లు!
ప్రస్తుతం మంచి రైజింగ్‌లో ఉన్న నటుడు శివకార్తికేయన్. ఇటీవల ఈయన నటించిన మావీరన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఇతడు.. విశ్వ నటుడు కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి శివకార్తికేయన్ సిద్ధమవుతున్నారు. కార్తికేయన్‌తో సీతారామం బ్యూటీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను గత సెప్టెంబర్‌లోనే నిర్మాతలు ప్రకటించారు. ఇందులో సీతారామం చిత్రం ఫేమ్ మృణాల్‌ఠాగూర్ కథానాయికగా నటించబోతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, అదేవిధంగా బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నట్లు తాజా సమాచారం. నటుడు మోహన్‌లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పుడు తుపాకీలో విలన్‌గా.. ఇప్పుడు.. ఇకపోతే విద్యుత్ జమ్వాల్ ఇంతకుముందు విజయ్ కథానాయకుడిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన తుపాకీ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారన్నది గమనార్హం. కాగా అనిరుధ్ సంగీతాన్ని అందించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. చిత్ర షూటింగ్ డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. చదవండి: ‘మంగళవారం’ మూవీ రివ్యూ -
Viral Pics: కేరళీయం 2023 వేడుకలు: ఒకే ఫ్రేమ్‌లో దిగ్గజాలు (ఫొటోలు)
-
వృషభ రిలీజ్ డేట్ వచ్చేది అప్పుడే! ఆ సన్నివేశాలు హైలైట్!
మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన జాతీయస్థాయి నటుడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించారు. తాజాగా ఈయన నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం వృషభ: ది వారియర్స్ అరైస్. రోషన్ మేకా, షనాయా కపూర్, సహారా ఎస్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. కనెక్ట్ మీడియా, బాలాజీ తెలుగు ఫిలిమ్స్ ఏవీఎస్ స్టూడియోస్ బ్యానర్లపై వరుణ్ మందుర్, సౌరవ్ మిశ్రా, ఏక్తా ఆర్ కపూర్, శోభాకపూర్, విశాల్ కుర్నానీ, జూసీ పరేక్ మేతా, అభిషేక్ వ్యాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమవగా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ చిత్ర వివరాలను నిర్మాతలు తెలుపుతూ తండ్రి కొడుకుల మధ్య డ్రామా, ఎమోషన్, ప్రేమ, పగ, ప్రతీకారంతో కూడిన పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందన్నారు. చిత్రంలో వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయన్నారు. ఇది 2024లో విడుదలయ్యే అత్యంత భారీ చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్ర విడుదల తేదీని నవరాత్రి సందర్భంగా వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తమిళం, హిందీ తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. చదవండి: మ్యాచ్ చూసేందుకు వెళ్లి గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ -
లూసిఫర్ సీక్వెల్ రెడీ.. మాలీవుడ్‌లో లైకా ప్రొడక్షన్స్ ప్లాన్
కోలీవుడ్‌లో చిన్న చిత్రాల నుంచి భారీ చిత్రాల వరకు కేరాఫ్‌గా మారిన చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షనన్స్. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్ ఇప్పుడు మాలీవుడ్లోకి అడుగు పెట్టారు. కంప్లీట్ యాక్టర్‌గా పేరుగాంచిన మోహన్‌లాల్ బహుభాషా నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగు దశాబ్దాలుగా కథానాయకుడిగా నటిస్తూ మాలీవుడ్‌లో (మలయాళం) అత్యధిక పారితోషికం తీసుకున్న నటుల్లో ఈయన ఒకరు. (ఇదీ చదవండి: వాళ్లు అయితే నా దుస్తులు తొలగించేవారు.. ఊసరవెల్లి బ్యూటీ కామెంట్లు) 350 చిత్రాలకు పైగా చేసిన మోహన్ లాల్ ఈమధ్య నటించిన చిత్రం లూసిఫర్. దీనికి మరో మలయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించి అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. లూసిఫర్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కాగా దానికి సీక్వెల్‌గా లూసిఫర్ 2 చిత్రం రూపొందుతోంది. ఇది కూడా మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్లో కాంబినేషన్లోనే తెరకెక్కడం విశేషం. కాగా విచిత్రాన్ని ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోని పెరంబలూర్తో కలిసి లైకా ప్రొడక్షనన్స్ సుభాస్కరన్ నిర్మిస్తుండడం మరో విశేషం. దీని గురించి లైకా ఫిలిమ్స్ సంస్థ అధినేత సుభాస్కరన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ దైవ దేశంగా భావించే మలయాళ చిత్ర పరిశ్రమంలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. అంకితభావంతో పనిచేసే కళాకారులు సహజత్వంతో కూడిన సంస్కృతికి అద్దం పట్టే చిత్రాలను రూపొందించే మలయాళ చిత్ర పరిశ్రమలో లూసిఫర్ 2 చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని తాము పొందామని చెప్పారు. ఈ చిత్త పరిశ్రమ అభివృద్ధిని, ఈ చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ ధ్యేయంగా పేర్కొన్నారు. ఈ చిత్ర విజయం పదికాలాలపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటుందని సుభాస్కరన్ పేర్కొన్నారు. -
మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్ హీరో
‘కన్నప్ప’ విషయంలో ఎక్కడ తగ్గట్లేదు డైటమిక్ హీరో మంచు విష్ణు. టెక్నీషియన్లను మొదలుకొని నటీనటుల వరకు పెద్ద పెద్ద వాళ్లనే తీసుకుంటున్నాడు. దీంతో కన్నప్ప మీద రోజు రోజు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ నటించబోతున్న విషయం తెలిసిందే. సినిమాలో కీలకపై శివుని పాత్రలో ప్రభాస్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్‌కి జోడిగా..అంటే పార్వతిగా నయనతార నటించబోతున్నట్లు నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో మరో స్టార్ హీరో వచ్చి చేరాడు. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం కన్నప్ప సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. ఈ మేరకు మంచు విష్ణు రీసెంట్గా మోహన్ లాల్‌ను కలిశారు. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సుమారు రూ. 150 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు. Har Har Mahadev! ❤️ https://t.co/Q62cakbibp — Vishnu Manchu (@iVishnuManchu) September 30, 2023 -
విజయ్ ‘లియో’కి బాయ్‌కాట్ సెగ.. కారణం ఆ గొడవేనా?
వారసుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. విక్రమ్‌తో కమల్‌హాసన్‌కు భారీ విజయాన్ని అందించిన లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చాలాకాలం తర్వాత విజయ్‌కి జోడీగా త్రిష నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. తమిళ్ ప్రేక్షకులే కాదు ఆలిండియా సినీ అభిమానులు సైతం లియో చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి తరుణంలో ఈ చిత్రానికి కేరళలో బాయ్‌కాట్ సెగ తగిలింది ట్రెండింగ్‌లో #KeralaBoycottLEO హ్యాష్‌ట్యాగ్ విజయ్‌కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు తెలుగు, కన్నడ, కేరళలో డబ్ అయి విజయం సాధించాయి. అందుకే లియో చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలతో పాటు పాన్ ఇండియా వైడ్‌గా విడుదల చేస్తున్నారు. కేరళలో కూడా విజయ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కేరళలో లియో సినిమాకు వ్యతిరేకత ఎదురవుతుంది. లియో సినిమాను బహిష్కరించాలంటూ కొంతమంది కేరళ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ వ్యతిరేకతను తెలియజేయడంతో.. #KeralaBoycottLEO హ్యాష్‌ట్యాగ్ ఎక్స్(ట్విటర్)లో ట్రెండ్ అవుతోంది. మోహన్‌లాల్ అభిమానులే ఈ చిత్రాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కారణమేంటి? పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న లియో సినిమాకు కేరళలో వ్యతిరేకత ఎదురవడానికి మోహన్‌లాల్ అభిమానులే కారణం. వాళ్లు అలా ట్రోల్ చేయడానికి కూడా కారణం ఉంది. 2014లో మోహన్‌లాల్, విజయ్ కలిసి ‘జిల్లా’ అనే సినిమాలో నటించారు. ఆ చిత్రం విడుదలయ్యాక కొంతమంది విజయ్ ఫ్యాన్స్.. మోహన్‌లాల్ నటనను అవమానిస్తూ ట్వీట్లు చేశారు. అప్పట్లో ఆ ట్వీట్స్ బాగా వైరల్ అయ్యాయి. తమ హీరోని అవమానించారు కాబట్టే.. విజయ్ సినిమాను ఇక్కడ ఆడనివ్వమని మోహల్‌లాల్ ఫ్యాన్స్ చెబుతున్నారు. విజయ్‌కి వ్యతిరేకంగా #Kerala Boycott Leo అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి బాయ్‌కాట్ హీట్ తగిలితే మాత్రం నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు. -
వెండితెరపై యుద్ధానికి సిద్ధం అవుతున్న స్టార్ హీరోలు
వెండితెరపై కథానాయకుడు కత్తి దూస్తే.. గుర్రపు స్వారీ చేస్తూ యుద్ధం చేస్తే... విల్లు ఎక్కుపెడితే చూసే ప్రేక్షకులకు ఓ థ్రిల్. రెగ్యులర్‌గా వచ్చే ఫైట్స్‌కి భిన్నంగా సిల్వర్ స్క్రీన్‌పై ‘వార్’ కనిపిస్తే ‘వావ్’ అనకుండా ఉండలేరు. కొందరు హీరోలు వెండితెరపై యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు. ఆ వారియర్స్ గురించి ఓ లుక్ వేయండి. దిక్కులెల్ల గెలిచినోడు.. ‘కొండల కోనల్లో కోటి పులులు పట్టినోడు, ముక్కోటి చుక్కలెక్కి దిక్కులెల్ల గెలిచినోడు.. ఒక్కడే ఒక్క వీరుడురా.. వాడే కంగ’.. కంగువా’ సినిమాలో హీరోగా సూర్య పాత్రను చిత్రబృందం వివరించిన తీరు ఇది. దీన్నిబట్టి ఈ సినిమాలో సూర్య పాత్రను ఈ చిత్రదర్శకుడు శివ చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్ది ఉంటారని ఊహించవచ్చు. ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో కొన్ని సన్నివేశాల్లో కంగ అనే యోధుడి పాత్రలో కనిపిస్తారు సూర్య. ఇప్పటికే ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. అంతేకాదు..‘కంగువా’ సినిమాలో ఈ సీన్స్ హైలైట్‌గా ఉంటాయని కోలీవుడ్ సమాచారం. 17వ శతాబ్దానికి చెందిన ఓ వీరుడు సమకాలీన పరిస్థితులకు కనెక్ట్ అయ్యే ఓ పాయింట్‌తో ‘కంగువా’ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్గా నటించారు. ‘కంగువా’ తొలి భాగం ఏప్రిల్‌లో విడుదల కానుంది. ది వారియర్ విభిన్న సినిమాలు, వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉంటారు హీరో మోహన్‌లాల్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వృషభ’. ‘ది వారియర్ అరైజ్’ అనేది ఉపశీర్షిక. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. తొలి షెడ్యూల్ పూర్తయింది. కాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఓ లుక్ కొన్ని సీన్స్‌లో మోహన్‌లాల్ వారియర్‌గా కనిపిస్తారన్నట్లుగా స్పష్టం చేస్తోంది. దీనికి తోడు క్యాప్షన్‌లో ‘వారియర్’ ప్రస్తావన ఉండటంతో మోహన్‌లాల్ వారియర్‌గా కనిపించే నిడివి కూడా ఎక్కువే అని ఊహిస్తున్నారు ఆయన అభిమానులు. తెలుగు, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రోషన్ ఓ హీరోగా నటిస్తున్నాడు. జహ్రా ఖాన్, శనయ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నందకిశోర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే మోహన్‌లాల్ నటించి, తొలిసారి దర్శకత్వం వహించిన పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ ‘బరోజ్’. ఈ చిత్రంలో ఓ నిధిని కాపాడే యోధుడిగా కనిపిస్తారాయన. స్వయంభూ వియత్నాంలో మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం.. వంటి యుద్ధ విద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు హీరో నిఖిల్. ఎందుకంటే ‘స్వయంభూ’ సినిమా కోసం. ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్‌లో నిఖిల్ యుద్ధ వీరుడిగా కనిపిస్తారు. నిఖిల్ శిక్షణ పూర్తయిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పూర్తి స్థాయిలో ్రపారంభం కానుంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇలా ‘వార్’ బ్యాక్‌డ్రాప్‌లో దక్షిణాదిన మరికొన్ని చిత్రాలు రూపొందుతున్నాయి. -
సినిమాల్లో ‘గుండు’ కలిసొస్తుందా?, సక్సెస్ రేటెంత?
ఒకప్పుడు హీరో అంటే.. 6 అడుగల హైట్..మంచి హెయిర్ స్టయిల్, డ్రెసింగ్ కచ్చితంగా ఉండాలి. అభిమానులు కూడా తమ హీరోలో ఈ క్వాలిటీస్ కచ్చితంగా ఉండాలని కోరుకునే వారు. కానీ ఇప్పుడు అవేవి పట్టించుకోవడం లేదు. గుండుతో కనిపించినా సరే.. తమను అలరిస్తే బా‘గుండు’ను అంటున్నారు. అందుకే ఈ మధ్య స్టార్ హీరోలే గుండుతో బాక్సాఫీస్ డీ కొడుతున్నారు. సినిమా సక్సెస్‌లోనూ ‘గుండు’ కీలక పాత్ర పోషిస్తోంది. షారుఖ్ సాహసం షారుఖ్ హెయిర్ స్టైల్ అంటే అభిమానులకు పిచ్చి. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మొదలు మొన్నటి పఠాన్ వరకు ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన హెయిర్ స్టైల్‌తో అభిమానులను అలరించాడు. అలాంటి షారుఖ్.. ‘జవాన్’ కోసం పెద్ద సాహసమే చేశాడు. తొలిసారి గుండుతో కనిపించి షాకిచ్చాడు. జవాన్‌లో కీలకమైన మెట్రో ట్రైన్ హైజాక్ సీన్లో షారుఖ్ గుండుతో దర్శనమించాడు. తెరపై గుండుతో షారుఖ్ కనిపించగానే అభిమానులు ఈలలు వేశారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. గుండుతో ధనుష్ ఢీ ధనుష్ తన 50వ చిత్రానికి తనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో గుండుతో కనిపించబోతున్నాడు. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామా అట. ధనుష్, విష్ణు విశాల్, ఎస్జే సూర్య అన్నదమ్ములుగా కనిపిస్తారని టాక్. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంతో ధనుష్ గుండుతోనే విలన్లను ఢీకొడుతాడట. గుండు, గుబురు గడ్డంతో మోహన్‌లాల్ మోహన్‌లాల్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్’. వాస్కో డి గామా నిధిని రక్షించడానికి నియమించబడిన 400 ఏళ్ల నాటి ఆత్మ కథ బర్రోజ్. ఈ చిత్రానికి మోహన్‌లాలే దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడిగా ఇది ఆయనకు తొలి చిత్రం. ఇందులో గుండు, గుబురు గడ్డంతో మోహన్‌లాల్ కనిపించబోతున్నాడు. బాస్..గుండూ బాస్ మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై ఇప్పటి వరకు గుండుతో కనిపంచలేదు. అయితే భోళాశంకర్ కోసం గుండులో కనిపిస్తాడని అంతా భావించారు. ఎందుకంటే చిరంజీవియే స్వయంగా ఈ విషయాన్ని చెబుతూ..అప్పట్లో ఓ వీడియో వదిలాడు. అందులో చిరు..జుట్టు తీయించకుండా ప్రొస్టేటిక్ మేకప్‌తో గుండు లుక్‌ని మౌల్డ్ చేయించుకున్నాడు. అయితే సినిమాలో మాత్రం ఆ లుక్‌లో కనిపంచలేదు. కలిసొచ్చిన ‘గుండు’ చిత్ర పరిశ్రమలో ‘గుండు’ సక్సెస్ రేటు ఎక్కువనే చెప్పాలి. స్టార్ హీరోలు గుండుతో కనిపించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. శివాజీ చిత్రంలో రజనీకాంత్ గుండుతో సరికొత్త లుక్‌లో కనిపించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ‘గజనీ’ సినిమాలో సూర్య గుండుతో కనిపించారు. అదీ సూపర్ హిట్టే. ఇదే సినిమా హిందీ రీమేక్‌లో అమీర్ గుండుతో కనిపించాడు. అభయ్ చిత్రంలో కమల్ హాసన్ కూడా గుండుతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. మోహన్ బాబు శివశంకర్ చిత్రంతో గుండుతో కనిపించగా.. ఆ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. వర్సటైల్ యాక్టర్ విక్రమ్ 'సేతు' సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు గుండు చేయించుకున్నారు. -
వృషభ.. మళ్లీ ఆ రేంజ్లో యాక్షన్ సీన్స్!
మోహన్‌లాల్, రోషన్ మేకా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ద్విభాషా (తెలుగు, మలయాళం) చిత్రం ‘వృషభ’. ‘ది వారియర్ అరైజ్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో జహ్రా ఖాన్, శనయ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నంద కిషోర్ దర్శకత్వంలో అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రా నిర్మాతలు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ‘‘తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుంది. ‘మన్యం పులి’ తర్వాత మోహన్‌లాల్, పీటర్ హెయిన్స్ కాంబినేషన్లో ఆ తరహా యాక్షన్ సీన్స్ అలరిస్తాయి. హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో మా సినిమాకు వర్క్ చేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. శ్రీకాంత్ మేకా, రాగిణి ద్వివేది తదితరులు కీలక పాత్రల్లో తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం హిందీ, కన్నడ, తమిళ భాషల్లో 2024లో రిలీజ్ కానుంది. -
అసాధారణ ప్రయాణం
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వంలో జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్ నిర్మించాయి. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ, తమిళ ట్రైలర్స్‌ని హీరోలు నాగార్జున, షారుక్ ఖాన్, మోహన్ లాల్, సూర్య విడుదల చేశారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘కింగ్ ఆఫ్ కోత’ ఒక అసాధారణ ప్రయాణం. గొప్ప పాత్రలు, క్లిష్టమైన కథతో రూపొందించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు జీ స్టూడియోస్ సౌత్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్. -
గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ కన్నుమూత
ఇండస్ట్రీలో మరో విషాదం. ఎన్నో అద్భుతమైన సినిమాల తీసి, స్టార్ డైరెక్టర్‌గా పేరు గడించిన సిద్ధిఖీ (63) కన్నుమూశారు. గత రెండు రోజులుగా అనారోగ్య సమస్యలతో సీరియస్ కండీషన్లో ఉన్న ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో మలయాళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హీరోయిన్ కీర్తి సురేశ్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, హీరో మోహన్‌లాల్ తదితరలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధిఖీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఏం జరిగింది? సోమవారం మధ్యాహ్నం దర్శకుడు సిద్ధిఖీకి గుండెపోటు వచ్చింది. దీంతో కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. లివర్ సంబంధిత సమస్యలతోపాటు న్యూమోనియా ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారు. మరోవైపు ఈయన ఆరోగ్యం విషమించింది. ఎక్మో సాయంతో చికిత్స అందించినట్లు మాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఆయనకు ఏం కాదని, త్వరగా కోలుకుంటారని అనుకున్నారు. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రాణాలు వదిలేశారు. (ఇదీ చదవండి: బెడ్‌పై కదల్లేని స్థితిలో.. మాట రాక కంటనీరు..: రాజీవ్ కనకాల ఎమోషనల్) సిద్దిఖీ ఎవరు? సిద్ధిఖీ అసలు పేరు సిద్ధిఖీ ఇస్మాయిల్. డైరెక్టర్ కమ్ స్క్రీన్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్. మలయాళంలో మోహన్‌లాల్‌కు సిద్దిఖీ బెస్ట్ ఫ్రెండ్. వీళ్లిద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. అద్భుతమైన సక్సెస్‌లు అందుకున్నాయి. విచిత్రం ఏంటంటే సిద్దిఖీ తీసిన తొలి సినిమా 'రాంజీరావు స్పీకింగ్'. చివరి సినిమా 'బిగ్ బ్రదర్'. ఈ రెండింటిలోనూ మోహన్‌లాల్ హీరో కావడం విశేషం. దీన్నిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. వీళ్లిద్దరి బాండింగ్ ఎలా ఉండేదోనని.. తెలుగులోనూ అలానే మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోని అద్భుతమైన సినిమాల్లో ఒకటైన 'హిట్లర్' కథ ఈయనదే. మలయాళంలో అదే పేరుతో మమ్ముట్టి హీరోగా తీసిన సినిమానే చిరు.. తెలుగులో రీమేక్ చేశారు. పలు భాషల్లో రీమేక్ అయిన 'బాడీగార్డ్' ఒరిజినల్‌కు దర్శకుడు ఈయనే. తెలుగులోనూ నితిన్ హీరోగా 'మారో' అనే మూవీ తీశాడు. కాకపోతే ఇది ఆడలేదు. దీంతో సిద్దిఖీ మరో తెలుగు సినిమా చేయలేదు. 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన సిద్దిఖీ ఇలా చనిపోవడం ఇండస్ట్రీకి తీరనిలోటు. 💔 pic.twitter.com/DJrV2IKZc6 — Keerthy Suresh (@KeerthyOfficial) August 8, 2023 RIP Deepest condolences to the family 🙏 pic.twitter.com/LXjkvvxxBl — Prabhudheva (@PDdancing) August 8, 2023 (ఇదీ చదవండి: అనాథలా రేకుల షెడ్డులో దుర్భర జీవితం గడిపిన స్టార్ హీరోయిన్!) -
వృషభ నాకో అందమైన జర్నీ
‘మూన్ లైట్ (2016), త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ’ (2017) వంటి పలు హాలీవుడ్ చిత్రాలకు నిర్మాతగా, సహనిర్మాతగా వ్యవహరించిన నిక్ తుర్లో తొలిసారి భారతీయ భాషా చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. మోహన్ లాల్, రోషన్ మేక తండ్రీ కొడుకులుగా, శనయ కపూర్, జహ్రా ఖాన్ కీ రోల్స్‌లో నటిస్తున్న ‘వృషభ’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు నిక్. ఈ సందర్భంగా నిక్ మాట్లాడుతూ – ‘‘వృషభ’ నా ఫస్ట్ ఇండియన్ మూవీ. నేను చేస్తున్న తొలి బహు భాషా సినిమా కూడా ఇదే. ‘వృషభ’ నాకో అందమైన జర్నీ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. నంద కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. -
రోషన్ లీడ్ రోల్లో వృషభ షురూ
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, రోషన్ లీడ్ రోల్లో నటిస్తున్న ద్విభాషా చిత్రం (తెలుగు, మలయాళం) ‘వృషభ’. నందకిశోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, రాగిణి ద్వివేది, జహ్రా ఎస్ ఖాన్ , షానయ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ వ్యాస్, ఏక్తా కపూర్, విశాల్గుర్నాని, జుహీ పరేహ్ మెహతా, శ్యామ్ సుందర్, శోభాకపూర్, వరుణ్ మాథుర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటి ఊహ క్లాప్ కొట్టారు. మోహన్ లాల్, రోషన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట నందకిశోర్. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. తెలుగు, మలయాళంతో పాటు తమిళం, కన్నడం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. -
రోషన్ చేతిలో రెండు పాన్ ఇండియా చిత్రాలు
‘నిర్మలా కాన్వెంట్’ (2016)లో లీడ్ రోల్ చేసి, ‘పెళ్లి సందడి’ (2021)తో హీరోగా మంచి మార్కులు తెచ్చుకున్నారు నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా. ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో హీరోగా సినిమాలు సైన్ చేశారు. రోషన్ ఒకేసారి రెండు పాన్ ఇండియా చిత్రాలు అంగీకరించడం విశేషం. కన్నడ దర్శకుడు నందకిశోర్ దర్శకత్వంలో రోషన్–మోహన్‌లాల్ కాంబినేషన్లో రూపొందనున్న పాన్ ఇండియా చిత్రం షూటింగ్ ఈ నెలాఖరులో ఆరంభం కానుంది. తండ్రీ–కొడుకుల అనుబంధం నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ మూవీగా రూపొందనుంది. రోషన్ నటించనున్న మరో పాన్ ఇండియా చిత్రం వైజయంతీ మూవీస్–స్వప్నా సినిమా బేనర్లపై రూపొందనుంది. నూతన దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. -
గుండుతో ఢీ కొట్టేందుకు రెడీ అయిన స్టార్స్
హీరో అంటే ఫ్యాన్స్‌కి స్టయిలిష్‌గా కనబడాలి.. హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్, వాకింగ్... ఇలా అన్నీ స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే అన్నట్లు ఉండాలి. ఫ్యాన్స్ ఇలానే కోరుకుంటారు. కానీ తమ హీరోని ‘గుండు’లో చూడాలనుకోరు. ఒకవేళ గుండులో కనిపించే క్యారెక్టర్ చేస్తున్నారని తెలిస్తే ‘బాగుండునా!’ అని చర్చించుకుంటారు. చివరికి లుక్ చూశాక ఈ క్యారెక్టర్ చేస్తే ‘బాగుండు’ అనుకుంటారు. మరి.. గుండులోనూ స్టయిలిష్‌గా కనిపిస్తే ఎందుకు కాదంటారు. ఇక ఈ లుక్‌లో చిరంజీవి, మోహన్‌లాల్, ధనుష్ కనిపించనున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. భోళా శంకర్‌లో... వెండితెరపై ఇప్పటివరకూ చిరంజీవి గుండుతో కనిపించలేదు.. ఎందుకంటే క్యారెక్టర్ డిమాండ్ చేయలేదు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ డిమాండ్ చేసింది.. అంతే.. గుండుతో కనిపించడానికి రెడీ అయ్యారు. ఆ సినిమా ‘భోళా శంకర్’. అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వేదాళం’కి రీమేక్ ఇది. తమిళ వెర్షన్లో అజిత్ పూర్తి గుండుతో కనిపించలేదు... అయితే దాదాపు ‘హెడ్ షేవ్’ చేసుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం నున్నటి గుండుతో కనిపించనున్నారు. అయితే జుట్టు తీయించకుండా ప్రొస్టేటిక్ మేకప్‌తో చిరంజీవి గుండు లుక్‌ని మౌల్డ్ చేశారు టెక్నీషియన్స్. ఆ వీడియోను చిరంజీవి షేర్ చేసి, నిపుణుల పని తీరుని మెచ్చుకున్నారు కూడా. ఇక మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి ఫ్లాష్‌బ్యాక్‌లో గుండుతో కనిపిస్తారట. ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా కథానాయికగా, ఆయన చెల్లెలి పాత్రను కీర్తీ సురేష్ చేస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. నిధిని కాపాడే బర్రోజ్ ఒక నిధిని కాపాడే పని మీద ఉంటాడు బర్రోజ్. వాస్కోడగామా దాచిన నిధి అది. వాస్కోడగామా నిజమైన వారసునికి మాత్రమే ఆ సంపద దక్కాలి. వారికి నిధిని అప్పగించే బాధ్యతను తీసుకున్న బర్రోజ్ 400 ఏళ్లుగా ఆ నిధిని కాపాడుకుంటూ వస్తాడు. ఈ కథతో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్’. టైటిల్ రోల్లో నటిస్తూ, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు మోహన్ లాల్. దర్శకుడిగా ఇది ఆయనకు తొలి చిత్రం. గుండు, గుబురు గడ్డంతో మోహన్‌లాల్ గెటప్ ఈ సినిమాలో డిఫరెంట్‌గా ఉంటుంది. బాలల చిత్రంలా రూపొందిస్తున్నారనీ, పెద్దలనూ ఆకట్టుకునే విధంగా ఉంటుందని సమాచారం. భారతీయ తొలి త్రీడీ చిత్రం ‘మై డియర్ కుట్టి సైతాన్’ దర్శకుడు జీజో పున్నూస్ ఈ త్రీడీ ‘బర్రోజ్’కి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఈ ఏడాది ఓనమ్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. యాభైయ్యవ సినిమాలో గుండుతో... నటుడిగా కెరీర్లో 50వ మైల్ స్టోన్ చేరుకున్నారు ధనుష్. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. అయితే డైరెక్టర్‌గా ఆయనకిది తొలి చిత్రం కాదు. దర్శకుడిగా ‘పవర్ పాండీ’ (2017) మొదటి చిత్రం. ఆ చిత్రంలో ఓ అతిథి పాత్ర కూడా చేశారు. ఐదేళ్ల తర్వాత ధనుష్ మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రంలో గుండుతో కనిపించనున్నారట. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఆరంభమైంది. చిత్రీకరణ ఆరంభించక ముందు తిరుమల వెళ్లి ధనుష్ తలనీలాలు సమర్పించుకున్నారు. ఎలానూ ఈ చిత్రంలో గుండుతో కనిపిస్తారు కాబట్టి దైవాన్ని దర్శించుకుని, తల నీలాలు సమర్పించి ఉంటారని కోలీవుడ్ అంటోంది. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామా అట. ధనుష్, విష్ణు విశాల్, ఎస్జే సూర్య అన్నదమ్ములుగా కనిపిస్తారని టాక్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
మోహన్ లాల్ బర్త్ డే.. ఖరీదైన కారు కొనిచ్చిన ఫ్రెండ్!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు అతని ప్రాణ స్నేహితుడు. మే 21న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఖరీదైన బహుమతి ఇచ్చి అభిమానం చాటుకున్నారు. మోహన్ లాల్‌కు సరికొత్త కియా ఈవీ-6 ఎలక్ట్రిక్ కారును గిప్ట్గా ఇచ్చాడు. ఈ లగ్జరీ ఎస్యూవీ కారు విలువ దాదాపు రూ. 65 లక్షలకు పైగానే ఉంది. సూపర్ స్టార్ తన భార్యతో కలిసి కారు డెలివరీ తీసుకుంటున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) మోహన్ లాల్ ఆదివారం తన 63 వ పుట్టినరోజును జరుపుకున్నారు. తెలుగులోనూ పలు చిత్రాలో నటించారు. ఆయన తన పుట్టిన రోజును కొంతమంది నిరుపేద పిల్లల సమక్షంలో జరుపుకున్నారు. వారితో కాసేపు సరదా మాట్లాడి కేక్ కట్ చేశారు. అంతే కాకుండా 2019 వరద రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన కోజికోడ్‌కు చెందిన వ్యక్తికి మోహన్‌లాల్ ఇంటిని కూడా విరాళంగా ఇచ్చారు. (ఇది చదవండి: వెయిటర్‌గా మారిన 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోని) కాగా.. మోహన్‌లాల్ ప్రస్తుతం 'మలైకోట్టై వాలిబన్'లో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by TOI ETimes Malayalam (@etimesmalayalam) -
కొరియాలో దృశ్యం
భారతీయ ‘దృశ్యం’ కొరియా తెరపైకి వెళ్లనుంది. మోహన్‌లాల్ హీరోగా, మీనా, ఆశా శరత్, అన్సిబా హాసన్, సిద్ధిఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ అయి హిట్ అయింది. ‘దృశ్యం’ తర్వాత మోహన్‌లాల్–జీతూజోసెష్ కాంబోలో వచ్చిన ‘దృశ్యం 2’ కూడా వీక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇక దృశ్యం సినిమా హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కాగా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ కొరియాలో రీమేక్ కానుంది. సౌత్ కొరియా ఆంథాలజీ స్టూడియోస్, ఇండియన్ పనోరమ స్టూడియోస్ పతాకాలపై చోయ్ జే వోన్, కుమార్ మంగత్ పాఠక్ హిందీ ‘దృశ్యం’ ని కొరియాలో రీమేక్ చేయనున్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోవత్సాల్లో ఈ విషయాన్ని చోయ్ జే, మంగత్ పాఠక్ ప్రకటించారు. ఇండియన్, కొరియన్ ప్రొడక్షన్ హౌస్‌లు కలిసి ఓ సినిమాను నిర్మిస్తుండటం ఇదే తొలిసారి. ‘‘సాధారణంగా కొరియన్ చిత్రాలు భారతీయ భాషల్లో రీమేక్ అవుతుంటాయి. కానీ, ఇప్పుడు ఓ ఇండియన్ సినిమా కొరియాలో రీమేక్ అవుతుంది’’ అన్నారు పాతక్. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నిర్మాత పీకేఆర్ పిళ్లై(92) కన్నుమూశారు. మాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన అనారోగ్యంతో సమస్యలతో త్రిసూర్ జిల్లా మందన్‌చిరలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మోహన్ లాల్‌తో ఎక్కువగా సినిమాలు నిర్మించారు. (ఇది చదవండి: నాకు పునర్జన్మ నిచ్చింది ఆమెనే: విజయ్ ఆంటోని) షిర్డిసాయి క్రియేషన్స్ బ్యానర్‌పై అమృతం గమ్య (1987), చిత్రం (1988), వందనం (1989), కిజక్కునరుమ్ పక్షి (1991, అహం (1992)తో సహా మోహన్‌లాల్ బ్లాక్‌బస్టర్ హిట్లను అందించారు. పిళ్లై చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమా చిత్రమ్. దీనికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా.. మోహన్‌లాల్ నటించారు. ఈ సినిమా రెండు థియేటర్లలో 300 రోజులకు పైగా ఆడిన ఘనత సాధించింది. ఈ చిత్రం తరువాత తెలుగు, హిందీ, కన్నడ, తమిళంలో వరుసగా అల్లుడుగారు, ప్యార్ హువా చోరీ చోరీ, రాయరు బండారు మావన మానేగే, ఎంగిరుంధో వందన్‌గా రీమేక్ చేశారు. (ఇది చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్‌తేజ్ ఎంగేజ్మెంట్?) పన్నెండు సంవత్సరాల క్రితం ముంబైలోని తన వ్యాపారాన్ని వదిలేసి కేరళాకు వచ్చారు పిళ్లై. 1984లో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. సొంత చిత్ర నిర్మాణ సంస్థ షిర్డీ సాయి క్రియేషన్స్‌పై వేప్రాళం అనే చిత్రాన్ని నిర్మించాడు. మొదట ఎర్నాకులం లో ఉన్నప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు త్రిస్సూర్ లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య రమ్య, పిల్లలు రాజేష్, ప్రీతి, సోను ఉన్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
మోహన్ లాల్ గ్యారేజిలో ధీరూభాయ్ అంబానీ కారు
ప్రముఖ మలయాళీ నటుడు 'మోహన్ లాల్' గురించి దాదాపు అందరికి తెలుసు. తనదైన నటనతో ప్రేక్షలకులను ఆకట్టుకున్న ఈయన తెలుగు ప్రేక్షలకులకు కూడా సుపరిచయమే. మోహన్ లాల్ ఇతర సెలబ్రిటీల మాదిరిగానే ఎప్పటికప్పుడు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ కారణంగానే అతని గ్యారేజిలో చాలా కార్లు ఉన్నాయి. ఇందులో ధీరూభాయ్ అంబానీకి చెందిన పాతకాలపు కాడిలాక్ కారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మోహన్ లాల్ గ్యారేజిలో ఎన్ని కార్లు ఉన్నప్పటికీ హిందూస్తాన్ అంబాసిడర్, కాండిలాక్ కార్లు చాలా ప్రత్యేకం. eisk007 ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడైన ఫొటోలో ఈ పాతకాలపు కారుని చూడవచ్చు. ఆ కారు పక్కన ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ బాలాజీ ఉండటం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. దీనిని బాలాజీ కొనుగోలు చేసినట్లు చెబుతారు. ఆయన స్వయానా మోహన్ లాల్ మామగారు. ఆయన నిర్మించిన చాలా సినిమాల్లో ఈ కారు ఉపయోగించినట్లు సమాచారం. ఫొటోలో కనిపించే ఈ కారు 1958 మోడల్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాడిలాక్ సెడాన్ అని తెలుస్తోంది. ఇది ఒకప్పుడు ధీరూభాయ్ అంబానీ ఉపయోగించినట్లు చెబుతున్నారు. ఇది పాతకాలపు కారు అయినప్పటికీ ఇప్పటికీ కొత్తగా కనిపిస్తోంది. దీనికి MAS 2100 నెంబర్ ఉంది. ఈ కారుని ఎప్పుడు కొనుగోలు చేశారనేదానికి ఖచ్చితమైన అధరాలు లేవు. ప్రస్తుతం ఈ మోడల్ కారు మార్కెట్లో లేదు. (ఇదీ చదవండి: భారత్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి టాప్ 5 కార్లు - ధరలు ఎలా ఉన్నాయంటే?) భారతీయ మార్కెట్లో ఒకప్పుడు కాడిలాక్ కారు వివిధ రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభించేది. అయితే మోహన్ లాల్ గ్యారేజిలో ఉన్న ఆ కారు ఇంజిన్ స్పెషిఫికేషన్స్ కూడా వెలుగులోకి రాలేదు. కానీ ఇప్పటికీ మంచి కండిషన్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మోహన్ లాల్ గ్యారేజిలో టొయోట వెల్ఫైర్, ఇన్నోవా క్రిష్టా, టయోటా ల్యాండ్ క్రూయిజర్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్350, లంబోర్ఘిని ఉరుస్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by Eisk007 (@eisk007) -
వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి?
దాగుడు మూతలాట ఆడుకోని వాళ్లుండరు... కళ్లకు గంతలు కట్టి పేర్లు అడిగితే చెప్పాలి. ఇది రియల్ ఆట. రీల్ గేమ్ విషయానికి వస్తే.. గంతలు కట్టకుండా.. ఆర్టిస్ట్‌ని ఎదురుగా నిలబెట్టి, ‘వీరి పేరేమి’ అని అడిగితే.. ఆ ఆర్టిస్ట్నిగుర్తుపట్టడానికి కాస్త టైమ్ పడుతుంది. అసలు గుర్తు పట్టకపోవచ్చు కూడా. అంతలా కొందరు స్టార్స్ క్యారెక్టర్లలో ఒదిగిపోయారు. ఫిజికల్ మేకోవర్‌తో, మేకప్‌తో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆ హీరోల గురించి తెలుసుకుందాం. ♦ పాత్రల కోసం రూపా న్ని మార్చుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు విక్రమ్. ‘శివపుత్రుడు, అపరిచితుడు, ఐ’ వంటి చిత్రాలు అందుకు నిదర్శనం. తాజాగా ‘తంగలాన్’లో కొత్త అవతారంలో కనిపించనున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మాస్ లుక్‌లో కనిపించనున్నారు విక్రమ్. గనుల తవ్వకాల పనులు చేసే వ్యక్తుల జీవితాల నేపథ్యంలో దర్శకుడు పా . రంజిత్ పా న్ ఇండియా మూవీగా ‘తంగలాన్’ని తెరకెక్కిస్తున్నారు. ♦ క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే అలా మారిపోవాలనుకుంటారు అల్లు అర్జున్. గతంలో ‘దేశ ముదురు’ సినిమా కోసం సిక్స్ ΄్యాక్ చేశారు. తాజాగా ‘పుష్ప’ కోసం ఫిజికల్ మేకోవర్‌తో పా టు మేకప్ పరంగానూ వ్యత్యాసం చూపించారు. స్మగ్లర్ పుష్పరాజ్‌గా తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో రెచ్చి పోయారు అల్లు అర్జున్. మలి భాగం ‘పుష్ప:ది రూల్’ చిత్రీకరణ జరుగుతోంది. కాగా.. పుష్పరాజ్‌గా గుర్తు పట్టలేనంతగా అల్లు అర్జున్ మారలేదు. కానీ రెండో భాగంలో జాతర బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఒక ఫైట్‌లో గుర్తు పట్టలేని విధంగా మారిపోయారు. పండగ చివరి రోజు స్త్రీ వేషధారణలో పురుషులు చెడును నాశనం చేసే గంగమ్మ తల్లిగా మారతారని, ఈ ఫైట్‌లో అల్లు అర్జున్ గెటప్ అదే అని తెలిసింది. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ♦ దుర్గ, పరశురామ్, డీజే.. ఈ మూడు పా త్రల్లో సుధీర్‌బాబు కనిపించనున్న చిత్రం ‘మామా మశ్చింద్ర’.. వీటిలో దుర్గ పా త్ర డిఫరెంట్. ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్ అన్నమాట. మామూలుగా సు«దీర్‌బాబు చాలా స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంటారు. అయితే ఈ పా త్రలో అందుకు భిన్నంగా బొద్దుగా కనబడతారు. హర్షవర్ధన్ దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది, ♦ అటు మలయాళంకి వెళితే సీనియర్ హీరో మోహన్‌లాల్, యంగ్ హీరో పృథ్వీ రాజ్కుమారన్లు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు. మోహన్‌లాల్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్’. వాస్కో డి గామా నిధిని రక్షించడానికి నియమించబడిన 400 ఏళ్ల నాటి ఆత్మ బర్రోజ్. ఆ నిధిని వాస్కో అసలు వారసునికి అప్పగించడానికి ఆ ఆత్మ వేచి ఉంటుంది. కాల్పనిక కథతో త్రీడీ చిత్రంగా ‘బర్రోజ్’ రూపొందుతోంది. కాగా ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేయడంతో పా టు మోహన్ లాల్ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ♦ మరో మలయాళ హీరో–దర్శకుడు పృథ్వీ రాజ్కుమారన్ గొర్రెల కాపరిగా కనిపించనున్న చిత్రం ‘ఆడు జీవితం’. 2008లో ఇదే పేరుతో వచ్చిన నవల నేపథ్యంలో బ్లెస్సీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నజీబ్ అనే మలయాళీ వలస కార్మికుడి పా త్రలో పృథ్వి రాజ్ కనిపిస్తారు. సౌదీ అరేబియాకి వలస వెళ్లిన నజీబ్‌ను గొర్రెల కాపరిని చేసి, బలవంతంగా బానిసత్వంలోకి నెట్టివేస్తారు. నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రం సాగుతుంది. సవాళ్లను ఇష్టపడని స్టార్స్ ఉండరు. అయితే సవాళ్లు అరుదుగా వస్తుంటాయి. అందుకే చాలెంజింగ్ రోల్స్ వచ్చి నప్పుడు ‘సై’ అంటూ ఎంత కష్టపడటానికైనా సిద్ధపడిపోతారు. ఈ సవాళ్లు స్టార్స్‌కి కిక్కే.. అభిమానులకూ కిక్కే. సినిమా సరిగ్గా క్లిక్ అయితే బాక్సాఫీస్కీ కిక్కే. -
Malaikottai Vaaliban: మోహన్‌లాల్ యువకుడు!
ఆరు పదుల వయసులో ఉన్న మోహన్‌లాల్‌ని యువకుడు అంటున్నారు దర్శకుడు లిజో జోస్ పెల్లిసరీ. మోహన్‌లాల్ టైటిల్ రోల్లో లిజో జోస్ పెల్లిసరీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మలైకోట్టై వాలిబన్’ (మలైకోట యువకుడు అని అర్థం). ఈ చిత్రంలోని మోహన్‌లాల్ లుక్‌ని విడుదల చేశారు. ఓ యాక్షన్ సీన్‌కి సంబంధించిన లుక్ ఇది. ‘‘జనవరి 18న రాజస్థాన్‌లోని జై సల్మేర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాం. హై బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు ఇతర ప్రముఖ భాషల్లో విడుదల చేస్తాం’’ అని చిత్రనిర్మాతలు షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్ పేర్కొన్నారు. -
లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో మోహన్ లాల్ (ఫొటోలు)
-
లగ్జరీ కారు కొన్న మోహన్ లాల్.. వామ్మో అన్ని కోట్లా?
మలయాళ సీనియర్ నటుడు మోహన్‌లాల్ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశారు. బ్రిటన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రేంజ్ రోవర్ కొత్త మోడల్ ఆటో బయోగ్రఫీని తన ఇంటికి తీసుకొచ్చారు. ఈ కారు ధర దాదాపుగా రూ.4 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాాగా.. మోహన్‌లాల్ వద్ద ఇప్పటికే 3 కోట్ల రూపాయల ఖరీదు చేసే లంబోర్గినీ కారును కలిగి ఉన్నాడు. టయోటా వెల్ఫైర్ రూ. 1 కోటి, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ 350(సుమారు రూ. 80 లక్షలు), టయోటా ల్యాండ్ క్రూయిజర్ (సుమారు రూ. 2 కోట్లు) మోహన్ లాల్ వద్ద ఉన్నాయి. ప్రస్తుతం అతని గ్యారేజీలో ఉన్న అత్యంత ఖరీదైన కారుగా రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ నిలవనుంది. కాగా.. మోహన్‌లాల్ ఇటీవలే రాజస్థాన్‌లో తన రాబోయే చిత్రం మలైకోట్టై వాలిబన్ షెడ్యూల్‌ను ముగించారు. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిసేరి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ లాల్ రజనీకాంత్ జైలర్‌లో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. New one to the garage 🚗#RangeRover @Mohanlal #Mohanlal #MalaikottaiVaaliban pic.twitter.com/2bZBuBKL3K — Mohanlal Fans Club (@MohanlalMFC) April 10, 2023 -
నేను చనిపోయేలోపు మోహన్‌లాల్ బండారం బయటపెడతా: నటుడు
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు సీనియర్ నటుడు శ్రీనివాసన్. దివంగత నటుడు ప్రేమ్ నజీర్ డైరెక్ట్ చేయాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమాను మోహన్‌లాల్ తిరస్కరించాడని, కానీ మీడియా ముందు మాత్రం మాట మార్చాడని ఆరోపణలు గుప్పించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాసన్ మాట్లాడుతూ.. 'ప్రేమ్ నజీర్‌కు మోహన్‌లాల్‌తో ఓ సినిమా తీయాలని ఎంతో కోరికగా ఉండేది. కడతనందన్ అంబాడీ సినిమా సెట్లో ప్రేమ్ నాకు ఈ విషయం చెప్పాడు. మరింకే, మోహన్‌లాల్‌కు సూటయ్యేలా మంచి కథ రాసుకోమని సూచించాను. దీంతో ఓ కథ సిద్ధం చేసుకుని మోహన్‌లాల్‌కు వినిపిస్తే అతడు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. తర్వాత నేను ఓసారి నడరాజన్ అనే మధ్యవర్తి ద్వారా కథ వినిపిస్తే ఏకంగా అతడిని తిట్టాడు కూడా! అదే కథ 'సందేశం'గా రిలీజైంది. నిజానికి ఈ సినిమా కోసం ప్రేమ్.. మోహన్‌లాల్‌కు ముందుగానే అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అప్పుడు ఆయన ఎంగేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికే ప్రేమ్ కన్నుమూశాడు. అతడు చనిపోయినప్పుడు మాత్రం మోహన్‌లాల్.. ప్రేమ్ సినిమాలో నటించాలనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది అని కపట మాటలు మాట్లాడాడు. నేను చచ్చేలోపు కచ్చితంగా అతడి నిజస్వరూపాన్ని మొత్తం బయటపెడతా' అని పేర్కొన్నాడు. శ్రీనివాసన్ వ్యాఖ్యలపై ప్రేమ్ నజీర్ తనయుడు షానవాజ్ స్పందిస్తూ.. 'నాన్నగారు మోహన్‌లాల్‌తో సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే! మోహన్‌లాల్ ఎప్పుడూ ప్రియదర్శన్‌ను వెంటేసుకుని స్క్రిప్ట్ డిస్కషన్స్‌కు వస్తుండేవారు. మరి ఆ కథ ఎందుకు పట్టాలెక్కలేదనేది ఎవరికీ తెలియదు. కానీ ఓ విషయం మాత్రం చెప్పగలను.. శ్రీనివాసన్ చెప్పాడంటే కచ్చితంగా అందులో నిజం ఉండే ఉంటుంది. ఆయన మాటలను నమ్మకుండా ఉండలేం' అని చెప్పుకొచ్చాడు. నటుడు ప్రేమ్ నజీర్ -
కొచ్చిలో జైలర్
కొచ్చికి మకాం మార్చారు ‘జైలర్’. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జైలర్’. శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా కీలక పాత్రధారులుగా, ఓ అతిథి పాత్రలో మోహన్‌లాల్ నటిస్తున్నారు. ‘జైలర్’ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల కొచ్చిలో ప్రారంభమైంది. రజనీకాంత్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో పది రోజులు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని సమాచారం. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘గెస్ట్’గా వచ్చేస్తున్న స్టార్ హీరోలు!
ఒక స్టార్ సినిమాలో మరో స్టార్ కనిపిస్తే.. ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్‌కి పండగే పండగ. అలా కాకుండా ఓ మామూలు బడ్జెట్ సినిమాలో ఒక స్టార్ గెస్ట్‌గా కనిపించినా ఆ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. ఇలా ఫ్యాన్స్ పండగ చేసుకునే ‘గెస్ట్’ రోల్స్‌లో కొందరు స్టార్స్ కనిపించనున్నారు. ఈ ‘స్టార్ గెస్ట్’ల గురించి తెలుసుకుందాం. గ్రౌండ్లో తలైవర్ క్రికెట్ గ్రౌండ్లో అతిథిగా ‘లాల్ సలామ్’ అంటున్నారు తలైవర్ (నాయకుడు) రజనీకాంత్. తమిళ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ముఖ్య తారలుగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘లాల్ సలామ్’. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో రజనీకాంత్ గెస్ట్ రోల్ చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో రజనీకాంత్‌కు చెల్లెలి పాత్రలో నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ నటించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అతిథిగా ఖైదీ ‘జైలర్’ కోసం రజనీకాంత్‌కు గెస్ట్ అయ్యారు మోహన్‌లాల్. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్‌లాల్ గెస్ట్ రోల్ చేశారు. ఇందులో ఆయన ఓ ఖైదీ పాత్రలో కనిపిస్తారట. ఆల్రెడీ మోహన్‌లాల్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. భాయ్‌కి గెస్ట్ సిల్వర్ స్క్రీన్‌పై సల్మాన్ భాయ్‌కి గెస్ట్ అయ్యారు రామ్‌చరణ్. సల్మాన్ ఖాన్, వెంకటేశ్, పూజా హెగ్డే, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రంజాన్ సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ఓ గెస్ట్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్, వెంకటేశ్‌లపై చిత్రీకరించిన ఓ పాటలో రామ్‌చరణ్ గెస్ట్‌గా కనిపిస్తారు. నిర్మాతే అతిథి! సూర్య కెరీర్లో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశమే హద్దురా..!) ఒకటి. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీలో రీమేక్ అవుతోంది. బాలీవుడ్ కిలాడి అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సుధానే హిందీ రీమేక్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ వెర్షన్లో హీరోగా నటించిన సూర్య హిందీ రీమేక్‌కి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు... ఈ రీమేక్‌లో సూర్య ఓ గెస్ట్ రోల్ కూడా చేశారు. కబ్జా కోసం... ఉపేంద్ర ‘కబ్జా’కు సాయం చేశారు శివ రాజ్‌కుమార్. ఉపేంద్ర, సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఓ గెస్ట్ రోల్ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ‘స్టార్ గెస్ట్’ లిస్ట్‌లో మరికొందరు స్టార్స్ ఉన్నారు. -
ఇది కదా అసలు సిసలైన పాన్ ఇండియా కథ!
ఒక ‘దృశ్యం’... మలయాళంలో బంపర్ హిట్. అదే ‘దృశ్యం’... తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలోనూ సూపర్ హిట్. అందుకే ఈ ‘దృశ్యం’ దేశం దాటింది. అటు చైనా.. ఇండోనేషియాలోనూ ‘దృశ్యం’ బాక్సాఫీస్ రికార్డులు సాధించింది. ఇలా మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ ఏ భాషలో రీమేక్ అయితే ఆ భాషలో హిట్. ఇప్పుడు ఇంగ్లీష్ ‘దృశ్యం’ రానుంది. ఇంకా పలు విదేశీ భాషల్లో రీమేక్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసే సినిమాలను ‘పాన్ ఇండియా’ అంటున్నాం. ‘పాన్ ఇండియా మూవీ’ అంటే కథ కూడా ‘పాన్ ఇండియా’ది అయ్యుండాలి.‘దృశ్యం’ అలాంటి కథే. ఇది కదా... పాన్ ఇండియా కథ! ఇక ఈ ‘దృశ్యం’ గురించి తెలుసుకుందాం. తొమ్మిదేళ్ల క్రితం హీరో మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లో మలయాళంలో ‘దృశ్యం’ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో మీనా, అన్సిబా హాసన్, ఎస్తర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు. ఐదు కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. 2013 డిసెంబరు 19న విడుదలై సంచలన విజయం సాధించిందీ చిత్రం. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి జీతూ జోసెఫ్ తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఎంతగా నచ్చిందంటే.. కేరళ బాక్సాఫీస్ చరిత్రలో యాభై కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా ‘దృశ్యం’ చరిత్ర సృష్టించింది. మొత్తంగా 75 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 44 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇక ‘దృశ్యం’ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో 2020 సెప్టెంబర్‌లో ‘దృశ్యం 2’ షూటింగ్‌కు శ్రీకారం చూట్టారు మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ అండ్ ఆంటోనీ పెరుంబవూర్. తొలి భాగంలానే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో 46 రోజుల్లో షూటింగ్‌ను పూర్తి చేసి 2021 ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ‘దృశ్యం 2’ కూడా సూపర్ డూపర్ హిట్. అయితే ఓ వెలితి. అదేంటంటే.. ‘దృశ్యం 2’ థియేటర్స్‌లో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. దీనికి కారణం కరోనా. ఒకవేళ థియేటర్స్‌లో విడుదలై ఉంటే కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ నమోదై ఉండేవేమో! 2016లో విడుదలై దాదాపు రూ. 150 కోట్ల వసూళ్లను సాధించిన ‘పులిమురుగన్’(ఇందులో మోహన్‌లాల్ హీరో) రికార్డును ‘దృశ్యం 2’ బ్రేక్ చేసి ఉండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయయపడ్డాయి. తొలి ఇండియన్ మూవీ! ‘దృశ్యం’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై వీక్షకుల, విమర్శకుల ప్రసంశలను పొందింది. దీంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మలయాళ ‘దృశ్యం’ సినిమాను 2014లో తెలుగులో ‘దృశ్యం’గా (ఇందులో వెంకటేశ్ హీరోగా నటించారు), కన్నడంలో ‘దృశ్య’ (ఇందులో రవిచంద్రన్)గా రీమేక్ చేశారు. ఆ తర్వాత 2015లో తమిళంలో ‘పాపనాశం’గా (కమల్‌హాసన్ హీరో), హిందీలో ‘దృశ్యం’ (అజయ్ దేవగన్)గా రీమేక్ చేశారు. అంతేకాదు.. ఆ తర్వాత శ్రీలంక భాషలో ‘ధర్మయుద్దాయ’ (2017)గా, చైనాలో ‘షీప్ వితవుట్ షెపర్డ్’(2019)గా ఆ తర్వాత ఇండోనేషియాలో ‘దృశ్యం’గా రీమేక్ అయ్యింది. ఇలా చైనా, ఇండోనేషియా భాషల్లో రీమేక్ అయిన తొలి ఇండియన్ మూవీ కూడా ‘దృశ్యం’ కావడం విశేషం. రీమేక్ కావడమే కాదు.. అక్కడ బాక్సాఫీస్ పరంగా హిట్ సాధించింది. కాగా, ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా 2021లో విడుదలైన మలయాళ ‘దృశ్యం 2’కి కూడా డిజిటల్ వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ‘దృశ్యం 2’ను తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. ‘దృశ్యం’ రీమేక్‌లో నటించిన వెంకటేశ్‌నే ‘దృశ్యం 2’లోనూ నటించారు. కోవిడ్ వల్ల ఈ చిత్రం 2021 నవంబరు 25న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. కాగా ‘దృశ్యం 2’ హిందీ రీమేక్ గత ఏడాది నవంబరు 18న థియేటర్స్‌లో విడుదలై రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2022లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ టెన్ హిందీ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. హిందీ ‘దృశ్యం’లో నటించిన అజయ్ దేవగనే ‘దృశ్యం 2’లోనూ నటించారు. అలాగే హిందీ చిత్రం ‘దేవదాస్’ (1955) తర్వాత ఇతర భాషల్లో ఎక్కువగా రీమేక్ అవుతున్న చిత్రం ‘దృశ్యం’ అని టాక్. మాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి... ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలకు సంబంధించిన ఇంగ్లిష్, నాన్ ఇండియన్ లాంగ్వేజెస్ రీమేక్ హక్కులను పనోరమ స్టూడియోస్ ఇంటర్నేషనల్ సంస్థ దక్కించుకుంది (ఫిలిప్పినో, ఇండోనేషియా, సింహళ భాషల హక్కులు మాత్రం కాదు.. ఎందుకంటే ఈ భాషల్లో ఆల్రెడీ ‘దృశ్యం’ రీమేక్ అయ్యింది). ‘‘దృశ్యం’, ‘దృశ్యం 2’ల ఫారిన్ లాంగ్వేజెస్ హక్కులను దక్కించుకున్నాం. జపాన్, కొరియా, హాలీవుడ్లో ‘దృశ్యం’ను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాం. ‘దృశ్యం 2’కు చెందిన చైనీస్ రీమేక్ హక్కులు కూడా మా వద్దే ఉన్నాయి’’ అని పనోరమ స్టూడియోస్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కథ ఏంటంటే... సినిమాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తండ్రి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన పెద్ద కుమార్తెను ఊహించని ఆపాయం నుంచి ఎలా రక్షించుకోగలిగాడు? ఈ ప్రయత్నంలో ఓ పోలీసాఫీసర్ కుమారుడి హాత్య కేసును చేధించాలనుకునే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యూహాలకు ఎటుంవంటి ప్రతివ్యూహాలు రచించి, ఆ తండ్రి సక్సెస్ అయ్యాడు అన్నదే ఈ చిత్రకథ. మోహన్‌లాల్, జీతూ జోసెఫ్, ఆంటోనీల కాంబినేషన్లో ‘దృశ్యం 3’ కూడా రానుంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో ‘దృశ్యం 3’ ఉంటుందన్నారు ఆంటోనీ. చదవండి: నాకు బుద్ధి తక్కువై అలా చేశాను.. చీటింగ్‌పై స్పందించిన సింగర్ -
Mohanlal: వందల కోట్ల స్టార్ హీరోకి దారుణ పరిస్థితి!
మాలీవుడ్ స్టార్ హీరోల్లో మోహన్‌లాల్ ఒకరు. ఆరు పదుల వయస్సులో కూడా కుర్ర హీరోలు సైతం షాక్ అయ్యేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అక్కడ లాల్ నటించిన చిత్రాలను టాలీవుడ్లో రీమేక్ చేస్తున్నాం. అయితే ఇదంత కాయిన్‌కి ఒకవైపే. మరోవైపు మాలీవుడ్‌లో మోహన్‌లాల్ పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు లాల్ సినిమా అంటే వంద కోట్ల కలెక్షన్స్.. కాని ఇప్పుడు కనీసం కోటి రూపాయల కలెక్షన్స్ కూడా దాటడం లేదు. రెండేళ్ల క్రితం వరకు మోహన్‌లాల్ మాలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసిస్తూ వచ్చాడు. పులి మురుగన్ సినిమాతో మాలీవుడ్‌కు రూ.100 కోట్లు, లూసీఫర్ తో రూ.150 కోట్ల వసూళ్లను చూపించాడు. అయితే కరోనా తర్వాత మోహన్‌లాల్‌కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ స్టార్ హీరో గతేడాది మాన్స్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఇక ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన అలోన్ (Alone) సినిమాకు అయితే తొలి రోజే గెటివ్ టాక్ రావడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. అసలు ఇలాంటి కథను మోహన్‌లాల్ లాంటి స్టార్ హీరో ఎలా అంగీకరించారంటూ కొంత మంది విమర్శకులు కామెంట్ చేశారు. ఫలితంగా ఈ చిత్రం తొలి రోజు వసూళ్లు రూ.40 లక్షలు కూడా దాటలేదు. దీంతో లాల్ ఫ్యూచర్‌పై మాలీవుడ్‌లో టెన్షన్ మొదలైంది. కానీ ఈ బిగ్‌స్టార్ త్వరలోనే స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్ చేతిలో లూసీఫర్ 2, దృశ్యం3 చిత్రాలు ఉన్నాయి. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. -
జైలర్‌కు అతిథిగా...
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలో మలయాళ స్టార్ మోహన్‌లాల్ కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ‘జైలర్’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో, తమన్నా కీ రోల్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో మోహన్‌లాల్ కూడా నటిస్తున్నట్లు తెలిసింది. మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించనునున్నారని, ఈ వారంలోనే షూటింగ్లో జాయిన్ అవుతారని కోలీవుడ్ సమాచారం. కాగా ‘జైలర్’ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలని అనుకుంటున్నారు. -
మెగాస్టార్ కోసం మరో రీమేక్ ను సిద్ధం చేసిన చరణ్
-
మోహన్ లాల్ తో వెరీ బోల్డ్ క్యారెక్టర్ చేస్తున్న : మంచు లక్ష్మి
-
ఓ కంక్లూజన్‌తో మోహన్ లాల్ 'దృశ్యం 3'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్
Mohanlal Drishyam 3 First Look Poster Released: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాలు దృశ్యం, దృశ్యం 2. మొదటగా వచ్చిన 'దృశ్యం' మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మాసీవ్ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో తెలుగు, తమిళంలో కూడా రీమేక్ కాగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది. తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనా నటించిన విషయం తెలిసిందే. ఇక దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'దృశ్యం 2' కూడా ఎంతపెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్న కూతురును, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ తండ్రి చేస్తున్న యుద్ధమే ఈ సిరీస్‌ల కథగా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ సిరీస్‌లో మూడో చిత్రం రానుంది. ఈ రెండు పార్ట్‌లకు కొనసాగింపుగా 'దృశ్యం 3' రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'దృశ్యం 3: ది కంక్లూజన్' పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో మోహన్ లాల్ సంకెళ్లతో ధీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించడం ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా పోస్టర్‌పై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. కాగా మొదటి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన జీతూ జేసేఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. మరీ ఈ మూడో చిత్రంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో వేచి చూడాల్సేందే. అలాగే ఈ మూడో భాగంతో ఓ కంక్లూజన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. #Drishyam3 The Conclusion offical announcement soon#Mohanlal @Mohanlal pic.twitter.com/X8dVERlaTR — Shivani Singh (@lastshivani) August 13, 2022 #Drishyam3 George Kutty & Family are coming back! pic.twitter.com/VUoT6m0gLF — Christopher Kanagaraj (@Chrissuccess) August 13, 2022 -
మోహన్ లాల్‌కు ఈడీ నోటీసులు.. ఎందుకంటే ?
Mohanlal Questioned By Ed In Money Laundering Case With Monson Mavunkal: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చిక్కుల్లో పడ్డారు. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు మోహన్ లాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మోహన్ లాల్‌కు నోటీసులు పంపింది. వచ్చే వారం కొచ్చి ఈడీ కార్యాలయంలో మోహన్‌లాల్‌ను అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మాన్కల్‌తో కలిసి మోహన్ లాల్ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ప్రజలను రూ. 10 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై మాన్సన్‌ను గత సెప్టెంబర్‌లోనే కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కేరళలో ఉన్న మాన్సన్ ఇంటికి మోహన్ లాల్ ఒకసారి వెళ్లినట్లు సమాచారం. అయితే అలా మోహన్ లాల్ వెళ్లడానికి కారణాలు తెలియరాలేదు. 'కేరళకు చెందిన మాన్సన్ మాన్కల్ కొన్నేళ్లుగా పురాతన కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ వాటిని అమ్మి రూ. 10 కోట్ల వరకు మోసం చేశాడు. అతని దగ్గర టిప్పు సుల్తాన్ సింహాసనం, మోసెస్ సిబ్బంది, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాఝీ భగవద్గీత కాపీ, సెయింట్ ఆంటోనీ వేలిగోరు వంటి వస్తువులు ఉన్నాయని చెప్పాడం అబద్ధం.' అని కేరళ పోలీసులు తెలిపారు. కాగా కేరళలోని అలప్పుజా జిల్లాలో నకిలీ పురాతన వస్తువులు విక్రయిస్తున్నాడని 52 ఏళ్ల యూట్యూబర్‌ను కూడా కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4431454862.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మోహన్ లాల్ మరో క్రైమ్ థ్రిల్లర్ '12th మ్యాన్'.. నేరుగా ఓటీటీలోకి
12th Man: Jeethu Joseph Mohanlal Locked Thriller Trailer Released: క్రైమ్ థ్రిల్లర్ జానర్స్తో ప్రేక్షకులను కట్టిపడేసే చిత్రాలను తెరకెక్కించే మలయాళ దర్శకులలో జీతు జోసేఫ్ ముందుంటారు. ఆయన తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఎంతటి హిట్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆయన మరో క్రైమ్ థ్రిల్లర్‌ను రూపొందించారు. విలక్షణ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది '12th మ్యాన్' చిత్రం. (చదవండి: వావ్.. సినీ ప్రియులకు ఇక పండగే.. ఓటీటీలో ఏకంగా 40) ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా మే 20 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటిస్తూ ట్రైలర్ విడుదల చేసింది. 11 మంది స్నేహితులు వెకేషన్‌కు వెళ్లినప్పుడు వారితో 12వ మనిషి కలుస్తాడు. ఆ 12వ మనిషి ఎవరు ? మిగతా 11 మందికి అతనికి ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయాలతో ట్రైలర్ ఉత్కంఠగా సాగింది. ట్రైలర్ చూస్తుంటే క్రైమ్‌తోపాటు, లాక్డ్ థ్రిల్లర్‌లా ఉంది. ఈ మూవీ కూడా దృశ్యం, దృశ్యం 2 సినిమాల్లానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని తెలుస్తోంది. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన ఆహా, మేలో ఏకంగా 40+ మూవీస్! 12th Man Official Trailer Out Now!!! Watch Here👉 https://t.co/5oyPiQhpH3#12thMan streaming from May 20 on @DisneyPlusHS #12thManOnHotstar @Mohanlal @aashirvadcine @KurupSaiju @Iamunnimukundan @JeethuJosephDir @12thManMovie @sethusivanand @SshivadaOffcl @DisneyplusHSMal pic.twitter.com/tUxENWUIKz — DisneyPlus Hotstar Malayalam (@DisneyplusHSMal) May 3, 2022 -
తెలుగులో విడుదల కానున్న మోహన్‌లాల్ సినిమా
మూడు జాతీయ అవార్డులు (బెస్ట్ పిక్చర్, బెస్ట్ వీఎఫ్ఎక్స్, బెస్ట్ కాస్ట్యూమ్స్) సాధించిన మలయాళ చిత్రం ‘మరక్కార్: ది అరబికడలింటే సింహం’ చిత్రం తెలుగులో విడుదల కానుంది. మోహన్‌లాల్ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రాన్ని ‘మరక్కార్: అరేబియా సముద్ర సింహం’ టైటిల్‌తో సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఈ చిత్రం ఈ డిసెంబరు 2న రిలీజ్ కానుంది. అర్జున్, సునీల్ శెట్టి, సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తీ సురేష్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్‌లాల్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. ‘‘ఈ చిత్రం నుంచి విడుదలైన ‘కనులను కలిపినా’ పాటకు మంచి స్పందన లభి స్తోంది. సినిమాకూ మంచి ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
మోహన్‌లాల్ మరక్కర్ చిత్రం థియేటర్లోనే..
Mohanlals Marakkar To Release In Theatres: ‘మరక్కర్’ థియేటర్స్‌కే వస్తున్నాడు. ప్రచారంలో ఉన్నట్లు ఓటీటీలోకి కాదు. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ టైటిల్ రోల్లో నటించిన మలయాళ చిత్రం ‘మరక్కర్: అరబికడలింటే సింహమ్’. 15వ శతాబ్దానికి చెందిన న్యావల్ చీఫ్ మహ్మద్ అలీ మరక్కర్ అలియాస్ కుంజాలి మరక్కర్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. అర్జున్, సునీల్ శెట్టి, కీర్తీ సురేశ్, మంజు వారియర్, కల్యాణీ ప్రియదర్శన్ ఈ చిత్రంలో కీలక పాత్రధారులు. ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనే వార్తలకు ఫుల్స్టాప్ పడేలా.. ‘‘ఇంతకాలం సీల్ చేసి ఉన్న విషయాన్ని బ్రేక్ చేసి, స్టన్నింగ్ సర్ప్రైజ్గా చెబుతున్నాం. ‘మరక్కర్’ చిత్రం థియేటర్స్‌లో ఈ ఏడాది డిసెంబరు 2న విడుదల కానుంది’’ అని శుక్రవారం మోహన్‌లాల్ స్పష్టం చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అనువాదమై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. 67వ జాతీయ అవార్డ్స్‌లో ఈ చిత్రం మూడు (బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ కాస్ట్యూమ్) విభాగాల్లో అవార్డులు సాధించిన విషయం తెలిసిందే. -
ఓ సౌత్ ఇండియా సినిమా మూడు విదేశీ భాషల్లోకి..
ఓ భాషలో హిట్ అయిన కథలను మరో భాషలో రీమేక్ చేయడం సినీ పరిశ్రమల్లో మాములుగా జరిగేదే. కానీ ఓ భారతీయ సినిమా విదేశీ భాషల్లో రీమేక్ అవడం మాత్రం అరుదనే చెప్పాలి. అది ఓ సౌత్ ఇండియన్ మూవీ అవడం చాలా తక్కువ. ఇప్పుడు మాలయాళం సూపర్ హిట్ సినిమా ‘దృశ్యం’ త్వరలో ఇండోనేషియా లాంగ్వేజ్‌లోకి వెళ్లనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మోహన్‌లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ‘దృశ్యం’ ఇప్పటి వరకు 4 భారతీయ భాషలు, 2 విదేశీ భాషల్లో రీమేకైంది. ఇండియన్ లాంగ్వేజేస్‌తోపాటు చైనీస్, శ్రీలంకన్ భాషల్లో విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇండోనేషియా భాషలో నిర్మితం కానుంది. ఇలా మా సినిమా సరిహద్దులను చెరిపేస్తూ దూసుకుపోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది’ అని ఆంటోని తెలిపాడు. ఈ చిత్రాన్ని ఇండోనేషియాలో జకార్తాలోని పీటీ ఫాల్కన్ అనే సంస్థ నిర్మించనుంది. చైనీస్‌లో రీమేక్ అయిన మొదటి మలయాళ చిత్రం ఇదే కావడం విశేషం. చదవండి: ‘దృశ్యం 2’ అరుదైన రికార్డు, ఇండియన్ సినిమాల్లో అత్యధిక రేటింగ్ కాగా, ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం 2’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్‌లో ఈ ఫిబ్రవరి విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ చిత్రం కూడా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్‌లు అవుతోంది. View this post on Instagram A post shared by Antony Perumbavoor (@antonyperumbavoor) -
ఒకే ఫ్రేమ్‌లో మోహన్‌లాల్, మల్లిక.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్
‘ఒకే ఫ్రేమ్‌లో గొప్ప నటుడిని, గొప్ప తల్లిని చూడడం, దానికి నేను దర్శకత్వం వహించడం ఎంతో ఆనందంగా ఉంది’అని సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు మలయాళ ప్రముఖ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజాగా చిత్రం ‘బ్రో డాడీ’. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ తల్లి మల్లిక సుకుమారన్, మళయాళ సూపర్‌స్టార్ మెహన్‌లాల్ నటిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫోటోని తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ పై వ్యాఖ్యలు చేశాడు డైర్టెర్ పృథ్వీరాజ్. దీనికి "చివరికి ఇది జరగడం ఆనందంగా ఉంది" అంటూ పృథ్వీరాజ్ భార్య సుప్రియ కామెంట్ పెట్టారు. (చదవండి: బిగ్‌బాస్: ఐదో సీజన్లో కీలక మార్పులు.. సక్సెస్‌పై అనుమానాలెన్నో!) కాగా, పృథ్వీరాజ్ తల్లిదండ్రులు లేట్ సుకుమారన్, మల్లిక ఇద్దరు మళయాళ సినీ పరిశ్రమలో గుర్తింపుపొందిన నటీనటులే. అంతేకాకుండా గతంలో మెహన్‌లాల్ నటించిన లూసిఫర్ సినిమాలో పృథ్వీరాజ్ ముఖ్యపాత్రలో నటించారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న "బ్రో డాడీ"లో కళ్యాణి ప్రియదర్శన్, మీనా వంటి గుర్తింపు పొందిన నటీనటులతో పాటు పృథ్వీరాజ్ సైతం ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) -
విషాదం: ప్రముఖ నిర్మాత మృతి.. సీఎం సంతాపం
తిరువనంతపురం: ప్రఖ్యాత చెఫ్, మలయాళ సినీ నిర్మాత నౌషద్(55) మరణించారు. తిరువల్లలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఇటీవలే కోవిడ్ బారిన పడిన నౌషద్.. ఉదర సంబంధిత నొప్పితో రెండు వారాల క్రితం నౌషద్ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో నేటి ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ నెల 12న నౌషద్ భార్య షీబా గుండెపోటుతో మరణించారు. 15 రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో కుటుంబలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులను కోల్పోయిన నౌషద్ కూతురు నష్వా(13)ను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నౌషద్ ది బిగ్ చెఫ్ పేరిట నౌషద్ నెలకొల్పిన రెస్టారెంట్, కాటెరింగ్ గ్రూపునకు మంచి గుర్తింపు ఉంది. అతడు చేసే రుచికరమైన వంటలంటే సెలబ్రిటీలకు మహా ప్రీతి. ఇక పలు స్థానిక టీవీ చానెళ్లలో కుకరీ షోలతో అలరించే నౌషద్ మమ్ముట్టి నటించిన కజా సినిమా(2005)తో నిర్మాతగా మారారు. చట్టంబి నాడు, లయన్, బెస్ట్ యాక్టర్, స్పానిష్ మసాలా వంటి చిత్రాలను నిర్మించారు. సీఎం విజయన్, సినీ ప్రముఖులు సంతాపం నౌషద్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అదే విధంగా మమ్ముట్టి, మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితర సినీ ప్రముఖులు నౌషద్ లేనిలోటు తీరనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. చదవండి: Amitabh Bachchan : తన జీతంపై క్లారిటీ ఇచ్చిన బిగ్‌బీ బాడీగార్డు Rest in peace. #Noushad 🙏 pic.twitter.com/r3cbCVMTIf — Prithviraj Sukumaran (@PrithviOfficial) August 27, 2021 Dearest Naushad, The food that you served became Celestial because of the love that you bestowed upon the served. Adieu, my friend. pic.twitter.com/CU2R8AkGiu — B Unnikrishnan (@unnikrishnanb) August 27, 2021 -
దర్శకుడిగా మారిన మలయాళ స్టార్ హీరో
యాక్టర్ మోహన్ లాల్ మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా మారారు. మోహన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ డీ గామా ట్రెజర్’ సినిమా ప్రారంభోత్సవం కొచ్చిలో జరిగింది. మలయాళ దర్శకుడు, నటుడు జిజో పున్నూస్ రచించిన ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ డీ గామా ట్రెజర్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్, పృథ్వీరాజ్, స్పానిష్ యాక్టర్లు పాజ్ వేగా, రాఫెల్ అమర్గో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘‘జీవితం నన్ను నటుడిని చేసింది. ఈ ప్రయాణంలో సినిమాయే నా జీవితం.. నా జీవనాధారం అని అర్థమైంది. నటుడిగా అద్భుతమైన ప్రయాణం చేసిన నేను ఇప్పుడు దర్శకుడిగా మరో ప్రయాణాన్ని మొదలుపెట్టాను’’ అని పేర్కొన్నారు మోహన్ లాల్. ఈ సినిమా ప్రారంభోత్సవంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి పాల్గొన్నారు. చదవండి: ఖమ్మం నుంచి వచ్చి సోనాలి సూద్ పేరు చెప్పగానే.. విజయ్ దేవరకొండ పాటకి సిగ్గు పడుతూ వీడియో -
రిలీజ్ కాకముందే జాతీయ అవార్డు, అలా ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అవార్డులను ఒక సంవత్సరం పాటు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ నటించిన మరక్కార్ మళయాళ చిత్రానికి గాను ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ కేటగిరీల్లో అవార్డు లభించింది. అసలు విషయమేంటంటే.. ఈ చిత్రం ఇంకా రిలీజ్ అవ్వలేదు. విడుదల కాకముందే అవార్డును ఎలా ప్రకటించారని అందరు నివ్వెరపోయారు. ఈ చిత్రం గత ఏడాది మార్చి 26న విడుదలకావాల్సింది. లాక్ డౌన్ కారణంగా చిత్రం విడుదలకు నోచుకోలేదు. గత ఏడాదే సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రావడంతో ఈ చిత్రాన్ని 2020లో వచ్చిన చిత్రంగా జ్యూరీ పరిగణించింది. ఈ ఏడాది మే 19న మూవీని చిత్ర బృందం రిలీజ్ చేయనుంది. కాగా, జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు 4 అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో వినోదం అందించిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్‌గా మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ ఎంపికైంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నాని నటించిన ‘జెర్సీ’ (దర్శకత్వం గౌతమ్ తిన్ననూరి) అవార్డు గెలిచింది. ‘మహర్షి’ చిత్రానికి నృత్యాలు సమకూర్చిన రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా, ‘జెర్సీ’కి ఎడిటింగ్ చేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. (చదవండి: మోహన్ లాల్ కసరత్తులు.. నెటిజన్లు ఫిదా) -
దృశ్యం త్రీ కూడా ఉంది
మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. 2013లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్ భాషల్లోకి రీమేక్ అయింది. ఇటీవలే ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కించారు జీతు. ఈ సినిమా నేరుగా అమేజాన్ ప్రై మ్లో విడుదలయింది. ఈ సినిమా కూడా విశేష ప్రశంసలు అందుకుంటోంది. జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే మలయాళ ‘దృశ్యం 2’ రీమేక్‌లో వెంకటేశ్ నటించనున్నారు. తాజాగా ‘దృశ్యం 3’ కూడా ఉంటుందని ప్రకటించారు దర్శకుడు జీతు. ఆల్రెడీ మూడో భాగం కై్లమాక్స్ రాసుకున్నానని తెలిపారు. కానీ ‘దృశ్యం 3’ తెరకెక్కడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని స్పష్టం చేశారు. -
దృశ్యం సీక్వెల్లో వెంకటేశ్: ఛాన్స్ ఉందా?
మలయాళంలో 2013లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం దృశ్యం. థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ అంశాలు ఈ సినిమాను పెద్ద హిట్ చేశాయి. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనేక భాషల్లో రీమేక్ అయింది. గత దశాబద్ధంలో ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన సినిమాల్లో దృశ్యం ఒకటి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషలో రీమేక్ అయింది. చైనీస్ భాషలోనూ రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. ఏడేళ్ల తర్వాత దృశ్యానికి సీక్వెల్ తెరకెక్కించాడు దర్శకుడు జీతూ జోసెఫ్. మొదటి భాగంలో నటించిన మోహన్‌లాల్, మీనా ఇందులోనూ భార్యాభర్తలుగా నటించారు. ఈ మధ్యే సినిమా ట్రైలర్ రిలీజవగా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లు ఓపెన్ అయినా కూడా ముందస్తు ఒప్పందం ప్రకారం ఓటీటీలో విడుదల చేయక తప్పట్లేదు. దృశ్యం తెలుగు రీమేక్‌లో నటించిన వెంకటేశ్ ఇప్పుడు దాని సీక్వెల్‌పైనా దృష్టి సారించాడు. కానీ డైరెక్టర్ జీతూ దృశ్యం 2ను తెలుగులో డబ్ చేస్తుండటంతో వెంకటేశ్‌కు దాదాపు రీమేక్ ఛాన్స్ లేకుండా పోయింది. పైగా మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ఓటీటీలో అందరికీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వెంకీ దీన్ని వదిలేసుకునే అవకాశమే అధికంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ సీక్వెల్ తెలుగు రీమేక్ ఉందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం వెంకీ 'నారప్ప' సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు. 'అసురన్' రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రం మే 14న విడుదల కానుంది. వరుణ్ తేజ్‌తో కలిసి చేస్తున్న 'ఎఫ్ 3' ఆగస్టు 27న థియేటర్లలో నవ్వులు పూయించేందుకు వస్తోంది. చదవండి: వేసవిలో నారప్ప రిలీజ్.. కేజీఎఫ్ 2 బిజినెస్ మాములుగా లేదుగా.. అన్ని కోట్లా?