విషాదం: ప్రముఖ నిర్మాత మృతి.. సీఎం సంతాపం | Film Producer Celebrity Chef Naushad Passes Away At 55 | Sakshi
Sakshi News home page

Naushad: సినీ నిర్మాత, ప్రముఖ చెఫ్‌ కన్నుమూత

Published Fri, Aug 27 2021 6:02 PM | Last Updated on Fri, Aug 27 2021 7:06 PM

Film Producer Celebrity Chef Naushad Passes Away At 55 - Sakshi

తిరువనంతపురం: ప్రఖ్యాత చెఫ్‌, మలయాళ సినీ నిర్మాత నౌషద్‌(55) మరణించారు. తిరువల్లలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఇటీవలే కోవిడ్‌ బారిన పడిన నౌషద్‌.. ఉదర సంబంధిత నొప్పితో రెండు వారాల క్రితం నౌషద్‌ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో నేటి ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా ఈ నెల 12న నౌషద్‌ భార్య షీబా గుండెపోటుతో మరణించారు. 15 రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో కుటుంబలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులను కోల్పోయిన నౌషద్‌ కూతురు నష్వా(13)ను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నౌషద్‌ ది బిగ్‌ చెఫ్‌ పేరిట నౌషద్‌ నెలకొల్పిన రెస్టారెంట్‌, కాటెరింగ్‌ గ్రూపునకు మంచి గుర్తింపు ఉంది.

అతడు చేసే రుచికరమైన వంటలంటే సెలబ్రిటీలకు మహా ప్రీతి. ఇక పలు స్థానిక టీవీ చానెళ్లలో కుకరీ షోలతో అలరించే నౌషద్‌ మమ్ముట్టి నటించిన కజా సినిమా(2005)తో నిర్మాతగా మారారు. చట్టంబి నాడు, లయన్‌, బెస్ట్‌ యాక్టర్‌, స్పానిష్‌ మసాలా వంటి చిత్రాలను నిర్మించారు.

సీఎం విజయన్‌, సినీ ప్రముఖులు సంతాపం
నౌషద్‌ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అదే విధంగా మమ్ముట్టి, మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తదితర సినీ ప్రముఖులు నౌషద్‌ లేనిలోటు తీరనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.

చదవండి: Amitabh Bachchan : తన జీతంపై క్లారిటీ ఇచ్చిన బిగ్‌బీ బాడీగార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement