mammotty
-
ఈ ఫొటోలోని ఇద్దరూ స్టార్ హీరోలే.. తండ్రి కొడుకులే కానీ!
వారసత్వంతో ఎంట్రీ ఇవ్వడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఏ రంగంలో అయినా ఇది అనుకున్నంత సులభమైతే కాదు. పైన కనిపిస్తున్న పిల్లాడు కూడా అలానే తండ్రి పేరుతో సినిమాల్లోకి వచ్చాడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో సినిమాలు చేస్తూ అసలైన పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు. ఇంతలా చెప్పాం కదా మరి వీళ్లు ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: తల్లి పుట్టినరోజున తిరుమలలో జాన్వీ కపూర్)పైన ఫొటోలో కనిపిస్తున్న వాళ్లలో పిల్లాడి పేరు దుల్కర్ సల్మాన్. వ్యక్తి పేరు మమ్ముట్టి. 'సీతారామం', 'మహానటి' సినిమాలతో తెలుగులోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సృష్టించిన హీరోనే పైన ఫొటోలో ఉన్న పిల్లాడు. తండ్రి మమ్ముట్టి మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడంతో సులభంగానే దుల్కర్ ఇండస్ట్రీలోకి వచ్చేశాడు. కానీ ఎంతో కష్టపడి ఇప్పుడున్న పొజిషన్‌కి చేరుకున్నాడు.వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరైన దుల్కర్ సల్మాన్.. సొంత భాష మలయాళంలో బోలెడన్ని మూవీస్ చేశాడు. తెలుగులోనూ మహానటి, సీతారామం చేశాడు. ప్రస్తుతం 'లక్కీ భాస్కర్' అనే మూవీ చేస్తున్నాడు. తమిళం, హిందీలోనే ఇదివరకే హీరోగా మూవీస్ చేసి మరీ హిట్స్ కొట్టాడు. పేరుకే తండ్రి కొడుకు గానీ మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్.. దేశవ్యాప్తంగా ఒకరిని మించి మరొకరు గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.(ఇదీ చదవండి: ఉన్న కార్లు అమ్మేసి కొత్త కారు కొన్న దళపతి విజయ్) -
ఓటీటీలోకి మెగాస్టార్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరో క్రేజీ హిట్ సినిమా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. మొన్నీమధ్య థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు మూడు వారాలు తిరక్కుండానే సినీ ప్రేమికుల్ని అలరించేందుకు సిద్ధమైపోయింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో నెటిజన్స్ అలెర్ట్ అయిపోతున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది? ఫిబ్రవరిలో మలయాళ ఇండస్ట్రీ వరస హిట్స్ కొట్టింది. ప్రేమలు, భ్రమయుగం, మంజుమల్ బాయ్స్.. ఇలా వారానికొకటి చొప్పున అద్భుతమైన సక్సెస్ అందుకున్నాయి. వీటిలో మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'భ్రమయుగం' మూవీ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాలంలోనూ బ్లాక్ అండ్ వైట్ కలర్లో తీసి సాహసం చేశారు. అలానే కేవలం మూడే పాత్రలతో దాదాపు రెండున్నర గంటల సినిమా చూపించారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) హారర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా తొలుత మలయాళంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇది జరిగిన వారానికే అంటే ఫిబ్రవరి 23న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేశారు. ఇక్కడ ఓ తరహా ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని సోని లివ్ ఓటీటీలో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. 'భ్రమయుగం' కథ విషయానికొస్తే.. 17వ శతాబ్దంలో మలబారు తీరం. ఓ రాజ్యంలో రాజు దగ్గర గాయకుడిగా పనిచేసే దేవన్(అర్జున్ అశోకన్).. అడవిలో తప్పిపోయి కుముదన్ పొట్టి (మమ్ముట్టి) ఉంటున్న ఇంటికి చేరుకుంటాడు. అనుకోని పరిస్థితుల్లో అక్కడే ఆశ్రయం పొందుతాడు. అయితే ఎన్నిసార్లు తప్పించుకోవాలని చూసినా సరే దేవన్ అక్కడి నుంచి బయటపడలేకపోతాడు. చివరకు ఏమైంది? ఇంతకు పొట్టి ఎవరు? అనేది స్టోరీ. (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) The iconic Mammootty stars in Bramayugam, a black and white masterpiece, shrouded in mystery and horror! Get ready for a cinematic experience unlike any other. Streaming on Sony LIV from March 15th.#Bramayugam #SonyLIV #BramayugamOnSonyLIV #Bramayugam starring @mammukka pic.twitter.com/os5y2t8hLH — Sony LIV (@SonyLIV) March 6, 2024 -
సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ మలయాళ మూవీస్.. వీటిలో అంతలా ఏముంది?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. ఉన్నంతలో 'ఊరి పేరు భైరవకోన' మాత్రమే ఎంటర్టైన్ చేస్తోంది. మరోవైపు ఈ వారమే రిలీజైన మలయాళ చిత్రాలు 'భ్రమయుగం', 'ప్రేమలు' హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే వీటి గురించి తెలుగు ప్రేక్షకుల డిస్కస్ చేస్తుండటమే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఈ రెండు మూవీస్‌లో అంతలా ఏముంది? కలెక్షన్స్ ఎంతనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో సినిమా అంటే ఫుల్ కలర్ఫుల్గా ఉండాల్సిందే. కానీ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మాత్రం బ్లాక్ అండ్ వైట్ పద్ధతిలో తీసిన 'భ్రమయుగం'లో నటించాడు. నలుపు తెలుపు కలర్‌కి తోడు కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రానికి ఆడియెన్స్ మెల్లమెల్లగా కనెక్ట్ అవుతున్నారు. స్టోరీ పరంగా అక్కడక్కడ ల్యాగ్ ఉన్నప్పటికీ.. యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్ని టాప్ నాచ్ ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ దీనికి డిమాండ్ గట్టిగానే ఉందండోయ్. రెండు రోజుల్లోనే దీనికి రూ.10 కోట్ల వరకు వసూళ్లు దక్కాయి. (ఇదీ చదవండి: అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష) 'ప్రేమలు' అనే మలయాళ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ కూడా వారం క్రితం థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. బ్యాక్ డ్రాప్ అంతా దాదాపు హైదరాబాద్‌లోనే ఉండటంతో మనోళ్లు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. కలెక్షన్స్ కూడా రూ.35 కోట్లకు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. రూ.5 కోట్లు పెట్టి తీస్తే ఈ రేంజు వసూళ్లు వచ్చేసరికి మన నిర్మాతలు కూడా దీన్ని రీమేక్ లేదంటే డబ్బింగ్ చేసేయాలని చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలు కూడా వేటికవే విభిన్నంగా ఉండటంతో పాటు కాస్త డిఫరెంట్ ఫీల్ ఇస్తున్నాయి. హారర్ థ్రిల్లర్ కథతో తీసిన 'భ్రమయుగం' కొందరికి కనెక్ట్ కాగా.. యూత్‌కి నచ్చే విషయంలో 'ప్రేమలు' ఫుల్ మార్క్స్ కొట్టేస్తోంది. టాలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం త్వరలో వీటిని తెలుగులో కూడా డబ్ చేసి వదలబోతున్నారట. (ఇదీ చదవండి: మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్‌కి ముందే నోటీసులు) -
నెల రోజుల్లో పని పూర్తి చేసిన మెగాస్టార్
మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి కథానాయకుడిగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం భ్రమయుగం. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సంస్థల అధినేతలు చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ కలిసి నిర్మిస్తున్నారు. మమ్ముట్టి చిత్రం అనగానే కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని ప్రేక్షకులు భావిస్తుంటారు. అలాంటి కథాంశంతోనే రాహుల్ సదాశివన్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్డా రైజ్ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్ గత ఆగస్టు 17వ తేదీన కేరళ సమీపంలోని ఒట్టపాలెం ప్రాంతంలో ప్రారంభమైంది. ఈ నెల 17వ తేదీన మమ్ముట్టి పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయినట్లు నిర్మాతలు తెలిపారు. అంటే సరిగ్గా నెల రోజుల్లో మమ్ముట్టి భ్రమయుగం చిత్ర షూటింగ్ పూర్తి చేశారన్నమాట. అదేవిధంగా ఇతర నటీనటులకు సంబంధించిన సన్నివేశాలను త్వరలో పూర్తి చేసి 2024 ప్రథమార్థంలో భారీ ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. చదవండి: సూర్య బాలీవుడ్ ఎంట్రీ.. ఆ పాత్రకు సెట్టయ్యేనా? -
హీరోయిన్ సాక్షిని చాలా సార్లు తిట్టాను ఇంకా కొట్టడం ఏంటి..!
-
ఈ జేజమ్మ మళ్లీ పుడుతుందట!
ఇదేంటి ఈ ఏనుగులకు జూలు ఉంది.. భలే విచిత్రంగా ఉన్నాయే అనుకుంటున్నారా? కానీ ఇవి ఏనుగులు కాదు.. వాటి జేజమ్మలు.. అంటే ఏనుగుల పూర్వీకులన్నమాట. వీటిని వూలీ మామత్‌లు అంటారు. చూసేందుకు ఆఫ్రికా ఏనుగుల తరహాలో బలిష్టంగా కనిపిస్తూ ఒంటినిండా జూలుతో మంచు యుగంలో భూమిపై సంచరించిన జీవులివి. యూరప్, ఉత్తర అమెరికాతోపాటు ఆసియాలోని మంచు ప్రాంతాల్లో 3 లక్షల ఏళ్ల కిందట తిరిగిన ఈ జీవులు దాదాపు 10 వేల ఏళ్ల కిందటే అంతరించిపోయాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే.. ప్రఖ్యాత హాలీవుడ్ చిత్రం జురాసిక్ పార్క్‌లో జన్యు శాస్త్రవేత్తలు ఎలాగైతే అంతరించిన డైనోసార్లను ప్రతిసృష్టి చేస్తారో అదే తరహాలో వూలీ మామత్లను తిరిగి భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ కొలోస్సల్ బయోసైన్సెస్ గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏకంగా 15 లక్షల డాలర్లను కూడా సమీకరించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆ కంపెనీ బయటకు వెల్లడించనప్పటికీ డీఎన్ఏ ఎడిటింగ్ పద్ధతి ద్వారా వూలీ మామత్లను సృష్టించాలనుకుంటోంది. దీన్నే మరోలా చెప్పాలంటే వూలీ మామత్లకు అత్యంత దగ్గరి పోలికలుగల, 99% డీఎన్ఏను పోలిన ఇప్పటి ఏనుగుల డీఎన్ఏను క్రమంగా వూలీ మామత్ల తరహాలోకి మార్చుకుంటూ వెళ్లాలని భావిస్తోంది. వచ్చే 10–15 ఏళ్లపాటు ఈ ప్రక్రియపైనే పనిచేయనున్నట్లు సంస్థ చెబుతోంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే అప్పుడు వూలీ మామత్ లేదా మామత్ను పోలిన అండాలను ల్యాబ్‌లలో తయారు చేసి వాటిని ఆసియా ఏనుగుల గర్భంలో ప్రవేశపెట్టాలనేది కొలోస్సల్ బయోసైన్సెస్ లక్ష్యం. ఎందుకీ ప్రయోగం? ఆర్కిటిక్ ప్రాంతంలో మట్టి, ఇసుక, మంచుతో ఘనీభవించిన నేల (పర్మాఫ్రాస్ట్) పొరల నుంచి భూతాపం వల్ల క్రమంగా మంచు కరిగిపోతోంది. భూమిపై అత్యధికంగా కార్బన్, మీథేన్‌లను పట్టి ఉంచిన పర్మాఫ్రాస్ట్ బలహీనపడితే అది భూ వాతావరణంలోకి భారీ స్థాయిలో కార్బన్ డై ఆౖð్సడ్, మీథేన్ వాయువులను విడుదల చేస్తుంది. ఈ పరిణామం మానవాళి ఉనికికే ప్రమాదం కానుంది. ఈ నేపథ్యంలో కొలోస్సల్ బయోసైన్సెస్తోపాటు మరికొన్ని బయోటెక్నాలజీ సంస్థలు వూలీ మామత్‌లు సహా అంతరించిపోయిన ఆర్కిటిక్ ప్రాంతాల జంతువులను భారీ స్థాయిలో ప్రతిసృష్టి చేసి వాటిని సహజ ఆవాస ప్రాంతానికి తరలించాలని భావిస్తున్నాయి. ఈ జీవులు ఆర్కిటిక్‌లో సంచరిస్తే వాటి బరువు వల్ల మంచుపొరలు లోపలకు తిరిగి గట్టిపడటంతోపాటు ఆ పొరల మధ్య చిక్కుకుపోయిన ఉష్ణం వెళ్లిపోతుందని శాస్త్రవేత్తల అంచనా. ఫలితంగా పర్మాఫ్రాస్ట్‌లో చల్లదనం శాశ్వతంగా ఉండిపోతుందని.. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
పప్పులో కాలేసిన బాలీవుడ్ స్టార్.. మమ్ముట్టికి బదులు చిరుకు విషెస్
మలయాళ నటుడు, మెగాస్టార్ మమ్ముట్టి మంగళవారం (సెప్టెంబర్ 7న) 70వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఎంతోమంది నటులు, రాజకీయవేత్తలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే బాలీవుడ్ నటుడు జాకీష్రాప్ పొరపాటున మలయాళ మెగాస్టార్‌కి బదులు టాలీవుడ్ మెగాస్టార్‌కి విషెస్ తెలిపాడు. మలయాళీ నటుడు రెహమాన్ ట్విటర్లో మమ్ముక్కతో ఉన్న ఫోటోని పోస్ట్ చేసిన మమ్ముట్టికి శుభాకాంక్షలు తెలిపాడు. ఆ పోస్ట్ కింద ‘ఎప్పుడూ ఆనందంగా ఉండాలి చిరు గారు’ అంటూ జాకీష్రాప్ కామెంట్ చేశాడు. తప్పును గుర్తించిన ఓ ట్విటర్ యూజర్ తెలిపిన్పటికీ జగ్గుదాదా ఆన్లైన్ లేకపోవడంతో డిలీట్ చేయలేదు. -
విషాదం: ప్రముఖ నిర్మాత మృతి.. సీఎం సంతాపం
తిరువనంతపురం: ప్రఖ్యాత చెఫ్, మలయాళ సినీ నిర్మాత నౌషద్(55) మరణించారు. తిరువల్లలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఇటీవలే కోవిడ్ బారిన పడిన నౌషద్.. ఉదర సంబంధిత నొప్పితో రెండు వారాల క్రితం నౌషద్ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో నేటి ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ నెల 12న నౌషద్ భార్య షీబా గుండెపోటుతో మరణించారు. 15 రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో కుటుంబలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులను కోల్పోయిన నౌషద్ కూతురు నష్వా(13)ను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నౌషద్ ది బిగ్ చెఫ్ పేరిట నౌషద్ నెలకొల్పిన రెస్టారెంట్, కాటెరింగ్ గ్రూపునకు మంచి గుర్తింపు ఉంది. అతడు చేసే రుచికరమైన వంటలంటే సెలబ్రిటీలకు మహా ప్రీతి. ఇక పలు స్థానిక టీవీ చానెళ్లలో కుకరీ షోలతో అలరించే నౌషద్ మమ్ముట్టి నటించిన కజా సినిమా(2005)తో నిర్మాతగా మారారు. చట్టంబి నాడు, లయన్, బెస్ట్ యాక్టర్, స్పానిష్ మసాలా వంటి చిత్రాలను నిర్మించారు. సీఎం విజయన్, సినీ ప్రముఖులు సంతాపం నౌషద్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అదే విధంగా మమ్ముట్టి, మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితర సినీ ప్రముఖులు నౌషద్ లేనిలోటు తీరనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. చదవండి: Amitabh Bachchan : తన జీతంపై క్లారిటీ ఇచ్చిన బిగ్‌బీ బాడీగార్డు Rest in peace. #Noushad 🙏 pic.twitter.com/r3cbCVMTIf — Prithviraj Sukumaran (@PrithviOfficial) August 27, 2021 Dearest Naushad, The food that you served became Celestial because of the love that you bestowed upon the served. Adieu, my friend. pic.twitter.com/CU2R8AkGiu — B Unnikrishnan (@unnikrishnanb) August 27, 2021 -
మాట ఇచ్చాక ఆలోచించేది ఏముంది.. ముందుకెళ్లాల్సిందే
-
యాత్ర ట్రైలర్ : మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను కానీ..
తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రనే ప్రధానంగా చూపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. పాదయాత్ర ముందు వైఎస్సార్‌కు ఎదురైన కొన్ని పరిస్థితులతో పాటు, పాదయాత్ర సాగిన తీరును ఈ చిత్రంలో ప్రధానంగా చూపించినట్టు ట్రైలర్లో ప్రతిబింబించింది. వైఎస్సార్ పాదయాత్రలో ప్రజలతో మమేకమైన తీరును కళ్లకు కట్టినట్టు చూపించారు. ‘నా విధేయతను.. విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోకండి’, ‘నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ.. జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం’, ‘మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేది ఏముంది.. ముందుకెళ్లాల్సిందే’ అని మమ్ముట్టీ పలికిన డైలాగులు గుండెకు హత్తుకునేలా ఉన్నాయి. చివర్లో ఓ వ్యక్తి రాజశేఖర ఈ సారి నా ఓటు నీకే.. నీ పార్టీకి కాదు అని పలికిన డైలాగ్ ఆకర్షించేదిగా ఉంది. వైఎస్ విజయమ్మగా ఆశ్రిత మేముగంటి ట్రైలర్‌కు కొద్ది గంటల ముందు సినిమాకు సంబంధించిన మరో విశేషాన్ని చిత్ర బృందం ప్రేక్షకులతో పంచుకుంది. వైఎస్సార్ జీవితంలో సగ భాగమైన ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రను ఈ చిత్రంలో ఆశ్రిత వేముగంటి పోషిస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్‌లో ఆశ్రిత అచ్చం వైఎస్ విజయమ్మను పోలినట్టు ఉన్నారు. Introducing #AshritaVemuganti as #YSVijayamma. #YatraTrailer will be out at 5 pm today. Get ready to join the remarkable #Yatra.@mammukka @MahiVRaghav @VijayChilla @devireddyshashi #ShivaMeka @K_RiverRecords @70mmentertains @MangoMusicLabel #YatraOnFeb8th pic.twitter.com/2FrLHnrCEb — #YatraOnFeb8th (@70mmEntertains) 7 January 2019 ఇప్పటికే రిలీజ్అయిన ఈ చిత్ర టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. వైఎస్సార్ అభిమానులతోపాటు, తెలుగు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం 2019 ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్ అవుతోంది. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. -
‘యాత్ర’ ట్రైలర్ వచ్చేస్తోంది..!
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రనే ప్రధానంగా చూపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్అయిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. జవనరి 7 సాయంత్రం 5 గంటలకు యాత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2019 ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్ అవుతోంది. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. Join the remarkable #Yatra of our beloved leader Dr. YSR. #YatraTrailer will be out on 7th Jan at 5 pm.@mammukka @MahiVRaghav @VijayChilla @devireddyshashi #ShivaMeka @K_RiverRecords @70mmentertains @MangoMusicLabel #YatraOnFeb8th pic.twitter.com/UkBsLhcfX4 — #YatraOnFeb8th (@70mmEntertains) 6 January 2019 -
నేను విన్నాను.. నేనున్నాను..
తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దివంగత మహానేత వైఎస్ రాజశెఖరరెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తన మేనియాతో తిరగరాసిన వైఎస్సార్ చేసిన పాదయాత్రను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారు. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు. కాగా, వైఎస్సార్ తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. ఓ రైతు తను పడుతున్న కష్టాలను మహానేత దృష్టికి తీసుకువచ్చే సన్నివేశాన్ని ప్రధానంగా ట్రైలర్లో చూపించారు. ‘నీళ్లు ఉంటే కరెంట్ ఉండదు.. కరెంట్ ఉంటే నీళ్లు ఉండవు.. రెండు ఉండి పంట చేతికస్తే సరైన ధర ఉండదు.. అందరు రైతే రాజు అంటారు.. సరైన కూడు, గుడ్డ, నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్య.. మమ్మల్ని రాజులుగా కాదు.. కనీసం రైతులుగా బతకనివ్వండి’ అంటూ రైతు తన ఆవేదనను మహానేతతో పంచుకుంటారు. ట్రైలర్ చివర్లో మమ్ముట్టీ పలికే.. ‘నేను విన్నాను.. నేనున్నాను’ మాటలు వింటే.. ఆయన వైఎస్సార్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారా అనిపిస్తుంది. ఈ చిత్రం 2019 ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, గతంలో విడుదల చేసిన టీజర్‌కు, ఫస్ట్ లుక్కు తెలుగు రాష్ట్రాలోని ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. తెలుగుతో పాటు తమిళ, మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్ అవుతోంది. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మహి వి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాలకు దర్శకత్వం వహించిన రాఘవ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. -
‘యాత్ర’ రిలీజ్ ఎప్పుడంటే..!
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రనే ప్రధానంగా చూపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. ముందుగా ఈ సినిమాను డిసెంబర్లోనేరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినా అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి కాకపోవటంతో ఫిబ్రవరికి వాయిదా వేశారు. జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2019 ఫిబ్రవరి 8న యాత్ర సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్ అవుతోంది. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. A tribute to the greatest journey history has ever witnessed. #Yatra in cinemas from 8th Feb. A film by @MahiVRaghav.@mammukka @VijayChilla @devireddyshashi #ShivaMeka @K_RiverRecords @MangoMusicLabel #YatraOnFeb8th pic.twitter.com/tn4iGz82S2 — #YatraOnFeb8th (@70mmEntertains) 14 December 2018 -
పోచంపల్లిలో ‘యాత్ర’ సినిమా షూటింగ్
భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : పోచంపల్లిలో 70ఎంఎం పిక్చర్స్ బ్యానర్‌పై దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న ‘యాత్ర’ సినిమా షూటింగ్ బుధవారం జరిగింది. పోచంపల్లిలోని టూరిజం పార్క్, చెరువు కట్ట సమీపంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో నటిస్తున్న మళయాల సూపర్‌స్టార్ మమ్ముట్టి, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటి సుహాసినిపై పాదయాత్రకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. పాదయాత్రలో భాగంగా ఓ పాటలోని బ్యాక్‌గ్రౌండ్ సన్నివేశాలను ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద పర్యవేక్షణలో వివిధ వర్గాల ప్రజలను కలిసే సన్నివేశాలను తెరకెక్కించారు. కాగా ఈ సినిమాకు మహి, వి రాఘవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, సంగీతం కృష్ణకుమార్, కెమెరామెన్‌గా సత్యన్‌సూర్యన్ వ్యవహరిస్తున్నారు. కాగా సినిమా షూటింగ్ చూడడానికి ప్రజలు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. చదవండి: యాత్ర టీజర్.. గడప కష్టాలు వినేందుకు రాజన్న... నిన్ను నీవే జయించు -
‘యాత్ర’ విడుదల తేదీ ఖరారు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర చిత్రం విడుదల తేదీని యూనిట్ సభ్యులు ఖరారు చేశారు. లెజెండరీ నటుడు మమ్ముట్టీ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం వినాయక చవితి సందర్భంగా బుధవారం విడుదల చేసింది. ప్రజానేత జీవితంలోని మహాప్రస్థానం(పాదయాత్ర) అనే కీలక ఘట్టం ఆధారంగా ఈ చిత్రాన్ని ఆనందోబ్రహ్మ ఫేమ్ మహి వీ రాఘవ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోకు విపరీతమైన స్పందన వచ్చింది. శరవేగంగా జరుగుతున్న షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా అందుకు కొన్ని రోజుల ముందుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలో జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్. -
కన్నుల్లో కొలిమై రగిలే..
-
కన్నుల్లో కొలిమై రగిలే..
సాక్షి, హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా దిగ్గజ నేతపై రూపొందుతున్న బయోపిక్ ‘యాత్ర’ యూనిట్ సమరశంఖం అంటూ సాగే పూర్తి సాంగ్ లిరిక్స్‌ను లాంఛ్ చేసింది. వేలాది మంది వెంటరాగా మహానేత పాదయాత్రగా ప్రజాక్షేత్రంలోకి వడివడిగా వెళుతున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘నీ కన్నుల్లో కొలిమై రగిలే..కలేదో నిజమై తెలవారెనే.. వెతికే వెలుగే రానీ.ఈనాటి సుప్రభాత గీతమే..నీకిదే అన్నది స్వాగతం’ అంటూ సాగే ఈ పాట ఆనాటి చారిత్రాత్మక యాత్రను కళ్లకుకట్టేలా ఉంది. మళయాళ మెగాస్టార్ మమ్ముటీ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ఆనందోబ్రహ్మ ఫేమ్ మహి వీ రాఘవ డైరెక్షన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో నెటిజన్లలో వైరల్ అవుతోంది. -
పెట్టుబడి సాయం బాగుంది: మమ్ముట్టి
సాక్షి, హైదరాబాద్ : మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావును కలిశారు. హైదరాబాద్‌లోని బేగంపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ నెల 25న రవీంద్రభారతిలో జరగనున్న ఇన్నిటెక్ అవార్డు ప్రదాన కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి కేటీఆర్‌ను మమ్ముట్టి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రాంత మలయాళీ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. స్టార్టప్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డులను అందించనున్నట్లు మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలపై మమ్ముట్టి ఆసక్తి వ్యక్తం చేశారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయం పథకంపై మమ్ముట్టి ప్రశంసలు కురిపించారు. కేరళ ప్రభుత్వ సహకారంతో శబరిమల దేవస్థానం వద్ద తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలతోపాటు, తెలంగాణలో ఉన్న మలయాళీలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మమ్ముట్టికి వివరించారు. -
వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ టీజర్ రిలీజ్
-
మాతో జీవితకాల ప్రయాణానికి సిద్ధంకండి!
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘షూ లేసులు కట్టుకోండి.. మాతో జీవితకాల ప్రయాణానికి సిద్ధంకండి’ అంటూ వైఎస్సార్ జయంతి కానుకగా ‘యాత్ర’ టీజర్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాలో మహానేత పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నారు. మహి వీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా, జగపతిబాబు, రావు రమేశ్, అనసూయ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. -
జూలై 8న ‘యాత్ర’ టీజర్!
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ పూర్తిచేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా యాత్ర టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2019 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. -
'కొడుకు నుంచి మమ్ముట్టి నటన నేర్చుకోవాలి'
ఎవరినైనా పొగడాలంటే.. అవతలివాళ్లను తిట్టాలన్నది రాంగోపాల్ వర్మ ఫిలాసఫీ. తాజాగా ప్రముఖ మళయాళ నటుడు మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తడానికి స్వయంగా మమ్ముట్టినే తిట్టిపోశాడు రామూ. మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన 'ఓకే బంగారం' సినిమాను ప్రశంసించేందుకు తన ట్విట్టర్ ఖాతాను వేదికగా చేసుకున్నాడు. ఇప్పుడే తాను మణిరత్నం సినిమా చూశానని, అవార్డు కమిటీ సభ్యులకు ఏమాత్రం సెన్స్ ఉన్నా.. వాళ్లు మమ్ముట్టికి ఇన్నాళ్లుగా ఇచ్చిన అవార్డులన్నీ వెనక్కి తీసేసుకుని వాటిని ఆయన కొడుక్కి ఇస్తారని రామూ అన్నాడు. దుల్కర్‌తో పోలిస్తే మమ్ముట్టి ఒక జూనియర్ ఆర్టిస్టు మాత్రమేనని వ్యాఖ్యానించాడు. మమ్ముట్టి నటనను తన కొడుకు నుంచి నేర్చుకోవాలని.. తాను ఈ మాట నిజంగానే అంటున్నానని నొక్క చెప్పాడు. కొన్నేళ్లలోనే మమ్ముట్టి కొడుకు కేరళ గర్వపడేలా చేస్తాడని.. ఇన్ని దశాబ్దాలుగా మమ్ముట్టి మాత్రం ఆ పని చేయలేకపోయారని కూడా రాంగోపాల్ వర్మ అన్నాడు. Jst saw Mani's film and if the award commitee members have any sense they will take back all awards of Mamooty and give it to his son — Ram Gopal Varma (@RGVzoomin) April 21, 2015 Mamooty is a junior artiste compared to his son — Ram Gopal Varma (@RGVzoomin) April 21, 2015 Mamooty should learn acting from his son..I mean realistic — Ram Gopal Varma (@RGVzoomin) April 21, 2015 Mamootys son will make Kerala proud In the non Kerala markets in just years which Mamooty couldn't do for decades — Ram Gopal Varma (@RGVzoomin) April 21, 2015