‘యాత్ర’ ట్రైలర్‌ వచ్చేస్తోంది..! | Yatra Trailer Will Be Out On 7th January | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 6 2019 10:36 AM | Last Updated on Sun, Jan 6 2019 4:14 PM

Yatra Trailer Will Be Out On 7th January - Sakshi

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాదయాత్రనే ప్రధానంగా చూపించనున్నారు‌. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్‌అయిన టీజర్‌, సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్‌ వచ్చింది.

తాజాగా చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. జవనరి 7 సాయంత్రం 5 గంటలకు యాత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2019 ఫిబ్రవరి 8న రిలీజ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్‌ అవుతోంది. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement