Yatra Movie
-
సోషల్ మీడియాలో యాత్ర 2 టీజర్ కు సూపర్ రెస్పాన్స్..!
-
Yatra 2: గుర్తుపెట్టుకోండి..నేను వై.ఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుని..
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ ‘యాత్ర’. వైఎస్సార్ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ నాలుగేళ్ల క్రితం(2019) విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లోనే ఈ చిత్రానికి సీక్వెల్ ఉటుందని ప్రకటించాడు దర్శకుడు మహి వి.రాఘవ్. ఈ సీక్వెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నుంచి మొదలై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఉంటుందని ఇటీవల రివీల్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ని జులై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ వారం ముందే ‘యాత్ర-2’ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ని విడుదల చేసి సర్ప్రైజ్ చేశాడు మహి. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. (చదవండి: సినీ తారల ‘వ్యాపారం’.. సైడ్ బిజినెస్‌తో కోట్లు గడిస్తున్న స్టార్స్ వీరే!) తాజాగా రిలీజైన పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. ఈ పోస్టర్‌పై ‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వై.ఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుని’అనే లైన్స్ ‘యాత్ర 2’ కథేంటో తెలియజేస్తుంది. వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర మొదలు.. సీఎం పీఠం ఎక్కే వరకు ఆయనకు ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో యాత్ర 2 కథ సాగుతుందని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. సీఎం జగన్ చేపట్టిన పాదయాత్రను హైలెట్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. సీఎం జగన్ పాత్ర పోషించేదెవరనేది ఇంతవరకు ప్రకటించలేదు కానీ తమిళ హీరో జీవా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Step into the shoes of a torchbearer as we bring his extraordinary journey to life! #Yatra2 in cinemas from Feb 2024 👣#LegacyLivesOn @ShivaMeka @MahiVraghav @vcelluloidsoffl @Music_Santhosh @madhie1 #SelvaKumar @3alproduction pic.twitter.com/biCaoXraBh — Three Autumn Leaves (@3alproduction) July 1, 2023 -
‘యాత్ర’.. ఓ మహానాయకుడి వ్యక్తిత్వానికి వెండితెర రూపం
కొన్ని కథలు ప్రేక్షకులను అలరిస్తాయి.. ఆలోచింపజేస్తాయి. మరికొన్ని కథలు హృదయాలను హత్తుకుంటాయి. కన్నీళ్లను తెప్పిస్తాయి. అలా మనసుల్ని హత్తుకునే కథలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. అలాంటి వాటిలో ‘యాత్ర’ ఒకటి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ ఇది. వైఎస్సార్‌లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. నాడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్సార్.. పాదయాత్ర ద్వారా జనంలోకి ఎలా వెళ్లగలిగారు? సమస్యలు ఎలా తెలుసుకున్నారు? కష్టాలకు పట్టించుకోకుండా.. మండుటెండల్లో ఎలా ముందడుగు వేశారు.. మండుటెండల్లో ఎలా ముందడుగు వేశారు? ఆయన పాదయాత్రకు దారి తీసిన పరిస్థితులేంటి? పాదయాత్ర రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చింది? యాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి ? పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పట్టుదలతో ఎలా విజయతీరాలకు చేర్చారు? అన్నదే ఈ సినిమా కథ. ఒక సినిమాకు కథతో పాటు క్యారెక్టర్ సెలక్షన్ కూడా చాలా ముఖ్యం. ఇదే సినిమా సక్సెస్‌ని నిర్ణయిస్తుంది. వైఎస్సార్ పాత్రకు మలయాళ నటదిగ్గజం మమ్ముట్టిని ఎంపిక చేయడంతోనే ఈ సినిమా సగం విజయం సాధించింది. ‘యాత్ర’ సినిమా అనేది ఓ ఎమోషనల్ జర్నీ. ఇందులో పెద్దగా కథ కంటే పాత్రలే ముఖ్యం. వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పెట్టి నటించాడు. ఫస్ట్ సీన్ నుంచి చివరి వరకు తెర మీద రాజన్ననే చూస్తున్నామన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు మమ్ముట్టి. రాజశేఖరరెడ్డి రాజసం, హుందాతనం, రాజకీయం, నమ్మిన వారికోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెర మీద అద్భుతంగా పలికించాడు. సినిమా అంతా ఒక ఎత్తైయితే క్లైమాక్స్‌లో వచ్చే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీన్స్ మరో ఎత్తు. అప్పటి వరకు వైఎస్సార్ గొప్పతనాన్ని తెలుసుకొని ఉప్పొంగిపోయిన ప్రేక్షకులను చివర్లో చూపించే రియల్ ఫుటేజ్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్ని బయోపిక్ మూవీస్‌లా కేవలం కథను మాత్రమే చెప్పే ప్రయత్నం చేయలేదు దర్శకుడు మహి వీ రాఘవ. సినిమా తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలో లీనం చేసి రాజన్నతో ప్రయాణం చేసేలా చేశాడు. అందుకే విమర్శకులు సైతం రాఘవపై ప్రశంసలు కురిపించారు. సూటిగా సుత్తి లేకుండా, చెప్పాల్సిన విషయాన్ని ఎమోషనల్‌గా.. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా.. కంటతడి పెట్టించేలా ‘యాత్ర’ను తీర్చి దిద్దారు. (యాత్ర సినిమా విడుదలై నేటికి(ఫిబ్రవరి 8) నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా..) -
Actor Shritej Latest Interview: నటుడు శ్రీతేజ్ ఫుల్ ఇంటర్వ్యూ
-
నటుడు శ్రీతేజ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రోమో
-
మా గుండెల్లో గుడిసెల్లో... కొలువుంటావు రాజన్నా!
పెంచలదాసు (రచయిత, గాయకుడు): రాజశేఖరరెడ్దిగారంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా కడప జిల్లావాడిని కనుక మరింత ఇష్టం ఉండి ఉండొచ్చు. ఆయన మహాభినిష్క్రమణ విధానం చూస్తే ఎవరికైనా కంట నీరు ఆగదు. అటువంటి స్థితి ఎవ్వరికీ రాకూడదు. నాకు గుండెల నిండా దుఃఖం వచ్చింది. ఆయన గురించి చాలామంది కవితలు రాశారు, పాటలు రాసి పాడారు, నాకు మాత్రం ‘యాత్ర’ చిత్రంలో ‘మరుగైనావా రాజన్నా... కనుమరుగైనావా రాజన్నా/మా ఇంటి దేవుడవే మా కంటి వెలుగువే/ఒరిగినావా రాజన్నా ఒరిగినావా రాజన్నా’ పాట రూపంలో ఘనమైన నివాళి ఇచ్చే అదృష్టం కలిగింది. వైయస్సార్ అంటే ఇష్టపడని వారు ఉండరు కదా. వైయస్సార్ మీద ‘యాత్ర’ సినిమా తీస్తున్న సందర్భంగా ఆ చిత్ర దర్శకులు మహి రాఘవ నన్ను పిలిచి, ఒక పాటకు ఫోక్ స్టయిల్లో డ్యాన్స్ చేయాలన్నారు. నేను డ్యాన్సర్‌ని కాదు కనుక మిన్నకుండిపోయాను. యాత్ర సినిమా మొదలైనప్పటి నుంచి నా మనసంతా అటువైపే ఉంది. ఈలోగా ‘అరవింద సమేత’ చిత్రంలో పాత్రలకు మాండలికం నేర్పడానికి శబ్దాలయా స్టూడియోకి వచ్చాను. అక్కడే ఉన్న మహి రాఘవ గారిని పలకరించాను. ‘నన్ను డ్యాన్సుకి పిలిచారు కదా, నేను డ్యాన్సర్‌ని కాదు, అందుకే రాలేదు’ అన్నాను. వాస్తవానికి ఆయన నన్ను పాట రాయడానికి పిలిచారట. ఆ చిత్రంలో మొత్తం ఐదు పాటలు సిరివెన్నెలగారితో రాయించారు. సినిమా విడుదలకు ఐదు రోజుల ముందు రాఘవగారు ఫోన్ చేసి, ‘వైయస్సార్ ఆఖరి రోజుకు సంబంధించిన పాట మీరు రాస్తే బావుంటుందనుకుంటున్నాం. పెద్దాయనది మీ జిల్లా కదా, మీ జిల్లా మాండలికంలో, యాసలో పాట రాయండి’ అని స్వేచ్ఛనిచ్చారు. సంగీతం గానం కూడా నన్నే చేయమన్నారు. నాలుగు రోజుల్లో సమాధానం చెప్పమని ఫోన్ చేశారు. నాకు మంచి పని పడింది కదా అని ఒక పక్క సంతోషం, ఎలా రాస్తానా అని మరో పక్క భయం రెండూ కలిశాయి. నేను రాసే ఈ పాట పదికాలాల పాటు నిలిచిపోవాలనుకున్నాను. వైయస్సార్ నిర్యాణం బాధాకరం. ఆయన నిర్యాణం తరవాత ఎంతోమంది ప్రాణాలు వదిలారు. అంతటి మహోన్నత వ్యక్తి గురించి ఎలా రాయాలా... అని నడుస్తున్నా, పడుకున్నా నిరంతరం అదే ఆలోచన. అద్భుతమైన మాటలతో ప్రారంభించాలనుకున్నాను. అవధూతలు నిర్యాణం చెందినప్పుడు ‘చనిపోయారు’ అని కాకుండా, ‘మరుగైనారు’ అంటారు. వైయస్సార్ కూడా అవధూతలాంటి వారు. మనుషులను ప్రేమించేవారు. మహా నాయకుడు. అందుకే ‘మరుగైనావా రాజన్నా’ అని పాట ప్రారంభించాను. పాటను తన్మయంతో పాడాలి. నాకు నాటకాలలో పద్యాలు, పాటలు పాడిన అనుభవం ఉన్న కారణంగా బాగానే పాడగలిగాను. మా అన్న చిన్నయదాసు (ఇప్పుడు ఆయన లేరు) గొప్ప జానపద గాయకుడు. మా అన్నయ్యను వైయస్సార్‌గారు ‘ఏం చిన్నయదాసు’ అని ఆప్యాయంగా పిలిచేవారు. అంత గొప్పనాయకుడు మనల్ని అంత గుర్తు పెట్టుకుని పలకరించడం చాలా సంతోషంగా వుండేదని మా అన్న తరచూ చెబుతూ వుండేవారు. మా అన్నయ్య తరం వారు ఆలి, ఆకలి తెలియకుండా తిరిగే జానపద కళాకారులు. ఆయన పాడిన జానపద గీతాల్లో ‘‘ఏమన్నాడు హనుమన్నా? ఏమన్నాడు రామయ్యా? ఏమన్నాడు రామయ్యా? ఎట్లున్నాడు లక్ష్మయ్య’ అని ఒక గీతం పాడేవారు. మా అన్నయ్యకు దండం పెట్టుకుని నేను రాసుకున్న ‘మరుగైనావా రాజన్నా’ పాటను అదే ట్యూన్లో పాడాను. మా పల్లెల్లో ఎవరైనా గొప్పవాళ్లు, మహనీయులు మరణిస్తే – వాళ్లని చనిపోయారు అనే మాటకు బదులు ‘కొండంత మనిషి వొరిగిపోయాడురా!’ అంటారు. అందువల్ల ఆ పదాన్ని పల్లవిలో ఉపయోగించాను. ‘‘అద్దుమానం అడవిలోనా/ ఏలకాని ఏల కాడ/పైన పోయే పచ్చులారా/ ఏడమ్మా మన రాజన్నా/ నువ్వొచ్చే దావల్లో... పున్నాగా పూలు జల్లి/నీ కోసం వేచుంటే... చేజారీపోతివా’ అని ఒక చరణం రాశాను. అధ్వానం అనే పదాన్ని అద్దుమానం అంటారు మా మాండలికంలో. ఆకాశంలో పక్షులు తిరుగుతుంటాయి. ఆ పైన నుంచి వాటికి రాజన్న కనిపించాడేమోనని ‘మీరైనా చూడలేదా’ అని ప్రశ్నించాను ఈ చరణంలో. పాట పాడుతున్నంతసేపూ నాకు ఏడుపు ఆగలేదు. వైయస్సార్‌గారి వేషధారణ, నడక, నవ్వు... మనిషిని అధీనం చేసుకుంటాయి. ఆయన నడుస్తుంటే తెల్ల కలువలా ఉంటాడు. ఆయన స్వచ్ఛమైన నవ్వుని, తెల్లని బట్టలను దృష్టిలో ఉంచుకుని, ‘చల్లానీ నీ నవ్వూ... చక్కానీ నీ నడక/రచ్చబండా చేరకనే... నేల రాలిపోతీవా/మాట తప్పని రాజన్నా... మడమ తిప్పని మనిషివయా/మరువజాలము నీ రూపం... నీకు సాటి ఎవరయ్యా’ అని రాశాను. ఈ పాటను మొత్తం 40 వాక్యాలు రాశాను. సినిమాకి అనుగుణంగా తగ్గించారు. సహజంగా రాయలసీమ గ్రామాల్లో సాయంకాలం సమయంలో మట్టి ప్రమిదలో ఒత్తి పెట్టి, ఆవు పేడ పిడను ఉంచి, దీపం వెలిగించి, దానికి దండం పెడతారు. ఆ సందర్భాన్ని ఇక్కడ రాజన్నకు కలిసేలా ‘‘మా గుండెల్లో గుడిసెల్లో... కొలువుంటావు రాజన్నా/సాయం సంధ్యా దీపంలో... నిన్నే తలుచూకుంటాము/నిన్నే తలుచుకుంటాము...’’ అని రాశాను. నా జీవితంలో నాకు ఇష్టమైన పాట, నా మనసుకి నచ్చిన పాట. ఈ పాట రాయడం పూర్తయ్యాక దర్శకనిర్మాతలకు వినిపించాను. అందరూ బాగుందని మెచ్చుకున్నారు. డైరెక్టరు గారైతే పాట వింటూ మౌనంగా ఉండిపోయారు. అలా ఆ పాట పూర్తయ్యింది. ఏదో ఒక పాట పాడి భ్రష్టుపట్టడం నాకు ఇష్టం లేదు. నచ్చినవి మాత్రమే పాడతాను. నా వరకు ఇది పెద్దాయనకు నేను నా హృదయమంతటితో ఆత్మతృప్తిగా ఇచ్చిన ఘనమైన అక్షర నివాళి. నేను డ్రాయింగ్ వేస్తుంటాను. వ్యాసాలు రాస్తుంటాను. బాటిక్ పెయింటింగ్‌లో రాష్ట్రస్థాయి అవార్డు పొందాను. ఈ పాటకు నాకు డబ్బులు బాగానే ఇచ్చారు. ‘‘పెద్దాయనా! ఆర్థికంగా కూడా నన్ను ఆదుకున్నావు’’ అనుకున్నాను. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!
పాఠశాల సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మహి వీ రాఘవ్ ఆనందో బ్రహ్మ సినిమాతో తొలి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. తరువాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన యాత్ర సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లను కూడా సాధించింది. యాత్ర తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మహి, తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు మహి. ‘ఓ దర్శకుడు కథ చెప్పటం కన్నా, ఏ కథ చెప్పాలి అని నిర్ణయించుకోవటమే కష్టమైన పని. బాక్సాఫీస్ ట్రెండ్స్, బడ్జెట్, నటీనటులు ఇవేవి కథ ఎంపికకు సాయపడవు. నిశ్శబ్ధంలో వచ్చే ఓ ఆలోచన.. ఇదే నువ్వు చెప్పాల్సిన కథ అని నాకు తెలియజేస్తుంది. నా తదుపరి చిత్రం ఓ యాక్షన్ డ్రామా. టైటిల్ ‘సిండికేట్’. త్వరలోనే ఈ కథ, పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా, ఆ స్క్రిప్ట్ సినిమాగా వస్తుందని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. ‘SYNDICATE’ pic.twitter.com/6DAyGGqjFf — Mahi Vraghav (@MahiVraghav) July 30, 2019 -
అన్నిటికీ మూలం.. ఆయనే
సాక్షి, అమరావతి : సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన జనరంజకులైన పాలకుల్ని, ప్రజల హృదయాలపై చెరగని ముద్ర వేసిన మహానుభావుల్ని వారు మరణించాక కూడా ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారు. భౌతికంగా ప్రజల మధ్య లేకపోయినా వారి గొప్పతనాన్ని స్మరించుకుంటూ పుస్తకాలు, సినిమాలు, షార్ట్‌ఫిల్మ్‌లు రావడం కొత్తేమీ కాదు. ఈ నేపథ్యంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలు తెలుగు ప్రజల జీవితాలతో ఎంతలా పెనవేసుకుపోయాయో, వాటితో ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయో చెప్పనలవి కాదు. అందుకే కన్నుమూశాక కూడా ఆయన కీర్తిప్రతిష్టలు తెలుగు రాష్ట్రాల్లో మరే ఇతర నాయకుడికి లేనంతగా ఇనుమడించాయి. ‘యాత్ర’ అపూర్వం..: ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ 1467 కిలోమీటర్ల మేర చేసిన పాదయాత్ర (ప్రజాప్రస్థానం) ఇతివృత్తంగా ప్రముఖ నటుడు మమ్ముట్టి కథానాయకుడిగా రూపొందిన ‘యాత్ర’ చిత్రం సంచలన విజయం సాధించింది. దేశ, విదేశాల్లో తెలుగు ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ దక్కించుకుంది. వైఎస్సార్ మాటతప్పని, మడమ తిప్పని వ్యవహార శైలి, ప్రజల చిన్నచిన్న సమస్యలకే కరిగిపోయే ఆయన దయార్ద హృదయం, ఆయన గుణగణాలను ప్రతిబింబించేలా తీసిన ‘యాత్ర’ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మాండంగా ఆదరించారు. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ ఆ చిత్రంలో వైఎస్సార్ పాత్రలో జీవించిన మమ్ముట్టి పలికిన డైలాగ్ తెలుగునాట జనాల్లోకి చొచ్చుకుపోయింది. పాదయాత్ర చేపట్టడానికి దారితీసిన పరిస్థితులు, పాదయాత్ర వల్ల వైఎస్సార్‌లో వచ్చిన మార్పు, ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, రైతులకు మేలు చేసే పథకాలు ప్రవేశపెట్టడానికి కారణాలను ఈ సినిమా చక్కగా ప్రజల ముందు ఆవిష్కరించింది. 2019 సాధారణ ఎన్నికలకు ముందు విడుదలైన ఈ చిత్రం విజయదుందుభి మోగించింది. వైఎస్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రాసిన ‘వైఎస్సార్‌తో ఉండవల్లి అరుణ్‌కుమార్’ అనే పుస్తకం ద్వారా ఆ మహానేత వ్యక్తిత్వాన్ని సామాన్య ప్రజలు మరింత ఎక్కువగా తెలుసుకునే అవకాశం కలిగింది. వైఎస్సార్ కన్నుమూశాక ఆయన గురించి పత్రికల్లో వివిధ ప్రముఖులు రాసిన వ్యాసాలను, ఆయనతో వారి అనుభవాలను సంకలనం చేసి వెలువడ్డ తొలి పుస్తకం.. ‘జననేత’. మాజీ జర్నలిస్టు ఎల్.విజయకృష్ణారెడ్డి (ఎల్వీకే) ఆధ్వర్యంలో వచ్చిన ఈ పుస్తకాన్ని నాడు ఎంపీగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. వైఎస్సార్‌కు సన్నిహితుడైన షేక్ ఇమాం (కదలిక పత్రిక సంపాదకుడు) ‘జనం చెక్కిన శిల్పం’ పేరుతో రూపొందించిన వ్యాసాల సంపుటి పుస్తకం వైఎస్ వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా ఆవిష్కరించింది. పేద, బడుగు వర్గాల సమస్యల పట్ల మహానేత వైఖరి, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయంపై ఆయన ఆసక్తి, అన్నిటి కంటే మించి.. పేదలకు విద్య వంటి అంశాలపై వైఎస్ ఆలోచనలు ఎలా ఉండేవో ఈ పుస్తకంలో ఇమాం చక్కగా వివరించారు. ‘వైఎస్సార్.. ది మ్యాన్ ఆఫ్ ది పీపుల్ (ప్రజల మనిషి.. వైఎస్సార్)’ పేరుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రాణస్నేహితుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు 150 ఫొటోలతో ఆకర్షణీయంగా ఒక పుస్తకాన్ని రూపొందించారు. 2011లో అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సోషియాలజీ విభాగం వైఎస్ పాలన, సంక్షేమంపై నిర్వహించిన సెమినార్‌కు దేశవ్యాప్తంగా ఎందరో విద్యావేత్తలు హాజరయ్యారు. రామగంగిరెడ్డి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ వైఎస్సార్ పాదయాత్రపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందడం గమనార్హం. 70 రోజులు వెంటిలేటర్‌పైనే.. గుంటూరు జిల్లా కొత్తపేటకు చెందిన ఈశ్వరరెడ్డి, రమాదేవి దంపతులది నిరుపేద కుటుంబం. ఈశ్వరరెడ్డి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుమస్తాగా పనిచేస్తున్నారు. పెళ్లయ్యాక చాలాకాలంపాటు వీరికి పిల్లలు లేరు. 2008లో ఈశ్వరరెడ్డి భార్య గర్భం దాల్చింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. అయితే.. ఈ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. రమాదేవికి 7వ నెలలోనే ప్రసవమై ఇద్దరు కవల ఆడ పిల్లలు పుట్టారు. ఒక్కో పాప కేవలం 900 గ్రాములు మాత్రమే బరువు ఉంది. ఆ చిన్నారుల బరువు చూసి వైద్యులు ఆశలు వదులుకోవాల్సిందేనన్నారు. వైద్యుల మాటలతో లేకలేక పుట్టిన చిన్నారులను చూసి తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు. అదే సమయంలో ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది.ఆ చిన్నారులను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించుకోండని వైద్యులు చెప్పారు. దీంతో ఆ చిన్నపిల్లలిద్దరినీ వెంటిలేటర్‌పై గుంటూరులోని శ్రీరామచంద్ర చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ఆ ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చుకున్నారు. పిల్లలిద్దరికీ 70 రోజులపాటు వెంటిలేటర్‌పైనే వైద్యమందించారు. సాధారణంగా వెంటిలేటర్‌పైన ఉంటే రోజుకు వేలల్లోనే ఖర్చవుతుంది. ఈ పరిస్థితుల్లో చిన్నారులిద్దరికీ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా నయాపైసా తీసుకోకుండా 70 రోజుల పాటు వైద్యమందించి వారి ప్రాణాలు కాపాడారు. ఆ చిన్నారులు మోహనదీప్తి, మోహనరూప ఇప్పుడు 5వ తరగతి చదువుతున్నారు. వైఎస్సార్ పుణ్యమాని ఇప్పుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. వైఎస్సార్ తమ కుటుంబంలో సంతోషం నింపారని దంపతులిద్దరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు పుట్టినప్పుడు వైద్యం చేయించడానికి డబ్బులు లేవని, ఆస్తులమ్ముకుని బతికించుకుందామన్నా ఆస్తులు లేవని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో పిల్లలిద్దరినీ చూసినప్పుడు బాధ, భయమూ వెంటాడాయని వివరించారు. ఆ దేవుడే ఆరోగ్యశ్రీ రూపంలో తన పిల్లలకు ప్రాణభిక్ష పెట్టారని చెబుతున్నారు. 70 రోజులు ఆస్పత్రిలో ఉన్నా ఒక్క నయాపైసా అడగలేదని, మందుల నుంచి ఇంజక్షన్ల వరకూ అన్నింటికీ ఆరోగ్యశ్రీ వర్తించిందని, తమకు నిజమైన దైవం వైఎస్సారే అంటున్నారు.. ఆ దంపతులు. దేవుడు ఎక్కడో లేడు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూపంలో దేవుడు ఉన్నారంటున్నారు.. విజయవాడకు చెందిన యార్లగడ్డ ఉదయశ్రీ. ఆమె తండ్రి శ్రీనివాసరావు వ్యవసాయం చేస్తుండేవారు. ఉదయశ్రీతోపాటు ఆమె అన్న చలపతి కుమార్ 2008లో ఒకేసారి బీటెక్‌లో చేరారు. దీంతో ఇద్దరికీ ఫీజులు చెల్లించడం శ్రీనివాసరావుకి కష్టమైంది. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ ఫీజురీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టడంతో తాను, తన అన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువు పూర్తిచేసుకోగలిగామని, లేదంటే చాలా కష్టాలు పడేవాళ్లమని నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ దయతో తాను ప్రస్తుతం బెంగళూరులోని ఇన్ఫోసిస్‌లో అసోసియేట్ కన్సల్టెంట్‌గా ఉద్యోగం చేస్తూ ఏడాదికి రూ.9 లక్షల వేతనం తీసుకుంటున్నానని సంతోషం వ్యక్తం చేశారు. తన అన్న కూడా మైసూరులో మంచి ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు. -
రెండో యాత్రకు శ్రీకారం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. వైఎస్సార్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ‘యాత్ర’ సీక్వెల్‌కు శ్రీకారం చూట్టారు మహీ వి. రాఘవ్. ‘‘వై.ఎస్. రాజారెడ్డి (వైఎస్సార్ తండ్రి), వై.ఎస్. జగన్ పాత్రలు లేకుండా వైఎస్సార్‌గారి కథ సంపూర్ణంగా అనిపించదు. ‘యాత్ర’ సినిమా వై.ఎస్. జగన్‌గారి విజువల్స్‌తో ముగుస్తుంది. ‘యాత్ర 2’ను అక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే ఆలోచనతోనే అలా చేశాం’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహి.వి. రాఘవ్. -
‘యాత్ర 2’ కథ అక్కడ మొదలవుతుంది!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించిన మహి వీ రాఘవ, వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో యాత్ర 2 సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సందర్భంగా వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ యాత్ర 2కు సంబంధించిన హింట్ ఇచ్చారు దర్శకుడు మహి. తాజాగా యాత్ర 2 సినిమాకు సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చారు. ‘వైఎస్ రాజా రెడ్డి, వైఎస్ జగన్ ల గురించి చెప్పకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథ పూర్తి కాదు. యాత్ర 2 ఆయన కథను పరిపూర్ణం చేస్తుంది. రాజశేఖర్ రెడ్డి యాత్ర తన తండ్రి సమాధి దగ్గర నుండి ప్రారంభమైంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర కూడా ప్రారంభమైంది’ అంటూ ట్వీట్ చేశారు మహి వీ రాఘవ. పావురాల గుట్ట దగ్గర వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తన తండ్రి మరణం తట్టుకోలేక చనిపోయిన వారిని స్వయంగా వచ్చి కలుస్తానని ప్రజలకు ఇచ్చిన మాట, ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆయనకు ఎదురైన ఇబ్బందులు. ఎన్ని కష్టాలు ఎదురైన మాట నిలబెట్టుకునేందుకు వైఎస్ జగన్ ముందడుగు వేయటం, 9 ఏళ్ల పోరాటం తరువాత అఖండ విజయం సాధించటం లాంటి అంశాల నేపథ్యంలో సీక్వెల్ సాగుతుందని అంచనా వేస్తున్నారు. YSR’S story is incomplete without Y.S. Raja reddy & Y.S.Jagan. Yatra 2 will complete their story. The reason why Yatra ended on Y.S. Jagan is we could take it off from where we left. YSR’s Yatra started from his father grave and Jagan’s Yatra from his father’s #yatra2 @ShivaMeka — Mahi Vraghav (@MahiVraghav) 29 May 2019 -
వైఎస్ జగన్ ఘనవిజయం.. ‘యాత్ర 2’
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సునామీలో ప్రత్యర్థి పార్టీలన్ని కొట్టుకుపోయాయి. వైఎస్ జగన్ విజయం ఖాయమైపోవటంతో ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. సుధీర్ బాబు, రవితేజ లాంటి సినీ హీరోలు కూడా వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఇక దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహీ వీ రాఘవ కూడా వైఎస్ఆర్సీపీ సునామీపై స్పందించారు. వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ‘మీరు భవిష్యత్ తరాలకు చెప్పాల్సినంత గొప్ప విజయాన్ని అందించారు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు యాత్ర 2 (#Yatra2) అనే ట్యాగ్‌ను కూడా జోడించారు. Congratulations to @ysjagan @YSRCParty Anna a truly deserving victory. As promised Hope you deliver more than Y S Rajasekhar Reddy Garu. You have a written and made story worth telling.. :) #yatra2 @ShivaMeka pic.twitter.com/1BI6ArOMFh — Mahi Vraghav (@MahiVraghav) 23 May 2019 Congratulations to the youngest CM of AP @ysjagan garu. Looking forward for good Governance...wishing you all the good luck🙏 — Ravi Teja (@RaviTeja_offl) 23 May 2019 Congratulations @ysjagan garu. The people of Andhra Pradesh have given you both, the victory and the responsibility. Sending my best wishes. Let's all work together for a greater AP. #APElectionResults2019 — Sudheer Babu (@isudheerbabu) 23 May 2019 -
మాలో యాత్ర
ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని, ఎనలేని జనాదరణను సొంతం చేసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారని ప్రేక్షకులు ప్రశంసించారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్ వంటి పథకాలకు పాదయాత్రలో ఎలా అంకురార్పణ జరిగిందనే విశేషాలను చాలా అర్థవంతంగా మహి చూపించారని కూడా వీక్షకులు అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు మరోసారి ఆ మహానేతను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై ప్రదర్శితం కానుంది. ‘యాత్ర’ చిత్రం ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ‘స్టార్‌మా’ చానెల్లో ప్రదర్శితం కానుంది. -
‘యాత్ర’కు ఈసీ గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: టీవీలో ప్రసారం కానున్న ‘యాత్ర’ చిత్రాన్ని అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు చేసిన ప్రయత్నం విఫలమైంది. టీవీలో ప్రసారం కానున్న యాత్ర సినిమా ఏరకంగానూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో టీవీలో ఈ చిత్ర ప్రసారానికి అడ్డంకులు తొలగిపోయాయి. వివరాల్లోకి వెళితే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే యాత్ర శాటిలైట్ రైట్స్‌ను సొంతం చేసుకున్న స్టార్ మా చానల్.. ఈ చిత్రాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయనున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యకం చేసింది. యాత్ర చిత్రాన్ని టీవీలో ప్రసారం చేయకుండా చూడాలని టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. టీడీపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. టీడీపీకి సమాధానంగా మరో లేఖ రాసింది. యాత్ర చిత్ర ప్రదర్శనలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని ఈసీ ఆ లేఖలో తెలిపింది. టీవీ లేదా సినిమా థియేటర్లలో ప్రదర్శించే సినిమాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. టీడీపీ నేతల ఫిర్యాదును తమ మీడియా సర్టిఫికేషన్ కమిటీ పరిశీలించిందనీ, అందులో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే అంశాలేవీ లేదని తేల్చిచెప్పింది. దీంతో రేపు మధ్యాహ్నం యాత్ర చిత్రం స్టార్ మాలో ప్రసారం కానుంది. #Yatra World Television Premiere..This Sunday at 12 PM on @StarMaa#YatraOnMaa pic.twitter.com/wOLIyda7Vx — STAR MAA (@StarMaa) April 4, 2019 -
జగన్ అనే నేను; అప్నా టైమ్ ఆయేగా...
-
జగన్ అనే నేను; అప్నా టైమ్ ఆయేగా...
అధికారం కోసం పరితపించే వాడు రాజకీయ నాయకుడు మాత్రమే అనిపించుకుంటాడు.. అదే ఆశయసాధన కోసం కష్టాల్ని సైతం లెక్కచేయని మనస్తతత్వం ఉన్నవాడు ప్రజానాయకుడిగా ఎదుగుతాడు.. ప్రజల గుండెల్లో శాశ్వతంగా కొలువు ఉంటాడు. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇందుకు నిలువెత్తు నిదర్శనం. అందుకే ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాజన్న ‘ఆశయ’ వారసత్వాన్ని కొనసాగించేందుకు అనేక కష్టనష్టాలకోర్చి 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించి ప్రజా సమస్యల గురించి స్వయంగా తెలుసుకున్నారు. ఆ క్రమంలో హత్యాయత్నం వంటి ఘటనలు చోటుచేసుకున్నా మడమ తిప్పక ప్రజాక్షేత్రంలోనే గడిపారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రత్యర్థులు తన చిన్నాన్నను హత్య చేసి కుట్ర రాజకీయాలకు తెరతీసినా బాధను దిగమింగి.. సంయమనం పాటిస్తూ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ‘జగన్ అనే నేను’ అంటూ ఆయన పలికే మాటల కోసం వైఎస్ జగన్ అభిమానులే కాదు సామాన్య ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో రాజన్న పాదయాత్ర ఘట్టాన్ని ‘ యాత్ర’గా తెరకెక్కించిన సినిమా దర్శకుడు మహి వి రాఘవ్ ప్రస్తుతం ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. వైఎస్ జగన్ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యాలకు.. ‘జైబోలో ఆజాదీ’ అంటూ ఫుల్‌జోష్‌గా సాగే బీజీని జతచేశారు. ‘అప్నా టైమ్ ఆయేగా’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
‘యాత్ర’పై ఏపీ పోలీసుల జులుం..!
సాక్షి, తిరుపతి : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా మహి వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర సినిమాపై ఏపీ పోలీసులు జులుం ప్రదర్శించారు. తిరుపతిలోని పలని థియేటర్ వద్ద మంగళవారం ఓవర్ యాక్షన్ చేశారు. ఈ సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులను థియేటర్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ప్రేక్షకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 8న రిలీజైన ‘యాత్ర’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా పలు చోట్ల ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వైఎస్సార్ పాత్రలో మళయాల మెగాస్టార్ మమ్ముట్టి ఆకట్టుకున్నారు. -
మరో తెలుగు సినిమాలో దుల్కర్
మళయాల యువ కథనాయుకు దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓకె బంగారం సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించిన దుల్కర్, మహానటితో స్ట్రయిట్ తెలుగులో సినిమా నటించాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో దుల్కర్‌ను టాలీవుడ్ నుంచి ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఈ యువ నటుడు మరో తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మళయాల మెగాస్టార్ దుల్కర్ తండ్రి అయిన మమ్ముట్టి ప్రధాన పాత్రలో యాత్ర సినిమాను తెరకెక్కించిన మహి వీ రాఘవ దర్శకత్వంలో దుల్కర్, తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే మహి చెప్పిన లైన్‌కు ఓకె చెప్పిన ఈ యంగ్ హీరో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. -
యాత్ర పాటతో ఆకట్టుకుంటున్న చిన్నారి
-
యాత్ర పాటతో ఆకట్టుకుంటున్న చిన్నారి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ అప్రతిహతంగా దూసుకుపోతోంది. కలెక్షన్ల జోరుతోపాటు విమర్శకుల ప్రశంసలను సైతం చేసుకుంటోంది. ప్రేక్షకుల ఆదరణ విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులనే కాదు.. చిన్నా పెద్దా అందరినీ ఆకట్టుకుంటూ తన పత్ర్యేకతను నిలబెట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాలోని హిట్ సాంగ్ సమర శంఖం పాటను అలవోకగా ఆలపించడం పలువురిని ఆకర్షిస్తోంది. కఠినమైన పదాలు కలిగిన పాటను కూడా చాలా ఈజీగా పాడుతోందనీ, యాత్ర సినిమాను ప్రజలు ఎలా గుండెల్లో పెట్టుకున్నారో చూడండి అంటూ సినిమా దర్శకుడు మాహి వి రాఘవ్ దీన్ని ట్వీట్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా వి రాఘవ్ దర్శకత్వంలో వైఎస్ఆర్ పాత్రను ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి పోషించిన సంగతి తెలిసిందే. ‘సమర శంఖం’ పాటను ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా, కీరవాణి తనయుడు కాల భైరవ ఆలపించారు -
యాత్ర సినిమా చూశా: వెంకయ్య నాయుడు
సాక్షి, నెల్లూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్రాన్ని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. శనివారం ఆయన నెల్లూరులో స్వర్ణభారతి ట్రస్ట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఈ మధ్యకాలంలో ‘యాత్ర’ సినిమా చూశా.. చాలా బాగుంది. రైతులు, సంస్కృతి, సంప్రదయాలన్నా నాకు ప్రాణం. మనం చేసే మంచి పనులే మన తరువాత మనలను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి.’ అని వెంకయ్య అన్నారు. ఏ హోదాలో ఉన్నా సొంత గ్రామాన్ని మరచిపోనని, ఎవరి పని వారు చేయడమే దేశభక్తి అని ఆయన పేర్కొన్నారు. ప్రజా జీవనంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అనేది తన భావన అని, కానీ తన పదవి, భద్రత, హోదాకు భంగం కలగకుండా ప్రవర్తిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మెలిసి ఉండే తత్వం తనదని చెప్పారు. మాతృభాష పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలన్నారు. భాషా ప్రగతికి తీసుకోవాల్సిన చర్యలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలలో పర్యటిస్తూ విద్యార్థులకు మార్గదర్శకాలు చెపుతున్నట్లు వెంకయ్య పేర్కొన్నారు. ఉత్తర భారతదేశం వాళ్లు దక్షిణ, దక్షిణాది వాళ్లు ఉత్తరదేశ భాషలు నేర్చుకుంటే దేశ సమైక్యత బలపడుతుందని ఉప రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. -
ఎన్టీఆర్ బయోపిక్కు వెన్నుపోటు
సాక్షి, హైదరాబాద్ : కథానాయకుడు బోల్తా కొట్టడంతో... మహానాయకుడుపై మేకర్స్ ప్రత్యేక దృష్టి సారించి ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే.. అందరి ఊహాగానాలకు భిన్నంగా సాగిన ఈ సినిమా అభిమానులను ఆశ్చర్యంలో ముంచింది. బయోపిక్ అంటే కత్తిమీద సాము లాంటిది. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే.. కొందరికి రుచించకపోవచ్చు. కొన్ని వాస్తవాలను దాచిపెట్టినా... అసలు ఏమాత్రం పొంతనలేని, జరగని సంఘటనలు జరిగినట్టు చూపించడమే కాకుండా ఈ సినిమాలో కథకు మూలమైన నాయకుడి పాత్రను తగ్గించి మరోపాత్రకు ప్రాధాన్యత కల్పించడంతో అసలు బయోపిక్ అర్థాన్నే మార్చడం గమనార్హం. బాలీవుడ్లో వచ్చిన ‘సంజు’ గమనిస్తే అందులో సంజయ్ దత్ కావాలని ఎలాంటి తప్పు చేయలేదనీ, పరిస్థితులే అతన్ని అలా మార్చేశాయనీ, తప్పంతా మీడియాదేనని, సంజు మంచి బాలుడు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సంజు పాత్రలో రణ్‌బీర్ అద్భుత నటనకు ప్రశంసలైతే వచ్చాయి. కానీ, సినిమా కథ, కథనాలపై ఘాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తెలుగులో బయోపిక్ ట్రెండ్ రావడానికి కారణం మహానటి. అలనాటి మహానటి సావిత్రి జీవితం గురించి, ఆమె చివరి రోజుల్లో మద్యానికి బానిసవ్వడం, ఆమె మరణానికి దారితీసిన కారణాలు అందరికీ తెలిసిందే. అయితే ‘మహానటి’లో సావిత్రిలోని మంచి గురించి, చెడు గురించి చెప్పారు కాబట్టే.. ఆ చిత్రాన్ని ఆదరించి పట్టం కట్టారు. అయితే ఆమెలోని చెడును కూడా ప్రేక్షకులు ఒప్పుకునేట్టు చేసి.. ఆ పరిస్థితిలో ఎవరైనా అలాగే చేస్తారులే.. అని ప్రేక్షకుల చేతే అనిపించేలా చేయగలగడం దర్శకుడి గొప్పదనం. అందుకే మహానటి అంతటి విజయాన్ని సొంతంచేసుకుని.. ఆ మహానటికి నిజమైన నివాళిగా ‘మహానటి’ చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాకుండా కథను ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా చెప్పడమే కాకుండా ఆ పాత్రను వేస్తున్న నటీనటులు అందులో పరకాయ ప్రవేశం చేయాలి. అప్పుడే ప్రేక్షకులు ఆ పాత్రను నమ్ముతారు. పాత్రతో పాటే లీనమవుతారు. ఇలా మహానటికి అన్నీ కుదరడంతో తెలుగు తెరపై బయోపిక్‌లకు మార్గదర్శకంగా నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్‌ది స్వర్ణ యుగమని అందరికీ తెలిసిందే. తిరుగులేని కథానాయకుడిగా ప్రజల్లో దేవుడిగా ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనాలు సృష్టించారు. అయితే ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయనకు ఎదురైన అనుభవాలు, లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించడం.. చంద్రబాబు వెన్నుపోటు పొడవడం, చివరగా ఆయన మరణం... ఇదంతా వెండితెరపైన చూపిస్తే ఎన్టీఆర్ బయోపిక్ సక్సెస్ అయ్యేదేమో. అలా కాకుండా వారు మెచ్చిన వాటిని ఎంపిక చేసుకుని నచ్చినట్టుగా తెరకెక్కిస్తే సహజంగానే ప్రేక్షకుల ఆదరణ లభించదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల విడుదలైన యాత్ర సినిమా కూడా ప్రేక్షకులను కదిలించిందంటే.. కథ, కథనంలో ఉన్నఆ పట్టు.. ఆ పాత్రను అంతగా పోషించిన కథానాయకుడు పాత్రలో జీవించారు. సినిమాలో భావోద్వేగాలు పండటంతోనే సినిమా అందరిని ఆకట్టుకుంది. సినిమా పక్క దారి పట్టకుండా వారు ఏం చెప్పదలుచుకున్నారో అదే చెప్పారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్‌గా చెప్పుకుంటున్న కథానాయకుడు, మహానాయకుడులో అవి లోపించాయి. కథను తమకు నచ్చినట్టుగా మార్చడంతో అసలు విషయాలను కావాలనే దాచిపెట్టినట్టు ప్రేక్షకుల ముందు ఇట్టే తేలిపోయింది. తెరపై ఎన్టీఆర్ పాత్రను పండించడం పక్కన పెడితే, ప్రేక్షకులను సినిమాలో లీనం చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కోవలసివచ్చింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానాయకుడు పూర్తిగా గాడి తప్పడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఇది ఎన్టీఆర్ గురించి తీసిన సినిమా? లేక చంద్రబాబును పైకెత్తడానికి తీసిన సినిమా? అన్న అనుమానం సగటు ప్రేక్షకుడికి వస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విడుదల చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంలో అత్యంత దుర్భరమైన వెన్నుపోటు ఘటనను చూపించకపోవడం కావాలనే పక్కన పెట్టినా... విలన్ పాత్రలో ఉండాల్సిన వ్యక్తిని హీరో పాత్రలో చూపించడం ప్రేక్షకులకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ప్రధాన ఘట్టంగా నిలిచిన వెన్నుపోటు ఘటనలో ముద్దాయిని చూపించకపోయినప్పటికీ ఎన్టీఆర్, ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ ఒక మునిగిపోతున్న నావగా చిత్రీకరించడమే కాకుండా ఆ నావను ఒడ్డుకుచేర్చి కాపాడిన మహోన్నత వ్యక్తిగా బాబును చిత్రీకరించారు. ఈ వక్రీకరణలు మింగుడుపడని అభిమానులు సోషల్‌మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకుడికి బాబు మహానాయకుడా..లేక ఎన్టీఆర్ మహానాయకుడా అన్న సందేహం వస్తుంది. కథను కథనాన్ని గమనిస్తే బాబుకోసం ఈబయోపిక్ ను బలిపెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతో సహజంగానే అందరి దృష్టి ఇప్పుడు వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై పడింది. సినిమాను ప్రకటించినప్పటి నుంచి సాధారణ ప్రేక్షకుడు సైతం.. వర్మ తీస్తున్న సినిమాపైనే ఆసక్తి చూపించాడన్న సంగతి తెలిసిందే. మహానాయకుడు ఎక్కడ ముగిసిందో.. ఎన్టీఆర్ జీవితంలో అసలు కథ ఎప్పుడు మొదలైందో.. అక్కడి నుంచే వర్మ తన సినిమాను ప్రారంభించడమే అందరి దృష్టిలో పడటానికి కారణం. మహానాయకుడులో ఆకాశానికెత్తేసిన చంద్రబాబు.. అసలు రంగు వర్మ తీసిన సినిమాల్లో బయటపడుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు చలోక్తులు విసురుకుంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ అంటూ హడావిడి సృష్టించిన బాలయ్య.. తన బావకు ఏదో మేలు చేద్దామని చేసిన ప్రయత్నం వృథా అయిందని ఆయన అభిమానులే పెదవి విరుస్తున్నారు. చదవండి : ‘యన్‌టిఆర్ మహానాయకుడు’ రివ్యూ ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ మూవీ రివ్యూ -
‘యాత్ర’ను తిలకించిన ఏయూ ప్రొఫెసర్లు
సాక్షి, విశాఖపట్నం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’సినిమాను ఆదివారం ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్లు తిలకించారు. ద్వారకానగర్‌లోని సంగం థియేటర్లో డాక్టర్ డి.వి.రామకోటిరెడ్డి, డాక్టర్ బి.సాంబరెడ్డి, డాక్టర్ ప్రేమానందం, డాక్టర్ నాయుడు ఆధ్వర్యంలో 100 మందికి పైగా ఏయూ ఉద్యోగులు ఈ సినిమాను తిలకించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. 1975 నుంచి 2003 వరకు సాధారణ నాయకుడిగా జీవించిన వైఎస్ రాజశేఖరరెడ్డి.. పాదయాత్ర అనంతరం మహానేత అయ్యారన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారని కొనియాడారు. ఏయూలో ప్రస్తుతం 360 మంది ప్రొఫెసర్లు ఉన్నారని.. అందులో 240 మంది ఆయన హయాంలో నియమితులయ్యారని చెప్పారు. ఆయన వల్లే ఇప్పుడు ఏయూ ప్రపంచంలో అత్యుత్తమ ర్యాంక్ గల యూనివర్సిటీల్లో ఒకటిగా ఉందన్నారు. ప్రస్తుతం తామంత ఉద్యోగాలు చేస్తున్నామంటే ఆ మహానేత పుణ్యమేనని భావోద్వేగానికి లోనయ్యారు. అలాంటి నాయకుడి కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. పేదవాడి కళ్లల్లో ఆనందం చూడాలని, ప్రభుత్వ పాలన ప్రతి ఒక్కరికీ అందాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన ప్రతి అడుగు నవ శకానికి నాంది పలికిందన్నారు. ఈ విషయం నేటి తరానికి అర్థమయ్యే విధంగా ‘యాత్ర’ సినిమా అద్భుతంగా సాగిందన్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగాలకు లోనయ్యారన్నారు. వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పోశారని.. ఆయన చెప్పిన ‘మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాను..ఇచ్చాక ఏముంది.. ముందుకు వెళ్లాల్సిందే’అనే డైలాగ్ చాలా బాగుందన్నారు. నేటి యువతరానికి ‘యాత్ర’ లాంటి మంచి సినిమాను అందించిన డైరెక్టర్ మహి వి.రాఘవకు ధన్యవాదాలు తెలిపారు. -
యాత్ర ఒక బాట.. ఒక మాట
మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిప్రతి పథమూ ఒక గొప్ప యాత్ర. నడక భరోసా ఇవ్వాలి.నడత స్ఫూర్తిని కలిగించాలి. ఇది జనం నచ్చిన యాత్ర.. జగం మెచ్చిన యాత్ర. ‘‘మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేదేముంది.. ముందుకెళ్లాల్సిందే.’’‘‘జనాలకు ఏం కావాలో తెలుసుకోవాలని ఉంది. వినాలనీ ఉంది. కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది.’’‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’’‘యాత్ర’ చిత్రంలోని ఈ సంభాషణలు వింటే చాలు.. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిత్వం, పట్టుదల తెలియడానికి. ప్రజలకు మేలు చెయ్యాలన్న నాయకుడని చెప్పడానికి! మండుటెండలో నాయకుడు నడుస్తుంటే.. మనమెందుకు ఆ ఎండలోకి వెళ్లాలని ప్రజలు అనుకోకుండా.. ఆయన్ని కలిసేందుకు.. తమ బాధల్ని చెప్పుకునేందుకు అడుగులో అడుగేశారు. ‘‘అలాంటి వ్యక్తినిరాజకీయ నాయకుడని అనరు. ప్రజా నేత అని పిలుస్తారు’’ అని చెబుతున్నారు.. మమ్ముట్టి. ‘యాత్ర’ సినిమాతో తెలుగుతెరపై రీ ఎంట్రీ ఇచ్చిన మమ్ముట్టి.. జనం గుండెచప్పుడని చెప్పే రాజన్న రాజసాన్ని మరోసారి ప్రజలకు పరిచయం చేశారు. వైఎస్సార్ అంతరంగాన్ని ఆకళింపు చేసుకొని మరీ నటించి.. నడుస్తున్న చరిత్రగా రాజన్న ప్రజాప్రస్థానాన్ని ప్రజలకు అందించిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ. ► ‘యాత్ర’ సినిమా ఘనవిజయం సాధించినందుకు ముందుగా కంగ్రాచ్యులేషన్స్. ►మమ్ముట్టి: థ్యాంక్యూ. ఇది ‘యాత్ర’ యూనిట్ విజయం. అంతకుమించి ప్రజలది. అన్నింటికన్నా.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిత్వానిదీ విజయం. ► సుమారు నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్లో ఎన్నో సక్సెస్‌లు చూశారు. ఈ సినిమా సక్సెస్ ఎలాంటి అనుభూతిని ఇస్తోంది? ►ఇది నాకు స్పెషల్ సినిమా. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడి జీవితంలోని ఓ భాగాన్ని కథగా రూపొందించి మలచిన చిత్రమిది. దీన్ని బయోపిక్ అనలేం. వైఎస్సార్ లైఫ్‌లోని ఓ ఈవెంట్ బేస్డ్ స్టోరీ అని కూడా అనుకోలేం. ఎందుకంటే ఆయన ప్రజా ప్రస్థాన యాత్ర ఓ నడుస్తున్న చరిత్ర. అందుకే.. అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ►350 సినిమాల కెరీర్లో మీకు కాంప్లిమెంట్స్ కొత్త కాదు. ఈ సినిమాకు మాత్రం సామాన్యుల నుంచి సినీ దిగ్గజాల వరకూ ప్రతి ఒక్కరూ మీ నటనను ప్రశంసిస్తున్నారు. మమ్ముట్టి తప్ప మరెవర్నీ ఈ క్యారెక్టర్లో ఊహించుకోలేక పోతున్నామంటున్నారు. మీరెలా ఫీలవుతున్నారు.? ►ఎవరి నటనతో వారు మెప్పించగలరు. నాకు అవకాశం వచ్చింది. నేను నటించాను. అందరి నుంచి ప్రశంసలు పొందుతున్నాను. హ్యాపీగా ఉన్నాను. అయితే సక్సెస్‌కు పొంగిపోవడం నాకు రాదు. చాలా రోజుల తర్వాత తెలుగులో నటించాను. ఈ చిత్రకథ, డైరెక్టర్ మహి కథ చెప్పిన విధానం నన్ను ఇంప్రెస్ చేసింది. నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా కావడంతో వెంటనే ఓకే చెప్పాను. ►డైరెక్టర్ మహి కథ చెప్పక ముందు వైఎస్సార్ గురించి మీకు ఏం తెలుసు.? ►ఒక పౌరుడిగా సమకాలీన రాజకీయాల గురించి తెలుసుకుంటూ ఉంటాను. ఆ సందర్భంలోనే వైఎస్సార్ రాజకీయ ప్రస్థానం గురించి చాలాసార్లు విన్నాను. న్యూస్‌లోనూ, పత్రికల్లోనూ ఆయన అద్భుతమైన పాలన గురించి చూశాను, చదివాను. ఆయన వ్యక్తిత్వం గురించి కూడా తెలుసుకున్నాను. ►వైఎస్సార్‌ను ప్రత్యక్షంగా ఒక్కసారి కూడా మీరు చూడలేదు. కానీ ఆయన రాజసం, మాటల్లో గాంభీర్యం, నడకలో తెగువ, చేయి ఊపడం.. అన్నీ ఎలా పండించగలిగారు? ►వైఎస్సార్‌ను ఇమిటేట్ చెయ్యాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆయనలా నడవాలని, ఆయనలా మాట్లాడాలని ప్రతి సీన్‌కు ముందు అనుకోలేదు. నా సినీ అనుభవంతో నేను వైఎస్సార్ అనే పాత్రలో నటిస్తున్నాను కాబట్టి.. ఆ క్యారెక్టర్ ఇలా ఉంటుందని ఊహించుకొని నటించాను. అయితే ఆ సీన్లన్నీ చరిత్రలో ఏం జరిగాయో, ఆయన హావభావాలు ఎలా ఉన్నాయో.. అచ్చం అలా వచ్చేశాయి. యాదృచ్ఛికంగా వైఎస్సార్ బాడీ లాంగ్వేజ్, నేను నటించిన విధానం ఒకేలా రావడం ఆశ్చర్యం. ►‘యాత్ర’ సినిమా కథ వినక ముందు వైఎస్సార్‌పై మీ అభిప్రాయం, కథ విన్న తర్వాత, సినిమా చేసిన తర్వాత ఆయన పై మీ అభిప్రాయం ఎలా ఉంది.? ►చూడండి.. నేను ఒక సామాన్య పౌరుడిగా దేశ రాజకీయాల గురించి తెలుసుకుంటూ ఉంటాను. అయితే ఏపీ రాజకీయాల గురించి అంతగా అవగాహన లేదు. కానీ రాజశేఖర్‌రెడ్డి లీడర్షిప్ గురించి మాత్రం కొంత తెలుసు. ‘యాత్ర’ కథ విన్నాక పూర్తిస్థాయి అవగాహన వచ్చింది. వైఎస్సార్ క్యారెక్టర్ నచ్చింది కాబట్టే ‘యాత్ర’ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను. ►ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ ఎమోషన్ ఉంది. మీకు హార్ట్ టచింగ్ అనిపించిన ఎమోషనల్ సీన్ ఏది? ►ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల కోసం జీవిస్తూ, వారి ఎమోషన్లను పంచుకునే ప్రతి నాయకుడూ సక్సెస్ అవుతాడు. రాజశేఖర్‌రెడ్డి ఈ కోవకు చెందిన వారే. తెలుగు ప్రజలందరిలోనూ వైఎస్సార్‌తో ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారు. రాజన్న మనకోసం ఉన్నాడు, మనకు ఉపకారం చేసేందుకు వచ్చాడు, మన బాధలు తీర్చే నాయకుడని విశ్వసించారు. అందుకే సినిమాలో నటించేటప్పుడు నేను ఆ ఎమోషన్‌ను చూపించాలని అనుకున్నాను. సక్సెస్ అయ్యాను. సినిమా చూసినంతసేపూ ప్రేక్షకులు ‘అతను మన రాజశేఖర్‌రెడ్డి.. మన జీవితాల్ని బాగుచేసింది ఈయనే’ అన్న ఉద్వేగానికి గురయ్యారు. అందుకే ప్రతి సన్నివేశం ప్రజల హృదయాల్ని హత్తుకునేలా ఉంది. అదే ఫీలింగ్ నాలోనూ ఉండిపోయింది. ఒక సన్నివేశం అని కాదు.. సినిమా మొత్తం నాకు నచ్చింది. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ►ఒక రాజకీయ నాయకుడి గురించి సినిమా అంటే.. ఆయన అభిమానులు, పార్టీకి సంబంధించిన వారికే నచ్చుతుందని భావిస్తారు. కానీ.. ‘యాత్ర’ మాత్రం అన్ని వర్గాల వారి హృదయాల్ని కదిలించింది. కన్నీళ్లు పెట్టించింది. ఇంతటి ఘన విజయం ఊహించారా? ►వైఎస్సార్ జీవిత చరిత్ర మొత్తం చెప్పిన కథ కాదు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఓ రాజకీయ నాయకుడు ప్రజల్లోకి వెళ్తూ చేసిన పాదయాత్ర అనే భాగం. పాదయాత్రకు మునుపు పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు పాదయాత్ర ఎందుకు చెయ్యాల్సి వచ్చింది, సుదీర్ఘ పాదయాత్ర ఎలా చేశారు? ఆయన పాదయాత్ర చేసిన నాటికి ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు, ఆయన వాటిని వింటూ, భరోసా ఇచ్చిన విధానం గురించి ప్రజలకు వివరించిన చిత్రమిది. పార్టీ గురించి కాకుండా ప్రజల గురించి చేసిన పాదయాత్ర కావడం.. ఆ విశేషాలను చక్కని స్క్రీన్‌ప్లేతో కళ్లకు కట్టినట్లు చూపించడం వల్లే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు. ►50 ఏళ్లు దాటాక సుదీర్ఘ పాదయాత్ర చెయ్యడం, అదీ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం.. ఏ రాజకీయ నాయకుడికైనా సాధ్యమని మీరు భావిస్తారా.? ►పాదయాత్ర అంటే కేవలం అలా నడుచుకుంటూ వెళ్లిపోవడం కాదు. వెయ్యి, రెండు వేల కిలోమీటర్లు నడిచి వెళ్లిపోవడం కాదు. ఆ యాత్రలో ఏం జరిగింది? ప్రజలను ఎలా కలుసుకున్నారు? వారి బాధలు ఎలా తెలుసుకున్నారు? నడిచి వస్తున్న నాయకుడ్ని ప్రజలు ఎలా ఆదరించారన్నది ముఖ్యం. ఏదో నడిచాం.. మాట్లాడాం అన్నది కాదు. వారి బాధల్ని మర్చిపోయేలా భరోసా ఇవ్వడం. వారికోసం ఏం చేస్తామో కుండబద్దలుకొట్టినట్లు వైఎస్సార్ చెప్పారు. అందుకే యాత్ర తర్వాత ముఖ్యమంత్రిగా ప్రజలు పట్టం కట్టారు. ప్రజలు నమ్మారు. ఆ వయసులో తమ కోసం నడిచి వచ్చి.. తమ బాధలు వినేందుకు రావడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే నాయకుడు వచ్చాడని ఆనందపడ్డారు. ►రాజకీయాలకు అతీతంగా సాగుతున్న ‘యాత్ర’ సినిమా విజయం గురించి ఒక్కమాటలో చెప్పండి.? ►ఇది రాజకీయ నాయకుడి సినిమా కాదు. ప్రజా నాయకుడి చిత్రం. అందుకే అందరూ ఆదరిస్తున్నారు. ►మలయాళం, తమిళ ప్రజలు కూడా యాత్రను ఆదరిస్తున్నారు కదా.. ►అవును. తెలుగులో విజయం సాధించిందంటే.. రాజశేఖర్‌రెడ్డి గురించి తెలుసు అనుకోవచ్చు. కానీ.. తమిళం, మలయాళంలోనూ ప్రజలు ‘యాత్ర’ సినిమాను ఆదరిస్తున్నారు. ఎందుకంటే వైఎస్సార్ అనే ఓ ప్రజానేత గురించి చెప్పిన చిత్రమిది. ఒక పొలిటికల్ లీడర్... పీపుల్స్ లీడర్‌గా ఎలా మారాడన్నది తెలుసుకున్న ప్రజలు సినిమాను బ్రహ్మరథం పడుతున్నారు. ►కొత్త జనరేషన్‌కు వైఎస్సార్ వ్యక్తిత్వాన్ని చూపించారు. రాజశేఖర్‌రెడ్డి గురించి తెలియని యువతకు ‘యాత్ర’ సినిమా చూపిస్తూ ఇలా ఉండేవారు అని చెబుతున్నారు ►నిజమే. నేనూ విన్నాను.. కొత్త జనరేషన్ వైఎస్సార్ పేరు, ఆయన ఏం చేశారు అనేవి మాత్రమే విని ఉంటారు. యాత్రలో చూపించిన ప్రతి సన్నివేశం యువతను ఆకట్టుకుంటోందని ప్రజలు చెబుతున్నారు. ► సినిమాలోని డైలాగ్స్ ప్రేక్షకులకు కన్నీరు తెప్పించాయి. ఆ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఉద్వేగానికి లోనయ్యారు? ►రైతుల కోసం ఓ డైలాగ్ ఉంటుంది. ఈ యాత్రలో కన్నీళ్లు పెట్టుకున్న రైతుల్ని చూశాను.. వాళ్ల కన్నీళ్లతో కూడా తడవని నేలని చూశాను. జీవంలేని ఆ భూముల్ని చూసి ప్రాణం వదిలిన ఎంతో మంది రైతుల్ని చూశాను. నేను విన్నాను.. నేను ఉన్నాను.. ఇది చాలా ఉద్వేగమైన సంభాషణ. నిజమే కదా.. నాయకుడంటే ప్రజలు తయారు చేసినవాడే. ఎండలో పనిచేసే ప్రతి పేదవాడికీ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని భావించిన రాజశేఖర్‌రెడ్డి యాత్ర చేశారు. ►మీరు నటించిన సినిమాల్లో పంచెకట్టు ఉంటుంది. వైఎస్సార్ పంచెకట్టు ఎలా అనిపించింది? ►పంచెకట్టు నేను నటించిన చాలా సినిమాల్లో ఉంది. అయితే ‘యాత్ర’ లో పంచెకట్టు ప్రత్యేకంగా ఉంది. అది కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ►సినిమాలో మీ క్యారెక్టర్ కాకుండా.. ఇంకా ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది.? ►అన్ని పాత్రలూ సమానమే. ప్రతి పాత్ర నిజ జీవితంలో జరిగిందే కదా. అందుకే ఎవరి పరిధిలో వారు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సినిమాలో చెప్పుకోవాల్సింది స్నేహానికి వైఎస్సార్ ఎంత విలువ ఇచ్చారన్న పాయింట్ గురించి. ఆయన స్నేహితుడు కేవీపీ పాత్రలో రావురమేష్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఇప్పుడు నేను, రావు రమేష్ మంచి స్నేహితులుగా మారిపోయాం కూడా. సినిమాలో నన్ను చాలా సపోర్ట్ చేశారు. ►తెలుగులో చాలా గ్యాప్ తర్వాత కనిపించారు. మళ్లీ ఎప్పుడు తెలుగు తెరపై మిమ్మల్ని చూడవచ్చు? ►తెలుగులో నటించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. ►మలయాళీ మెగాస్టార్‌గా కాకుండా.. సామాజిక కార్యకర్తగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సేవా కార్యక్రమాలు కేరళకు మాత్రమే పరిమితం చేశారు. మిగిలిన రాష్ట్రాలకు విస్తరిస్తారా? ►అదేం లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ అవసరం ఉన్నా సేవలందిస్తున్నాం. బాల కార్మికులకు విద్యనందించేందుకు స్ట్రీట్ ఇండియా మూమెంట్, పేదలకు ఉచిత క్యాన్సర్ చికిత్స అందించేందుకు పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సొసైటీ పేరుతో కార్యక్రమాలు, ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. క్యాన్సర్ ట్రీట్మెంట్ సేవా సంస్థ ఏపీలోనూ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ► 350 సినిమాలు, 3 నేషనల్ అవార్డులు, 7 కేరళ ఫిల్మ్ అవార్డులు, 13 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, డాక్టరేట్లు, పద్మశ్రీ.. ఇలా మీ ప్రస్థానం సాగుతోంది. మీరెలా ఫీలవుతున్నారు.? ►చాలా సంతోషంగా ఉంది. ఇది కొనసాగిస్తాను. నావరకూ నేను సేవా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చెయ్యాలని అనుకుంటున్నాను. ► ‘యాత్ర’ సినిమా చూసిన వారు మమ్ముట్టి రాజ కీయాల్లోకి వస్తారని ఊహాగానాలు చేస్తున్నారు. ఇందులో నిజమెంత ఉంది? ►సినిమాల్లో ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. వారిని ఆనందపరిచేందుకు నేను సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదు. ‘యాత్ర’ సినిమాపై కొంతమంది ప్రేక్షకుల స్పందన నడుస్తున్న చరిత్ర కథ మంచి ఎమోషనల్ టచింగ్‌గా ఉంది. ప్రజల నాయకుడైన ఒక గొప్ప రాజకీయ నాయకుడి కథ ఇది. మా ముందుకు మళ్లీ వైఎస్ఆర్ను తీసుకొచ్చారు. ఓ వైపు కన్నీళ్లు వస్తున్నాయ్.. మరోవైపు చప్పట్లు కొడుతూ ఉండిపోయాం. నాలుగైదు సార్లు కళ్లు చెమర్చినా, అరె సినిమా అప్పుడే అయిపోయిందే! అనిపించింది. చరిత్ర సృష్టించిన ‘ఆరోగ్యశ్రీ’, రికార్డుకెక్కిన ‘ఫీజ్ రీయింబర్స్మెంట్’, నేటికీ నిలిచిన ‘ఉచిత విద్యుత్’, ప్రాంతాల గతి మార్చిన ‘జలయజ్ఞం’... ఇలా అయిదున్నరేళ్ల అభివృద్ధి – సంక్షేమం జోడు గుర్రాల స్వారీతో పాలన పరుగులెత్తించిన అన్ని పథకాలూ.. ‘పాదయాత్ర’లో ఎలా పురుడు పోసుకున్నాయో ఒడుపుగా తెరకెక్కించారు. అది ముగిసిన యాత్ర కాదు.. ‘నడుస్తున్న’ చరిత్ర. అందుకే తడుస్తున్న కళ్లతో ఆ చిత్రాన్ని చూస్తున్నాం. – రామకృష్ణారెడ్డి, కాంతమ్మ దంపతులు, బెంగళూరు వైఎస్సార్ వ్యక్తిత్వం తెలిసింది రాజశేఖర రెడ్డి వలన అనేకమంది లబ్ది పొందారు. ఆయన్ను మరచిపోలేము. మహోన్నత నాయకుడు. ఆయన పాత్రలో మలయాళ నటుడు ముమ్ముట్టి ఒదిగిపోయారు. రాజశేఖర రెడ్డి అంటే మంచి పరిపాలకుడు, సంక్షేమ పథకాలకు ఆద్యుడు అని మాత్రమే మాకు తెలుసు. ‘యాత్ర’ సినిమా చూశాక ఆయన వ్యక్తిత్వం మాకు మరింత తెలిసింది. కష్టాలలో ఉన్నవారికి ధైర్యం ఇవ్వడం, వారికి అండగా ఉండడం, అధిష్టానాన్ని తనదైన శైలిలో ఎదిరించడం, మాట ఇచ్చాక దానికి కట్టుబడి ఉండడం ఒక ఎత్తు అయితే ‘యాత్ర’లో ముమ్ముట్టిని చూశాక రాజశేఖర రెడ్డిని మరోసారి చూసినట్లు అయ్యింది. ఆయన పదవిలోకి వచ్చాక ఆయన చేపట్టిన కార్యక్రమాలు మరింతగా చూపించాల్సింది. ఏది ఏమైనా ‘యాత్ర’ సినిమా రాజశేఖర రెడ్డిలోని అన్ని కోణాలను కళ్లకు కట్టినట్లు చూపారు. సినిమా సూపర్బ్. – జుత్తాడ అరుణకుమారి, బొబ్బిలి క్లైమాక్స్ కన్నీళ్లు తెప్పించింది నేను, నా భర్త ‘యాత్ర’ సినిమా చూస్తున్న కొద్దీ తర్వాత ఏం జరుగుతుందోనన్న ఒక ఫీలింగ్ కలిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి చాలా అద్భుతంగా నటించారు. వైఎస్సార్ చేసిన నిజజీవితపు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వం రాగానే వాటిని అమలు చేస్తామన్న వాగ్దానాలు ‘యాత్ర’ సినిమాలో బాగా ఆకట్టుకున్నాయి. సినిమా చివరిలో వైఎస్ రాజశేఖరరెడ్డి రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరిన హెలికాప్టర్ సన్నివేశాలను చూపిస్తూ కన్నీళ్ళు తెప్పించారు. – ధర్మాన సుశ్రీ, శ్రీకాకుళం అద్భుతంగా చూపించారు ‘యాత్ర’ సినిమాలో రాజశేఖర్‌రెడ్డి ప్రజా ప్రస్థాన యాత్రలో ఎదురైన అనుభవాలను చక్కగా చూపించారు. వాస్తవాలను తెరపైకి తీసుకొచ్చారు. డైర్క్షన్ అదుర్స్. స్క్రీన్‌ప్లే అద్భుతం. ఈ గడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది డైలాగ్ సూపర్. సినిమా ప్రతి వర్గాన్ని ఆకట్టుకునేలా ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కంట తడితో బయటికి వస్తున్నారు. ‘యాత్ర’ సినిమాతో రాజశేఖర రెడ్డిని గుర్తు చేశారు. అలాంటి నాయకుడు మళ్లీ రావాలని దేవుని కోరుకుంటున్నాం. – సాత్విక, చిత్తూరు ఆ తర్వాత మళ్లీ ‘యాత్ర’కే క్షీరాభిషేకాలు 20 సంవత్సరాలుగా సినిమా రిప్రజెంటేటివ్‌గా వ్యవహరిస్తున్నాను. మాతృదేవోభవ, అమ్మోరు చిత్రాల అనంతరం థియేటర్ల వద్ద మళ్లీ క్షీరాభిషేకాలు చూడటం జరిగింది. ‘మాతృదేవోభవ’లో ఆద్యంతం హృదయాన్ని పిండే సన్నివేశాలు చూసి, చెమర్చిన కళ్లతో ప్రేక్షకులు హాలు నుంచి బయటకు వచ్చేవారు. ఇప్పుడు మళ్లీ ‘యాత్ర’ సినిమా చూసి వందలాది మంది చెమర్చిన కళ్లతో సినిమా హాలు నుంచి బయటకు వచ్చి మహానేతను మననం చేసుకోవడం కనిపించింది. – సోమరౌతు అప్పారావు, థియేటర్ రిప్రజెంటేటివ్, కొయ్యలగూడెం హృదయాన్ని కదిలించే సినిమా జన హృదయాలలోని సంఘర్షణలకు ప్రత్యక్ష రూపమిచ్చిన ‘యాత్ర’ సినిమా చూస్తున్నంత సేపూ వైఎస్సార్ నిజ జీవితంలో తిరుగాడినట్లుంది. వైఎస్సార్ పాత్రలో ముమ్ముట్టి జీవించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. హృదయాన్ని కదిలించే ఈ చిత్రంలోని సన్నివేశాలు చూస్తుంటే అడుగడుగునా మాకు జగన్మోహన్రెడ్డి ప్రసంగాలు విన్నట్టే అనిపించాయి. మా ఇంట్లో వారు పట్టుబట్టి చిత్రం చూశారు. మొత్తం మీద జీవితం లాంటి సినిమాను చూశామన్న తృప్తి అందరికి కల్గుతుంది. – కె.నరసింహారెడ్డి, ప్రయివేటు ఉద్యోగి, పుట్టపర్తి అందరూ ఫిదా రాజన్న నడకలోని రాజసం, మాటలోని గాంభీర్యం.. మనసులోని మర్మం.. సెల్యులాయిడ్‌పై నిలువెల్లా వ్యాపించింది. ‘యాత్ర’ చూశాను. ఇదొక ఎమోషనల్ జర్నీ. చాలా సందర్భాల్లో ఎమోషనల్ అయ్యాను. రాజన్నే స్వయంగా తెరపైకి వచ్చాడేమో అనేంతలా మమ్ముట్టి అద్భుతంగా నటించారు. ‘యాత్ర’ నిజాయితీతో కూడిన భావోద్వేగాలతో సాగే చిత్రం. హృదయాన్ని హత్తుకునే క్లైమాక్స్ ఉంది. సినిమా చూసిన తర్వాత రాత్రంతా ఆ మహానేత ఆలోచనలే. ‘యాత్ర’లో భాగంగా వచ్చే ప్రతి సీన్ మనసును కదిలించేలా ఉంది. ఓ రైతు పండించిన టమాటాలు అమ్ముకోలేకపోవడం.. కనీసం చార్జీలు ఇవ్వలేని పరిస్థితి, వైద్యం అందక ఓ అమ్మాయి చనిపోయే సీన్స్ చూస్తే చాలా సిగ్గేసింది. ఇన్ని కష్టాలను చూసి ఆ మహానేత వారికి భరోసా కల్పించి.. వారికిచ్చిన హామీలను నెరవేర్చడం చాలా గొప్ప విషయం. – సానికొమ్ము సుప్రియ, బెంగళూరు జన్మ చరితార్థమైంది ‘యాత్ర’ సినిమా ఉచిత షోలను ప్రదర్శించడం అదృష్టంగా భావిస్తున్నాను. మహానేతపై ఉన్న అభిమానంతో సినిమా హక్కులు కొనుగోలు చేయడమే కాక పేద మధ్య తరగతి ప్రజలు సైతం సినిమా చూడాలనే ఉద్దేశ్యంతో షోలను ఉచితంగా ప్రదర్శించి. జన్మను చరితార్థం చేసుకోగలిగాను. చిత్రాన్ని చూసిన ప్రతీ మహిళ, వృద్ధులు చెమర్చిన కళ్లతో మంచి చిత్రాన్ని చూపించి మాకు మళ్లీ మహానేతను మా ముందుంచావు అంటూ పేర్కొనడం గర్వకారణంగా భావిస్తున్నా. – గంజిమాల దేవి, వైఎస్సార్ అభిమాని, కొయ్యలగూడెం, ప.గో.జిల్లా, పాదయాత్రలో పాల్గొన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో తుగ్లక్ పాలన తలపించడంతో అన్ని వర్గాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న మహానేత వైఎస్ఆర్ ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా ప్రస్థాన ‘యాత్ర’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిశానిర్దేశాన్ని మార్చేసేందుకు దోహదం చేసింది. ఆం్ర«ధప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్రను ‘యాత్ర’ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూశాం. ఈ సినిమా చూస్తుంటే మహానేత వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రలో మొత్తం పాల్గొన్నట్లుగా ఉంది. సినిమా అద్భుతం. మలయాళ ప్రముఖ సినీ హీరో మమ్ముట్టి యాక్టింగ్ అచ్చం వైఎస్ఆర్ తరహాలోనే ఉంది. ‘యాత్ర ’సినిమాలో ఆయన ప్రతిపక్ష నేత హోదాలో కాంగ్రెస్ హైకమాండ్‌తో ఎలా నడుచుకున్నది, రైతుల సమస్యలు ఎలా తెలుసుకున్నది, విద్యార్థుల సమస్యలను.. ఇలా చెప్పుకుంటే పోతే రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రలో వైఎస్ఆర్ పడిన కష్టాలను మమ్ముట్టి ‘యాత్ర’ సినిమాలో చూశాం. నిజంగా ఇది యాత్ర సినిమా కాదు. మహానేత వైఎస్ఆర్ పాదయాత్రను, ఆయన వ్యవహారశైలిని దగ్గరగా చూసే అదృష్టం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. – శ్రీనివాసరెడ్డి పాల్వాయ్, ఆర్.కే.ఆస్పత్రి, బళ్లారి, కర్ణాటక. ప్రతి సీన్ బాగుంది మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఏముంది...ముందుకు వెళ్లాల్సిందే అంటూ హైకమాండ్‌ను ధిక్కరించి చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. అన్నింటికన్నా పెద్ద జబ్బు క్యాన్సరో...గుండె జబ్బో కాదయ్యా...పేదరికం అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఒకటేంటి.. ప్రతీ సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నిజజీవిత పాత్రలో మమ్ముట్టి జీవించేశారు. – తాన్న సునీల్‌కుమార్ (శ్రీకాకుళం–ఎచ్చెర్ల) ప్రతి సీన్ బాగుంది మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఏముంది...ముందుకు వెళ్లాల్సిందే అంటూ హైకమాండ్‌ను ధిక్కరించి చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. అన్నింటికన్నా పెద్ద జబ్బు క్యాన్సరో...గుండె జబ్బో కాదయ్యా...పేదరికం అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఒకటేంటి.. ప్రతీ సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నిజజీవిత పాత్రలో మమ్ముట్టి జీవించేశారు. – తాన్న సునీల్‌కుమార్ (శ్రీకాకుళం–ఎచ్చెర్ల) కళ్లకు కట్టినట్లు తీశారు ‘యాత్ర’ సినిమాలో రాజశేఖర రెడ్డిగారి పాద యాత్రను కళ్లకు కట్టినట్లు తీశారు. ఆయన నిజజీవితంలో జరిగిన ఎన్నో వాస్తవ సంఘటనలను యధావిదిగా చూపారు. రాజశేఖర రెడ్డి హావభావాలను అచ్చంగా అలానే ముమ్ముట్టి ప్రదర్శించారు. ఆయన నటన చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ‘యాత్ర’లో స్క్రీన్‌ప్లే బాగుంది. పాటలు ఇంకా ఉత్తేజంగా ఉంటే బాగుండేవి. రాజశేఖర రెడ్డి గొప్ప దార్శనికులు.ఆయన ఎందరి జీవితాలలోనో వెలుగులు నింపారు. కానీ ఆయన కుటుంబం అనేక కష్టాలలో ఉంది. ‘యాత్ర’ సినిమా జగన్‌కు మేలు చేయాలని కోరుకుంటున్నాం. – బిట్రా శ్రీనివాసరావు, బొబ్బిలి రాజన్న పాత్రలో మమ్ముటి జీవించారు ‘యాత్ర’ చిత్రాన్ని సినిమా యూనిట్ అత్యద్భుతంగా తెరకెక్కించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముటి జీవించారు. అధిష్టానాన్ని ఎదిరించే సన్నివేశం అద్భుతంగా ఉంది. నటీనటులు వారి వారి పాత్రకు న్యాయం చేశారు. ప్రతి సీన్ అభిమానులను కంట తడి పెట్టిస్తోంది. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు, వాటి గల కారణాలను సూటిగా చూపించారు. – రాజు, చిత్తూరు మమ్ముట్టిని చూస్తున్న కొద్ది వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకొచ్చారు ‘యాత్ర’ సినిమా చూస్తున్న కొద్దీ మొదటి నుంచి చివరి వరకూ వైఎస్ రాజశేఖరరెడ్డినే చూసినట్లు అనిపించింది. రాజన్న రాజసం తెరమీద చూపించేందుకు డైరక్టర్ చేసిన ప్రయత్నం చాలా బాగుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌ను తెరమీద చూస్తున్న కొద్దీ చాలా ఆనందంగా అనిపించింది. రాజశేఖర రెడ్డి నిజజీవితంలో ఎలా ఉండేవారు? అనేది ‘యాత్ర’ సినిమాను డైరక్టర్ ప్రేక్షకులకు అద్భుతంగా చూపించారు. – అక్కేన నరేష్. శ్రీకాకుళం – కరుకోల గోపీకిశోర్‌రాజా, సాక్షి, విశాఖ -
బాధ్యతారాహిత్యంపై దండ‘యాత్ర’
కళకీ కులాలుంటాయి. సినిమాలకీ రాజకీయాలుంటాయి. మనోళ్ల కళ హాయిగా కళ కళ లాడుతూ ఉంటుంది. మనోళ్లకి నష్టం తెచ్చే పరాయి వారి కళ ఎంతబాగున్నా వెల వెలబోతుంది. అసలామాటకొస్తే మనోడి సినిమా బాగాలేకపోయినా.. అద్భుతంగా ఉందని చెప్పడానికి మనకి భయమే ఉండదు. మనోడి సినిమాకన్నా అవతలోడి సినిమా నిజంగానే అద్భుతంగా ఉన్నా...మన మాటల వల్ల కూడా ఆ సినిమాకి ప్రచారం జరిగిపోతే కొంపలంటుకుపోతాయి కాబట్టి దాని గురించి మాట్లాడనే మాట్లాడం. ఇపుడు టాలీవుడ్ లో మెజారిటీ ప్రముఖులకు ఓ సినిమా అంటరానిదైపోయింది. దాని గురించి మాట్లాడ్డమే నేరమన్నట్లు అంతా మౌనవ్రతం పట్టేశారు. ఆ సినిమాయే యాత్ర. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవితంలో ఓ చిన్న అధ్యాయం పాదయాత్ర. ఆ చిన్నపాటి ఘట్టాన్నే ఇతివృత్తంగా తీసుకున్న నిర్మాత...ఓ వర్ధమాన దర్శకుడు కలిసి ఈ సినిమాని తెరకెక్కించారు. ఎలాంటి హడావిళ్లూ..ప్రచార ఆర్భాటాలూ లేకుండా యాత్ర సినిమాని విడుదల చేశారు. సినిమా పెద్ద హిట్ అయ్యింది. చిత్రంగా టాలీవుడ్ లో ఏ సినీ ప్రముఖుడూ కూడా ఈ సినిమా గురించి ఒక్క మాట మాట్లాడలేదు. సినిమా బాగుందనో.. బాగాలేదనో చెప్పలేదు. దీనికి కొద్ది రోజుల ముందు నందమూరి బాలకృష్ణ నటించిన కథానాయకుడు సినిమా అత్యంత ఆర్భాటంగా విడుదలైంది. సినిమా విడుదలకు మూడు నెలల ముందు నుంచే అన్ని చానెళ్లూ..పత్రికలూ కథానాయకుడి గురించి లెక్కకు మించిన కథనాలు రాసి ప్రమోట్ చేశాయి. అంత హడావిడీ చేసి విడుదల చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. సినిమా ఫ్లాప్ అయినా కూడా చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా సినిమా గురించి ఆహా ఓహో అని పొగిడారు. ట్విట్టర్ లో పోస్టింగులు పెట్టి తమ బాధ్యత నెరవేర్చుకున్నారు. ఈ పెద్దలంతా యాత్ర సినిమా విషయం వచ్చేసరికి నోళ్లు కట్టేసుకున్నారు. కలాలు పక్కన పెట్టేశారు. మౌస్ లు కదలకుండా పట్టేసుకున్నారు. ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోయింది కాదు. కావాలనే..ఒక పథకం ప్రకారమే.. యాత్ర గురించి మాట్లాడకుండా అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందువల్ల చేత? యాత్ర సినిమాని పొరపాటున బాగుందంటే...ఏపీలో ఒక రాజకీయ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుతుందేమనని కంగారు పడ్డారేమోనని అనిపించగానే ఆందోళన కలిగింది. అక్కడ ఒకానొక మన రాజకీయ పార్టీకి నష్టం చేకూరుస్తుందేమో...మన పార్టీ పెద్దలకు మనపై కోపం వస్తుందేమో అని భయపడ్డారేమో అనిపించగానే జాలేసింది. సినీ రంగంలో ఉన్న చాలా మంది మేథావులు..సినీ క్రిటిక్స్ సైతం యాత్ర సినిమా విషయంలో స్ట్రైక్ చేసినట్లు స్పందించకపోవిడం చూసి మనసు చివుక్కుమంది. టాలీవుడ్ లో భిన్న వైరుధ్యాలు..శత్రుత్వాలూ ఉన్న గ్రూపులన్నీ కూడా యాత్రను ప్రమోట్ చేయకూడదన్న ఒకే ఒక్క అంశంలో ఒక్కతాటిపైకి రావడం చూసి భయమేసింది. ఏ చిన్న సినిమాయో అనాథలా విడుదలై హిట్ అయితే..స్పందించకపోతే బాగుండదేమోనని బాగుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే సినీ జీనియస్ లు సైతం యాత్ర ను వెలివేయడం చూసి బాధేసింది. సామాజిక వర్గం ఆధారంగా ఓ సినిమాని ఇలా వెలివేసేసే పెద్దలున్న కాలంలోనే నేనూ బతుకుతున్నందుకు సిగ్గేసింది. ఈ పెద్దలంతా కూడా... కథానాయకుడి విషయంలో ఇందుకు భిన్నంగా స్పందించడం చూసి ఆశ్చర్యమేసింది. కథానాయకుడు సినిమా ఫ్లాప్ అని తేలిపోయిన తర్వాత కూడా.. అన్ని చానెళ్లూ..అందరు సినీ ప్రముఖులూ కూడా ఒకటే భజన. కథానాయకుడి సినిమా చాలా బాగున్నప్పటికీ..బాలకృష్ణ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ...సినిమా అనుకున్నట్లు ఆడలేదట. అంటే..మనోడి సినిమాని మెచ్చుకోకపోతే..మొత్తం ప్రేక్షకులందరినీ బోనులో నిలబెట్టి..ఇంత మంచి సినిమా ఎందుకు చూడలేదని కాలర్ పట్టుకుని నిలేస్తారన్నమాట. అదే అవతలోడి యాత్ర ఎవరూ ప్రమోట్ చేయకపోయినా..మీడియా ఏ పాటి ప్రాధాన్యత ఇవ్వకపోయినా..విడుదలై జనం అద్భుతంగా ఉందని మెచ్చుకుంటే... ఆ విషయం ఎవరికీ తెలీకుండా ఉండేందుకు మొత్తం యాత్ర సినిమానే బోనులో పెట్టేస్తారన్నమాట. యాత్రపై కోపానికి చాలా కారణాలే ఉండచ్చు. ఎందుకంటే..చాలా సినిమాల్లా యాత్ర సినిమా ఆర్భాటంగా ముందుకు రాలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి భారీ సెట్టింగులు వేసి..సినీ పరిశ్రమలోని అతిరథమహారథులను పిలిచి తారల తళుక్కుల మధ్య నిర్వహించలేదు. సినిమాలో సుమోలు గాల్లోకి లేచి కిందపడలేదు. అమ్మాయిల అంగాంగ ప్రదర్శనలతో యువతకు గేలం వేయలేదు. భారీ సెట్టింగులూ లేవు..ఘోరమైన ఫైటింగులూ లేవు. ఓ ఊరి నుంచి మరో ఊరికి ఎడ్లబండిపై వెళ్లినట్లు సినిమాని ముందుకు నడిపించారు దర్శకుడు మహి. సినిమాకి సంబంధించిన రూల్స్ ని పక్కన పెట్టి.. సినీ పరిశ్రమలోని సంప్రదాయాలను పట్టించుకోకుండా.. అత్యంత సింపుల్ గా సినిమా విడుదల చేసేసి..హిట్ కొట్టేసి.. కాలరెగరేస్తే ఎలాగ? అనుకున్నారో ఏమో కానీ చిత్ర పరిశ్రమ అంతా ఒకేలా సహాయనిరాకరణ ప్రదర్శించింది. సమకాలీన అంశాలపై తమ తమ యూట్యూబ్ ఛానెళ్లలో అద్భుతంగా స్పందించే సినీ మేథావులు తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి బ్రదర్స్, నాగబాబులతో పాటు..సోషల్ మీడియాలో భిన్న అంశాలపై బాధ్యతాయుతంగా తమ అభిప్రాయాలను వెల్లడించే..సాహితీ ప్రియులు...విమర్శకులు సైతం యాత్ర మనది కాదులేనని వదిలేయడం అన్యాయం అనిపించింది. సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఎన్ ఆర్ఫాన్- అన్న సామెత కూడా అన్ని వేళలా..అన్ని కాలాల్లోనూ నిజం కాదనిపించింది. ఎందుకంటే కథానాయకుడు ఫెయిల్ అయినా..మేథావులు..సినీ ప్రముఖులూ.. జర్నలిస్టులూ అంతా కూడా సినిమా బాగుంది కానీ..ఎక్కువ మంది చూడలేదని కితాబునిచ్చారు. అంటే మనోళ్ల ఫెయిల్యూర్ కి కూడా చాలా మంది ఫాదర్సూ,బాబాయిలూ..మావయ్యలూ దూరపు చుట్టాలూ అండగా నిలిచారు. సినిమా బాగుంటే జనం ఎందుకు చూడరు? జనం చూడకపోవడం వల్లనే కదా సినిమా ఫ్లాప్ అయ్యింది. చూడలేదంటే ఆ సినిమా జనానికి నచ్చలేదనే కదా. అదే యాత్ర చాలా బాగుందని జనం మెచ్చుకున్నా..సినిమా హిట్ అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క మంచి మాట అనలేకపోవడం దేనికి సంకేతం? అన్నింటినీ మించిన దారుణం ఏంటంటే..యాత్ర సినిమా ఘన విజయం సాధించాక..చిత్ర యూనిట్ విశాఖ పట్టణంలో సక్సెస్ మీట్ పెట్టారు. దానికి చిత్ర కథానాయకుడు..మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా వచ్చారు. చిన్న చిన్న సినిమాల సక్సెస్ మీట్ లు జరిగినా మీడియాలో వార్తలు వస్తారు. కానీ యాత్ర సక్సెస్ మీట్ వార్తలు మాత్రం ప్రధాన పత్రికలు పక్కన పెట్టేశాయి. యాత్రను మీడియా కూడా వెలి వేసిందన్నమాట. యాత్ర సక్సెస్ అయినా ..అనాథగా వదిలేసి వెళ్లిపోవాలని మెజారిటీ పెద్దలు అనుకున్నారు. అయితే యాత్ర అనాథ కాలేదు. 5కోట్ల మంది ప్రజలు యాత్రను దత్తత తీసుకుని తమ గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటున్నారు. జన హృదయాల్లోంచి యాత్ర సంతకాన్ని ఎవరూ చెరపలేరు. మనం మెచ్చిందే కళ...మనం చెప్పిందే వేదం అన్న ఆలోచన ఎంత ప్రమాదకరం? కళ మనకో మనోళ్లకో...మనోళ్ల పార్టీలకో మేలు చేసేదై ఉండాలనుకోవడం ఎంత బాధ్యతారాహిత్యం? ఎంత దారుణం? - సి.ఎన్.ఎస్.యాజులు -
వైఎస్‌గారి పాత్ర చేయడం నా అదృష్టం
‘‘యాత్ర’ సినిమాకి ముందు తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆసక్తికరంగా అనిపించకపోవడంతో చేయలేదు. అయితే ‘యాత్ర’ సినిమాను కాదనలేకపోయాను. కథ బాగుంది.. మంచి ఎమోషనల్ టచ్ కూడా ఉంది. ప్రజల నాయకుడైన ఒక గొప్ప రాజకీయ నాయకుడి కథ ఇది. ప్రజలను అర్థం చేసుకోకపోతే రాజకీయ నాయకుడు.. ప్రజానాయకుడు కావడం కష్టం. మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజలు మెచ్చిన నాయకుడే రూలర్ అవుతారు’’ అని హీరో మమ్ముట్టి అన్నారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్ రోల్లో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా శుక్రవారం వైజాగ్‌లో నిర్వహించిన ‘బ్లాక్ట్‌బస్టర్ మీట్’లో మమ్ముట్టి మాట్లాడుతూ– ‘‘అందరికీ నమస్కారం. నాకు తెలుగు రాదు.. నన్ను క్షమించండి. తెలుగు స్పష్టంగా మాట్లాడటం ఇంకా రాలేదు. నా డైలాగ్స్‌కు జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పుకున్నాను. ఉగ్రవాద దాడిలో అమరులైన వీరజవాన్లకు సెల్యూట్ చేస్తున్నాను. తెలుగులో ప్రత్యక్షంగా ‘యాత్ర’ నా మూడో చిత్రం. కె.విశ్వనాథ్‌గారితో ఒక సినిమా, ఉమా మహేశ్వరరావుగారితో మరో తెలుగు సినిమా చేశాను. ‘యాత్ర’ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సాంగ్ షూట్ చేశాం. ఆ తర్వాత ఓ సీన్‌ను చిత్రీకరించాం. కాస్త భయం వేసింది.. నెర్వస్‌గా ఫీలయ్యాను. లక్కీగా ఆ సీన్ సినిమాలో లేదు. ఆ తర్వాత మ్యానేజ్ చేశాను. దర్శక–నిర్మాతలు నాకు మ్యాగ్జిమమ్ కంఫర్ట్ లెవల్స్ ఇచ్చారు. నా నుంచి కొత్తవిషయాలు నేర్చుకున్నానని మహి చెప్పారు. కానీ, నేర్చుకున్నది నేను. పాత్ర కోసం కొత్త భాష నేర్చుకున్నాను. సెట్లో ప్రతి రోజూ నాకు కొత్త రోజే. డైలాగ్స్ పలకడానికి సహకరించిన అసోసియేట్ డైరెక్టర్స్‌తో పాటు టీమ్ అందరికీ ధన్యవాదాలు. సినిమాల్లో నాకు అనుభవం ఎక్కువగా ఉండొచ్చు. కానీ తెలుగులో తక్కువ. సినిమా సక్సెస్ అయ్యింది. ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘యాత్ర’లో హీరో లేడు.. హీరోయిన్ లేదు.. ఫైట్స్ లేవు.. పాటలు, కామెడీ సీన్స్ లేవు.. అయినా ప్రేక్షకులు ఆదరించారు. సినిమాలను చూడటంలో వారి అభిరుచి మారింది. తెలుగులో మరిన్ని మంచి సినిమాలు రావాలి. విభిన్నమైన సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఆల్రెడీ పెరిగారు. వైఎస్‌ఆర్‌గారిలా నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆయన పాత్రలో నటించడం నా అదృష్టం’’ అన్నారు. నిర్మాత విజయ్ చిల్లా మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో మూడో సినిమా ‘యాత్ర’. మొదటి సినిమా ‘భలే మంచి రోజు’ చేసినప్పుడు బాగా పేరొచ్చింది కానీ డబ్బులు రాలేదు. రెండో సినిమా మహితో ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం చేసినప్పుడు బాగా డబ్బులు వచ్చాయి కానీ పెద్దగా పేరు రాలేదు. ‘యాత్ర’ మా మూడో సినిమా. ఈ చిత్రానికి మాకు ఎంత డబ్బు వచ్చిందో అంతకు మించి రెట్టింపు పేరొచ్చింది. సినిమా రిలీజ్ అయ్యాక కొన్ని వేల ఫోన్‌కాల్స్ వచ్చాయి. అందరూ ఒక్కటే మాట చెప్పారు. ‘మేం జీవితాంతం మీ రుణం తీర్చుకోలేం.. మా ముందుకు మళ్లీ వైఎస్ఆర్గారిని తీసుకొచ్చారు’ అనడంతో మేం పడ్డ ఏడాదిన్నర కష్టం మరచిపోయాం. ఈ సినిమాని చూసి విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు. డిస్ట్రిబ్యూటర్లు కూడా కాల్ చేసి సంతోషం వ్యక్తం చేయడం వెరీ హ్యాపీ. ఈ సినిమా కేవలం డబ్బు కోసం తీయలేదు. వైఎస్‌గారి అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టినందుకు చాలా గర్వపడుతున్నాం. థ్యాంక్స్ టు మమ్ముట్టిసార్.. వైఎస్‌గారిని మళ్లీ తీసుకొచ్చారు. సినిమా రిలీజ్ అయ్యాక నేను, మహి వెళ్లి జగన్ అన్నని కలిశాం.. ‘యాత్ర’ ప్రొడ్యూసర్.. రండి అని అన్న అనడంతో చాలా సంతోషం వేసింది’’ అన్నారు. దర్శకుడు మహి వి.రాఘవ్ మాట్లాడుతూ– ‘‘మమ్ముట్టిగారు నమ్మకపోతే ఈ సినిమా చేయడం అసాధ్యం. వైఎస్‌గారిపై అభిమానం వేరే, కృతజ్ఞత వేరే అని ఈ సినిమా ద్వారా తెలుసుకున్నా. వైఎస్‌గారిపై అభిమానం, ప్రేమకు మించిన ఒక భావం కానీ, ఏదైనా ఒక ఫీలింగ్ ఉందంటే అది కృతజ్ఞత. ఆయన్ను ప్రేమించేవారికి ఓ కృతజ్ఞత ఉంది. అది క్రీడాకారులకో, సినిమా వాళ్లకో రాదు.. అది అసాధ్యం. నేను ఇంకా పెద్ద సినిమాలు చేయొచ్చు.. ఎక్కువ డబ్బులు రావొచ్చేమో కానీ, నా జీవితంలో నాకు తెలిసి ఇంత కృతజ్ఞత కానీ, ప్రేమ కానీ రాదని కచ్చితంగా చెప్పగలను. ప్రేక్షకుల స్పందన చాలా బాగుంది. ఒకతను నాకు ఫోన్ చేసి, ‘ఓ వైపు కన్నీళ్లు వస్తున్నాయ్.. మరోవైపు చప్పట్లు కొడుతూ ఉండిపోయాను’ అన్నాడు. ఓ మహిళ ఫోన్ చేసి, ‘ఇకపై రైతు మార్కెట్లో టమోటాని ధర కన్నా రెండు రూపాయలకు తక్కువ ఇమ్మని రైతులను అడగను’ అని చెప్పింది. ఓ కథ ఇంత ప్రభావం చూపిస్తుందని, ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుందని నేను అనుకోలేదు. జగనన్నకి కూడా థ్యాంక్స్. ఎన్నికలు ఉన్న ఏడాదిలో నేను ఎవర్నో కూడా తెలియకుండా నన్ను గుడ్డిగా నమ్మి ‘మీ నాయకుని కథ మీరు చెప్పుకోండి’ అన్నారు. ఆ మాట అనాలంటే నిజంగా ధైర్యం ఉండాలి. అందుకు అన్నకి థ్యాంక్స్ చెబుతున్నా. సినిమాల్లో చాలామంది కడప కథలు చెప్పారు. తొలిసారి ఓ కడప బిడ్డ కథ చూపించాం. వైఎస్‌గారు కడపలో పుట్టినా ప్రతి గడపలోకి వచ్చారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో కూడా ఆయన్ని ప్రేమించారు. రాఘవేంద్రరావుగారు, రామ్‌గోపాల్‌వర్మగారు... ఇలా చాలామంది సినిమా బావుందని అభినందించారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు అశ్రిత, ఉమ, ‘దిల్’ రమేశ్, దయానంద్, మొయినుద్దీన్, బాలనటి సహస్ర, శ్రీమిత్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)