క్రిస్మస్‌ బరిలో ఇంట్రస్టింగ్‌ సినిమాలు | 3 Interesting Films That Are Being Released on Christmas Day | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 24 2018 10:20 AM | Last Updated on Wed, Oct 24 2018 11:49 AM

3 Interesting Films That Are Being Released on Christmas Day - Sakshi

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి, దసరాలతో పాటు క్రిస్టమస్‌ సీజన్‌ మీద కూడా భారీ అంచనాలు ఉంటాయి. అందుకే చాలా సినిమాలు ఈ సీజన్‌లో రిలీజ్‌కు క్యూ కడుతుంటాయి. ఈ ఏడాది కూడా మూడు ఇంట్రస్టింగ్ సినిమాలు బరిలో దిగుతున్నాయి. మూడు విభిన్న కథలతో తెరకెక్కుతున్న చిత్రాలు ఈ క్రిస్మస్‌కు పోటి పడుతున్నాయి.

శర్వానంద్‌, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా కోల్‌కతా నేపథ్యంలో తెరకెక్కుతున్న  ప్రేమకథ పడి పడి లేచే మనసు డిసెంబర్‌ 21న రిలీజ్‌ అవుతున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అదే సమయంలో ఘాజీ ఫేం సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న స్పేస్‌ మూవీ అంతరిక్షం కూడా రిలీజ్‌ అవుతోంది. ఈ రెండు సినిమాలతో పాటు బయోపిక్‌గా తెరకెక్కుతున్న యాత్ర (వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో)సినిమా కూడా అదే సీజన్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ మూడు చిత్రాలు మూడు విభిన్న నేపథ్యంలో తెరకెక్కుతున్నవి కావటంతో పోటి ఉండదని భావిస్తున్నారు నిర్మాతలు. అయితే మూడు సినిమాలు ఒకే రోజు రిలీజ్‌ అయితే మాత్రం థియేటర్ల సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement