Varun Tej
-
దెబ్బకు రూట్ మార్చిన మెగా ప్రిన్స్
-
ఈ తూరి నవ్వించేకి వస్తుండా
వరుణ్ తేజ్( Varun Tej ) హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ ఇండో–కొరియన్ హారర్ కామెడీ చిత్రం రూపొందనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. జనవరి 19 (ఆదివారం) వరుణ్ తేజ్( Varun Tej ) బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా అనౌన్స్మెంట్పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈపోస్టర్పై ‘వెన్ హంటింగ్ టర్న్స్ హిలేరియస్’ అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఈ చిత్రం షూటింగ్‌ని మార్చిలోప్రారంభించనున్నట్లుగా మేకర్స్ తెలిపారు.‘‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా!’ అంటూ ఈ సినిమాను ఉద్దేశించి, ‘ఎక్స్’లో పేర్కొన్నారు వరుణ్ తేజ్( Varun Tej ). ఈ మూవీకి తమన్ సంగీతం అందించనున్నారు. వరుణ్ తేజ్( Varun Tej ) కెరీర్‌లోని హిట్ మూవీ ‘తొలిప్రేమ’ (2018) తర్వాత మళ్లీ ఈ హీరో సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా కథనం రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, ఈ చిత్రానికి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. -
వరుస ప్లాపుల తర్వాత వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రకటన
వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాను ప్రకటించారు. దర్శకుడు మేర్లపాక గాంధీతో ఈ చిత్రాన్ని ఆయన చేయనున్నారు. భారీ అంచనాలతో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. ఇండో - కొరియన్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ రానుంది. వరుణ్ తేజ్ 15వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీకి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ న్యూ ఏజ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్‌లో వరుణ్ తేజ్ క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. రీసెంట్గా వరుణ్ నటించిన మట్కా చిత్రం భారీ డిజాస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆయన ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, మాస్ట్రో వంటి చిత్రాలను మేర్లపాక గాంధీ తెరకెక్కించిన విషయం తెలిసిందే.వరుణ్‌తేజ్ నటించిన మట్కా చిత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలింది. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 5 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. అయతే, ఈ మూవీ కోసం సుమారు రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మట్కా మూవీకి పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. విజయేందర్‌రెడ్డి, రజనీ తాళ్లూరి మట్కా మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ కంటే ముందు వరుణ్‌తేజ్ చేసిన గని, ఆపరేషన్ వాలెంటైన్, గాండీవదారి అర్జున కూడా డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇలా వరుస సినిమాలతో వరణ్ తన అభిమానులను నిరుత్సాహపరుస్తున్నారు. దీంతో మేర్లపాక గాంధీతో చేస్తున్న సినిమాపై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
కొండగట్టు అంజన్న సన్నిధిలో వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించారు. హనుమాన్ మాల ధరించిన ఆయన మంగళవారం జిగిత్యాల జిల్లలోని కొండగట్టుకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణ్‌కు అక్కడి అధికారులు, అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మొదటిసారి హనుమాన్ మాల ధరించి, కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందని వరుణ్ తెలిపారు.ఇక వరుణ్ సినిమాల విషయాలకొస్తే.. ఆయన హీరోగా నటించిన మట్కా చిత్రం ఇటీవల విడుదలై డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. కరుణ కుమార్ దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. థియేటర్లో ఫ్లాప్ టాక్ రావడంతో 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 5 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది. -
కొరియన్ కనకరాజు?
కొరియన్ కనకరాజుగా మారనున్నారట వరుణ్ తేజ్. ఆయన హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను ఆదివారం ప్రకటించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.వచ్చే మార్చిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘‘ఈ న్యూ ఏజ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్‌లో వరుణ్ తేజ్ క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. కాగా ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. -
3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మెగా హీరోల్లో కాస్త డిఫరెంట్ సినిమాలు చేసే వరుణ్ తేజ్ రీసెంట్ 'మట్కా'లో నటించాడు. భారీ బడ్జెట్‌తో దీన్ని తీశారు. చాన్నాళ్ల పాటు షూటింగ్ చేసుకుని నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఓ మాదిరితో అంచనాలతో వచ్చింది గానీ ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.(ఇదీ చదవండి: సాయం చేస్తానంటూ రాఘవ లారెన్స్ పేరుతో మోసం)వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన 'మట్కా'ని యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. అయితే ఎమోషన్స్ సరైన రీతిలో వర్కౌట్ అయ్యే సీన్స్ పడలేదు. దీంతో ఒకటి రెండు రోజుల్లోనే థియేటర్ల నుంచి కనుమరుగైపోయింది. భారీ నష్టాలు కూడా వచ్చాయని టాక్. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోకి రాబోతుంది.థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే అంటే డిసెంబరు 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఒకవేళ గ్యాంబ్లింగ్ కాన్సెప్ట తరహా మూవీస్ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. అదే రోజున థియేటర్లలో 'పుష్ప 2' రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు) -
మట్కా,కంగువా ఫస్ట్ డే కలెక్షన్స్.. వరుణ్ కెరీర్లోనే భారీ డిజాస్టర్
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ జయాపజయాలతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఓకే చెప్పేస్తాడు. భారీ అంచనాలతో ఆయన నటించిన 'మట్కా' చిత్రం నవంబర్ 14న విడుదలైంది. అయితే, ఈ సినిమా మొదటి ఆటతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. వరుణ్ కెరియర్లోనే అత్యంత తక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా 'మట్కా' రికార్డ్ క్రియేట్ చేసింది.'పలాస' సినిమాతో మెప్పించిన కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సుమారు రూ. 40 కోట్లతో ఈ మూవీని నిర్మించారు. 'మట్కా' టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకునేలా ఉండటం, వరుణ్ భిన్నమైన గెటప్పుల్లో కనిపించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల దృష్టి పడింది. అయితే, కథలో కొత్తదనం లేకపోవడంతో పాటు ఆసక్తిరేకెత్తించే సీన్స్ పెద్దగా సినిమాలో కనిపించలేదు. దీంతో 'మట్కా' మొదటిరోజు కేవలం రూ. 70 లక్షలు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే కనీసం రూ. 2 కోట్లు అయినా రావడం కష్టమని చెప్పవచ్చు.కంగువా కలెక్షన్స్సూర్య, దిశా పటానీ జోడీగా నటించిన చిత్రం 'కంగవ'. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సత్తా చాటింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీ నవంబర్ 14న విడుదలైంది. అయితే, కంగువా మొదటిరోజు రూ. 58.62 కోట్లు రాబట్టినట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా కోసం రూ.350 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే కంగువా నిర్మాతలకు కూడా భారీగా నష్టాలు తప్పవని చెప్పవచ్చు. -
‘మట్కా’ మూవీ రివ్యూ
టైటిల్: మట్కానటీనటులు: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులునిర్మాణ సంస్థ: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరిదర్శకత్వం: కరుణ కుమార్సంగీతం: జీవీ ప్రకాశ్సినిమాటోగ్రఫీ: ఎ కిశోర్ కుమార్ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్విడుదల తేది: నవంబర్ 14, 2024కథేంటంటే..బర్మా నుంచి వైజాగ్ వచ్చిన వాసు దేవ్ అలియాస్ వాసు(వరుణ్ తేజ్)..చిన్నప్పుడే అనుకోకుండా ఓ వ్యక్తిని హత్య చేసి జైలుకు వెళ్తాడు. అక్కడ జైలు వార్డెన్ నారాయణ మూర్తి(రవిశంకర్)తో మంచి పరిచయం ఏర్పడుతుంది. వాసుని తన సొంత పనులకు వాడుకుంటూ మంచి ఫైటర్‌లా తయారు చేస్తారు. జైలు నుంచి బయటకు వచ్చిన వాసు.. కొప్పరికాయల వ్యాపారి అప్పల రెడ్డి(అజయ్ ఘోష్) దగ్గర పనిలో చేరతాడు. ఓ సారి ఆ ఏరియా రౌడీ కేబీఆర్ గ్యాంగ్‌ని చితక్కోట్టి..అతని ప్రత్యర్థి నానిబాబు(కిశోర్)కి దగ్గరవుతాడు. అతని అండదండలతో పూర్ణ మార్కెట్ నాయకుడిగా ఎదుగుతాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ.. చివరకు మాట్కా ఆటను ప్రారంభిస్తాడు. ఆ తర్వాత వాసు జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి? మట్కా కింగ్‌గా ఆయన ఎలా ఎదిగాడు? సెల్ ఫోన్ లేని రోజుల్లో దేశం మొత్తానికి ఒక నెంబర్ ని ఎలా పంపించాడు? వాసు కోసం సీబీఐ ఎందుకు రంగంలోకి దిగింది? సుజాత(మీనాక్షి చౌదరి) వాసు జీవితంలోకి ఎలా వచ్చింది? ఈ కథలో సోఫియా(నోరా ఫతేహి), సాహు(నవీన్ చంద్ర) పాత్రలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘మట్కా కింగ్’ రతన్ లాల్ ఖత్రీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘మట్కా’. గ్యాoబ్లింగ్ వరల్డ్ లో రతన్ ఖత్రీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 1962లో ముంబైలో కేంద్రంగా మట్కా గ్యాంబ్లింగ్ లో దేశం మొత్తం పెద్ద నెట్‌వర్క్‌ను సృష్టించాడు. ఖత్రీ క్యారెక్టర్ స్ఫూర్తితో వాసు క్యారెక్టర్ ని డిజైన్ చేసి మట్కా చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కరుణ కుమార్. కథగా చూస్తే ఇది కేజీయఫ్, పుష్ప లాంటి అండర్ డాగ్ స్టోరీ. చేతిలో చిల్లిగవ్వ లేని హీరో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టడం.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి..ప్రభుత్వాలనే శాసించే స్థితికి రావడం.. గ్యాంగ్‌స్టర్ కథలన్నీ ఇలానే ఉంటాయి. మట్కా కథనం కూడా ఇలానే సాగుతుంది. అయితే ఓ ఆటను అడ్డుపెట్టుకొని ఓ వ్యక్తి దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా సంక్షోభంలో పడేశాడనేది కొత్త పాయింట్. కథకు ఇదే మెయిన్ పాయింట్ కూడా. కానీ తెరపై మాత్రం దాన్ని అంతే బలంగా చూపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఎలాంటి ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకుండా చాలా రొటీన్‌గా కథనాన్ని నడిపించాడు. హీరో మట్కా కింగ్‌గా ఎదిగిన క్రమం కూడా సినిమాటిక్‌గా అనిపిస్తుంది కానీ ఎక్కడా సహజంగా కనిపించదు. ఇక కథకి కీలకమైన మట్కా ఆట కూడా ఇంటర్వెల్ వరకు మొదలు కాదు. సెకండాఫ్‌లో అయినా ఆ ఆటని హైలెట్ చేశారా? అంటే అదీ లేదు. కథనం మొత్తం రొటీన్‌గా సాగుతుంది. హీరో పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా పండలేదు. ఫస్టాఫ్ మొత్తం హీరో బాల్యం, అతను ఎదిగిన క్రమం చూపిస్తూ.. మట్కా ఆటలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారనే చూపించారు. ఇక సెకండాఫ్‌లో మట్కా ఆటతో వాసు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా సంక్షోభంలో పడేశాడు? అతన్ని పట్టుకునేందుకు సీబీఐ రంగంలోకి దిగడం..మరోవైపు ప్రత్యర్థులు అతన్ని చంపేందుకు కుట్ర చేయడం.. వాటిని హీరో ఎలా తిప్పికొట్డానేది చూపించారు. అయితే ఈ సన్నివేశాలేవి ఆకట్టుకునేలా ఉండవు. చివరల్లో దావూద్ పాత్రని పరిచయం చేసి.. క్రికెట్ బెట్టింగ్తో సీక్వెల్ ఉంటుందని పరోక్షంగా ప్రకటించారు. ఎవరెలా చేశారంటే.. వాసు పాత్రకి వరుణ్ తేజ్ న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. వాసు భార్య సుజాతగా మీనాక్షి చౌదరి తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు. సోఫియాగా నోరా ఫతేహి తెరపై అందంగా కనిపించింది. కిషోర్, నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవీ ప్రకాశ్ సంగీతం సినిమాకి ప్రధాన బలం. సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.-రేటింగ్: 2.25/5 -
థియేటర్లలో వరుణ్ తేజ్ మట్కా.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా. కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఇవాళే విడుదలైంది. కోలీవుడ్ స్టార్ సూర్య మూవీ కంగువాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది. మట్కా, జూదం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ తొలిసారిగా డిఫరంట్ రోల్లో కనిపించారు.కాగా.. ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్స్ షోలు పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మట్కా మార్నింగ్ షోలు మొదలయ్యాయి. దీంతో మూవీ చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మట్కా అద్భుతంగా ఉందని.. మంచి స్టోరీ అని, ఫైట్ సీక్వెన్స్ బాగున్నాయని ట్విటర్ వేదికగా వెల్లడిస్తున్నారు. కామెడీ, యాక్షన్, సెంటిమంట్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయని కొందరు ప్రేక్షకులు చెబుతున్నారు. మరికొందరైతే బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. వీటికి సాక్షి ఎలాంటి బాధ్యత వహించదు.కాగా.. పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా వస్తోన్న మట్కా చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ భామ నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీతో తెలుగులో నోరా ఫతేహీ అరంగేట్రం చేయనుంది. మట్కా జూదగాడైన రతన్ ఖేత్రి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సలోని అశ్వని, సత్యం రాజేష్, పి రవిశంకర్, కిషోర్, నవీన్ చంద్ర,అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. #MatkaBlock buster 🔥🔥🔥🔥🔥🔥🔥@IAmVarunTej pic.twitter.com/ySv0yXaSE6— TrendCharan (@TrendCharan) November 14, 2024 #Matka getting a positive Mouth talk from everyone 🤗❤️Congratulations @IAmVarunTej anna pic.twitter.com/822hcehFG6— PremKumaR ᴳᵃᵐᵉ ᶜʰᵃⁿᵍᵉᴿ ♔🚁 (@RC_Premkumar) November 14, 2024 #Matka - BLOCKBUSTER 🏆🔥2024 Best Movie....👏🏆🔥#MATKAFromToday @IAmVarunTej #MatkaReview pic.twitter.com/qGd25hzQKC— Aravind Editor (@aravindak0) November 14, 2024 -
ఈ నెల నాకు చాలా ప్రత్యేకం
‘‘అమ్మ, సిస్టర్, ప్రేయసి, భార్య... ఇలా ఏదో ఒక విధంగా ప్రతి అబ్బాయి జీవితంలో ఓ మహిళ ఉంటుంది. ఆ అబ్బాయి జీవితానికి ఎంతో ముఖ్యంగా ఉంటూ, అతని లైఫ్‌కి ఓ పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది. అలా వాసు (‘మట్కా’ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర) జీవితానికి సుజాత (మీనాక్షీ చౌదరి పాత్ర) ఓ వెలుగు వంటిది. సుజాత పాత్రలోని పాజిటివిటీ వాసు జీవితంపై ఉంటుంది. ఈ పాజిటివిటీకి ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారని నేను నమ్ముతున్నాను’’ అని అన్నారు హీరోయిన్ మీనాక్షీ చౌదరి. వరుణ్ తేజ్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మట్కా’. కరుణకుమార్ దర్శకత్వంలో విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ– ‘‘మట్కా’లో వాసు ప్రేయసి సుజాతగా నటించాను. సుజాత పాత్రకు మూడు గెటప్స్ ఉంటాయి. ఈ గెటప్స్‌కి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ చూపించడం కొత్తగా అనిపించింది. ‘మట్కా’ విజయంపై నమ్మకం ఉంది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘లక్కీభాస్కర్’ చిత్రం ఆల్రెడీ విడుదలై, విజయం సాధించింది. ‘మట్కా’ విడుదలవుతోంది. ఇదే నెలలో ‘మెకానిక్ రాకీ’ చిత్రం విడుదలవుతోంది. ఇలా నెల రోజుల వ్యవధిలోనే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్‌లో ఈ నెల చాలా ప్రత్యేకం. ఓ స్పెషల్ మూమెంట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న మట్కా టీమ్.. వీడియో వైరల్!
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా. కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ అయింది. కోలీవుడ్ స్టార్ సూర్య మూవీ కంగువాతో బాక్సాఫీస్ బరిలో నిలిచింది. మట్కా, జూదం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల వైజాగ్‌లో మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించారు.తాజాగా మట్కా టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందు టీమ్ అంతా కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మూవీ సూపర్ హిట్ కావాలని ప్రత్యేక పూజులు చేశారు. వీరికి ఆలయ పండితులు మర్యాదలతో సత్కరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.ప్రస్తుతం వరుణ్ తేజ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇవాళ తిరుపతిలోని ఎన్విఆర్ సినిమాస్‌లో జరిగే ఈవెంట్‌కు హాజరుకానున్నారు. కాగా.. పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా వస్తోన్న మట్కా చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ భామ నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీతో తెలుగులో నోరా ఫతేహీ అరంగేట్రం చేయనుంది. మట్కా జూదగాడైన రతన్ ఖేత్రి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సలోని అశ్వని, సత్యం రాజేష్, పి రవిశంకర్, కిషోర్, నవీన్ చంద్ర,అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. Mega Prince #VarunTej and #Matka team at Tirumala Tirupati Devasthanam. pic.twitter.com/poJsm8diW5— Filmyscoops (@Filmyscoopss) November 13, 2024 -
అలా చేయలేని రోజు సినిమాలు మానేస్తాను: కరుణ కుమార్
‘‘సెట్లో కూడా స్టార్ హీరోలుగా ఉండే ఆర్టిస్టులను హ్యాండిల్ చేయడం నాకు కాస్త కష్టంగా ఉంటుంది. కానీ, తన స్టార్ హీరో ఇమేజ్‌ని బయటపెట్టి సెట్స్‌లో అందరితో హుందాగా ఉంటారు వరుణ్ తేజ్. ‘పలాస 1978’ సినిమాను ఎంత స్వేచ్ఛగా చేశానో, అంతే హాయిగా ‘మట్కా’ ని తీశాను. ఇరవై ఏళ్ల తర్వాత కూడా ‘మట్కా’లోని వరుణ్ నటన గురించి చెప్పుకుంటారు. వరుణ్ లుక్స్ విషయంలో చిరంజీవిగారి గెటప్స్‌ను రిఫరెన్స్ లుగా తీసుకున్నా’’ అని దర్శకుడు కరుణ కుమార్ అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘మట్కా’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లు.విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం రేపు(గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా కరుణ కుమార్ మాట్లాడుతూ– ‘‘బర్మా నుంచి వైజాగ్‌కు శరణార్థిగా వచ్చిన వాసు అనే వ్యక్తి కథే ఈ ‘మట్కా’. రతన్ ఖత్రి జీవితాన్ని ‘మట్కా’గా తీయలేదు. రతన్ ఖత్రీ ఏం చేసి ఉండేవాడోనని ఆలోచించి, ఓ ఐడియాతో ఈ స్క్రిప్ట్‌ని రాశాను. ‘మట్కా’ గేమ్ గురించి కూడా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాం. మొబైల్ ఫోన్స్ లేని రోజుల్లో కూడా దేశం మొత్తం ఒక నంబర్ని ఓ వ్యక్తి అతి తక్కువ సమయంలో ఎలా పంపాడు? అనే పాయింట్ ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది.జీవీ ప్రకాష్‌కుమార్ మంచి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. విజయేందర్ రెడ్డి, రజనీ చాలా సపోర్ట్ చేశారు. సినిమా అనేది కళతో కూడిన వ్యాపారమని నా అభి్రపాయం. నా నిర్మాతలు లాభపడాలనే కోరుకుంటాను. అందుకే ఎక్కవ ఫుటేజ్‌ని కూడా చిత్రీకరించను. నా ప్రతి సినిమాలో కూడా నా మార్క్ ఫిల్మ్‌మేకింగ్ సెన్సిబిలిటీస్ ఉంటాయి.. అలా చేయలేని రోజు సినిమాలు మానేస్తాను’’ అని తెలిపారు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న వరుణ్ తేజ్ మట్కా.. రన్ టైమ్ ఎంతంటే?
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా. ఈ ఫుల్ యాక్షన్ సినిమాకు కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా.. చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మెగాహీరో వరుణ్ తేజ్.. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలన్ని పెట్టుకున్నాడు. 'మట్కా' అనే గేమ్ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో వరుణ్ తేజ్ మూడు విభిన్న గెటప్స్‌లో వరుణ్ కనిపించనున్నాడు.రన్ టైమ్ ఎంతంటే..మట్కా రన్‌టైమ్ దాదాపు 2 గంటల 33 నిమిషాలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టైటిల్స్‌తో కలిసి దాదాపు 2 గంటల 39 నిమిషాల రన్‌టైమ్ ఉండనుంది. ఈ ఫుల్ మాస్ ఎంటర్టైనర్లో చివరి 20 నిమిషాలు క్లైమాక్స్ హైలెట్‌గా ఉండనుందని ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేకర్స్ వెల్లడించారు. -
విశాఖపట్నం : ‘మట్కా’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హరితేజ ఎలిమినేట్.. నిఖిల్ సహా ఆ నలుగురు మాస్క్ తీయాల్సిందే!
ఈరోజు హౌస్ జంబలకిడిపంబగా మారిపోయింది. వాళ్లు వీళ్లయ్యారు, వీళ్లు వాళ్లయ్యారు. అదేనండి.. ఆడాళ్లు మగాళ్ల గెటప్‌లోకి. మగాళ్లు ఆడాళ్ల గెటప్‌లోకి మారిపోయారు. వీరినలా చూస్తుంటేనే ప్రేక్షకులు పడీపడీ నవ్వడం ఖాయం. అలా ఉన్నాయి ఒక్కొక్కరి అవతారాలు.. పైగా ఒకరి పాత్రల్లో మరొకరు లీనమై నటించారు. ముఖ్యంగా ప్రేరణ.. నిఖిల్‌గా నటించి అదరగొట్టేసింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 10) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఐటం సాంగ్నాగ్.. ప్రేరణ, గౌతమ్‌ను సేవ్ చేశాడు. తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా సినిమా ప్రమోషన్స్ కోసం స్టేజీపైకి వచ్చాడు. వచ్చీరావడంతోనే ఆడవేషంలో ఉన్న మగవారికి ఐటం సాంగ్ చేసే టాస్క్ ఇచ్చాడు. అలాగే మగవేషంలో ఉన్న ఆడపిల్లలు మాస్ పాటలకు చిందేయాలన్నాడు. పర్ఫామెన్స్ బట్టి మార్కులిస్తానన్నాడు. ఈ గేమ్‌లో నబీల్‌కు 6, రోహిణి, తేజ, విష్ణుప్రియకు 10, అవినాష్, ప్రేరణ, నిఖిల్, హరితేజలకు 9, యష్మికి 8, గౌతమ్‌కు 7 మార్కులిచ్చాడు. తేజ డ్యాన్స్‌కు ముచ్చెమటలుముఖ్యంగా తేజ పర్ఫామెన్స్కైతే వరుణ్‌తేజ్‌కు చెమటలు పట్టాయి. ఒక్కరు నవ్వకుండా ఉంటే ఒట్టు! ఆ రేంజ్లో ఉంది మనోడి పర్ఫామెన్స్. ఫైనల్‌గా ఈ గేమ్‌లో బాయ్స్ వేషంలో ఉన్న ఆడవారు గెలిచారు. అనంతరం వరుణ్ తన మనసుకు దగ్గరైనవారి గురించి మాట్లాడాడు. రామ్ చరణ్ తనకు సోదరుడని, ఏ సమస్య వచ్చినా అతడి దగ్గరకు వెళ్తానన్నాడు. నిహారిక కొడుతుందా?చిరంజీవి తన ఇన్స్పిరేషన్ అని, అల్లు అర్జున్ హార్డ్‌వర్కర్ అని, పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవన్నాడు. నిహారిక బెస్ట్‌ఫ్రెండ్ అని.. ఎప్పుడూ తనను కొడుతుందన్నాడు. తర్వాత సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. అనంతరం నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు. ఇకపోతే కొన్ని హ్యాష్‌ట్యాగులు ఇచ్చిన బిగ్‌బాస్ అవి ఎవరికి సెట్టవుతాయో చెప్పాలన్నాడు. ముందుగా తేజ.. ఎవరికోసం ఆలోచించకుండా పండ్లు తినేసిన గౌతమ్‌కు సెల్ఫిష్ ట్యాగ్ ఇచ్చాడు. బిల్లు మాఫీ చేయించిన నాగ్ఈ క్రమంలో హౌస్‌లో జరుగుతున్న దొంగతనం గురించి నాగ్ ఆరా తీశాడు. సూపర్ మార్కెట్లో హౌస్మేట్స్ కొన్ని వస్తువులు దొంగతనం చేశారు. అందుకుగానూ బిగ్‌బాస్ రూ.1,85,000 బిల్లు వేశాడు. అసలు ఏమేం దొంగిలించారనేది నాగ్ వీడియో ప్లే చేసి మరీ చూపించాడు. అయితే చిన్నచిన్న దొంగతనాలను చూసీ చూడనట్లు వదిలేయమని, ఆ బిల్లును ప్రైజ్‌మనీలో నుంచి కట్ చేయొద్దని నాగ్ బిగ్‌బాస్‌ను అభ్యర్థించడం విశేషం.అవినాష్ కట్టప్పహ్యాష్ట్యాగుల గేమ్ విషయానికి వస్తే.. విష్ణుప్రియ.. ప్రేరణ టేప్‌రికార్డర్ అని, హరితేజ.. తేజ లేజీబాయ్ అని, నబీల్.. ప్రేరణకు ఇగో ఎక్కువ, యష్మి.. అవినాష్ కట్టప్ప (వెన్నుపోటు), అవినాష్.. విష్ణుప్రియ ఓవర్ డ్రమటిక్, గౌతమ్.. ప్రేరణ కంట్రోల్ ఫ్రీక్, రోహిణి.. అవినాష్ అటెన్షన్ సీకర్, ప్రేరణ.. గౌతమ్ ఇరిటేటింగ్, పృథ్వీ.. నిఖిల్ ఇమ్మెచ్యూర్, నిఖిల్.. పృథ్వీ అటెన్షన్ సీకర్ అని పేర్కొన్నారు. తర్వాత విష్ణు, పృథ్వీ సేవ్ అయ్యారు.హరితేజ ఎలిమినేట్చివరగా హరితేజ, యష్మి మాత్రమే మిగిలారు. నబీల్ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడగ్గా అతడు ఇప్పుడు వాడనని తేల్చిచెప్పాడు. దీంతో నాగ్ యష్మిని సేవ్ చేసి హరితేజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. హరితేజ వెళ్లిపోతుంటే విష్ణుప్రియ వెక్కివెక్కి ఏడ్చింది. చివర్లో హరితేజ.. హౌస్‌లో ఎవరు మాస్కులు తీసేస్తే బెటరో చెప్పాలన్నాడు. ఐదుగురు మాస్క్ తీయాల్సిందే!అవినాష్, రోహిణి మాస్కు తీసేయాలని అభిప్రాయపడింది. తేజ.. రూల్స్ చెప్పడమే కాకుండా పాటించాలని సూచించింది. ప్రేరణ మంచి అమ్మాయే కానీ కొన్ని చెడు లక్షణాల వల్ల తన మంచి కనడకుండా పోతుందని తెలిపింది. నిఖిల్.. తన ఎమోషన్స్ బయటకు చూపించాలన్నాడు. అలా ఈ ఐదుగురు మాస్క్ తీసేస్తే బెటర్ అని చెప్పింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అంతకంటే ఆనందం మరొకటి ఉండదు: వరుణ్ తేజ్
‘‘బర్మా నుంచి శరణార్థిగా వైజాగ్ వచ్చిన వాసు అనే ఒక అబ్బాయి జీవిత కథ ‘మట్కా’. 1958 నుంచి 1982 వరకు అంచలంచెలుగా వాసు ఎలా ఎదిగాడు? అనేది సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. ‘మట్కా’ సందేశాత్మక చిత్రం కాదు. పక్కా కమర్షియల్ మాస్ ఫిలిం’’అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా, మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మట్కా’. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ పంచుకున్న విశేషాలు... ⇒ కరుణ కుమార్‌గారు ‘మట్కా’ కథని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చేద్దామని భావించారు. తనే మట్కా కింగ్ అయి ఉంటే ఎలా చేసేవారో అని ఆలోచించి ఆయనకు వచ్చిన ఐడియాస్తో వాసు క్యారెక్టర్ని డిజైన్ చేశారు. ఈ కథ చదువుతున్నప్పుడే వాసు పాత్ర ఎలా ఉంటుందో ఒక అంచనాకి వస్తాం. తనకి ఎవడూ సాయం చేయడనే ఒక బాధ, కోపం వాసులో కనిపిస్తుంది. పైగా ఈ దేశంలో చెలామణి అయ్యే ప్రతీ రూపాయిలో 90 పైసలు ఒక్క శాతం వారే సంపాదిస్తారు. మిగతా 10 పైసల గురించి 99 మంది కొట్టుకుంటారు. వాసు ఆ ఒక్క శాతంలో ఉండాలనుకుంటాడు. ఇందుకోసం తను ఏం చేశాడు? అన్నది సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. ⇒ ‘మట్కా’లో వాసు పాత్ర చాలా » లంగా ఉంటుంది. మంచీ, చెడు అని కాదు.. ప్రేక్షకులు థియేటర్స్‌లో కూర్చున్నప్పుడు ఒక క్యారెక్టర్‌తో కనెక్ట్ అవ్వాలి, ఆ పాత్రతో ప్రయాణించాలి. అలా చూసుకుంటే ‘మట్కా’ లో వాసు క్యారెక్టర్‌కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.. రెండున్నర గంటలు వాసుతో పాటు ప్రయాణం చేస్తారు. మాస్ ఆడియన్స్ లక్ష్యంగా చేసిన సినిమా ఇది. కానీ, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్‌లో వాసు పాత్ర తన బాధని, అసలు తను ఎందుకు అలా అయ్యాడో కూతురుతో ఒక పిట్ట కథలా చెబుతున్నప్పుడు ప్రేక్షకుల కళ్ల నుంచి నీరు వస్తాయి. దాదాపు వారం పాటు ఆ సీన్, డైలాగ్స్‌ని చదువుతూనే ఉన్నాను. ఆ సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఎగై్జట్‌మెంట్ ఉంది. ⇒ నేను సోలో హీరోగా నటించిన లాస్ట్ మూడు సినిమాల్లో(గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్) పెర్ఫార్మెన్స్ పరంగా కొంచెం లిమిటేషన్స్ ఉండే పాత్రలు చేశాను. ‘గద్దల కొండ గణేష్’ తర్వాత మళ్లీ అలాంటి నటనకి స్కోప్ ఉండే సినిమా కోసం ఎదురు చూస్తున్నప్పుడు ‘మట్కా’ కథ వచ్చింది. ఇందులో వాసులాంటి పాత్ర చేయడం సవాల్‌గా, అదృష్టంగా అనిపిచింది. స్క్రీన్‌పై వరుణ్ అని కాకుండా ప్రేక్షకులు వాసునే చూడాలి. దాని కోసం కష్టపడాల్సిందే. ‘గద్దల కొండ గణేష్’ తర్వాత నేను బయటకి వెళ్లినప్పుడు వరుణ్ అని కాకుండా గణేష్ అని పిలిచారు. అది నాకు చాలా పెద్ద ప్రశంస. ఓ యాక్టర్‌గా నన్ను క్యారెక్టర్ పేరుతో పిలిస్తే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. ⇒ కరుణ కుమార్‌గారు మంచి విజన్ ఉన్న డైరెక్టర్. గ్రౌండ్ రియాలిటీని షుగర్ కోటింగ్ లేకుండా చెబుతుంటారు.. అది నాకు చాలా నచ్చింది. ఆయనకి మ్యూజిక్ మీద కూడా మంచి కమాండ్ ఉంది. ‘మట్కా’ తో ఆయనకి ఇంకా మంచి పేరువస్తుంది. ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. ఆ పాటలు కథలో చాలా ముఖ్యం. జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతం, అదిరిపోయే నేపథ్య సంగీతం అందించారు. వాసుతో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ మీనాక్షీ చౌదరిది. నోరా ఫతేహి, కన్నడ కిషోర్, జాన్ విజయ్, రాజేష్, నవీన్ చంద్ర పాత్రలు కూడా చాలా బాగుంటాయి. మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతోనే నిర్మాతలు తొలి రోజు నుంచి చాలా ప్యాషనేట్‌గా పనిచేశారు. -
ఆ అంశాలు ఆకట్టుకుంటాయి: జీవీ ప్రకాష్ కుమార్
‘‘మట్కా’ సినిమా నేను చూశాను. చక్కని యాక్షన్ ఫిల్మ్. అద్భుతమైన కథ, నటన, డైరెక్షన్.. ఈ అంశాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వరుణ్ తేజ్‌గారు ఈ సినిమా కోసం తన కెరీర్లోనే బెస్ట్‌గా నటించారు. ఈ చిత్రం కచ్చితంగా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా, మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిం చిన చిత్రం ‘మట్కా’.కరుణ కుమార్ దర్శకత్వంలో డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘నా తొలి ప్రాధాన్యత ఎప్పుడూ కథకే. ఆ తర్వాత డైరెక్టర్ గురించి ఆలోచిస్తాను. కరుణ కుమార్‌గారు అద్భుతమైన డైరెక్టర్. ‘మట్కా’ పీరియాడికల్ స్టోరీ. మ్యూజిక్ కూడా అదే తరహాలో తీసుకురావడం నాకు పెద్ద సవాల్‌గా అనిపించింది.ఈ మూవీలో రెట్రో జోన్లో చేసిన ‘లేలే రాజా..’ పాట నాకు చాలా ఇష్టం. నిర్మాతలు పెద్ద బడ్జెట్‌తో ఈ సినిమా తీశారు. నెలలో 12 రోజులు నటన కోసం కేటాయిస్తాను. మిగతా రోజులన్నీ సంగీతం కోసం కేటాయిస్తాను. తెలుగులో ‘దసరా’ సినిమాలో ఒక పాత్ర చేయాల్సింది. కానీ, నా డేట్స్ కుదరలేదు. మంచి కథ, క్యారెక్టర్ ఉంటే తెలుగులో నటిస్తాను. వ్యక్తిగతంగా ప్రేమకథలకు సంగీతం ఇవ్వడం నాకు ఇష్టం’’ అన్నారు. -
హీరో వరుణ్ తేజ్ మూవీ మట్కా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వరుణ్ తేజ్ 'మట్కా' ట్రైలర్ రిలీజ్
'మట్కా' మూవీ ట్రైలర్ రిలీజైంది. చాన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మెగాహీరో వరుణ్ తేజ్.. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలన్ని పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్లే ట్రైలర్ ఉంది. 'మట్కా' అనే గేమ్ నేపథ్య కథతో దీన్ని తెరకెక్కించారు. మూడు విభిన్న గెటప్స్‌లో వరుణ్ కనిపించాడు. వేరియేషన్స్‌తో ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: పవన్‌తో తొలి సినిమా.. తర్వాత కెరీర్ ఖతం.. ఈ హీరోయిన్ ఎవరంటే?)నవంబర్ 14న థియేటర్లలోకి 'మట్కా' రానుంది. అదే రోజు సూర్య పాన్ ఇండియా మూవీ 'కంగువ' కూడా థియేటర్లలోకి రానుంది. అయితేనేం ట్రైలర్ చూస్తుంటే వర్కౌట్ అయ్యే బొమ్మలా అనిపిస్తుంది. ట్రైలర్లో వరుణ్ తేజ్ చెప్పిన 'నాకు ఇక్కడ (మెదడు).. ఇక్కడ (గుండె)... ఇక్కడ (ఇంకా ఇంకా కిందకు) కంట్రోలు ఉంది కాబట్టే ఇలా వున్నాను' అనే డైలాగ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. (ఇదీ చదవండి: మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య) -
మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య
మెగాకపుల్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠికి అప్పుడే పెళ్లయి ఏడాది అయిపోయింది. దీంతో స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి ఆనందంగా గడిపిన క్షణాల్ని అద్భుతంగా క్యాప్చర్ చేశారు. వాటన్నింటిని ఒకటిన్నర నిమిషంలోనే చాలా చక్కగా చూపించారు.(ఇదీ చదవండి: దీపావళికి నాలుగు కొత్త సినిమాలు.. ఏది ఎలా ఉందంటే?)వరుణ్ తేజ్.. లావణ్య గురించి చెప్పడం, అలానే లావణ్య.. వరుణ్ని 'హే మిస్టర్' అని పిలవడం లాంటి విజువల్స్ బాగున్నాయి. ఈ వీడియోలోనే హల్దీ, పెళ్లికి సంబంధించిన అన్నింటినీ చూపించేశారు. అల్లు అర్జున్-రామ్ చరణ్ కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేయడం లాంటివి కూడా భలే అనిపించాయి.రీసెంట్గా వెకేషన్ కోసం ఫ్యామిలీతో కలిసి వరుణ్-లావణ్య స్విట్జర్లాండ్ వెళ్లి వచ్చారు. దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అలానే పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా భార్యకు వరుణ్ విషెస్ కూడా చెప్పాడు. సరే ఇదంతా పక్కనబెడితే వరుణ్ లేటెస్ట్ మూవీ 'మట్కా'. ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది. దీనిపై ఈ మెగా హీరో బోలెడు ఆశలు పెట్టేసుకున్నాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)A love story written in the stars! ✨💖Relive the magical moments of Mega Prince @IAmVarunTej and @Itslavanya's wedding day with a special video 😍Happy Wedding Anniversary to the Lovely Couple and Here’s to a lifetime of happiness together 🫶#VarunTej #LavanyaTripathhi pic.twitter.com/UnVQizu9s6— Filmy Bowl (@FilmyBowl) November 1, 2024 -
నీదే దునియా అంతా...
‘హే రప్పా... రప్పా... రప్పా... రప్పా... యురేఖ... కూర్చుంటే ఏదీ రాదు... నిలబడి చూస్తుంటే కాదు... కలబడితే నీదే దునియా అంతా..’ అంటూ మొదలవుతుంది ‘మట్కా’ సినిమాలోని ‘తస్సాదియ్యా...’ సాంగ్. వరుణ్ తేజ్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ఇది. నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించారు. కరుణ కుమార్ దర్శకత్వంలో డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం నవంబరు 14న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘తస్సాదియ్యా...’పాట లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. ఈ చిత్రం సంగీతదర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపరిచిన ఈపాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా మనోపాడారు. ‘ఎవ్వడిని అడగొద్దంట... జీవితమే నేర్పిస్తుంది అంతా... తస్సాదియా..’ అంటూ సాగుతుందీపాట. -
కౌంట్‌డౌన్ స్టార్ట్
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించారు. 1958 నుంచి 1982 మధ్య జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు.కరుణ కుమార్ దర్శకత్వంలో డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం నవంబరు 14న విడుదల కానుంది. కాగా ఆదివారం ‘మట్కా’ సినిమా రిలీజ్ 25 రోజుల కౌంట్‌డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, ‘కన్నడ’ కిషోర్, రవీంద్ర విజయ్ ఇతర కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. -
మట్కాతో 'లే లే రాజా' అంటున్న బ్యూటీ
వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక మాస్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. వైర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో నవంబరు 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.'లే లే రాజా' అంటూ సాగే ఈ పాటను భాస్కరభట్ల రచించగా నీతీ మోహన్ ఆలపించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘మట్కా’ రూపొందుతోంది. 1958 నుంచి 1982 వరకు 24 ఏళ్ల బ్యాక్‌డ్రాప్‌తో పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను కరుణ కుమార్ ఎంచుకున్నారు. వరుణ్ తేజ్‌ని నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో అద్భుతంగా చూపిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. -
మళ్ళీ కామెడీ రోల్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్
-
మెగా హీరో 'మట్కా' టీజర్ ఎలా ఉందంటే?
మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'మట్కా'. 1980 బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా విజయవాడలో లాంచ్ చేశారు. గత కొన్నాళ్లుగా వరస ఫ్లాఫ్స్ దెబ్బకు పూర్తిగా డీలా పడిపోయిన వరుణ్ తేజ్ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. టీజర్ అయితే ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: వాళ్ల మాటల వల్ల ఇప్పటికీ బాధపడుతున్నా: ప్రియమణి)యుక్త, వృద్ధ పాత్రల్లో వరుణ్ తేజ్ కనిపించాడు. వింటేజ్ లుక్ కూడా బాగుంది. యాక్షన్ సీన్స్ కూడా గట్టిగానే ఉండబోతున్నాయని టీజర్‌తో హింట్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ 'మట్కా' టైటిల్‌కి తగ్గట్లు ఈ గేమ్‌కి సంబంధించిన సీన్స్ ఎక్కడ చూపించలేదు. బహుశా ట్రైలర్లో రివీల్ చేస్తారేమో?'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. వరుణ్ సరసన మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు. నవంబరు 14న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: నటి వనిత నాలుగో పెళ్లి.. అసలు నిజం ఇది) -
‘కలి’లో మంచి కంటెంట్ ఉంది : వరుణ్ తేజ్
మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అలాంటి మంచి కంటెంట్‌తో వస్తున్న ‘కలి’ సినిమాకు ఆడియన్స్ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను’అని అన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. ‘ప్రిన్స్ నాకు క్లోజ్ ఫ్రెండ్. డెడికేషన్ ఉన్న నటుడు. హీరోగా చేస్తూనే మంచి రోల్స్ వస్తే డీజే టిల్లు, స్కంధ లాంటి మూవీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అలాంటి క్యారెక్టర్స్ తో ప్రిన్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. నా మూవీస్ లో కూడా ప్రిన్స్ నటించాడు. ప్రిన్స్ ఈ సినిమా గురించి నాకు చాలా ఎగ్జైటింగ్ గా చెప్పాడు. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఆదరించాలని కోరుతున్నాను’అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో అల్లరి నరేశ్, ప్రియదర్శి, ఆకాశ్ జగన్నాథ్‌తో చిత్రబృందం పాల్గొంది. కథ కొత్తగా అనిపించింది: కె. రాఘవేంద్ర రెడ్డి‘‘కరోనా ప్యాండమిక్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. మన దేశంలో కూడా ఎక్కవగానే ఉన్నాయంటున్నారు. అయితే ఆత్మహత్య ప్రయత్నం చేసే వ్యక్తిని ఎవరైనా అడ్డుకుని, వారి ఆత్మహత్య ఆలోచనను దూరం చేస్తే బాగుంటుంది. ఈ పాయింట్‌తో ‘కలి’ కథను శివ శేషు రాసుకున్నాడు. కథ విన్నప్పుడు కొత్తగా అనిపించింది. అందుకే సమర్పకుడిగా వ్యవహరించాను’’ అని అన్నారు కె. రాఘవేంద్ర రెడ్డి. ప్రిన్స్, నరేష్ అగస్త్య లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘కలి’. శివ శేషు దర్శకత్వంలో కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో లీలా గౌతమ్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో కె. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ– ‘‘జీవితంలోని సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్న శివరాజ్ జీవితంలోకి ఓ అపరిచిత వ్యక్తి రావడం వల్ల ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రకథ. దర్శకుడు శివ శేషు ప్రతిభావంతుడు. అతనికి పురాణాల మీద పట్టు ఉంది. కలి అతనికి మంచి పేరు తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం నేను రెండు కథలు రాస్తున్నాను’’ అని అన్నారు. -
‘కాళీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సెలవులు కలిసొచ్చేలా...
వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని నవంబరు 14న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించి, వరుణ్ తేజ్ కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘మట్కా’ రూపొందుతోంది.కరుణ కుమార్ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను తయారు చేశారు. 1958 నుంచి 1982 వరకు 24 ఏళ్ల బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకున్నారాయన. వరుణ్ తేజ్‌ని నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో అద్భుతంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వరుణ్ తేజ్, ఫైటర్స్‌పై సినిమాకి కీలకమైన, ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నాం.మరోవైపు నిర్మాణానంతర పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కార్తీక ΄ûర్ణమికి ముందుగా నవంబర్ 14న విడుదల కానున్న మా సినిమాకి లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, పి. రవిశంకర్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: ఎ. కిశోర్ కుమార్. -
మెగా హీరో సడన్ సర్ప్రైజ్.. ఆశలన్నీ దీనిపైనే
మెగా హీరో వరుణ్ తేజ్ మంచి నటుడే. వైవిధ్యమైన సినిమాలు చేస్తుంటాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. అదృష్టమే కలిసి రావడం లేదు. ఎందుకంటే గత మూడు నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్స్‌గా నిలిచాయి. దీంతో మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఇలాంటి టైంలో 'మాట్కా' అనే మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు దీని రిలీజ్ డేట్ ఖరారు చేశారు.(ఇదీ చదవండి: పెళ్లికి ముందే పిల్లల గురించి శోభిత కామెంట్స్)'పలాస' మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'మాట్కా' చిత్రాన్ని.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీస్తున్నారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీత దర్శకుడు. నవంబరు 14న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.కొన్నాళ్ల క్రితం బడ్జెట్ సమస్యల వల్ల ఈ సినిమా ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. కానీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇంతలోనే సర్ప్రైజ్ అన్నట్లు రిలీజ్ డేట్‌తో వచ్చేశారు. దీనితో పాటే సూర్య 'కంగువ' రిలీజ్ కానుంది. మరి వరుణ్ తేజ్ హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్) -
చివరి దశలో మట్కా మూవీ
-
ఫైనల్లో మట్కా
వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది.‘‘పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘మట్కా’. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్‌లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
కాకినాడలో మట్కా
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వంలో డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ తాజా షెడ్యూల్ కాకినాడలో జరుగుతోంది.‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మట్కా’. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో వరుణ్ డిఫరెంట్ మేకోవర్లలో కనిపించనున్నారు. ప్రస్తుతం కాకినాడలో జరుగుతున్న షెడ్యూల్లో కీలక తారాగణంపై టాకీ పార్ట్‌తో పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి. రవి శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: ఎ. కిశోర్ కుమార్. -
తిరుమల శ్రీవారి సేవలో హీరో వరుణ్ తేజ్-లావణ్య (ఫోటోలు)
-
పెళ్లి తర్వాత ఇన్నాళ్లకు తిరుమలలో వరుణ్-లావణ్య
మెగా హీరో వరుణ్ తేజ్, తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి తిరుమల స్వామి వారిని దర్శించుకున్నాడు. మంగళవారం రాత్రి కొండపై బస చేసి, బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శనం చేసుకున్నారు. తర్వాత మొక్కులు చెల్లించుకున్నారు. వేదపండితులు ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌కి రోడ్డు ప్రమాదం అని రూమర్స్.. టీమ్ క్లారిటీ)గతేడాది పెళ్లి చేసుకున్న పనిలో బిజీ అయిపోయిన వరుణ్ తేజ్.. ఇన్నాళ్లకు తీరిక చూసుకుని భార్యతో కలిసి తిరుమల దర్శనం చేసుకున్నాడు. ఆలయం బయట వీళ్లని చూసిన పలువురు.. సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ ప్రస్తుతం 'మట్కా' సినిమా చేస్తున్నాడు. 80స్ బ్యాక్ డ్రాప్లో స్టోరీతో తీస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి రావొచ్చు.(ఇదీ చదవండి: అన్నీ తానై.. కంగన 'ఎమర్జెన్సీ' ట్రైలర్ రిలీజ్)#VarunTej #LavanyaTripathi Visited Tirumala Tirupati Devasthanam pic.twitter.com/k4J76fsFzy— Telugu Film Producers Council (@tfpcin) August 14, 2024 -
వింటేజ్ యాక్షన్
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘మట్కా’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లు. కరుణకుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై డా. విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.ఇరవైనాలుగేళ్ల టైమ్‌లైన్‌తో సాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. సిగార్ తాగుతూ కనిపిస్తున్న వరుణ్ తేజ్ డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్లో వింటేజ్ వైబ్ కనిపిస్తోంది. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, పి. రవిశంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
‘కమిటీ కుర్రోళ్ళు’ చూసి ఏడ్చాను : వరుణ్ తేజ్
‘‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూశాను. చాలా బాగుంది. నాకు పాత రోజులు గుర్తొచ్చాయి.. చాలా చోట్ల కన్నీళ్లు పెట్టుకున్నాను. ప్రేక్షకులకు కూడా అలాంటి అనుభూతి కలుగుతుందనిపిస్తోంది. ఇంతమంది ప్రతిభ ఉన్న నటీనటులను ఇండస్ట్రీకి అందిస్తున్న మా చెల్లి నిహారికను చూస్తుంటే గర్వంగా ఉంది’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. నూతన నటీనటులతో యదు వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 9న విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, అడివి శేష్, దర్శకుడు వెంకీ అట్లూరి అతిథులుగా హాజరయ్యారు. సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ– ‘‘కమిటీ కుర్రోళ్ళు’ టైటిల్ విన్నప్పుడే నాకు చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. ట్రైలర్ చాలా నచ్చింది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రం ట్రైలర్ చూడగానే ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపించింది’’ అన్నారు అడివి శేష్. -
పాన్ ఇండియాపై ‘మెగా’ ఆశలు
మెగా హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్‌పై ఫోకస్ పెట్టారు. తమ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అలాంటి కథలనే ఎంచుకుంటున్నారు. చిరంజీవి మొదలు సాయి ధరమ్ తేజ్ వరకు అందరూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’, రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు చిత్రాలపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఇది హిట్టయితే ఇక చెర్రీకి తిరుగుండదు. పాన్ ఇండియా మార్కెట్‌ను కొన్నాళ్ల పాటు శాసించొచ్చు. ‘విశ్వంభర’ హిట్ కూడా చిరుకు చాలా అవసరం. ఆయన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇది హిట్టయితే ఇకపై చిరు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులనే ఎంచుకునే అవకాశం ఉంది. (చదవండి: అర్జునుడుగా విజయ్ దేవరకొండ.. రెమ్యునరేషన్ ఎంతంటే?)మరోవైపు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. దాని కోసం పాన్ ఇండియా సబ్జెక్ట్‌నే నమ్ముకున్నాడు. ఆయన నటిస్తున్న ‘మట్కా’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. (చదవండి: ఆ విషయంలో తప్పు చేశాను: సమంత)ఇక ‘విరూపాక్ష’ చిత్రంతో 100 కోట్ల క్లబ్బులో చేరిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఇకపై పాన్ ఇండియా సినిమాలే చేస్తానంటున్నాడు. ‘బ్రో’ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే టైటిల్ విషయంలో వచ్చిన కాట్రవర్సీ కారణంగానో లేదా బడ్జెట్ ఇష్యూనో తెలియదు కానీ ఆ సినిమాను పక్కకు పెట్టి కొత్త మూవీని ప్రకటించాడు. ఇది తన కెరీర్లో 18వ సినిమా. ఈ మూవీతో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. సాయి ధరమ్ తేజ్‌కి ఈ చిత్రం చాలా ముఖ్యం. ఇది హిట్టయితేనే ఇకపై పాన్ ఇండియా సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. -
హైదరాబాద్‌లో మట్కా
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ్రపారంభమైంది. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. దేశమంతటా సంచలనం సృష్టించిన ఓ నిజ జీవిత ఘటన స్ఫూర్తితో ఈ మూవీ తెరకెక్కుతోంది.ఇందులో వినోదంతో పాటు నిజ జీవితంలోని ఘటనలు, హ్యూమన్ ఎమోషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ‘మట్కా’లో నాలుగు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు వరుణ్ తేజ్. నలభై రోజుల పాటు జరగనున్న ఈ ముఖ్యమైన షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేక సెట్ నిర్మించాం. ఇందులో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ప్రస్తుతం వరుణ్, నోరా, మీనాక్షీలపై సన్నివేశాలు తీస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి. రవిశంకర్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: ఎ. కిశోర్ కుమార్. -
కొంత గ్యాప్ తర్వాత...
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘మట్కా’. ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లు. రజనీ తాళ్లూరి ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి వైర ఎంటర్టైన్మెంట్స్పై డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. యావత్ భారతదేశాన్ని కదిలించిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో సాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు.కాగా కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఆరంభం కానుంది. తాజా షెడ్యూల్ చిత్రీకరణను ఈ నెల 19న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఓ స్టూడియోలో ప్లాన్ చేశారు. ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతోంది. కొత్తగా ప్రారంభం కానున్న షూటింగ్ షెడ్యూల్లో ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్టును కూడా చిత్రీకరిస్తారట మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
కట్టెల పొయ్యిపై టీ పెట్టిన మెగా కోడలు..లావణ్య త్రిపాఠి ఫోటోలు వైరల్
-
ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లెలెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. పుల్వామా దాడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి, మిక్స్డ్ టాక్ని సంపాదించుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. మానుషి చిల్లర్ హీరోయిన్. నవదీప్, మిర్ సర్వర్, రుహానీ శర్మ కీలక పాత్రలు పోషించారు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ కథేంటంటే..? అర్జున్ రుద్ర దేవ్ అలియాస్ రుద్ర(వరుణ్ తేజ్) భారతీయ వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పని చేస్తుంటాడు. అక్కడే పని చేసే రాడార్ ఆఫీసర్ అహనా గిల్(మానుషి చిల్లర్)తో ప్రేమలో ఉంటాడు. అహనా చెప్పినా వినకుండా.. గగనవీధిలో అనేక ప్రయోగాలు చేస్తుంటాడు అర్జున్. అలా ఓ సారి ప్రాజెక్ట్ వజ్ర చేపట్టి.. తొలి ప్రయత్నంలోనే విఫలం అవుతాడు. ఈ ప్రయోగంలో తన ప్రాణ స్నేహితుడు వింగ్ కమాండర్ కబీర్(నవదీప్) ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రాజెక్ట్ వజ్రను బ్యాన్ చేస్తారు. గాయాలను నుంచి కోలుకున్న రుద్ర.. 2019లో ఆపరేషన్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఆపరేషన్ వాలైంటైన్ లక్ష్యమేంటి? ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? అర్జున్ రుద్ర తన టీమ్‌తో కలిసి పాకిస్తాన్ కళ్లు గప్పి ఆ దేశ బార్డర్ని క్రాస్ చేసి ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశాడు? ప్రాజెక్ట్ వజ్ర లక్ష్యమేంటి? చివరకు అది సక్సెస్ అయిందా లేదా? అనేదే మిగతా కథ they risked it all to honour the fallen, witness the operation come alive!#OperationValentineOnPrime, watch nowhttps://t.co/4AlFuYMpRi pic.twitter.com/aOoAv4lHQa — prime video IN (@PrimeVideoIN) March 22, 2024 . -
నెల రోజుల్లోపే ఓటీటీకి మెగా హీరో యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన బిగ్గెస్ట్ ఏరియల్ వార్ డ్రామా ఆపరేషన్ వాలెంటైన్ . శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించగా.. నవదీప్ కీలక పాత్ర పోపించాడు. మార్చి 1న తెలుగు,హిందీ భాషల్లో విడుదలై మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటం.. దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ‘ఆపరేషన్ వాలెంటైన్ రూపొందించారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా కనిపించారు. హీరోయిన్ మానుషీ చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు. పుల్వామా ఎటాక్ జరిగిన తర్వాత ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అతిపెద్ద వైమానిక దాడిని ఈ చిత్రంలో చూపించారు.ఈ సినిమా తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ థియేటర్లలో విడుదలైంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ హక్కులన అమెజాన్ ప్రైమ్ దక్కించకున్న సంగతి తెలిసిందే. ఈ ఫర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కానన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే తేదీ ఫిక్స్ అయితే ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలో చూసేయొచ్చు. కాగా.. ఈ చిత్రంలో నవదీప్, పరేష్ పహుజా, రుహానీ శర్మ, అలీ రెజా ప్రధాన పాత్రల్లో కనిపించారు. #OperationValentine OTT RELEASE MARCH 29 @PrimeVideoIN pic.twitter.com/2RQAdlDuEq — OTTGURU (@OTTGURU1) March 9, 2024 -
'ఆపరేషన్ వాలెంటైన్' ఓటీటీలో ఎంట్రీ అప్పుడేనా..?
వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్' మార్చి 1న విడుదలైన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. మానుషి చిల్లర్ ఇందులో కథానాయిక. ఈ మధ్య కాలంలో వరుణ్‌కు మంచి విజయాన్ని అందించిన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. పుల్వామా ఎటాక్ వంటి నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొంది ఈ దేశభక్తి చిత్రాన్ని మేకర్స్ రూపొందించారు. మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను దీంట్లో చక్కగా చూపించాడు దర్శకుడు. ఇందులో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా కనిపించగా.. మానుషి రాడార్ ఆఫీసర్‌గా మెప్పించింది. ఆపరేషన్ వాలంటైన్ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మంచి ధరకే దక్కించుకుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా రిలీజైన 30 రోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది. అంటే మార్చి 29 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఒక వేళ ఆ తేదీలో కుదరకపోతే ఏప్రిల్ మొదటి వారంలో గ్యారెంటీగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు సంబంధించి నెలలోపు స్ట్రీమింగ్ అవ్వొచ్చు. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఉండనుందని సమాచారం. -
'ఆపరేషన్ వాలంటైన్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. వచ్చేది అప్పుడేనా?
దేశభక్తి నేపథ్యంలో మెగాహీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలంటైన్'. గతంలో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజైపోయింది. గురువారం సాయంత్రమే ప్రీమియర్లు పడగా పాజిటివ్ టాక్ వచ్చింది. అలానే ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ కూడా ఎవరనేది తెలిసిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా రివ్యూ) మెగాహీరోల్లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుణ్ తేజ్ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. హిట్ ఫ్లాప్ సంగతి పక్కనబెడితే ఒక్కో చిత్రం భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అలా పుల్వామా దాడి, భారత్-పాక్ వైరం తదితర అంశాలతో తీసిన చిత్రమే 'ఆపరేషన్ వాలంటైన్'. దేశభక్తి సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా నచ్చేస్తుంది. మిగతా వాళ్లకు మాత్రం నచ్చడం నచ్చకపోవడం అనేది చెప్పలేం. ఇకపోతే 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల డీల్ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. అంటే ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు సంబంధించి నెలలోపు స్ట్రీమింగ్ అవ్వొచ్చు. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఉండనుందని సమాచారం. (ఇదీ చదవండి: యాంకర్‌ను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్) -
‘ఆపరేషన్ వాలెంటైన్’ రివ్యూ
టైటిల్: ఆపరేషన్ వాలెంటైన్ నటీనటులు: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవదీప్, మిర్ సర్వర్, రుహానీ శర్మ తదితరులు నిర్మాతలు: సోనీ పిక్చర్స్, సందీప్ ముద్ద దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా సంగీతం: మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫీ:హరి కె. వేదాంతం ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: మార్చి 1, 2024 కథేంటంటే.. అర్జున్ రుద్ర దేవ్ అలియాస్ రుద్ర(వరుణ్ తేజ్) భారతీయ వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పని చేస్తుంటాడు. అక్కడే పని చేసే రాడార్ ఆఫీసర్ అహనా గిల్(మానుషి చిల్లర్)తో ప్రేమలో ఉంటాడు. అహనా చెప్పినా వినకుండా.. గగనవీధిలో అనేక ప్రయోగాలు చేస్తుంటాడు అర్జున్. అలా ఓ సారి ప్రాజెక్ట్ వజ్ర చేపట్టి.. తొలి ప్రయత్నంలోనే విఫలం అవుతాడు. ఈ ప్రయోగంలో తన ప్రాణ స్నేహితుడు వింగ్ కమాండర్ కబీర్(నవదీప్) ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రాజెక్ట్ వజ్రను బ్యాన్ చేస్తారు. గాయాలను నుంచి కోలుకున్న రుద్ర.. 2019లో ఆపరేషన్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఆపరేషన్ వాలైంటైన్ లక్ష్యమేంటి? ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? అర్జున్ రుద్ర తన టీమ్‌తో కలిసి పాకిస్తాన్ కళ్లు గప్పి ఆ దేశ బార్డర్ని క్రాస్ చేసి ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశాడు? ప్రాజెక్ట్ వజ్ర లక్ష్యమేంటి? చివరకు అది సక్సెస్ అయిందా లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిని దేశం ఇప్పటికి మర్చిపోలేదు. ఈ దాడిలో 40 మందికిపైగా భారతీయ జవాన్లు వీర మరణం పొందారు. దీనికి ప్రతీకారంగా భారత్ బాల్కోట్ స్ట్రైక్ నిర్వహించి సక్సెస్ అయింది. ఈ ఘటనల ఆధారంగానే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెరకెక్కించాడు. ఇందులో దేశ రక్షణ కోసం వైమానిక దళం ఎలా పని చేస్తుంది అనేది కళ్లకు కట్టినట్లు చూపించారు. వాస్తవానికి వేరే దేశంతో యుద్ధం అనగానే అందరికి సైనిక దళమే గుర్తొస్తుంది. కానీ వారితో పాటు నావిక, వైమానిక దళం కూడా దేశ రక్షణ కోసం పని చేస్తుందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. నావిక, వైమానిక దళాలపై సినిమాలు కూడా పెద్దగా రాలేదు. కానీ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత మన వైమానిక దళం గొప్పదనం ప్రపంచానికి మొత్తం తెలిసింది. గనతలంలో వాళ్లు చేసే పోరాటల గురించి అంతా చర్చించుకున్నారు. బాలీవుడ్లో ఆ నేపథ్యంతో సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే ‘ఫైటర్’ అనే సినిమా కూడా ఇదే కాన్సెప్ట్‌తో వచ్చి..బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఆపరేషన్ వాలెంటైన్ కాన్సెప్ట్ కూడా అలాంటిదే. అయితే ఇలాంటి నేపథ్యంతో తెలుగులో వచ్చిన మొట్టమొదటి సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్ ’ అనే చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్(రూ.42 కోట్లు అని సమాచారం) ఇంత రిచ్‌గా సినిమాను తెరకెక్కించిన దర్శకుడుని అభినందించాల్సిందే. అయితే ఇలాంటి సినిమాల్లో ఎమోషన్స్ చాలా ముఖ్యం. ఆపరేషన్ వాలెంటైన్లో అది మిస్ అయింది. దేశం మొత్తాన్ని కుదిపేసిన పుల్వామా దాడిని మరింత ఎమోషనల్‌గా, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చూపిస్తే బాగుండేదేమో. అలా అని ఎమోషన్ పూర్తిగా పండలేదని చెప్పలేం. దాడిలో ఓ సైనికుడు తన ప్రాణాన్ని అడ్డు పెట్టి చిన్నారిని కాపాడిన సీన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆ తరహా ఎమోషనల్ సీన్స్ కొచ్చి చోట్ల ఉంటే సినిమా మరింత కనెక్ట్ అయ్యేది. దర్శకుడు వైమానిక దళ సైనికుల ఆపరేషన్స్, సాహసాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. చాలా సహజంగా వాటిని తెరపై చూపించాడు కానీ కథలోని డ్రామాని మాత్రం తెరపై సరిగా పండించలేకపోయాడు.ప్రాజెక్ట్ వజ్రతో కథను ప్రారంభించాడు. ఆ ఒక్క సీన్‌తోనే హీరో పాత్ర ఎలాంటిదో తెలియజేశాడు. ఫస్టాప్ అంతా పైలెట్ల టెస్ట్, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చుట్టునే తిరుగుతుంది. అయితే ప్రేమ కథలో గాఢత తగ్గినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. పాకిస్తాన్‌పై మన సైనికులు దాడి చేసే సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు. పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ నెహ్రుని తిప్పికొట్టేందుకు హీరో చేసే సాహసం.. చివరల్లో ఆపరేషన్ వజ్రని ప్రయోగించడం ప్రతీది.. ఆకట్టుకుంటుంది. మన సైనికుల ధైర్యసాహసాలను గుర్తు చేసుకుంటూ థియేటర్స్‌ని నుంచి బయటకు వస్తారు. ఎవరెలా చేశారంటే.. అర్జున్ రుద్ర దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ ఒదిగిపోయాడు. తెరపై నిజమైన వింగ్ కమాండర్‌గానే కనిపించాడు. ఆయన బాడీ లాంగ్వెజ్, మాటలు ప్రతీది నిజమైన సైనికుడినే గుర్తు చేస్తుంది. సినిమా కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపించింది. ఇక రాడార్ ఆఫీసర్ అహనా గిల్‌గా మానుషిచిల్లర్ అద్భుతంగా నటించింది. సినిమాలో తన పాత్రను మంచి ప్రాధాన్యత ఉంటుంది. అయితే హీరోహీరోయిన్ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. కబీర్‌గా నవదీప్ ఒకటి రెండు సన్నివేశాల్లోనే కనిపించాడు. ఆయన పాత్రకు డైలాగ్స్ కూడా లేవు. మిర్ సర్వర్, రుహానీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతిక పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. మిక్కి జే మేయర్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. వందేమాతరం సాంగ్ ఆకట్టుకుంటుంది. హరి కె. వేదాంతం సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్ చాలా రిచ్‌గా చిత్రీకరించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఒక్క వరుణ్ మూవీకే పర్మిషన్ ఇచ్చిన రక్షణ శాఖ..!
-
'ఆపరేషన్ వాలెంటైన్' చూసి గర్వపడతారు: నిర్మాతలు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్‌పై ఈ చిత్రం రపొందింది. ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతలు సిద్దు ముద్దా, నందకుమార్ అబ్బినేని మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. అలా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మొదలైంది దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ చేసిన షార్ట్ ఫిల్మ్ నాకు(సిద్దు ముద్దా), వరుణ్ కి చాలా నచ్చింది. దాన్నే ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ గా చేయాలనే ప్రయత్నాల్లో దర్శకుడు ఉన్నప్పుడు, నేను, వరుణ్ కలసి కథ విన్నాం. కథ విన్న వెంటనే మాకు చాలా నచ్చింది. వెంటనే సినిమా చేయాలని అనుకున్నాం. సోనీ పిక్చర్స్ నిర్మాణ భాగస్వామిగా రావడంతో తెలుగు, హిందీలో చాలా గ్రాండ్ రూపొందించాం. శక్తి ప్రతాప్ కి చాలా క్లారిటీ ఉంది. తన విజన్ క్లియర్ గా ఉంటుంది, సినిమాకి ఏం కావాలో తనకి చాలా స్పష్టంగా తెలుసు. అలాగే తనకు వీఎఫ్ఎక్స్ పై చాలా మంచి కమాండ్ ఉంది. తను అదే నేపథ్యం నుంచి వచ్చారు. ఫైటర్ తర్వాత ఇలాంటి భారీ ఎయిర్ సీక్వెన్స్ తో ఇండియాలో వచ్చిన సినిమా ఇదే. సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రశంసించారు ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను ఎయిర్ ఫోర్స్ అధికారులకు చూపించాం. సినిమా మొత్తం చూసిన తర్వాత చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏం చెప్పారో అదే తీశారని ప్రశంసించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా వారు చాలా సపోర్ట్ చేశారు. రియల్ ఎయిర్ బేస్ లో షూట్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. సైనికులు త్యాగాలని, ధైర్య సాహసాలని స్మరించుకుంటూ వాళ్ళ కథని ప్రేక్షకులకు చూపించాలనే గొప్ప ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. 'ఆపరేషన్ వాలెంటైన్' చేస్తున్న క్రమంలో ఇలాంటి రియల్ హీరోస్ సినిమాలు మరిన్ని చేయాలనే స్ఫూర్తి కలిగింది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. మిక్కీ జే మేయర్ బీజీఎం అదరగొట్టేశాడు ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతం అందించాడు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా మ్యూజిక్ ఇచ్చారు. పాటలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఇప్పటికే పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ మూవీతో వరుణ్‌కి బాలీవుడ్లో మంచి గుర్తింపు వస్తుంది. నితిన్‌తో ఓ సినిమా? వరుణ్ తేజ్ తో ఇది మాకు రెండో సినిమా(గతంలో ‘గని’ అనే సినిమాను నిర్మించారు). ఇకపై బయట హీరోలతోనూ సినిమాలు చేస్తాం. నితిన్ తో ఓ సినిమా అనుకుంటున్నాం. ప్రస్తుతం మా దృష్టి 'ఆపరేషన్ వాలెంటైన్' విడుదలపై ఉంది. ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డాం. దీని తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని ఆగస్టు నుంచి కొత్త ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తాం. ఇప్పటివరకు స్పోర్ట్స్, ఏరియల్ యాక్షన్ జోనర్స్ లో లార్జర్ సినిమాలు చేశాం. ఇప్పుడు ఒక డిఫరెంట్ లవ్ స్టొరీ చేయాలనే ఆలోచన ఉంది. -
ప్రతి భారతీయుడు కనెక్ట్ అయ్యే సినిమా ఇది
‘‘ఆపరేషన్ వాలెంటైన్’ షూటింగ్లో ఒక ఫ్లైట్ సిమ్యులేటర్‌లో నన్ను కూర్చోబెట్టి రియల్ లైఫ్ప్రోజెక్షన్ అనుభూతిని ఇచ్చేలా చేశారు. అందులో కూర్చుంటే నిజంగా విమానం నడిపినట్లే ఉంటుంది. ముఖానికి ఆక్సిజన్ మాస్క్, తలకు హెల్మెట్ ఉండటంతో కళ్లతోనే భావోద్వేగాలు పలికించాలి. ఇలాంటి పాత్రలు చేయడం ఒక సవాల్‌గా అనిపించింది’’ అన్నారు వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్‌పై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చెప్పిన విశేషాలు. ► ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రకథని శక్తి ప్రతాప్ సింగ్ 2020లో చెప్పాడు.. వినగానే నచ్చింది. శక్తి హిందీ అబ్బాయి అయినప్పటికీ ఈ సినిమాని తెలుగులోనే చేయాలని అనుకున్నాడు. నేను సోనీ పిక్చర్స్ వారితో ఓ సినిమా చేయాల్సి ఉండటంతో ఈ చిత్రకథను వారికి పంపించాను. నేషనల్ అప్పీల్ కంటెంట్ ఉన్న ఈ కథ సోనీ పిక్చర్స్ వారికి కూడా బాగా నచ్చడంతో హిందీలో కూడా చేయాలని నిర్ణయించాం. ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ మూవీలోని ప్రతి సీన్‌ని తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరించాం. ► ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రంలో రుద్ర పాత్రలో కనిపిస్తాను. కొందరు రియల్ ఎయిర్ ఫైటర్స్ స్ఫూర్తితో నా పాత్రని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు శక్తి ప్రతాప్. నా పాత్రతో అందరూ చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా కోసం శక్తి చాలా పరిశోధన చేశాడు. తనకి వీఎఫ్ఎక్స్పై కూడా మంచి పట్టు ఉంది. ► 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందారు. దానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత వైమానిక దళం ఓ ఆపరేషన్ నిర్వహించి, శత్రువులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఫిబ్రవరి 14న ప్రపంచమంతా వాలెంటైన్స్ డే జరుపుకుంటుంది. అయితే ఫిబ్రవరి 14న ఈ ఘటన జరిగింది కాబట్టి మా సినిమాకి ‘ఆపరేషన్ వాలెంటైన్’ టైటిల్ పెట్టాం. ఈ సినిమాలో వాలెంటైన్ అంటే ప్రతి ఒక్కరికీ దేశం మీద ఉన్న ప్రేమ అని అర్థం. మా సినిమా చూసిన ఎయిర్‌ఫోర్స్ అధికారులు పుల్వామా ఘటనపై ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల్లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ ది బెస్ట్ అని ప్రశంసించారు. ప్రతి భారతీయుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ► ‘ఆపరేషన్ వాలెంటైన్’ని తెలుగు, హిందీ భాషల్లో చేశాం. హిందీలో డైలాగులు చెప్పేందుకు రెండు నెలలు క్లాసులు తీసుకున్నాను. హిందీలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను. ఇక ప్రస్తుతం ‘మట్కా’ సినిమా చేస్తున్నాను. ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రీకరణ అక్టోబర్‌లో పూర్తయింది. ఆ తర్వాత బ్రేక్ తీసుకుని నవంబరులో లావణ్యా త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాను. ఈ సినిమా కోసం హిందీ డైలాగులు నేర్చుకుంటున్నప్పుడు తను కూడా సాయం చేసింది. మా ఇద్దరికీ సరిపడే పాత్రలు ఉంటే కచ్చితంగా మళ్లీ జోడీగా నటిస్తాం (గతంలో ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాలు చేశారు).. అంతేకానీ, ఏదో మేమిద్దరం కలిసి చేసేయాలనే ఉద్దేశంతో మాత్రం చేయం. -
అందుకే వార్ సినిమాకి 'ఆపరేషన్ వాలెంటైన్’అని టైటిల్ పెట్టాం: వరుణ్
పుల్వామా ఘటన ఆధారంగా 'ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా తీశాం. 2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందారు. దానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత వైమానిక దళం ఆపరేషన్ నిర్వహించింది. ఫిబ్రవరి 14న ఈ సర్జికల్ స్ట్రయిక్స్ చోటు చేసుకుంది. వాలెంటైన్ డే రోజు జరిగింది కాబట్టి శత్రువులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గా ఈ ఎటాక్ ప్లాన్ చేయడం జరిగింది. అందుకే ఈ చిత్రానికి ‘ఆపరేషన్ వాలెంటైన్’ అని టైటిల్ పెట్టాం’ అని అన్నారు హీరో వరుణ్ తేజ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ 2020లో ఈ కథతో నన్ను సంప్రదించారు. నాకు కథ చాలా నచ్చింది. నేను సోనీ పిక్చర్స్ తో అంతకుముందు ఓ సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వలన టేకాఫ్ కాలేదు. ఈ కథ వారికి పంపించినపుడు వారికీ నచ్చింది. చాలా గ్రాండ్ బడ్జెట్ తో పక్కాగా ప్లాన్ సినిమాని చేశారు. దర్శకుడు హిందీ అబ్బాయి అయినప్పటికీ సినిమాని తెలుగులో చేయాలనే ఉద్దేశం ఆయనలో ఉంది. సోనీ పిక్చర్స్ వచ్చిన తర్వాత హిందీలో కూడా చేయాలని నిర్ణయించాం. ప్రతి సీన్ ని తెలుగు, హిందీ రెండు భాషల్లో షూట్ చేశాం. ► ఈ సినిమాలో వాలెంటైన్ అంటే ప్రతి ఒక్కరికీ దేశం మీద వున్న ప్రేమ. ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఈ సినిమా చూపించాం. పుల్వామా ఘటన పై ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో 'ఆపరేషన్ వాలెంటైన్' ది బెస్ట్ అని వారు ప్రసంశించారు. ప్రతి భారతీయుడు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. దర్శకుడు ఈ కథని చాలా ఫ్యాషన్‌తో చేశాడు. ఈ కథని చాలా పాషన్ తో చేశాడు. తనకి వీఎఫ్ఎక్స్ పై కూడా చాలా మంచి పట్టు ఉంది. నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ ని చాలా అద్భుతంగా రాబట్టుకునే నేర్పు తనలో ఉంది. ► ఈ సినిమాలోని నా పాత్ర కోసం చాలా రిసెర్చ్ చేశాను. అసలు ఫైటర్ ఫ్లైట్ ఎలా పని చేస్తుంది, ఎంత స్పీడ్ లో వెళుతుంది, ఎలా మలుపుతిరుగుతుంది ఇవన్నీ ముందే ఒక పైలెట్ ని అడిగి తెలుసుకున్నా. ఆయన చాలా ప్రోత్సహించారు. ఒక ఫ్లైట్ సిమ్యులేటర్ లో కూర్చోబెట్టి రియల్ లైఫ్ ప్రొజెక్షన్ అనుభూతిని ఇచ్చేలా చేశారు. అందులో కూర్చుంటే రియల్ గా ప్లయిట్ నడిపినట్లే ఉంటుంది. ఆ అనుభవం చాలా ఉపయోగపడింది. ఇలాంటి పాత్రలు చేయడం ఒక ఛాలెంజ్. ముఖం మొత్తం ఆక్సిజన్ మాస్క్ తో కప్పబడి ఉంటుంది. ఎమోషన్ ని కళ్ళతోనే పలికించాలి. ► హిందీ కోసం రెండు నెలలు క్లాసులు తీసుకున్నాను. డిక్షన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఎమోషనల్ డైలాగులు చెప్పడం బాగా ప్రాక్టీస్ చేశాను. ఒక సీన్ ని మొదట హిందీలో షూట్ చేసి తర్వాత తెలుగులో షూట్ చేసిన్నపుడు మధ్యమధ్యలో హిందీ డైలాగులు కూడా వచ్చేసేవి( నవ్వుతూ) చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ చేసేవాళ్ళం. ► మానుషి చిల్లర్ మిస్‌వరల్డ్ విన్నర్ గా దేశని పేరు తీసుకొచ్చారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. తన పాత్రపై చాలా ఫోకస్ గా ఉంటుంది. రాడర్ ఆఫీసర్ గా కనిపించడానికి చాలా హోం వర్క్ చేసింది. ► మిక్కీ జే మేయర్ బ్రిలియంట్ కంపోజర్. ఈ సినిమా కోసం దర్శకుడే మిక్కీ అయితే బావుంటుందని అనుకున్నారు. ఇందులో పాటలు ఎమోషనల్ గా ఉంటాయి. మనసుని హత్తుకుంటాయి. అలాగే నేపధ్య సంగీతం కూడా చాలా బలంగా ఉంటుంది. -
Varun Tej: మా గుండె ధైర్యం మా బాబాయ్
-
రానా, ప్రభాస్ లాగా హైట్ కాబట్టి ఈ సినిమా సెట్ అయ్యింది..!
-
వరుణ్‌పై ఇప్పటికీ కోపంగా ఉన్నా: చిరంజీవి
వరుణ్‌తేజ్-లావణ్య త్రిపాఠిలు ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు. గతేడాదే వారి ప్రేమను పెళ్లి బంధంతో నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. వీరి ప్రేమ కహాని నిహారికకు ఎప్పటినుంచో తెలుసు. కానీ వరుణ్ తనంతట తానుగా చెప్పేవరకు ఇంట్లో ఎవరికీ ఈ రహస్యం లీక్ చేయలేదు. పెదనాన్న చిరంజీవితో అన్ని విషయాలు పంచుకునే వరుణ్.. తన ప్రేమ విషయాన్ని మాత్రం చెప్పలేదట. తాజాగా ఆపరేషన్ వాలంటైన్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో వరుణ్‌పై చిన్నబుచ్చుకున్నాడు చిరు. ఆ ఒక్కటి మాత్రం.. 'ప్రతీది చెప్తాడు, కానీ ఈ ఒక్కటి చెప్పలేదు. చాలాసార్లు నన్ను ఇన్స్పిరేషన్ అని చెప్తుంటాడు. మరి లీక్స్ విషయంలో కూడా ఇన్స్పైర్ అయి నాకు చెప్పొచ్చుకదా! వాళ్ల నాన్నకు చెప్పుకోలేని విషయాలు కూడా నాతో చెప్పుకుంటాడు. ఈ ఒక్కటి మాత్రం చెప్పలేదు. ఈ విషయంలో నాకు ఇప్పటికీ కోపంగా ఉంది' అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఆ కారణం వల్లే చెప్పలేదు దీనికి వరుణ్ స్పందిస్తూ 'గౌరవంతో కూడిన భయం వల్లే చెప్పలేదు. కానీ ఇంట్లో రివీల్ చేసేముందు మా పెదనాన్నకే చెప్పాను' అని క్లారిటీ ఇచ్చాడు. కాగా వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. మానుషి చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. చదవండి: ఆ ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు -
టాలీవుడ్ డైరెక్టర్లపై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు
మెగా హీరో వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా విడుదలకు రెడీగా ఉంది. మానుషి చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్ద రినైసన్స్ పిక్చర్స్‌పై నిర్మించిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి టాలీవుడ్ డైరెక్టర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రాన్ని డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ కేవలం 75 రోజుల్లోనే చాలా రీజనబుల్ బడ్జెట్లో తీశాడు. విజువల్స్ చూస్తుంటే ఇంత తక్కువ బడ్జెట్లో అంత గొప్ప నాణ్యమైన సినిమా తీశారా అని ఆశ్చర్యం కలుగుతోంది. ట్రైలర్లో కనిపించిన విమానాల విన్యాసాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. డబ్బు ఖర్చు పెడితేనే సినిమాకు రిచ్‌నెస్ రాదు. తక్కువ బడ్జెట్లో కూడా ఇలా సినిమా తీసి ఎలా రిచ్‌గా చూపించాలో దర్శకులు ఆలోచించాలి. అప్పుడు నిర్మాతలు బాగుంటారు. ఇండస్ట్రీ బాగుంటుంది. అందుకే శక్తి ప్రతాప్ సింగ్‌ని మన యంగ్ డైరెక్టర్స్ స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను 'టాప్‌గన్' మూవీ చూసినప్పుడు ఇంత బాగా మనం చేయగలమా? అనిపించింది. ఆ విజువల్స్‌కి ఆశ్చర్యపోయాను. నేడు 'ఆపరేషన్ వాలెంటైన్' రూపంలో మనవాళ్లు కూడా చాలా సులభంగా తెరకెక్కించారంటే.. ప్రతిభ ఎవడి సొత్తు కాదు.. మనం ఆ స్థాయిలో ఉన్నామని ఈ మూవీ ద్వారా నిరూపించబడుతుంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది.' అని మెగాస్టార్ అన్నారు. -
ఆ బాధ్యత మనందరిపై ఉంది
‘‘మనందరిలో దేశభక్తి ఎంత ఉన్నా కానీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ లాంటి సినిమాలు చూసినప్పుడు ఆ దేశభక్తి ఉప్పొంగిపోతుంది. ముఖ్యంగా మన యువత ఇలాంటి సినిమాలు చూడాలి. ఈ మూవీని తీయడం యూనిట్ బాధ్యత. విజయం అందించి మన రియల్ హీరోలైన సైనికులకు నివాళి అర్పించాల్సిన, అంకితం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని హీరో చిరంజీవి అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. మానుషి చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్ద రినైసన్స్ పిక్చర్స్‌పై నిర్మించిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ–‘‘శక్తి ప్రతాప్ సింగ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ 75 రోజుల్లోనే చాలా రీజనబుల్ బడ్జెట్లో తీశాడు. కానీ, ట్రైలర్ చూస్తే ఎంతో రిచ్‌నెస్, ఎక్కువ బడ్జెట్ మూవీలా కనిపిస్తోంది. డబ్బు ఖర్చు పెడితేనే రిచ్‌నెస్ రాదు.. మన ఆలోచన ల నుంచి వస్తుంది. తక్కువ ఖర్చులో అలా రిచ్‌గా చూపిస్తే సినిమా బాగా వస్తుంది.. ఇటు నిర్మాతలూ బాగా ఉంటారు. సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. అందుకే శక్తి ప్రతాప్ సింగ్‌ని మన యంగ్ డైరెక్టర్స్ స్ఫూర్తిగా తీసుకోవాలి. వరుణ్ ప్రతి సినిమాలోనూ వైవిధ్యంగా కనిపిస్తాడు. నేను ‘టాప్‌గన్’ మూవీ చూసినప్పుడు ఇంత బాగా మనం చేయగలమా? అనిపించింది. ఆ విజువల్స్‌కి ఆశ్చర్యపోయాను. ఈరోజు ‘టాప్‌గన్’ లాంటి గొప్ప సినిమాని ‘ఆపరేషన్ వాలెంటైన్’ రూపంలో మనవాళ్లు సులభంగా చేశారంటే.. ప్రతిభ ఎవడి సొత్తు కాదు.. మనం ఆ స్థాయిలో ఉన్నామని ఈ మూవీ ద్వారా నిరూపించబడుతుంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మా వరుణ్‌గాడు మంచి సినిమా ఇచ్చాడని మీరు(మెగా అభిమానులు) గర్వపడేందుకు ప్రతి సినిమాకి కష్టపడుతుంటాను. ‘ఆపరేషన్ వాలెంటైన్’ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు శక్తి ప్రతాప్ సింగ్ హడా. ‘‘మా మూవీని సైనికులకు అంకితం ఇస్తున్నాం’’ అన్నారు నిర్మాత సిద్ధు ముద్ద. ఈ వేడుకలో సహ నిర్మాత నందకుమార్, కెమెరామేన్ హరి కె.వేదాంతం, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, నటులు నవదీప్, అభినవ్ గోమటం, శతాఫ్, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల, ఫైట్ మాస్టర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
వరుణ్ తేజ్- లావణ్య పూజలు.. కారణం ఇదేనా..?
వివాహం తర్వాత వెంటనే సినిమా పనుల్లో పడిపోయాడు మెగా హీరో మరుణ్ తేజ్. ఆయన సతీమణి లావణ్య కూడా పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌తో హాట్‌స్టార్‌లో రీసెంట్గా పలకరించింది లావణ్య. ఈ సిరీస్‌లో ఆమె పాత్ర కాస్త భిన్నంగా పర్వాలేదనిపించింది. మరోవైపు వరుణ్ తేజ్ కూడా పరేషన్ వాలెంటైన్ సినిమాతో మార్చి 1న రానున్నాడు. శక్తి ప్రతాప్ డైరెక్షన్లో రానున్న ఈ సినిమాలో ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ హీరోయిన్గా ఉంది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకు సంబంధించి వేగంగా ప్రమోషన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్గా వచ్చిన ట్రైలర్ ప్రేక్షలను మెప్పించింది. వరుణ్‌కు ఈ సినిమా కమ్‌బ్యాక్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మెగా హీరో తనదైన స్టైల్లో యాక్షన్ సీన్స్‌లలో మెప్పించాడు. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు గోదావరి తల్లిని దర్శించుకున్నారు. వారిద్దరూ కలిసి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని వరుణ్ తన ఇన్‌స్టా వేదికగా తెలిపాడు. ఫోటోలో పూజారులు, వరుణ్ మాత్రమే ఉన్నారు. లావణ్య లేదు. కానీ లావణ్య కూడా గోదావరిలోని పడవ ఫోటోను షేర్ చేసింది. దీంతో వారిద్దరూ కలిసే అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. వారిద్దరి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారడంతో వారిద్దరూ పూజలో ఎందుకు పాల్గొన్నారో అంటూ ఇన్‌స్టాలో పలు ప్రశ్నలు వచ్చాయి. ఇప్పటికే వరుస ప్లాపులతో ఉన్న వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ఆపరేషన్ వాలెంటైన్ మంచి విజయాన్ని అందుకోవాలని గోదావరి తల్లి ఆశీర్వాదం తీసుకున్నారా..? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా అని తెగ ఆలోచనల్లో పడిపోయారు మెగా ఫ్యాన్స్. నేడు (ఫిబ్రవరి 25) సాయింత్రం 6గంటలకు ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పద్మవిభూషన్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. జేఆర్సీ కన్వెన్షన్‌లో ఈ వేడుక జరగనుంది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
ఉత్తరాంధ్రపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్
టాలీవుడ్లో ఒకప్పుడు రాయలసీమ నేపథ్యంగా సాగే సినిమాలు ఎక్కువ వచ్చేవి. హీరోలు కూడా రాయలసీమ యాసలోనే మాట్లాడేవాళ్లు. ఆ తర్వాత తెలంగాణ నేపథ్య కథలు వెండితెరపై సందడి చేశాయి. కేవలం విలన్లకు, కమెడియన్లకు మాత్రమే వాడే తెలంగాణ యాసను.. హీరో పాత్రతో మాట్లాడించి హిట్ కొట్టారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో పాటు నాని, వరుణ్ తేజ్, రామ్ పోతినేని, నాగచైతన్య లాంటి యంగ్ స్టార్స్ సైతం తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ అంతా ఉత్తరాంధ్ర బాషపై మక్కువ చూపుతున్నారు. టాలీవుడ్లో ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం కథ ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగుతుంది. ఓ ఆటను ప్రధానంగా చేసుకొని బలమైన భావోద్వేగాలతో ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నాడట బుచ్చిబాబు. ఇందులో హీరోతో పాటు అన్ని మిగతా పాత్రధారులంతా ఉత్తరాంధ్ర యాసలోనే మాట్లాడతారట. ఉత్తరాంధ్ర యాసను అనర్గళంగా మాట్లాడే నటీనటులను వెతికే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర యాస కోసం రామ్ చరణ్ శిక్షణ తీసుకుంటున్నారట. ఈ మూవీలో ఆయన లుక్ చాలా రస్టిక్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జాలరి ప్రేమ కథ నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం తండేల్. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇది ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రం. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరు ఉత్తరాంధ్ర యాసలోనే మాట్లాడతారు.ఇటీవలే వచ్చిన గ్లింప్స్‌లో నాగచైతన్య ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంది. ‘మట్కా’ఆడనున్న వరుణ్ తేజ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పలాస ఫేం కరుణ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘మట్కా’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలోనే సాగనుంది. మట్కా అనేది ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఆడే ఒక జూదం.1958-1982 మధ్య దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా మట్కా స్టోరీ రాసుకున్నాడు కరుణ కుమార్. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా స్టోరీ సాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో వరుణ్ నాలుగు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. ఉత్తరాంధ్ర యాసలో అనుష్క మాటలు అనుష్క, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో ఓ లేడి ఓరియెంటెండ్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘వేదం’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో చిత్రమిది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు జరిగిన అన్యాయంపై ఓ యువతి ఎలాంటి పోరాటం చేసిందనే పాయింట్‌తో ఈ కథను రాసుకున్నాడట క్రిష్. ఇందులో అనుష్క ఉత్తరాంధ్రకు చెందిన యువతిగా కనిపించబోతున్నారట. ఇవి మాత్రమే కాదు.. తెలుగులో మరిన్ని చిత్రాలు ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి. - పోడూరి నాగ ఆంజనేయులు -
సినిమా చూసి సెల్యూట్ కొడతారు
‘‘మన సైనికుల త్యాగాలని గుర్తు చేసుకుంటూ వారి ధైర్య సాహసాలని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ‘ఆపరేషన్ వాలెంటైన్’. మనందరికీ దేశభక్తి ఉంటుంది.. కానీ, మా సినిమా చూశాక అది మరింత పెరుగుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. మానుషీ చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా హిందీ ట్రైలర్‌ను హీరో సల్మాన్ ఖాన్, తెలుగు ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మన దేశంలో సినిమా పెద్ద వినోద సాధనం. సరదాగా కాలక్షేపం చేయాలంటే అందరూ ముందు సినిమావైపు వెళ్తారు. అందుకే ప్రేక్షకులు ఖర్చు పెట్టే టిక్కెట్ డబ్బులకి న్యాయం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. చాలా కొత్తగా, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చుని గూస్ బంప్స్ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేసే చాలా సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నాయి. ఈ సినిమాని చాలా గర్వంగా, గుండెల నిండా దేశభక్తితో చూసి మన సైనికులకు సెల్యూట్ కొడతారు’’ అన్నారు. ‘‘యాక్షన్, ఫన్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలున్న చిత్రమిది’’ అన్నారు శక్తి ప్రతాప్. -
అలాంటి సీన్స్'ఆపరేషన్ వాలెంటైన్'లో ఉన్నాయి: వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన బిగ్గెస్ట్ ఏరియల్ వార్ డ్రామా ‘ఆపరేషన్ వాలెంటైన్ ’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించగా.. నవదీప్ కీలక పాత్ర పోపించాడు. మార్చి 1న తెలుగు,హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘మన దేశంలో సినిమా అనేది బిగ్గెస్ట్ ఎంటర్ టైన్మెంట్. సరదాగా కాలక్షేపం చేయాలంటే అందరు ముందు సినిమా వైపు వెళ్తారు. ప్రేక్షకులు కష్టపడి సంపాదించిన డబ్బుని టికెట్ రూపంలో మాకు ఇస్తారు. ప్రేక్షకులు ఖర్చుపెట్టే డబ్బులకి న్యాయం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి కష్టపడుతుంటాను. ప్రేక్షకులకు కొత్త కథ చూపించాలనే ప్యాషన్ నాకు, మా టీంకు ఉంది. అందుకే 'ఆపరేషన్ వాలెంటైన్'లాంటి సినిమాని తీయగాలిగాం. తెలుగులో మొట్టమొదటి ఏరియల్ ఫిల్మ్ అవ్వబోతుంది. చాలా కొత్తగా, ఎడ్జ్ అఫ్ ది సీట్ కూర్చుని గూస్ బంప్స్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేసే చాలా సీన్స్ ఇందులో ఉన్నాయి. మార్చి 1న ఈ సినిమాని చాలా గర్వంగా గుండెలు నిండా దేశభక్తితో చూసి మన జవాన్స్ కి సెల్యూట్ కొడతారు ప్రేక్షకులు. మన జవాన్స్ త్యాగాలని గుర్తు చేసుకుంటూ వారి ధైర్య సాహసాలని మీముందుకు తీసుకురావడాని చేస్తున్న ప్రయత్నం ఈ సినిమా. కచ్చితంగా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది. అందరికీ దేశభక్తి లోపల ఉంటుంది. ఈ సినిమా చూశాక అది మరింత పెరుగుతుందని నమ్మకంగా చెబుతున్నాం’ అన్నారు. (Operation Valentine Trailer: ఏం జరిగినా సరే.. చూసుకుందాం అంటూ సవాల్ విసిరిన వరుణ్‌తేజ్) హీరోయిన్ మానుషి చిల్లర్ మాట్లాడుతూ.. 'ఆపరేషన్ వాలెంటైన్' చాలా స్పెషల్ మూవీ. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. వరుణ్ తేజ్ వండర్ ఫుల్ కో స్టార్. చాలా సపోర్ట్ చేశారు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ అద్భుతంగా ఈ సినిమాని తీశారు. ఇది నాకు డ్రీం రోల్. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు. నవదీప్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేశాను. తెలుగులో మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ యాక్షన్ సినిమా చేసిన ఘనత వరుణ్ తేజ్ కి దక్కుతుంది. 'ఆపరేషన్ వాలెంటైన్' ట్రైలర్ లో విజువల్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. మార్చి 1న థియేటర్స్ లో కలుద్దాం’’ అన్నారు దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ కి, నిర్మాతలకు కృతజ్ఞతలు. వారి వలనే ఈ సినిమా సాధ్యపడింది. ఈ సినిమా సమిష్టి కృషి. టీం అందరం సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాం. యాక్షన్ డ్రామా ఫన్ ఎమోషన్ అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. మార్చి 1 సినిమాని ఎంజాయ్ చేయండి’ అని కోరారు. -
'రామ్ చరణ్‌కు ఫోన్ చేయి అన్నా'.. వరుణ్ తేజ్ రిప్లై ఇదే!
మెగా హీరో వరుణ్‌తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా మార్చి 1న విడుదల కానుంది. శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగులో రామ్ చరణ్ చేతుల మీదుగా ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ విడుదల చేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌తోనే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. దీంతో మెగా హీరో హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్ర దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సుమారు 40కి పైగా మన సైనికులు మరణించారు. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఆపరేషన్ ఆధారంగా సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది. అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న వరుణ్ తేజ్‌కు అభిమానుల నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అక్కడే ఉన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్ అడుగన్న ప్లీజ్.. అంటూ వరుణ్ తేజ్‌కు రిక్వెస్ట్ చేశారు. రామ్ చరణ్ అన్నకు ఫోన్ చేసి కనుక్కో అన్నా అని అడిగారు. దీనికి వరుణ్ స్పందిస్తూ.. నిజం చెప్పాలంటే నేను కూడా రోజు అదే అడుగుతున్నా.. ఈ రోజే షూటింగ్ స్టార్ట్ అయిందనుకుంటా.. అక్కడి నుంచి ఈరోజే ఉదయం ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది అంటూ ఫ్యాన్స్‌కు సమాధానమిచ్చారు. ఈ రోజును మీకు అన్ని అప్డేట్స్ వస్తాయని వరుణ్ తేజ్ అన్నారు. Mega Prince @IAmVarunTej about #GameChanger UPDATE.#RamCharan #VarunTej #OperationValentine #TeluguFilmNagar pic.twitter.com/12u478l8h6 — Telugu FilmNagar (@telugufilmnagar) February 20, 2024 -
ఏం జరిగినా సరే.. చూసుకుందాం అంటూ సవాల్ విసిరిన వరుణ్ తేజ్
వరుణ్‌తేజ్ హీరోగా ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా మార్చి 1న విడుదల కానుంది. శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ ముద్ద నిర్మాత. ఇందులో వరుణ్‌కి జోడీగా అందాల భామ, ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ మధ్యే ఫైటర్‌తో హృతిక్ రోషన్ హిట్ కొట్టాడు.. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే వరుణ్ హిట్ కొట్టడం ఖాయం అని చెప్పవచ్చు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్రవాదుల దాడి జరిగింది. ఆ సమయంలో సుమారు 40కి పైగా మన సైనికులు మరణించారు. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై ఎలాంటి ఎటాక్ చేసింది అనేదే వాలెంటైన్ చిత్రం. ఈ సినిమాతో వరుణ్ బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అందుకు ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఇందులో రుహానీ శర్మ కీలక పాత్రలో కనిపించింది.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా ఆమె అదరగొట్టేసిందని చెప్పవచ్చు. గాల్లో వారిద్దరూ చేసే విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్లో మాస్ ఆడియన్స్‌తో పాటు దేశభక్తిని రగిలించే డైలాగ్స్ ఉన్నాయి. సుమారు 3 నిమిషాల పాటు ఉన్న ట్రైలర్ ప్రేక్షకులను ఎక్కడా కూడా నిరాశ పరచదు. ట్రైలర్‌ను చూస్తే.. మార్చి 1న రిలీజ్ కానున్న ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. -
పెళ్లి తర్వాత ఆ ప్రశ్నలే ఎక్కువగా వస్తున్నాయి: వరుణ్ తేజ్
మెగా హీరో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తోన్న చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా మార్చిన 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు వరుణ్. అందులో భాగంగానే మల్లారెడ్డి ఇంజినీరింగ్ ఉమెన్స్ కాలేజీలో సందడి చేశారు. ఈవెంట్లో పాల్గొన్న యాంకర్ సుమ అడిగిన పలు ప్రశ్నలకు వరుణ్ ఆసక్తికర సమాధానాలిచ్చారు. అవేంటో తెలుసుకుందాం. పెళ్లి తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన మార్పులేంటని యాంకర్ సుమ ప్రశ్నించింది. దీనికి వరుణ్ తేజ్ బదులిస్తూ.. 'పెళ్లి తర్వాత ఫోన్‌కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని.. ఎక్కడికి వెళ్తున్నారంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయని.. కానీ అవన్నీ ప్రేమతోనేనని నవ్వుతూ సమాధానమిచ్చారు. అంతే కాకుండా ఈ ఏడాది వాలెంటైన్ డే రోజు లావణ్య ఎలాంటి బహుమతి ఇవ్వలేదన్నారు. ఆ తర్వాత పలువురు విద్యార్థినిలు వరుణ్‌తేజ్‌కు ప్రశ్నలు వేశారు. నా సినిమా స్క్రిప్టు ఎంపికలో పెద్దనాన్న చిరంజీవినే ఆదర్శంగా తీసుకుంటానని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆన్సరిచ్చారు. అంతే కాకుండా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అనంతరం ఆపరేషన్ వాలెంటైన్ గురించి మాట్లాడుతూ.. 'దేశాన్ని రక్షించే మన సైనికుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వాస్తవ పరిస్థితులను చూపించే అవకాశం అరుదుగా వస్తుంది. ఈ సినిమా కంటే ముందు పుల్వామా ఎటాక్ గురించి నాకు కొంత అవగాహన ఉంది. ముఖ్యంగా యువతకు ఇలాంటి చిత్రాలు చాలా అవసరం. ఇలాంటి సినిమాలో భాగమవడం నా అదృష్టం. సీరియస్ మాత్రమే కాదు.. ఈ చిత్రాన్ని కామెడీ కోణంలోనూ తెరకెక్కించాం. ఇలాంటి తరహాలో చాలా సినిమాలు వచ్చాయి కదా అని అడిగారు. ప్రేమకథా చిత్రాలు, కమర్షియల్ సినిమాలు ఎన్నైనా తీస్తున్నప్పుడు రియల్ హీరోపై ఎందుకు తీయకూడదని అడిగా. ఈ సినిమా నాకెన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. ఈ సినిమా పాటను వాఘా బోర్డర్లో విడుదల చేయడం ఆనందాన్నిచ్చింది. ప్రతి ఒక్కరు వాఘా బోర్డర్‌ను సందర్శించండి. ఎందుకంటే యువతకు దేశభక్తి చాలా ముఖ్యం. బీఎస్ఎఫ్ జవాన్లను కలుసుకోవడం నాకు మంచి అనుభూతినిచ్చింది' అని అన్నారు. -
రియల్ సూపర్ హీరోస్ కథ చూసి ప్రేక్షకులు గర్వపడతారు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ద్విభాషా(తెలుగు-హిందీ)చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్. మానుషీ చిల్లర్ హీరోయిన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మిస్తున ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘గగనాల తేలాను నీ ప్రేమలోన..’పాట లిరికల్ వీడియోను యూనిట్ రిలీజ్ చేసింది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరకల్పనలో రామ జోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడారు. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ..‘దేశాన్ని కాపాడే సైనికుడు 130 కోట్ల మందిని తన కుటుంబంలా భావించి, తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. అలాంటి సైనికుల కోసం, వాళ్లు చేసిన త్యాగాల కోసం, వాళ్ల కథని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే గొప్ప ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం.. థియేటర్స్ లో మన దేశానికి రియల్ సూపర్ హీరోస్ అయిన వారి కథని చూసి ప్రేక్షకులంతా చాలా గర్వంగా ఫీలౌతారు’ అన్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ‘'ఆపరేషన్ వాలెంటైన్' దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల అద్భుతంగా చూపించబోతుంది’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?.. వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్!
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా తెలుగు, హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా రానుంది. ఈ మూవీని మార్చి 1 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటం, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ‘ఆపరేషన్ వాలెంటైన్ రూపొందించారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా కనిపించనుండగా.. హీరోయిన్ మానుషీ చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆడియన్స్‌లో భారీ అంచనాలు పెంచేశాయి. జనవరి 26న రిపబ్లిక్ డేకు ముందు దేశభక్తి జ్వాలని రగిలించే ఫస్ట్ సింగిల్ ‘వందేమాతరం’ రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'గగనాల తేలేను నీ ప్రేమలోన' అనే పాటను అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థులతో చిత్ర బృందం ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సెషన్లో వరుణ్‌తేజ్ ఆసక్తిక ప్రశ్న ఎదురైంది. మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు? అంటూ విద్యార్థులు వరుణ్‌తేజ్‌ను అడిగారు. దీనికి సమాధానం ఇస్తూ..'నేను నా ఫేవరేట్ హీరోయిన్నే పెళ్లి చేసుకున్నా. ఏదైనా మంచి కథ వస్తే ఇద్దరం కలిసి చేస్తాం. మా ఇద్దరిలో మొదట ప్రపోజ్ చేసింది నేనే' అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా లావణ్య కాకుండా తనకు సాయిపల్లవి అంటే అభిమానం అని తెలిపారు. అనంతరం సినిమా గురించి మాట్లాడుతూ.. 'ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో తెలుగులో వస్తున్న మొదటి సినిమా ఇదే అనుకుంటా. దేశం కోసం ఏది చేసినా గొప్పగానే ఉంటుంది. ఈ సినిమా మీ అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాం. నేను చేయబోయే తర్వాతి మాస్ మూవీ మట్కా. గద్దల కొండ గణేష్ తరహాలో నా పాత్ర ఉండనుంది.' అని అన్నారు. Love takes flight and so do we!#OperationValentine second song out now❤️ - https://t.co/FeQNC1gjrd#Gaganaala #RabHainGawah#OPVonMarch1st@ShaktipsHada89 @ManushiChhillar @MickeyJMeyer @ArmaanMalik22 @singer_shaan @sonypicsfilmsin @RenaissancePicz @saregamaglobal pic.twitter.com/0OC575Ndot — Varun Tej Konidela (@IAmVarunTej) February 6, 2024 -
భర్త, మెగా ఫ్యామిలీపై మెగా కోడలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
మరో నెలలో ఆపరేషన్
దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటం, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా, హీరోయిన్ మానుషీ చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ఈ నెలలోనే విడుదల కావాల్సింది. అయితే మార్చి 1న రిలీజ్ చేయనున్నట్లు శనివారం యూనిట్ ప్రకటించింది. ‘‘ఈ చిత్రం టీజర్,పోస్టర్లు, రిపబ్లిక్ డేకి ముందు విడుదల చేసిన దేశభక్తి జ్వాలని రగిలించిన ఫస్ట్ సింగిల్ ‘వందేమాతరం...’ వంటివి సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలు చేరుకునేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
పెళ్లి అయిపోయిందిగా సినిమాలు మానేస్తారా? క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు
సాధారణంగా హీరోయిన్లు ఎవరైనా సరే పెళ్లి తర్వాత సినిమాలు చేయడం తగ్గించేస్తారు లేదంటే పూర్తిగా పక్కనబెట్టేస్తారు. ఇప్పుడు ఇలాంటి ప్రశ్ననే మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఎదురైంది. దీనికి ఆమె నుంచి ఆసక్తికర సమాధానం వచ్చింది. అలానే కొత్తగా ఏం సినిమాలు చేస్తున్నాననేది బయటపెట్టింది. భర్త వరుణ్ తేజ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మెగాకోడలిగా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ని ఆస్వాదిస్తోంది. నవంబరులో పెళ్లి జరగ్గా.. ఇప్పుడు ఫిబ్రవరిలో 'మిస్ ఫెర్ఫెక్ట్' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ క్రమంలోనే మీడియా ఆమెని పలకరించగా.. పెళ్లి, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో తలో సినిమా చేస్తున్నానని క్లారిటీ ఇచ్చేసింది. అలానే కోడలిగా మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టినా సరే సినిమాలు చేసే విషయంలో ఎలాంటి మార్పు లేదని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం వివాదం.. ఇప్పుడు సారీ చెప్పిన యంగ్ హీరోయిన్) లావణ్య ఏం చెప్పింది? 'పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఎలాంటి మార్పు రాలేదు. మెగా ఫ్యామిలీలోకి వచ్చావు కాబట్టి నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అని నాకు ఎవరు పరిమితులు పెట్టడం లేదు. కెరీర్ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. వరుణ్ తేజ్ రూపంలో బాగా అర్థం చేసుకునే భర్త దొరికాడు. ఇంతకు మించి ఏం కావాలి' 'మా వరకు మేం అయితే ఎప్పటిలానే ఉన్నాం. అలానే నా సినిమాల విషయంలో వరుణ్ పెద్దగా కల్పించుకోడు. నేను ఏదైనా స్టోరీ చెబితే మాత్రం వింటాడు. తను ఈ సిరీస్ చూసి బాగుందని మెచ్చుకున్నాడు' అని మెగా కోడలు లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
ఆ విషయంలో వరుణ్ ఇంట్లో ఎలా ఉంటాడంటే..!
-
అత్తారింట్లో కండీషన్స్ ?..మెగా కోడలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఏ హీరోయిన్ పెళ్లి చేసుకున్నా సరే.. చాలామందికి వచ్చే ఫస్ట్ డౌట్.. ఇకపై నటిస్తారా? లేదంటా ఇండస్ట్రీ టాటా చెప్పేస్తారా? అని చాలామంది అడుగుతారు. ఇప్పుడు ఇదే ప్రశ్న.. మెగా కోడలు లావణ్య త్రిపాఠికి కూడా ఎదురైంది. ప్రస్తుతం ఈమె 'మిస్ ఫెర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్ చేసింది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా లావణ్యకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే కెరీర్, అత్తారింట్లో కండీషన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మెగా కోడలు ట్యాగ్ అలాంటిది మెగా కోడలు ట్యాగ్ అనేది నటిగా తనకు బాధ్యత పెంచిందని.. లావణ్య త్రిపాఠి అనే పేరు తాను కష్టపడి సాధించుకున్నానని, మెగా కోడలు అనే పేరు మాత్రం వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిందని.. ఈ పిలుపు చాలా స్పెషల్‌గా భావిస్తున్నట్లు లావణ్య చెప్పుకొచ్చింది. అలానే ఓటీటీ, సినిమాలు అనే భేదం తనకు లేదని.. నచ్చిన కథల్లో నటిస్తూ కెరీర్ పరంగా ముందుకు సాగుతున్నానని లావణ్య క్లారిటీ ఇచ్చేసింది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్‌బాస్' శోభాశెట్టి) నేను ఫెర్ఫెక్ట్ కాదు వెబ్ సిరీస్ టైటిల్‌లానే మీరు కూడా ఫెర్ఫెక్టేనా అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన లావణ్య.. ఫెర్ఫెక్షన్ కూడా ఓ సమస్య అని, దీని వల్ల జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుందని చెప్పింది. తాను మాత్రం నిజజీవితంలో ఫెర్ఫెక్షనిస్ట్ కాదని స్పష్టం చేసింది. తన భర్త వరుణ్ తేజ్ మాత్రం ఫెర్ఫెక్షనిస్ట్ అని, అతడికి ఓసీడీ ఉందని ఎవరికీ తెలియని విషయాన్ని బయటపెట్టింది. కండీషన్స్ ఏం లేవు సినిమాలు-కెరీర్ విషయంలో పెళ్లి తర్వాత అత్తారింట్లో కండీషన్స్ ఏమైనా పెట్టారా? అనే ప్రశ్నకు కూడా లావణ్య సమాధానమిచ్చేసింది. పాత్రల ఎంచుకునే విషయమై వరుణ్ కుటుంబుం తనకు ఎలాంటి కండీషన్స్, ఆంక్షలు పెట్టలేదని.. ఇలాంటి పాత్రలు చేయొద్దు లాంటి మాటలు కూడా తనతో అనలేదని చెప్పింది. కెరీర్ విషయంలో అత్తారింట్లో తనకు ఫుల్ సపోర్ట్ ఉందని చెప్పింది. అలానే మంచి కథతో దొరికితే వరుణ్‌తో నటించడానికి తాను రెడీ అనే హింట్ ఇచ్చేసింది. (ఇదీ చదవండి: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?) -
హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్స్ కటౌట్
-
మెగా ప్రిన్స్ పాన్ ఇండియా డ్రీమ్స్
-
‘మట్కా’తో ప్రామిస్ చేసిన వరుణ్ తేజ్
‘మట్కా’లో వరుణ్ తేజ్ప్రామిస్ చేశారు. ఎవరికి? ఎందుకు? అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. కరుణ కుమార్ దర్శకత్వంలో డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. శుక్రవారం (జనవరి 19) వరుణ్ తేజ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘మట్కా’ నుంచి ఓపెనింగ్ బ్రాకెట్ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు మేకర్స్. ఇందులో వరుణ్ తేజ్ ప్రామిస్’ అంటూ టెలిఫోన్లో మాట్లాడటం కనిపిస్తుంటుంది. యావత్ దేశాన్ని కదిలించిన వాస్తవ ఘటన ఆధారంగా ‘మట్కా’ కథను రూపొందించారు. 24 ఏళ్ల టైమ్ పీరియడ్‌లో (1958–1982) సాగే ఈ కథలో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ‘‘ఓ గ్యాంబ్లింగ్ మాఫియా అధిపతి నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది (ఈ పాత్ర వరుణ్ తేజ్‌ది అని ఊహించ వచ్చు). ఈ చిత్రంలో ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నవీన్ చంద్ర, పోలీసాఫీసర్ పాత్రలో పి. రవిశంకర్ కనిపిస్తారు. కథ రీత్యా 1950, 1980 నాటి పరిస్థితులను రీ క్రియేట్ చేయడంలో దర్శకులు కరుణ కుమార్ విజయం సాధించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, ‘సత్యం’ రాజేశ్, రవిశంకర్, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
గ్యాంగ్‌స్టర్‌గా వరుణ్ తేజ్.. ‘మట్కా’ గ్లింప్స్ చూశారా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , ‘పలాస 1978’ఫేమ్ కరుణ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మట్కా’. . వైర ఎంటర్టైన్మెంట్స్పై నిర్మాత డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి SRT ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. నేడు(జనవరి 19) వరుణ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్‌తో పాటు ‘మట్కా’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కథానాయకుడు గ్రామోఫోన్‌లో మ్యూజిక్ ని ప్లే చేయడంతో టీజర్ ప్రారంభం అవుతుంది. ఇది రెండు వేర్వేరు టైమ్లైన్లలో పాత్రలని ప్రజెంట్ చేస్తోంది. నవీన్ చంద్ర గ్యాంగ్‌స్టర్‌గా కనిపించగా, పి రవిశంకర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. గ్యాంగ్‌స్టర్ పాత్రలో వరుణ్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీతో పాటు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. -
వరుణ్ తేజ్ బర్త్‌డే: చెల్లి అలా..వైఫ్ ఇలా.. మెగా పిక్స్ (ఫొటోలు)
-
Birthday Special: హీరో వరుణ్ తేజ్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
చావునే చెండాడు ధీరుడు...
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి హిందీ చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషీ చిల్లర్ హీరోయిన్గా నటించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్‌పై సందీప్ ముద్దా నిర్మించిన ఈ మూవీ తెలుగు, హిందీలో ఫిబ్రవరి 16న విడుదల కానుంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘వందేమాతరం..’ అంటూ సాగే తొలి పాటని అమృతసర్‌లోని వాఘా సరిహద్దులో విడుదల చేశారు. ‘చూడరా సంగ్రామ శూరుడు.. మండె రా మధ్యాహ్న సూర్యుడు.. చావునే చెడాడు ధీరుడు.. నిప్పులు కురిశాడు.. వందేమాతరం..’ అంటూ ఈ పాట సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని తెలుగులో అనురాగ్ కులకర్ణి, హిందీలో సుఖ్వీందర్ సింగ్ ఆలపించారు. ‘‘ఎయిర్ ఫోర్స్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ రూపొందింది. దేశ స్ఫూర్తిని చాటే దేశభక్తి గీతమైన ‘వందేమాతరం..’ని వాఘా సరిహద్దులో విడుదల చేశాం. ఇక్కడ రిలీజ్ చేసిన తొలి పాటగా ‘వందేమాతరం..’ చరిత్ర సృష్టించింది’’ అని మేకర్స్ తెలిపారు. ఈ పాట ఆవిష్కరణలో వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్‌తో సహా టీమ్ పాల్గొన్నారు. -
మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో తెలుసా!
గతేడాది హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. మెగా హీరో వరుణ్ తేజ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు. వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. టుస్కానీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని సందడి చేశారు. గతేడాది జూన్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అయితే కొత్త ఏడాదికి స్వాగతం పలికిన లావణ్య తన న్యూ ఇయర్ రిజల్యూషన్స్ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మెగా కోడలు అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలిపింది. అంతే కాకుండా 2024లో తన న్యూ రిజల్యూషన్స్ను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. కొత్త ఏడాదిలో మరింత మానవత్వంతో ఉండాలని.. తనపై తనకు మరింత ప్రేమ, అలాగే సోషల్ మీడియాకు తక్కువ టైమ్ కేటాయించాలని.. ఎక్కువ సమయం ప్రకృతితో మమేకం కావాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చింది. 2012లో అందాల రాక్షసి చిత్రం ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. అందాల రాక్షసి చిత్రానికి లావణ్య ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. అయితే సినిమాల్లో రాకముందు ఆమె హిందీ సీరియల్ ప్యార్ కా బంధన్ (2009)తో తొలిసారిగా నటించింది. వరుణ్ తేజ్- లావణ్య జంటగా మిస్టర్ (2017), అంతరిక్షం చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. -
VarunLav: 2023 ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందంటున్న మెగా హీరో (ఫోటోలు)
-
ఈ ఏడాది వివాహబంధంతో ఒక్కటైన సినీతారలు వీళ్లే!!
మరో వారం రోజుల్లో ఈ ఏడాదికి ఎండ్ కార్డ్ పడనుంది. 2023కి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. సినీ ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల వారికి ఎన్నో మధురానుభూతులను తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ ఏడాదిలో చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు వివాహాబంధంతో ఒక్కటయ్యారు. వారిలో ప్రధానంగా వరుణ్-లావణ్య, శర్వానంద్-రక్షితా రెడ్డి, మంచు మనోజ్- భూమా మౌనిక లాంటి స్టార్ జంటలు ఉన్నాయి. ఈ ఏడాదికి ఘనమైన ముగింపు పలుకుతూ.. పెళ్లిబంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారి పెళ్లి విశేషాలు తెలుసుకుందాం. వరుణ్- లావణ్య ఈ ఏడాది మెగా ఇంట పెళ్లి సందడి గ్రాండ్‌గా జరిగింది. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, నితిన్, అల్లు అర్జున్, సన్నిహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇటలీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత మాదాపూర్‌లో నవంబర్ 5న రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ ఫంక్షన్‌కు టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య హఠాత్తుగా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) శర్వానంద్-రక్షితా రెడ్డి టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది ఇంటివాడయ్యాడు. జూన్ 2న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శర్వానంద్, రక్షితా రెడ్డిల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. శర్వానంద్ పెళ్లి వేడుకకు రామ్ చరణ్‌తో పాటు పలువురు టాలీవుడ్ సినీ, రాజకీయ నాయకులు హాజరయ్యారు. వీరిద్దరి నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) మంచు మనోజ్- భూమా మౌనికల వివాహం ఈ ఏడాది మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికమెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. మంచు మనోజ్- భూమా మౌనికల పెళ్లి మార్చి 3న హైదరాబాద్‌లోని మంచు లక్ష్మిప్రసన్న ఇంట్లో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. భూమా మౌనిక 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు పెద్దఎత్తున అభిమానులు, సినీతారలు శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) మానస్ - శ్రీజ ఈ ఏడాది పెళ్లి చేసుకున్న మరో స్టార్ మానస్. ఈ బుల్లితెర నటుడు ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించిన మానస్ తర్వాత సీరియల్స్‌తో పాటు యాంకరింగ్‌లోనూ తన ప్రతిభ చాటుకున్నాడు. విజయవాడలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీతారలు, బంధుమిత్రులు హాజరయ్యారు. కాగా.. మానస్ బిగ్‌బాస్ ఐదో సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్న ఇతడు ఆ మధ్య మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. కేఎల్ రాహుల్‌ను పెళ్లాడిన అతియాశెట్టి ఈ ఏడాది పెళ్లి చేసుకున్న జంటల్లో బాలీవుడ్ భామ అతియా శెట్టి- కేఎల్ రాహుల్. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అతియా శెట్టి పలు బాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది. కేఎల్ రాహుల్‌తో మూడేళ్లపాటు డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. వీరిద్దరి పెళ్లి ముంబై సమీపంలోని ఖండాలాలో ఉన్న సునీల్‌శెట్టి ఫాంహౌస్‌లో జరిగింది. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. సెర్బియా నటితో హార్దిక్ పాండ్యా సెర్బియాకు చెందిన నటి, మోడల్ అయిన నటాషా స్టాంకోవిచ్‌ను టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా పెళ్లాడారు. అంతుకుముందే ఆమెతో నిశ్చితార్థం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన పాండ్యా ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఆ తర్వాత బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రేమికుల రోజున తన కుమారుడు అగస్త్య పాండ్యా సమక్షంలో నటాషా స్టాంకోవిచ్‌ను వివాహం చేసుకున్నారు. వీరిపెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. ఎంపీని పెళ్లాడిన హీరోయిన్ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పెళ్లాడింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఈ జంట ఈ ఏడాది వివాహాబంధంతో ఒక్కటైంది. చమ్కీలా అనే సినిమా షూటింగ్ పంజాబ్‌లో జరిగినప్పుడు వీరిద్దరు ప్రేమలో పడ్డారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో జరిగిన వీరిపెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. పెళ్లిబంధంతో ఒక్కటైన జంట బాలీవుడ్‌కు చెందిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా సైతం ఈ ఏడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. షేర్షా చిత్రం ద్వారా పరిచయమైన వీరిద్దరి స్నేహం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించారు. రాజస్థాన్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అలాగే ఈ ఏడాది మరికొందరు సినీ తారలు కూడా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వారిలో రణ్‌దీప్ హుడా, స్వరాభాస్కర్, మసాబా గుప్తా లాంటి వారు కూడా ఉన్నారు. -
Operation Valentine: గుర్తుచేయాల్సిన సమయం వచ్చింది
వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా నటించిన దేశభక్తి చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. రాడార్ ఆఫీసర్‌గా మానుషి చిల్లర్ నటించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, సందీప్ ముద్దా నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది. సోమవారం ‘ఫస్ట్ స్ట్రైక్’ పేరుతో ఈ సినిమా టీజర్‌ను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘శత్రువులకు ఓ విషయం గుర్తుచేయాల్సిన సమయం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ది కూడా..’, ‘ఏం జరిగినా సరే చూసుకుందాం’ (వరుణ్ తేజ్) వంటి డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ‘‘దేశ వైమానిక దళ హీరోల ధైర్యసాహసాలు, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్ల నేపథ్యంలో ఈ మూవీ కథనం ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.