దేశభక్తి నేపథ్యంలో మెగాహీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలంటైన్'. గతంలో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజైపోయింది. గురువారం సాయంత్రమే ప్రీమియర్లు పడగా పాజిటివ్ టాక్ వచ్చింది. అలానే ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ కూడా ఎవరనేది తెలిసిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
(ఇదీ చదవండి: ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా రివ్యూ)
మెగాహీరోల్లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుణ్ తేజ్ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. హిట్ ఫ్లాప్ సంగతి పక్కనబెడితే ఒక్కో చిత్రం భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అలా పుల్వామా దాడి, భారత్-పాక్ వైరం తదితర అంశాలతో తీసిన చిత్రమే 'ఆపరేషన్ వాలంటైన్'. దేశభక్తి సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా నచ్చేస్తుంది. మిగతా వాళ్లకు మాత్రం నచ్చడం నచ్చకపోవడం అనేది చెప్పలేం.
ఇకపోతే 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల డీల్ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. అంటే ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు సంబంధించి నెలలోపు స్ట్రీమింగ్ అవ్వొచ్చు. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఉండనుందని సమాచారం.
(ఇదీ చదవండి: యాంకర్‌ను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్)
Comments
Please login to add a commentAdd a comment