Operation Valentine Movie
-
Manushi Chhillar: మాజీ సీఎం మనవడితో వరుణ్ తేజ్ హీరోయిన్ డేటింగ్?
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది మానుషి చిల్లర్. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్ర పోషించి..తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో టాలీవుడ్లో ఈ మాజీ విశ్వసుందరి ఆఫర్లు లభించలేదు. దీంతో మళ్లీ తన మకాంను బాలీవుడ్‌కి మార్చింది. అక్కడ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇలా సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది మానుషి. ప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. అయితే ఇన్నాళ్లు ఆమె ఫోటోలు మాత్రమే వైరల్ అయ్యేవి. కానీ ఇప్పుడు మానుషి పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఓ గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మాజీ విశ్వసుందరీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ షిండే మనవడు, నటుడు వీర్ పహారియాతో మానుషి డేటింగ్ ఉందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దానికి ఓ కారణం ఉంది. ఇటీవల జాన్వీ కపూర్, ఆమె ప్రియుడు శిఖర్ పహారియా, స్నేహితులతో కలిసి టూర్‌కి వెళ్లింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో మానుషి, శిఖర్ సోదరుడు వీర్ పహారియా భుజంపై సేదతీరుతూ కనిపించింది. దీంతో మానుషి, వీర్లు ప్రేమలో ఉన్నారని, అందుకే కలిసి టూర్‌కి వెళ్లారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.అయితే దీనిపై అటు మానుషి కానీ, ఇటు వీర్ కానీ స్పందించలేదు.(చదవండి: ఈ వారం థియేటర్స్‌లో 11 సినిమాలు..కానీ ఒక్కటి కూడా!)ఇక మానుషీ విషయానికొస్తే.. హరియాణాకు చెందిన ఈ బ్యూటీ 2017లో విశ్వ సుందరిగా నిలిచింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమానే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. బాలీవుడ్ మూవీ సామ్రాట్ పృథ్వీరాజ్లో అక్షయ్‌కు జోడీగా నటించింది మానుషీ. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. రెండో మూవీ ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ కూడా ఫ్లాప్ అయింది. బాలీవుడ్ అచ్చిరాకపోవడంతో టాలీవుడ్ మూవీతోనైనా హిట్ కొడదామని ‘ఆపరేషన్ వాలెంటైన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కూడా ప్లాప్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతోన్న ‘టెహ్రాన్’లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Filmymantra Media (@filmymantramedia) -
డేంజర్ జోన్లో ప్రపంచం మెచ్చిన అందగత్తె!
-
ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లెలెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. పుల్వామా దాడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి, మిక్స్డ్ టాక్ని సంపాదించుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. మానుషి చిల్లర్ హీరోయిన్. నవదీప్, మిర్ సర్వర్, రుహానీ శర్మ కీలక పాత్రలు పోషించారు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ కథేంటంటే..? అర్జున్ రుద్ర దేవ్ అలియాస్ రుద్ర(వరుణ్ తేజ్) భారతీయ వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పని చేస్తుంటాడు. అక్కడే పని చేసే రాడార్ ఆఫీసర్ అహనా గిల్(మానుషి చిల్లర్)తో ప్రేమలో ఉంటాడు. అహనా చెప్పినా వినకుండా.. గగనవీధిలో అనేక ప్రయోగాలు చేస్తుంటాడు అర్జున్. అలా ఓ సారి ప్రాజెక్ట్ వజ్ర చేపట్టి.. తొలి ప్రయత్నంలోనే విఫలం అవుతాడు. ఈ ప్రయోగంలో తన ప్రాణ స్నేహితుడు వింగ్ కమాండర్ కబీర్(నవదీప్) ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రాజెక్ట్ వజ్రను బ్యాన్ చేస్తారు. గాయాలను నుంచి కోలుకున్న రుద్ర.. 2019లో ఆపరేషన్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఆపరేషన్ వాలైంటైన్ లక్ష్యమేంటి? ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? అర్జున్ రుద్ర తన టీమ్‌తో కలిసి పాకిస్తాన్ కళ్లు గప్పి ఆ దేశ బార్డర్ని క్రాస్ చేసి ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశాడు? ప్రాజెక్ట్ వజ్ర లక్ష్యమేంటి? చివరకు అది సక్సెస్ అయిందా లేదా? అనేదే మిగతా కథ they risked it all to honour the fallen, witness the operation come alive!#OperationValentineOnPrime, watch nowhttps://t.co/4AlFuYMpRi pic.twitter.com/aOoAv4lHQa — prime video IN (@PrimeVideoIN) March 22, 2024 . -
నెల రోజుల్లోపే ఓటీటీకి మెగా హీరో యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన బిగ్గెస్ట్ ఏరియల్ వార్ డ్రామా ఆపరేషన్ వాలెంటైన్ . శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించగా.. నవదీప్ కీలక పాత్ర పోపించాడు. మార్చి 1న తెలుగు,హిందీ భాషల్లో విడుదలై మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటం.. దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ‘ఆపరేషన్ వాలెంటైన్ రూపొందించారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా కనిపించారు. హీరోయిన్ మానుషీ చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు. పుల్వామా ఎటాక్ జరిగిన తర్వాత ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అతిపెద్ద వైమానిక దాడిని ఈ చిత్రంలో చూపించారు.ఈ సినిమా తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ థియేటర్లలో విడుదలైంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ హక్కులన అమెజాన్ ప్రైమ్ దక్కించకున్న సంగతి తెలిసిందే. ఈ ఫర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కానన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే తేదీ ఫిక్స్ అయితే ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలో చూసేయొచ్చు. కాగా.. ఈ చిత్రంలో నవదీప్, పరేష్ పహుజా, రుహానీ శర్మ, అలీ రెజా ప్రధాన పాత్రల్లో కనిపించారు. #OperationValentine OTT RELEASE MARCH 29 @PrimeVideoIN pic.twitter.com/2RQAdlDuEq — OTTGURU (@OTTGURU1) March 9, 2024 -
'ఆపరేషన్ వాలెంటైన్' ఓటీటీలో ఎంట్రీ అప్పుడేనా..?
వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్' మార్చి 1న విడుదలైన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. మానుషి చిల్లర్ ఇందులో కథానాయిక. ఈ మధ్య కాలంలో వరుణ్‌కు మంచి విజయాన్ని అందించిన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. పుల్వామా ఎటాక్ వంటి నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొంది ఈ దేశభక్తి చిత్రాన్ని మేకర్స్ రూపొందించారు. మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను దీంట్లో చక్కగా చూపించాడు దర్శకుడు. ఇందులో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా కనిపించగా.. మానుషి రాడార్ ఆఫీసర్‌గా మెప్పించింది. ఆపరేషన్ వాలంటైన్ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మంచి ధరకే దక్కించుకుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా రిలీజైన 30 రోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది. అంటే మార్చి 29 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఒక వేళ ఆ తేదీలో కుదరకపోతే ఏప్రిల్ మొదటి వారంలో గ్యారెంటీగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు సంబంధించి నెలలోపు స్ట్రీమింగ్ అవ్వొచ్చు. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఉండనుందని సమాచారం. -
'ఆపరేషన్ వాలంటైన్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. వచ్చేది అప్పుడేనా?
దేశభక్తి నేపథ్యంలో మెగాహీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలంటైన్'. గతంలో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజైపోయింది. గురువారం సాయంత్రమే ప్రీమియర్లు పడగా పాజిటివ్ టాక్ వచ్చింది. అలానే ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ కూడా ఎవరనేది తెలిసిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా రివ్యూ) మెగాహీరోల్లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుణ్ తేజ్ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. హిట్ ఫ్లాప్ సంగతి పక్కనబెడితే ఒక్కో చిత్రం భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అలా పుల్వామా దాడి, భారత్-పాక్ వైరం తదితర అంశాలతో తీసిన చిత్రమే 'ఆపరేషన్ వాలంటైన్'. దేశభక్తి సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా నచ్చేస్తుంది. మిగతా వాళ్లకు మాత్రం నచ్చడం నచ్చకపోవడం అనేది చెప్పలేం. ఇకపోతే 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల డీల్ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. అంటే ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు సంబంధించి నెలలోపు స్ట్రీమింగ్ అవ్వొచ్చు. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఉండనుందని సమాచారం. (ఇదీ చదవండి: యాంకర్‌ను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్) -
‘ఆపరేషన్ వాలెంటైన్’ రివ్యూ
టైటిల్: ఆపరేషన్ వాలెంటైన్ నటీనటులు: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవదీప్, మిర్ సర్వర్, రుహానీ శర్మ తదితరులు నిర్మాతలు: సోనీ పిక్చర్స్, సందీప్ ముద్ద దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా సంగీతం: మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫీ:హరి కె. వేదాంతం ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: మార్చి 1, 2024 కథేంటంటే.. అర్జున్ రుద్ర దేవ్ అలియాస్ రుద్ర(వరుణ్ తేజ్) భారతీయ వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పని చేస్తుంటాడు. అక్కడే పని చేసే రాడార్ ఆఫీసర్ అహనా గిల్(మానుషి చిల్లర్)తో ప్రేమలో ఉంటాడు. అహనా చెప్పినా వినకుండా.. గగనవీధిలో అనేక ప్రయోగాలు చేస్తుంటాడు అర్జున్. అలా ఓ సారి ప్రాజెక్ట్ వజ్ర చేపట్టి.. తొలి ప్రయత్నంలోనే విఫలం అవుతాడు. ఈ ప్రయోగంలో తన ప్రాణ స్నేహితుడు వింగ్ కమాండర్ కబీర్(నవదీప్) ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రాజెక్ట్ వజ్రను బ్యాన్ చేస్తారు. గాయాలను నుంచి కోలుకున్న రుద్ర.. 2019లో ఆపరేషన్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఆపరేషన్ వాలైంటైన్ లక్ష్యమేంటి? ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? అర్జున్ రుద్ర తన టీమ్‌తో కలిసి పాకిస్తాన్ కళ్లు గప్పి ఆ దేశ బార్డర్ని క్రాస్ చేసి ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశాడు? ప్రాజెక్ట్ వజ్ర లక్ష్యమేంటి? చివరకు అది సక్సెస్ అయిందా లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిని దేశం ఇప్పటికి మర్చిపోలేదు. ఈ దాడిలో 40 మందికిపైగా భారతీయ జవాన్లు వీర మరణం పొందారు. దీనికి ప్రతీకారంగా భారత్ బాల్కోట్ స్ట్రైక్ నిర్వహించి సక్సెస్ అయింది. ఈ ఘటనల ఆధారంగానే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెరకెక్కించాడు. ఇందులో దేశ రక్షణ కోసం వైమానిక దళం ఎలా పని చేస్తుంది అనేది కళ్లకు కట్టినట్లు చూపించారు. వాస్తవానికి వేరే దేశంతో యుద్ధం అనగానే అందరికి సైనిక దళమే గుర్తొస్తుంది. కానీ వారితో పాటు నావిక, వైమానిక దళం కూడా దేశ రక్షణ కోసం పని చేస్తుందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. నావిక, వైమానిక దళాలపై సినిమాలు కూడా పెద్దగా రాలేదు. కానీ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత మన వైమానిక దళం గొప్పదనం ప్రపంచానికి మొత్తం తెలిసింది. గనతలంలో వాళ్లు చేసే పోరాటల గురించి అంతా చర్చించుకున్నారు. బాలీవుడ్లో ఆ నేపథ్యంతో సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే ‘ఫైటర్’ అనే సినిమా కూడా ఇదే కాన్సెప్ట్‌తో వచ్చి..బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఆపరేషన్ వాలెంటైన్ కాన్సెప్ట్ కూడా అలాంటిదే. అయితే ఇలాంటి నేపథ్యంతో తెలుగులో వచ్చిన మొట్టమొదటి సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్ ’ అనే చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్(రూ.42 కోట్లు అని సమాచారం) ఇంత రిచ్‌గా సినిమాను తెరకెక్కించిన దర్శకుడుని అభినందించాల్సిందే. అయితే ఇలాంటి సినిమాల్లో ఎమోషన్స్ చాలా ముఖ్యం. ఆపరేషన్ వాలెంటైన్లో అది మిస్ అయింది. దేశం మొత్తాన్ని కుదిపేసిన పుల్వామా దాడిని మరింత ఎమోషనల్‌గా, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చూపిస్తే బాగుండేదేమో. అలా అని ఎమోషన్ పూర్తిగా పండలేదని చెప్పలేం. దాడిలో ఓ సైనికుడు తన ప్రాణాన్ని అడ్డు పెట్టి చిన్నారిని కాపాడిన సీన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆ తరహా ఎమోషనల్ సీన్స్ కొచ్చి చోట్ల ఉంటే సినిమా మరింత కనెక్ట్ అయ్యేది. దర్శకుడు వైమానిక దళ సైనికుల ఆపరేషన్స్, సాహసాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. చాలా సహజంగా వాటిని తెరపై చూపించాడు కానీ కథలోని డ్రామాని మాత్రం తెరపై సరిగా పండించలేకపోయాడు.ప్రాజెక్ట్ వజ్రతో కథను ప్రారంభించాడు. ఆ ఒక్క సీన్‌తోనే హీరో పాత్ర ఎలాంటిదో తెలియజేశాడు. ఫస్టాప్ అంతా పైలెట్ల టెస్ట్, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చుట్టునే తిరుగుతుంది. అయితే ప్రేమ కథలో గాఢత తగ్గినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. పాకిస్తాన్‌పై మన సైనికులు దాడి చేసే సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దాడు. పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ నెహ్రుని తిప్పికొట్టేందుకు హీరో చేసే సాహసం.. చివరల్లో ఆపరేషన్ వజ్రని ప్రయోగించడం ప్రతీది.. ఆకట్టుకుంటుంది. మన సైనికుల ధైర్యసాహసాలను గుర్తు చేసుకుంటూ థియేటర్స్‌ని నుంచి బయటకు వస్తారు. ఎవరెలా చేశారంటే.. అర్జున్ రుద్ర దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ ఒదిగిపోయాడు. తెరపై నిజమైన వింగ్ కమాండర్‌గానే కనిపించాడు. ఆయన బాడీ లాంగ్వెజ్, మాటలు ప్రతీది నిజమైన సైనికుడినే గుర్తు చేస్తుంది. సినిమా కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపించింది. ఇక రాడార్ ఆఫీసర్ అహనా గిల్‌గా మానుషిచిల్లర్ అద్భుతంగా నటించింది. సినిమాలో తన పాత్రను మంచి ప్రాధాన్యత ఉంటుంది. అయితే హీరోహీరోయిన్ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. కబీర్‌గా నవదీప్ ఒకటి రెండు సన్నివేశాల్లోనే కనిపించాడు. ఆయన పాత్రకు డైలాగ్స్ కూడా లేవు. మిర్ సర్వర్, రుహానీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతిక పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. మిక్కి జే మేయర్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. వందేమాతరం సాంగ్ ఆకట్టుకుంటుంది. హరి కె. వేదాంతం సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్ చాలా రిచ్‌గా చిత్రీకరించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఒక్క వరుణ్ మూవీకే పర్మిషన్ ఇచ్చిన రక్షణ శాఖ..!
-
'ఆపరేషన్ వాలెంటైన్' చూసి గర్వపడతారు: నిర్మాతలు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్‌పై ఈ చిత్రం రపొందింది. ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతలు సిద్దు ముద్దా, నందకుమార్ అబ్బినేని మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. అలా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మొదలైంది దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ చేసిన షార్ట్ ఫిల్మ్ నాకు(సిద్దు ముద్దా), వరుణ్ కి చాలా నచ్చింది. దాన్నే ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ గా చేయాలనే ప్రయత్నాల్లో దర్శకుడు ఉన్నప్పుడు, నేను, వరుణ్ కలసి కథ విన్నాం. కథ విన్న వెంటనే మాకు చాలా నచ్చింది. వెంటనే సినిమా చేయాలని అనుకున్నాం. సోనీ పిక్చర్స్ నిర్మాణ భాగస్వామిగా రావడంతో తెలుగు, హిందీలో చాలా గ్రాండ్ రూపొందించాం. శక్తి ప్రతాప్ కి చాలా క్లారిటీ ఉంది. తన విజన్ క్లియర్ గా ఉంటుంది, సినిమాకి ఏం కావాలో తనకి చాలా స్పష్టంగా తెలుసు. అలాగే తనకు వీఎఫ్ఎక్స్ పై చాలా మంచి కమాండ్ ఉంది. తను అదే నేపథ్యం నుంచి వచ్చారు. ఫైటర్ తర్వాత ఇలాంటి భారీ ఎయిర్ సీక్వెన్స్ తో ఇండియాలో వచ్చిన సినిమా ఇదే. సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రశంసించారు ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను ఎయిర్ ఫోర్స్ అధికారులకు చూపించాం. సినిమా మొత్తం చూసిన తర్వాత చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏం చెప్పారో అదే తీశారని ప్రశంసించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా వారు చాలా సపోర్ట్ చేశారు. రియల్ ఎయిర్ బేస్ లో షూట్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. సైనికులు త్యాగాలని, ధైర్య సాహసాలని స్మరించుకుంటూ వాళ్ళ కథని ప్రేక్షకులకు చూపించాలనే గొప్ప ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. 'ఆపరేషన్ వాలెంటైన్' చేస్తున్న క్రమంలో ఇలాంటి రియల్ హీరోస్ సినిమాలు మరిన్ని చేయాలనే స్ఫూర్తి కలిగింది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. మిక్కీ జే మేయర్ బీజీఎం అదరగొట్టేశాడు ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతం అందించాడు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా మ్యూజిక్ ఇచ్చారు. పాటలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఇప్పటికే పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ మూవీతో వరుణ్‌కి బాలీవుడ్లో మంచి గుర్తింపు వస్తుంది. నితిన్‌తో ఓ సినిమా? వరుణ్ తేజ్ తో ఇది మాకు రెండో సినిమా(గతంలో ‘గని’ అనే సినిమాను నిర్మించారు). ఇకపై బయట హీరోలతోనూ సినిమాలు చేస్తాం. నితిన్ తో ఓ సినిమా అనుకుంటున్నాం. ప్రస్తుతం మా దృష్టి 'ఆపరేషన్ వాలెంటైన్' విడుదలపై ఉంది. ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డాం. దీని తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని ఆగస్టు నుంచి కొత్త ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తాం. ఇప్పటివరకు స్పోర్ట్స్, ఏరియల్ యాక్షన్ జోనర్స్ లో లార్జర్ సినిమాలు చేశాం. ఇప్పుడు ఒక డిఫరెంట్ లవ్ స్టొరీ చేయాలనే ఆలోచన ఉంది. -
ప్రతి భారతీయుడు కనెక్ట్ అయ్యే సినిమా ఇది
‘‘ఆపరేషన్ వాలెంటైన్’ షూటింగ్లో ఒక ఫ్లైట్ సిమ్యులేటర్‌లో నన్ను కూర్చోబెట్టి రియల్ లైఫ్ప్రోజెక్షన్ అనుభూతిని ఇచ్చేలా చేశారు. అందులో కూర్చుంటే నిజంగా విమానం నడిపినట్లే ఉంటుంది. ముఖానికి ఆక్సిజన్ మాస్క్, తలకు హెల్మెట్ ఉండటంతో కళ్లతోనే భావోద్వేగాలు పలికించాలి. ఇలాంటి పాత్రలు చేయడం ఒక సవాల్‌గా అనిపించింది’’ అన్నారు వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్‌పై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చెప్పిన విశేషాలు. ► ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రకథని శక్తి ప్రతాప్ సింగ్ 2020లో చెప్పాడు.. వినగానే నచ్చింది. శక్తి హిందీ అబ్బాయి అయినప్పటికీ ఈ సినిమాని తెలుగులోనే చేయాలని అనుకున్నాడు. నేను సోనీ పిక్చర్స్ వారితో ఓ సినిమా చేయాల్సి ఉండటంతో ఈ చిత్రకథను వారికి పంపించాను. నేషనల్ అప్పీల్ కంటెంట్ ఉన్న ఈ కథ సోనీ పిక్చర్స్ వారికి కూడా బాగా నచ్చడంతో హిందీలో కూడా చేయాలని నిర్ణయించాం. ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ మూవీలోని ప్రతి సీన్‌ని తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరించాం. ► ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రంలో రుద్ర పాత్రలో కనిపిస్తాను. కొందరు రియల్ ఎయిర్ ఫైటర్స్ స్ఫూర్తితో నా పాత్రని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు శక్తి ప్రతాప్. నా పాత్రతో అందరూ చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా కోసం శక్తి చాలా పరిశోధన చేశాడు. తనకి వీఎఫ్ఎక్స్పై కూడా మంచి పట్టు ఉంది. ► 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందారు. దానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత వైమానిక దళం ఓ ఆపరేషన్ నిర్వహించి, శత్రువులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఫిబ్రవరి 14న ప్రపంచమంతా వాలెంటైన్స్ డే జరుపుకుంటుంది. అయితే ఫిబ్రవరి 14న ఈ ఘటన జరిగింది కాబట్టి మా సినిమాకి ‘ఆపరేషన్ వాలెంటైన్’ టైటిల్ పెట్టాం. ఈ సినిమాలో వాలెంటైన్ అంటే ప్రతి ఒక్కరికీ దేశం మీద ఉన్న ప్రేమ అని అర్థం. మా సినిమా చూసిన ఎయిర్‌ఫోర్స్ అధికారులు పుల్వామా ఘటనపై ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల్లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ ది బెస్ట్ అని ప్రశంసించారు. ప్రతి భారతీయుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ► ‘ఆపరేషన్ వాలెంటైన్’ని తెలుగు, హిందీ భాషల్లో చేశాం. హిందీలో డైలాగులు చెప్పేందుకు రెండు నెలలు క్లాసులు తీసుకున్నాను. హిందీలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను. ఇక ప్రస్తుతం ‘మట్కా’ సినిమా చేస్తున్నాను. ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రీకరణ అక్టోబర్‌లో పూర్తయింది. ఆ తర్వాత బ్రేక్ తీసుకుని నవంబరులో లావణ్యా త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాను. ఈ సినిమా కోసం హిందీ డైలాగులు నేర్చుకుంటున్నప్పుడు తను కూడా సాయం చేసింది. మా ఇద్దరికీ సరిపడే పాత్రలు ఉంటే కచ్చితంగా మళ్లీ జోడీగా నటిస్తాం (గతంలో ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాలు చేశారు).. అంతేకానీ, ఏదో మేమిద్దరం కలిసి చేసేయాలనే ఉద్దేశంతో మాత్రం చేయం. -
అందుకే వార్ సినిమాకి 'ఆపరేషన్ వాలెంటైన్’అని టైటిల్ పెట్టాం: వరుణ్
పుల్వామా ఘటన ఆధారంగా 'ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా తీశాం. 2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందారు. దానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత వైమానిక దళం ఆపరేషన్ నిర్వహించింది. ఫిబ్రవరి 14న ఈ సర్జికల్ స్ట్రయిక్స్ చోటు చేసుకుంది. వాలెంటైన్ డే రోజు జరిగింది కాబట్టి శత్రువులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గా ఈ ఎటాక్ ప్లాన్ చేయడం జరిగింది. అందుకే ఈ చిత్రానికి ‘ఆపరేషన్ వాలెంటైన్’ అని టైటిల్ పెట్టాం’ అని అన్నారు హీరో వరుణ్ తేజ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ 2020లో ఈ కథతో నన్ను సంప్రదించారు. నాకు కథ చాలా నచ్చింది. నేను సోనీ పిక్చర్స్ తో అంతకుముందు ఓ సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వలన టేకాఫ్ కాలేదు. ఈ కథ వారికి పంపించినపుడు వారికీ నచ్చింది. చాలా గ్రాండ్ బడ్జెట్ తో పక్కాగా ప్లాన్ సినిమాని చేశారు. దర్శకుడు హిందీ అబ్బాయి అయినప్పటికీ సినిమాని తెలుగులో చేయాలనే ఉద్దేశం ఆయనలో ఉంది. సోనీ పిక్చర్స్ వచ్చిన తర్వాత హిందీలో కూడా చేయాలని నిర్ణయించాం. ప్రతి సీన్ ని తెలుగు, హిందీ రెండు భాషల్లో షూట్ చేశాం. ► ఈ సినిమాలో వాలెంటైన్ అంటే ప్రతి ఒక్కరికీ దేశం మీద వున్న ప్రేమ. ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఈ సినిమా చూపించాం. పుల్వామా ఘటన పై ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో 'ఆపరేషన్ వాలెంటైన్' ది బెస్ట్ అని వారు ప్రసంశించారు. ప్రతి భారతీయుడు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. దర్శకుడు ఈ కథని చాలా ఫ్యాషన్‌తో చేశాడు. ఈ కథని చాలా పాషన్ తో చేశాడు. తనకి వీఎఫ్ఎక్స్ పై కూడా చాలా మంచి పట్టు ఉంది. నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ ని చాలా అద్భుతంగా రాబట్టుకునే నేర్పు తనలో ఉంది. ► ఈ సినిమాలోని నా పాత్ర కోసం చాలా రిసెర్చ్ చేశాను. అసలు ఫైటర్ ఫ్లైట్ ఎలా పని చేస్తుంది, ఎంత స్పీడ్ లో వెళుతుంది, ఎలా మలుపుతిరుగుతుంది ఇవన్నీ ముందే ఒక పైలెట్ ని అడిగి తెలుసుకున్నా. ఆయన చాలా ప్రోత్సహించారు. ఒక ఫ్లైట్ సిమ్యులేటర్ లో కూర్చోబెట్టి రియల్ లైఫ్ ప్రొజెక్షన్ అనుభూతిని ఇచ్చేలా చేశారు. అందులో కూర్చుంటే రియల్ గా ప్లయిట్ నడిపినట్లే ఉంటుంది. ఆ అనుభవం చాలా ఉపయోగపడింది. ఇలాంటి పాత్రలు చేయడం ఒక ఛాలెంజ్. ముఖం మొత్తం ఆక్సిజన్ మాస్క్ తో కప్పబడి ఉంటుంది. ఎమోషన్ ని కళ్ళతోనే పలికించాలి. ► హిందీ కోసం రెండు నెలలు క్లాసులు తీసుకున్నాను. డిక్షన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఎమోషనల్ డైలాగులు చెప్పడం బాగా ప్రాక్టీస్ చేశాను. ఒక సీన్ ని మొదట హిందీలో షూట్ చేసి తర్వాత తెలుగులో షూట్ చేసిన్నపుడు మధ్యమధ్యలో హిందీ డైలాగులు కూడా వచ్చేసేవి( నవ్వుతూ) చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ చేసేవాళ్ళం. ► మానుషి చిల్లర్ మిస్‌వరల్డ్ విన్నర్ గా దేశని పేరు తీసుకొచ్చారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. తన పాత్రపై చాలా ఫోకస్ గా ఉంటుంది. రాడర్ ఆఫీసర్ గా కనిపించడానికి చాలా హోం వర్క్ చేసింది. ► మిక్కీ జే మేయర్ బ్రిలియంట్ కంపోజర్. ఈ సినిమా కోసం దర్శకుడే మిక్కీ అయితే బావుంటుందని అనుకున్నారు. ఇందులో పాటలు ఎమోషనల్ గా ఉంటాయి. మనసుని హత్తుకుంటాయి. అలాగే నేపధ్య సంగీతం కూడా చాలా బలంగా ఉంటుంది. -
Varun Tej: మా గుండె ధైర్యం మా బాబాయ్
-
రానా, ప్రభాస్ లాగా హైట్ కాబట్టి ఈ సినిమా సెట్ అయ్యింది..!
-
వరుణ్‌పై ఇప్పటికీ కోపంగా ఉన్నా: చిరంజీవి
వరుణ్‌తేజ్-లావణ్య త్రిపాఠిలు ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు. గతేడాదే వారి ప్రేమను పెళ్లి బంధంతో నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. వీరి ప్రేమ కహాని నిహారికకు ఎప్పటినుంచో తెలుసు. కానీ వరుణ్ తనంతట తానుగా చెప్పేవరకు ఇంట్లో ఎవరికీ ఈ రహస్యం లీక్ చేయలేదు. పెదనాన్న చిరంజీవితో అన్ని విషయాలు పంచుకునే వరుణ్.. తన ప్రేమ విషయాన్ని మాత్రం చెప్పలేదట. తాజాగా ఆపరేషన్ వాలంటైన్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో వరుణ్‌పై చిన్నబుచ్చుకున్నాడు చిరు. ఆ ఒక్కటి మాత్రం.. 'ప్రతీది చెప్తాడు, కానీ ఈ ఒక్కటి చెప్పలేదు. చాలాసార్లు నన్ను ఇన్స్పిరేషన్ అని చెప్తుంటాడు. మరి లీక్స్ విషయంలో కూడా ఇన్స్పైర్ అయి నాకు చెప్పొచ్చుకదా! వాళ్ల నాన్నకు చెప్పుకోలేని విషయాలు కూడా నాతో చెప్పుకుంటాడు. ఈ ఒక్కటి మాత్రం చెప్పలేదు. ఈ విషయంలో నాకు ఇప్పటికీ కోపంగా ఉంది' అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఆ కారణం వల్లే చెప్పలేదు దీనికి వరుణ్ స్పందిస్తూ 'గౌరవంతో కూడిన భయం వల్లే చెప్పలేదు. కానీ ఇంట్లో రివీల్ చేసేముందు మా పెదనాన్నకే చెప్పాను' అని క్లారిటీ ఇచ్చాడు. కాగా వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. మానుషి చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. చదవండి: ఆ ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు -
టాలీవుడ్ డైరెక్టర్లపై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు
మెగా హీరో వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా విడుదలకు రెడీగా ఉంది. మానుషి చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్ద రినైసన్స్ పిక్చర్స్‌పై నిర్మించిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి టాలీవుడ్ డైరెక్టర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రాన్ని డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ కేవలం 75 రోజుల్లోనే చాలా రీజనబుల్ బడ్జెట్లో తీశాడు. విజువల్స్ చూస్తుంటే ఇంత తక్కువ బడ్జెట్లో అంత గొప్ప నాణ్యమైన సినిమా తీశారా అని ఆశ్చర్యం కలుగుతోంది. ట్రైలర్లో కనిపించిన విమానాల విన్యాసాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. డబ్బు ఖర్చు పెడితేనే సినిమాకు రిచ్‌నెస్ రాదు. తక్కువ బడ్జెట్లో కూడా ఇలా సినిమా తీసి ఎలా రిచ్‌గా చూపించాలో దర్శకులు ఆలోచించాలి. అప్పుడు నిర్మాతలు బాగుంటారు. ఇండస్ట్రీ బాగుంటుంది. అందుకే శక్తి ప్రతాప్ సింగ్‌ని మన యంగ్ డైరెక్టర్స్ స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను 'టాప్‌గన్' మూవీ చూసినప్పుడు ఇంత బాగా మనం చేయగలమా? అనిపించింది. ఆ విజువల్స్‌కి ఆశ్చర్యపోయాను. నేడు 'ఆపరేషన్ వాలెంటైన్' రూపంలో మనవాళ్లు కూడా చాలా సులభంగా తెరకెక్కించారంటే.. ప్రతిభ ఎవడి సొత్తు కాదు.. మనం ఆ స్థాయిలో ఉన్నామని ఈ మూవీ ద్వారా నిరూపించబడుతుంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది.' అని మెగాస్టార్ అన్నారు. -
ఆ బాధ్యత మనందరిపై ఉంది
‘‘మనందరిలో దేశభక్తి ఎంత ఉన్నా కానీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ లాంటి సినిమాలు చూసినప్పుడు ఆ దేశభక్తి ఉప్పొంగిపోతుంది. ముఖ్యంగా మన యువత ఇలాంటి సినిమాలు చూడాలి. ఈ మూవీని తీయడం యూనిట్ బాధ్యత. విజయం అందించి మన రియల్ హీరోలైన సైనికులకు నివాళి అర్పించాల్సిన, అంకితం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని హీరో చిరంజీవి అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. మానుషి చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్ద రినైసన్స్ పిక్చర్స్‌పై నిర్మించిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ–‘‘శక్తి ప్రతాప్ సింగ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ 75 రోజుల్లోనే చాలా రీజనబుల్ బడ్జెట్లో తీశాడు. కానీ, ట్రైలర్ చూస్తే ఎంతో రిచ్‌నెస్, ఎక్కువ బడ్జెట్ మూవీలా కనిపిస్తోంది. డబ్బు ఖర్చు పెడితేనే రిచ్‌నెస్ రాదు.. మన ఆలోచన ల నుంచి వస్తుంది. తక్కువ ఖర్చులో అలా రిచ్‌గా చూపిస్తే సినిమా బాగా వస్తుంది.. ఇటు నిర్మాతలూ బాగా ఉంటారు. సినిమా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. అందుకే శక్తి ప్రతాప్ సింగ్‌ని మన యంగ్ డైరెక్టర్స్ స్ఫూర్తిగా తీసుకోవాలి. వరుణ్ ప్రతి సినిమాలోనూ వైవిధ్యంగా కనిపిస్తాడు. నేను ‘టాప్‌గన్’ మూవీ చూసినప్పుడు ఇంత బాగా మనం చేయగలమా? అనిపించింది. ఆ విజువల్స్‌కి ఆశ్చర్యపోయాను. ఈరోజు ‘టాప్‌గన్’ లాంటి గొప్ప సినిమాని ‘ఆపరేషన్ వాలెంటైన్’ రూపంలో మనవాళ్లు సులభంగా చేశారంటే.. ప్రతిభ ఎవడి సొత్తు కాదు.. మనం ఆ స్థాయిలో ఉన్నామని ఈ మూవీ ద్వారా నిరూపించబడుతుంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మా వరుణ్‌గాడు మంచి సినిమా ఇచ్చాడని మీరు(మెగా అభిమానులు) గర్వపడేందుకు ప్రతి సినిమాకి కష్టపడుతుంటాను. ‘ఆపరేషన్ వాలెంటైన్’ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు శక్తి ప్రతాప్ సింగ్ హడా. ‘‘మా మూవీని సైనికులకు అంకితం ఇస్తున్నాం’’ అన్నారు నిర్మాత సిద్ధు ముద్ద. ఈ వేడుకలో సహ నిర్మాత నందకుమార్, కెమెరామేన్ హరి కె.వేదాంతం, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, నటులు నవదీప్, అభినవ్ గోమటం, శతాఫ్, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల, ఫైట్ మాస్టర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
వరుణ్ తేజ్- లావణ్య పూజలు.. కారణం ఇదేనా..?
వివాహం తర్వాత వెంటనే సినిమా పనుల్లో పడిపోయాడు మెగా హీరో మరుణ్ తేజ్. ఆయన సతీమణి లావణ్య కూడా పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌తో హాట్‌స్టార్‌లో రీసెంట్గా పలకరించింది లావణ్య. ఈ సిరీస్‌లో ఆమె పాత్ర కాస్త భిన్నంగా పర్వాలేదనిపించింది. మరోవైపు వరుణ్ తేజ్ కూడా పరేషన్ వాలెంటైన్ సినిమాతో మార్చి 1న రానున్నాడు. శక్తి ప్రతాప్ డైరెక్షన్లో రానున్న ఈ సినిమాలో ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ హీరోయిన్గా ఉంది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకు సంబంధించి వేగంగా ప్రమోషన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్గా వచ్చిన ట్రైలర్ ప్రేక్షలను మెప్పించింది. వరుణ్‌కు ఈ సినిమా కమ్‌బ్యాక్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మెగా హీరో తనదైన స్టైల్లో యాక్షన్ సీన్స్‌లలో మెప్పించాడు. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు గోదావరి తల్లిని దర్శించుకున్నారు. వారిద్దరూ కలిసి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని వరుణ్ తన ఇన్‌స్టా వేదికగా తెలిపాడు. ఫోటోలో పూజారులు, వరుణ్ మాత్రమే ఉన్నారు. లావణ్య లేదు. కానీ లావణ్య కూడా గోదావరిలోని పడవ ఫోటోను షేర్ చేసింది. దీంతో వారిద్దరూ కలిసే అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. వారిద్దరి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారడంతో వారిద్దరూ పూజలో ఎందుకు పాల్గొన్నారో అంటూ ఇన్‌స్టాలో పలు ప్రశ్నలు వచ్చాయి. ఇప్పటికే వరుస ప్లాపులతో ఉన్న వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ఆపరేషన్ వాలెంటైన్ మంచి విజయాన్ని అందుకోవాలని గోదావరి తల్లి ఆశీర్వాదం తీసుకున్నారా..? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా అని తెగ ఆలోచనల్లో పడిపోయారు మెగా ఫ్యాన్స్. నేడు (ఫిబ్రవరి 25) సాయింత్రం 6గంటలకు ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పద్మవిభూషన్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. జేఆర్సీ కన్వెన్షన్‌లో ఈ వేడుక జరగనుంది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
సినిమా చూసి సెల్యూట్ కొడతారు
‘‘మన సైనికుల త్యాగాలని గుర్తు చేసుకుంటూ వారి ధైర్య సాహసాలని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ‘ఆపరేషన్ వాలెంటైన్’. మనందరికీ దేశభక్తి ఉంటుంది.. కానీ, మా సినిమా చూశాక అది మరింత పెరుగుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. మానుషీ చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా హిందీ ట్రైలర్‌ను హీరో సల్మాన్ ఖాన్, తెలుగు ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మన దేశంలో సినిమా పెద్ద వినోద సాధనం. సరదాగా కాలక్షేపం చేయాలంటే అందరూ ముందు సినిమావైపు వెళ్తారు. అందుకే ప్రేక్షకులు ఖర్చు పెట్టే టిక్కెట్ డబ్బులకి న్యాయం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. చాలా కొత్తగా, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చుని గూస్ బంప్స్ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేసే చాలా సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నాయి. ఈ సినిమాని చాలా గర్వంగా, గుండెల నిండా దేశభక్తితో చూసి మన సైనికులకు సెల్యూట్ కొడతారు’’ అన్నారు. ‘‘యాక్షన్, ఫన్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలున్న చిత్రమిది’’ అన్నారు శక్తి ప్రతాప్. -
అలాంటి సీన్స్'ఆపరేషన్ వాలెంటైన్'లో ఉన్నాయి: వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన బిగ్గెస్ట్ ఏరియల్ వార్ డ్రామా ‘ఆపరేషన్ వాలెంటైన్ ’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించగా.. నవదీప్ కీలక పాత్ర పోపించాడు. మార్చి 1న తెలుగు,హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘మన దేశంలో సినిమా అనేది బిగ్గెస్ట్ ఎంటర్ టైన్మెంట్. సరదాగా కాలక్షేపం చేయాలంటే అందరు ముందు సినిమా వైపు వెళ్తారు. ప్రేక్షకులు కష్టపడి సంపాదించిన డబ్బుని టికెట్ రూపంలో మాకు ఇస్తారు. ప్రేక్షకులు ఖర్చుపెట్టే డబ్బులకి న్యాయం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి కష్టపడుతుంటాను. ప్రేక్షకులకు కొత్త కథ చూపించాలనే ప్యాషన్ నాకు, మా టీంకు ఉంది. అందుకే 'ఆపరేషన్ వాలెంటైన్'లాంటి సినిమాని తీయగాలిగాం. తెలుగులో మొట్టమొదటి ఏరియల్ ఫిల్మ్ అవ్వబోతుంది. చాలా కొత్తగా, ఎడ్జ్ అఫ్ ది సీట్ కూర్చుని గూస్ బంప్స్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేసే చాలా సీన్స్ ఇందులో ఉన్నాయి. మార్చి 1న ఈ సినిమాని చాలా గర్వంగా గుండెలు నిండా దేశభక్తితో చూసి మన జవాన్స్ కి సెల్యూట్ కొడతారు ప్రేక్షకులు. మన జవాన్స్ త్యాగాలని గుర్తు చేసుకుంటూ వారి ధైర్య సాహసాలని మీముందుకు తీసుకురావడాని చేస్తున్న ప్రయత్నం ఈ సినిమా. కచ్చితంగా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది. అందరికీ దేశభక్తి లోపల ఉంటుంది. ఈ సినిమా చూశాక అది మరింత పెరుగుతుందని నమ్మకంగా చెబుతున్నాం’ అన్నారు. (Operation Valentine Trailer: ఏం జరిగినా సరే.. చూసుకుందాం అంటూ సవాల్ విసిరిన వరుణ్‌తేజ్) హీరోయిన్ మానుషి చిల్లర్ మాట్లాడుతూ.. 'ఆపరేషన్ వాలెంటైన్' చాలా స్పెషల్ మూవీ. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. వరుణ్ తేజ్ వండర్ ఫుల్ కో స్టార్. చాలా సపోర్ట్ చేశారు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ అద్భుతంగా ఈ సినిమాని తీశారు. ఇది నాకు డ్రీం రోల్. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు. నవదీప్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేశాను. తెలుగులో మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ యాక్షన్ సినిమా చేసిన ఘనత వరుణ్ తేజ్ కి దక్కుతుంది. 'ఆపరేషన్ వాలెంటైన్' ట్రైలర్ లో విజువల్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. మార్చి 1న థియేటర్స్ లో కలుద్దాం’’ అన్నారు దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ కి, నిర్మాతలకు కృతజ్ఞతలు. వారి వలనే ఈ సినిమా సాధ్యపడింది. ఈ సినిమా సమిష్టి కృషి. టీం అందరం సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాం. యాక్షన్ డ్రామా ఫన్ ఎమోషన్ అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. మార్చి 1 సినిమాని ఎంజాయ్ చేయండి’ అని కోరారు. -
'రామ్ చరణ్‌కు ఫోన్ చేయి అన్నా'.. వరుణ్ తేజ్ రిప్లై ఇదే!
మెగా హీరో వరుణ్‌తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా మార్చి 1న విడుదల కానుంది. శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగులో రామ్ చరణ్ చేతుల మీదుగా ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ విడుదల చేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌తోనే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. దీంతో మెగా హీరో హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్ర దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సుమారు 40కి పైగా మన సైనికులు మరణించారు. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఆపరేషన్ ఆధారంగా సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది. అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న వరుణ్ తేజ్‌కు అభిమానుల నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అక్కడే ఉన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్ అడుగన్న ప్లీజ్.. అంటూ వరుణ్ తేజ్‌కు రిక్వెస్ట్ చేశారు. రామ్ చరణ్ అన్నకు ఫోన్ చేసి కనుక్కో అన్నా అని అడిగారు. దీనికి వరుణ్ స్పందిస్తూ.. నిజం చెప్పాలంటే నేను కూడా రోజు అదే అడుగుతున్నా.. ఈ రోజే షూటింగ్ స్టార్ట్ అయిందనుకుంటా.. అక్కడి నుంచి ఈరోజే ఉదయం ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది అంటూ ఫ్యాన్స్‌కు సమాధానమిచ్చారు. ఈ రోజును మీకు అన్ని అప్డేట్స్ వస్తాయని వరుణ్ తేజ్ అన్నారు. Mega Prince @IAmVarunTej about #GameChanger UPDATE.#RamCharan #VarunTej #OperationValentine #TeluguFilmNagar pic.twitter.com/12u478l8h6 — Telugu FilmNagar (@telugufilmnagar) February 20, 2024 -
ఏం జరిగినా సరే.. చూసుకుందాం అంటూ సవాల్ విసిరిన వరుణ్ తేజ్
వరుణ్‌తేజ్ హీరోగా ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా మార్చి 1న విడుదల కానుంది. శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ ముద్ద నిర్మాత. ఇందులో వరుణ్‌కి జోడీగా అందాల భామ, ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ మధ్యే ఫైటర్‌తో హృతిక్ రోషన్ హిట్ కొట్టాడు.. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే వరుణ్ హిట్ కొట్టడం ఖాయం అని చెప్పవచ్చు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్రవాదుల దాడి జరిగింది. ఆ సమయంలో సుమారు 40కి పైగా మన సైనికులు మరణించారు. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై ఎలాంటి ఎటాక్ చేసింది అనేదే వాలెంటైన్ చిత్రం. ఈ సినిమాతో వరుణ్ బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అందుకు ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఇందులో రుహానీ శర్మ కీలక పాత్రలో కనిపించింది.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా ఆమె అదరగొట్టేసిందని చెప్పవచ్చు. గాల్లో వారిద్దరూ చేసే విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్లో మాస్ ఆడియన్స్‌తో పాటు దేశభక్తిని రగిలించే డైలాగ్స్ ఉన్నాయి. సుమారు 3 నిమిషాల పాటు ఉన్న ట్రైలర్ ప్రేక్షకులను ఎక్కడా కూడా నిరాశ పరచదు. ట్రైలర్‌ను చూస్తే.. మార్చి 1న రిలీజ్ కానున్న ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. -
పెళ్లి తర్వాత ఆ ప్రశ్నలే ఎక్కువగా వస్తున్నాయి: వరుణ్ తేజ్
మెగా హీరో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తోన్న చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా మార్చిన 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు వరుణ్. అందులో భాగంగానే మల్లారెడ్డి ఇంజినీరింగ్ ఉమెన్స్ కాలేజీలో సందడి చేశారు. ఈవెంట్లో పాల్గొన్న యాంకర్ సుమ అడిగిన పలు ప్రశ్నలకు వరుణ్ ఆసక్తికర సమాధానాలిచ్చారు. అవేంటో తెలుసుకుందాం. పెళ్లి తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన మార్పులేంటని యాంకర్ సుమ ప్రశ్నించింది. దీనికి వరుణ్ తేజ్ బదులిస్తూ.. 'పెళ్లి తర్వాత ఫోన్‌కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని.. ఎక్కడికి వెళ్తున్నారంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయని.. కానీ అవన్నీ ప్రేమతోనేనని నవ్వుతూ సమాధానమిచ్చారు. అంతే కాకుండా ఈ ఏడాది వాలెంటైన్ డే రోజు లావణ్య ఎలాంటి బహుమతి ఇవ్వలేదన్నారు. ఆ తర్వాత పలువురు విద్యార్థినిలు వరుణ్‌తేజ్‌కు ప్రశ్నలు వేశారు. నా సినిమా స్క్రిప్టు ఎంపికలో పెద్దనాన్న చిరంజీవినే ఆదర్శంగా తీసుకుంటానని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆన్సరిచ్చారు. అంతే కాకుండా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అనంతరం ఆపరేషన్ వాలెంటైన్ గురించి మాట్లాడుతూ.. 'దేశాన్ని రక్షించే మన సైనికుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వాస్తవ పరిస్థితులను చూపించే అవకాశం అరుదుగా వస్తుంది. ఈ సినిమా కంటే ముందు పుల్వామా ఎటాక్ గురించి నాకు కొంత అవగాహన ఉంది. ముఖ్యంగా యువతకు ఇలాంటి చిత్రాలు చాలా అవసరం. ఇలాంటి సినిమాలో భాగమవడం నా అదృష్టం. సీరియస్ మాత్రమే కాదు.. ఈ చిత్రాన్ని కామెడీ కోణంలోనూ తెరకెక్కించాం. ఇలాంటి తరహాలో చాలా సినిమాలు వచ్చాయి కదా అని అడిగారు. ప్రేమకథా చిత్రాలు, కమర్షియల్ సినిమాలు ఎన్నైనా తీస్తున్నప్పుడు రియల్ హీరోపై ఎందుకు తీయకూడదని అడిగా. ఈ సినిమా నాకెన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. ఈ సినిమా పాటను వాఘా బోర్డర్లో విడుదల చేయడం ఆనందాన్నిచ్చింది. ప్రతి ఒక్కరు వాఘా బోర్డర్‌ను సందర్శించండి. ఎందుకంటే యువతకు దేశభక్తి చాలా ముఖ్యం. బీఎస్ఎఫ్ జవాన్లను కలుసుకోవడం నాకు మంచి అనుభూతినిచ్చింది' అని అన్నారు. -
రియల్ సూపర్ హీరోస్ కథ చూసి ప్రేక్షకులు గర్వపడతారు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ద్విభాషా(తెలుగు-హిందీ)చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్. మానుషీ చిల్లర్ హీరోయిన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మిస్తున ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘గగనాల తేలాను నీ ప్రేమలోన..’పాట లిరికల్ వీడియోను యూనిట్ రిలీజ్ చేసింది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరకల్పనలో రామ జోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడారు. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ..‘దేశాన్ని కాపాడే సైనికుడు 130 కోట్ల మందిని తన కుటుంబంలా భావించి, తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. అలాంటి సైనికుల కోసం, వాళ్లు చేసిన త్యాగాల కోసం, వాళ్ల కథని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే గొప్ప ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం.. థియేటర్స్ లో మన దేశానికి రియల్ సూపర్ హీరోస్ అయిన వారి కథని చూసి ప్రేక్షకులంతా చాలా గర్వంగా ఫీలౌతారు’ అన్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ‘'ఆపరేషన్ వాలెంటైన్' దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల అద్భుతంగా చూపించబోతుంది’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.