అందుకే వార్‌ సినిమాకి 'ఆపరేషన్ వాలెంటైన్’అని టైటిల్‌ పెట్టాం: వరుణ్‌ | Varun Tej Talk About Operation Valentine Movie | Sakshi
Sakshi News home page

అందుకే వార్‌ సినిమాకి 'ఆపరేషన్ వాలెంటైన్’అని టైటిల్‌ పెట్టాం: వరుణ్‌

Published Tue, Feb 27 2024 5:46 PM | Last Updated on Tue, Feb 27 2024 6:04 PM

Varun Tej Talk About Operation Valentine Movie - Sakshi

పుల్వామా ఘటన ఆధారంగా 'ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా తీశాం. 2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు వీర మరణం పొందారు. దానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత వైమానిక దళం ఆపరేషన్ నిర్వహించింది. ఫిబ్రవరి 14న ఈ సర్జికల్ స్ట్రయిక్స్ చోటు చేసుకుంది. వాలెంటైన్ డే రోజు జరిగింది కాబట్టి శత్రువులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గా ఈ ఎటాక్ ప్లాన్ చేయడం జరిగింది. అందుకే ఈ చిత్రానికి ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ అని టైటిల్‌ పెట్టాం’ అని అన్నారు హీరో వరుణ్‌ తేజ్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ 2020లో ఈ కథతో నన్ను సంప్రదించారు. నాకు కథ చాలా నచ్చింది. నేను సోనీ పిక్చర్స్ తో అంతకుముందు ఓ సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వలన టేకాఫ్ కాలేదు. ఈ కథ వారికి పంపించినపుడు వారికీ నచ్చింది. చాలా గ్రాండ్ బడ్జెట్ తో పక్కాగా ప్లాన్ సినిమాని చేశారు. దర్శకుడు హిందీ అబ్బాయి అయినప్పటికీ సినిమాని తెలుగులో చేయాలనే ఉద్దేశం ఆయనలో ఉంది. సోనీ పిక్చర్స్ వచ్చిన తర్వాత హిందీలో కూడా చేయాలని నిర్ణయించాం. ప్రతి సీన్ ని తెలుగు, హిందీ రెండు భాషల్లో షూట్ చేశాం.

► ఈ సినిమాలో వాలెంటైన్ అంటే ప్రతి ఒక్కరికీ దేశం మీద వున్న ప్రేమ. ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఈ సినిమా చూపించాం. పుల్వామా ఘటన పై ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో 'ఆపరేషన్ వాలెంటైన్' ది బెస్ట్ అని వారు ప్రసంశించారు. ప్రతి భారతీయుడు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. దర్శకుడు ఈ కథని చాలా ఫ్యాషన్‌తో చేశాడు. ఈ కథని చాలా పాషన్ తో చేశాడు. తనకి వీఎఫ్ఎక్స్ పై కూడా చాలా మంచి పట్టు ఉంది. నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ ని చాలా అద్భుతంగా రాబట్టుకునే నేర్పు తనలో ఉంది.  

► ఈ సినిమాలోని నా పాత్ర కోసం చాలా రిసెర్చ్‌ చేశాను.  అసలు ఫైటర్ ఫ్లైట్ ఎలా పని చేస్తుంది, ఎంత స్పీడ్ లో వెళుతుంది, ఎలా మలుపుతిరుగుతుంది ఇవన్నీ ముందే ఒక పైలెట్ ని అడిగి తెలుసుకున్నా. ఆయన చాలా ప్రోత్సహించారు. ఒక ఫ్లైట్ సిమ్యులేటర్ లో కూర్చోబెట్టి రియల్ లైఫ్ ప్రొజెక్షన్ అనుభూతిని ఇచ్చేలా చేశారు. అందులో కూర్చుంటే రియల్ గా ప్లయిట్ నడిపినట్లే ఉంటుంది. ఆ అనుభవం చాలా ఉపయోగపడింది. ఇలాంటి పాత్రలు చేయడం ఒక ఛాలెంజ్. ముఖం మొత్తం ఆక్సిజన్ మాస్క్ తో కప్పబడి ఉంటుంది. ఎమోషన్ ని కళ్ళతోనే పలికించాలి.

► హిందీ కోసం రెండు నెలలు క్లాసులు తీసుకున్నాను. డిక్షన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఎమోషనల్ డైలాగులు చెప్పడం బాగా ప్రాక్టీస్ చేశాను. ఒక సీన్ ని మొదట హిందీలో షూట్ చేసి తర్వాత తెలుగులో షూట్ చేసిన్నపుడు మధ్యమధ్యలో హిందీ డైలాగులు కూడా వచ్చేసేవి( నవ్వుతూ) చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ చేసేవాళ్ళం.

► మానుషి చిల్లర్ మిస్‌వరల్డ్ విన్నర్ గా దేశని పేరు తీసుకొచ్చారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. తన పాత్రపై చాలా ఫోకస్ గా ఉంటుంది. రాడర్ ఆఫీసర్ గా కనిపించడానికి చాలా హోం వర్క్ చేసింది.

► మిక్కీ జే మేయర్ బ్రిలియంట్ కంపోజర్. ఈ సినిమా కోసం దర్శకుడే మిక్కీ అయితే బావుంటుందని అనుకున్నారు. ఇందులో పాటలు ఎమోషనల్ గా ఉంటాయి. మనసుని హత్తుకుంటాయి. అలాగే నేపధ్య సంగీతం కూడా చాలా బలంగా ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement