వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్' మార్చి 1న విడుదలైన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. మానుషి చిల్లర్ ఇందులో కథానాయిక. ఈ మధ్య కాలంలో వరుణ్‌కు మంచి విజయాన్ని అందించిన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది.
పుల్వామా ఎటాక్ వంటి నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొంది ఈ దేశభక్తి చిత్రాన్ని మేకర్స్ రూపొందించారు. మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను దీంట్లో చక్కగా చూపించాడు దర్శకుడు. ఇందులో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా కనిపించగా.. మానుషి రాడార్ ఆఫీసర్‌గా మెప్పించింది.
ఆపరేషన్ వాలంటైన్ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మంచి ధరకే దక్కించుకుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా రిలీజైన 30 రోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది. అంటే మార్చి 29 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఒక వేళ ఆ తేదీలో కుదరకపోతే ఏప్రిల్ మొదటి వారంలో గ్యారెంటీగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు సంబంధించి నెలలోపు స్ట్రీమింగ్ అవ్వొచ్చు. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఉండనుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment