మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన బిగ్గెస్ట్ ఏరియల్ వార్ డ్రామా ఆపరేషన్ వాలెంటైన్ . శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించగా.. నవదీప్ కీలక పాత్ర పోపించాడు. మార్చి 1న తెలుగు,హిందీ భాషల్లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటం.. దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ‘ఆపరేషన్ వాలెంటైన్ రూపొందించారు.
ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా కనిపించారు. హీరోయిన్ మానుషీ చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు. పుల్వామా ఎటాక్ జరిగిన తర్వాత ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అతిపెద్ద వైమానిక దాడిని ఈ చిత్రంలో చూపించారు.ఈ సినిమా తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ థియేటర్లలో విడుదలైంది.
అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ హక్కులన అమెజాన్ ప్రైమ్ దక్కించకున్న సంగతి తెలిసిందే. ఈ ఫర్‌ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కానన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే తేదీ ఫిక్స్ అయితే ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలో చూసేయొచ్చు. కాగా.. ఈ చిత్రంలో నవదీప్, పరేష్ పహుజా, రుహానీ శర్మ, అలీ రెజా ప్రధాన పాత్రల్లో కనిపించారు.
#OperationValentine OTT RELEASE MARCH 29 @PrimeVideoIN pic.twitter.com/2RQAdlDuEq
— OTTGURU (@OTTGURU1) March 9, 2024
Comments
Please login to add a commentAdd a comment