
శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రం అర్జున ఫల్గుణ. ఈ మూవీ 2021 డిసెంబర్ 31న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఈనెల 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో విడుదలైన దాదాపు మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి తీసుకొచ్చారు మేకర్స్. కాగా.. ఈ చిత్రంలో నరేశ్, సుబ్బరాజు, మహేశ్, శివాజీ రాజా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నిరంజన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ సంగీతం అందించాడు.
A heist, a twist, and a whole lot of laughs! 🎭💰
Don't miss #ArjunaPhalguna, now streaming on @PrimeVideoIN! 🤩#ArjunaPhalgunaOnPrime ▶️ https://t.co/zqJeq98baa@sreevishnuoffl @Actor_Amritha @DirTejaMarni @MatineeEnt #TeluguFilmNagar pic.twitter.com/wUFnuSfpD1— Telugu FilmNagar (@telugufilmnagar) February 24, 2025
అర్జున ఫల్గుణ అసలు కథేంటంటే..?
డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటున్న ఐదుగురు స్నేహితులు అర్జున్(శ్రీవిష్ణు), రాంబాబు(రాజ్ కుమార్), తాడి(‘రంగస్థలం’మహేశ్), ఆస్కార్(చైతన్య గరికిపాటి), శ్రావణి(అమృత అయ్యర్)ల చూట్టూ ‘అర్జున ఫల్గుణ’కథ సాగుతుంది. వీరంతా చిన్నప్పటి నుంచి బెస్ట్‌ఫ్రెండ్స్. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే వ్యక్తిత్వం వాళ్లది. వీరంతా ఊర్లోనే సోడా సెంటర్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటారు. దాని కోసం బ్యాంకు లోన్‌కు ట్రై చేస్తారు. రూ. 50 వేలు ఇస్తే లోన్ వస్తుందని చెప్పడంతో.. డబ్బుకోసం వీళ్లు ప్రయత్నాలు చేస్తారు. ఈక్రమంలో ఈ ఐదుగురు గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడతారు. అక్కడి నుంచి వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? సరదాగా ఊర్లో తిరిగే వీళ్లు గంజాయి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ కేసు నుంచి ఈ ఐదుగురు ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ.