
బాలీవుడ్ హిట్ సినిమా 'ఛావా' ఓటీటీ ప్రకటన సడెన్‌గా వచ్చేసింది. విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’(Chhaava Movie) ఫిబ్రవరి 14న హిందీలో రిలీజై భారీ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, సినిమాకు మంచి ఆదరణ రావడంతో మూడు వారాల తర్వాత నిన్న (మార్చి 7) ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో విడుదల చేసింది. సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదలపై మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఛావా' చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) 'ఏప్రిల్ 11'న విడుదల కానుందని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే, హిందీ, తెలుగు రెండు భాషలలో విడుదల చేస్తారా లేదా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తారా..? అనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ, రెండు భాషలలో ఒకేసారి స్ట్రీమింగ్ కావచ్చని సమాచారం. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.750 కోట్లు రాబట్టి అనేక రికార్డ్స్‌ను క్రియేట్ చేసిన ఛావా కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచింది.

ఛావా కథేంటంటే..
ఛత్రపతి శివాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ రాజ్యాన్ని సులభంగా ఆక్రమించుకోవచ్చని భావిస్తాడు మొగల్ చక్రవర్తి ఔరంగాజేబు(అక్షయ్ ఖన్నా). అతని ఆశకు అడ్డుకట్ట వేస్తూ బరిలోకి దిగుతాడు శివాజీ పుత్రుడు శంభాజీ మహారాజ్ (విక్కీ కౌశల్). మొగల్ చక్రవర్తుల కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగాజేబు వరకు చేరుతుంది. దీంతో శంభాజీని అంతం చేసేందుకు తానే రంగంలోకి దిగుతాడు. పెద్ద ఎత్తున సైన్యంతో దక్కన్ ప్రాంతానికి బయలుదేరుతాడు. కేవలం పాతిక వేల మంది సైన్యం మాత్రమే ఉన్న శంభాజీ..ఔరంగాజేబును ఎలా ఎదుర్కొన్నాడు? యుద్ధంలో అతనికి తోడుగా నిలిచిందెవరు? వెన్నుపటు పొడిచిందెవరు? స్వరాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ.
Aale Raje aale 👑 Witness a tale of courage and glory etched in time 🔥⚔️
Watch Chhaava, out 11 April on Netflix. #ChhaavaOnNetflix pic.twitter.com/6BJIomdfzd— Netflix India (@NetflixIndia) April 10, 2025