
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన హిస్టారికల్ చిత్రం ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ జీవితంగా ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. నెల రోజులైనా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లకు వసూళ్లు సాధించింది.
అయితే గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టి పీడిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సూపర్ హిట్ సినిమా ఛావాను కూడా పైరసీ చేశారు కేటుగాళ్లు. దీంతో ఛావా మేకర్స్ పోలీసులను ఆశ్రయించారు. ఆగస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ శ్రీ రజత్ రాహుల్ హక్సర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పటికే పలు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఛావాను ప్రదర్శించారని ఫిర్యాదులో పేర్కొన్నారు మేకర్స్. నిర్మాణ సంస్థ మడ్‌హాక్ ఫిల్మ్స్ ఏర్పాటు చేసిన యాంటీ పైరసీ ఏజెన్సీ పైరసికీ సంబంధించిన ఇంటర్నెట్ లింకులను పోలీసులకు సమర్పించింది. దీనిపై ముంబయిలోని సౌత్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment