Chhaava Movie
-
మోదీ కోసం ఛావా స్పెషల్ స్క్రీనింగ్
న్యూఢిల్లీ: బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఛావా’’(Chhaava)ను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించబోతున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎంపీల కోసం పార్లమెంట్‌లోనే ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు.మార్చి 27న పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ఛావా సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ స్క్రీనింగ్‌కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు హాజరుకాబోతున్నట్లు సమాచారం. చిత్ర దర్శకుడితో పాటు తారాగణం కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని న్యూస్18 తన కథనంలో పేర్కొంది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన చిత్రమే ‘ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు (Chhatrapati Shivaji Maharaj) శంభాజీ మహారాజ్(Sambhaji Maharaj) జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా.. దినేష్ విజన్ నిర్మించారు. రష్మిక మందన్నా, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 14న విడుదలై సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. కేవలం హిందీలోనే రూ.750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రీసెంట్గా ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయగా.. భారీ వసుళ్లను సాధించింది. ఛావా సక్సెస్‌పై గతంలోనే ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనానికి హాజరై ఆయన.. ప్రస్తుతం దేశంలో ఛావా హవా కొనసాగుతోందంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఛావా చిత్రానికి స్ఫూర్తినిచ్చిన నవల(ఛావా) రచయిత శివాజీ సావంత్‌కు ఈ ఘనతంతా దక్కుతుందని అభినందించారు. -
ఛావాను వదలని కేటుగాళ్లు.. కేసు నమోదు
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన హిస్టారికల్ చిత్రం ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ జీవితంగా ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. నెల రోజులైనా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లకు వసూళ్లు సాధించింది.అయితే గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టి పీడిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సూపర్ హిట్ సినిమా ఛావాను కూడా పైరసీ చేశారు కేటుగాళ్లు. దీంతో ఛావా మేకర్స్ పోలీసులను ఆశ్రయించారు. ఆగస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ శ్రీ రజత్ రాహుల్ హక్సర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఇప్పటికే పలు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఛావాను ప్రదర్శించారని ఫిర్యాదులో పేర్కొన్నారు మేకర్స్. నిర్మాణ సంస్థ మడ్హాక్ ఫిల్మ్స్ ఏర్పాటు చేసిన యాంటీ పైరసీ ఏజెన్సీ పైరసికీ సంబంధించిన ఇంటర్నెట్ లింకులను పోలీసులకు సమర్పించింది. దీనిపై ముంబయిలోని సౌత్ సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. -
అంతా ఛావా వల్లే.. అసెంబ్లీలో సీఎం ఫడ్నవిస్ ప్రకటన
ముంబై: నాగపూర్‌లో గత రాత్రి నుంచి నెలకొన్న ఉద్రిక్తతలకు ఒక రకంగా ‘ఛావా’ సినిమానే కారణమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. మొఘలాయి చక్రవర్తి ఔరంగజేబు సమాధి(Aurangzeb Tomb)ని తొలగించాలనే డిమాండ్‌తో మొదలైన ఆందోళన కాస్త హింసాత్మకంగా మారడం.. ఆపై నెలకొన్న కర్ఫ్యూ పరిస్థితులపై ఆయన ఇవాళ అసెంబ్లీలో కీలక విషయాలు వెల్లడించారు.ఇక్కడ నేను కేవలం ఒక సినిమాను మాత్రమే తప్పుపట్టాలని అనుకోవడం లేదు. కానీ, ఇలా మాట్లాడక తప్పడం లేదు. శంభాజీ మహరాజ్ చరిత్రను ఛావా చిత్రం ప్రజల ముందు ఉంచింది. అదే సమయంలో పలువురి మనోభావాలు రగిలిపోయాయి. అందుకే ఔరంగజేబు మీద వ్యతిరేకత అంశం ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది. అయితే..ఇదంతా పక్కా ప్రణాళిక బద్ధంగా జరిగిన కుట్ర అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఔరంగజేబు సమాధి తొలగించాలనే డిమాండ్‌తో సోమవారం సాయంత్రం వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ ధర్నా చేపట్టాయి. కర్రలతో ఔరంగజేబు నకిలీ సమాధి ఒకదానిని ఏర్పాటు చేసి తగలపెట్టారు. కాసేపటికే మతపరమైన ప్రతులు తగలబెట్టారని ప్రచారం రేగింది. ఇది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాబట్టి ఇందులో కుట్రకోణం కూడా దాగి ఉండొచ్చు అని అన్నారాయన.#NagpurViolence: Maharashtra Chief Minister DevendraFadnavis says #Chhaava brought the history of Chhatrapati Sambhaji Maharaj to the fore and ignited public anger against Mughal ruler Aurangzeb. Read: https://t.co/hLrV0crgkG pic.twitter.com/RrUt0qPfJ2— NDTV Profit (@NDTVProfitIndia) March 18, 2025VIDEO Credits: NDTV Profit X Accountఅయితే చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా సహించేది లేదని.. కులం, మతం ఏదైనా సరే ప్రజలు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని సూచించారాయన. అదే సమయంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేవాళ్లపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలంతా సమన్వయంతో పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారు.ఇదిలా ఉంటే.. గత రాత్రి నాగ్‌పూర్(Nagpur)లో భారీ ఎత్తున విధ్వంస కాండ జరిగింది. రాళ్లు రువ్వుకుంటూ.. పలు వాహనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. పోలీసుపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడుల్లో.. కేవలం పోలీసులకే 33 మందికి గాయాలైనట్లు సమాచారం. అయితే సాధారణ పౌరులు ఎంత మంది గాయపడ్డారనేదిపై అక్కడి మీడియా ఛానెల్స్ తలా ఓ ఫిగర్ చెబుతుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన చిత్రంలో లీడ్ రోల్ శంభాజీగా విక్కీ కౌశల్(Vicky Kaushal), శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా(Akshay Khanna As Aurangzeb) తమ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. అయితే సినిమా రిలీజ్ టైంలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తారు. మరాఠా యోధుడు శంభాజీ పోరాటాన్ని, త్యాగాన్ని ఇప్పటి తరానికి తెలియజేసిన ఈ చిత్రం నిజంగా ఓ అద్భుతమంటూ కొనియాడారు. -
బాక్సాఫీస్ వద్ద ఛావా దూకుడు.. పుష్ప-2 రికార్డ్ బ్రేక్!
విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన పీరియాడికల్ డ్రామా ఛావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఫిబ్రవరి 14 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ఛావా రిలీజైన ఐదో వారంలో మరో సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. హిందీ బాక్సాఫీస్ వద్ద ఐదో వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ లిస్ట్‌లో ఛావా రూ.22 కోట్లు రాబట్టగా.. గతేడాది విడుదలైన స్త్రీ-2 రూ.16 కోట్లు, అల్లు అర్జున్ పుష్ప-2 రూ.14 కోట్లతో రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఐదో వారాంతంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఛావా నిలిచింది. పుష్ప 2 తర్వాత రష్మిక కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.కాగా.. ఈ చిత్రం ఇప్పటికే రణబీర్ కపూర్ చిత్రం యానిమల్‌ను దాటేసింది. ఈ సినిమా రిలీజైన 31 రోజుల్లో ఇండియా వ్యాప్తంగా నెట్ కలెక్షన్ 562.65 కోట్లు రాగా.. అందులో హిందీ వెర్షన్ రూ.548.7 కోట్లు, తెలుగు వెర్షన్ మరో రూ.13.95 కోట్లు రాబట్టింది. ఇండియాలో గ్రాస్ కలెక్షన్ 661.3 కోట్లు కాగా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఛావా 750.5 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కాగా.. ఈ సినిమా తెలుగు వర్షన్ మార్చి 7న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా.. మాడాక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో దినేష్ విజన్ నిర్మించారు. View this post on Instagram A post shared by Taran Adarsh (@taranadarsh) -
మల్టీప్లెక్స్ స్టాక్ పంట పండింది..?
హిందీతో పాటు విభిన్న భాషల్లో ఇటీవల విడుదలైన పాన్ ఇండియా సినిమా ఛావా తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని ప్రముఖ థియేటర్లతోపాటు మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ సినిమాస్‌లోనూ విడుదల చేయడంతో కంపెనీకి లాభాల పంట పండినట్లయిందని స్టాక్ రేటింగ్ బ్రేకరేజ్ సంస్థ నువామా ఇన్ స్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది. ఇటీవల కాలంలో మార్కెట్ అనిశ్చితుల నేపథ్యంలో కంపెనీ షేర్లు గరిష్ఠం నుంచి 32 శాతం పతనమైనప్పటికీ రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని తెలిపింది.2024-25 ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో ఛావా సినిమా కలెక్షన్లు ఊపందుకోవడంతో పీవీఆర్ ఐనాక్స్ మంచి లాభాలు పోస్ట్ చేస్తుందని నువామా తన నివేదికలో అంచనా వేసింది. ఇటీవల కంపెనీ ప్రమోటర్లు షేర్లు కొనుగోలు చేసినట్లు గుర్తు చేసింది. ఫిబ్రవరిలో ఛావా బాక్సాఫీస్ వసూళ్లతోపాటు ఇతర సినిమాల సహకారంతో స్టాక్ ధర ఏడాది ప్రాతిపదికన 39 శాతం పెరుగుదలతో ఆదాయాన్ని రూ.2,264 కోట్లకు పెంచిందని పేర్కొంది. కరోనా తర్వాత ఫిబ్రవరి నెలలో రూ.1,245 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో పరిశ్రమకు అత్యధిక వసూళ్లు సాధించడంలో ఛావా తోడ్పడింది.ఇదీ చదవండి: భారత్‌తో వాణిజ్యంపై యూఎస్ స్పై చీఫ్ స్పందనకొత్తగా 100 స్క్రీన్లు..పీవీఆర్ ఐనాక్స్ అసెట్-లైట్ గ్రోత్ స్ట్రాటజీని పాటిస్తోంది. భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో 30-40 కొత్త స్క్రీన్లను జోడించాలని భావిస్తున్నారు. సంస్థ క్యాపిటల్-లైట్ గ్రోత్ మోడల్ కింద 100 స్క్రీన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నువామా పేర్కొంది. ఇందులో 31 స్క్రీన్లు మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ మోడల్ కింద, 69 అసెట్-లైట్ మోడల్ కింద ఉండనున్నాయి. ఇందులో 42 శాతం నుంచి 80 శాతం వరకు మూలధన వ్యయాన్ని డెవలపర్ భరిస్తారని పేర్కొంది. కొత్తగా ప్లాన్ చేసిన ఈ స్క్రీన్లు రెండు మూడేళ్లలో అందుబాటులోకి వస్తాయని నువామా నివేదించింది. -
పుష్ప 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసిన ఛావా..
-
ఛావా మూవీ మేకింగ్ వీడియో
-
'ఛావా'.. తెర వెనక ఇంత కష్టపడ్డారా?
గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన మూవీ 'ఛావా'. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే రూ.600 కోట్ల మేర వసూళ్లు సాధించింది. తెలుగులోనూ రూ.11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్)దాదాపు నెలరోజుల నుంచి థియేటర్లలో అద్భుతంగా ప్రదర్శితమవుతున్న 'ఛావా' క్లైమాక్స్ బీటీఎస్ (బిహైండ్ ద సీన్స్) వీడియోని చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇందులో విక్కీ రిహార్సల్ చేయడం, ప్రొస్థటిక్ మేకప్ లాంటివి చూపించారు. ఇదంతా చూస్తున్నప్పుడు సినిమా కోసం ఇంతలా కష్టపడ్డారా అనిపించకమానదు.(ఇదీ చదవండి: 40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత) -
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ 'ఛావా'.. డేట్ ఫిక్సయిందా?
గత కొన్నిరోజులుగా ప్రేక్షకుల మధ్య డిస్కషన్ కి కారణమైన మూవీ 'ఛావా'. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన ఈ పీరియాడికల్ సినిమాన ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తీశారు. ఫిబ్రవరిలో హిందీ వెర్షన్, మార్చి తొలివారంలో తెలుగు వెర్షన్ రిలీజైంది.(ఇదీ చదవండి: తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్)హిందీలో ఎలా అయితే హిట్ టాక్ వచ్చిందో తెలుగులోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తొలి మూడు రోజులకే దాదాపు రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. శుక్రవారం వరకు కొత్త మూవీస్ ఏం లేవు కాబట్టి ఎన్ని కోట్లు వస్తాయో చూడాలి?సరే ఈ సంగతులన్నీ పక్కనబెడితే 'ఛావా' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారం నుంచి అంటే 11వ తేదీన అలా నెట్ ఫ్లిక్స్ లోకి రానుందని సమాచారం. మరి దక్షిణాది భాషల్లోనూ డబ్ చేస్తారా లేదా అనేది చూడాలి.(ఇదీ చదవండి: పెళ్లి రిసెప్షన్ లో ఫుల్ హ్యాపీగా సితార-నమ్రత-చరణ్) -
Chhaava Movie: ఇండియాలోనే 500 కోట్లు దాటిన కలెక్షన్లు
-
చరిత్ర తిరగరాస్తోన్న ఛావా.. ఏకంగా బాహుబలి-2 రికార్డ్‌ను కూడా!
బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన హిస్టారికల్ చిత్రం ఛావా. ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదట హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా తిరుగులేని వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవల తెలుగులోనూ విడుదలైన ఛావా కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది.తాజాగా ఈ చిత్రం హిందీలో క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 రికార్డ్‌ను అధిగమించింది. ప్రభాస్ నటించిన బాహుబలి-2 హిందీలో రూ.510 కోట్ల వసూళ్లు రాబట్టింది. తాజాగా ఛావా చిత్రం ఆ రికార్డ్‌ను దాటేసింది. కేవలం హిందీలోనే రూ.516 కోట్ల వసూళ్లు చేసింది. కేవలం విడుదలైన 25 రోజుల్లోనే బాహుబలి-2 రికార్డ్‌ను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా హిందీ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో సినిమాగా నిలిచింది. దీంతో విక్కీ కౌశల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.తెలుగులోనూ దూసుకెళ్తోన్న ఛావా..బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఛావా' తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఛావా తెలుగు వర్షన్ కలెక్షన్స్‌తో పాటు సినిమాలోని క్లైమాక్స్ సీన్ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ ఈ మూవీ కోసం ఎంతలా కష్టపడ్డారో అందులో చూపించారు. ఔరంగజేబు పాత్రతో అక్షయ్ ఖన్నా మేకింగ్ విధానాన్ని కూడా చూపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 530 కోట్ల మార్క్‌ను ఛావా చేరుకుంది. తెలుగు వర్షన్లో మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 10.91 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు గీతా ఆర్ట్స్ పేర్కొంది. -
'ఛావా' తెలుగులో కలెక్షన్స్ రికార్డ్.. క్లైమాక్స్ మేకింగ్ వీడియో చూశారా..?
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఛావా' తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఛావా తెలుగు వర్షన్ కలెక్షన్స్‌తో పాటు సినిమాలోని క్లైమాక్స్ సీన్ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ ఈ మూవీ కోసం ఎంతలా కష్టపడ్డారో అందులో చూపించారు. ఔరంగజేబు పాత్రతో అక్షయ్ ఖన్నా మేకింగ్ విధానాన్ని కూడా చూపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 530 కోట్ల మార్క్‌ను ఛావా చేరుకుంది. తెలుగు వర్షన్లో మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 10.91 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు గీతా ఆర్ట్స్ పేర్కొంది.ఫిబ్రవరి 14న హిందీ వర్షన్లో మాత్రమే విడుదలైన ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో మార్చి 7న థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఈ ఏడాది బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఛావా రికార్డు నెలకొల్పింది. మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతుంది. ఫైనల్‌గా రూ. 20 కోట్ల మార్క్‌ను ఛావా టాలీవుడ్లో అందుకుంటుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.ఛావా క్లైమాక్స్ మేకింగ్ఛావా సినిమాలో సంగమేశ్వర్ వద్ద జరిగిన క్లైమాక్స్ సీక్వెన్స్ చాలా కీలకంగా ఉంటుంది. మూవీకి అత్యంత బలాన్ని ఇచ్చే ఈ సీన్‌ను ఎలా తెరకెక్కించారో ప్రేక్షకులకు చూపారు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్‌ను ఎలా రెడీ చేశారో చూపారు. శంభాజీ మహారాజ్‌గా కనిపించేందుకు తాను ఆరు నెలల పాటు శిక్షణ తీసుకున్నట్లు విక్కీ కౌశల్ ఇప్పటికే చెప్పారు. రోజుకు ఆరు నుంచి 8 గంటలకు పైగానే శిక్షణ కోసమే కేటాయించానని ఆయన అన్నారు. ఆయనలా ధృఢమైన శరీరంతో కనిపించేందుకు కండలు పెంచడమే కాకుండా సుమారు 100 కేజీల వరకు విక్కీ బరువు పెరిగిన విషయం తెలిసిందే. -
‘ఛావా’ క్లైమాక్స్‌లో కన్నీళ్లు వచ్చాయి: బన్నీ వాసు
‘‘ఒక చరిత్రని సినిమాగా తీయడం అంత సులభం కాదు. అలాంటి ఒక కొత్త చరిత్రని ‘ఛావా’ వంటి గొప్ప సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ లక్ష్మణ్‌గారికి ధన్యవాదాలు. ఈ రోజు మనం స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నామంటే కారణం శంభాజీ మహారాజ్‌లాంటి మహావీరుల త్యాగ ఫలితమే. ‘ఛావా’(Chhaava Movie) మూవీ క్లైమాక్స్‌లో భావోద్వేగ సన్నివేశాలు చూసి కన్నీళ్లు వచ్చాయి’’ అని నిర్మాత బన్నీ వాసు (bunny vasu)తెలిపారు. విక్కీ కౌశల్, రష్మికా మందన్న జంటగా నటించిన చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వం వహించారు. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలైంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ తెలుగులో శుక్రవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన థాంక్స్ మీట్లో బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘ఛావా’ కేవలం సినిమా మాత్రమే కాదు... గ్రేట్ ఎమోషన్. నాలుగు రోజుల్లోనే పాటలని పూర్తి చేసిన ఏఆర్ రెహమాన్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్ని ఇస్తోంది. తెలుగులో నాకు వాయిస్ ఇచ్చిన ఫణి వంశీగారికి థ్యాంక్స్’’ అని నటుడు వినీత్ కుమార్ సింగ్ తెలిపారు. ‘‘మా సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని మాడ్డాక్ సీఎఫ్ఓ దివ్యాంశ్ గోయల్ అన్నారు. ఈ థ్యాంక్స్ మీట్లో తెలుగు డైలాగ్ రైటర్ సామ్రాట్, తెలుగు డబ్బింగ్ డైరెక్టర్ రాఘవ, లిరిక్ రైటర్ శ్రీమణి మాట్లాడారు. -
'ఛావా' తెలుగు వర్షన్.. రెండో రోజు కలెక్షన్ల జోరు
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఛావా' తెలుగులో కూడా సత్తా చాటుతుంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్, రష్మిక ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న హిందీ వర్షన్లో మాత్రమే విడుదలైన ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో మార్చి 7న థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఈ ఏడాది బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఛావా రికార్డు నెలకొల్పింది. మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతుంది.ఛావా సినిమా తెలుగు వర్షన్‌ను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. తొలిరోజే ఈ చిత్రం రూ.3 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సంస్థ తెలిపింది. ఒక డబ్బింగ్ చిత్రానికి ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం రికార్డ్ అంటూ నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, రెండో రోజు 'ఛావా' తెలుగు కలెక్షన్స్ మరింత పెరిగాయి. రెండు రోజులకు గాను టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 6.81 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. నేడు ఆదివారం కావడంతో సులువుగా రూ. 10 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ ఆయన సతీమణి యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక మందన్న జీవించేశారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కథలో కీలకమైన ఔరంగజేబు పాత్రతో అక్షయ్ ఖన్నా అదరగొట్టేశారని చెప్పవచ్చు. దీంతో ఛావా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు దాటేసింది. -
ఛావా ఎఫెక్ట్.. గుప్తనిధుల కోసం జనం ఉరుకులు పరుగులు
విక్కీ కౌశల్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఛావా(Chhaava) చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో.. రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ఓవైపు ఛావా కథాకథనాలపై విమర్శలు.. మరోవైపు రోమాంచితమైన ఫెర్మార్మెన్స్‌కు ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమా ప్రభావం మధ్యప్రదేశ్ బుర్హన్‌పూర్‌లో అలజడికి కారణమైంది.బుర్హన్‌పూర్‌లోని అసర్ఘడ్ కోట(Asirgarh Fort)ను బంగారు గనిగా, శంభాజీ సైన్య స్థావరంగా ఛావా చిత్రంలో చూపించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. అయితే ఈ మధ్య అక్కడ జరిగిన ఓ ఘటన.. ఈ వాదనకు మరింత బలం చేకూర్చి జనాల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. టార్చ్ లైట్లు, ఇనుప పనిముట్లు, మెటల్ డిటెక్టర్స్ స్థానికులు రాత్రిపూట కోట దగ్గరకు చేరుకున్నారు. ఇష్టానుసారం తవ్వకాలకు దిగారు. కొందరు బంగారు నాణేలు దొరికాయని ప్రకటించడంతో.. ఆ ప్రాంతానికి రోజురోజుకీ జనాల తాకిడి పెరిగింది. అయితే పోలీసులకు, అధికారులకు ఈ విషయమై సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని స్థానికంగా కొందరు యువకులు చెబుతున్నారు.అసలేం జరిగిందంటే..అసర్ఘడ్ కోటకు దగ్గర్లో ఉన్న జాతీయ రహదారిపై నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న దర్గా దగ్గర తవ్వకాలు జరిపిన ఓ జేసీబీ మిషన్.. ఆ మట్టిని స్థానికంగా ఉన్న ఓ రైతు పొలంలో పోశారు. అయితే కూలీలు ఆ మట్టి నుంచి పాత నాణేలు గుర్తించరాని, అందులో బంగారం, వెండి నాణేలు ఉన్నాయని ప్రచారం మొదలైంది. ఈ పుకార్లు చిలిచిలికి గాలివానగా చుట్టుపక్కల ఊర్లకు విస్తరించాయి. అయితే ఈ ప్రచారం కొందరు ఆకతాయిల ప్రచారమేనని స్థానికులు అంటున్నారు. చరిత్రకారులు ఏం చెబుతున్నారంటే..బుర్హన్‌పూర్ గతంలో మొఘలుల నగరంగా ఉండేది. ఆ కాలంలో అప్పటి ప్రజలు యుద్ధాలు, దొంగలకు భయపడి తమ వద్ద ఉన్న బంగారం, ఇతర విలువైన వస్తువుల్ని మట్టిలో పాతి పెట్టేవాళ్లు. కాబట్టి తవ్వకాల్లో నాణేలు బయటపడడంలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదని అంటున్నారు. నిజంగా అక్కడ నాణేలు దొరుకుతుంటే గనుక.. ఈ అంశాన్ని తీవ్రంగా భావించాలని, తక్షణమే ఆ ప్రాంతానికి రక్షణ కల్పించాలని పురావస్తు శాఖ అధికారులు స్థానిక యంత్రాంగాన్ని కోరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాన్ని పరిశీలించాలని పోలీసులను కోరింది. దీంతో స్పందించిన అధికారులు రంగంలోకి దిగి.. ఆ ప్రాంతంలో సిబ్బందిని మోహరింపజేశారు. ఇష్టానుసారం తవ్వకాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
‘ఛావా’ తెలుగు వెర్షన్‌కి ఊహించని ఓపెనింగ్స్!
విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’(Chhaava Movie). ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన ఈ చిత్రం తొలిరోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని సంపాదించుంది. మూడు వారాల తర్వాత నిన్న (మార్చి 7) ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో విడుదల చేసింది. టాలీవుడ్లో కూడా ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. విక్కీ కౌశల్ నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫలితంగా ఈ చిత్రం తొలి రోజు మంచి కలెక్షన్లలే రాబట్టింది. (ఛావా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసి తొలి రోజు 3.03 కోట్ల రూపాయలను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఓ డబ్బింగ్ సినిమాకు ఫస్ట్‌డే ఈ స్థాయి కలెక్షన్స్ రావడం రికార్డే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్లో మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఇప్పటి వరకు రూ. 483.58 కోట్లను రాబట్టింది.ఛావా విషయానికొస్తే.. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. శంభాజీ పాత్రలో విక్కీ నటించగా.. ఆయన భార్య ఏసుబాయి పాత్రను రష్మిక పోషించింది. ఇక బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా..ఔరంగాజేబు పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
Chhaava Review: ‘ఛావా’(తెలుగు వెర్షన్) మూవీ రివ్యూ
టైటిల్: ఛావానటీనటులు: విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్, డయానా పెంటీ, సంతోష్ జువేకర్ తదితరులునిర్మాత: దినేష్ విజన్దర్శకత్వం: లక్ష్మణ్ ఉటేకర్సంగీతం: ఏఆర్ రెహమాన్సినిమాటోగ్రఫీ: సౌరభ్ గోస్వామి (ISc)ఎడిటర్: మనీష్ ప్రధాన్తెలుగు రిలీజ్: గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్విడుదల తేది: మార్చి 7, 2025(తెలుగులో)ఛావా.. ఫిబ్రవరి 14న కేవలం హిందీ భాషలో మాత్రమే రిలీజైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ మోస్తరు అంచనాలతో రిలీజై.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తే బాగుండేదని చాలా మంది అనుకున్నారు. ఎట్టకేలకు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది. నేడు(మార్చి 7) తెలుగు భాషలో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.ఛావా కథేంటంటే..ఛత్రపతి శివాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ రాజ్యాన్ని సులభంగా ఆక్రమించుకోవచ్చని భావిస్తాడు మొగల్ చక్రవర్తి ఔరంగాజేబు(అక్షయ్ ఖన్నా). అతని ఆశకు అడ్డుకట్ట వేస్తూ బరిలోకి దిగుతాడు శివాజీ పుత్రుడు శంభాజీ మహారాజ్ (విక్కీ కౌశల్). మొగల్ చక్రవర్తుల కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగాజేబు వరకు చేరుతుంది. దీంతో శంభాజీని అంతం చేసేందుకు తానే రంగంలోకి దిగుతాడు. పెద్ద ఎత్తున సైన్యంతో దక్కన్ ప్రాంతానికి బయలుదేరుతాడు. కేవలం పాతిక వేల మంది సైన్యం మాత్రమే ఉన్న శంభాజీ..ఔరంగాజేబును ఎలా ఎదుర్కొన్నాడు? యుద్ధంలో అతనికి తోడుగా నిలిచిందెవరు? వెన్నుపటు పొడిచిందెవరు? స్వరాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ‘ఛావా’ అనేది మారాఠా రాజు శంభాజీకి సంబంధించిన చరిత్ర. అది ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. లేనిపోని మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఛావాని తెరకెక్కించాడు. శంభాజీ గురించి పూర్తిగా చెప్పకుండా.. స్వాతంత్రం కోసం, మారాఠా సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం ఆయన చేసిన పోరాటాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. శంభాజీ చరిత్ర తెలిసివాళ్లు కూడా తెరపై ‘ఛావా’ చూస్తే ఎంటర్‌టైన్‌తో పాటు ఎమోషనల్ అవుతారు.రాజుల పాలన ఎలా ఉంటుంది? అధికారం కోసం ఎలాంటి కుట్రలు చేస్తారు? అనేది బాహుబలితో పాటు పలు చారిత్రాత్మక సినిమాల్లో చూశాం. ‘ఛావా’ కథ కూడా అదే. అందుకే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా భారీ ఎలివేషన్స్, ఎమోషన్స్, యాక్షన్ సీన్లతో కథనాన్ని నడిపించాడు. శంభాజీ చరిత్ర తెలియని వాళ్లకు కూడా ఈజీగా అర్థం అయ్యేలా కథను తీర్చిదిద్దాడు. ఓ భారీ యుద్దపు సన్నివేశంతో హీరో ఎంట్రీని ప్లాన్ చేసి.. సినిమా ప్రారంభం నుంచే ఆసక్తిని పెంచేలా చేశాడు. ఫస్టాఫ్ మొత్తం రాజ్యాలు.. యుద్దం.. కుట్రలు ఇలానే సాగుతుంది. కథ ఊహకందేలా సాగడం.. శంభాజీని అంతం చేసేందుకు ఔరంగాజేబు చేసే కుట్రలు రొటీన్‌గా ఉండడంతో కథనం కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కొన్ని సీన్లను మరింత ఎమోషనల్‌గా చూపించే ఆస్కారం ఉన్నా..దర్శకుడు ఆ సీన్లను సింపుల్‌గా కట్ చేశాడు. ఇక సెకండాఫ్ మాత్రం చాలా పకడ్భంధీగా ప్లాన్ చేసుకున్నాడు డైరెక్టర్. ఔరంగాజేబు సైన్యాన్ని ఎదుర్కొనుందుకు శంభాజీ చేసే ప్రయత్నం..ఈ క్రమంలో వచ్చే యుద్దపు సన్నివేశాలు అదిరిపోతాయి. సంగమేశ్వరలో ఉన్న శంభాజీపై మొగల్ సైన్యం దాడి చేసే సీన్లు.. వారిని ఎదుర్కొనేందుకు శంభాజీ చేసే పోరాట ఘట్టాలు ప్రేక్షకుడికి గూస్బంప్స్ తెప్పిస్తాయి. ‘జై భవానీ’, ‘హర హర మహదేవ్’ అంటూ ఢిల్లీ సైన్యంపై మారాఠ సైన్యం విరుచుకుపడుతుంటే.. థియేటర్స్‌లో విజిల్స్ పడతాయి. ఇక శంభాజీ బంధీగా మారడం.. మొగల్ సైన్యం అతన్ని చిత్రహింసలు పెడుతుంటే.. తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి. బరువెక్కిన గుండెతో థియేటర్ బయటకు వచ్చేస్తాం. ఎవరెలా చేశారంటే.. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటించలేదు.. జీవించేశాడు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటించలేదు.. జీవించేశాడు. వార్, యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. క్లైమాక్స్‌లో నట విశ్వరూపం చూపించాడు. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా అద్భుతంగా నటించాడు. శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక ఇద్దరూ వారి వారి పాత్రలకు వందశాతం న్యాయం చేశాడు.మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
తెలుగువారి ప్రేమకు కృతజ్ఞతలు– విక్కీ కౌశల్
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘ఛావా’. విక్కీ కౌశల్, రష్మికా మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ నేడు విడుదల చేస్తోంది. ‘‘ఛావా’ తెలుగు ట్రైలర్ దాదాపు 5 మిలియన్ల వ్యూస్ సాధించింది. తెలుగులో 550కి పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ‘‘ఛావా’ పట్ల తెలుగువారి అద్భుతమైన సపోర్ట్, ప్రేమకు కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకు వస్తున్నందుకు మేము గర్విస్తున్నాం. శంభాజీ మహారాజ్ కీర్తి, అజేయమైన శౌర్యం, త్యాగాన్ని చూసే అవకాశం మీకు లభిస్తుంది... అలాగే మీ హృదయాలను తాకుతుంది. ఈ చిత్రాన్ని మీరందరూ బిగ్ స్క్రీన్‌పై ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను’’ అంటూ విక్కీ కౌశల్ ఓ వీడియో విడుదల చేశారు. -
మంచి సినిమాలివ్వడానికి ముందుంటాం: నిర్మాత ‘బన్నీ’ వాసు
ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్‌గా రూపొందిన హిందీ చిత్రం ‘ఛావా’(Chhaava Movie). విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో యేసుబాయి భోంస్లే పాత్రను రష్మికా మందన్న పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలైంది. ఈ నెల 7న తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత ‘బన్నీ’ వాసు(Bunny Vasu) మాట్లాడుతూ– ‘‘ఛావా’ హిందీలో ఎంత పెద్ద ప్రభంజనం సృష్టించిందో ఆందరికీ తెలుసు. అంత మంచి సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు గర్వపడుతున్నాం. భాష ఏదైనా మంచి సినిమా అయితే తెలుగులో తీసుకురావడానికి మా గీతా ఆర్ట్స్ ముందుంటుంది. ఇక ‘ఛావా’ చివరి 25 నిమిషాలు ఇండియా మొత్తం కన్నీళ్లు పెట్టించింది. అద్భుతమైన క్యాలిటీతో తెలుగులో డబ్ చేశాం. ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
Chhaava : తెలుగు ట్రైలర్ బ్లాక్ బస్టర్..
-
నార్త్ లో రష్మిక కు నయా క్రేజ్..!
-
బ్లాక్ బస్టర్ 'ఛావా' తెలుగు ట్రైలర్ రిలీజ్
గతనెలలో హిందీ రిలీజైన 'ఛావా' సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు తెలుగు ట్రైలర్ తాజాగా విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)'ఉరి', 'సర్దార్ ఉద్దమ్ సింగ్' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమైన విక్కీ కౌశల్.. 'ఛావా'లో మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడిగా నటించాడు. రష్మిక హీరోయిన్. పీరియాడికల్ కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రాన్ని ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్.. తెలుగులో ఛావా చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. మార్చి 7న అంటే ఈ వీకెండ్ లో మూవీ రిలీజ్. 3 నిమిషాలున్న ట్రైలర్.. మంచి పవర్ ఫుల్ గా ఉంది. మీరు ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: 97వ ఆస్కార్ విజేతల పూర్తి జాబితా.. ఉత్తమ చిత్రం 'అనోరా') -
బద్దలు అవుతున్న పుష్ప2 రికార్డ్స్
-
మార్చిలో థియేటర్ మూవీస్.. హిట్ కొడితే చాలు!
మార్చి అంటేనే పరీక్షల సీజన్. నెల చివర్లో తప్పితే మిగతా రోజుల్లో సినిమాలు సరిగా రిలీజ్ కావు. కానీ ఈ సారి మాత్రం స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు 10 వరకు ఉన్నాయి. ఇవి కాకుండా పలు రీ రిలీజులు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏంటవి? వాటి సంగతేంటి?మార్చి తొలివారంలో కింగ్ స్టన్, ఛావా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే డబ్బింగ్ సినిమాలతో పాటు నారి అనే తెలుగు మూవీ రాబోతుంది. వీటిలో 'ఛావా'పైనే అంచనాలు ఉన్నారు. దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ మూవీకి తెలుగులో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)రెండో వారంలో నాని నిర్మించిన 'కోర్ట్', కిరణ్ అబ్బవరం 'దిల్ రుబా', హిందీ మూవీ 'డిప్లమాట్' విడుదలవుతాయి. వీటిలో దేనిపైన పెద్దగా అంచనాల్లేవు.మూడో వారంలో ఇప్పటివరకైతే ఏ సినిమాలు లేవు. నాలుగో వారంలో మాత్రం లూసిఫర్ సీక్వెల్ 'ఎల్ 2: ఎంపురన్' మార్చి 27న, నితిన్ రాబిన్ హుడ్ 28న, మ్యాడ్ స్క్వేర్ 29న థియేటర్లలోకి వస్తాయి. వీటిలో మ్యాడ్ 2పైనే కొద్దో గొప్పో అంచనాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు')మార్చి 28న పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' రిలీజ్ అవుతుందని నిర్మాతలు అంటున్నారు. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అయ్యే అవకాశాలు అస్సలు లేవని చెప్పొచ్చు. అలానే మార్చిలోని సినిమాలకు హిట్ టాక్ వస్తే లాభాలు వచ్చేస్తాయి. ఎందుకంటే అన్నీ చిన్న బడ్జెట్ చిత్రాలే!వీటితో పాటు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, సలార్ లాంటి సినిమాలు కూడా ఇదే నెలలో రీ రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: 'కన్నప్ప' కొత్త టీజర్ రిలీజ్.. ఈసారి మాత్రం) -
ఆమె పదేళ్ల చిన్నారి.. ఎలా పెంచుతున్నానంటే: రష్మిక
రష్మిక మందన్న(Rashmika Mandanna ) ఓ ఏడాది క్రితం అయితే ఏమోగాని...ఇప్పుడు ఆమె ఇంటర్నేషనల్ స్టార్. పుష్ప, పుష్ప 2లతోనే అమాంతం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆమెను ఆ వెంటనే వచ్చిన చావా ఎక్కడికో తీసుకెళ్లిపోయింది.ప్రస్తుతం తన తాజా చిత్రం ఛావా విజయాన్ని ఎంజాయ్ చేస్తోన్న రష్మిక త్వరలోనే విడుదల కానున్న సికిందర్ లో సల్మాన్‌ఖాన్ సరసన నటించింది. ఈ సినిమా మీద కూడా బాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపధ్యంలో రష్మిక ఇటీవల మరో బాలీవుడ్ సీనియర్ నటి నేహా ధూపియాతో ‘‘నేహాతో నో ఫిల్టర్’’ షోలో తన కుటుంబం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.అమ్మానాన్న ఇన్వాల్వ్ కారు...భారం నాదే...స్టార్ హీరోయిన్ గా ఎదిగినా ఇప్పటికీ రష్మిక నిరాడంబరంగా కనిపిస్తుంది. వీలైనంత వరకూ డౌన్ టూ ఎర్త్ ఉంటుంది. ఈ పరిణితికి కారణం ఏమిటి? అంటే... ఆమె తన తల్లిదండ్రుల పెంపకమే అని స్పష్టం చేస్తుంది. ‘‘ ఇది నీ జీవితం నీ జీవితంలో జోక్యం చేసుకోమని మమ్మల్ని అడగకు ’’ అని నా తల్లిదండ్రులు భారాన్ని తీసుకొచ్చి నా తలపై ఉంచారు కాబట్టి, ‘ అని ఆమె వివరించింది. తన పేరు ప్రఖ్యాతులు ఎంతగా పెరుగుతున్నప్పటికీ తన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ నిరాడంబరమైన, స్వతంత్ర జీవితాన్ని జీవిస్తున్నారని చెప్పింది.చెల్లి...పదహారేళ్ల వ్యత్యాసం...రష్మిక మందన్నకు ఓ సోదరి ఉంది. ఈ ఇంటర్వూలో తన చెల్లెలు గురించి రష్మిక కొన్ని ఆశ్చర్యకరమైన వివరాలను పంచుకుంది, అందులో ముఖ్యమైనది తనకు తన చెల్లికి మధ్య 16 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉండడం. ‘నాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక చెల్లెలు ఉంది, మా మధ్య దాదాపు 16 సంవత్సరాల గ్యాప్ ఉంది‘ అని రష్మిక ఆ సంభాషణలో వెల్లడించారు. రష్మిక ఎప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది. ఆ స్వేఛ్చకు ఆమె సెలబ్రిటీ హోదా కూడా అడ్డం కాకూడదని ఆశిస్తుంది. ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించడం కోసం, వీలైనంత వరకూ సాదా సీదాగా సాధారణ స్థితిని కొనసాగించడం కోసమే ప్రాధాన్యతనిస్తుంది,తన తల్లిదండ్రుల పెంపకాన్ని రష్మిక అభినందిస్తుంది. తన పెంపకం ఓ వ్యక్తిగా తనని ఎలా తీర్చిదిద్దిందో తన సోదరి కూడా అలాగే ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు వివరించింది. ‘నేను ఎప్పుడూ నా చెల్లి విషయంలో ఆలోచించేది ఒకటే, నాకున్న ఇప్పటి పరిస్థితుల వల్ల ఆమె కోరుకున్నది ఏదైనా ఆమె పొందుతుంది. కానీ అది ముఖ్యం కాదు, ఎందుకంటే నేను పెరిగిన పెంపకం లాంటిదే ఆమెకు మంచిది. దాని కారణంగానే నేను ఈ రోజు ఇలా ఉన్నాను,‘ అని ఆమె చెప్పింది, బాల్యం నుంచే ప్రతీ వ్యక్తీ స్వతంత్రంగా ఎదగాల్సిన అవసరం ఉందనేది ఆమె అభిప్రాయం.‘అయితే, ప్రస్తుతం, ఆమె చిన్న పిల్ల. తర్వాత తర్వాత నేను ఆమెకు ఇవ్వాల్సిన భద్రత చాలా ఉంది, వయసుతో పాటు ఆమెకు నేను అందించగలిగిన సౌకర్యాలు కూడా చాలా ఉన్నాయి’’ అంటూ చెల్లి పట్ల తనకున్న అపారమైన ప్రేమను రష్మిక పంచుకుంది. , భవిష్యత్తులో తన సోదరికి రక్షణ సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడంతో పాటు లేత వయస్సులో సరైన పెంపకాన్ని అందించడం చాలా అవసరమని అంటున్న రష్మిక అభిప్రాయాలకు దోహదం చేసింది స్వీయానుభవాలే. -
తెలుగు 'ఛావా' రిలీజ్ ఎప్పుడంటే..!
-
తెలుగులో ఛావా.. వర్కౌట్ అవుతుందా..!
-
బాలీవుడ్ లో కోట్లు కొల్లగొడుతున్న ఛావా మూవీ.!
-
రూ.500 కోట్లకు చేరువలో ఛావా.. తెలుగు వర్షన్ రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవలి కాలంలో వచ్చిన బెస్ట్ సినిమా ఏది? అంటే క్షణం ఆలోచించకుండా ఛావా (Chhaava Movie) అని చెప్తున్నారు సినీప్రియులు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ జనాల్ని థియేటర్‌కు రప్పిస్తూనే ఉంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీయే కాదు ఆయన తనయుడు శంభాజీ (Chhatrapati Sambhaji Maharaj) కూడా పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, త్యాగశీలి అని చరిత్రను చాటిచెప్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.483 కోట్లు రాబట్టింది. రేపో మాపో రూ.500 కోట్ల క్లబ్లో చేరనుంది.తెలుగు ప్రేక్షకుల డిమాండ్సినిమాను విపరీతంగా ప్రేమించే తెలుగు ప్రేక్షకులు ఛావా తెలుగు డబ్బింగ్ (Chhaava Telugu Version) కావాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు వర్షన్లో ఛావా రిలీజైతే ఇక్కడ మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంత గొప్ప సినిమాను టాలీవుడ్ ఆడియన్స్‌కు అందించాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భావించారు. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ ఛావా తెలుగు డబ్బింగ్ పనులను ఇదివరకే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా గీతా ఆర్ట్స్.. మార్చి 7న ఛావా తెలుగు వర్షన్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.ఛావావిక్కీ కౌశల్ పోషించిన శంభాజీ పాత్రకు ఏ హీరో డబ్బింగ్ చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ పాత్రకు ప్రాణం పోస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. మరి ఏ హీరో డబ్బింగ్ చెప్పాడన్నది వారం రోజుల్లో తెలియనుంది. ఛావా సినిమా విషయానికి వస్తే.. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. The epic tale of India’s courageous son, #Chhaava is now all set to roar in Telugu by popular demand⚔️❤️🔥Witness the biggest spectacle #Chhaava in Telugu from March 7th💥👑#ChhaavaTelugu Grand Release by #GeethaArtsDistributions 🔥@vickykaushal09 @iamRashmika #AkshayeKhanna… pic.twitter.com/awm4MAq4J6— Geetha Arts (@GeethaArts) February 26, 2025 చదవండి: ఆ సమయంలో నా తండ్రి పేరు చెప్పుకోలేదు: శృతిహాసన్ -
క్షమాపణలు చెప్పిన 'ఛావా' డైరెక్టర్.. ఎందుకంటే?
కొన్ని కథలు వినోదాన్ని పంచితే మరికొన్ని హృదయాలను బరువెక్కిస్తాయి. కొన్ని మాత్రమే మన రక్తం మరిగేలా చేస్తూనే కన్నీళ్ల వరద పారిస్తాయి. అలాంటి సినిమాయే ఛావా (Chhaava Movie). బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీగా నటించాడు. ఆయన భార్య ఏసుబాయిగా హీరోయిన్ రష్మిక మందన్నా యాక్ట్ చేసింది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది.ద్రోహులుగా చిత్రీకరించారుఇక ఈ సినిమాలో తన పూర్వీకులను తప్పుగా చూపించారంటూ మరాఠా యోధులు గానోజీ, కాన్హోజి షిర్కే వారసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను ఉటంకిస్తూ తమ పూర్వీకులను శంభాజీ మహారాజ్‌కు ద్రోహం చేసినవారిగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఆయా సన్నివేశాల ద్వారా తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగించినందుకుగానూ చిత్రయూనిట్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar)కు నోటీసులు పంపించారు.అసౌకర్యానికి గురైతే క్షమించండిఈ వివాదంపై డైరెక్టర్ లక్ష్మణ్ స్పందిస్తూ ఛావాలో గానోజి, కన్హోజీల పేర్లు మాత్రమే ఉపయోగించామన్నాడు. వారి ఇంటిపేరు, ఏ ప్రాంతానికి చెందినవారు వంటి వివరాలను వెల్లడించలేదన్నాడు. షిర్కే కుటుంబసభ్యుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చాడు. ఛావా వల్ల వారు అసౌకర్యానికి గురైతే తనను క్షమించాల్సిందిగా కోరాడు.చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు -
రష్మికపైనే విమర్శలా? ఆమె ట్రాక్ రికార్డ్ చూశారా?: ఛావా నటి
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ (Chhatrapati Sambhaji Maharaj) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఛావా (Chhaava Movie). బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ శంభాజీగా, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక మందన్నా నటించారు. విక్కీ కౌశల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రష్మిక పాత్రపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.రష్మిక కళ్లతోనే నటించగలదుఈ ట్రోలింగ్‌పై నటి దివ్య దత్త (Divya Dutta) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమె ఛావా చిత్రంలో రాజమాత సోయరబాయిగా నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దివ్య మాట్లాడుతూ.. సినిమాలో రష్మిక మందన్నా(Rashmika Mandanna)కు, నాకు మధ్య ఎలాంటి సన్నివేశాలు లేవు. కానీ తను గొప్ప నటి అని నా విశ్వాసం. కొన్ని సీన్స్‌లో తన కళ్లను చూడండి.. అవి మిమ్మల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఆమె ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చిందన్న విషయం మర్చిపోవద్దు. ట్రాక్ రికార్డ్ చూశారా?ప్రేక్షకుల కోసం ఆమె ఎంతలా తపన పడుతుందో ఆమె ట్రాక్ రికార్డ్ చూస్తే స్పష్టంగా తెలిసిపోతుంది. నాకు తెలిసిందల్లా రష్మిక మంచి అమ్మాయి మాత్రమే కాదు, ఎంతో కష్టపడే వ్యక్తి. ఆమె అంటే నాకెంతో ఇష్టం. మిగతావాళ్లేమనుకుంటారో నాకనవసరం. ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది. నీ పాత్ర నిడివి ఇంకాస్త ఎక్కువుంటే బాగుండేదని కొందరు అద్భుతంగా యాక్ట్ చేశావని మరికొందరు చెప్తుంటారు. నేనైనా, రష్మిక అయినా మా పాత్రల కోసం బెస్ట్ ఇచ్చాం. అందుకు సంతోషిద్దాం..మిగతావాళ్లు కూడా వారి పాత్రల పరిధి మేర నటించారు. ఇప్పుడు ప్రేక్షకులు వారి పని నిర్వర్తిస్తున్నారు. సినిమాను ఆదరిస్తున్నారు. ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలబెడుతున్నారు. అందుకు మనం సంతోషిద్దాం అని పేర్కొంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదలకాగా ఇప్పటివరకు రూ.300 కోట్లు రాబట్టింది. రష్మిక.. యానిమల్, పుష్ప 2తో వరుసగా భారీ విజయాల్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం ఈ బ్యూటీ సికందర్, ద గర్ల్‌ఫ్రెండ్, కుబేర, థామ సినిమాలు చేస్తోంది.చదవండి: ఆ ఒక్క పనితో లాభపడ్డ ఇద్దరు హీరోలు.. లేకుంటే సీన్ రివర్స్?! -
ఆ ఒక్క పనితో లాభపడ్డ ఇద్దరు హీరోలు.. లేకుంటే సీన్ రివర్స్?!
ఎక్కడ చూసినా ఛావా (Chhaava Movie) ప్రభంజనమే! ఛావా అంటే సింహం పిల్ల అని అర్థం. ఛత్రపతి శివాజీ ధైర్యసాహసాల గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన కుమారుడు శంబాజీ గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఆయన చరిత్రను అందరికీ తెలియజేయాలన్న లక్ష్యంతో తెరకెక్కిన సినిమా ఛావా. ఓపక్క ప్రేక్షకుల రక్తం మరిగేలా చేస్తూ మరోపక్క వారిని సీట్లకు కట్టిపడేసి కన్నీళ్లు పెట్టిస్తోందీ మూవీ.పుష్ప 2 Vs ఛావా అయ్యేది!ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజైంది. నిజానికి గతేడాది డిసెంబర్ 6న ఛావాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా (Pushpa 2: The Rule) కూడా సరిగ్గా అప్పుడే వస్తున్నట్లు తెలిసి ఆలోచనలో పడ్డారు. అప్పటికే పుష్ప 1 బ్లాక్‌బస్టర్. దానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2ను పాన్ ఇండియావైడ్‌గా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ఇలాంటి సమయంలో పుష్పరాజ్‌కు పోటీగా వెళ్తే రెండు సినిమాల కలెక్షన్స్ దెబ్బతినే అవకాశం ఉందని ఛావా మేకర్స్ వెనక్కు తగ్గారు.పుష్పరాజ్‌కు దారిచ్చిన ఛావాపుష్పరాజ్కు దారిస్తూ కొత్త డేట్ వెతుక్కున్నారు. అందుకుగానూ అల్లు అర్జున్ (Allu Arjun) ఛావా యూనిట్‌కు స్పెషల్‌గా థాంక్స్ కూడా చెప్పారు. ఈ నిర్ణయం వల్ల రెండు సినిమాలు లాభపడ్డాయి. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1850 కోట్లు సాధించింది. ఇప్పుడు ఛావాకు పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో కలెక్షన్స్ ఊపందుకుంటున్నాయి. ఇక ఈ రెండు సినిమాల్లోనూ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించడం విశేషం. (చదవండి: Sankranthiki Vasthunam: ఓటీటీలో కన్నా ముందుగా టీవీలో)ఇద్దరి కెరీర్లో మైలురాయి..అల్లు అర్జున్ కెరీర్లో పుష్ప ఎలాగో విక్కీ కౌశల్ కెరీర్లో ఛావా అంతే ప్రత్యకంగా నిలిచిపోనుంది. ఛావా సినిమాపై ప్రధాని నరేంద్రమోదీ సైతం ప్రశంసలు కురిపించారు. 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఛావా అన్నిచోట్లా ఆదరణ పొందుతోంది. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల వల్ల శంభాజీ వీరత్వాన్ని సినిమాగా పరిచయం చేయడానికి వీలైంది అన్నారు.మోదీ ప్రశంసలుఇందుకు సంబంధించిన వీడియోను విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీ ఛావాను ప్రశంసించడం, ఛత్రపతి శంభాజీ మహారాజ్ త్యాగాన్ని కీర్తించినందుకు గర్వంగా ఉంది. ఆనందంతో మనసు ఉప్పొంగుతోంది అని రాసుకొచ్చాడు. ఛావాలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక మందన్నా, ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా రాబట్టింది.చదవండి: అయ్య బాబోయ్.. కిచ్చ సుదీప్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా? -
ఛావా 'ఆయా రే తుఫాన్'.. పవర్ఫుల్ సాంగ్ చూశారా..?
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ పరాక్రమాన్ని చూపుతూ ఆయన జీవిత కథ ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) ఛావా చిత్రాన్ని తెరకెక్కించారు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసు భాయి పాత్రలో రష్మిక మందన్నా అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించారు. ఈ మూవీలోని "ఆయా రే తూఫాన్" పాటకు విపరీతంగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. సోసల్మీడియాలో ఈ పాట బీజీఎమ్‌తో ఎన్నో రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ సాంగ్‌ను లైవ్‌లో ఏ.ఆర్.రెహమాన్, మరాఠీ సింగర్ వైశాలి సామంత్(Vaishali Samant) పాడారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.బాలీవుడ్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాటే వినిపిస్తోంది. ఈ పాటతో మరాఠీ సింగర్ వైశాలి సామంత్‌కు మరింత గుర్తింపు దక్కింది. ఇప్పటికే ఆమె చాలా పాటలు పాడినప్పటికీ ఆయా రే తుఫాన్ సాంగ్‌తో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఈ పాటకు ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతం అందించడంతో పాటు ఆయన కూడా ఆలపించారు.ఛావా కలెక్షన్స్ప్రపంచవ్యాప్తంగా ఛావా 8 రోజుల్లోనే రూ. 297 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. 2025లో తొలి హిట్‌గా ఛావా నిలిచింది అంటూ ఇండస్ట్రీ వర్గాలు కూడా తెలుపుతున్నాయి. త్వరలో రూ. 500 కోట్ల మార్క్‌ను సులువుగా చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీకి మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. అయితే, ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయాలంటూ ఇప్పటికే చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాను పాన్ ఇండియా రేంజ్లో అన్ని భాషలలో విడుదల చేస్తే బాగుండేదని తెలుపుతున్నారు. అదే జరిగింటే ఇప్పటికే రూ. 500 కోట్ల కలెక్షన్స్ దాటేదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. -
చావాను మిస్ చేసుకున్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?
-
'ఛావా'పై వివాదాస్పద కామెంట్లు.. వివరణ ఇచ్చిన స్వర భాస్కర్!
ఛావా సినిమాపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన ట్వీట్స్ వివాదానికి దారితీశాయి. దీంతో ఆమె తాజాగా వివరణ ఇచ్చింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన తాజా చిత్రం ఛావా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల గుండెలను తాకింది. అయితే, ఈ సినిమా గురించి ఆమె చేసిన పోస్టులపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మహాకుంభ్ మేళాలో జరిగిన తొక్కిసలాటను పోలుస్తూ ఛావా మూవీపై విమర్శలు చేసింది. కొద్దిరోజుల క్రితం మహాకుంభ్ మేళాలో జరిగిన తొక్కిసలాట కంటే దాదాపు 500 ఏళ్ల క్రితం హిందువులను హింసించినట్లు తెరకెక్కించిన కల్పిత కథలనే ప్రజలు నమ్ముతారంటూ స్వర భాస్కర్ ట్వీట్ చేసింది. అంతేకాకుండా అలాంటి వాటిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారంటూ తన ట్వీట్లో పేర్కొంది. అది కాస్తా వివాదానికి దారితీయడంతో ఆమెపై తీవ్రస్థాయిలో నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఫైనల్లీ వాటికి వివరణ ఇస్తూ ఆమె పోస్ట్ చేసింది. ఛావా మూవీలో ఔరంగజేబు చేతిలో ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ అనుభవించిన హింస అంతా కల్పితం అని ఎలా అంటావ్ అంటూ ఆమెపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఆమె ఇలా విరణ ఇచ్చింది. 'నేను వ్యక్తపరిచిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. మన చరిత్రను నేను ఎంతగానో గౌరవిస్తాను. ఛత్రపతి శివాజీ ఘనతల్ని కీర్తించడంలో నేను గౌరవిస్తాను. కానీ, దయచేసి ప్రస్తుత కాలంలోని తప్పులు, వైఫల్యాలను దాచడానికి గత వైభవాన్ని దుర్వినియోగం చేయవద్దు. చారిత్రక అవగాహన ఎల్లప్పుడూ ప్రజలను ఏకం చేయడానికి ఉపయోగించాలి. ప్రస్తుత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కాదు. చరిత్ర అందర్నీ కలిపేలా ఉండాలి. కానీ, విడదీసేలా కాదు. నా మునుపటి ట్వీట్ ఏదైనా మీ మనోభావాలను దెబ్బతీస్తే.. నేను చింతిస్తున్నాను. అందరితో పాటు నేను కూడా మన భారత చరిత్ర గురించి తెలుసుకొని గర్వపడుతున్నాను.' అని ఆమె అన్నారు. -
ఛత్రపతి శివాజీ వారసుడిపై అభ్యంతరకర కంటెంటా?.. వీకీపీడియాపై కేసులు
ముంబై: మరాఠా సామ్రాజ్య వీరుడు ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji Maharaj) వారసుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ (chhatrapati sambhaji maharaj) గురించి వీకీపీడియా అభ్యంతరకర పోస్టు పోస్టు చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం(21-02-2025) వీకీపీడియాకు చెందిన 4-5 ఎడిటర్లపై మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు కేసులు నమోదు చేశారు.ఇటీవల వీకీపీడియా ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి తప్పుడు సమాచారం పోస్టు చేసిందని, వెంటనే ఆ కంటెంట్‌ను తొలగించాలని మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు అమెరికాకు చెందిన వీకీపీడియా మాతృసంస్థ వీకీమీడియా ఫౌండేషన్‌కు నోటీసులు జారీ చేశారు.15 ఈమెయిల్స్ పంపినా ఇంత వరకూ వీకీమీడియా ఫౌండేషన్ నుంచి ఎలాంటి స్పందనరాలేదు. దీంతో వీకీపీడియా శంభాజీ మహారాజ్ గురించి అభ్యంతరకర కంటెంట్ పోస్టు చేసిందని, ఆ కంటెంట్ వల్ల శాంతిభద్రతకు విఘూతం కలిగే అవకాశం ఉందని సైబర్ సెల్ పోలీసులు వీకీపీడియా ఎడిటర్లపై కేసులు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ 69,79 ఉల్లంఘించినందుకు కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘ఛావా’ (Chhaava)విడుదల నేపథ్యంలో వికీపీడియా కంటెంట్‌పై అభ్యంతరాలు వచ్చాయి. మరాఠాలు ఇదే విషయాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్లారు. చారిత్రక వాస్తవాలను వక్రీకరించే కంటెంట్‌ను సహించబోమని, వీలైనంత త్వరగా వికీపీడియాను సంప్రదించాలని సైబర్ సెల్ పోలీసుల్ని ఆదేశించారు. మరాఠా సామ్రాజ్య పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత కథను.. ‘ఛావా’ పేరిట భావోద్వేగపూరిత చిత్రంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తీర్చిదిద్దాడు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ‘ఛావా’లో శంభాజీగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) జీవించేయేగా.. శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా ఆకట్టుకున్నారు. -
'ఛావా'తో భారీ పాపులారిటీ.. ఏకంగా రెహమాన్‌తో కలిసి.. ఎవరీ వైశాలి?
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న చిత్రం 'ఛావా(Chhaava)'. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ మూవీ రూ.200 కోట్ల మార్క్‌ను దాటేందుకు సిద్ధమైంది.ఛావా కోసం కష్టపడ్డ హీరోమరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) ఈ చిత్రాన్ని రూపొందించాడు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసు భాయి పాత్రలో రష్మిక మందన్నా ఒదిగిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం విక్కీ కౌశల్ కత్తి సాము నేర్చుకోవడమే కాకుండా 100 కిలోల బరువు పెరిగి మరీ సాహసం చేశాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి విడుదలైన "ఆయా రే తూఫాన్" పాట ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాట పాడిందెవరో తెలుసా?ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాటే వినిపిస్తోంది. ఈ పాటను పాడింది ఎవరో కాదు మరాఠీ సింగర్ వైశాలి సామంత్ (Vaishali Samant). ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన ఆమె ఆయా రే తుఫాన్ సాంగ్‌తో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతం అందించడంతో పాటు ఈ పాటను ఆలపించాడు. ఇర్షాధ్ కమిల్, క్షతిజ్ పట్వర్దన్ రచించారు.మిలియన్ల వ్యూస్ఈ పాట విన్న ఆడియన్స్‌కు గూస్ బంప్స్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో ఇప్పటివరకు 37 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. ఇదే విషయంపై వైశాలి మాట్లాడుతూ.."ఏ ఆర్ రెహమాన్ తో పాడే అవకాశం వచ్చినందుకు ఎప్పటికీ నేను కృతజ్ఞురాలినై ఉంటాను. ఛావా సినిమాలోని ఈ పాట నా సంగీత ప్రయాణానికి ఎంతో ముఖ్యమైనది. ఆయన నా గానం పై నమ్మకం ఉంచి నాకు అవకాశాన్ని కల్పించారు. ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆడియో లాంచ్ సందర్భంగా ఏఆర్ రెహమాన్‌తో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఒక గొప్ప అవకాశం. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను" అని తెలిపింది. చదవండి: కడుపుతో ఉన్న భార్య కోసం ఆరాటం.. జైల్లో ఉండగా నటుడు ఏం చేశాడంటే? -
ఛావాపై వివాదాస్పద ట్వీట్.. హీరోయిన్‌పై ఓ రేంజ్లో నెటిజన్స్ ఫైర్!
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన ట్వీట్స్ వివాదానికి దారితీశాయి. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన తాజా చిత్రం ఛావా గురించి ఆమె చేసిన పోస్టులపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహాకుంభ్ మేళాలో జరిగిన తొక్కిసలాటను పోలుస్తూ ఛావా మూవీపై విమర్శలు చేసింది. ఇటీవల జరిగిన తొక్కిసలాట కంటే దాదాపు 500 ఏళ్ల క్రితం హిందువులను హింసించినట్లు కల్పిత కథలనే ప్రజలు నమ్ముతారంటూ స్వర భాస్కర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా అలాంటి వాటిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అది కాస్తా వివాదానికి దారితీయడంతో నటిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్స్.స్వర భాస్కర్ చేసిన పోస్ట్‌పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి మన వీరుల చరిత్రతో ఆటలు ఆడుకోవద్దని సూచిస్తున్నారు. ఓ నెటిజన్ ఆమెకు రిప్లై ఇస్తూ.. నేను ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్రను అభ్యసించా. ఔరంగజేబ్ చేతిలో శంభాజీ మహరాజ్ చిత్రహింసలతోనే మృతి చెందారనడంలో ఎలాంటి కల్పితాలు లేవు. దయచేసి మీ ఆలోచన విధానంపై ఒకసారి పునరాలోచించుకోండి అంటూ చురకలంటించాడు. (ఇది చదవండి: ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?)హిందువులపై ఔరంగజేబ్ చిత్రహింసలను కల్పితం అనడం.. శంభాజీ మహరాజ్ ప్రాణత్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడేందుకు మీకెంత ధైర్యం? ఛత్రపతి శివాజీ జయంతి రోజున మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. కోట్లాది మంది భారతీయుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ఓ నెటిజన్ స్వర భాస్కర్‌పై మండిపడ్డాడు. ఛత్రపతి శంభాజీ రాజ్ అనుభవించిన హింసలో ఒక భాగాన్ని ఈ చిత్రంలో చూపించలేదని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. కాగా.. నటి స్వర భాస్కర్.. ఫహాద్ ఆహ్మద్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలాసార్లు తన వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తూనే ఉంది..బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఛావా. మడాక్ ఫిలింస్ పతాకంపై దినేష్ విజన్ నిర్మించారు. శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శంభాజీగా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించగా.. రష్మిక మందన్న మహారాణి యేసుబాయిగా కనిపించింది. అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ పాత్రలో నటించారు. ఈ చిత్రం శివాజీ సావంత్ రచించిన మరాఠీ నవల 'ఛావా' ఆధారంగా రూపొందించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.A society that is more enraged at the heavily embellished partly fictionalised filmy torture of Hindus from 500 years ago than they are at the horrendous death by stampede & mismanagement + then alleged JCB bulldozer handling of corpses - is a brain & soul-dead society. #IYKYK— Swara Bhasker (@ReallySwara) February 18, 2025 -
శివాజీ వారసుడిపై అభ్యంతరకర కంటెంటా?
ముంబై: వికీపీడియాపై మరాఠాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ వారసుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి అభ్యంతకర కంటెంట్‌ను పోస్ట్ చేయడమే అందుకు కారణం. శంభాజీ జీవిత వృత్తంగా తెరకెక్కిన ఛావా(Chhaava) చిత్రం థియేటర్లలలో ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. శివాజీ తనయుడు, మరాఠా సామ్రాజ్యపు రెండో ఛత్రపతి అయిన శంభాజీ మహరాజ్(Sambhaji Maharaj) గురించి వికీపీడియాలో అభ్యంతరకర సమాచారం పోస్ట్ అయ్యింది. ఈ విషయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి వెళ్లింది. దీంతో కంటెంట్ తొలగింపు దిశగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో ముంబై సైబర్ సెల్ వికీపీడియా(Wikipedia)కు నోటీసులు జారీ చేసింది. ఆ కంటెంట్‌ను తొలగించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు సున్నితమైన ఇలాంటి అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఎడిట్ చేయగలిగే వికీపీడియాలో.. ఎడిటోరియల్ నియంత్రణ లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. వికీపీడియాకు కిందటి ఏడాది కేంద్ర ప్రభుత్వం సైతం నోటీసులు జారీ చేసింది. కచ్చితత్వం లేని సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు నోటీసులు ఇచ్చింది. మరాఠా సామ్రాజ్య పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత కథను.. ‘ఛావా’ పేరిట భావోద్వేగపూరిత చిత్రంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తీర్చిదిద్దాడు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ‘ఛావా’లో శంభాజీగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) జీవించేయేగా.. శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా ఆకట్టుకున్నారు. -
‘చరిత్ర’లో శంభాజీ గురించి ఎందుకు చెప్పలేదు: మాజీ క్రికెటర్ ప్రశ్న
బాక్సాఫీస్ వద్ద హిందీ చిత్రం ‘ఛావా’(Chhaava Movie) దూసుకెళ్తోంది. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం తొలి రోజే రూ.31 కోట్లు వసూళ్లు సాధించింది. రిలీజ్ రోజే హిట్ టాక్ రావడంతో వసూళ్లు అమాంతం పెరిగాయి. ఇప్పటి వరకు రూ.121 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కలెక్షన్ల సంగతి పక్కన పెడితే.. ఈ మూవీపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారంటూ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌ని పొగిడేస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన ఇండియన్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఎక్స్ వేదికగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే కొన్ని ఆసక్తికర ప్రశ్నలు లేవనేత్తారు.‘ఈ రోజే ఛావా చిత్రం చూశాను. ధైర్యం, నిస్వార్థం, వృత్తిపట్ల ఉన్న అంకితభావం ఉన్న గొప్ప కథ ఇది. నిజాయతీగా ఒక ప్రశ్నలు అడగాలనుకుంటున్నా.. ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర స్కూల్లో ఎందుకు నేర్పించలేదు? పాఠ్య పుస్తకాల్లో ఆయన గురించి ఎక్కడ ప్రస్తావించలేదు? కానీ అక్బర్ గొప్ప నాయకుడు, న్యాయంగా పాలించిన చక్రవర్తి అని మనం నేర్చుకున్నాం. అంతేకాదు ఢిల్లీలోకి ఓ రహదారికి ఔరంగజేబు రోడ్డు అని పేరు కూడా పెట్టుకున్నాం. అలా ఎందుకు జరిగింది?అని తన ఎక్స్ ఖాతాలో ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు.ఆకాశ్ చోప్రా ట్వీట్‌పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆకాశ్ ట్వీట్‌ని సమర్థిస్తుండగా..మరికొంతమంది మాత్రం ఇలాంటి వివాదాలు సృష్టించే ట్వీట్స్ చేయొద్దని విమర్శిస్తున్నారు. ‘చరిత్ర తెలుసుకోవడానికి సినిమా ఎప్పుడూ నమ్మదగిన మాధ్యమం కాదు. ఎవరు ఏ ఏ స్థాయిలో కృషి చేశారనే చరిత్ర మొత్తం చూస్తే అర్థం అవుతుంది. మౌర్య/గుప్త సామ్రాజ్యాలు, అక్బర్, ఔరంగజేబు, శివాజీ సహజంగానే శంభాజీ కంటే ఎక్కువ ప్రాధాన్యతతను పొందారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘చరిత్ర తెలుసుకో ఆకాశ్’ అని మరో నెటిన్ కామెంట్ చేయగా.. ‘నేను హిస్టరీలో టాపర్‌ని. చరిత్రలో నాకు 80 శాతం మార్కులు వచ్చాయి’ అని ఆకాశ్ రిప్లై ఇచ్చాడు. Watched Chhaava today. Incredible tale of bravery, selflessness and the sense of duty. Genuine question—why were we not taught about Chattrapati Sambhaji Maharaj at all in school? Not even a mention anywhere!!! We did learn though how Akbar was a great and fair emperor, and…— Aakash Chopra (@cricketaakash) February 17, 2025 -
చావా హిట్‌తో మరింత పెరిగిన నేషనల్ క్రష్ క్రేజ్..
-
'ఛావా' సినిమా చూసి కన్నీళ్లతో ప్రేక్షకులు.. వీడియోలు వైరల్
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal), రష్మిక (Rashmika) జోడీగా నటించిన చిత్రం 'ఛావా'.. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆయన భార్యగా, మహారాణి యేసుబాయిగా రష్మిక మందన్న నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే రూ. 86 కోట్లు రాబట్టింది.1689 సమయంలో మొఘల్ చక్రవర్తి ఔరం గజేబు మరాఠా సామ్రాజ్యంపై దండెత్తిన సమయంలో తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి వారు చూపిన ధైర్యసాహసాలను కళ్ళకు కట్టినట్లు దర్శకుడు చూపారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ చూసిన ప్రేక్షకుల కంటతడి పెట్టుకుంటున్నారు. చాలా ఎమోషనల్‌గా తమ అభిప్రాయాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మూవీ చూసిన వారిలో ఎక్కువ భాగం కన్నీళ్లతోనే బయటకు వస్తున్నారు. థియేటర్లోనే శంభాజీ మహరాజ్‌ను గుర్తు చేసుకుంటూ కేకలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియా వేదికగా ఛావా సినిమాపై భారీగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శంభాజీ మహరాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయిగా రష్మికల నటన పట్ల పాజిటివ్ టాక్ వస్తుంది. చివరి 40 నిమిషాలు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లారంటూ మెచ్చుకుంటున్నారు. బుక్‌మైషోలో రోజుకు 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. బాలీవుడ్లో ఎక్కడ చూసిన కూడా హోస్‌ఫుల్ బోర్డులతో థియేటర్స్ కనిపిస్తున్నాయి.Ek Maratha sherni ka garjan🔥#ChhatrapatiSambhajiMaharaj #Chaava pic.twitter.com/E1249nucNc— Peddoda🔱🚩 (@_peddodu) February 15, 2025Chaava is not just a movie it's an emotion,pain ,our HISTORY It is difficult to watch on screen imagine how much our Raje tolerated n suffered... #Chaava #ChaavaReview pic.twitter.com/Vv5YtD4hX9— Harsha Patel 🇮🇳 (@harshagujaratan) February 15, 2025Just watched #Chaava, a powerful tribute to Sambhaji's bravery & struggle for Hindutva. A must-know chapter in Indian history! Jai Hind! #IndianHistory #Hindutva pic.twitter.com/Cudc1u4t78— Neha Chandra (@nehachandra800) February 15, 2025The most unfortunate thing about being a south indian the I'd not be able to feel these goosebumps in real with all theses doomed circle.of mine 😭 #Chaava #VickyKaushal#HarHarMahadevॐpic.twitter.com/MTNwYkvZkY— AlteredO (@AlteredDrift)When the audience of a film is giving it a standing ovation even after it's ended, then that film doesn't need anyone's review or rating. #Chhaava has won people's hearts. @iamRashmika @vickykaushal09 @MaddockFilms #AkshayKhanna #RashmikaMandanna ❤️ #VickyKaushal ❤️ pic.twitter.com/bqbuN1qWj5— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) February 15, 2025ref_src=twsrc%5Etfw">February 16, 2025 Yesterday when I went to a movie theater there was a poster of Chhava movie and some young boys were taking pictures on that poster when I looked at them they had no slippers on their feet and they were taking pictures. @vickykaushal09 @iamRashmika #chavaa #VickyKaushal #Chhaava pic.twitter.com/PhTXmh7ama— Sumit kharat (@sumitkharat65) February 15, 2025 -
Chhaava OTT Release : ఓటీటీలోకి ‘ఛావా’.. ఎప్పుడు, ఎక్కడ?
ఛావా(Chhaava )..ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. విక్కీ కౌశల్, రష్మిక(Rashmika Mandanna) జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో రిలీజై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక నటించి మెప్పించారు. దాదాపు రూ.130 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ రోజే మంచి కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.31 కోట్లు ఓపెనింగ్స్‌ని రాబట్టింది. ఈ ఏడాదిలో బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్(రూ.31 కోట్లు) సొంతం చేసుకున్న చిత్రంగా ఛావా నిలిచింది. అంతేకాదు విక్కీ కౌశల్ కెరీర్లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఛావా రికార్డుకెక్కింది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సంపాదించుకోవడంతో ఓటీటీ రిలీజ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.భారీ ధరకు ఓటీటీ రైట్స్ఛావా చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. సినిమాకు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని డిజిటల్ రైట్స్‌ని భారీ ధరకే కొనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్. యావరేజ్ టాక్ వస్తే నెల రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారట. కానీ ఊహించని విధంగా భారీ హిట్ టాక్ రావడంతో ఓటీటీ రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఎనిమిది వారాల తర్వాత ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అంటే ఏప్రిల్ మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.ఛావా కథేంటంటే..ఛత్రపతి శివాజీ మరణం మరాఠా సామ్రాజ్యంపై మొగల్ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) కన్నేస్తాడు. వారిని ఎదుర్కొని తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు రంగంలోకి దిగుతాడు శంభాజీ మహారాజ్(విక్కీ కౌశల్). ఈ విషయం ఔరంగజేబుకు తెలిసి తానే స్వయంగా సైన్యంతో యుద్ధానికి బయల్దేరుతాడు. శక్తిమంతమైన మొగల్ సేనను శంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ యుద్దంలో సంభాజీకి ఆయన సతీమణి మహారాణి ఏసుభాయి(రష్మిక) ఎలాంటి నైతిక మద్దతు ఇచ్చారు? చివరకు మొఘల్ అహంకారాన్ని తన పోరాటంతో ఎలా అణచివేశాడు? అనేది ఈ సినిమా కథ. -
నోరు జారిన రష్మిక.. ఫైర్ అవుతున్న కన్నడ ప్రజలు!
నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna)పై కర్ణాటక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన ఊరిని మర్చిపోయావంటూ ఆమెపై మండిపడుతున్నారు. దీనికి కారణం ‘ఛావా’(Chhaava) ప్రమోషన్స్ ఈవెంట్లో రష్మిక చేసేన వ్యాఖ్యలే. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన హిందీ చిత్రం ‘ఛావా’. ఈ మూవీ ఈ నెల 14న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. రిలీజ్‌కి ముందు ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో రష్మిక పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పింది. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో చర్చకు దారీ తీశాయి. పుట్టిన ప్రాంతం(కర్ణాటక) పేరు చెప్పడానికి రష్మికకు వచ్చిన సమస్య ఏంటంటూ కన్నడ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: బాక్సాఫీస్‌పై ‘ఛావా’ దండయాత్ర.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్, ఎన్ని కోట్లంటే..?)కర్ణాటకలోని కొడగు జిలా విరాజ్ పేట రష్మిక జన్మస్థలం. కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో ఆమె చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఛలో’తో తెలుగులోకి అడుగుపెట్టింది. గీత గోవిందం సినిమాలో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో వరస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ లిస్ట్‌లోకి చేరిపోయింది. పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్‌గా మారింది.(చదవండి: తమన్‌కి ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇచ్చిన బాలయ్య.. ధర ఎంతంటే?)అయితే ఛావా ప్రమోషనల్ ఈవెంట్లో తన సొంతూరు హైదరాబాద్ అన్నట్లుగా మాట్లాడడంతో కన్నడ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని తెలియజేస్తూ రష్మికను ట్రోల్ చేస్తున్నారు. వరుస హిట్లు వచ్చే సరికి సొంతూరును మర్చిపోవడం సరైన పద్దతి కాదంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కాగా, గతంలోనూ రష్మికపై ఇలాంటి ట్రోలింగే జరిగింది. పుష్ప రిలీజ్ సమయంలో తన తొలి సినిమా కిరిక్ పార్టీ నిర్మాణ సంస్థ పేరును చెప్పకుండా...‘పేపర్లో వచ్చిన తన ఫొటో చూసి ఓ నిర్మాణసంస్థ తనకు హీరోయిన్గా అవకాశం ఇచ్చింది’ అని రష్మిక చెప్పడంతో నెటిజన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మిక నటించిన సినిమాలను బ్యాన్ చేయాలంటూ అప్పట్లో ట్వీట్స్ చేశారు. మళ్లీ చాలా రోజుల తర్వాత రష్మిక ట్రోలింగ్కి గురైంది. దీనికి ఈ నేషనల్ క్రష్ ఎలా స్పందిస్తుందో చూడాలి. '@iamRashmika, I sometimes feel pity for you for receiving unnecessary negativity/targeting from our fellow Kannadigas. But when you make statements like this I think they are right and you deserve the backlash.👍#Kannada #Chaava #RashmikaMandanna pic.twitter.com/RBY7RcpHgP— Virat👑Rocky✨️ (@Virat_Rocky18) February 14, 2025 -
బాక్సాఫీస్‌పై ‘ఛావా’ దండయాత్ర.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్!
విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఛావా’(Chhaava Movie). మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి..తొలి రోజే హిట్ టాక్‌కి అందుకుంది. విక్కీ యాక్టింగ్‌తో పాటు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మేకింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా అద్భుతంగా తీశారని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజే ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. మొదటి రోజు ఈ చిత్రం దాదాపు రూ.31 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా వేశాయి. ఈ ఏడాదిలో బాలీవుడ్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్. విక్కీ కౌశల్ కెరీర్లోనే ఈ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన తొలి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది. గతంలో విక్కీ నటించిన సినిమాలలో తొలి రోజు అత్యధికంగా బాడ్ న్యూజ్(2024) రూ.8.62 కోట్లు, సామ్ బహదూర్ రూ.5.75 కోట్లు, జరా హాట్కే జరా బచ్కే రూ.5.49 కోట్లు సాధించాయి. ఛావా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.విక్కీపై ప్రశంసలు..‘ఛావా’విజయంలో విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషించాడు. శంభాజీగా విక్కీ కౌశల్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించాడని పలు వెబ్‌సైట్స్ తమ రివ్యూలో తెలిపాయి. వార్ యాక్షన్స్ అదరగొట్టేశాడట. క్లైమాక్స్ ఫైట్ సీన్లో వీక్కీ రుద్ర తాండవం చేశాడని చెబుతున్నారు. శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఉటేకర్ ఎంచుకున్న పాయింట్లో గొప్ప కథ, ఊహించని ట్విస్ట్‌లు లేకపోయినా శంభాజీ పాత్ర, యాక్షన్ సీక్వెన్స్ సినిమాను నిలబెట్టాయి.