
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘ఛావా’. విక్కీ కౌశల్, రష్మికా మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ నేడు విడుదల చేస్తోంది.
‘‘ఛావా’ తెలుగు ట్రైలర్ దాదాపు 5 మిలియన్ల వ్యూస్ సాధించింది. తెలుగులో 550కి పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ‘‘ఛావా’ పట్ల తెలుగువారి అద్భుతమైన సపోర్ట్, ప్రేమకు కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకు వస్తున్నందుకు మేము గర్విస్తున్నాం. శంభాజీ మహారాజ్ కీర్తి, అజేయమైన శౌర్యం, త్యాగాన్ని చూసే అవకాశం మీకు లభిస్తుంది... అలాగే మీ హృదయాలను తాకుతుంది. ఈ చిత్రాన్ని మీరందరూ బిగ్ స్క్రీన్‌పై ఎక్స్‌పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను’’ అంటూ విక్కీ కౌశల్ ఓ వీడియో విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment