Chhatrapati Shivaji
-
ఛత్రపతి శివాజీగా తెలుగు హీరోలు, AI ఫోటోలు చూశారా?
-
ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన : నిందితుడు దొరికాడు
ముంబై : మహారాష్ట్రలో 35 అడుగుల మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన ఘటనలో విగ్రహ తయారీ దారుడు జయదీప్ ఆప్టేను పోలీసులు అరెస్ట్ చేశారు. జయదీప్ ఆప్టే ప్రస్తుతం రాష్ట్ర డీసీపీ కార్యాలయంలో పోలీసు కస్టడీలో ఉన్నారు. గత నెల ఆగస్ట్ 26న సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో ఏర్పాటు చేసిన 35 అడుగుల శివాజీ విగ్రహం కూలిపోయింది. ఈ ఘటన జరిగిన అనంతరం ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరాఠా యోధుడి విగ్రహం ఏర్పాటులో అవినీతి జరిగిందని, నిందితుల్ని అరెస్ట్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో తనని పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంతో జయదీప్ పరారయ్యాడు. ఎట్టకేలకు కణ్యాణ్ ప్రాంతంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.అనుభవం లేకుండా విగ్రహం తయారీమహరాష్ట్రలో దుమారం రేపుతున్న శివాజీ విగ్రహం కూలిన ఘటనపై జయ్‌దీప్ గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. కల్యాణ్ ప్రాంతంలో విగ్రహాల తయారీ సంస్థను నిర్వహిస్తున్న జయ్‌దీప్‌కు అనుభవం లేదని పోలీసులు గుర్తించారు. చిన్న చిన్న విగ్రహాలు తయారు చేసిన అనుభవం ఉన్న జయ్‌దీప్ 30 అడుగుల భారీ విగ్రహాన్ని ఎలా తయారు చేశారనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. అనుభవం లేకపోవడం, ఫలితంగా విగ్రహం కూలిపోవడంపై పోలీసులు జయ్దీప్పై కఠిన చర్యలు తీసుకోనున్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ విగ్రహం కూలిపోవడంతో ఇప్పటికే మహరాష్ట్ర పోలీసులు జయదీప్ ఆప్టే, నిర్మాణ సలహాదారు చేతన్ పాటిల్‌పై భారతీయ న్యాయ సంహిత చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఆగస్టు 31న పాటిల్‌ను అరెస్టు చేయగా..ఆప్టేపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అనంతరం, సింధుదుర్గ్ పోలీసులు బృందాలుగా విడిపోయి జయ్దీపై కోసం ముంబై, థానే, కొల్హాపూర్‌తో సహా పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు అరెస్ట్ చేశారు. రాజకీయ దుమారంమరికొన్ని రోజుల్లో మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ కూలిపోవడంపై రాజకీయ దుమారం చెలరేగింది. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. విగ్రహ నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.236 కోట్లు కేటాయించినప్పటికీ కేవలం రూ.1.5 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇంత భారీ నిర్మాణాన్ని రూపొందించడంలో అనుభవం లేకపోయినా జయదీప్‌కు ఇంత ముఖ్యమైన కాంట్రాక్టు ఎలా ఇచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్కనారు. -
ప్రధాని మోదీలో అహంకారాన్ని చూశారా? : ఉద్ధవ్ ఠాక్రే
ముంబై : ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై మహరాష్ట్రలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఇందులో భాగంగా హుతాత్మ చౌక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు విపక్ష నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మహారాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు.విగ్రహం కూలిపోవడంపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు. అయితే మోదీ క్షమాపణలపై మహరాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు.మోదీ క్షమాపణల్లో మీరు అహంకారాన్ని చూశారా? ప్రధాని ఎందుకు క్షమాపణలు చెబుతున్నారు. ఎనిమిది నెలల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం కూలిపోయినందుకా? లేదంటే విగ్రహం నిర్మాణంలో అవినీతి చోటు చేసుకున్నందుకా? అని ప్రశ్నలు కురిపించారు. శివాజీ మహారాజ్‌ను అవమానించిన శక్తులను ఓడించడానికి ఎంవీఏ క్యాడర్ కలిసి పనిచేయాలి అని పిలుపునిచ్చారు. ఇక శివాజీ విగ్రహం కూలిపోవడంపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని వ్యాఖ్యానించిన సీఎం ఏక్నాథ్ షిండే వ్యాఖ్యలపై ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. మేం రాజకీయాలు చేస్తున్నామని ప్రభుత్వం చేస్తుంది. మేం రాజకీయాలు చేయడం లేదు. రాష్ట్ర కీర్తి కోసం పోరాడుతున్నాం. మహాయుతి ప్రభుత్వానికి గెట్ అవుట్ చెప్పడానికి మేము గేట్‌వే ఆఫ్ ఇండియాకు వచ్చాము’అని హెచ్చరించారు. -
‘వాళ్లకి కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు’: ప్రధాని మోదీ
ముంబై : చత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. శిరస్సు వంచి క్షమాపణలు చెప్పారు.మహరాష్ట్రలో రూ.76వేల కోట్లతో నిర్మించనున్న వాడ్‌వాన్ పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ కూలిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ‘మనమంతా ఛత్రపతి శివాజీని దేవుడిలా కొలుస్తాం. కొందరు వ్యక్తులు దేశ భక్తులను అవమానిస్తున్నారు. వీర సావర్కర్‌ను కూడా ఇష్టారీతిగా తిట్టిపోశారు. దేశభక్తులను అవమానించినవారు క్షమాపణలు చెప్పాల్సిందే. సమరయోధులను గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం కూడా వారికి లేదు. కానీ క్షమాపణలు చెప్పకుండా కోర్టుకు వెళ్లి పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారని’ ధ్వజమెత్తారు.నా కొత్త ప్రయాణం ప్రారంభమైంది అప్పుడే 2013లో బీజేపీ నన్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. ప్రకటన అనంతరం నేను చేసిన మొదటి పని రాయ్‌గఢ్‌లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధిని భక్తుడిలా సందర్శించా. అప్పటి నుంచే నా కొత్త ప్రయాణం ప్రారంభమైందని’ మోదీ అన్నారు. ముందు ఒక భక్తుడిగా కూర్చుని కొత్త ప్రయాణం ప్రారంభించడం” అని మోదీ పాల్ఘర్లో అన్నారు.#WATCH | Palghar, Maharashtra: PM Narendra Modi speaks on the Chhatrapati Shivaji Maharaj's statue collapse incident in MalvanHe says, "...Chhatrapati Shivaji Maharaj is not just a name for us... today I bow my head and apologise to my god Chhatrapati Shivaji Maharaj. Our… pic.twitter.com/JhyamXj91h— ANI (@ANI) August 30, 2024 -
వెండితెరపై ఛత్రపతి శివాజీ వీరగాధ.. భర్త దర్శకత్వం, భార్య నిర్మాత!
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ బయోపిక్‌కి శ్రీకారం జరిగింది. ఈ మహా రాజ్ జయంతి (ఫిబ్రవరి 19) సందర్భంగా ‘రాజా శివాజీ’ టైటిల్‌తో బయోపిక్ రూపొందించనున్నట్లు రితేష్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. ఈ జీవిత చరిత్రలో టైటిల్ రోల్ చేయడంతో పాటు రితేష్ దర్శకత్వం కూడా వహించనున్నారు. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది పేరు మాత్రమే కాదు ఒక భావోద్వేగం. ఈ మట్టిలో పుట్టిన ఈ మాణిక్యానికి నా నివాళులు. ఆయన వారసత్వం రాబోయే తరా లకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మా ఈ నూతన ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు కావాలి.. జై శివరాయ్’’ అని పేర్కొన్నారు రితేష్. కాగా, రెండేళ్ల క్రితం దర్శకుడిగా తొలి చిత్రం ‘వేద్’ (మరాఠీ)ని తెరకెక్కించి విజయం సాధించారు రితేష్. మలి ప్రయత్నంగా ఛత్రపతి శివాజీ వంటి భారీ బయోపిక్‌ను రూపొందించనున్నారు. మరాఠీ, హిందీ భాషల్లో జియో స్టూడియోస్ సమర్పణలో ముంబై ఫిల్మ్ కంపెనీ బేనర్ నిర్మించనున్న ఈ చిత్రానికి రితేష్ భార్య, నటి జెనీలియా ఓ నిర్మాత. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. -
భారత్‌కు శివాజీ ఆయుధం
ముంబై–లండన్: ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని లండన్ మ్యూజియంలో ఉన్న ఆయన ఆయుధాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకురానుంది. 17వ శతాబ్దంలో శివాజీ వాడిన పులిగోళ్లు ఆకారంలో ఉండే ఆయుధాన్ని వెనక్కి తీసుకురావడానికి లండన్‌లోని విక్టోరియా అల్బర్ట్ మ్యూజియం, మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఇనుముతో తయారు చేసిన అత్యంత పదునైన వాఘ్ నఖ్ (పులి గోళ్లు) ఆయుధాన్ని శివాజీ ఎక్కువగా వాడేవారు. ఆ ఆయుధాన్ని చేత్తో పట్టుకొని మహారాజా శివాజీ కదనరంగంలో స్వైరవిహారం చేస్తూ ఉంటే శత్రువులు గడగ డలాడిపోయేవారు. బీజాపూర్ సేనా నాయ కుడు అఫ్జల్ ఖాన్‌ను శివాజీ ఈ పులిగోళ్ల ఆయుధంతో చంపాడని చరిత్ర చెబుతోంది. తెల్లదొరల పాలనా కాలంలో 1818లో ఈస్ట్ ఇండియాకు చెందిన అధికారి జేమ్స్ గ్రాండ్ డఫ్ పులి గోళ్ల ఆయుధాల సెట్‌ను విక్టోరియా అల్బర్ట్ మ్యూజియానికి ఇచ్చేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత శివాజీ వాడిన ఆయుధం మన దేశానికి రానుంది. ఛత్రపతి శివాజీ పట్టాభి షిక్తుడై అక్టోబర్ 3నాటికి 350 ఏళ్లు పూర్తి కానున్నాయి. అదే రోజు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ ఒప్పంద పత్రాలపై సంతకం చేయనున్నారు. -
ఛత్రపతి శివాజీ ప్రారంభించారు.. మోదీ కొనసాగిస్తున్నారు: అమిత్ షా
పుణే: మొగలులు, ఇతర విదేశీ దురాక్రమణదారులు ధ్వంసం చేసిన ఆలయాలను ఛత్రపతి శివాజీ పునర్నిర్మించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్లాఘించారు. మరాఠా యోధుడు ప్రారంభించిన ఆ పనిని ప్రధాని మోదీ నేడు కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడేందుకే శివాజీ తన జీవితాన్ని పణంగా చెప్పారన్నారు. పుణేలోని నర్హే–అంబేగావ్‌లో శివాజీ జీవితగాథ ఆధారంగా ‘శివసృష్టి’ ఇతివృత్తంతో 21 ఏకరాల్లో ఏర్పాటవుతున్న పార్క్ మొదటి దశను అమిత్ షా ప్రారంభించారు. ‘శివాజీ అనంతరం ధ్వంసమైన ఆలయాల పనర్నిర్మాణాన్ని ప్రధాని కొనసాగిస్తున్నారు. పలు దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు’అన్నారు. శివాజీ ఆశీస్సులతో విల్లు, బాణం: షిండే ఛత్రపతి శివాజీ ఆశీస్సులతో తమకు శివసేన ఎన్నికల గుర్తు ‘విల్లు, బాణం’ లభించిందని కార్యక్రమంలో పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. శివసృష్టి ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దుతామని షిండే చెప్పారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, అమిత్ షా తమ వెనక కొండంత అండగా నిలిచారని శనివారం ఆయన పేర్కొనడం తెలిసిందే. -
ఛత్రపతి శివాజీగా అక్షయ్ కుమార్.. వద్దంటూ నెటిజన్స్ ట్రోల్!
మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా మరాఠీలో ‘వేడాట్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీగా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటిస్తున్నారు. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆరంభమైంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఛత్రపతి శివాజీగా నటించడం అనేది చాలా పెద్ద బాధ్యత. నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను’’ అని పేర్కొన్నారు అక్షయ్ కుమార్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. కాగా హిందీలో హీరోగానూ, ప్రత్యేక పాత్రలు చేసిన చిత్రాలు, దక్షిణాదిన చేసిన రెండు మూడు చిత్రాలతో కలుపుకుని అక్షయ్ 150 చిత్రాలకు చేరువలో ఉన్నారు. ఇప్పుడు మరాఠీలో మెయిన్ లీడ్ యాక్టర్‌గా అక్షయ్‌కు ‘వేడాట్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ తొలి చిత్రం కావడం విశేషం. కాగా, చత్రపతి శివాజీ పాత్రని అక్షయ్ కుమార్ పోషించొద్దని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’లో నటించి పృథ్వీ రాజ్ చౌహాన్ పాత్రని చెడగొట్టాడని, ఇప్పుడు మరొక చారిత్రక పాత్రను పాడు చేస్తారా ఏంటి? అని ట్రోల్ చేస్తున్నారు. आज मराठी फ़िल्म ‘वेडात मराठे वीर दौड़ले सात’ की शूटिंग शुरू कर रहा हूँ जिसमें छत्रपति शिवाजी महाराज जी की भूमिका कर पाना मेरे लिये सौभाग्य है।मैं उनके जीवन से प्रेरणा लेकर और माँ जिजाऊ के आशीर्वाद से मेरा पूरा प्रयास करुंगा ! आशीर्वाद बनाए रखियेगा। pic.twitter.com/MC50jCdN8Z — Akshay Kumar (@akshaykumar) December 6, 2022 -
మహోజ్వల భారతి: ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం
జూన్ 6, 1674 న రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీ తనను తను ‘ఛత్రపతి’గా ప్రకటించుకున్నారు. ఛత్రపతి అయ్యాక 50 వేల బలగాలతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న రాయఘడ్ కోటలో మరణించారు. ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే 1927 ఫిబ్రవరి 19న జన్మించారు. పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని డీకొన్నారు. శివాజీ తండ్రి షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవారు. అయితే నిజాంషాహీ ప్రభువు తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధుణ్ణి హత్య చేయించడంతో అది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికారు. శివాజీ లౌకిక పాలకుడు. అన్ని మతాలకు అనుకూలంగా ఉండి, అన్ని మతాల ప్రజలను సమానంగా చూసుకునేవారు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవానికి నోచుకున్నారు. భారత స్వాతంత్య్రోద్యమానికి, శివాజీ జీవించిన కాలానికి సంబంధం లేకున్నా.. ఆయన వ్యక్తిత్వం ఆ తర్వాతి కాలాలకు ఒక స్ఫూర్తిగా ఉంటూ వచ్చింది. -
విలువైన భోజనం
ఒకసారి ఛత్రపతి శివాజీ ఆగ్రాపై దండయాత్ర అనంతరం తిరిగి తన రాజ్యానికి వెళుతున్నాడు. మార్గమధ్యంలో తన రాజ్యంలోని ఒక గ్రామంలో విశ్రాంతి తీసుకున్నాడు. తీవ్రమైన అలసటతో, ఆకలితో ఉండడం వల్ల దగ్గరలోని ఒక ఇంటికి వెళ్లి ఆ గృహిణిని ఆహారం పెట్టమని కోరాడు శివాజీ. సాధువు వేషంలో ఉన్న శివాజీని ఆ ఇల్లాలు గుర్తించలేదు. కాసేపు ఆగితే వంట చేసి భోజనం వడ్డిస్తానని చెప్పింది ఆదరంగా. ఎదురు చూస్తూ కూర్చున్నాడు శివాజీ. కాసేపటికి శివాజీని పిలిచి అరటి ఆకు వేసి అందులో అన్నం వడ్డించింది. పాత్రలో పప్పు పెట్టింది. కుంభంలా ఉన్న అన్నం మీద పప్పు పోసుకున్నాడు శివాజీ. అరటి ఆకుకు అంచులు లేనందున అన్నం మీద నుండి పప్పు ఆకు బయటకు పారింది. ఆ దృశ్యం చూసిన గృహిణి ‘‘నువ్వూ మన రాజుగారు శివాజీ లానే చేస్తున్నావే! అరటి ఆకు మీద నుండి పప్పు బయటకు పోకుండా చుట్టూ అన్నంతో కట్టుకట్టాలని తెలియదా?’’ అని అడిగింది. శివాజీ ఉలిక్కిపడ్డాడు. తరువాత సంతృప్తిగా భోజనం ముగించి గృహిణికి కృతజ్ఞతలు చెప్పుకుని బయల్దేరాడు. శివాజీ రాజ్యాన్ని అయితే విస్తరించాడు కానీ రాజ్యం చుట్టూ సరైన ఎల్లలు నిర్మించి కట్టుదిట్టం చేయకపోవడం వలన తరచూ శత్రువులు రాజ్యంలో సులువుగా ప్రవేశించి దాడులు జరిపేవారు. తనకు ఆతిథ్యం ఇచ్చిన ఆమె పలికిన మాటలు శివాజీ పొరపాటుని ఎత్తి చూపించడమే కాకుండా కర్తవ్యాన్ని బోధించాయి. కొన్నిసార్లు విలువైన పాఠాలు కూడా మామూలు సందర్భాలలోనే జనించి ఊహించని మేలు చేస్తాయని మనసులో అనుకున్నాడు శివాజీ. – అమ్మాజీ గుడ్ల -
లక్ష్యాధికారులు
ప్రపంచంలో లక్షాధికారులు చాలామందే ఉంటారు. లక్షల సంపద పోగేసుకున్న వారు కాదు, చెక్కుచెదరని లక్ష్యశుద్ధి ఉన్నవారు మాత్రమే ప్రజలకు మార్గదర్శకులు కాగలరు. అలాంటి వారే లక్ష్యాధికారులు అవుతారు. ప్రజల మీద అపారమైన ప్రేమతో, పీడన నుంచి, దోపిడీ నుంచి ప్రజలను విముక్తం చేయాలనే ఉన్నత లక్ష్యంతో పోరాటం సాగించిన ధీరోదాత్తులు మాత్రమే చరిత్రలో వీరులుగా నిలిచిపోతారు. అలాంటి వీరులనే ప్రజలు మనస్ఫూర్తిగా మననం చేసుకుంటారు. ఛత్రపతి శివాజీ జయంతి (ఫిబ్రవరి 19) సందర్భంగా కొందరు వీరుల గురించి సంక్షిప్తంగా... ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మహావీరుడు ఛత్రపతి శివాజీ. శివాజీ తండ్రి షాహాజీ ఒక సేనాని. బీజాపూర్ రాజ్యంలోని కొన్ని జాగీర్లపై ఆయనకు ఆధిపత్యం ఉండేది. తల్లి జిజియాబాయి చిన్నప్పుడు శివాజీకి రామాయణ, మహాభారత కథలు, వీరుల గాథలు చెప్పేది. శివాజీపై తల్లి ప్రభావం ఎక్కువగా ఉండేది. సుల్తానుల పాలన నుంచి మరాఠా ప్రజలను విముక్తం చేయాలనే లక్ష్యంతో పోరాటం సాగించి, స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మరాఠాలను ఏకం చేసి బీజాపూర్ సుల్తాను అదిల్షాహీ సేనలతో పలుమార్లు యుద్ధాలు చేశాడు. బీజాపూర్ రాజ్యంలోని భూభాగాన్ని చాలావరకు కైవసం చేసుకుని, 1674లో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరాఠా రాజ్యానికి మొఘల్‌ల నుంచి ముప్పు ఉండటంతో ఔరంగజేబు హయాంలోని మొఘల్ సేనలతో కడవరకు పోరాటం సాగిస్తూనే వచ్చాడు. మహారాణా ప్రతాప్ ఉత్తర భారతదేశంలోని చాలా భాగం బలమైన మొఘల్ సామ్రాజ్యం పరిధిలో ఉన్న కాలంలో మేవార్ రాజ్యాన్ని ఏలిన రాజపుత్రుడు మహారాణా ప్రతాప్. మొఘల్ చక్రవర్తి అక్బర్‌ను ఎదిరించిన ఏకైక వీరుడు. అప్పట్లో గుజరాత్ ప్రాంతం మొఘల్ సామ్రాజ్యం పరిధిలో ఉండేది. మేవార్ మీదుగా గుజరాత్‌కు దగ్గరి రహదారిని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి అక్బర్ చక్రవర్తి చాలా ప్రయత్నాలే చేశాడు. అక్బర్ సేనలు మేవార్ తూర్పు భూభాగాన్ని కొంతవరకు ఆక్రమించుకున్నా, దుర్గమారణ్యాలతో నిండిన పడమటి ప్రాంతాన్ని మాత్రం ఆక్రమించుకోలేకపోయాయి. రాణి దుర్గావతి సామ్రాజ్య విస్తరణ కాంక్షతో దురాక్రమణకు తెగబడ్డ మొఘల్ సేనలను తరిమికొట్టిన వీరవనిత రాణి దుర్గావతి. చందేల్ యువరాణి అయిన దుర్గావతి గోండు రాకుమారుడు దల్పత్షాను పెళ్లాడింది. కొంత కాలానికి వారికి కొడుకు వీర్ నారాయణ్ పుట్టాడు. తర్వాత ఐదేళ్లకే దల్పత్షా మరణించడంతో దుర్గావతి రాజ్యభారాన్ని స్వీకరించింది. మాల్వా రాజు బాజ్ బహదూర్ గోండు రాజ్యంపై యుద్ధానికి దిగి దుర్గావతి సేనల చేతిలో చావు తప్పి కన్ను లొట్టపోయిన రీతిలో బయటపడ్డాడు. ఆ తర్వాత మొఘల్ సేనలు బాజ్ బహదూర్‌ను ఓడించడంతో మాల్వా రాజ్యం మొఘల్ అధీనంలోకి వచ్చింది. మాల్వా సరిహద్దుల్లోనే ఉన్న గోండు రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు మొఘల్ సేనలు దండెత్తినప్పుడు రాణి దుర్గావతి యుద్ధరంగంలోకి దిగి, ఒక దశలో వారిని తరిమి కొట్టింది. మొక్కవోని ధైర్యంతో పోరాటం కొనసాగించింది. చివరకు ఓటమి అనివార్యమవడంతో యుద్ధరంగంలోనే కత్తితో పొడుచుకుని ఆత్మాహుతి చేసుకుంది. రాణి చెన్నమ్మ సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ వారిని ఎదిరించిన వీర వనిత కిట్టూరు రాణి చెన్నమ్మ. తన సొంత రాజ్యానికి రాణి అయింది. దేశాయ్ వంశానికి చెందిన రాజా మల్లసర్జను పెళ్లాడింది. చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యల్లో శిక్షణ పొందింది. రాజా మల్లసర్జ, రాణి చెన్నమ్మ దంపతులకు ఒక కొడుకు పుట్టి చనిపోవడంతో శివలింగప్ప అనే బాలుడిని దత్తత తీసుకుని, అతడిని సింహాసనానికి వారసుడిగా ప్రకటించింది. శివలింగప్ప రాజ్యాధికారం చేపట్టడానికి వీల్లేదంటూ అప్పటి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అభ్యంతరపెడుతూ జారీ చేసిన ఆదేశాలను చెన్నమ్మ పట్టించుకోలేదు. ఆగ్రహించిన బ్రిటిష్ బలగాలు కిట్టూరు ఖజానాను స్వాధీనం చేసుకోవడానికి దాడికి తెగబడ్డాయి. రాణి చెన్నమ్మ వీరోచితంగా బ్రిటిష్ సేనలను ఎదిరించింది. తొలి విడత పోరులో బ్రిటిష్ సేనలు భారీనష్టాన్ని చవిచూశాయి. యుద్ధంలో బ్రిటిష్ కలెక్టర్, రాజకీయ ప్రతినిధి సెయింట్ జాన్ థాకరే మరణించాడు.రెండో విడత పోరులో సబ్‌కలెక్టర్ మన్రో మరణించాడు. రాణి చెన్నమ్మ వీరోచిత పోరాటం సాగించినప్పటికీ, బ్రిటిష్ బలగాలు ఆమెను పట్టి బంధించి, కోటలోనే బందీ చేశాయి. ఆమె ఆ కోటలోనే ప్రాణాలు విడిచింది. రాణి లక్ష్మీబాయి 1857 నాటి మొదటి స్వాతంత్య్ర సమరంలో బ్రిటిష్ సేనలను ఎదిరించిన వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఆమె అసలు పేరు మణికర్ణిక. వారణాసిలో పుట్టింది. ఝాన్సీ రాజు గంగాధరరావును పెళ్లాడటంతో అప్పటి సంప్రదాయం ప్రకారం లక్ష్మీబాయిగా పేరు మార్చుకుంది. పెళ్లయిన పదకొండేళ్లకే భర్త మరణించడంతో రాజ్యభారం స్వీకరించింది. అప్పటికి దత్తపుత్రుడు ఇంకా పసివాడే. లక్ష్మీబాయి భర్త మరణం తర్వాత నాటి బ్రిటిష్ ప్రభుత్వం రాణి అధికారాన్ని గుర్తించ నిరాకరించింది. ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి సేనలను పంపింది. వీరోచిత పోరాటం సాగించిన లక్ష్మీబాయి దత్తపుత్రుడితో సహా కోటను వీడి రాణి మహల్‌కు చేరుకుంది. అక్కడకు వచ్చిన బ్రిటిష్ దూతతో ఝాన్సీని వదులుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. బ్రిటిష్ సేనలతో జరిగిన యుద్ధంలో పోరాడుతూ వీరమరణం పొందింది. వేలు నాచియార్ బ్రిటిష్ వారిని యుద్ధరంగంలో ఎదిరించడమే కాదు, వారిపై విజయం కూడా సాధించిన తొలి వీరనారి వేలు నాచియార్. ఆమె రామ నాథపురం యువరాణి. శివగంగై రాజు ముత్తువడుగణతపెరియ ఉదయదేవర్ను పెళ్లాడింది. వారికి వెల్లాచ్చి అనే కుమార్తె కలిగింది. ఆర్కాట్ నవాబు సేనలు, బ్రిటిష్ సేనలతో జరిగిన యుద్ధంలో నాచియార్ భర్త ఉదయదేవర్ వీరమరణం చెందాడు. భర్త మరణంతో నాచియార్ తన కుమార్తెను తీసుకుని కోట వదిలి దిండిగల్ చేరుకుని, అక్కడే ఎనిమిదేళ్లు అజ్ఞాతంలో గడిపింది. అజ్ఞాతంలో ఉంటూనే సైనిక శక్తిని పోగు చేసుకుంది. దిండిగల్ పాలకుడు గోపాల నాయకర్, హైదర్ అలీల సైనిక సహకారంతో 1780లో బ్రిటిష్ వారిపై యుద్ధానికి దిగింది. వేలు నాచియార్‌కు విశ్వసనీయురాలైన కుయిలి బ్రిటిష్ ఆయుధాగారంపై ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో బ్రిటిష్ బలగాలు బెంబేలెత్తిపోయాయి. యుద్ధంలో గెలుపొందిన వేలు నాచియార్ తిరిగి తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది. నాచియార్ తర్వాత ఆమె కుమార్తె వెల్లాచ్చి శివగంగై రాజ్య బాధ్యతలు చేపట్టింది. కన్నెగంటి హనుమంతు ‘నీరు పెట్టావా, నారు వేశావా, కోత కోశావా, కుప్ప నూర్చావా... ఎందుకు కట్టాలిరా శిస్తు?’ అంటూ బ్రిటిష్ వారి దాష్టీకాలపై గర్జించిన తెలుగు వీరుడు కన్నెగంటి హనుమంతు. బ్రిటిష్ పాలకులు ప్రజల ముక్కుపిండి అన్యాయంగా పన్నులు వసూలు చేయడానికి వ్యతిరేకంగా తిరగబడ్డ కన్నెగంటి హనుమంతు పల్నాడు ప్రాంతంలోని మించాలపాడు గ్రామంలో పుట్టాడు. జనాన్ని కూడగట్టుకుని బ్రిటిష్ వారిపై తిరగబడ్డ హనుమంతు పోలీసుల తూటాలకు నేలకొరిగాడు. హనుమంతు మరణంతో వెల్లువెత్తిన ప్రజాగ్రహం పల్నాడు తిరుగుబాటుకు దారితీసింది. తిరోత్ సింగ్ బ్రిటిష్ వారిపై తొలి స్వాతంత్య్ర పోరాటానికి ముందే వారిని ఎదిరించిన గిరిజన నాయకుడు తిరోత్ సింగ్. బ్రహ్మపుత్ర లోయ ప్రాంతంలో ఖాసీ తెగకు చెందిన తిరోత్ సింగ్ తన ప్రాంత ప్రజల హక్కుల కోసం బ్రిటిష్ వారిపై పోరు సాగించాడు. బ్రిటిష్ వారు తుపాకులు, ఫిరంగులతో యుద్ధానికి దిగితే, తిరోత్ సింగ్ నాయకత్వంలో ఖాసీలు సంప్రదాయ ఆయుధాలతోనే వారిని ఎదిరించారు. తూటా గాయాలకు గురైన తిరోత్ సింగ్ ఒక గుహలో తలదాచుకున్నాడు. ఒక నమ్మకద్రోహి కారణంగా బ్రిటిష్ వారికి బందీగా చిక్కాడు. అతడిని ఢాకాకు తరలించగా, అక్కడే 1835 జూలై 17న కన్నుమూశాడు. బిర్సా ముండా బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన గిరిజన యోధుడు బిర్సా ముండా. ‘అబువా రాజ్ సెతెర్ జానా, మహారాణి రాజ్ తుండు జానా’ (ఇప్పుడిక మన రాజ్యం రావాల్సిందే... మహారాణి రాజ్యం అంతం కావాల్సిందే) నినాదంతో గిరిజనులను ఏకతాటిపైకి తెచ్చి, తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. చక్రధర్పూర్ సమీపంలోని అడవిలో నిద్రిస్తున్న సమయంలో బ్రిటిష్ బలగాలు బిర్సా ముండాను నిర్బంధంలోకి తీసుకుని, రాంచీ జైలుకు తరలించాయి. అక్కడే అతడు 1900 జూన్ 9న అనుమానాస్పదంగా మరణించాడు. ఖుదీరామ్ బోస్ స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా జరిగిన సాయుధ పోరాటంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడు ఖుదీరామ్ బోస్. బెంగాల్ ప్రెసిడెన్సీ చీఫ్ మేజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్‌ఫోర్డ్‌ను హతమార్చడానికి ముజఫర్‌పూర్‌లో చేసిన ప్రయత్నం కూడా విఫలం కావడంతో కాలిబాటన తప్పించుకుని పారిపోతూ వైని స్టేషన్ వద్ద పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద రెండు రివాల్వర్లు, తూటాలు బయటపడ్డాయి. బ్రిటిష్ ప్రభుత్వం అతడికి ఉరిశిక్ష విధించింది. అప్పటికి అతడి వయసు పద్దెనిమిదేళ్లు మాత్రమే. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిని ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. గిరిజనుల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. స్వాతంత్య్రం సాధించడానికి సాయుధ పోరాటమే మార్గమని నమ్మి, కడవరకు పోరాటం సాగించాడు. గిరిజనులను ఏకం చేసి, వారిని పోరుబాట పట్టించాడు. అప్పటి స్పెషల్ కమిషనర్ రూథర్‌ఫర్డ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ బలగాలు సీతారామరాజు ఆచూకీ కోసం మన్యం ప్రజలను నానా హింసలు పెట్టారు. చివరకు ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా పోలీసులు చుట్టుముట్టి ఆయనను నిర్బంధించారు. తర్వాత ఎలాంటి విచారణ లేకుండా చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. బేగమ్ హజ్రత్ మహల్ సిపాయిల తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వారిని ఎదిరించిన వీరనారీమణులలో ఒకరు బేగమ్ హజ్రత్ మహల్. బ్రిటిష్ సేనలు 1856లో అవ«ద్ రాజ్యాన్ని ఆక్రమించుకోవడంతో రాజు వజీద్ అలీ షా కలకత్తాకు చేరుకుని, అక్కడ ప్రవాస జీవితం గడపసాగాడు. అయితే, రాణి హజ్రత్ మహల్ రాజ్యభారాన్ని తన చేతుల్లోకి తీసుకుని, బ్రిటిష్ బలగాలను తిప్పికొట్టి, తన కొడుకు బిర్జిస్ ఖద్రాను అవ«ద్ పాలకుడిగా ప్రకటించింది. కొంతకాలానికి బ్రిటిష్ సేనలు మరిన్ని బలగాలతో విరుచుకుపడి అవ«ద్‌ను ఆక్రమించుకోవడంతో హజ్రత్ మహల్ నేపాల్‌లో ఆశ్రయం పొంది, శేషజీవితాన్ని అక్కడే ముగించింది. తిరుపూర్ కుమరన్ అహింసా మార్గంలో బ్రిటిష్ వారిపై స్వాతంత్య్ర ఉద్యమాన్ని సాగించి ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు తిరుపూర్ కుమరన్. మద్రాసు ప్రెసిడెన్సీలోని చెన్నిమలైకి చెందిన కుమరన్ దేశబంధు యువజన సంఘాన్ని స్థాపించి యువకులందరినీ ఏకం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించాడు. ఒకసారి తిరుపూర్‌లోని నొయ్యల్ నదీ తీరంలో జాతీయ జెండాను చేత పట్టుకుని నిరసన ప్రదర్శన చేస్తుండగా, బ్రిటిష్ పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. తీవ్ర గాయాలతో కుమరన్ చేతిలో జెండాను పట్టుకునే ప్రాణాలు విడిచాడు. చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ అసలు పేరు చంద్రశేఖర్ తివారీ. పోలీసులు కోర్టులో హాజరుపరచినప్పుడు పేరేంటని అడిగిన జడ్జికి తన పేరు ‘ఆజాద్’ అని బదులివ్వడంతో చంద్రశేఖర్ ఆజాద్‌గా ప్రసిద్ధి పొందాడు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ 1922లో అర్ధంతరంగా నిలిపివేయడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆజాద్, బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి సాయుధ మార్గంలో పోరు సాగించాడు. అలహాబాద్‌లోని ఒక పార్కులో ఉండగా, పోలీసులు చుటుముట్టి కాల్పులు జరిపారు. ఆజాద్ వారిని తన తుపాకితో ఎదిరించి, ముగ్గురు పోలీసులను మట్టుబెట్టాడు. గాయపడిన ఆజాద్, పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో తనను తాను కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. భగత్ సింగ్ సాయుధ మార్గంలో బ్రిటిష్ వారిని ఎదిరించి, ధైర్యంగా ఉరిశిక్షను ఎదుర్కొన్న ధీరుడు భగత్ సింగ్. లాలా లజపత్‌రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో బ్రిటిష్ పోలీసు సూపరింటెండెంట్ జేమ్స్ స్కాట్‌ను అంతం చేయాలనుకున్నాడు. తన సహచరుడు శివరామ్ రాజగురుతో కలసి పొరపాటున జేమ్స్ స్కాట్ అనుకుని జేమ్స్ సాండర్స్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిపై కాల్పులు జరిపాడు. బ్రిటిష్ చట్టాలకు నిరసనగా సెంట్రల్ అసెంబ్లీ సమావేశం కొనసాగుతుండగా, బటుకేశ్వర్ దత్ అనే సహచరుడితో కలసి అసెంబ్లీ హాలులోకి రెండు బాంబులు విసిరాడు. పోలీసులు అక్కడే వారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత జరిగిన విచారణలో భగత్ సింగ్‌తో పాటు ఆయన సహచరులు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ఉరిశిక్ష పడింది. కొమరం భీమ్ బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతంలో ఒకవైపు స్వాతంత్రోద్యమం కొనసాగుతున్న కాలంలో తెలంగాణలో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరు సాగించిన గిరిజన వీరుడు కొమరం భీమ్. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ పరిసరాల్లోని గిరిజనులను ఏకం చేసి, గెరిల్లా పద్ధతుల్లో నిజాం సైనికులను ఎదిరించాడు. భీమ్ తండ్రి ఆదివాసీల హక్కులపై ప్రశ్నించిన పాపానికి అతన్ని నిజాం అటవీ అధికారులు హతమార్చారు. ఆ సంఘటన భీమ్‌పై బాగా ప్రభావం చూపింది. యువకుడిగా ఎదిగిన తర్వాత ‘జల్, జంగిల్, జమీన్’ నినాదంతో గిరిజనులను ఏకం చేశాడు. తాలూక్దార్ అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యంలో పోలీసులు తుపాకులతో కాల్పులు జరిపినప్పుడు భీమ్ నాయకత్వంలోని గోండులు విల్లంబులతో వారిని ఎదిరించారు. ఆ పోరాటంలోనే కొమరం భీమ్ అమరుడయ్యాడు. 1857 నాటి వీరులు... వివిధ కాలాల్లో, వివిధ సందర్భాల్లో ప్రజలకు అండగా ఉంటూ, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పోరుబాటలో ముందుకు సాగిన వారు చాలామందే ఉన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తొలి స్వాతంత్య్ర పోరాటం జరిగినప్పుడు ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో మంగల్ పాండే, బహదూర్ షా, బఖ్త్ ఖాన్, నానా సాహెబ్, తాంతియా తోపే, సురేంద్ర సాయి, మౌల్వీ అహ్మదుల్లా, మౌల్వీ లియాఖత్ అలీ, తుఫ్జల్ హసన్ ఖాన్, మహమ్మద్ ఖాన్, అబ్దుల్ అలీ ఖాన్, ఖాన్ బహదూర్ ఖాన్, ఫిరోజ్ షా, కందర్పేశ్వర సింగ్, రాజా ప్రతాప్ సింగ్, జయ్దయాల్ సింగ్, హర్దయాల్ సింగ్, గజాధర్ సింగ్, కదమ్ సింగ్, కున్వర్ సింగ్, అమర్ సింగ్ వంటి వీరులు ఉన్నారు. వీరందరూ శాయశక్తులా సాయుధ మార్గంలోనే బ్రిటిష్ బలగాలను ఎదిరించారు. పోరుబాటలో సాగిన వారిలో కొందరు యుద్ధక్షేత్రంలో ప్రాణాలు కోల్పోతే, మరికొందరు బ్రిటిష్ సేనలకు చిక్కి మరణశిక్షలకు, జైలు శిక్షలకు గురయ్యారు. ఆధునిక ఆయుధ సంపత్తి, భారీ సైనిక బలగాల సాయంతో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ సిపాయిల తిరుగుబాటును, ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో చెలరేగిన పోరాటాలను అణచివేసింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాచరికం భారత భూభాగంపై ఆధిపత్యాన్ని కైవసం చేసుకుంది. మొదటి స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత... మొదటి స్వాతంత్య్ర సంగ్రామం తర్వాతి కాలంలో పూణేలో ఐక్యవర్ధినీ సభను స్థాపించిన వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే దక్కన్ ప్రాంతంలో విప్లవోద్యమానికి నాయకత్వం వహించాడు. ఒక నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారం వల్ల బ్రిటిష్ పోలీసులకు పట్టుబడి జైలు పాలైనా, జైలు నుంచి పారిపోయాడు. అయితే, మళ్లీ పట్టుబడి జైలు పాలయ్యాడు. జైలులోనే ఆమరణ నిరాహారదీక్ష సాగిస్తూ 1883 ఫిబ్రవరి 17న ప్రాణాలు విడిచాడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో అహింసా మార్గంలో స్వాతంత్య్ర ఉద్యమం అప్పటి ప్రజలపై విపరీతమైన ప్రభావం చూపింది. అదేకాలంలో బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమి కొట్టడానికి సాయుధ మార్గమే సరైనదని తలచి, విప్లవ సంస్థలను ఏర్పరచి పోరు కొనసాగించిన యోధులు చాలామంది ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం 1905లో బెంగాల్ విభజనకు తెగబడటంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టాలనే ఉద్దేశంతో తూర్పు బెంగాల్లో ప్రమథనాథ్ మిత్రా ‘అనుశీలన్ సమితి’ అనే విప్లవ సంస్థను స్థాపించాడు. అదేకాలంలో కొందరు సాయుధ మార్గంలో ‘గదర్ పార్టీ’ని నెలకొల్పారు. అరబిందొ ఘోష్, ఆయన సోదరుడు బరిన్ ఘోష్ విప్లవమార్గం పట్టారు. బరిన్ ఘోష్ నేతృత్వంలో ‘జుగాంతర్’ సంస్థను స్థాపించిన విప్లవకారులు మొదటి ప్రపంచయుద్ధ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి విఫలయత్నాలు చేశారు. చిట్టగాంగ్‌లో విప్లవోద్యమానికి నాయకత్వం వహించిన సూర్యసేన్ బ్రిటిష్ బలగాలను తిప్పికొట్టి, కొద్దికాలం స్థానిక ప్రభుత్వాన్ని నడిపాడు. తర్వాత పోలీసులకు చిక్కి, ఉరిశిక్షకు బలైపోయాడు. కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాక సుభాష్‌చంద్ర బోస్ ఆజాద్ హిందు ఫౌజ్ స్థాపించి నాటి యువతరంలో పోరాట స్ఫూర్తి రగిల్చారు. ఇలాంటి వీరులు ఎందరెందరో ఉన్నారు. చరిత్రకెక్కిన వారు కొందరైతే, చరిత్రపుటల్లో మరుగునపడిన వారు ఇంకెందరో... -
225 కోట్లతో శివాజీ బయోపిక్..!
బాహుబలి ఘనవిజయం సాధించటంతో ఇప్పుడు చాలా మంది దర్శక నిర్మాతలు భారీ చిత్రాల నిర్మాణానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలు ఎనౌన్స్ కాగా.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్ చేశారు మరాఠా మేకర్స్. మరాఠా యోదుడు శివాజీ కథతో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. 225 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ, రితేష్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ' బాహుబలి మెరుపుల తరువాత, మరో గొప్ప వార్త.. రితేష్ దేశ్‌ముఖ్ 225 కోట్ల బడ్జెట్‌తో శివాజీ సినిమాను రూపొందించటం. బాహుబలి కన్నా శివాజీ కథలో గొప్ప హీరోయిజం, డ్రామా ఉంటుంది. భరత మాత ముద్దుబిడ్డగా శివాజీ కథ అందరికీ బాగా తెలిసిన కథ, ఈ కథలోని యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. గొప్ప సినిమాను రూపొందిస్తున్నందుకు రితేష్‌కు కృతజ్ఞతలు. బాహుబలి తెలుగు వారికి ఎలాగో, మరాఠిలకు శివాజీ అలా నిలిచిపోయే చిత్రంగా రితేష్ రూపొందిస్తున్నాడు.' అంటూ ట్వీట్ చేశాడు. రితేష్.. చాలా కాలంగా శివాజీ కథను సినిమాగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రితేష్ స్వయంగా శివాజీగా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో నటిస్తుండగా, సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించేందుకు అంగీకరించాడన్న ప్రచారం కూడా జరిగింది. అయితే బడ్జెట్ పరంగా వర్క్ అవుట్ కాదన్న అనుమానంతో ఇంత కాలం ఈ ప్రాజెక్ట్‌ను వాయిదా వేస్తూ వచ్చారు. బాహుబలి ఘనవిజయం సాధించటంతో శివాజీ బయోపిక్ మరోసారి తెర మీదకు వచ్చింది. After the Bahubali thunder I just heard great news that RiteishDeshmukh is making Shivaji at a whopping cost of more than 225 crores — Ram Gopal Varma (@RGVzoomin) 11 May 2017 Shivaji's story has more heroism and drama than Bahubali nd he was real unlike Bahubali which will make it a more thrilling experience — Ram Gopal Varma (@RGVzoomin) 11 May 2017 Shivaji is known throughout india as the bravest son of india who fought against invasion ..Am sure the battle scenes will be magnificient — Ram Gopal Varma (@RGVzoomin) 11 May 2017 Shivaji being the subject as an audience I want to thank Riteish for venturing to make the greatest Indian film ever — Ram Gopal Varma (@RGVzoomin) 11 May 2017 Am sure Riteish is doing Shivaji at this large scale only for it to become ultimate pride of Maharashtra like Bahubali for Andhra Pradesh — Ram Gopal Varma (@RGVzoomin) 11 May 2017 -
అందరివాడు
-
రాజ్యసభకు ఛత్రపతి వారసుడు
న్యూఢిల్లీ: మరాఠా యోధుడైన ఛత్రపతి శివాజీ వారసుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త శంభాజీ రాజే ఛత్రపతి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ఆయనను పెద్దలసభకు నామినేట్ చేశారు. కొల్హాపూర్‌ను పాలించిన ఛత్రపతి శివాజీ, రాజశ్రీ సాహు వారసుడైన శంబాజీ మహారాష్ట్రలో పలు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రారంభించిన ఉద్యమానికి ఆయన ఆర్థిక చేయూతనిచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలోని పలు వర్గాల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడంలో శంభాజీ విశేష పాత్ర పోషించారని చెప్పాయి. విశ్వ గాయత్రి పరివార్ అధిపతి ప్రణవ్ పాండే తాను రాజ్యసభ స్వభ్యత్వాన్ని స్వీకరించబోనని ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్థానంలో శంభాజీని నామినేట్ చేశారు. ప్రస్తుతం పెద్దల సభలో తనకు అనువైన వాతావరణం లేదని, అందుకే తాను రాజ్యసభ స్వభ్యత్వాన్ని తిరస్కరిస్తున్నానని ప్రణవ్ పాండే పేర్కొన్నారు. -
జయహో సురభి!
ఛత్రపతి శివాజీ అస్తమించాడు. మరాఠా సామ్రాజ్యం చెల్లాచెదురైపోయింది. చెట్టుకొకరు... పుట్టకొకరు... సైనికులకు పని లేదు. వాళ్లకు బతుకుతెరువు కావాలి. వలస వెళ్లిపోవాల్సిందే! అలా ఓ ముఠా మరాఠీ సీమ నుంచి రాయలసీమకొచ్చింది. ఇక్కడే కథ స్టార్ట్. 2 ముఠా పెద్ద... వనారస సంజీవరావు. మంచివాడు, కానీ మహా కోపిష్ఠి. వ్యవసాయం మొదలెట్టాడు. దానికి తోడు సారా వ్యాపారం. పెద్ద కుటుంబం. ఇద్దరు భార్యలు. బోలెడంత మంది బంధువులు. మరాఠా నేల మీద ఆరెకాపులు అంటే గొప్ప. ఇక్కడ వీళ్లనెవరు పట్టించుకుంటారు! ఆ ఏడాది వానల్లేవు. అమ్మవారికి ఎవరో ఒకరు బలి అయితేనే వానలు పడతాయట! వనారస సంజీవరావు ముందూ వెనుకా ఆలోచించలేదు. అమ్మవారికి తనే బలిపశువు. పాపం పిల్లలు బికారులైపోయారు. ఇక్కడే కథకు టర్నింగ్. 3 వాళ్లకు దేవుడు కూసింత సంగీత జ్ఞానమిచ్చాడు. దాంతోపాటు ఇంగిత జ్ఞానమిచ్చాడు. ఇప్పుడు వాళ్లు తోలుబొమ్మలాడుతున్నారు. పొట్టకూటి కోసం పోరాటం చేయాలి కదా! ఊరూరూ తిరుగుతున్నారు. తోలుబొమ్మలాట బాగానే గిట్టుబాటు అవుతోంది. కడప ఏరియాలో ఓ పల్లెటూరికెళ్లారు. పకీరన్న అనే అనాథ తగిలాడు. పాపం కుర్రాడికి మశూచి. వీళ్లకు జాలేసింది. తమతో పాటే తీసుకెళ్లిపోయారు. తమలోనే కలిపేసుకున్నారు. ఆ పిల్లాడి బతుకు మారిపోయింది. పేరు కూడా మారిపోయింది. ఇప్పుడతని పేరు గోవిందప్ప. ఔ! ఇతనే ఈ కథకు నాయకుడు... నావికుడు! 4 గోవిందప్ప మృదంగం నేర్చుకున్నాడు. వయొలిన్ కూడా వాయించగలడు. ఆ ట్రూప్‌లో అతనే చలాకీ. బొమ్మలాటయ్యాక ఇంటింటికీ తిరిగి ధాన్యం, బట్టలు అడుక్కోవడం నచ్చలేదు అతనికి! ఇలా ఎదురు తిరిగినప్పుడల్లా ఓ మొట్టికాయ పడేది. పాపం కుర్రాడు కదా... తట్టుకోలేకపోయాడు. చూసి చూసి విసుగేసి నంద్యాల పారిపోయాడు. అక్కడ జ్యోతి సుబ్బయ్య వీధి నాటకాల కంపెనీలో చేరాడు. ఆరేడు నెలలు అక్కడే ఉండి, వేషాల గుట్టూ మట్టూ తెలుసుకోగలిగాడు. చివరకు ఆచూకీ కనిపెట్టి, ఇంట్లోవాళ్లు తమతో పాటే లాక్కెళ్లిపోయారు. ఇక్కడ పడింది కథకు అసలు ట్విస్టు! 5 ఆ ఊరి పేరు సురభి. పూర్వకాలంలో ‘సొరుగు’ అనేవారంట. అల్లపురెడ్డి చెన్నారెడ్డి ఆ ఊళ్లోనే పెద్ద రైతు. వాళ్లింట్లో పెళ్లి. పెళ్లంటే తోలుబొమ్మలాట ఉండాల్సిందే! గోవిందప్ప ట్రూపు దిగింది. చెన్నారెడ్డిని బతిమిలాడుకుని, ‘‘బాబ్బాబు... తోలు బొమ్మలాట కాదు. నాటకం వేస్తాం’’ అని ఒప్పించాడు. నాటకం పేరు ‘కీచక వధ’. ముహూర్తం అదిరిపోయింది. దాంతో నాటకం కూడా అదిరిపోయింది. చెన్నారెడ్డి ఫుల్ ఖుష్ అయిపోయి, వాళ్లకో బిల్డింగిచ్చేసి నాటక సమాజం పెట్టుకోమన్నాడు. ఇది 1885 నాటి మాట. ‘శ్రీశారద మనో వినోదిని సంగీత నాటక సమాజం’ పేరుతో ‘సురభి’ నాటక ప్రస్థానం అలా మొదలైందన్న మాట. ఇక అక్కడి నుంచీ ఈ కథకు తిరుగు లేకుండా పోయింది. 6 ‘సురభి’ అంటే చెట్టు కాదు. ఓ మహావృక్షం. కాదు కాదు... కల్పవృక్షం. దీని పేరు చెప్పి ఎంతమంది ఎదిగారో! దీని నీడలో ఎంతమంది సేద తీరారో! తెలుగు నేల నలు చెరగులా సురభి వీరవిహారం చేసేసింది. తెలుగు నాట నాటకమంటే ‘సురభి’... సురభి అంటే నాటకం. కుటుంబాలు పెరిగి పెద్దయ్యి, ఎవరికి వాళ్లు సొంతంగా సమాజాలు పెట్టుకున్నా, వీళ్లందర్నీ కలిపి ఉంచిన దారం మాత్రం ‘సురభి’. ఏం రోజులవి? ఏం నాటకాలవి? ‘సురభి’ నాటకం చూడకుండా ఆంధ్ర దేశం మేల్కోలేదంటే నమ్మండి! 7 వాళ్లు మనవాళ్లు కాదు. కాదు కాదు... మనవాళ్లే! అలా వాదిస్తే మనవాళ్లే కొడతారు కూడా! పొట్టకూటి కోసం వచ్చినవాళ్లు ఒక కళను ఇన్నేళ్ల పాటు వారసత్వంగా నిలుపుకోవడమంటే మాటలు కాదు. వాళ్లది మామూలు జన్మ కాదు. శాపవశాత్తూ ఇక్కడికొచ్చిన గంధర్వులేమో! వాళ్లకు కులం లేదు. సురభి నాటకమే వాళ్ల కులం. ఇది నిజంగా నిజం. వాళ్ల సర్టిఫికెట్లు ఒకసారి చూడండి. వాళ్లది మన భాష కాదు. మన ప్రాంతం కాదు. కానీ నాటక కళతో వాళ్లు మన మూలాల్ని పట్టేసుకోగలిగారు. అదీ లెక్క. వాళ్లు మనలో కలిసిపోయారు. మనల్ని వాళ్ల కళతో మమేకం చేసేసుకోగలిగారు. ‘రావు’ అనేది వాళ్ల పేరే! ప్రతి పేరు చివరా ‘రావు’ అని ఉంటుంది. వాళ్లని చూసి మనమూ ‘రావు’ను తగిలించేసుకున్నాం. మంచిదేగా! 8 ప్రపంచంలో ఎక్కడా లేని స్పెషాల్టీ ‘సురభి’ వాళ్ల దగ్గరుంది. వాళ్లో నాటకం వేశారంటే - అందులో పాత్రధారులంతా కుటుంబ సభ్యులే! బయటోడు ఒక్కడుంటే ఒట్టు. నూట పాతికేళ్ల నుంచి ఈ ఆనమా తప్పలేదు వాళ్లు. ఎవడో నాలాంటివాడు చేస్తానన్నా కూడా బోలెడన్ని కండిషన్స్! ఈ టైమ్‌లో నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలి. నాలుగేళ్ల క్రితం... హైదరాబాద్‌లో ‘సురభి’ నాటకం 125 సంవత్సరాల మహోత్సవం జరిగింది. నేను ‘పాతాళ భైరవి’ నాటకంలో మాయల ఫకీరు వేషం వేశా. పది రోజులు రిహార్సల్స్‌కు వెళ్లా. రోజూ షూటింగ్ అయిపోగానే, రాత్రిళ్లు వాళ్లతోటే గడిపేవాణ్ణి. వాళ్లకు నా మీద నమ్మకం రావడం కోసం ‘మాయాబజార్’ నాటకంలో చిన్న కామెడీ వేషం కూడా వేశా. నాతో పాటు షఫీ కూడా చేశాడు. వాళ్లకప్పుడు నా మీద నమ్మకమొచ్చింది. ‘పాతాళ భైరవి’ నాటకాన్ని రవీంద్రభారతిలో వేసినప్పుడు టిక్కెట్లు పెట్టాం. జనం బాగానే వచ్చారు. ఆ డబ్బంతా వాళ్లకే ఇచ్చేశాం. ఆ ఒక్కసారే నేను వాళ్లతో కలిసి నటించింది. ఆ ఒక్క నాటకంతోనే వాళ్లు పడే కష్టం తెలిసొచ్చింది. అలాగని వాళ్లేమీ దాన్ని కష్టంగా ఫీలవ్వరు. కలిసి - వంట వండుకుంటారు. కలిసి - భోంచేస్తారు. కలిసి - నాటకం వేస్తారు. అంతా ఓ ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నమాట. కాపురాలూ అక్కడే! పురుళ్లూ అక్కడే! చావులూ అక్కడే! వాళ్లకు రంగస్థలమే బడి, గుడి. అమ్మా, నాన్న, తాతయ్య, నానమ్మ, అక్క, చెల్లి, బావ, తమ్ముడు, బామ్మర్ది... ఇలా అందరూ కలిసిపోయి నాటకం వేయడం ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడా జరగలేదు!! జరగదు కూడా!! అది చాలా కష్టం కూడా! ఫ్యామిలీ ఫ్యామిలీ ఇలా ఒక వృత్తినే నమ్ముకోవడమంటే చాలా కష్టం. అదీ ఈ రోజుల్లో. అందుకే చాలా నాటక సమాజాలు కనుమరుగైపోయాయి. మిగిలినవి చాలా కొన్నే. అయినా కూడా వాళ్లు ఎంత శ్రద్ధగా, దీక్షగా, భక్తితో పనిచేస్తారో! నాకు మళ్లీ మళ్లీ వాళ్లతో నటించాలని ఉంది. కానీ అన్ని పనులూ మానుకుని కాన్సన్ట్రేట్ చేయాలి. 9 అసలు విషయం చెప్పడం మరిచేపోయాను. వాళ్ల సెట్టింగులు చూడాలి. ట్రిక్స్ చూడాలి. ఆ రోజుల్లోనే ఎన్ని వండర్స్ చేశారో! ఇవాళ గ్రాఫిక్కులూ, స్పెషల్ ఎఫెక్టులూ వచ్చాక అవి మనకు ఆనకపోవచ్చేమో కానీ, వాళ్ల టెక్నికల్ నాలెడ్జ్ సామాన్యమైనది కాదు. ఇంకో చిత్రం ఏంటంటే, ఓ నాటకంలో ఓసారి వాడిన టెక్నిక్‌ని మళ్లీ వాడరంతే! ఆగ్నేయాస్త్రం, నాగాస్త్రం అంటూ బాణాలు విసురుకోవడం, ఠకీమని మనుషులు మాయమైపోవడం, పక్షుల్లా ఎగరడం... ఇవన్నీ స్టేజ్ మీద చేసి చూపించాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. చిత్రమేమిటంటే - వాళ్లే యాక్టర్సు, వాళ్లే టెక్నీషియన్స్ కూడా! ఉదాహరణకు శకుని పాత్ర చేసేవాడు ఈ సీన్లో లేడనుకోండి. వాడు తెర వెనుక వైర్ వర్క్ చేస్తుంటాడు. రాముడు లేడనుకోండి. వాడు వెనకాల మ్యూజిక్ కొడుతుంటాడు. అసలు వాళ్లు నాటకం వేసేటప్పుడు జరిగే ప్రాసెస్‌ని ఎవరైనా డాక్యుమెంటరీ తీస్తే బాగుంటుంది. తొలి తరం సినిమాలకు ‘సురభి’ వాళ్లే ఆధారం. ఎంతమంది ఆర్టిస్టులో ఇక్కడనుంచి అక్కడికెళ్లారు. మన తొలి పూర్తి తెలుగు టాకీ సినిమా ‘భక్త ప్రహ్లాద’లో చేసినవాళ్లు ‘సురభి’ వాళ్లే. 10 ‘సురభి’ అంటే పురాణాల్లో కామధేనువు. ఎప్పుడూ పాలధారలు కురిపిస్తూనే ఉంటుంది. ఈ సురభికీ ఆ పేరు సరిగ్గా సరిపోతుంది. ఈ కామధేనువు వల్లే కదా... తెలుగు నాటకం ఇంతెత్తుకి ఎదిగింది! అలాంటి కామధేనువుకి ఇప్పుడు కష్టాలు ముంచుకొచ్చాయి. ప్రజలూ పట్టించుకోవడం లేదు. పాలకులు అంతకన్నానూ! హైదరాబాద్‌లో తెలుగు లలిత కళాతోరణం పక్కన వాళ్లు తాత్కాలికంగా ఉండడానికీ, రోజూ నాటకాలు వేయడానికీ జాగా ఇచ్చారు. అప్పట్లో నటి జమునగారు కొంతమందికి క్వార్టర్స్ ఇప్పించినట్టు గుర్తు. సురభి సంస్థకు ఇప్పుడో సైనాధ్యక్షుడున్నాడు. పేరు ‘సురభి’ నాగేశ్వరరావు. అందరూ ‘బాబ్జీ’ అంటుంటారు. ఆయన చేతిలో అయిదు సభ్య సమాజాలున్నాయి. ఆయనకి ఆ మధ్య ‘పద్మశ్రీ’ ఇచ్చారు. ఆ వార్త తెలియగానే గుండె నిండిపోయింది. వాళ్లు కూడా మనస్ఫూర్తిగా ప్రేక్షకులు కొట్టే చప్పట్లే తప్ప కోటానుకోట్లు కావాలనుకోరు. 11 ‘సురభి’ మన తెలుగుజాతి సంపద! దయచేసి దాన్ని మ్యూజియమ్‌లో పెట్టే పరిస్థితి రానీయొద్దు! ఈ కామధేనువుని వట్టి పోనివ్వద్దు! సురభీ... నువ్వు నిండు నూరేళ్లు కాదు, వెయ్యేళ్లు వర్థిల్లాలి. జయహో సురభి! ప్రజల ఆదరణే సురభి ఊపిరి... 1885లో చిన్న గ్రామంలో పుట్టింది సురభి నాటకం. దినదిన వర్ధమానం చెంది అంతర్జాతీయ స్థాయికి కూడా ఎదిగింది. తొలుత దీన్ని డాక్టర్ గోవిందరావు, చిన్న రామయ్యలు ప్రారంభించారు. సురభి గ్రామ పెద్ద రామిరెడ్డి చెన్నారెడ్డి ద్వారా సురభి నాటకం ఆడించేవారు. క్రమక్రమంగా ఉమ్మడి ఏపీ అంతటా సురభి వ్యాపించింది. ప్రజల ఆదరణ అప్పటికీ ఇప్పటికీ ఒకేలాగా ఉంది. నేను 1969లో చదువుకునే వయసులోనే సురభి నాటక వేషాలు వేయటం ప్రారంభించాను. అప్పట్లో ఖర్చు తక్కువ. ఇప్పుడు ఆదాయం రెండు రేట్లు పెరిగితే ఖర్చులు వంద రెట్లు పెరిగాయి. ఆ ఖర్చులకు తట్టుకోలేక నాటక సమాజాలు కట్టేస్తున్నారు. ఐదు సమాజాలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు శ్రీవేంకటేశ్వరనాట్య మండలి, శ్రీ శారద విజయ నాట్యమండలి, శ్రీ విజయభారతి నాట్యమండలి, శ్రీ వినాయక నాట్య మండలి, శ్రీ బీఎన్ మండలి ఆధ్వర్యంలో సురభి నాటకాలు ప్రదర్శితమవుతున్నాయి. సురభి నాటకం... కుటుంబ నాటకం. 60 నుంచి 70 మంది నాటకం వేస్తారు. చంటి బిడ్డ నుంచి 90 ఏళ్ల వయసు వృద్ధుడి వరకు వేసే నాటకం ఇది. 1991లో ప్రధాని పీవీ నరసింహరావు ఢిల్లీకి పిలిపించుకుని ఐదు నాటకాలు వేయించారు. ఢిల్లీ ప్రజలు నాటకం చూసి మురిసి పోయారు. నాటకం ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. తెలుగు ప్రజలు నేటికీ టికెట్ కొని చూసే నాటకం ఏదైనా ఉందా అంటే అది సురభి ఒక్కటే. 2013లోఫ్రాన్స్‌లో కూడా 40 రోజుల పాటు సురభి నాటకాలు ప్రదర్శించాం. శ్రీ వేంకటేశ్వర నాట్య మండలికి ఈ ఏడాదితో 80 ఏళ్లు నిండనున్నాయి. - పద్మశ్రీ సురభి బాబ్జీ (నాగేశ్వరరావు) సురభికి ప్రోత్సాహం అందిస్తాం! 1991లో ఉమ్మడి ఏపీ కల్చరల్ డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వేంకటేశ్వర నాట్య మండలి వారిని హైదరాబాద్‌కు రప్పించి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నాటకాలు ప్రదర్శించేలా చేశాను. దానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సివిల్ సర్వెంట్లను ఆహ్వానించాను. దాంతో ఆ సమాజం దినదిన వర్థ మానం చెందింది. ఆ తర్వాత పబ్లిక్ గార్డెన్సలో వారికి స్థావరం కల్పించేం దుకు కృషి చేశాను. చందానగర్ సమీపంలో సురభి కాలనీ ఏర్పాటు చేయటం కూడా జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రమంతటా సురభి నాటకాలు ప్రదర్శితమయ్యేలా చూస్తున్నాను. ఇలాంటి సమాజాలు జీవించాలి. ఎప్పటికీ జీవించే ఉండాలి. - డా॥కె.వి.రమణాచారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు తమదైన టెక్నిక్ సురభి సొంతం! 130 ఏళ్ల పైబడి చరిత్ర ఉన్న నాటక అకాడెమీ సురభి. మారుమూల పల్లె నుంచి విదేశాల వరకు నాటకాన్ని పాకేలా చేసింది. సురభి నాటకాన్ని ఓ సంప్రదాయ నాటకంగా ప్రజలు ఆదరిస్తున్నారు. సురభి నాటకం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ దైన టెక్నిక్‌తో ప్రత్యేకత సాధించుకుంది. తెలంగాణ ప్రభుత్వం సురభికి సంబంధించి ఐదు నాటక సమాజాలను ఎప్పటికప్పుడు ప్రొత్సహిస్తోంది. మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇటీవలే సురభి నాటకాలను ప్రదర్శించారు. మిగతా జిల్లాల్లో కూడా ప్రదర్శనలు జరిగేలా చూస్తాం. రంగస్థలంపై అధ్యయనానికి, కొత్త ఆలోచనల కోసం వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాం. - మామిడి హరికృష్ణ, తెలంగాణ రాష్ర్ట భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు -
బుర్జ్ ఖలీఫాను మించేలా చత్రపతి టవర్!
ముంబయి: దుబాయ్‌లో ఉన్న ప్రపంచంలోనే ఎత్తయిన భవనం బుర్జ్ ఖలిఫాలాంటి నిర్మాణాన్ని అంతకంటే ఎత్తులో ముంబయిలో నిర్మించాలని అనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మరాఠ వీరుడు చత్రపతి శివాజీకి గుర్తుగా దానిని నిర్మించాలని ఉందన్నారు. అయితే, ఇది అధికారిక ప్రకటన కాదని కేవలం తన మనసులో మాట అని మాత్రమే చెప్పారు. ప్రపంచంలో ఎత్తయిన బుర్జ్ ఖలీఫా లాంటి ఎత్తయిన భవనం ముంబయి సముద్ర తీరంలో ఉండాలని, దానిని చత్రపతి శివాజీ టవర్ అని పిలిస్తే చూడాలనేది తన కోరిక అని అన్నారు. అందులో 30 ఫ్లోర్స్ కేవలం సమావేశాలకోసమే ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.మరో 30 ఫ్లోర్లు రెస్టారెంట్లు, మరో 30 హోటల్స్, 20 షాపింగ్ మాల్స్, మరెన్నో ఫ్లోర్స్ పార్కింగ్ కు ఉండాలని చెప్పారు. బుర్జ్ ఖలీపా ప్రపంచంలోనే 829.8 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనంగా ఉంది. -
శివాజీ కోటలు లేనందునే ఉగ్రవాదుల చొరబాటు
పింప్రి, న్యూస్‌లైన్: సముద్ర తీరాల వెంట ఛత్రపతి శివాజీ నిర్మించిన కోటలను మనం భద్రంగా కాపాడుకొని ఉంటే కసబ్ లాంటి ఉగ్రవాదులు మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారు కాదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉద్ఘాటించారు. నిర్వహణ లోపం కారణంగా ఆ కోటలు కనుమరుగైపోయాయని అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని గురువారం ఆయన జన్మస్థలమైన పుణే జిల్లా, జున్నర్ కోటపై ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఫడ్నవీస్‌తోపాటు గ్రామాభివృద్థి శాఖ మంత్రి పంకజా ముండే, పాలవే, పుణే జిల్లా ఇన్చార్జి మంత్రి గిరీష్ బాపట్, సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి దిలీప్ కాంబ్లే, జలవనరుల శాఖ సహాయ మంత్రి విజయ్ శివ్‌తారే, ఎంపీ ఉదయన్‌రాజే భోంస్లే, శిరూర్ ఎంపీ శివాజీరావ్ పాటిల్, జిల్లా పరిషత్ అధ్యక్షుడు ప్రదీప్ కంద్, ఎమ్మెల్యే వినాయక్ మేటే, జున్నర్ ఎమ్మెల్యే శరద్ సోనవణే తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ వంశపారపర్యంగా వస్తున్న శివాజీ జయంతి వేడుకలు, ఆయన తల్లి జిజావు విగ్రహానికి జరిగిన అభివందన కార్యక్రమంలో ఫడ్నవీస్ పాల్గొన్నారు. అనంతరం ఫడ్నవీస్ మాట్లాడుతూ కోటలను పరిరక్షించుకోవల్సిన అవసరం ఉందని, అందుకు ఖజానాపై ఎంత భారం పడినప్పటికీ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. శివాజీ హయాంలో కోటల కారణంగానే రాజ్య ప్రజలు క్షేమంగా, ధైర్యంగా ఉండేవారని గుర్తుచేశారు. ఖిల్లాల పరిరక్షణ, పునర్నిర్మాణం కోసం కేంద్రం సహకారంతో రాష్ట్ర స్థాయిలో ఒక సంస్థను స్థాపిస్తామని అన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ముంబైలోని అరేబియా సముద్రంలో భారీ శివాజీ స్మారకాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఎనిమిదేళ్ల నుంచి జరుగుతున్నాయి. ప్రస్తుతం అన్ని శాఖల నుంచి అనుమతులు లభించాయని త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. శివాజీ దయవల్ల ఐదేళ్లలో రాష్ట్రం రూపురేఖలు మార్చివేస్తామని ఉద్ఘాటించారు. శివాజీ వంశంలో 13వ తరానికి చెందిన ఎంపీ ఉదయన్‌రాజే భోంస్లే మాట్లాడుతూ శివాజీ పేరు ఉచ్ఛరిస్తే చాలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని శరీరంలో ఒక విధమైన శక్తి వస్తుందని అన్నారు. నేటి యువకులు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అప్పుడే దేశం మరింత పటిష్టం అవుతుందన్నారు. ఛత్రపతి శివాజీకి గవర్నర్ ఘన నివాళి సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని గవర్నర్ సి.హెచ్.విద్యాసాగరరావ్ గురువారం శివాజీపార్క్ మైదానంలో అశ్వాన్ని అధిరోహించిన శివాజీ విగ్రహానికి భారీ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జీ మంత్రి సుభాష్ దేశాయ్, రవాణ శాఖ మంత్రి దివాకర్ రావుతే, ముంబై మేయర్ స్నేహల్ ఆంబేకర్, బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే తదితర ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం బీఎంసీ తరఫున మేయర్ బంగ్లాలో ఏర్పాటుచేసిన శివ్ జయంతి ఉత్సవాలకు కూడా గవర్నర్ హాజరయ్యారు. అక్కడ సంగీత కళా అకాడమి ఆధ్వరంలో జరిగిన దేశ భక్తి గీతాల ఆలాపన కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం ధారవికి చెందిన ఛత్రపతి శివాజీ విద్యాలయం ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రదర్శించిన జీజామాత, శివాజీ జీవిత చరిత్రపై నాటకాలను వీక్షించారు. భివండీలో... భివండీ, న్యూస్‌లైన్: ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని గురువారం ఉదయం భివండీ మహానగర్ పాలిక ముఖ్య కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ తుషార్ చౌదరి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నజరానా సర్కిల్లో ఉన్న శివాజీ విగ్రహానికి కమిషనర్ జీవన్ సోనావునే, డీసీపీ సుదీర్ దాబాడే పూలమాల వేసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సంతోష్ ఎం. శెట్టి, వికాస్ పాటిల్, కాలీద్ గుడ్డూతో పాటు కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పుణే, పింప్రి-చించ్వడ్ నగరాలలో... పింప్రి, న్యూస్‌లైన్: శివాజీ జయంతిని పురస్కరించుకుని పింప్రి-చించ్వడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగర మేయరు శకుంతలా ధరాడే, కమిషనరు రాజీవ్ జాదవ్, ఉప మేయరు ప్రభాకర్ వాఘర్ ఇతర అధికారులు శివాజీ విగ్రహానికి పుష్పహారాలు వేసి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. నగరంలో శివాజీ విగ్రహాలను అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. ప్రతి రథం ముందు శివాజీ కోటలను, ఇతర చారిత్రాత్మిక కట్టడాల నమూనాలతో రథాలను అలంకరించారు. హరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో సాక్షి, ముంబై: కింగ్సర్కిల్కు చెందిన ఆంధ్ర హరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం దాదర్‌లోని చైత్యభూమి వద్ద శివాజీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ సంస్థ పదాధికారులు గుమ్మడి బొందయ్య శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సముద్రతీరం వెంట ఉన్న కోటలు, ఖిల్లాలు మన తెలుగు ప్రజలే కట్టారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ఉపాధ్యక్షుడు శశికాంత్ మేకల, సహాయ కార్యదర్శి తెడ్డుబాయి, భీంరావు మాదిగ, ఎంటీజాక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
చత్రపతి శివాజీ స్మారకంపై వివాదం!
-
శివాజీ స్మారకానికి లైన్ క్లియర్
ఏర్పాటుకు కేంద్ర పర్యావరణ శాఖ పచ్చజెండా త్వరలోనే పనులు ప్రారంభం సాక్షి, ముంబై: నగరానికి ఆనుకుని ఉన్న అరేబియా సముద్రంలో ఛత్రపతి శివాజీ భారీ స్మారకాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్మారకం పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఇదివరకే రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల నుంచి అనుమతులు లభించడంతో కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి కోసం వేచిచూస్తున్నారు. గత ఏడు నెలలుగా అనుమతి కోసం కేంద్ర పర్యావరణ శాఖ వద్ద ఈ ప్రతిపాదన పెండింగులో ఉంది. ఇటీవల ఆ శాఖ సహాయ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముంబై పర్యటనకు వచ్చినప్పుడు త్వరలో అనుమతి లభించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అది నెరవేర్చడంతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ అనుమతికి సంబంధించిన సర్క్యూలర్‌ను త్వరలో జారీ చేస్తామని ఆయన తెలిపారు. మహారాష్ట్ర ప్రజల ఆరాధ్యదైవమైన ఛత్రపతి శివాజీ స్మారకాన్ని అరేబియా సముద్రంలో నెలకొల్పాలని పదేళ్ల కిందటే ప్రతిపాదించారు. అందుకు బాంద్రా, మాహిం, శివాజీపార్క్, గేట్ వే ఆఫ్ ఇండియా తదితర ప్రాంతాలను ఎంపిక చేశారు. చివరకు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మెరైన్ డ్రైవ్ సముద్ర తీరంలో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తీరం నుంచి కిలోమీటరు దూరంలో ఈ భారీ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందుకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకోవడం అనివార్యమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్-ఎన్సీపీ (డీఎఫ్ కూటమి) ప్రభుత్వం, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కొనసాగడంవల్ల ఈ ప్రతిపాదన పెండింగులో పడిపోయింది. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎఫ్ కూటమి తమ మేనిఫెస్టోలో శివాజీ స్మారకం అంశాన్ని పొందుపరిచింది. ఆ తర్వాత 2009లో కూడా దీని ఏర్పాటుపై హామీ ఇచ్చింది. కాని కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అంతగా ఆసక్తి కనబర్చకపోవడంతో ఈ ప్రతిపాదన పెండింగు దశలోనే ఉండిపోయింది. కాని ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో శివాజీ స్మారకం ప్రతిపాదన మరోసారి తెరమీదకు వచ్చింది. అనుమతివ్వాలని కేంద్రానికి ప్రతిపాదన పంపించారు. ఎట్టకేలకు పర్యావరణ శాఖ నుంచి అనుమతి లభించడంతో త్వరలో పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. -
ఛత్రపతి శివాజీ మార్కెట్‌కు పూర్వవైభవం
సాక్షి, ముంబై: నగరంలోని ఛత్రపతి శివాజీ మార్కెట్ భవనం పూర్వవైభవం సంతరించుకోనుంది. ఇందుకు కారణం బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) దీనిని పునర్నిర్మించనుండడమే. ఇందుకోసం సదరు భవనాన్ని ఖాళీ చేయాలంటూ ఆదేశాలుకూడా జారీ చేసింది. ఈ భవనం శిథిలావస్థకు చేరుకున్నట్టు వారం క్రితం జరిపిన నిర్మాణ మదింపులో తేలింది. ఇటీవల డాక్యార్డులోని బీఎంసీ భవనం కూలిన ఘటనలో 61 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కార్పొరేషన్ ముందు జాగ్రత్తగా ఈ భవనానికి మరమ్మతులు నిర్వహించనుంది. అయితే ఛత్రపతి శివాజీ మార్కెట్ భవనంలో కార్పొరేషన్‌కు చెందిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఆక్ట్రాయ్, ఎస్టేట్ విభాగాలతోపాటు మరో ఆరు కార్పొరేషన్ కార్యాలయాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ భవనంలో నగర పోలీసు శాఖతోపాటు అనేక ప్రైవేటు సంస్థలకు చెందిన కార్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే గతంలోనే ఈ భవనం స్లాబ్ కూలడంతో బీఎంసీ సీబ్బంది దీనిపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఈ శాఖలకు మరో ప్రత్యామ్నాయాన్ని సమకూర్చలేదని ఓ అధికారి వివరించారు. దీంతో భవనం ఖాళీ చేయడం, మరమ్మతు పనుల్లో జాప్యం జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరో ప్రత్నామ్నాయ కార్యాలయం కోసం నెల క్రితం నగర ఇంజనీరింగ్ విభాగానికి ఓ లేఖ రాశామన్నారు. అయినప్పటికీ ఎటువంటి స్పందనా రాలేదని తెలిపారు. అంతేకాకుండా కొత్త కార్యాలయాన్ని చూసే బాధ్యతను తమకే అప్పగించారన్నారు. ఈ భవ నానికి స్ట్రక్చర్ ఆడిట్‌ను నిర్వహించే అంశంపై ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా నిర్మాణ మదింపు జరపకుండానే మూడో అంతస్తులోని గ్యాలరీని తొలగించిందన్నా రు. కాగా, ఈ భవనంలో అనేకచోట్ల పైకప్పు ప్లాస్టర్ ఊడి పడుతోందని. నిర్మాణ మదింపు నిర్వహించడంతోపాటు, తగు మరమ్మతు పనులు చేపట్టిఉంటే తాము మరో చోటికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. -
కొండంత ఫలాన్నిచ్చే ... కొల్హాపూర్ మహాలక్ష్మి
సకల ఐశ్వర్య సంపదలతో, సర్వ సమ్మోహన ముగ్ధ మనోహర రూపంతో విలసిల్లుతున్న దేవతామూర్తి శ్రీ మహాలక్ష్మి. అందుకే ఆమెను ‘దాసీభూత సమస్త దేవవనితాం’ అన్నారు. మనకి శక్తిని, ఉత్సాహాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే మహాలక్ష్మి రజోగుణాధీశ్వరి. ఆమె ఈ సృష్టినంతటినీ శాసిస్తున్న పరమేశ్వరి. ఆమె శక్తి అంశ. ఆ కారణంగానే భక్తులు మహాలక్ష్మిని నిత్యం పూజిస్తారు. మహాలక్ష్మికి ప్రీతికరమైన మాసం శ్రావణం. ఈ మాసంలో ఆ దేవిని పూజిస్తే సకలైశ్వర్యాలతో పాటు కార్యజయం కూడా కలుగుతుందని దేవీపురాణం చెబుతోంది. అయితే శ్రీ మహాలక్ష్మికి మనదేశంలో ఆలయాలు అరుదుగా ఉన్నాయి. చాలావరకు ఆలయాలు శ్రీమన్నారాయణ స్వామితో కలిసి ఉంటాయి తప్ప ప్రత్యేకించి మహాలక్ష్మి ఆలయాలు తక్కువ. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో శ్రీమహాలక్ష్మి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ‘కొల్హాపూర్ మహాలక్ష్మి’ అని పిలుస్తారు. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠంగా విరాజిల్లుతోంది. సతీదేవికి చెందిన నయనాలు ఈ క్షేత్రంలో పడి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా విలసిల్లుతోందని ఐతిహ్యం. మనదేశంలో ఉన్న మహాలక్ష్మి ఆలయాలలో కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం అగ్రగణ్యమైనది. అతి పురాతనమైన ఈ ఆలయం క్రీ.పూ. 4, 5 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మితమై ఉండవచ్చని ఇక్కడి శాసనాల ద్వారా అవగతమవుతోంది. సూర్యగ్రహణం రోజున ఇక్కడ స్నానం చేస్తే... ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించగా, నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా, శివుడు నీరుగా, విష్ణువు రాయిగా, మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్లుగా, మూడున్నర కోట్ల తీర్థాలూ సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారని, అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచ మహాపాతకాలు సైతం ప్రక్షాళనమవుతాయంటారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని కరవీర నగరమని, ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని స్తుతించారని పద్మ, స్కాంద, దేవీభాగవతాలు ప్రస్తావించాయి. పూర్వకథ... అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ఏటా కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి, శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే, అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట. శివుని ఆనతిమేరకు అగస్త్యుడు కొల్హాపూర్‌లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది. అమ్మవారు వెలసిన తర్వాత ఈ నగరానికి కరవీరపురమనే పేరు సార్థకమైంది. ఈ నగరాన్ని కోల్పూర్ అని కోల్‌గిరి అని, కొలదిగిరి పట్టణ్ అని పిలిచేవారు. ‘కొల్లా’ అంటే ‘లోయ’అని, ‘పూర్’ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రం విలసిల్లిందని చెబుతారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వికులు పాలించగా, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్థమానమైందని తెలుస్తోంది. శంకరులు దర్శించిన క్షేత్రం... శంకరాచార్యులవారు సైతం కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని స్థాపించారట. అనంతరకాలంలో విద్యాశంకర భారతి కొల్హాపూర్ క్షేత్రానికున్న ధార్మిక విశిష్టతను గుర్తించి 13వ శతాబ్దంలో ఓ మఠం నిర్మించారు. ఈ క్షేత్రానికి అన్ని దిక్కులా పుణ్యతీర్థాలు ఉండటం విశేషం. సర్వసౌభ్యాగ్యాల నిలయం... ఈ ఆలయంలో అమ్మవారి దర్శనమాత్రం చేతనే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. శ్రావణమాసంలో విశేష పూజలు జరుగుతాయి. ఇక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రోజుకో అలంకారంతో భక్తుల పూజలందుకునే అమ్మవారి ఆలయానికి దత్తాత్రేయుడు ప్రతిరోజూ మధ్యాహ్నం పూట భిక్షాటనకై వస్తారని ఐతిహ్యం. కొల్హాపూర్‌లో చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంతటి ఫలాలనిస్తుందని పెద్దలు చెబుతారు. ఇక్కడ అమ్మవారి ఆలయగుండంలో జ్యోతి ప్రజ్వలనం చేస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ దగ్ధమై శాంతిసౌఖ్యాలు లభిస్తాయని స్థలపురాణం చెబుతోంది. - దాసరి దుర్గాప్రసాద్ కొల్హాపూర్ మహాలక్ష్మిని పుష్పాలతో పూజిస్తే పువ్వుల్లాంటి పిల్లలు పుడతారట. అలాగే పసిపిల్లలను అమ్మవారి సమక్షంలో ఉంచితే ఆయా పిల్లల భవిష్యత్తు అమోఘంగా ఉంటుందట. వ్యాధులు, రోగాల బారిన పడిన వారు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి పాయసాన్ని సమర్పిస్తే రోగాలన్నీ మటుమాయవుతాయట. అవివాహితులు ఇక్కడి అమ్మవారికి శ్రీచక్రపూజలు జరిపిస్తే వివాహయోగం కలిగి వారి భావిజీవితం నందనవనంలా ఉంటుందని భక్తుల విశ్వాసం.