మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ బయోపిక్‌కి శ్రీకారం జరిగింది. ఈ మహా రాజ్ జయంతి (ఫిబ్రవరి 19) సందర్భంగా ‘రాజా శివాజీ’ టైటిల్‌తో బయోపిక్ రూపొందించనున్నట్లు రితేష్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. ఈ జీవిత చరిత్రలో టైటిల్ రోల్ చేయడంతో పాటు రితేష్ దర్శకత్వం కూడా వహించనున్నారు. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది పేరు మాత్రమే కాదు ఒక భావోద్వేగం. ఈ మట్టిలో పుట్టిన ఈ మాణిక్యానికి నా నివాళులు. ఆయన వారసత్వం రాబోయే తరా లకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మా ఈ నూతన ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు కావాలి.. జై శివరాయ్’’ అని పేర్కొన్నారు రితేష్.
కాగా, రెండేళ్ల క్రితం దర్శకుడిగా తొలి చిత్రం ‘వేద్’ (మరాఠీ)ని తెరకెక్కించి విజయం సాధించారు రితేష్. మలి ప్రయత్నంగా ఛత్రపతి శివాజీ వంటి భారీ బయోపిక్‌ను రూపొందించనున్నారు. మరాఠీ, హిందీ భాషల్లో జియో స్టూడియోస్ సమర్పణలో ముంబై ఫిల్మ్ కంపెనీ బేనర్ నిర్మించనున్న ఈ చిత్రానికి రితేష్ భార్య, నటి జెనీలియా ఓ నిర్మాత. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment