Riteish Deshmukh
-
అత్యంత అందమైన శాకాహార సెలబ్రిటీలు వీరే!
బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్‌ముఖ్‌లను పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా 2024కి గాను భారతదేశపు ’అత్యంత అందమైన శాకాహార సెలబ్రిటీలు’ గా ఎంపిక చేసింది. జంతు సంక్షేమం పట్ల గల అంకితభావానికి, కారుణ్య జీవనశైలి నిబద్ధతకు గుర్తింపుగా వారికి ఈ గౌరవం లభించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ‘పనితో సంబంధం లేకుండా కూడా వెలుగులోకి రావడం ఆనందంగా ఉంది’ని ఈ సందర్భంగా తెలియజేసింది. గతంలో హాటెస్ట్ వెజిటేరియన్ సెలబ్రిటీ అవార్డు టైటిల్ విజేతలలో జీనత్ అమన్, జాకీ ష్రాఫ్, ఫాతిమా సనా షేక్, రాజ్‌కుమార్ రావు, అలియా భట్, అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్, శ్రద్ధా కపూర్, సోనూసూద్, మానుషి చిల్లర్ .. వంటి సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. మానుషి చిల్లర్, సునీల్ ఛెత్రి, అనుష్క శర్మ, కార్తీక్ ఆర్యన్, విద్యుత్ జమ్వాల్, షాహిద్ కపూర్, రేఖ, అమితాబ్ బచ్చన్ లు కూడా అత్యంత అందమైన శాకా హారులుగా గుర్తింపు పొందారు. ఈ యేడాది జాక్వెలిన్ తన స్టార్ పవర్‌ను అన్ని జంతువుల రక్షణ కోసం ఉపయోగించడంలో పేరొందింది. 50 ఏళ్లకు పైగా సంకెళ్లలో ఉంచిన ఏనుగును రక్షించిన #Freegajraj ప్రచారంతో సహా అనేక మార్గాల్లో పెటా ఇండియా పనికి మద్దతుగా తన అభిమానులను సమీకరించింది.రితేష్ శాకాహారి. శాకాహారాన్ని ప్రోత్సహిస్తున్నాడు. భార్య జెనీలియాతో కలిసి శాకాహార మాంసం కంపెనీని కూడా స్థాపించాడు. ‘నటన నుంచి జంతు సంరక్షణ వరకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్‌ముఖ్ నిజమైన సూపర్ స్టార్లుగా నిరూపితమయ్యారు’ అని పెటా ఇండియా సెలబ్రిటీ, పబ్లిక్ రిలేషన్స్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ బంగేరా తెలిపారు. ‘ఈ విధంగా దయను ప్రపంచానికి చూపినందుకు పెటా ఇండియా వారిని గౌరవించడం ఆనందంగా ఉంది. అన్నింటికన్నా వీరిది నాణ్యమైన అందం’ అని ప్రశంసించారు. -
తుల్జాభవానీ అమ్మవారి సేవలో జెనిలీయా దంపతులు.. (ఫొటోలు)
-
వెండితెరపై ఛత్రపతి శివాజీ వీరగాధ.. భర్త దర్శకత్వం, భార్య నిర్మాత!
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ బయోపిక్‌కి శ్రీకారం జరిగింది. ఈ మహా రాజ్ జయంతి (ఫిబ్రవరి 19) సందర్భంగా ‘రాజా శివాజీ’ టైటిల్‌తో బయోపిక్ రూపొందించనున్నట్లు రితేష్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. ఈ జీవిత చరిత్రలో టైటిల్ రోల్ చేయడంతో పాటు రితేష్ దర్శకత్వం కూడా వహించనున్నారు. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది పేరు మాత్రమే కాదు ఒక భావోద్వేగం. ఈ మట్టిలో పుట్టిన ఈ మాణిక్యానికి నా నివాళులు. ఆయన వారసత్వం రాబోయే తరా లకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మా ఈ నూతన ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు కావాలి.. జై శివరాయ్’’ అని పేర్కొన్నారు రితేష్. కాగా, రెండేళ్ల క్రితం దర్శకుడిగా తొలి చిత్రం ‘వేద్’ (మరాఠీ)ని తెరకెక్కించి విజయం సాధించారు రితేష్. మలి ప్రయత్నంగా ఛత్రపతి శివాజీ వంటి భారీ బయోపిక్‌ను రూపొందించనున్నారు. మరాఠీ, హిందీ భాషల్లో జియో స్టూడియోస్ సమర్పణలో ముంబై ఫిల్మ్ కంపెనీ బేనర్ నిర్మించనున్న ఈ చిత్రానికి రితేష్ భార్య, నటి జెనీలియా ఓ నిర్మాత. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. -
కన్నీళ్లు పెట్టుకున్న జెనీలియా భర్త.. వీడియో వైరల్
మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ ఎమోషనల్ అయ్యారు. తన దివంగత తండ్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి దివంగత కాంగ్రెస్ నేత విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో రితీష్ తాజాగా మాట్లాడారు. ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. నాన్న చనిపోయి 12 ఏళ్లు అయింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.. ఆ సమయంలో వెంటనే ఆయన అన్నయ్య, లాతూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అమిత్ దేశ్‌ముఖ్ ఓదార్చారు. 'సాహెబ్ (విలాస్‌రావ్ దేశ్‌ముఖ్) మనల్ని విడిచిపెట్టి పన్నెండేళ్లు గడిచాయి. ఆయన లేకపోవడం వల్ల ఎంతో బాధగా ఉంటుంది. అతను ఈ రాష్ట్ర ప్రజల్లో ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ప్రకాశిస్తాడు. ఆయన గొప్పతనం ఎప్పటికీ మసకబారదు. అతను ప్రజల కోసం బలంగా నిలబడ్డాడు. తద్వారా ఇప్పుడు మేము, మా పిల్లలు కూడా నిలువెత్తు ఆవశ్యకతను అనుభవిస్తున్నాం. ఈరోజు ఆయన భౌతికంగా లేకపోయినా, మనపై ఆయన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. అది ఈ స్టేజీపైన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ వెలుగుల రూపంలో ప్రకాశవంతంగా కనిపింస్తుంది.' అని రితీష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 2012లో హీరోయిన్ జెనీలియాను బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి చివరిగా వేద్ అనే చిత్రంలో జంటగా కనిపించారు.తెలుగులో సూపర్ హిట్ అయిన ‘మజిలీ’ సినిమాకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. మే 26, 1945న లాతూర్‌లో జన్మించిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్రకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఆగస్టు 14, 2012న మరణించారు. थोरामोठ्यांचा आदर करणं ही महाराष्ट्राची संस्कृती आहे. प्रत्येक घराघरात हेच संस्कार केले जातात. परंतु, जेव्हा स्वार्थाचा विचार मनात येतो, तेव्हा सगळी नाती मागे पडतात आणि अशातच मग घर आणि पक्ष फोडावा लागला तरी कसलाच विचार लोक करत नाही.#Maharashtra #RiteishDeshmukh pic.twitter.com/i8xqWEzEYr — Nationalist Congress Party - Sharadchandra Pawar (@NCPspeaks) February 18, 2024 -
విభిన్న కథాంశంగా 'మిస్టర్ మమ్మీ'.. ఆకట్టుకుంటున్న వీడియో సాంగ్
నటనతో పాటు నిజ జీవితంలోనూ ఒక్కటైన జంట రితేష్ దేశ్‌ముఖ్- జెనీలియా. మళ్లీ ఒక దశాబ్దం తర్వాత వీరిద్దరూ వెండితెరపై కనిపించనున్నారు. తాజాగా వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం'మిస్టర్ మమ్మీ' విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో గర్భం దాల్చిన పురుషుడి పాత్రలో రితేష్ దేశ్‌ముఖ్ కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. 'పాపాజీ పేట్ సే' అంటూ సాగే పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌లో రితేశ్ దేశ్‌ముఖ్ ఫర్మామెన్స్ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించింది చిత్రబందం. షాద్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని టీ -సిరీస్ నిర్మిస్తోంది. -
యోధురాలైన బామ్మ.. గొప్ప కథ: హీరో
ఎంతటి కష్టం వచ్చినా ఆత్మాభిమానాన్ని వదులుకోకుండా సొంత కాళ్లపైనే నిలబడాలనుకునే వాళ్లు ఈ ప్రపంచంలో కొంత మందే ఉంటారు. పుణెకు చెందిన శాంతాబాయి పవార్ కూడా ఈ కోవకే చెందుతారు. ఎనిమిది పదుల వయసులోనూ శక్తిని కూడదీసుకుని తనకు వచ్చిన విద్యను ప్రదర్శిస్తూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నారు. రోడ్ల మీద కర్రతో విన్యాసాలు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్ కాలంలోనూ ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఈ సూపర్ బామ్మకు సంబంధించిన వీడియోను బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘యోధురాలైన ఈ బామ్మ వివరాలు ఇవ్వగలరా’’అంటూ తన ఫాలోవర్లను అడిగారు.(సంపదలో పేదవాడు.. గుణంలో ధనవంతుడు) ఇందుకు స్పందించిన నెటిజన్లు.. శాంతాబాయికి సంబంధించిన వివరాలను రితేశ్‌కు తెలియజేశారు. అదే విధంగా గతంలో తాము ఆమెకు సహాయపడిన తీరును వివరిస్తూ ఫొటోలు చేశారు. ‘‘తన కాళ్ల మీద తాను నిలబడుతూ.. ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్న ఈ బామ్మకు సెల్యూట్’’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక శాంతాబాయి వివరాలు తెలియడంతో తన టీం ఆమెను కలిసేందుకు వెళ్లిందని.. ఆమెది చాలా గొప్ప కథ అంటూ రితేశ్ తన ఫాలోవర్లకు ధన్యవాదాలు తెలిపారు.(‘శభాష్ పోలీస్’.. నెటిజన్ల ప్రశంసలు) -
మిస్ యూ పప్పా: హీరో భావోద్వేగం
‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. మిమ్మల్ని రోజూ మిస్సవుతున్నా!!’’ అంటూ బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ తన తండ్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ జయంతి సందర్భంగా భావోద్వేగ వీడియోను షేర్ చేశాడు. హ్యాంగర్‌కు తగిలించి ఉన్న తండ్రి కుర్తా స్లీవ్‌లో తన చేతిని ఉంచిన రితేశ్.. దానిని ఆలింగనం చేసుకుని ఆ చేతితో తన తలను తానే నిమురుకున్నాడు. తండ్రే స్వయంగా దిగివచ్చి తనను ఆత్మీయంగా హత్తుకున్నట్టు ఉద్వేగానికి లోనయ్యాడు. మిస్ యూ నాన్నా అంటూ ట్విటర్ వేదికగా నివాళి అర్పించాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను వీక్షించిన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. ‘ఎంత అందమైన వీడియో’అంటూ రితేశ్ ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు. అతడితో పాటు మరికొంత మంది సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.(ప్రముఖ దర్శకుడి ఇంట్లో ఇద్దరికి కరోనా పాజిటివ్) కాగా రితేశ్ భార్య, నటి జెనీలియా సైతం మామగారిని గుర్తు చేసుకుంటూ.. ‘‘నువ్వు గర్వపడే విషయం ఏమిటని టీచర్ రియాన్‌ను అడిగినపుడు.. వాడి సమాధానం.. మా తాతయ్య అని. ఎల్లప్పుడూ మేం మీ సమక్షంలోనే ఉన్నట్లు భావిస్తాం. మీరెక్కడున్నా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారని తెలుసు. మా అందరిలో మీరు జీవించే ఉన్నారు. హ్యాపీ బర్త్‌డే పప్పా’’అని భావోద్వేగపూరిత పోస్టు పెట్టారు. కాగా 1945 మే 26న జన్మించిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్.. మహారాష్ట్ర సీఎంగా, కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. 2012లో కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధితో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. విలాస్‌రావ్ నలుగురు కుమారుల్లో రితేశ్ సినీరంగంలో ఉండగా.. మిగిలిన వారు రాజకీయాల్లో ప్రవేశించి తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.(‘గ్లామర్ వాలా, సఫాయీ వాలా ఒకటే’) -
ఇది శాశ్వతం.. మీ ప్రేమకు ధన్యవాదాలు!
‘తుజే మేరీ కసమ్కు పదిహేడేళ్లు... నా మొదటి సినిమా. ఇందులో నా హృదయం అంటే నా భర్త కూడా ఉన్నాడు’ అంటూ హీరోయిన్ జెనీలియా తన భర్త రితేశ్ దేశ్ముఖ్తో స్టెప్పులేస్తున్న వీడియోను షేర్ చేశారు. ‘తుజే మేరీ కసమ్’ సినిమాతో జెనీలియా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు రితేశ్ దేశ్‌ముఖ్ కూడా ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయమయ్యాడు. ఇందులో జంటగా కనిపించిన జెనీలియా- రితేశ్.. షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. పెళ్లికి పెద్దల ఆమోదం లభించకపోవడంతో కొన్నాళ్లు స్నేహితులుగానే ఉన్న ఈ స్టార్ కపుల్.. పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ జంటకు రేహిల్, రియాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా వీరిద్దరి బంధానికి బీజం వేసిన ‘తుజే మేరీ కసమ్’ సినిమా విడుదలై(2003) నేటికి సరిగ్గా పదిహేడేళ్లు. ఈ సందర్భంగా తొలి సినిమాలోని పాటలకు స్టెప్పులేసిన ఈ స్టార్ కపుల్... ఇందుకు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఇది నిన్ననే జరిగినట్లుగా అనిపిస్తుంది. కొన్ని విషయాలు జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. మాపై ఇంతగా ప్రేమ కురిపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అని భావోద్వేగ క్యాప్షన్ జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ‘ఎల్లప్పుడూ మీరిద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలి. ప్రేమ బంధాన్ని.. పెళ్లి పీటలు ఎక్కించి మా అందరికీ ఆదర్శంగా నిలిచిన మీ బంధం శాశ్వతంగా నిలిచి ఉంటుంది’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక తొలి సినిమాతోనే రితేశ్- జెనీలియా సూపర్‌హిట్ కొట్టారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా టాలీవుడ్ హీరో తరుణ్ ‘నువ్వే కావాలి’ మూవీకి రీమేక్. View this post on Instagram #17YearsOfTujheMeriKasam Feels like yesterday... somethings in life are forever. Thank you all for the unconditional love that you have showered upon @geneliad & me. Location: Babhalgaon, Latur Shot by : @sandeep_films A post shared by Riteish Deshmukh (@riteishd) on Jan 2, 2020 at 11:50pm PST View this post on Instagram 17 years on .... fees like yesterday- reliving the memories of our debut film. #17YearsOfTujheMeriKasam @geneliad - Shot by @sandeep_films A post shared by Riteish Deshmukh (@riteishd) on Jan 2, 2020 at 11:15pm PST -
‘నువ్వు ఎల్లప్పుడూ నా వాడివే’
బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ నేడు 41వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా రితేశ్ భార్య, నటి జెనీలియా షేర్ చేసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. తమ ఇద్దరు కుమారులు, తాను రితేశ్‌ను ఆత్మీయంగా ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసిన జెనీలియా... ‘నువ్వు ఎల్లప్పుడూ నా వాడివే. నీకు వందేళ్లు వచ్చినా ఎలాంటి మార్పూ ఉండదు. నేడైనా రేపైనా నువ్వున్నది నా కోసమే. హ్యాపీ బర్త్‌డే లవ్. ఎన్నటికైనా నా ప్రేమ నీకే సొంతం’ అంటూ క్యాప్షన్ జత చేశారు. ఈ క్రమంలో రితేశ్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా జెనీలియా- రితేశ్‌ల జోడి తమకు ఆదర్శమని, మీ ప్రేమ ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలని పలువురు నెటిజనన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ‘తుజే మేరీ కసమ్’ సినిమాలో కలిసి నటించిన రితేశ్ దేశ్‌ముఖ్- జెనీలియా బీ-టౌన్ ప్రేక్షకులను ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట రియల్ లైఫ్‌లోనూ జోడీ కట్టారు. పెళ్లికి తొలుత పెద్దల నుంచి వ్యతిరేకత రావడంతో... కొన్నాళ్లపాటు స్నేహితులుగానే ఉన్న ఈ స్టార్ కపుల్.. పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరికి రేహిల్, రియాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక రితేశ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర మాజీ సీఎం, దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడన్న సంగతి తెలిసిందే. ‘బొమ్మరిల్లు’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనస్సుల్లో ‘హాసిని’గా చెరగని ముద్రవేసుకున్న జెనీలియా.. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నారు. View this post on Instagram Dear Forever Mine😍😍😍 Il say the same thing to you now, that Il say to you when you turn 100 - You are my today and all of my tomorrows Happy Birthday Love Forever yours ❤️❤️❤️ Ps- I’m always in the mood for you 😘 A post shared by Genelia Deshmukh (@geneliad) on Dec 16, 2019 at 6:32pm PST -
నాన్నా.. సాధించాం : హీరో భావోద్వేగ ట్వీట్
సాక్షి, ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకుని పలువురు రాజకీయ వారసులు చట్టసభలో అడుగుపెట్టబోతున్నారు. హరియాణా, మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలు సహా దేశ వ్యాప్తంగా పలు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన ఆదిత్య ఠాక్రే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికకాగా.. మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారులు అజిత్ దేశ్‌ముఖ్, ధీరజ్ దేశ్‌ముఖ్(ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ తరఫున) లాతూర్ జిల్లా నుంచి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మరో కుమారుడు, బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. ‘ నాన్న మేము సాధించాం!! వరుసగా మూడోసారి అమిత్ లాతూర్ సిటీలో గెలుపొందగా(40 వేల మెజార్టీ), ధీరజ్ లాతూర్ రూరల్ అసెంబ్లీ స్థానాన్ని లక్షా 20 వేల భారీ మెజార్టీతో సొంతం చేసుకున్నాడు. లాతూర్ ప్రజలు మాపై ఉంచిన విశ్వాసానికి, నమ్మకానికి ధన్యవాదాలు’ అని ట్విటర్లో పేర్కొన్నాడు. ఇక ఠాక్రే, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ వారసులతో పాటు... కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణతి షిండే గెలుపొందగా... మాజీ సీఎం నారాయణ రాణే కుమారుడు నితేష్ రాణేలతోపాటు పలువురు రాజకీయ నాయకుల వారసులు విజయం సాధించిన విషయం విదితమే. We did it PAPPA!!! @AmitV_Deshmukh wins Latur (city) by 42000+ votes for the 3rd consecutive time.@MeDeshmukh wins Latur (rural) by 1,20,000 votes. Thank you people of Latur for this faith & trust. pic.twitter.com/pOGFsmoEJU — Riteish Deshmukh (@Riteishd) October 24, 2019 వర్లీ నుంచి ఆదిత్య ఠాక్రే శివసేన అధినేత దివంగత బాల్ ఠాక్రే మనవడు, శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఘన విజయం సాధించారు. దీంతో ఠాక్రే కుటుంబం నుంచి మొట్టమొదటిసారిగా ఆయన అసెంబ్లీకి వెళ్లనున్నారు. శివసేనకు పెట్టనికోటగా ఉన్న ముంబైలోని వర్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి యువసేన అధ్యక్షులైన ఆయన బరిలోకి దిగారు. ఆయనకు వ్యతిరేకంగా ఎన్సీపీ అభ్యర్థి సురేష్ మానే, వంచిత్ ఆఘాడి అభ్యర్థి గౌతం గైక్వాడ్, ఇండిపెండెంట్ అబిజీత్ బిచ్‌కులేతోపాటు 12 మంది బరిలోకి దిగారు. అయితే ఆదిత్య ఠాక్రేకు 89,248 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు 21,821 ఓట్లతో ఎన్సీపీ అభ్యర్థి సురేష్ మానే ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇలా ఆదిత్య ఠాక్రే 67,427మ ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు వర్లీ నియోజకవర్గంలో 6305 మంది ఓటర్లు నోటాకు ఓటేవ్వడం కూడా విశేషం. ధీరజ్ దేశ్‌ముఖ్ భారీ మెజార్టీ మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని లాతూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ కుమారుడు ధీరజ్ దేశ్‌ముఖ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఇక్కడ ప్రత్యర్థులైన శివసేన అభ్యర్థి సచిన్ అలియాస్ రవి దేశ్‌ముఖ్ కంటే అధికంగా ‘నోటా’కు ఓట్లు వచ్చాయి. ఎక్కడలేని విధంగా నోటా ద్వితీయ స్థానంలో నిలిచింది. దీంతో లాతూరు రూరల్ లోకసభ నియోజకవర్గం ఫలితాలు అందరిని దృష్టిని ఆకర్శించాయి. కడపటి వివరాలు అందిన మేరకు కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ దేశ్‌ముఖ్‌కు 1,33,161 ఓట్లు పోలవ్వగా నోటాకు ఏకంగా 27,287 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు శివసేన అభ్యర్థి సచిన్‌అలియాస్ రవీ దేశ్‌ముఖ్‌కు 13,335 ఓట్లు పోలయ్యాయి. -
అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’ ట్రైలర్ లాంచ్
-
సర్ప్రైజ్ చేయమన్నందుకు...ఇదిగో ఇలా!!
‘తుజే మేరీ కసమ్’ సినిమాలో కలిసి నటించిన రితేశ్ దేశ్‌ముఖ్- జెనీలియా బీ-టౌన్ ప్రేక్షకులను ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట రియల్ లైఫ్‌లోనూ జోడీ కట్టారు. పెళ్లికి పెద్దల ఆమోదం లభించకపోవడంతో కొన్నాళ్లు స్నేహితులుగానే ఉన్న ఈ స్టార్ కపుల్.. పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వివాహ బంధంతో ఒక్కటై కపుల్ గోల్స్‌ను సెట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరు కుమారులతో క్యూట్ ఫ్యామిలీ కలిగి ఉన్న ఈ జంట సోషల్ మీడియాలో తమకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడంలోనూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా జెనీలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రితేశ్ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘ సరికొత్త లుక్‌తో నన్ను సర్ప్రైజ్ చేయమని రితేశ్‌ను అడిగాను. ఇదిగో తను ఇలా ఎర్ర రంగు ఉడుత తోకతో నా ముందుకు వచ్చాడు... కూల్‌గా ఉంది కదా!!’ అంటూ రితేశ్ న్యూలుక్ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ క్రమంలో.. ‘మీ మాటకు విలువనిచ్చి రితేశ్ ఇలా తయారయ్యాడా? గ్రేట్. మాకు కూడా చెప్పండి ఈ హెయిర్‌స్టైల్ పేరేమిటో. మీ జంట ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా రితేశ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడన్న సంగతి తెలిసిందే. ఇక రితేశ్‌తో కలిసి తొలిసారి వెండితెరపై సందడి చేసిన జెనీలియా అతడిని పెళ్లి చేసుకుని ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నారు. View this post on Instagram Asked @riteishd to surprise me with a new look & he comes back sporting a Red Squirrel Tail .... COOL isn’t it 😍😍😍😍???? A post shared by Genelia Deshmukh (@geneliad) on May 31, 2019 at 7:15am PDT -
ఇది బచ్చాగ్యాంగ్ చాలెంజ్!!
బీ టౌన్ స్టార్ కిడ్స్ తైమూర్, అబ్రామ్, ఆరాధ్య బచ్చన్, ఇనాయా ఖేము, మిషాలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. వీరి ఫొటోలు షేర్ చేస్తే చాలు లక్షల్లో లైకులు వచ్చిపడతాయి. తాజాగా ఈ జాబితాలో చేరేందుకు బాలీవుడ్ స్టార్ కపుల్ జెనీలియా- రితేశ్‌ల చిన్న కుమారుడు రెహిల్ కూడా సిద్ధమైపోయాడు. అయితే అందరిలా కేవలం ఫొటోలతో సరిపెట్టకుండా... ఫిట్నెస్ వీడియోతో అదరగొట్టాడు. తన తండ్రి రితేశ్ దేశ్‌ముఖ్ విసిరిన ఫిట్నెస్ చాలెంజ్‌ను స్వీకరించిన రెండేళ్ల రెహిల్... రోప్ సాయంతో గోడ మీదకి ఎక్కుతూ చాలెంజ్ పూర్తి చేశాడు. అంతేకాదు... స్టార్ కిడ్స్ తైమూర్ అలీఖాన్, లక్ష్యా కపూర్, కరణ్ జోహార్ కవలలు యశ్- రూహీలకు చాలెంజ్ కూడా విసిరాడు. రెహిల్కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన జెనీలియా..‘ రెహిల్.. వాళ్ల నాన్న విసిరిన ఫిట్నెస్ చాలెంజ్‌ను స్వీకరించాడు. ఇప్పుడు బచ్చా గ్యాంగ్‌కు చాలెంజ్ విసురుతున్నాడు.. #బచ్చేఫిట్తోదేశ్ఫిట్’ అంటూ క్యాప్షన్ జత చేశారు. రెహిల్ క్యూట్ వీడియోను చూసిన కరణ్ జోహార్...‘ ఓ మైగాడ్!!! చూడండి!!!! ఇతను రాక్‌స్టార్. నేనైతే రెహిల్లా చాలెంజ్ పూర్తి చేస్తానో లేదో’ అంటూ సరదాగా కామెంట్ చేశారు. Rahyl accepts his Baba’s #FitnessChallenge ... He further challenges the Bachcha Gang..... #BachceFitTohDeshFit A post shared by Genelia Deshmukh (@geneliad) on Aug 28, 2018 at 11:46pm PDT OMG!!! Look at him!!!! He’s a rock star!!!! Am nervous to even attempt this with mine😂😂😂 https://t.co/nihN0wVjyz — Karan Johar (@karanjohar) August 29, 2018 -
జెనీలియా రెండ్రోజులు నాతో మాట్లాడలేదు!
సాక్షి, ముంబై: రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజాలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన తొలి సినిమా 'తుఝే మేరి కసమ్' సినిమా వచ్చి అప్పుడే 15 ఏళ్లు అవుతోంది. ఈ సినిమా రితేశ్, జెనీలియాల జీవితాన్ని మార్చివేసింది. ఈ సినిమాలో సహనటులుగా ప్రస్థానాన్ని ప్రారంభించిన వీరిద్దరు ఇప్పుడు భార్యాభర్తలుగా కలిసి జీవితాన్ని సాగిస్తున్నారు. ఇదే విషయాన్ని గుర్తుచేసిన రితేశ్.. ఈ సినిమా సెట్స్‌లో మొదటి రెండురోజులు జెనీలియా తనతో అస్సలు మాట్లాడలేదని తెలిపాడు. ప్రముఖ తెలుగు దర్శకుడు కే విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన 'తుఝే మేరి కసమ్' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 'జనవరి 3, 2003న 'తుఝే మేరీ కసమ్' సినిమా విడుదలైంది. నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. మొదటి సినిమాతోనే జీవితం మారిపోయింది. ఆర్కిటెక్ట్ నటుడు అయ్యాడు. సహనటి జెనీలియా జీవితభాగస్వామి అయింది' అని రితేశ్ ట్వీట్ చేశారు. నిర్మాత రామోజీరావు, దర్శకుడు విజయ్‌భాస్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 'మా నాన్న అప్పటి ముఖ్యమంత్రి కావడంతో సినిమా షూటింగ్ సమయంలో తొలిరెండురోజులు జెనీలియా మాట్లాడలేదు. ఆమె అడిగిన మొదటి మాట నీ సెక్యూరిటీ ఏదని.. నాకు ఎలాంటి సెక్యూరిటీ లేదని చెప్పాను' అని రితేశ్ గుర్తుచేసుకున్నారు. దివంగత మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడైన రితేశ్ తనను ఈ సినిమాకు రికమండ్ చేసినందుకు సినిమాటోగ్రాఫర్ కబీర్‌లాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. Sincere thanks to Director Vijaya Bhaskar Ji - I Love You Sir, Producer Shri Ramoji Rao Sir 🙏🏽 Respect. Cinematographer Kabir Lal Sir- who recommended me. 🙏🏽. #15YearsOfTujheMeriKasam pic.twitter.com/npIpCgd6jQ — Riteish Deshmukh (@Riteishd) 3 January 2018 .@geneliad didn’t speak to me for the first two days during the shoot of the film because my father was the Chief Minister on Maharashtra then. #15YearsOfTujheMeriKasam pic.twitter.com/dezgUiqtpz — Riteish Deshmukh (@Riteishd) 3 January 2018 -
225 కోట్లతో శివాజీ బయోపిక్..!
బాహుబలి ఘనవిజయం సాధించటంతో ఇప్పుడు చాలా మంది దర్శక నిర్మాతలు భారీ చిత్రాల నిర్మాణానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలు ఎనౌన్స్ కాగా.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్ చేశారు మరాఠా మేకర్స్. మరాఠా యోదుడు శివాజీ కథతో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. 225 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ, రితేష్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ' బాహుబలి మెరుపుల తరువాత, మరో గొప్ప వార్త.. రితేష్ దేశ్‌ముఖ్ 225 కోట్ల బడ్జెట్‌తో శివాజీ సినిమాను రూపొందించటం. బాహుబలి కన్నా శివాజీ కథలో గొప్ప హీరోయిజం, డ్రామా ఉంటుంది. భరత మాత ముద్దుబిడ్డగా శివాజీ కథ అందరికీ బాగా తెలిసిన కథ, ఈ కథలోని యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. గొప్ప సినిమాను రూపొందిస్తున్నందుకు రితేష్‌కు కృతజ్ఞతలు. బాహుబలి తెలుగు వారికి ఎలాగో, మరాఠిలకు శివాజీ అలా నిలిచిపోయే చిత్రంగా రితేష్ రూపొందిస్తున్నాడు.' అంటూ ట్వీట్ చేశాడు. రితేష్.. చాలా కాలంగా శివాజీ కథను సినిమాగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రితేష్ స్వయంగా శివాజీగా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో నటిస్తుండగా, సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించేందుకు అంగీకరించాడన్న ప్రచారం కూడా జరిగింది. అయితే బడ్జెట్ పరంగా వర్క్ అవుట్ కాదన్న అనుమానంతో ఇంత కాలం ఈ ప్రాజెక్ట్‌ను వాయిదా వేస్తూ వచ్చారు. బాహుబలి ఘనవిజయం సాధించటంతో శివాజీ బయోపిక్ మరోసారి తెర మీదకు వచ్చింది. After the Bahubali thunder I just heard great news that RiteishDeshmukh is making Shivaji at a whopping cost of more than 225 crores — Ram Gopal Varma (@RGVzoomin) 11 May 2017 Shivaji's story has more heroism and drama than Bahubali nd he was real unlike Bahubali which will make it a more thrilling experience — Ram Gopal Varma (@RGVzoomin) 11 May 2017 Shivaji is known throughout india as the bravest son of india who fought against invasion ..Am sure the battle scenes will be magnificient — Ram Gopal Varma (@RGVzoomin) 11 May 2017 Shivaji being the subject as an audience I want to thank Riteish for venturing to make the greatest Indian film ever — Ram Gopal Varma (@RGVzoomin) 11 May 2017 Am sure Riteish is doing Shivaji at this large scale only for it to become ultimate pride of Maharashtra like Bahubali for Andhra Pradesh — Ram Gopal Varma (@RGVzoomin) 11 May 2017 -
భార్య యంగ్‌గా కనిపిస్తే.. మరీ భర్త..!
‘అంతేనా.. వీలుంటే నాలుగు మాటలు.. కుదరితే కప్పు’ అంటూ ‘బొమ్మరిల్లు’లో ఆకట్టుకున్న జెనీలియా గుర్తుంది కదా! పలు తెలుగు సినిమాల్లో నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకొని హాయిగా వైవాహిక జీవితాన్ని గడుపుతోంది. బాలీవుడ్‌లోని క్యూటెస్ట్ జంటలలో రితేశ్-జెనీలియా జోడీ ఒకటని చెప్పవచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తమ ప్రేమకథలోని ఒక్కో పేజీని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల ఓ స్మార్ట్‌ఫోన్ ప్రమోషన్ కార్యక్రమంలో జెనీలియా పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆమెతో దిగిన ఫొటోను పెట్టి రితేష్ ఓ ఆసక్తికరమైన కామెంట్ పెట్టాడు. ‘మీ భార్య టీనేజర్లా మరీ యంగ్‌గా కనిపిస్తే.. మీరు ఆమెకు తండ్రిలా కనిపిస్తారు’అంటూ ఫన్నీ కామెంట్ పెట్టాడు. నిజమే జెనీలియా ఇప్పటికీ తన చార్మింగ్ లుక్‌ను కోల్పోలేదు. రితేష్-జెనీలియా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల రియాన్, ఐదేళ్ల రహిల్‌ను శ్రద్ధగా చూసుకుంటూ తల్లిగా తాను మురిసిపోతున్నట్టు జెనీలియా చెప్తోంది. -
చవితి పండక్కి 'రితేష్' కొత్త గీతం...
-
చవితి పండక్కి 'రితేష్' కొత్త గీతం...
వినాయక చవితి వస్తోందంటే దేశవ్యాప్తంగా ముందుగానే సందడి మొదలౌతుంది. ముఖ్యంగా ముంబైలో గణేష్ చతుర్థి హంగామా అంతా ఇంతా కాదు. రంగురంగుల విగ్రహాల తయారీతోపాటు ఉత్సవాల్లో సందడి చేసే పాటలకూ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ముఖ్యంగా గణపతి బప్పా మోరియా అంటూ వినిపించే గీతాలు.. గణపతి నవరాత్రుల్లో ఎంతో ఆదరణ పొందుతాయి. అయితే ఇంతకు ముందెన్నడూ వినని ప్రత్యేక ట్యూన్స్ తో, ఈసారి భిన్నంగా కంపోజ్ చేసిన 'థాంక్ గాడ్ బప్పా' సాంగ్ లోని ప్రతి చరణం ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ తో ఓ మరాఠీ ఛానల్ 'థాంక్ గాడ్ బప్పా' అంటూ ఓ కొత్త గీతాన్నిరూపొందించింది. వినాయకుడి వేషంలో ఉన్న పిల్లలతో పాటు డ్యాన్స్ చేస్తూ.. ఈ పాటలో రితేష్ విభిన్నంగా కనిపించడం విశేషం. ఒక్కోసారి ఒక్కో పాత్రలో తనదైన ప్రత్యేకతతో ఒదిగిపోయిన రితేష్.. పాటతో జనానికి ఓ సందేశం ఇవ్వడం కూడా కనిపిస్తుంది. దేవుడి పేరుతో జరిగే మోసాలను, అక్రమాలను ఎత్తి చూపడమే ఈ పాట ప్రధానాంశంగా కనిపిస్తుంది. అయితే మరాఠీ పాట కావడంతో వీడియో సాంగ్ ప్లే అవుతున్నపుడు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కనిపిస్తాయి. చందాల పేరుతో మోసాలు చేసినా... పర్మిషన్ల పేరుతో పోలీసులు దండుకున్నా అందర్నీ ఒకేలా చూసే దేవుడ్ని మెచ్చుకుంటూ... థాంక్ గాడ్ బప్పా.. అంటూ సెటైరికల్ గా ఈ పాట సాగుతుంది. కపిల్ సావంత్ దర్శకత్వం, రితేష్ భార్య.. జెనీలియా దేశ్ ముఖ్ నిర్మాణంలో ఈ మ్యూజిక్ వీడియో రూపొందించారు. ఈసారి గణేష్ ఉత్సవాల సందర్భంలో విడుదలైన ఈ పాట.. ఇప్పటికే ఎందరో బాలీవుడ్ ప్రముఖుల ట్వీట్లతో ప్రశంసలు పొందుతోంది. Bribe HIM with treats, HE'll still smile with all HIS teeth -
లవ్లీ కపుల్.. స్వీట్ ట్వీట్స్
బాలీవుడ్ క్యూట్ అండ్ హ్యాపీ కపుల్ జెనీలియా, రితేష్‌లు సందర్భం వచ్చిన ప్రతిసారి తమ ప్రేమను వ్యక్తపరచుకుంటూనే ఉంటారు. ఇటీవలే రెండవ బిడ్డకు జన్మనిచ్చిన జెనీలియా ప్రస్తుతం ఆ సంబరంలోనే ఉంది. అయితే శుక్రవారం జెన్నీ పుట్టినరోజు కావడంతో తోటి నటీనటులు, సన్నిహితుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అన్నిటికంటే, అందరికంటే.. భర్త రితేష్ నుంచి అందిన విషెస్ ఆమెతోపాటు అందరినీ ఆకట్టుకున్నాయి. 'నిన్ను నవ్వుతూ చూడటం కంటే నన్నేదీ సంతోషంగా ఉంచలేదు. హ్యాపీ బర్త్ డే బయ్కో(బయ్కో అంటే మరాఠీలో భార్య అని అర్థం)'.. అంటూ వారిద్దరూ ఉన్న ఓ అపురూపమైన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. భర్త ప్రేమకు జెనీలియా స్పందిస్తూ.. 'థాంక్యూ నవ్రా( నవ్రా అంటే మరాఠీలో భర్త అని అర్థం).. నేనెప్పుడూ నవ్వుతూ ఉండటానికి నువ్వే కారణం, లవ్ యూ సోమచ్' అంటూ ట్వీట్ చేశారు. ఈ లవ్లీ కపుల్ స్వీట్ విషెస్ పలువురిని ఆకట్టుకున్నాయి. వీరి ప్రేమ వర్థిల్లుగాక అంటూ ప్రేమగా దీవించేస్తున్నారు. 'నువ్వేకావాలి' సినిమాకు రీమేక్ గా తీసిన 'తుఝే మేరీ కసమ్' సినిమా ద్వారా జెనీలియా, రితేష్‌లు తొలిసారి బాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. ఆ పరిచయం స్నేహమై, స్నేహం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో 2012లో వైభవంగా వివాహం చేసుకున్నారు. అనోన్యమైన జంటగా వీరికి మంచి పేరుంది కూడా. ఇద్దరు పిల్లల తల్లి అయిన జెనీలియా వెండితెరకు తాత్కాలికంగా దూరమయ్యారు. పలు విజయవంతమైన చిత్రాలతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆమె తిరిగి వెండితెరపై మెరవాలనే అభిమానుల ఆశ త్వరలో నెరవేరాలని ఆశిద్దాం. హ్యాపీ బర్త్ డే హాసినీ. Happy Birthday Baiko @geneliad - nothing makes me happier than seeing you smile. Have the bestest one. #HBDGenelia pic.twitter.com/PT7GfExh79 — Riteish Deshmukh (@Riteishd) 4 August 2016 Thank you Navra.. Ur the reason I smile always .. Love you so much https://t.co/IYsNdaRZR2 — Genelia Deshmukh (@geneliad) 5 August 2016 -
రిలీజ్‌కు ముందే ఆన్లైన్లో సినిమా లీక్!
న్యూఢిల్లీ: రితేశ్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబరాయ్, ఆఫ్తాబ్ శివదాసని, ఊర్వశీ రౌతేలా, పూజా బోస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆడల్ట్ కామెడీ మూవీ 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'... 'మస్తీ', 'గ్రేట్ మస్తీ' సిరీస్ భాగంగా వస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే ఆన్ లైన్ లో లీకైంది. ఈ లీకు ఆన్ లైన్ లో దుమారం రేపడంతో అప్రమత్తమైన 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' చిత్రయూనిట్ ఈ సినిమా విడుదలను ఒక వారం ముందుకు జరిపింది. నిజానికి ఈ సినిమా వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. ఈ శుక్రవారమే (ఎల్లుండి) విడుదల చేయబోతున్నారు. సినిమా ఆన్ లైన్ లో లీకు కావడంపై స్పందించడానికి 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' స్టార్లు రితేశ్, వివేక్, ఆఫ్తాబ్ నిరాకరించారు. ఈ విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానం ఇవ్వలేదు. ఢిల్లీలో బుధవారం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాలుపంచుకున్న వారు ఈ విషయంపై తాము కామెంట్ చేయబోమని చెప్పారు. సినిమా లీక్ పై నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయనుందని వివేక్ తెలిపారు. 'మస్తీ' సిరీస్ లో భాగంగా వస్తున్న మూడో సినిమాలోనూ తాము కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉందని, గత 12 ఏళ్లుగా ఈ సినిమాల కోసం పనిచేయడం వల్ల తమ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని ముగ్గురు స్టార్లు పేర్కొన్నారు. -
'హౌస్‌ఫుల్' కలెక్షన్లతో దూసుకుపోతోంది!
ముంబై: బాలీవుడ్ దర్శక ద్వయం సాజిద్-ఫర్హాద్ తాజా కామెడీ సినిమా 'హౌస్‌ఫుల్-3'... హౌస్‌ఫుల్ కలెక్షన్లు సాధిస్తోంది. తొలిరోజు 15.21 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండోరోజు మరింతగా పుంజుకొని రూ. 16.31 కోట్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా ఆడుతున్న థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయని పరిశీలకులు చెప్తున్నారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా రెండురోజుల్లో మొత్తంగా 31.51 కోట్లు రాబట్టింది. అక్షయ్‌కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్ హీరోలుగా నటించిన ఈ కామెడీ మూవీ మీద క్రిటిక్స్ పెదవి విరిచారు. రివ్యూలూ సోసోగానే వచ్చాయి. ఒక్క అక్షయ్ నటన తప్ప పెద్దగా కామెడీ లేకుండానే 'హౌస్‌ఫుల్-3' ఉందంటూ రివ్యూలు అభిప్రాయపడ్డాయి. ఈ రివ్యూల సంగతి ఎలా ఉన్నా.. ఈ సినిమా కలెక్షన్లు భారీగా ఉన్నట్టు బాలీవుడ్ ట్రెడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. తొలిరెండో రోజుల్లో భారత్‌లో రూ. 31.51 కోట్లు సాధించిన ఈ సినిమా ఆదివారం మరింతగా వసూళ్లు రాబట్టే అవకాశముందని పేర్కొన్నారు. ఈ విదేశాల్లోనూ ఈ సినిమా పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టుతున్నదని, యూఈఏ కలుపుకొని విదేశాల్లో రెండురోజుల్లో ఈ సినిమా రెండు మిలియన్ డాలర్లు (రూ. 13.36కోట్లు) రాబట్టిందని వెల్లడించారు. గతంలో సూపర్ హిట్ అయిన 'హౌస్‌ఫుల్' సినిమాకు థర్డ్ పార్ట్‌గా తాజా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ, రితేశ్, అభిషేక్ లకు జోడీగా జాక్వలిన్ ఫెర్నాండెజ్, లిసా హేడన్, నర్గీస్ ఫక్రీ నటించారు. అక్షయ్, రితేశ్ 'హౌస్‌ఫుల్' తొలి రెండు పార్ట్‌లలో కనిపించగా.. మూడో పార్టులో తాజాగా అభిషేక్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను నడియావాలా గ్రాండ్‌సన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. -
ఆ సిన్మాకు తొలిరోజు సూపర్ కలెక్షన్లు
ముంబై: బాలీవుడ్ దర్శక ద్వయం సాజిద్-ఫర్హాద్ తాజా సినిమా 'హౌస్‌ఫుల్-3'... అక్షయ్‌కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్ హీరోలుగా నటించిన ఈ కామెడీ మూవీ మీద క్రిటిక్స్ పెదవి విరిచారు. రివ్యూలూ సోసోగానే వచ్చాయి. ఒక్క అక్షయ్ నటన తప్ప పెద్దగా కామెడీ లేకుండానే 'హౌస్‌ఫుల్-3' ఉందంటూ రివ్యూలు అభిప్రాయపడ్డాయి. ఈ రివ్యూల సంగతి ఎలా ఉన్నా.. తొలిరోజు మాత్రం ఈ సినిమా భారీగానే కలెక్షన్లు రాబట్టింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ. 15.21 కోట్లు రాబట్టిందని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో సూపర్ హిట్ అయిన 'హౌస్‌ఫుల్' సినిమాకు థర్డ్ పార్ట్‌గా తాజా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ, రితేశ్, అభిషేక్ లకు జోడీగా జాక్వలిన్ ఫెర్నాండెజ్, లిసా హేడన్, నర్గీస్ ఫక్రీ నటించారు. అక్షయ్, రితేశ్ 'హౌస్‌ఫుల్' తొలి రెండు పార్ట్‌లలో కనిపించగా.. మూడో పార్టులో తాజాగా అభిషేక్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను నడియావాలా గ్రాండ్‌సన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. -
నా బొమ్మలన్నీ తనవే!
‘‘మా అమ్మానాన్న నాకో తమ్ముణ్ణి బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు నా బొమ్మలన్నీ తనవే’’ అని ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు రియాన్. జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌ల ముద్దుల కొడుకు తను. ఈ బుడతడు పుట్టి ఏడాదిన్నర్ర అయ్యింది. అప్పుడే ట్విట్టర్లో తనకు తమ్ముడు పుట్టిన విషయాన్ని ఎలా పంచుకున్నాడబ్బా? అని ఆలోచించక్కర్లేదు. రియాన్ తరఫున రితేష్ చేసిన ట్వీట్ ఇది. బుధవారం ఉదయం జెనీలియా తన రెండో కొడుక్కి జన్మనిచ్చారు. తల్లీ కొడుకు క్షేమంగా ఉన్నారు. రితేష్, జెన్నీ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీళ్లది ప్రేమ వివాహం అనే విషయం తెలిసిందే. దాదాపు ఏడేళ్లకు పైగా ప్రేమించుకుని, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రితేష్ వంటి వ్యక్తి తనకు భర్తగా లభించడం అదృష్టం అని జెన్నీ పేర్కొన్నారు. రెండో బాబుకి జన్మనివ్వడానికి ఆస్పత్రిలో చేరే ముందు తన భర్తతో దిగిన ఒక ఫొటోను ట్విట్టర్లో పెట్టి... ‘‘థ్యాంక్యూ గాడ్... నేను అనుకున్నదానికన్నా నన్ను ఎక్కువే ఆశీర్వదించావ్’’ అని పేర్కొన్నారామె. జెన్నీ, రితేష్‌ల వైవాహిక జీవితం ఎంత ఆనందంగా సాగుతోందో చెప్పడానికి ఈ ఒక్క ట్వీట్ చాలు. -
మరో బిడ్డకు జన్మనిచ్చిన హ..హ..హాసిని
హ హ హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులను మైమరపించిన జెనీలియా రెండోసారి తల్లి అయ్యింది. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ వెల్లడించాడు. ఈ జంటకు ఇప్పటికే రియాన్ అనే నాలుగేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. అందుకే తన పెద్ద కొడుకు చెపుతున్నట్టుగా, ' మా అమ్మ నాన్నలు నాకు చిన్ని తమ్ముణ్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇక నాబొమ్మలన్ని తనవే' అంటూ రియాన్ ఫోటోతో కలిపి ట్వీట్ చేశాడు రితేష్. హిందీ, తెలుగు, తమిళ సినిమాలో నటించిన జెనీలియా, రితేష్‌తో వివాహం తరువాత సినిమాలకు దూరంగా ఉంటోంది. గత కొద్ది రోజులుగా ట్విట్టర్లో యాక్టివ్‌గా ఫోటోలు పోస్ట్ చేస్తున్న జెనీలియా, 'మా అర్హత కన్నా ఎక్కువగా ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేసింది. కొడుకు పుట్టిన ఆనందంలో ఉన్న ఈ జంటకు బాలీవుడ్ ప్రముఖల నుంచి శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. Hey guys, my Aai & Baba just gifted me a little brother. Now all my toys are his...- Love Riaan pic.twitter.com/H8JSKE0A3d— Riteish Deshmukh (@Riteishd) 1 June 2016Thank you GOD for blessing me much more than I deserve. pic.twitter.com/9gZqpYTmB4— Genelia Deshmukh (@geneliad) 31 May 2016 -
అందాల హీరోయిన్లు కలిస్తే ఇలా ఉంటుంది..!
సాధారణంగా సినిమా సెట్లో హుషారైన ఒక్క హీరోయిన్ ఉంటే చాలు సందడి వాతావరణం కనిపిస్తోంది. అలాంటి ముగ్గురు తారలు ఒకేసారి ఒకేచోటు ఉన్నారంటే వారి గొడవలు, ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడం సహజమే. కానీ, ఇక్కడ చూడండి లీసా హెడాన్, నర్గీస్ ఫక్రీ, జాక్వెలైన్ ఫెర్నాండేజ్ ఎంత జాలీగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ముగ్గురు హీరోయిన్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించి, డ్యాన్స్ చేస్తూ కనిపించారు. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ఓ ఫొటోను తన ఖాతాలో పోస్ట్ చేశాడు. హౌస్ ఫుల్ లో అందమైన భామలు అంటూ ట్వీట్ చేశాడు. ఉదయ్ చోప్రాతో బ్రేకప్ తర్వాత మూడాఫ్ లో ఉన్న నర్గీస్ ఫక్రీ షూటింగ్ నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది. బాలీవుడ్ లో హౌస్ ఫుల్ సిరీస్ మూవీలో ఎంత పాపులర్ చెప్పనక్కర్లేదు. ఆ సిరీస్ నుంచి తాజాగా విడుదులకు సిద్ధంగా ఉన్న మూవీ 'హౌస్‌ఫుల్ 3'. 2010లో హౌస్‌ఫుల్, 2012లో హౌస్‌ఫుల్ 2 కామెడీ థ్రిల్లర్ మూవీలు. ఈ మూవీలో అలరించిన అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్ లేటెస్ట్ మూవీలో కూడా నటిస్తున్నారు. వీరితో పాటు అభిషేక్ బచ్చన్, నర్గీస్ ఫక్రీ, జాక్వెలైన్ ఫెర్నాండేజ్, లీసా హెడాన్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీని ఫర్హాద్, సాజిద్ తీస్తున్నారు. జూన్ 3న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. Housefull of Beautiful ladies @HaydonLisa @NargisFakhri @Asli_Jacqueline pic.twitter.com/7dTUHtxURh — Riteish Deshmukh (@Riteishd) 27 May 2016 -
'ఎంతరాత్రి వచ్చినా ఆట ఆడాకే నిద్రపోతాడు'
ముంబయి: తీరిక లేకుండా సినిమా షూటింగుల్లో పాల్గొని వస్తున్నా తన కుమారుడితో ఆడుకోకుండా తన భర్త రితేశ్ దేశ్ ముఖ్ అస్సలు నిద్రపోడని నటి జెనీలియా దేశ్‌ముఖ్ చెప్పింది. రితేశ్‌ను చూసి తాను ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంటానని అంటోంది. ప్రస్తుతం బంజో అనే చిత్రం షూటింగ్లో తీరిక లేకుండా పాల్గొంటున్న రితేశ్.. ఒక రోజు తెల్లవార్లు షూటింగ్లో పాల్గొని తెల్లవారిన తర్వాత ఉదయం 7గంటలకు వచ్చి కూడా రితేశ్ తన ఏడాది కుమారుడితో ఆడుకుంటాడని, ఆ తర్వాతే నిద్రపోతాడని చెబుతూ మురిసిపోతోంది. 2012లో రితేశ్, జెనీలియాలు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. -
'సాఫ్ట్ టార్గెట్ గా బాలీవుడ్ సెలబ్రిటీలు'
ముంబై: యాకూబ్ మెమన్ కు మద్దతుగా హీరో సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్స్ ను అపార్థం చేసుకున్నారని నటుడు రితేశ్ దేశ్ ముఖ్ అన్నారు. సల్మాన్ వ్యాఖ్యలను నెటిజన్లు సరిగా అర్థం చేసుకోలేదని అన్నాడు. యాకూబ్ మెమన్ అమాయకుడని, అతడి సోదరుడు టైగర్ మెమన్ చేసిన దానికి యాకూబ్ ను ఉరితీయం సరికాదని ఆదివారం సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశాడు. తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో సల్మాన్ తర్వాత క్షమాపణ చెప్పాడు. సల్మాన్ ట్వీట్స్ ను అర్థం చేసుకోకుండానే చాలా మంది వ్యతిరేకంగా స్పందించారని రితేశ్ పేర్కొన్నాడు. తప్పొప్పుల చర్చ జరగకుండానే సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారని వాపోయాడు. చాలాసార్లు బాలీవుడ్ సెలబ్రిటీలను సాఫ్ట్ టార్గెట్ గా చేసుకుంటున్నారని, దాంతో ప్రజామాధ్యమాల్లో తమ అభిప్రాయాలు వెల్లడించాలంటే వెనుకంజ వేయాల్సివస్తోందని అన్నాడు. ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉందని రితేశ్ స్పష్టం చేశాడు. -
మా జీవితాలను సంపూర్ణం చేశాడు - జెనీలియా
ఫొటోలనేవి తీపిగుర్తులు. పైగా, ఆత్మీయలు, రక్తసంబంధీకుల ఫొటోలైతే మనకు ఎంతో అపురూపంగా అనిపిస్తాయి. పదే పదే వాటిని చూసుకుని మురిసిపోతుంటాం. కానీ, ఒక్కోసారి ఇతరుల ఫొటోలను కూడా పదే పదే చూస్తుంటాం. ఆ ఫొటో తాలూకు బ్యూటీ మనకు కనువిందు చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న జెనీలియా, ఆమె భర్త రితేశ్ దేశ్‌ముఖ్, కుమారుడు రియాన్ ఫొటో ఆ కోవకే చెందుతుంది. ముద్దులొలికే రియాన్‌పై తమకున్న ప్రేమనంతా జస్ట్ ఒక్క ఎక్స్ప్రెషన్తో చూపించేశారు జెన్నీ, రితేష్‌లు. రియాన్‌కి ఇప్పుడు ఆరు నెలల వయసు. ఈ బుడతడి రాకతో తమ జీవితం సంపూర్ణమైందని జెనీలియా అంటున్నారు. -
మా అబ్బాయి పేరేంటంటే...?
బాలీవుడ్ క్యూట్ కపుల్ రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా ఇటీవల తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ‘మా బుజ్జి కొండ రాక మాకెంతో ఆనందంగా ఉంది’ అని ఈ దంపతులు పేర్కొన్నారు. తమ కుమారుడి నామకరణోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ వేడుక గురించి జెనీలియా చెబుతూ - ‘‘ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల బంధువుల్నీ, స్నేహితుల్నీ కలుసుకోవడం అరుదైపోతోంది. కానీ, మా అబ్బాయి ‘బార్సీ’ (నామకరణోత్సవం) మమ్మల్నందర్నీ ఒకచోటకి చేర్చింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ వేడుక చేయడం చాలా ఆనందం అనిపించింది’’ అన్నారు. మా అబ్బాయి పేరేంటో తెలుసా. ‘రియాన్ రితేష్ దేశ్‌ముఖ్’ అని రితేష్, జెనీలియా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. -
నేను కపిల్ వీరాభిమానిని
ప్రముఖ టీవీ కమెడియన్ కపిల్‌శర్మ చేయాల్సిన ఓ సినిమా పాత్రను బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ దక్కించుకున్నా డు. తాను కపిల్ వీరాభిమానినని, ఏదో ఒకరోజు ఆయనతో కలిసి పని చేయడాన్ని ఇష్టపడతానని రితేష్ పేర్కొన్నాడు. యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ వారు కపిల్‌శర్మ ప్రధాన పాత్రలో ‘బ్యాంక్ చోర్’ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. అయితే అనివా ర్య కారణాల వల్ల ఈ చిత్రంలోని కపిల్ పాత్ర తనకు దక్కిందని రితేష్ చెప్పాడు. రుణం తీసుకొని తిరిగి చెల్లించలేని ఓ సామాన్య వ్యక్తి బ్యాంకు దొంగగా మారటమే ఈ చిత్రం ఇతివృత్తం అని అన్నాడు. ఈ సినిమా కోసం మెహబూబ్ స్టూడియోలో ఓ బ్యాంకు సెట్ వేశారు. అత్యధిక భాగం బ్యాంకులోనే షూటింగ్ జరపాల్సి ఉందని రితేష్ చెప్పాడు. సామాన్యుడైన హీరో సమస్యల వలయంలో చిక్కుకుంటాడని, వాటి నుంచి బయటపడేందుకు బ్యాంకును చోరీ చేయడమే మార్గంగా భావిస్తాడని అన్నాడు. దేవుడి పట్ల భయభక్తులు ఉన్న ఓ మహారాష్ట్ర వ్యక్తి పాత్రలో తాను నటిస్తున్నానని ఈ 35 ఏళ్ల నటుడు చెప్పాడు. బంపీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే మార్చి నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పా డు. ఈ చిత్రంలో ఇంకా వివేక్ ఓబెరాయ్, రియా చక్రవర్తి కూడా నటిస్తున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందు పాత్రలను పరిచయం చేసేం దుకు నటులందరితో ఒక వర్క్‌షాప్ నిర్వహించారు. పాత్రలన్నీ విభిన్నమైనవని, అందువల్లనే వర్క్‌షాప్‌ను దాదాపు పది రోజుల పాటు నిర్వహించాల్సి వచ్చిందని రితేష్ దేశ్‌ముఖ్ చెప్పాడు. -
అమ్మ అనిపించుకోవడానికి ఇంకొన్ని రోజులే...!
‘బొమ్మరిల్లు’ సినిమాతో హాసినిగా తెలుగు ప్రేక్షకులపై గాఢమైన ముద్ర వేసిన జెనీలియా, హిందీ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడి దాదాపుగా సినిమాలకు దూరమయ్యారు. త్వరలో ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. తాను గర్భవతినన్న విషయం తెలియగానే మీడియా కంట పడకుండా డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పుడైనా బయటకు రావాల్సి వస్తే పొట్ట కనిపించకుండా లూజ్ షర్ట్స్ వేసుకొని కవర్ చేసేసేవారు జెన్నీ. ఇటీవలే తన భర్త రితేశ్‌తో కలిసి ముంబయ్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో డిన్నర్‌కి వచ్చారామె. యాదృచ్ఛికమో, లేక ముందే ప్లాన్ చేసుకున్నారో తెలీదుకానీ... అదే రెస్టారెంట్లో కరీనా, సైఫ్ అలీఖాన్ కూడా ఉన్నారు. రెండు జంటలూ కలిసి ఆ ఆహ్లాద వాతావరణంలో డిన్నర్ చేసి కాసేపటి తర్వాత బయటకొచ్చారు. ఆ సమయంలో జెన్నీ కొన్ని కెమెరాలకు చిక్కేశారు. జీన్స్ ప్యాంట్, టీషర్ట్, ఓవర్ కోట్లో దర్శనమిచ్చిన జెన్నీ... ఈ దఫా తన కడుపు(బేబీ బంప్)ను దాచలేకపోయారు. -
చేతులు కాల్చుకున్న రితేష్ దేశ్‌ముఖ్
జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్‌కు చేతులు కాలాయి. అయితే, ఇది వంట చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదం మాత్రం కాదు. బంగిస్థాన్ అనే సినిమా షూటింగ్ జరుగుతుండగా చిన్నపాటి ప్రమాదం సంభవించడంతో ఆయన చేతులు కాలాయి. ఈ విషయాన్ని స్వయంగా రితేష్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. సినిమాలో నటించేటప్పుడు సహజత్వం రావాలంటే ఇలాంటి సాహసాలు చేయడం తప్పనిసరి అవుతోంది. ఇటీవలి కాలంలో చాలామంది హీరోలు సహజంగా కనిపించడం కోసం ఫైట్లలో కూడా సాహసాలు చేస్తున్నారు. 2015లో విడుదల కానున్న కామెడీ చిత్రం బంగిస్థాన్లో రితేష్ దేశ్ముఖ్తో పాటు పులకిత్ సమ్రాట్ కూడా నటిస్తున్నాడు. దీనికి కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ ప్రత్యేక గీతంలో కనిపిస్తారు. సల్మాన్ ఖాన్ నటించిన 'కిక్' సినిమాలో ఆమె పాట హిట్టవడంతో ఇప్పుడు బంగిస్థాన్లోనూ నర్తిస్తోంది. -
కామెడీ క్యారెక్టర్లతో బోర్ కొట్టింది: రితేష్
న్యూఢిల్లీ: కామెడీ క్యారెక్టర్లు చేసి బోర్ కొట్టిందని బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ పేర్కొన్నాడు. 35 ఏళ్ల రితేష్.. హౌస్‌ఫుల్, గ్రాండ్ మస్తీ సినిమాల్లో హాస్యాపాత్రల్లో అలరించాడు. మంచి టైమింగ్ తో కామెడీ పండించి పలు అవార్డులు కూడా అందుకున్నాడు. హాస్యపాత్రలు చేసి విసుగొచ్చిందని రితేష్ అన్నాడు. కొత్తగా ఏం చేయాలో తెలియడం లేదన్నాడు. ప్రేక్షకులు తనను కామెడీ పాత్రల్లో చూడడానికే ఇష్ట పడుతున్నారని తెలిపాడు. నాచ్, రన్ సినిమాల్లో విభిన్న పాత్రలు చేసినా ప్రేక్షకులు ఆదరించలేదని వాపోయాడు. త్వరలో విడుదలకానున్న సాజిద్ ఖాన్ సినిమా 'హమ్షాకాల్స్'లో రితేష్ నటించాడు. -
అమ్మ కానున్న జెనీలియా
‘అంతేనా... వీలైతే నాలుగు మాటలు. కుదిరితే కప్పు కాఫీ’... అని ఎనిమిదేళ్ల క్రితం తెరపై జెనిలియా చేసిన అల్లరి అంతా ఇంతానా! తర్వాత తను ఎన్ని సినిమాల్లో నటించినా... తెలుగువారి గుండెల్లో మాత్రం ఆమె హాసినీనే. అలాంటి హాసిని త్వరలో అమ్మ కాబోతోంది. రితేష్ దేశముఖ్ని రెండేళ్ల క్రితం పెళ్లాడిన ఈ అందాల భామ... అప్పుడే పిల్లలొద్దని కొన్నాళ్ల క్రితం తన భర్తతో గొడవ కూడా పెట్టుకుందని అప్పట్లో మీడియాలో కథనాలు కూడా ప్రసారమయ్యాయి. వాటిని జెన్నీ కూడా ఖండించలేదు. అయితే ప్రస్తుతం మాత్రం అత్తారింటి అభిమతాన్ని గౌరవిస్తూ... ‘అమ్మ’ అవ్వడానికి సిద్ధమైపోయారు జెనీలియా. అంటే త్వరలో అందాల హాసిని పొత్తిళ్లలో ఓ చిన్నారిని చూడబోతున్నామన్నమాట. -
జెనీలియా తల్లి కాబోతోంది!!
హ.. హ.. హాసిని అంటూ బొమ్మరిల్లుతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుని, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్తో మెడలో మూడు ముళ్లు వేయించుకున్న జెనీలియా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె భర్త రితేష్ నిర్ధారించాడు. బాంబే టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపాడు. తన భార్య గర్భవతి అంటూ ఇన్నాళ్లుగా వస్తున్న కథనాలన్నీ ఇప్పుడు నిజమయ్యాయని అన్నాడు. ఆమె గర్భం దాల్చిందని, పిల్లల విషయంలో తామిద్దరం చాలా ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నామని చెప్పాడు. ఇటీవల కొన్ని ఫొటోలలో జెనీలియా పొట్ట ఎత్తుగా కనపడటంతో ఆమె గర్భవతి అయి ఉంటుందని పత్రికల్లో గుప్పుమంది. ఇక త్వరలోనే తండ్రి కాబోతున్న ఆనందంలో ఉన్న రితేష్ దేశ్‌ముఖ్.. సాజిద్ ఖాన్, సైఫ్ అలీఖాన్‌లతో కలిసి చేసిన 'హమ్‌షకల్స్' చిత్రం ప్రమోషన్లో మునిగి తేలుతున్నాడు. -
వంద కోట్ల క్లబ్లో గ్రాండ్ మస్తీ
ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్లో విడుదలైన ’గ్రాండ్ మస్తీ’ వంద కోట్ల క్లబ్లో చేరింది. అసభ్యత హద్దులు దాటిందని క్రిటిక్స్‌తో పాటు పలువురు ఈ చిత్రాన్ని విమర్శిస్తున్నారు. ఈ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూస్తుందని కొంతమంది ఊహించారు. అయితే ఆ ఊహలకు భిన్నంగా వసూళ్ల సునామీ సృష్టించడం విశేషం. ఇంద్రకుమార్ దర్శకత్వంలో రితేష్ దేశ్‌ముఖ్, అఫ్తాబ్ శివదానీ, వివేక్ ఒబెరాయ్‌లు నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయ్యింది. అయితే విడుదలైన వెంటనే శృంగారభరితమైన కామెడీ చిత్రంగా బ్రాండ్ పడటం, సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకోవడం ఈ చిత్రానికి కలిసి వచ్చిందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మొదటి ‘అడల్ట్ సెక్స్ కామెడీ’ చిత్రం ఇదేనని ట్రేడ్ వర్గాలవారు విశ్లేషించారు. తొలివారంలో 66.4 కోట్ల రూపాయల్ని వసూలు చేసిన ‘గ్రాండ్ మస్తీ’ మూడోవారానికి వందకోట్ల మార్కును దాటింది. ఈ చిత్రంపై వస్తున్న విమర్శలను చిత్రదర్శకుడు ఇంద్రకుమార్ పట్టించుకోవడం లేదు. సరికదా... ఈ విజయంతో ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చిందని, శృంగారభరితమైన హాస్య చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందని రుజువయ్యిందని పేర్కొనడం గమనార్హం. -
సల్మాన్‌పై రితేశ్ దేశ్‌ముఖ్ ప్రశంసలు
ముంబై: కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నాడు రితేశ్ దేశ్‌ముఖ్. నిర్మాతగా తాను తెరకెక్కిస్తున్న రెండో మరాఠీ చిత్రంలో సల్మాన్ నటిస్తుండడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రితేశ్ మాట్లాడుతూ... మరాఠీ భాషపై సల్మాన్‌కు మంచి పట్టుందని, బాలీవుడ్లో సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న సల్లూభాయ్ మరాఠీ చిత్రంలో నటించేందుకు ఒప్పుకోవడం సామాన్యమైన విషయం కాదన్నాడు. మరాఠీ అంటే సల్మాన్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉందని, ఆ అభిమానంతోనే తన చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నాడని, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే చిత్రంలో నటించేందుకు సల్మాన్ తనంత తానుగా ముందుకొచ్చాడని చెప్పాడు. సల్మాన్ తల్లి మహారాష్ట్రకు చెందిన మహిళే కావడంతో సహజంగా సల్మాన్‌కు కూడా మరాఠీపై మంచి పట్టు లభించిందని, ఆయన మరాఠీ మాట్లాడడాన్ని చూస్తూ తానే ఆశ్చర్యపోయానని చెప్పాడు. బాలీవుడ్లో దాదాపు పెద్ద హీరోలందరి సరసన నటించానని, అయితే సల్మాన్‌ఖాన్‌తో నటించే అవకాశం ఈ చిత్రంద్వారా తొలిసారిగా దక్కిందని, అదీ తన చిత్రంతోనే రావడం సంతోషంగా ఉందన్నాడు. నిర్మాతగా మారిన తర్వాత మరాఠీలో నిర్మిస్తున్న రెండో చిత్రం ఇదని, సినిమాకు ‘లాయి భారీ’ పేరును ఖరారు చేశామని, జాతీయ అవార్డు గెలుచుకున్న నిశికాంత్ కామత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని చెప్పాడు. ఇందులో సల్మాన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడని, ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైనందున తానూ, సల్మాన్ కలిసి చిత్రీకరణలో పాల్గొన్నామని, ఇద్దరి మధ్య సాగే ఓ హాస్య సన్నివేశాన్ని చిత్రీకరించారని చెప్పాడు. సినిమాను ఈ సంవత్సరాంతంలో లేదంటే వచ్చే సంవత్సరం తొలి మాసంలో విడుదల చేసే అవకాశముందన్నాడు.