
బీ టౌన్ స్టార్ కిడ్స్ తైమూర్, అబ్‌రామ్, ఆరాధ్య బచ్చన్, ఇనాయా ఖేము, మిషాలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. వీరి ఫొటోలు షేర్ చేస్తే చాలు లక్షల్లో లైకులు వచ్చిపడతాయి. తాజాగా ఈ జాబితాలో చేరేందుకు బాలీవుడ్ స్టార్ కపుల్ జెనీలియా- రితేశ్‌ల చిన్న కుమారుడు రెహిల్ కూడా సిద్ధమైపోయాడు. అయితే అందరిలా కేవలం ఫొటోలతో సరిపెట్టకుండా... ఫిట్‌నెస్ వీడియోతో అదరగొట్టాడు. తన తండ్రి రితేశ్ దేశ్‌ముఖ్ విసిరిన ఫిట్‌నెస్ చాలెంజ్‌ను స్వీకరించిన రెండేళ్ల రెహిల్... రోప్ సాయంతో గోడ మీదకి ఎక్కుతూ చాలెంజ్ పూర్తి చేశాడు. అంతేకాదు... స్టార్ కిడ్స్ తైమూర్ అలీఖాన్, లక్ష్యా కపూర్, కరణ్ జోహార్ కవలలు యశ్- రూహీలకు చాలెంజ్ కూడా విసిరాడు.
రెహిల్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన జెనీలియా..‘ రెహిల్.. వాళ్ల నాన్న విసిరిన ఫిట్‌నెస్ చాలెంజ్‌ను స్వీకరించాడు. ఇప్పుడు బచ్చా గ్యాంగ్‌కు చాలెంజ్ విసురుతున్నాడు.. #బచ్చేఫిట్‌తోదేశ్‌ఫిట్’ అంటూ క్యాప్షన్ జత చేశారు. రెహిల్ క్యూట్ వీడియోను చూసిన కరణ్ జోహార్...‘ ఓ మైగాడ్!!! చూడండి!!!! ఇతను రాక్‌స్టార్. నేనైతే రెహిల్‌లా చాలెంజ్ పూర్తి చేస్తానో లేదో’ అంటూ సరదాగా కామెంట్ చేశారు.
OMG!!! Look at him!!!! He’s a rock star!!!! Am nervous to even attempt this with mine😂😂😂 https://t.co/nihN0wVjyz
— Karan Johar (@karanjohar) August 29, 2018
Comments
Please login to add a commentAdd a comment