Fitness Challenge
-
శరీరానికి కావల్సిన వ్యాయామాన్ని అందిస్తుంది, నాజుగ్గా మారుస్తుంది
‘ఆరోగ్యకరమైన జీవనానికి .. ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి’ అనేది తెలిసిన మాటే. కానీ బిజీ లైఫ్‌లో అదే వీలు కావట్లేదని ఫీలయ్యేవారికి ఈ డివైజ్ భలే మంచి చాయిస్. ఎందుకంటే.. ఇది సమయం వృథా కాకుండా.. అందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ మెషిన్ ఇంట్లో ఉంటే.. కూర్చున్నా, నిలుచున్నా ఫిట్‌నెస్సే మరి. ఈ డివైజ్ (ఎలక్ట్రో మజిల్స్ స్టిములేషన్ ఇన్హాన్స్ వైబ్రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్సర్సైజర్).. మిమ్మల్ని ఎల్లప్పుడూ నాజూగ్గా ఉంచుతుంది. శరీరానికి కావాల్సిన వ్యాయామాన్ని అందిస్తుంది. అదెలా అంటే.. దీనిపైన నిలబడి.. డివైజ్‌కి అమర్చిన ఎక్సర్సైజ్ బ్యాండ్స్‌ని పట్టుకుంటే చాలు.. అరికాళ్ల నుంచి బాడీ మొత్తానికీ వైబ్రేషన్ పొందొచ్చు. దీనిపైన నిలబడితే.. బాడీ మొత్తంలో ఉండే కండరాల పనితీరు మెరుగుపడి.. రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. ల్యాప్‌టాప్‌లో పనిచేసుకుంటూనో.. కూరగాయలు తరుక్కుంటూనో.. ఇలా ఏ పని చేసుకోవాల్సి వచ్చినా ఆ పని చేసుకుంటూనే.. ఈ ఎక్సర్సైజర్ ప్రయోజనాలను పొందొచ్చు. చైర్లో కానీ.. సోఫాలో కానీ కూర్చుని.. కాళ్లను దీనిపై పెట్టుకుని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. రిమోట్ సాయంతో ఆపరేట్ చేసుకోవచ్చు. ఇందులో 3 ప్రీసెట్ మోడ్స్ ఉంటాయి. అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. అలాగే టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. దీన్ని చిన్న చిన్న అపార్ట్‌మెంట్స్‌లో కూడా సులభంగా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ స్థలాన్ని తీసుకోదు. సోఫా కిందో, మంచం కిందో ఈజీగా పట్టేస్తుంది. ధర 458 డాలర్లు. అంటే 37,899 రూపాయలు. -
బరువు తగ్గితే రూ.10 లక్షలు.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్
ముంబై: జెరోడా అనే ఆన్లైన్ బ్రోకరేజీ కంపెనీ ఉద్యోగులకు సీఈఓ నితిన్ కామత్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బరువు తగ్గితే మంచి ఇన్సెంటివ్‌లు ఇస్తారట. అంతేకాదు, ఒక లక్కీ విజేతకు ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. ఇందుకోసం వారు రోజుకు కనీసం 350 క్యాలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా ఏడాది పాటు శ్రమించి లక్ష్యంలో 90 శాతం సాధించిన వారందికీ నెల వేతనం బోనస్‌గా ఇస్తారు! దీనికి తోడు రూ.10 లక్షల బంపర్ బొనాంజా ఉండనే ఉంది! దాంతో ఈ ఫిట్నెస్ చాలెంజ్‌ను సీరియస్‌గా తీసుకుని ఉద్యోగులంతా గట్టిగానే శ్రమిస్తున్నారట. అన్నట్టూ, ఎవరు ఏ మేరకు కొవ్వు కరిగిస్తున్నదీ కంపెనీ తాలూకు ఫిట్నెస్ ట్రాకర్ గమనిస్తుంటుందట. ఉద్యోగుల ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఈ కంపెనీకి కొత్తేమీ కాదట. 25 కంటే తక్కువ బీఎంఐ ఉన్న ఉద్యోగులకు ఇప్పటికే సగం నెల వేతనం బోనస్‌గా ఇస్తోంది!! వర్క్ ఫ్రం హోం వల్ల స్థూలకాయం తెచ్చుకుని అనారోగ్యం పాలు కావొద్దన్నదే తమ ఉద్దేశమంటున్నారు కామత్. కరోనా కాలంలో పెరిగిన బరువును తానెలా తగ్గించుకున్నదీ చెబుతూ ఉద్యోగులను మోటివేట్ చేస్తున్నారు. -
ఫిట్నెస్ క్వీన్ @ 55
కొంతమంది మధ్యవయసులోనూ కెరీర్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి దూసుకుపోతుంటారు. నిస్రీన్ పారిఖ్ మాత్రం యాభైఏళ్లకు పైబడ్డ వయసులోనూ చక్కటి ఫిట్నెస్తో అబ్బుర పరుస్తోంది. ‘‘ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరిస్తే వయసుతో సంబంధం లేకుండా అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చు’’ అని నిరూపించి చూపిస్తోంది నిస్రీన్ పారిఖ్. ముంబైలో పుట్టిన పెరిగిన నిస్రీన్ పారిఖ్‌కు చిన్నప్పటి నుంచి ఆటలాడడం అంటే ఎంతో ఇష్టం. పదిహేనేళ్లకే కరాటే నేర్చుకుంది. ఆల్ ఇండియా కరాటే ఫెడరేషన్, నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో పతకాలను కూడా సాధించింది. నిస్రీన్‌కు 1989లో పెళ్లయి పిల్లలు పుట్టడంతో..వారిని చూసుకోవడంలోనే సమయం గడిచిపోయేది. అయినా రోజువారి ఫిట్నెస్ వ్యాయామాలు చేయడం మాత్రం మర్చిపోలేదు. బెస్ట్ పర్సనల్ ట్రెయినర్... ఇంటి బాధ్యతల్లో నిమగ్నమైనప్పటికీ కాస్త వెసులుబాటు చేసుకుని ముంబై యూనివర్సిటీలో సైకాలజీ, సోఫియా కాలేజీలో డైట్ అండ్ న్యూట్రిషన్లో మాస్టర్స్ చేసింది. తరువాత ఎయిర్ ఇండియాలో ఉద్యోగులకు పర్సనల్ ట్రెయినర్‌గా పాఠాలు చెప్పేది. నిస్రీన్ క్లాసులకు మంచి ఆదరణ లభించడంతో 2015లో ఏటీపీ ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమంలో ‘బెస్ట్ పర్సనల్ ట్రెయినర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచింది. ఈ ఉత్సాహంతో స్కూల్ స్థాయి విద్యార్థులకు ఫిట్నెస్ ట్రెయినర్‌గా చేరింది. పిల్లలిద్దరూ బోర్డింగ్ స్కూల్లో చేరడంతో నిస్రీన్‌కు సమయం దొరికింది. దీంతో యోగాలో పీజీ డిప్లొమా చేస్తూనే ఇంటి దగ్గర సాధన చేస్తుండేది. తర్వాత విద్యార్థులకు, ఫిట్నెస్ ఔత్సాహికులకు యోగా పాఠాలు చెప్పడం మొదలు పెట్టింది. ఇలా గత పద్దెనిమిదేళ్లుగా యోగా పాఠాలు చెబుతూ ఎంతోమందిని ఫిట్‌గా ఉంచడంతోపాటు తను కూడా ఫిట్‌గా తయారైంది నిస్రీన్. ఆ ఆపరేషన్‌తో బాడీ బిల్డర్‌గా... నిస్రీన్‌కు 48 ఏళ్లు ఉన్నప్పుడు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ వల్ల ఇబ్బందులు ఏర్పడడంతో గర్భసంచినే తొలగించారు. సర్జరీ సమయం లో కాస్త బలహీన పడిన నిస్రీన్.. తన ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టింది. రెండేళ్ల తరువాత పూర్తి ఫిట్నెస్ వచ్చిన నిస్రీన్ తన పిల్లల ప్రోత్సాహంతో 50 ఏళ్ల వయసులో తొలిసారిగా 2016లో ‘ముంబై బాడీబిల్డింగ్ కాంపిటీషన్లో పాల్గొంది. అలా పాల్గొన్న ప్రతి పోటీలో మెడల్ గెలుచుకుంటూ లేటు వయసు బాడీబిల్డర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా, ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొని ‘మోడల్ ఫిజిక్ అథ్లెట్’గా పాపులారిటీ సంపాదించుకుంది. థాయ్‌లో జరిగిన ‘వరల్డ్ బాడీబిల్డింగ్ అండ్ ఫిజిక్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్’లో నాలుగోస్థానంలో నిలిచి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. కలలు నిజం చేసుకునేందుకు ద్వారాలెప్పుడూ తెరిచే ఉంటాయి. మనముందున్న సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగితే కలలను నిజం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఉదయాన్నే ప్రోటీన్ షేక్, తరువాత వర్క్ అవుట్స్‌తో రోజు ప్రారంభం అవుతుంది. అడ్వర్టైజ్మెంట్స్ షూట్స్, బాలీవుడ్ సెలబ్రెటీలను కలుస్తూనే, రోజూ ఫిట్నెస్ తరగతులు నిర్వహిస్తున్నాను. లాక్డౌన్ సమయంలో వర్చువల్ తరగతులను నడిపాను. కొన్ని ఫిట్నెస్ సప్లిమెంట్స్‌కు అంబాసిడర్‌గా పనిచేస్తూ ఎప్పూడూ బిజీగా ఉంటున్నప్పటికీ, నా కుటుంబ సహకారం వల్లే నేనెప్పుడూ ఎనర్జిటిక్‌గా, ఫిట్‌గా ఉండగలుగుతున్నాను. – నిస్రీన్ -
అనుకరణ ఆమోదమేనా?!
ఉదయం నిద్ర కళ్లతోనే సోషల్ మీడియాను చూడటం ఈ రోజుల్లో సర్వసాధారణమైన పని. ‘ఎంత బాగుంది...’ అనుకునే ఫొటోలు మన కళ్ల ముందు కుప్పలు తెప్పలు. వాటిని చూసి ‘నేనెందుకిలా ఉన్నాను’ అనే నిరుత్సాహంతో తమ శరీరంతో పోలిక. తర్వాత ‘నేనూ అలా ఉంటే బాగుండు’ అనే ఆలోచన. ఆ మరు నిమిషం ‘ఎలాగైనా సరే, నేనూ అంత అందంగా, ఫిట్‌గా మారిపోవాలి’ అనే నిర్ణయం... ఒకదాని వెంట ఒకటి వచ్చేస్తుంటుంది. దీంతో ఏమవుతుంది!? తినే ఆహారంలో మార్పులు వచ్చేస్తాయి. చేసే వ్యాయామాల్లో మార్పులు. ప్రయత్నాలలో లోపం, సరిపడని ఆహారం.. అన్నీ ఒక్కోసారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సోషల్ మీడియా లో ఫిట్‌నెస్‌కు సంబంధించిన క్లిక్‌లు, ఫిట్నెస్ సెంట్రిక్ ప్రొఫైల్స్‌ను తనిఖీ చేయడంలో ఈ రెండేళ్లలో విపరీతం గా పెంచినట్టు ప్రముఖ విశ్వవిద్యాలయాల మానసిక శాస్త్రవేత్తలు గుర్తించారు. సోషల్‌మీడియా కారణంగా ఫిట్నెస్ పట్ల ప్రభావితమైనవారు ఎలాంటి అనర్థాలకు లోనవుతున్నారో, వారి భవిష్యత్తు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చెబుతూ అమెరికాలోని ఫ్లోరిడా మానసిక విశ్వవిద్యాలయం అధ్యయనం చేసి, కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. ఇతరులతో పోలికలు శరీరాకృతి అందంగా ఉండాలని న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌లో గట్టి నిర్ణయమే తీసుకుని ఉంటారు. అందుకు మీ చేతిలోని ఫోన్ యాప్‌లలో పోస్ట్ అయ్యే అందమైన శరీరాకృతి గల మహిళలు, వారు చేస్తున్న ఫిట్నెస్ చర్యల గురించి తెలుసుకోవడానికి తెగ తనిఖీ చేస్తుంటారు. ఈ విషయంపై నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలో బాడీ, మైండ్ ల్యాబ్‌ను నడుపుతున్న మనస్తత్వవేత్త రెనీ ఎంగెల్న్ –‘సాధారణంగా తమ చుట్టూ ఉన్న వ్యక్తులతో పోల్చుకునే స్వభావం మనిషిలో ఉంటుంది. గతంలో తక్కువ స్థాయిలో ఉన్న ఈ స్వభావం సోషల్ మీడియా వల్ల ఈ పోలికలు వేగంగా ఎన్నడూ లేనంత గా అవకాశాలను అందిస్తోంది’ అంటారామె. నిరుత్సాహానికి 7నిమిషాలు ఎంగెల్స్, ఇతర మనస్తత్వవేత్తలు వ్యక్తుల మెదడు వారి చర్యలపై సోషల్ మీడియా ప్రభావాన్ని వివరించడానికి 2020 నుంచి సామాజిక పోలిక సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేశారు. స్ఫూర్తిదాయకమైన హ్యాష్‌ట్యాగ్‌లను ట్రోల్ చేయడం లేదా తమ సొంత ఆరోగ్య ఆకాంక్షలకు కొంచెం మసాలాను జోడించడానికి ఫిట్నెస్ సెంట్రిక్ ప్రొఫైల్‌లను తనిఖీ చేయడం ఉత్సాహం కలిగిస్తుంది. అయితే, అవన్నీ తమ స్వీయ భావాన్ని దెబ్బతీస్తాయి. కాలేజీ అమ్మాయిలు కేవలం ఏడు నిమిషాలు ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేయడం వల్ల వారిలో తమ శరీరం పట్ల అసంతృప్తిగా ఉన్నారని, ఫేస్‌బుక్‌ని ఉపయోగించిన దానికంటే ఎక్కువ బాడీ ఇమేజ్ పోలికలు, వారి రూపం గురించి ఎక్కువ ఆలోచించారని కనుక్కున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోతో కూడిన సెలబ్రిటీ హెవీ కంటెంట్ ఆ పోలికలను పెంచడానికి కారణమైందని గుర్తించారు. అసూయతో స్క్రోలింగ్ చేసే అసంతృప్తి కేవలం మొదటి దశ మాత్రమే. యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన మనస్తత్వవేత్త పమేలా ఎస్. కీల్ ఈ విషయంలో తినే రుగ్మతలు, శరీర ఇమేజ్ను ప్రభావితం చేసే సామాజిక అంశాలను పరిశోధించారు. 2020 అధ్యయనంలో కీల్, ఆమె సహోద్యోగులు ఎడిట్ చేసిన వారి ఫోటోలను పోస్ట్ చేసే వారి కంటే ఎక్కువగా తినే క్రమ రహిత ప్రవర్తనను ప్రదర్శించారని కనుక్కున్నారు. అన్ని రకాల డిజిటల్ వ్యూహాలు ఫొటోలను ఎడిట్ చేయడం అనే అంశాన్ని పార్టిసిపెంట్స్ ముందుకు తీసుకువచ్చారు. ఫోటోలను ఎడిట్ చేసిన పార్టిసిపెంట్స్ కి ఎలాంటి సూచన లూ చేయలేదు. వారు సోషల్ ‘మీడియాలో పోస్ట్ చేసేవి మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేయమని మాత్రమే వారికి చెప్పాం. దీంతో అన్ని ఫిల్టర్లు, ఫేస్‌టైమ్ వంటి అనేక ఇతర డిజిటల్‌పరంగా తారుమారు చేసే వ్యూహాలన్నీ ఉపయోగించినట్టు మా ముందుకు వచ్చిన ఫొటోలు చూపాయి. ఈటింగ్ డిజార్డర్ లక్షణాలను ఎవరూ పెద్దగా పేర్కొనలేదు. కానీ వారు తమను తాము ఇతరులతో పోల్చుకున్నారు. అంతేకాదు, తమ ప్రత్యర్థుల ఇష్టాలు, వ్యాఖ్యలపై ఎక్కువ సమయాన్ని ఖర్చు చేశారని నిరూపించారు. చెడు సమాచారం మీకు నప్పని, హాని కలిగించే సమాచారం నుంచి సోషల్ మీడియా మిమ్మల్ని రక్షించదు. నిర్ణయాల అమలు, ఆందోళన రేకెత్తిస్తూ మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశ ఉంది. ‘ఆరోగ్యకరమైన ఆహారం‘పై 1.2 మిలియన్ల కంటే ఎక్కువ ట్వీట్లను విశ్లేషించిన 2020 అధ్యయనం ఏం చెబుతుందంటే అలాంటి సమాచారం వెలిబుచ్చినవారిలో నిపుణులు ఎక్కువ మంది లేరని కనుక్కున్నారు. 8.5 శాతం కంటెంట్ తమకు తెలిసిన సమాచారాన్ని రీ పోస్ట్ చేయడం పైనే శ్రద్ధ చూపినట్టు తెలుస్తోంది. దీని కారణంగా ‘సులభం గా ప్రభావితమైన వ్యక్తులు‘ ఆహారం, ఆరోగ్యం గురించి రకరకాల ఉబుసుపోని కబుర్లు సృష్టిస్తారు. అంతేకాదు, వారికి నచ్చిన ఉత్పత్తులు, సేవలను అందించే వాణిజ్య సంస్థల ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తారు. ఇతరులనూ చేయమని ప్రేరేపిస్తారు. ‘అందుకని ఒక పోస్ట్ నాణ్యతను ఎలా అంచనా వేయాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం’ అంటారు కీల్. అలాంటిదేదైనా గమనిస్తే ‘వాడద్దు’ అనే హెచ్చరికకు సంకేతం’ అని గుర్తించాలంటారు ఆమె. ఎందుకంటే, ఏ ఒక్కరికీ మిగతావారికి సరిపడే పోషకాలలో పోలిక ఉండదు. ఏం చేయాలంటే.. ‘మీరు మరొకరిని చూసి వారిలాగే అవాలనుకునే నిర్ణయాన్ని ఈ క్షణమే వదిలేయండి. ఒక వ్యక్తిగా ఎదగడం గురించి ఎదుటివారిని అనుసరించవచ్చు. ఆ విలువలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి. కానీ, ఆహార– ఫిట్నెస్ తీర్మానాల్లో కాదు’ అంటారు కీల్. తోటివారు ఏం చేస్తున్నారో తెలుసుకోవడంలో తప్పులేదు. కానీ మీ కోసం ఓ మార్గాన్ని రూపొందించడానికి ఇతరులకు అవకాశం ఇవ్వద్దు. ఆచరించే నియమాలివి.. నిరుత్సాహపరిచే సోషల్ మీడియా కంటెంట్ నుండి దూరం అవ్వాలనుకుంటే ఎంగెల్న్, ఆమె సహచరులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ► మొదటి దశగా మిమ్మల్ని తమ శరీరాకృతితో పోలిక తెచ్చే సోషల్ మీడియా అకౌంట్లను తీసేయండి. దానికి బదులుగా మిమ్మల్ని ఉత్తేజిత పరిచే సమాచారాన్ని తీసుకోండి. మరొక సులువైన పరిష్కారం కూడా ఉంది. అలాంటి ఫొటోలను పదే పదే చూస్తున్నాం అనుకుంటే ఆ యాప్‌ను పూర్తిగా తొలగించండి. సోషల్ మీడియా నుండి విరామం మీ మానసిక ఆరోగ్యానికి మేలే చేస్తుంది. ► సోషల్ మీడియా వ్యక్తులు మీ సొంత లక్ష్యాలను ప్రభావితం చేయడానికి మీరు అనుమతిస్తే, మీరు ఓటమికి లేదంటే కనీసం నిరుత్సాహానికి లోనవుతారు. ► మీ శరీరాకృతిని మార్చడానికి సంబంధించిన ఇతరుల నిర్ణయాలు ఏ మాత్రం విలువైనవి కావు అనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. -
ఇంతకీ ‘మ్యాటరేంటంటే!’
స్కూల్‌కి వెళ్లేటప్పుడు క్లాస్మేట్స్ కావాలి. చదివింది షేర్ చేసుకోవడానికి.. అల్లరి పనులు చేయడానికి. పనిలో ఉన్నప్పుడు ఆఫీస్ మేట్స్ కావాలి పని పంచుకొని ఒత్తిడి తగ్గించుకోవడానికి. సినిమా విషయానికి వస్తే గ్రీన్‌మ్యాట్ కావాలి గ్రాఫిక్స్ ద్వారా కష్టాన్ని తగ్గించుకోవడానికి. గ్లామర్ ఇండస్ట్రీలో వాళ్లకు యోగా మ్యాట్ కూడా కావాలి ఫిట్నెస్ పెంచుకోవడానికి. ఇంతకీ ‘మ్యాటరేంటంటే!’ మ్యాటర్ చదవండి.. అర్థమైపోతుంది. కరోనా వల్ల ఎవ్వరం ఇంట్లో నుంచి కాలు కదపడానికి లేదు. ఫిట్నెస్ ప్రియులకు ఇది కాళ్లు కట్టేయడంలాంటిదే. కానీ హీరోయిన్లు ఫిట్‌గా ఉండాలి. ఫిట్‌నెస్‌ని అశ్రద్ధ చేయకూడదు. ఫిట్‌గా స్క్రీన్ మీద కనిపించాలి. అందుకే నోరు కట్టేస్తూ, జిమ్ చుట్టేస్తారు. ఇప్పుడు ఈ కరోనా సమయంలో జిమ్ సెంటర్ కి వెళితే రిస్క్‌ని వర్కవుట్ తో తెచ్చుకునే ప్రమాదం ఉంది. అందుకే ఈ మధ్య అందాల తారలు ఎక్కువగా ‘యోగా మ్యాట్’తో ఫ్రెండ్ షిప్ చేస్తున్నారు. మ్యాట్రేంటంటే ... హీరోయిన్లందరూ తరచూ యోగాసనాలు చేస్తూ ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే క్లిష్టమైనవి నేర్చుకోవాలంటే కాస్త టైమ్ పడుతుంది. ఈ కరోనా లాక్ డౌన్ హీరోయిన్లకు కావాల్సినంత సమయాన్ని ఇచ్చింది. దీంతో కొత్త ఆసనాలు ప్రాక్టీస్ చేస్తున్నారు. కొందరు టార్గెట్ ను చేరుకున్నారు. మరికొందరు చేరుకుంటున్నారు. మ్యాట్ మీద ఫీట్లు చేస్తున్న హీరోయిన్ల విషయానికి వస్తే.. ‘లాక్ డౌన్లో గార్డెనింగ్‌తో పాటు యోగాను బాగా ఆస్వాదిస్తున్నా’ అని సమంత తెలిపారు. యోగాసనాల్లో అతి క్లిష్టమైన మయూరాసనం వేయాలనే లక్ష్యాన్ని చేరుకోగలిగారు సమంత. రకుల్‌కు ఫిట్నెస్ మీద ఎంత శ్రద్ధో అందరికీ తెలిసిందే. యోగా కేవలం శరీరానికి సంబంధించింది కాదు మనసుకు, మన జీవిత విధానానికి సంబంధించింది అంటారామె. ‘వర్కౌట్‌లో క్రమం తప్పేది లేదు’ అంటున్నారు తమన్నా. ఎప్పటికప్పుడు వర్కౌట్ ఫోటోలతో అభిమానులనూ వర్కౌట్ చేసేలా ప్రోత్సహిస్తున్నారామె. ధనురాసనం నేర్చేసుకున్నారట పూజా హెగ్డే. ‘యోగా చేస్తే తెలియని సంతోషం’ అంటున్నారు పూజ. ‘ఇంట్లో వీలయ్యే వర్కౌట్స్ చేయండి.. నేను చేస్తున్నా’ అంటారు రాశీ ఖన్నా. అదా శర్మ, తాప్సీ తదితరులు కూడా వర్కౌట్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. -
30 ఫుషప్స్ చేయలేక రూ.వెయ్యి కట్టారు!
భోపాల్: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు యువకులకు ఓ పోలీసు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. 30 పుషప్స్ చేస్తేనే జరిమానా లేకుండా విడిచిపెడతానని చాలెంజ్ విసిరారు. చివరకు ఆ ముగ్గురూ చాలెంజ్‌లో ఓడిపోయి రూ.1000 జరిమానా చెల్లించారు. ఈ ఆసక్తికరన ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నగరంలో గత మంగళవారం చోటుచేసుకోగా.. వైరల్ అయింది. కరోనా లాక్డౌన్ పాటించకుండా ముగ్గురు యువకులు గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డుపైకొచ్చారు. నిబంధనలు పాటించకుండా బయటకొచ్చిన వారిని ట్రైనీ డిప్యూటీ ఎస్పీ సంతోష్ పటేల్ అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: 30 బస్కీలు తీస్తే టికెట్ ఉచితం) శారీరక కసరత్తులు చేసి ఫిట్నెస్ పెంచుకునేందుకే బయటికొచ్చామని యువకులు చెప్పిన సమాధానం విని వారితో ఓ చాలెంజ్ చేశారు. తనతో కలిసి పుషప్స్ చాలెంజ్‌లో పాల్గొని గెలవాలని షరతు విధించాడు. ముగ్గురూ తలో 30 ఫుషప్స్ చేయాలని లేదంటే సరైన పత్రాలు లేకుండా బండి నడిపినందుకు రూ.1000 జరిమానా కట్టాలని స్పష్టం చేశారు. వారు చాలెంజ్ స్వీకరించిన్పటికీ.. ఇద్దరు యువకులు 10 ఫుషప్స్తో ఢీలా పడగా.. మరొకరు 20 మాత్రమే చేయగలిగారు. చివరకు ఓటమిని అంగీకరించి జరిమానా కట్టారు. లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బయటకు రావొద్దని సంతోష్ పటేల్ వారిని హెచ్చరించారు. ఇళ్లల్లోనే ఉండి ఎక్సర్సైజులు చేసుకోవాలని సూచించారు. (చదవండి: నో లిక్కర్.. రోజుకు ఎంత నష్టమో తెలుసా?) -
30 బస్కీలు తీస్తే టికెట్ ఉచితం
న్యూఢిల్లీ: ‘ఫిట్ ఇండియా’కు ప్రచారం కల్పించేందుకు భారత రైల్వే ఓ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో 30 బస్కీలు తీస్తే ఉచితంగా ప్లాట్ఫారం టికెట్ లభించనుంది. ఈ తరహా పథకాన్ని రైల్వే శాఖ అమలు చేయడం ఇదే మొదటిసారి. ఆనంద్ విహార్ రైల్వేస్టేషన్లో ‘స్క్వార్ట్ మెషీన్’ను అధికారులు ఏర్పాటు చేశారు. దాని ముందు 30 బస్కీలు తీస్తే చాలు ప్లాట్ఫారం టికెట్ జనరేట్ అయి ఉచితంగా లభిస్తుంది. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రైల్వే స్టేషన్లో ‘దవా దోస్త్’ జెనరిక్ మెడికల్ షాప్‌ను కూడా రైల్వే ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికులకు నాణ్యమైన మందులను సరసమైన ధరలకే అందిస్తామని రైల్వే తెలిపింది. జెనరిక్ ఔషధాలను ప్రోత్సహిస్తున్న ‘దవా దోస్త్’కు ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తోంది. ప్రస్తుతం రాజస్తాన్, ఢిల్లీలో 10 దవా దోస్త్ దుకాణాలున్నాయి. ఈ ఏడాది 100 దుకాణాలు.. వచ్చే నాలుగేళ్లలో 1,000 దుకాణాల ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. -
కంప్యూటర్ ముందు ఇలా కూర్చోరాదు
ఇంట్లో ఉన్నా...కార్యాలయానికి వెళ్లినా.. చాలామంది కూర్చోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. గంటల తరబడి కంప్యూటర్ల ముందు పని చేస్తుంటారు. ఉన్నచోటు నుంచి కదలడానికి ఇష్టపడరు. ఇంట్లో ఉంటే ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్ , టీవీకి పరిమితమవుతుంటారు. ఈ అలవాటు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. – విజయనగరం గంటల తరబడి కంప్యూటర్ వినియోగిస్తే కంటికి అలసట కళ్లు: కంప్యూటర్ ముందు రాత్రి పగలు గంటల తరబడి పనిచేయడం వల్ల కళ్లకు ఇబ్బందులు తప్పవు. దాని నుంచి వెలువడే కాంతి కంటిచూపుపై పడుతుంది. కళ్లల్లో దురద, ఎర్ర బారడం, కన్నీళ్లు ఇంకిపోవడం (డ్రై ఐస్) తదితర సమస్యలు బాధిస్తాయి. ప్రతి గంటకు ఒకసారి కంప్యూటర్ నుంచి చూపు పక్కకు మరల్చడం, సీటులోంచి లేచి నిలబడటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కొద్దిసేపు కళ్లను మూసుకోవడం ద్వారా విశ్రాంతి పొందవచ్చు. కంటి అద్దాలను ధరించవచ్చు. ప్రస్తుతం 25–30 శాతం వరకు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. చాలా అనారోగ్య సమస్యలకు ఇదే హేతువుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. తల నుంచి అరికాలి వరకు అన్ని భాగాలపైనా దుష్ప్రభావం చూపుతుందంటున్నారు. ఆయా అవయవాలకు జరిగే నష్టం పెద్ద మొత్తంలో ఉంటుందని చెబుతున్నారు. వ్యాయామం లేకపోతే శరీరానికి ముప్పు జీర్ణవ్యవస్థ: వ్యాయామం లేకపోవడం వల్ల ఆ భారం జీర్ణ వ్యవస్థపై పడుతుంది. చాలామంది కూర్చున్న చోటు నుంచి కదలడానికి ఇష్టపడరు. టీవీ చూస్తూ తింటుంటారు. అది తొందరగా జీర్ణం కాదు. పుల్లని తేన్పులు, గుండెలో మంట ఇతర సమస్యలు వేధిస్తాయి. రోజూ కొంత వ్యాయామం చేయడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. సక్రమంగా కూర్చోకపోతే వెన్నునొప్పి సమస్య మెడ, వెన్నునొప్పి: ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులు చాలామందిలో వచ్చే సాధారణ సమస్య వెన్నునొప్పి. కంప్యూటర్ ముందు కూర్చొనే భంగిమ, కీబోర్డ్‌లు సక్రమంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లను భూమికి పూర్తిగా ఆనించాలి. ఇంట్లో పడక సమాంతరంగా ఉండాలి. దిండు మరీ ఎత్తుగా మరీ తక్కువగా ఉండకూడదు. లేదంటే వెన్నుపూసలోని డిస్క్‌లపై ఒత్తిడి పెరిగి అది వెన్ను నొప్పికి దారి తీస్తుంది. కంప్యూటర్ ముందు ఇలా కూర్చోరాదు మెదడు: ఎలాంటి వ్యాయామం లేకుండా ఒకే చోట కూర్చొని గంటల తరబడి పనిచేయడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతుంది. ఊబకాయం పెరిగి హైపర్ టెన్షన్‌కు దారితీస్తుంది. అధిక బీపీ ఉన్నా చాలామందిలో బయట పడదు. చివరికి ఇది బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమవుతుంది. మాట పడిపోవడం, మూతి వంకర పోవడం, కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడం వంటి సమస్యలతో జీవితమే దుర్భరంగా మారుతుంది. విపరీతమైన పని ఒత్తిడి వల్ల తరచూ తలనొప్పి, నిద్రలేమి వేధిస్తుంది. ఊబకాయంతో అధిక రక్తపోటు గుండె: గుండె జబ్బులకు ప్రధాన కారణం అధిక రక్తపోటు, మధుమేహం. వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయానికి దారి తీస్తుంది. ఇది అధిక రక్తపోటు, మధుమేహానికి కారణమవుతుంది. ఫలితంగా గుండె నాళాల్లో పూడికలు ఏర్పడి రక్తసరఫరా సక్రమంగా జరగదు. ఆకస్మిక గుండె జబ్బులు తలెత్తుతాయి. ఊపిరితిత్తులు: ఊబకాయంతో శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతాయి. గురక సమస్య వేధిస్తుంది. నగరంలో ఇది ఎక్కువగా ఉంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే నిద్రలో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. గురక వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పడిపోతుంది. తద్వారా మెదడుకు మరింత ప్రమాదం. కాళ్ల నరాలపై: ఎక్కువ సమయం కూర్చొంటే కాళ్ల నరాల్లో పూడిక ఏర్పడుతుంది. వెంటనే చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, గుండెకు రక్త సరఫరాలో ఇబ్బందులు తలెత్తి పల్మనరీ ఎంబాలిజమ్‌కు దారి తీసి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. క్యాన్సర్ల ముప్పు: కూర్చొని పని చేసే వారిలో క్యాన్సర్ల ముప్పు ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. రెండు గంటల కంటే ఎక్కువ సేపు కూర్చొని ఉంటే పెద్దపేగు, మహిళల్లో అండాశయం, రొమ్ము, పురుషుల్లో వీర్య గ్రంథి కేన్సర్లు చుట్టుముట్టే ప్రమాదం ఉందని తేల్చారు. కొందరు పనిచేస్తూ ఏమీ తినకుండా ఉంటారు. కొందరు అదే పనిగా టీవీ చూస్తూ జంక్ఫుడ్స్ ఇతర పదార్థాలు లాగించేస్తుంటారు. ఈ రెండు ప్రమాదమే. బరువు పెరిగితే మోకాళ్ల నొప్పులు మోకాళ్ల నొప్పులు: శారీరక వ్యాయామం లేని వారిలో చాలామందికి మోకాళ్ల నొప్పులు వస్తాయి. శరీర బరువు పెరిగి అది మోకాళ్లపై పడుతుంది. కీళ్లలో ఉండే మృదులాస్థి దెబ్బతింటుంది. కీళ్లు అరిగిపోతాయి. అక్కడ వాపు వచ్చి అడుగు వేయలేని పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం పురుషుల్లో కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. కూర్చుని తింటే ఊబకాయం తప్పదు పొట్ట (బెల్లీ ఫ్యాట్): అదే పనిగా కూర్చోవడం వల్ల పొట్ట భాగంలో అనవసరపు కొవ్వు పెరుగుతుంది. ఇది బెల్లీ ఫ్యాట్‌గా మారుతుంది. చాలామంది కార్యాలయాల్లోని క్యాంటీన్లలో జంక్‌ఫుడ్ ఎక్కువగా తింటుంటారు. పనిచేస్తూనే ఫ్రైడ్ స్నాక్స్, ఫాస్ట్ఫుడ్స్ తినేస్తుంటారు. తెలియకుండానే బరువు పెరిగిపోతారు. పొట్టభాగం ముందుకొస్తుంది. ఇలా చేయండి.. ► కొందరు ఏదో అనారోగ్య సమస్య బయట పడితేనో.. లేదంటే వైద్యులు చెప్పారనో ఉదయపు నడకకు వస్తుంటారు. వ్యాయామశాలకు వెళుతుంటారు. కొన్ని రోజులు చేసి మానేస్తుంటారు. ఇది సరికాదని వైద్యులు సూచిస్తున్నారు. ► 25 ఏళ్లు దాటిన వ్యక్తి రోజూ గంటపాటు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. పెద్ద పెద్ద బరువులు ఎత్తడమో, రూ.వేలు ఖర్చు పెట్టి జిమ్‌లకు వెళ్లడమో కాదు. చెమట పట్టే ఎలాంటి పని అయినా చేయవచ్చు. రోజూ 45 నిమిషాల పాటు తప్పనిసరిగా వేగంగా నడవాలి. ► గంటపాటు ఒకేచోట కూర్చుంటే.. లేచి 2–5 నిమిషాలు అటుఇటు తిరగాలి. చూపును కంప్యూటర్ నుంచి పక్కకు తిప్పాలి. సీటులో కూర్చొనే భంగిమ కూడా కీలకం. కంప్యూటర్ ముందుకి ఒంగిపోకుండా నిటారుగా కాళ్లు భూమికి పూర్తిగా అనించి కూర్చోవాలి. ► చాలామంది అల్పాహారం తీసుకోవడం మానేసి నేరుగా లంచ్ తింటుంటారు. ఇది సరికాదు. తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. ► లంచ్, డిన్నర్లో కనీసం 400 గ్రాములకు తక్కువ కాకుండా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు లాంటివి తీసుకోవాలి. వీలైనంత వరకు జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు, నూనెలు, ఉప్పు ఉన్న వంటకాలు తగ్గించుకోవాలి. చెమట వచ్చేలా కష్టపడాలి పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసేవారు. అందుకే వారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించగలిగారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కష్టపడే తత్వం తగ్గిపోతుంది. దీంతో అరోగ్యానికి అనర్దం కలిగిస్తోంది. ప్రతి ఒక్కరు రోజూ చెమట పట్టేలా కష్టపడాలి. నడక, వ్యాయామం లేదంటే ఇతర పనులు చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. – ఫణికుమార్, ఫిట్నెస్ ట్రైనర్, విజయనగరం -
ఆ సిత్రాలు.. ‘సోషల్’.. వైరల్!
సెకన్లు, నిమిషాల వ్యవధిలో కార్చిచ్చులా వ్యాపించి అందరినీ చేరుకునే సత్తా ఉండటం సోషల్ మీడియాలో కొత్త పోకడలకు ఆస్కారమిస్తోంది. ఆ సిత్రాలు కొన్ని చూస్తే... బాటిల్ క్యాప్ చాలెంజ్ సీసా మూతను కాలితో తీసే చాలెంజ్ పేరే బాటిల్ క్యాప్ చాలెంజ్. టైక్వాండో ఇన్స్ట్రక్టర్ ఫరాబీ డవ్లెట్చిన్ దీన్ని ప్రారంభించారు. నేలపైనగానీ, బల్లపైన గానీ ఒక సీసాని ఉంచి, దాని మూతను వదులుగా పెట్టాలి. కాలితో సీసా మూత ఊడిపోయి కిందపడేలా చేయాలి. సీసా మాత్రం పడకూడదు. బాలీవుడ్ నటులు అక్షయ్‌కుమార్, గోవింద, పరిణీతి చోప్రా, సుస్మితా సేన్ లాంటి ప్రముఖులు ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. కికీ చాలెంజ్ కదులుతున్న కారులోంచి దిగడం.. పాటకు తగ్గట్టు డ్యాన్స్ చేయడం... ఇదీ కికీ ఛాలెంజ్!!. యువత ఈ చాలెంజ్‌ను క్షణాల్లో వైరల్‌గా మార్చేసినా.. చాలా చోట్ల ఈ చేష్టలు ప్రమాదాలకూ కారణమ య్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఇలాంటి ఘటనలు నమోదు కావడంతో పోలీసులు.. ఈ చాలెంజ్‌లో పాల్గొనవద్దంటూ హెచ్చరికలు జారీచేయాల్సిన పరిస్థితులొచ్చాయి. ఫిట్నెస్ చాలెంజ్ ఈ చాలెంజ్ ప్రకారం యోగా చేస్తున్న దృశ్యాల వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవాలి. ప్రధాని మోదీ యోగా వీడియోలూ మథ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. క్రీడాకారులూ, బాలీవుడ్ నటులు ఇంకా ఎందరో ఇందులో పాల్గొన్నారు. -
ఇది బచ్చాగ్యాంగ్ చాలెంజ్!!
బీ టౌన్ స్టార్ కిడ్స్ తైమూర్, అబ్రామ్, ఆరాధ్య బచ్చన్, ఇనాయా ఖేము, మిషాలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. వీరి ఫొటోలు షేర్ చేస్తే చాలు లక్షల్లో లైకులు వచ్చిపడతాయి. తాజాగా ఈ జాబితాలో చేరేందుకు బాలీవుడ్ స్టార్ కపుల్ జెనీలియా- రితేశ్‌ల చిన్న కుమారుడు రెహిల్ కూడా సిద్ధమైపోయాడు. అయితే అందరిలా కేవలం ఫొటోలతో సరిపెట్టకుండా... ఫిట్నెస్ వీడియోతో అదరగొట్టాడు. తన తండ్రి రితేశ్ దేశ్‌ముఖ్ విసిరిన ఫిట్నెస్ చాలెంజ్‌ను స్వీకరించిన రెండేళ్ల రెహిల్... రోప్ సాయంతో గోడ మీదకి ఎక్కుతూ చాలెంజ్ పూర్తి చేశాడు. అంతేకాదు... స్టార్ కిడ్స్ తైమూర్ అలీఖాన్, లక్ష్యా కపూర్, కరణ్ జోహార్ కవలలు యశ్- రూహీలకు చాలెంజ్ కూడా విసిరాడు. రెహిల్కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన జెనీలియా..‘ రెహిల్.. వాళ్ల నాన్న విసిరిన ఫిట్నెస్ చాలెంజ్‌ను స్వీకరించాడు. ఇప్పుడు బచ్చా గ్యాంగ్‌కు చాలెంజ్ విసురుతున్నాడు.. #బచ్చేఫిట్తోదేశ్ఫిట్’ అంటూ క్యాప్షన్ జత చేశారు. రెహిల్ క్యూట్ వీడియోను చూసిన కరణ్ జోహార్...‘ ఓ మైగాడ్!!! చూడండి!!!! ఇతను రాక్‌స్టార్. నేనైతే రెహిల్లా చాలెంజ్ పూర్తి చేస్తానో లేదో’ అంటూ సరదాగా కామెంట్ చేశారు. Rahyl accepts his Baba’s #FitnessChallenge ... He further challenges the Bachcha Gang..... #BachceFitTohDeshFit A post shared by Genelia Deshmukh (@geneliad) on Aug 28, 2018 at 11:46pm PDT OMG!!! Look at him!!!! He’s a rock star!!!! Am nervous to even attempt this with mine😂😂😂 https://t.co/nihN0wVjyz — Karan Johar (@karanjohar) August 29, 2018 -
సల్మాన్... 52 ఏళ్ల వయస్సులోనూ..
-
సల్మాన్... 52 ఏళ్ల వయస్సులోనూ..
భారతీయులంతా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ ప్రారంభించిన ‘ఫిట్నెస్ చాలెంజ్’ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సామాన్యుని వరకు చాలా మంది ఈ ఫిట్నెస్ చాలెంజ్‌ని స్వీకరించి తమ వీడియోలను షేర్ చేశారు. ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ అంటూ పిలుపునిచ్చారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా చేరాడు. కేంద్ర సహాయక మంత్రి కిరణ్ రిజిజు విసిరిన చాలెంజ్‌కు స్పందనగా.. ‘క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ ప్రారంభించిన గొప్ప కార్యక్రమం ఇది. కిరణ్ రిజిజు విసిరిన చాలెంజ్‌ను స్వీకరిస్తున్నా’ అంటూ తన వర్కౌట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు ఫిదా అయిన సల్మాన్ అభిమానులు.. 52 ఏళ్ల వయస్సులోనూ తమ హీరో ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూస్తే చాలు అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూసేయండి. కాగా ప్రస్తుతం ‘భారత్’ సినిమా షూటింగ్ నిమిత్తం సల్లూ భాయ్ ‘మాల్టా’కు చేరుకున్నాడు. Fabulous campaign by sports minister #RajyavardhanRathore on #HumFitTohIndiaFit. I accept #FitnessChallenge of #KirenRijiju 🙏. Here is my video ... A post shared by Salman Khan (@beingsalmankhan) on Aug 10, 2018 at 10:30pm PDT -
రవిబాబు పందిపిల్లతో ఫిట్నెస్
-
అదుగో : పందిపిల్లతో ఫిట్నెస్ చాలెంజ్
విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు, పందిపిల్ల ప్రధాన పాత్రలో అదుగో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ఆలస్యమవుతోంది. అయితే సినిమా మీద ఆసక్తి కొనసాగించేందుకు రవిబాబు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో నోట్ల రద్దు సమయంలో పందిపిల్లతో కలిసి ఏటీయం క్యూలో నిల్చోని అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా మరోసారి అదే తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఫిట్నెస్ చాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ సందర్భాన్ని తన సినిమా ప్రచారానికి వినియోగించుకున్న రవిబాబు. బంటీ(పందిపిల్ల)తో కలిసి కసరత్తులు చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. పందిపిల్లను వీపుపై ఎక్కించుకుని పుల్అప్స్ చేశారు. ‘ బంటి ఫిట్నెస్ కోసం వ్యాయామం చేయగలుగుతోందని, మరి మీరు ఎందుకు చేయర’ని ప్రశ్నించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
దేవెగౌడను సవాల్ చేసే దమ్ముందా...!?
సాక్షి, బెంగళూరు : కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చిన ఫిట్నెస్ చాలెంజ్‌కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విసిరిన సవాల్‌ను స్వీరించిన ప్రధాని మోదీ తన ఫిట్నెస్ వీడియోను పోస్ట్ చేయడంతో పాటు కర్ణాటక సీఎం కుమారస్వామితో పాటు మరికొంత మందిని చాలెంజ్ చేశారు. అయితే మోదీ సవాల్‌కు కుమారస్వామి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. తాను ఫిట్‌గానే ఉన్నానని, తన రాష్ట్రం ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తున్నానని బదులిచ్చాడు. అయితే ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్న కుమారస్వామిని కాకుండా ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడను మోదీ సవాలు చేయాల్సిందంటూ జేడీఎస్ మద్దతుదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దేవెగౌడ చేస్తున్న కసరత్తులు అలాంటివి మరి. మోదీ ఫిట్నెస్ వీడియోపై మిశ్రమ స్పందనలు వచ్చిన నేపథ్యంలో దేవెగౌడ చేస్తున్న కసరత్తులు చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. 86 ఏళ్ల వయస్సులోనూ కఠినమైన కసరత్తులు చేస్తూ ఫిట్నెస్ పట్ల శ్రద్ధ వహిస్తున్న దేవెగౌడ అందరికీ ఆదర్శమంటూ కితాబు ఇస్తున్నారు. బెంగళూరులోని తన నివాసంలో జిమ్‌ను ఏర్పాటు చేసుకున్న దేవెగౌడ ప్రత్యేకంగా ఫిట్నెస్ ట్రైనర్‌ని కూడా నియమించుకున్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘తక్కువగా మోతాదులో ఆహారం తీసుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్‌కు దూరంగా ఉండడం, తక్కువగా నిద్రపోవడం, వేకువజామునే నిద్రలేచి వ్యాయామం చేయడం.. అన్నింటికీ మించి దురాశ లేకుండా ఉండడమే తన ఆరోగ్య రహస్యమని దేవెగౌడ చెప్పారు. మరి ప్రధాని మోదీ ఫిట్నెస్ వీడియోపై అభిప్రాయమేమిటని అడగ్గా చిరునవ్వు చిందించారు. దేవెగౌడ ఫిట్నెస్ ట్రైనర్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘ఉదయాన్నే నిద్రలేవగానే దేవెగౌడ గంటపాటు ట్రెడ్మీల్పై నడుస్తారు. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్, డంబెల్స్‌తో మరెన్నో కఠినమైన ఎక్సర్సైజులు’ చేస్తారని తెలిపారు. -
నామినేట్ చేసినందుకు మోదీకి థ్యాంక్స్!
న్యూఢిల్లీ : ఇటీవల కేంద్ర క్రీడలశాఖా మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ ప్రారంభించిన ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’కు విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేను సైతం అంటూ తన ఫిట్నెస్ వీడియోను పోస్ట్ చేశారు. నరేంద్ర మోదీ ఫిట్నెస్ ఛాలెంజ్‌పై భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మానికా బాత్రా స్పందించారు. ప్రధాని మోదీ స్థాయి వ్యక్తి తనకు ఫిట్నెస్ ఛాలెంజ్ విసరడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనను గుర్తించి ఫిట్నెస్ ఛాలెంజ్‌కు నామినేట్ (ఆహ్వానించినందుకు) చేసినందుకు ప్రధానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. మోదీ చేసిన ఈ ప్రయత్నం అందరికీ ఉపయోగకరమైనదని పేర్కొన్నారు. క్రీడాకారులతో పాటు ఇతరలుకు కూడా ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమని మానికా అభిప్రాయపడ్డారు. కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా మోదీ ఛాలెంజ్‌ను స్వీకరించారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణి మానికా బత్రా. కామన్వెల్త్ చరిత్రలో టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ సాధించిన తొలి పతకం కావడం గమనార్హం. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సింగపూర్ క్రీడాకారిణి మెయినగ్యు యూతో జరిగిన హోరాహోరీ పోరులో మానికా 11-7, 11-6, 11-2, 11-7 పాయింట్ల తేడాతో నెగ్గి స్వర్ణం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అతికొద్ది మందిలో మోదీ ఒకరు: రాజ్యవర్థన్ రాథోడ్ తాను ప్రారంభించిన హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఫిట్నెస్ విడుదల చేయడంపై కేంద్ర క్రీడలశాఖా మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రధాని తరచుగా యువత ఫిట్నెస్ గురించి మాట్లాడేవారు. యువత వల్ల దేశం మరింత అభివృద్ధి చెందుతుందని మోదీ భావించేవారు. ఇలాంటి ఫిట్నెస్ వీడియోలు షేర్ చేసే అతికొద్దిమంది ప్రధానులలో మోదీ ఒకరు. ఈ ప్రచారం మంచిధోరణిలో వెళ్తుంది. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని’ రాజ్యవర్ధన్ రాథోడ్ వివరించారు. -
మోదీ సవాల్.. స్పందించిన కుమారస్వామి
సాక్షి, బెంగళూరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన సవాల్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి స్పందించారు. ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ లో భాగంగా తనకు ప్రధాని మోదీ ఫిట్నెస్ ఛాలెంజ్ విసరడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు కర్ణాటక సీఎం కార్యాలయం ట్విటర్ ద్వారా తెలిపారు. తన ఆరోగ్యంపై మోదీ శ్రద్ధ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎవరికైనా ముఖ్యమే. అందుకే ప్రతిఒక్కరూ ఎక్సర్సైజ్, యోగా, జిమ్ లాంటి ఏదో రకంగా ఫిట్నెస్ను కాపాడుకుంటారని పేర్కొన్నారు. తాను రోజూ ట్రెడ్‌మిల్‌పై వర్కవుట్స్, యోగా చేస్తానని కుమారస్వామి వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి గురించి అంతకుమించి ఆందోళన చెందుతున్నానని, అందుకు మీ మద్దతు కావాలంటూ ప్రధాని మోదీని కర్ణాటక సీఎంఓ ట్విటర్ ద్వారా కుమారస్వామి కోరారు. Dear @narendramodi ji I am honoured& thankU very much for d concern about my health I believe physical fitness is imptnt for all&support d cause. Yoga-treadmill r part of my daily workout regime. Yet, I am more concerned about devlpment fitness of my state&seek ur support for it. — CM of Karnataka (@CMofKarnataka) 13 June 2018 కాగా, కర్ణాటక సీఎం కుమారస్వామికి, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన మానికా బాత్రాతో పాటు 40 ఏళ్లకు పైగా వయసున్న ఐపీఎస్ అధికారులను ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ ఛాలెంజ్‌కు మోదీ ట్విటర్ ద్వారా బుధవారం ఉదయం ఆహ్వానించిన విషయం తెలిసిందే. కర్ణాటక సీఎంకు మోదీ సవాల్ -
ఫిట్నెస్ చాలెంజ్; సరికొత్త సంచలనం!
బెల్గావి: ‘డాన్సింగ్ అంకుల్’ను తలదన్నే రీతిలో ‘అల్టిమేట్ ఫిట్నెస్ చాలెంజ్’ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ నుంచి ఫిట్నెస్ చాలెంజ్‌ల పరంపర మొదలుకావడం, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఫిట్నెస్ చాలెంజ్‌ను స్వీకరించడం, సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తున్నక్రమంలో.. హోరువానలో నడిరోడ్డుపై నిలబడి ఈ పెద్దాయన చేసిన విన్యాసాలను నెటిజన్లు విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. ఫుల్‌గా మద్యం సేవించి ఫిట్నెస్ చాలెంజ్: కడుపునిండా మద్యం సేవించి, ఆ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఈ పెద్దాయన చేసిన విన్యాసాలకు నెటిజన్లు ‘ఫిట్నెస్ చాలెంజ్’తో పోల్చుతున్నారు. కాసేపు పుషప్స్ కొట్టి.. మరికాసేపు ఆకాశంతో అలౌకిక సంభాషణచేసి.. మళ్లీ పుషప్స్ కొట్టి.. తొగడొట్టి... చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. కర్ణాటకలోని బెల్గావి పట్టణంలో ఈ వీడియోను చిత్రీకరించారు. అక్కడ భారీ వర్షాలు: కర్ణాటకలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుముకురు, ధావన్గిరి, కలబుర్గి, ధర్వాడ్, హుబ్లీ, గదగ్ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల జనజీవనం అస్తవ్యవస్థమైపోయింది. -
ఫుల్‌గా మద్యం సేవించి ఫిట్నెస్ చాలెంజ్!
-
ఆ హీరోని తిట్టొద్దు : ‘ఈగ’ విలన్
అభిమానుల మూలంగా స్టార్ హీరోలకు ఇబ్బందులు తప్పటం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు చేస్తున్న కామెంట్స్ స్టార్స్ మెడకు చుట్టుకుంటున్నాయి. తాజాగా కన్నడ నటుడు యష్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దేశవ్యాప్తంగా ఫిట్నెస్ చాలెంజ్ ట్రెండ్ నడుస్తుంది. సినీ తారలు తన తోటి నటీనటులను చాలెంజ్ చేస్తూ ఫిట్నెస్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కన్నడ స్టార్ హీరో, ఈగ విలన్ సుదీప్ తన ఫిట్నెస్ వీడియోను పోస్ట్ చేస్తూ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్, సోహైల్ ఖాన్, యష్, శివ రాజ్‌కుమార్‌లను చాలెంజ్ చేశాడు. ఈ చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసిన యష్ తన ఫిట్నెస్ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే ఈ వీడియోలో సుదీప్‌ను ఏకవచనంతో సంబోదించటం వివాదాస్పదమైంది. తమ అభిమాన నటుడిని యష్ కేవలం సుదీప్ అంటూ సంబోందించటంతో ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. నీ కన్నా పెద్దవారికి మర్యాద ఇవ్వటం నేర్చుకోమంటూ కామెంట్లు చేశారు. ఈ కామెంట్ల పై స్పందించిన సుదీప్, అభిమానులు సంయమనం పాటించాలని కోరారు. యష్‌ను ఇద్దేశించిన ఎలాంటి అభ్యంతరకర ట్వీట్స్ చేయోద్దంటూ కోరారు. యష్ పోస్ట్ చేసిన వీడియోలో నాకు ప్రేమ, మర్యాద మాత్రమే కనిపించాయి. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. I request my frnz n fans not to post any harsh tweets towards Yash ,calling me by my name in the video he has posted. Accepting my fitness challenge and posting tat video was outta sheer luv n respect n I can see only that. Hope my request is respected. — Kichcha Sudeepa (@KicchaSudeep) 4 June 2018 -
నానిని ఇరకాటంలో పెట్టిన నాగ్
సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా ఫిలిం సెలబ్రిటీలు ఫిట్నెస్ చాలెంజ్‌తో బిజీ అవుతున్నారు. కేంద్ర మంత్రి రాజవర్థన్ సింగ్ మొదలు పెట్టిన ఫిట్నెస్ చాలెంజ్‌ను టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, కల్యాన్ రామ్, నాగార్జున, అఖిల్, నాగచైతన్యలు తమ కసరత్తుల వీడియోలోనూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరికొంత మంది తారలను చాలెంజ్ చేశారు. అయితే తనను చాలెంజ్ చేస్తూ నాగార్జున చేసిన ట్వీట్ పై యంగ్ హీరో నాని ఆసక్తికరంగా స్పందించాడు. అఖిల్ చాలెంజ్‌కు స్పందింస్తూ తన జిమ్ వీడియోనూ పోస్ట్ చేసిన నాగ్, నాని, కార్తీ, శిల్పా రెడ్డిలను చాలెంజ్ చేశారు. ఈ చాలెంజ్ పై స్పందించాన నాని.. ‘చచ్చాను’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం నాని, నాగార్జున కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నారు. నాగ్ డాన్పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నాని డాక్టర్‌గా కనిపించనున్నాడు. Chachanu 🙈 — Nani (@NameisNani) 2 June 2018 -
ఫిట్నెస్ చాలెంజ్: సైనా పేరెంట్స్‌పై ప్రశంసలు
హైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తల్లిదండ్రులపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పిలుపునిచ్చిన ఫిట్నెస్ చాలెంజ్‌కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. దిగ్గజ క్రీడాకారుల నుంచి సినీ తారలు, సామన్య ప్రజల అందరూ.. తమ ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ.. సన్నిహితులకు సవాల్ విసురుతున్నారు. రాథోడ్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన సైనా సైతం జిమ్ వర్కౌట్స్ వీడియోను షేర్ చేస్తూ.. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, క్రికెటర్ గౌతం గంభీర్‌లను చాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫిట్ నెస్ చాలెంజ్‌ను సైనా తల్లిదండ్రులు స్వీకరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సైనా తల్లి ఉషా నెహ్వాల్ ఏకంగా జిమ్‌లో పెద్ద పెద్ద బరువులు ఎత్తుతూ ..ఎంతో మంది యువతీ, యువకులకు స్పూర్తిగా నిలిచారు. సైనా తండ్రి సైతం జిమ్‌లో సైక్లింగ్ చేస్తూ ‘హమ్‌ఫిట్‌తో ఇండియా ఫిట్’ కార్యక్రమంలో భాగమయ్యాడు. వీరి ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను సైనానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో సైనా తల్లితండ్రులపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్పూర్తినికలిగిస్తున్నారని కొందరంటే.. ‘ఫిట్ ఫాదర్.. ఫిట్ మదర్.. ఫిట్ డాటర్.. ఫిట్ ఇండియా’ అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. -
సైనా పేరెంట్స్ ఫిట్నెస్ చాలెంజ్
-
ఫిట్నెస్ ఛాలెంజ్: వాహ్.. నాగ్
ప్రస్తుతం దేశం మొత్తం ఫిట్నెస్ ఛాలెంజ్ ఫీవర్‌తో ఊగిపోతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు... అంతా ఒకరికొకరు సవాళ్లు విసిరుకుంటూ వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లోని ప్రముఖులు కూడా క్యూ కట్టేశారు. స్టార్ హీరో ఎన్టీఆర్.. చెర్రీ, మహేష్, కొరటాల శివ, రాజమౌళి, కళ్యాణ్ రామ్ తదితరులకు ఛాలెంజ్ విసరటం చూశాం. ఇప్పుడు సీనియర్ హీరో నాగ్ వంతు వచ్చింది. తనయుడు అఖిల్ విసిరిన ఛాలెంజ్‌కు నాగార్జున అక్కినేని స్పందించారు. ఈ ఉదయం జిమ్‌లో చేసిన ఎక్సర్సైజ్లకు వీడియో ఒకదానిని పోస్ట్ చేశాడు. వెయిట్ లిఫ్టింగ్‌కు సంబంధించిన వర్కవుట్ల కోసం బాగానే కష్టపడ్డాడు. ఇవన్నీ చూస్తుంటే 58 ఏళ్ల వయసులోనూ నాగ్ ఫిట్‌గా ఉండటంలో ఆశ్చర్యం లేదనిపిస్తోంది. అన్నట్లు ఇంతకీ నాగ్ ఎవరికి ఛాలెంజ్ విసిరాడో తెలుసా? నేచురల్ స్టార్ నాని, హీరో కార్తీ, శిల్పారెడ్డిలకు. ఆ వీడియో చూసిన అభిమానులంతా ‘వాహ్ నాగ్’ అంటున్నారు. మరోవైపు వర్మ దర్శకత్వంలో నాగ్ నటించిన నటించిన ఆఫీసర్ చిత్రం నేడు విడుదల కాగా, నానితో చేస్తున్న మల్టీస్టారర్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇవికాకుండా కోలీవుడ్ హీరో ధనుష్ డైరెక్షన్లో ఓ చిత్రం ఉండబోతున్నట్లు నాగ్ ప్రకటించాడు కూడా. Here we go @AkhilAkkineni8 my reply for #HumFitToIndiaFit challenge..I challenge @NameisNani @Karthi_Offl @shilpareddy217 to post there fitness videos. 👉My exercise regime today lower body heavy for strength and upper body light for recovery👍 pic.twitter.com/nsgmym0M4n — Nagarjuna Akkineni (@iamnagarjuna) 1 June 2018 -
టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలకు ఎన్టీఆర్ ఛాలెంజ్!
సాక్షి, హైదరాబాద్ : మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ విసిరిన ఛాలెంజ్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వీకరించారు. నా ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం మోహన్‌లాల్ ఛాలెంజన్‌ను స్వీకరించానని సోషల్ మీడియాలో తెలిపారు. అందులో భాగంగానే జిమ్‌లో ట్రైనర్ స్టీవెన్స్ సూచనలతో తరచూ కసరత్తులు చేస్తానని చెప్పారు. జిమ్‌లో చేసిన తన వర్కవుట్స్‌ను వీడియో తీసి ట్వీట్లో పోస్ట్ చేశారు తారక్. కావాల్సిన దానికంటే కాస్త ఎక్కువ బరువులతో ఎన్టీఆర్ కుస్తీ పట్టారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ లో భాగంగా మరికొందరు టాలీవుడ్ ప్రముఖులను ఎన్టీఆర్ ఛాలెంజ్ చేశారు. సోదరుడు నందమూరి కళ్యాణ్‌రామ్, సూపర్‌స్టార్ మహేష్ బాబు, మెగా పవర్‌స్టార్ రాంచరణ్, డైరెక్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివలకు ఎన్టీఆర్ ఫిట్నెస్ సవాల్ విసిరారు. అయితే చరణ్‌కు తన ఛాలెంజ్ గురించి చెప్పాలని ఉపాసనను ఎన్టీఆర్ కోరారు. ఇదివరకే కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ ప్రారంభించిన ఫిట్నెస్ ఛాలెంజ్‌ను స్వీకరించిన క్రికెటర్లు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు తమ ఫిట్నెస్ వీడియోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ ఛాలెంజ్‌ను స్వీకరించిన మోహన్‌లాల్.. ఎన్టీఆర్‌కు ఫిట్నెస్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. Challenge accepted sir @Mohanlal ! This is a part of my fitness routine with @lloydstevenspt . I now challenge @NANDAMURIKALYAN , @urstrulyMahesh , Charan , @ssrajamouli & @sivakoratala to take the #HumFitTohIndiaFit challenge. Psst @upasanakonidela ..plz convey this to Charan pic.twitter.com/zoGjzzHNsC — Jr NTR (@tarak9999) 31 May 2018