సల్మాన్‌... 52 ఏళ్ల వయస్సులోనూ.. | Salman Khan Accepts And Wins Kiren Rijiju's Fitness Challenge | Sakshi
Sakshi News home page

సల్మాన్‌... 52 ఏళ్ల వయస్సులోనూ..

Published Sat, Aug 11 2018 1:51 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

భారతీయులంతా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ ప్రారంభించిన ‘ఫిట్‌నెస్‌ చాలెంజ్‌’ ‌ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సామాన్యుని వరకు చాలా మంది ఈ ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ని స్వీకరించి తమ వీడియోలను షేర్‌ చేశారు. ‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’ అంటూ పిలుపునిచ్చారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా చేరాడు.కేంద్ర సహాయక మంత్రి కిరణ్‌ రిజిజు విసిరిన చాలెంజ్‌కు స్పందనగా.. ‘క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ ప్రారంభించిన గొప్ప కార్యక్రమం ఇది. కిరణ్‌ రిజిజు విసిరిన చాలెంజ్‌ను స్వీకరిస్తున్నా’  అంటూ తన వర్కౌట్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోకు ఫిదా అయిన సల్మాన్ అభిమానులు.. 52 ఏళ్ల వయస్సులోనూ తమ హీరో ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూస్తే చాలు అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూసేయండి. కాగా ప్రస్తుతం ‘భారత్‌’  సినిమా షూటింగ్‌ నిమిత్తం సల్లూ భాయ్‌ ‘మాల్టా’కు చేరుకున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement