Salman Khan
-
ది కపిల్ శర్మ షో వివాదం.. సల్మాన్ ఖాన్ టీమ్ క్లారిటీ!
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోన్న స్టార్ కమెడియన్ కపిల్ శర్మ షో.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో. ఈ షోకు కపిల్ శర్మ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఇటీవల ఓ ఎపిసోడ్లో రవీంద్రనాథ్ ఠాగూర్ వారసత్వాన్ని అగౌరవపరిచేలా చూపించారంటూ ఓ వర్గం ఆరోపించింది. ఈ నేపథ్యంలో బొంగో భాషి మహాసభ ఫౌండేషన్ వారికి లీగల్ నోటీసులు పంపింది. ఈ షో తమను కించపరిచేలా ఉందని.. సాంస్కృతిక, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నోటీసుల్లో పేర్కొంది.అన్ని అవాస్తవాలే...అయితే ఈ వివాదం తర్వాత సల్మాన్ ఖాన్ టీమ్‌కు ఈ షోతో సంబంధాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఆయనకు చెందిన ఎస్కేటీవీకి లీగల్ నోటీసులు వచ్చినట్లు రాసుకొచ్చారు. తాజాగా ఈ ఆరోపణలపై సల్మాన్ ఖాన్ టీమ్ స్పందించింది. అసలు ఆ షోతో సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాపై వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్టేట్మెంట్ విడుదల చేశారు.కాగా.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. -
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరుగా : కన్నెత్తి చూడని బాలీవుడ్ సెలబ్రిటీలు
సాక్షి ముంబై: ఎన్నికల ప్రచారంలో సినీతారలకు ప్రజల్లో ఉన్న క్రేజే వేరు. పంచ్ డైలాగులు, హావభావాలతో రోడ్ షోలు, ఎన్నికల సభలను రక్తికట్టించడంలో వారికి వారే సాటి. అందుకే ఓటర్లను ఆకర్షించేందుకు ఓ మాదిరి ఆర్టిస్టుల దగ్గర్నుంచి బడా నటీనటుల వరకూ రాజకీయ పార్టీలు తమ తరపున ప్రచారం చేయమంటూ ఆహ్వానించడం పరిపాటి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నప్పటికీ పలువురు సినీ, బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం ఈవైపు కన్నెత్తి చూడడం లేదు. క్యాంపెయినింగ్‌కు దూరంగా బాలీవుడ్.. గతంలో ప్రముఖ రాజకీయ పార్టీల తరపున విస్తృతంగా ప్రచారం చేసిన అనేక మంది బాలీవుడ్ తారలు ఇప్పుడు ఊరుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. కొందరు మినహా అనేక మంది సినీ ప్రముఖులు ప్రచార సభలు, రోడ్‌షోలకు దూరంగా ఉంటున్నారు. సల్మాన్ ఖాన్ ఇంటిపై ఇటీవల కాల్పులు జరగటం, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని బిష్ణోయి గ్యాంగ్ హత్య చేయడం, సల్మాన్‌ఖాన్, షారుఖ్ ఖాన్లకు కూడా ఈ గ్యాంగ్ ద్వారా బెదిరింపు ఫోన్లు రావడం వల్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ప్రముఖ బాలీవుడ్ తారలతోపాటు చిన్న చిన్న పాత్రలు పోషించే ఆర్టిస్టులు కూడా మనకెందుకొచ్చిన గొడవలే అన్నట్లుగా మిన్నకుంటున్నారు. ఒకవేళ ఎవరైన బడా నేతలు ప్రచారానికి రావాలని అడిగినా షూటింగుల్లో బిజీగా ఉన్నామని, విదేశాల్లో ఉన్నామని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకే... లోక్‌సభ, అసెంబ్లీ, కార్పొరేషన్ ఇలా ఎలాంటి ఎన్నికలు వచి్చనా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పారీ్టలు అనేక విధాలుగా ప్రయత్నిస్తాయి. అందులో ముఖ్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు బాలీవుడ్ తారలను ప్రచారంలోకి దింపడం ఒక ఫ్యాషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి సభలకు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని, వీరి మాటల ప్రభావంతో ఓటర్లు తమ పార్టీ అభ్యరి్ధకి ఓటు వేస్తారని నేతల ప్రగాఢ నమ్మకం. మాజీ మంత్రి, ఇటీవలే హత్యకు గురైన బాబా సిద్దీఖీ తరపున గతంలో అనేక మంది ప్రముఖ బాలీవుడ్ నటులు ప్రచారంలో పాల్గొన్నారు. అప్పట్లో సిద్దిఖీ నిర్వహించే సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి అనేక మంది దిగ్గజ సెలిబ్రిటీలు కనిపించేవారు. ఆయన విజయంలో ఇది కూడా పరిగణించదగ్గ అంశమని రాజకీయ వర్గాల అభిప్రాయం. కానీ ఇటీవల ఆయన హత్యకు గురికావడంతో బాలీవుడ్ తారల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ హత్య తామే చేసినట్లు బిష్నోయి గ్యాంగ్ అంగీకరించడంతో పాటు పలువురు సెలబ్రిటీలకు ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడంతో ప్రచార సభలకు సా««ధ్యమైనంత దూరంగా ఉండాలని వారంతా భావిస్తున్నారు. ప్రాంతీయ నటులతో ప్రచారం... గతంలో మాదిరిగా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల కోసం అనేక మంది సినీ తారలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించినప్పటికీ ఈసారి వారంతా ముఖం చాటేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యక్షంగా ప్రచార సభలకు హాజరయ్యేందుకు వారు నిరాకరిస్తుండటంతో రాజకీయ పారీ్టలు గత్యంతరం లేక ప్రాంతీయ సినిమా, స్టేజీ ఆరి్టస్టులను ప్రచారం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాయి. దీంతో మరాఠీ సినీ, నాటక రంగానికి చెందిన తారలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కొన్ని గంటల ప్రచారానికి కొంతమంది రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఇక రోజంతా ప్రచారంలో పాల్గొనాలంటే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నారు. ఇక ఏ గ్రేడ్ తారలైతే రూ.20–35 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నారని సమాచారం. దీంతో మరోదారి లేక వారడిగినంత చెల్లించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి రాజకీయ పార్టీలు. కాగా కొందరు మరాఠీ నటుల మాత్రం రాజకీయ పార్టీలతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచితంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం... దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన, జరగనున్న ఎన్నికల్లో ప్రచారం విషయంలో ఈసారి సోషల్ మీడియాదే అగ్రస్థానం. తాము చెప్పదలచుకున్న విషయాలను, వివరించదలచిన అంశాలను సూటిగా, స్పష్టంగా, నిమిషాల వ్యవధిలో ఓటర్లకు చేర్చడంలో ఇది అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం కావడంతో రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారంతోపాటు సోషల్ మీడియాను కూడా విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. బాలీవుడ్ తారలు ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొనక పోయినప్పటికీ వారి వాయిస్ రికార్డింగులు, వీడియోలను ఫేస్ బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్‌గా మారి తమకు భారీగా ఓట్లు దక్కే అవకాశముందని అభ్యర్ధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు ఓటర్ల కోసం ప్రత్యేకంగా...ముంబై సహా మహారాష్ట్ర సరిహద్దులైన విదర్భ. మరఠ్వాడాలోని చంద్రాపూర్, నాందేడ్, బల్లార్పూర్తోపాటు నాసిక్, ముంబై. పుణే, సోలాపూర్ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాల పరిధిలోని నియోజక వర్గాలలో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నటీనటులతోపాటు తెలుగు నేతలను ప్రచార రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, సీతక్క, ఇతర కాంగ్రెస్ నేతలు మహావికాస్ ఆఘాడి, కాంగ్రెస్‌లకు మద్దతుగా ర్యాలీలు, రోడ్ షోల ద్వారా విస్తత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. బీజేపీ, టీడీపల మధ్య పొత్తు కుదిర్చేందుకు పవన్ ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలుండే నియోజక వర్గాలలో బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేయడానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది నో స్టార్స్... ఓన్లీ క్యాంపెయినింగ్ క్యాంపెయిన్‌లో పాల్గొననున్న మరాఠీ తారలు వీరే ...నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) (అజిత్ పవార్ వర్గం)–శాయాజీ శిందే, భావు కదం. శివసేన (ఏక్నాథ్ శిందే)–గోవిందా, శరద్ పోంక్షే. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)–ప్రజక్తా మాళీ, తేజస్వినీ పండిట్. ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)–అమోల్ కోల్హే. బీజేపీ–ప్రియా బేర్డే, నిశా పరుళేకర్. -
అసలు హీరో అనిల్‌ను వదిలేసి.. లారెన్స్‌కు ప్రాధాన్యం.. కరెక్ట్ కాదు!
ఒక లక్ష్యం కోసం దశాబ్దాలుగా అవిశ్రాంతంగా శ్రమిస్తూ, పని చేస్తున్నవారు సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. 48 ఏళ్ల అనిల్ బిష్ణోయ్ అటువంటివాడే. ఆయన విద్యావంతుడే కాదు రైతు కూడా! ఆవాలు, పత్తి పండించేవాడు. వన్యప్రాణుల ప్రేమికుడు, జంతువులు... ముఖ్యంగా కృష్ణ జింకలు అంటే ఆయనకు చిన్నతనం నుంచీ ప్రేమ ఎక్కువ! జంతువులను వేటాడేవారిని అతడు తీవ్రంగా నిరసిస్తాడు. హనుమాన్‌గఢ్‌లోని శ్రీగంగానగర్‌లో జంతువులను రక్షించే మిషన్‌ను ప్రారంభించడానికి వేటగాళ్లే కారణం అంటాడు అనిల్.బిష్ణోయ్ కమ్యూనిటీ వారికి కృష్ణ జింక పవిత్ర జంతువు. ఈ కమ్యూనిటీ వారి గురువైన భగవాన్ జాంబేశ్వర్ అడవినీ, వన్యప్రాణులనూ రక్షించాలనీ, తద్వారా మాత్రమే పర్యావరణ పరి రక్షణ ఉంటుందనీ చెప్పేవారు! ఆ బోధనల ప్రభావం బిష్ణోయ్ కమ్యూ నిటీపై ఎక్కువ ఉంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మీద ఇదే ప్రాంతంలో జింకను చంపిన కేసు నమోదు అవ్వడం గమనార్హం. ఇప్పుడు ఆయనకు చంపుతామనే బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. నిజానికి బిష్ణోయ్ సమాజానికి చెందినవారు సల్మాన్‌ను తమ మందిర్‌కు వచ్చి క్షమాపణ కోరమన్నారు. దీనిని ఆసరా చేసుకుని జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగస్టర్ ముఠా బెదిరింపులకు దిగిందని అంటారు. జాతీయ మీడియా అసలు హీరో అనిల్‌ను వదిలేసి లారెన్స్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు.హనుమాన్ గఢ్ జిల్లా శ్రీగంగా నగర్‌కు చెందిన అనిల్ చిన్న నాటి నుంచే జింకల వేటగాళ్ల పట్ల కోపంగా ఉండేవాడు! వారిని పోలీస్‌లకు పట్టించేవాడు, సాక్ష్యం చెప్పి వారికి శిక్షలు పడే విధంగా చూసేవాడు! 30 ఏళ్లుగా ఈ సంరక్షకుడు 10 వేల కృష్ణ జింకలను వేటగాళ్ల ఉచ్చు నుంచి కాపాడాడు! వాటి రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. గత మూడు దశా బ్దాలుగా జింకల రక్షణ కోసం ప్రచారం చేస్తున్నాడు. చదవండి: ఆ ప్రాజెక్టుకు పది లక్షల చెట్ల బలి!50 పంచాయతీలలో కృష్ణ జింకల సహజ అవాసాలకు కలిగిన నష్టం, వేటగాళ్ల దుశ్చర్యల గురించి ప్రచార కార్యక్రమం చేపట్టాడు. కృష్ణ జింకలకు నీరు వంటి కనీస వసతులు కల్పించడానికి పూనుకుని... తన గ్రామ ప్రజల నుంచి రెండు లక్షల రూపాయలు చందా పోగు చేశాడు. దానికి తన సొంత డబ్బు కొంత జతచేసి కృష్ణ జింకల అవసరాలను తీర్చడానికి 60కి పైగా చిన్న, మధ్య తరహా నీటి వనరులను ఏర్పాటు చేశాడు. వాటికి గాయాలు అయినపుడు చికిత్స ఏర్పాట్లు కూడా చేశాడు.చదవండి: వ్యక్తిగా రతన్ టాటా ఎలా ఉండేవారు?1990లో సూరత్ గఢ్‌లో కళాశాల చదువు చదువుతున్న కాలంలోనే అటవీ రక్షణ, వన్య ప్రాణుల రక్షణ మీద జరిగిన ఒక సదస్సులో అనిల్ పాల్గొన్నాడు. ‘ఈ సదస్సు నా మనస్సుపై చాలా ప్రభావాన్ని చూపింది’ అంటాడు అనిల్! బీఏ. బీఈడీ చదువు పూర్తి కాగానే గ్రామానికి వచ్చి వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. రాజస్థాన్ లోని 12 జిల్లాలలో 3,000 మంది వివిధ ఉద్యోగాలు చేసుకునే వారితో కలిసి వన్యప్రాణ రక్షణ మీద, శాంతి ర్యాలీలు, సమావేశాలు పెట్టడం మొదలు పెట్టాడు. ఇప్పటి దాకా వేటగాళ్ల మీద 200లకు పైగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో 30 కేసులు ముగింపు దశకు చేరాయి. కొందరికి జరిమానాలు పడ్డాయి. అనిల్ బిష్ణోయ్ తుంహే సలాం! – ఎండి. మునీర్సీనియర్ జర్నలిస్ట్ -
హైదరాబాద్‌లో సల్మాన్ ఖాన్.. ఆ హోటల్లో కఠిన నిబంధనలు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం సల్లు భాయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సిటీలో రాయల్ హోటల్‌గా గుర్తింపు ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనూ షూటింగ్ నిర్వహిస్తున్నారు.అయితే సల్మాన్ ఖాన్‌కు ఇటీవల వరుసగా బెదిరింపులు వస్తోన్న సంగతి తెలిసిందే. కృష్ణజింకల కేసు నుంచి ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్‌ను చంపేస్తామంటూ కొందరి నుంచి కాల్స్ వస్తుండటంతో ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను పెంచారు. అలా ఫుల్ సెక్యూరిటీ మధ్య ఆయన షూటింగ్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.నాలుగంచెల భద్రత..ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్లో నాలుగు అంచెల భద్రతలో సల్మాన్ ఖాన్ మూవీ షూటింగ్ నిర్వహించారు. ఆయన భద్రత విషయంలో రాజీ పడకూడకుండా నిర్మాతలు చర్యలు తీసుకున్నారు. ఎవరైనా అతిథులు షూటింగ్ జరుగుతున్న హోటల్‌ను బుక్ చేసుకుంటే రెండంచెల చెకింగ్‌ను వారు ఎదుర్కొవాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి హోటల్ సెక్యూరిటీ సిబ్బంది.. మరొకటి సల్మాన్ ఖాన్ ప్రత్యేక భద్రత బృందం వారిని తనిఖీ చేయాలి. ఆ తర్వాతే వారిని హోటల్లోకి అనుమతించడం జరుగుతుంది.ఐడీ ఉంటేనే అనుమతి...మరోవైపు హోటల్ సిబ్బందికి ఐడీ కార్డులు ఉంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ప్రతి రోజు సిబ్బంది ఐడీలను సైతం తనిఖీ చేస్తున్నారు. సల్మాన్ కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను పటిష్టమైన భద్రతా వలయంగా మార్చారు. ఆయన కోసం దాదాపు 50 నుంచి 70 వరకు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించారు. వీరిలో మాజీ పారామిలటరీ సిబ్బంది కూడా ఉన్నారు. అయితే హైదరాబాద్‌లో షూటింగ్ షెడ్యూల్‌ను ముగించిన తర్వాత సల్మాన్ దుబాయ్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.కాగా.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికందర్ను సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బిగ్‌బాస్ హోస్టింగ్‌కు బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరో
బిగ్‌బాస్ షోలో వారం రోజులు కంటెస్టెంట పర్ఫామెన్స్ చూస్తే వీకెండ్లో హోస్ట్ వారికి ఎలా కోటింగ్ ఇస్తారు? ఎవరిని మెచ్చుకుంటారు? అని ఎదురుచూస్తుంటారు ఆడియన్స్. అందుకే వీకెండ్లో రేటింగ్ కూడా ఎక్కువే ఉంటుంది. కొందరు హీరోలు బిగ్‌బాస్ బాధ్యతను ఏళ్ల తరబడి భుజాలపై మోస్తున్నారు. బిగ్‌బాస్ షోకు డుమ్మావారిలో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. దాదాపు 15 ఏళ్లుగా ఆయన హిందీ బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం 18వ సీజన్‌కు హోస్టింగ్ చేస్తున్నాడు. అయితే ఈ వారం అతడు షూటింగ్‌కు డుమ్మా కొట్టనున్నాడట! ప్రస్తుతం అతడు సికిందర్ సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్‌లో సినిమా షెడ్యూల్ ఉండటంతో బిగ్‌బాస్ షో నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాడు. సల్మాన్ స్థానంలో ఆ సెలబ్రిటీలుదీంతో ఈ వారం వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో సల్మాన్ స్థానంలో సెలబ్రిటీలు ఏక్తా కపూర్, రోహిత్ శెట్టి రానున్నారు. వీళ్ల స్పెషల్ ఎంట్రీ గురించి షో నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఇక సికిందర్ సినిమా విషయానికి వస్తే.. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) చదవండి: నన్ను క్షమించండి.. తప్పు చేయలేదు: కస్తూరి -
వారి పిల్లలు చెట్లు, దైవం కృష్ణజింక
సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు రావడంతో బాలీవుడ్ సూపర్‌స్టార్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ‘కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్ నిర్దోషి’ అని అతని తండ్రి సలీంఖాన్ ప్రకటనపై బిష్ణోయ్ సంఘాలు నిరసన ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కృష్ణజింకలు, వాటితో బిష్ణోయ్ సమాజానికి ఉన్న అనుబంధం మరో సారి వార్తల్లోకి వచ్చింది.వారిది 550 సంవత్సరాల అనుబంధం!పదిహేనవ శతాబ్దంలో గురు జంబేశ్వర్ (జాంబాజీ అని కూడా పిలుస్తారు) స్థాపించిన బిష్ణోయ్ శాఖ 29 సూత్రాలతో మార్గనిర్దేశం చేయబడింది. జాంబాజీ బోధనలు వన్య ప్రాణులు, చెట్ల ప్రాముఖ్యత, సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తాయి. కృష్ణజింకను తమ ఆధ్యాత్మిక గురువుగా జాంబేశ్వర్ పునర్జన్మగా నమ్మి పూజిస్తారు.బిష్ణోయ్‌ల జానపద కథల్లోనూ కృష్ణజింక ప్రధానంగా కనిపిస్తుంది. కృష్ణజింకను తన ప్రతీకగా, వ్యక్తీకరణగా ఆరాధించమని జాంబేశ్వర్ తన అనుచరులకు ఆదేశించినట్లు చెబుతారు. తాము కృష్ణజింకలుగా పునర్జన్మ పొందుతామని బిష్ణోయ్‌లు నమ్ముతారు.చెట్లను బిడ్డల్లా చూసుకోవడం విషయానికి వస్తే...1730లో జోద్పూర్ సమీపంలోని ఖేజర్లీ గ్రామంలో చెట్లను నరికి వేయకుండా కాపాడే క్రమంలో 362 మంది బిష్ణోయిలు మరణించారు. జోద్పూర్ మహారాజా అభయ్‌సింగ్ ఆదేశాల మేరకు ఈ మారణకాండ జరిగింది.కొత్త రాజభవనాన్ని నిర్మించడానికి అభయ్ సింగ్ కలప కోసం చెట్లను నరికి వేయడానికి సైనికులను పంపాడు. అమృతాదేవి అనే మహిళ నాయకత్వంలో బిష్ణోయ్ ప్రజలు ప్రతిఘటించారు. అమృతాదేవి తదితరులు చెట్లను కౌగిలించుకొని వాటిని రక్షించడానికి సాహసోపేతంగా ప్రతిఘటించారు. ఈ సంఘటన 1973 చిప్కో ఉద్యమానికి ప్రేరణ ఇచ్చింది.(చదవండి: భారతీయ వంటకాలపై రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పొగడ్తల జల్లు..!) -
హైదరాబాద్‌లో ఫుల్ సెక్యూరిటీతో సల్మాన్ ఖాన్.. కారణం ఇదే..!
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సికందర్’. ఇప్పుడు ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరగనుంది. ఈమేరకు సల్మాన్ భాగ్యనగరానికి వచ్చారు. ఈ మూవీకి సాజిద్ నడియాడ్వాలా నిర్మాతగా ఉన్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సికందర్‌గా సల్మాన్ ఖాన్ కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ముంబైలో ప్రారంభమైంది.'కిక్' సినిమా తర్వాత సాజిద్, సల్మాన్ కలయికలో రానున్న చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో సల్మాన్‌ను చంపేస్తామంటూ కొందరి నుంచి బెదిరింపుల కాల్స్ వస్తుండటంతో ఆయన సెక్యూరిటీని పెంచుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడికెళ్లినా ఫుల్ సెక్యూరిటీతోనే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే, ఇప్పుడు షూటింగ్ కోసం ఇలాంటి పరిస్థితిల్లో హైదరాబాద్‌కు సల్మాన్ రావడంతో అందరిలోనూ ఆసక్తిగా ఉంది.హైదరాబాద్‌లో రాయల్ ప్యాలెస్‌గా గుర్తింపు ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సికిందర్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించనున్నారు. నవంబర్ 7వరకు సల్మాన్ షూటింగ్లో పాల్గొననున్నారు. వచ్చే ఏడాది ఈద్‌కి 'సికందర్' సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్‌కు ఎలాంటి డూప్ సాయం లేకుండా సల్మాన్ నటించనున్నారు. -
సల్మాన్ ఖాన్ (బాలీవుడ్ స్టార్)రాయని డైరీ
తప్పులు మానవ సహజం అయినప్పుడు శిక్షలు అమానుషంగా ఎందుకు ఉండాలి?! చట్టాల గురించి, బిష్ణోయ్ లారెన్స్ గ్యాంగ్ గురించీ కాదు నా ఆలోచన. శిక్షను విధిస్తు న్నట్లు తెలియపరచకుండానే మూతి బిగింపుల మౌనంతో యావజ్జీవ దూరాన్ని పాటిస్తుండే సొంత మనుషుల గురించి, ‘నా’ అనుకున్నా, నా వాళ్లు కాకుండా పోయిన వాళ్ల గురించి. చట్టం విధించే శిక్ష నిర్దాక్షిణ్యమైనదిగా కనిపించవచ్చు. కానీ, ఏ రూల్ బుక్కూ లేకుండా మనిషికి మనిషి విధించే శిక్ష అన్యాయమైనది. న్యాయం లేకపోవటం కన్నా దయ లేకపోవటం ఏమంత చెడ్డ విషయం?!శిక్షల విధింపులో చట్టానికి ఒక చక్కదనం ఉంటుంది. ఒక సక్రమం ఉంటుంది. చింపిరి జుట్టుకు దువ్వెన, దారిలో పెట్టే దండన... చట్టం.కారును ఢీకొట్టించు. జింకను వేటాడు. ఆయుధాలు కలిగి ఉండు. 26/11 పై కామెంట్లు చెయ్యి. యాకూబ్ మెమన్ మీద ట్వీట్లు పెట్టు. దరిద్రం నీ నెత్తి మీద ఉండి ఆఖరికి ఐశ్వర్యారాయ్ పైన కూడా చెయ్యి చేస్కో. నువ్వెన్ని చేసినా... చట్టం వెంటనే నిన్ను దూలానికి వేలాడదీయదు. శూలాలతో పొడిపించదు. మొదట విచారణ జరుపుతుంది. వాదనలు వింటుంది. వాయిదాలు వేస్తుంది. తీర్పును రిజర్వు చేస్తుంది. ఆ తర్వాతే నువ్వు దోషివో, నిర్దోషివో తేలుస్తుంది. దోషివైతే జైలుకు పంపుతుంది. కావాలంటే బెయిలిస్తుంది.మనుషులు విధించే శిక్షలో ఇవేవీ ఉండవు. దువ్వెనా, దండనా అసలే ఉండవు. దూరంగా జరిగిపోతారంతే. ‘‘ఎలా ఉన్నావ్?’’ అని అడిగేందుకైనా దగ్గరకు రారు. ‘‘భద్రంగా ఉండు..’’ అని చెప్పేందుకైనా దూరాన్ని తగ్గించుకోరు. ఎంత అమానుషం!!‘‘నువ్వు పెంచుకున్న దూరమే ఇది సల్మాన్..’’ ఎంత తేలిగ్గా అనేస్తారు!బంధాలను కదా నేను పెంచుకున్నాను. దూరాలనా?! స్నేహబంధం, ప్రేమబంధం, జీవితబంధం... అన్ని బంధాలనూ తెంచుకుని వెళ్లింది ఎవరు?!‘‘కానీ సల్మాన్, నువ్వొట్టి పొసెసివ్. గట్టిగా పట్టేసుకుంటావ్. ఎటూ కదలనివ్వవు. ఎటూ చూడనివ్వవు. ఏదీ మాట్లాడనివ్వవు. ఏమీ చెప్పనివ్వవు. దాన్నేమంటారు మరి? దూరం పెరగటమే కదా! నువ్వు పెంచుకున్న దూరం..’’ అంటారు!కేరింగ్‌ను పొసెసివ్ అని ఎందుకు అనుకుంటారు వీళ్లంతా?! కేరింగ్ అవసరం లేదని చెయ్యి విడిపించుకున్నప్పుడు దూరం పెరిగితే అది చెయ్యి వదిలిన వాళ్లు పెంచుకున్న దూరం అవుతుందా?!రోజుకొకరు ఫోన్ చేసి, ‘‘సల్మాన్ నిన్ను చంపేస్తాం’’ అని బెదిరిస్తున్నారు. వాళ్లు నయం కదా... ‘‘సల్మాన్ బాగున్నావా?’’ అని పరామర్శగా ఒక్క కాల్ అయినా చేయకుండా జూహూలో, బాంద్రాలో ఏళ్లకు ఏళ్లు నాకు ‘దగ్గరగా’ ఉంటున్న వారి కంటే!బయట క్రాకర్స్ పేలుతున్నాయి. గన్ పేలి నప్పుడు వచ్చే శబ్దం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. సైలెన్సర్ బిగిస్తే అసలు శబ్దమే ఉండదు.నవ్వొచ్చింది నాకు. నా చుట్టూ ఉన్న వాళ్లంతా మౌనాన్ని బిగించుకున్న తుపాకుల్లా అయిపోయారా! సైలెన్సర్ ఉన్న బులెట్ మౌనంగా ఒకసారే దిగిపోతుంది. మౌనం అదేపనిగా బులెట్లను దింపుతూ ఉంటుంది.లేచి బాల్కనీ లోకి వచ్చాను. ఒక్కక్షణం నాకు గెలాక్సీ అపార్ట్మెంట్లో ఉన్నానో, పాన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఉన్నానో అర్థం కాలేదు. ఎక్కడుంటే ఏమిటి, పక్కన మనిషే లేనప్పుడు? పలకరింపు కూడా కరువైనప్పుడు!కళ్లెదురుగా ఆకాశం వెలిగి ఆరిపోతూ, వెలిగి ఆరిపోతూ ఉంది. ఎగసిన కాంతి పూలు ఫెటేల్మని విచ్చుకుని, చప్పున అంతెత్తు నుంచి చీకట్లోకి జారిపోతున్నాయి.ఏనాడో జీవితంలోంచి వెళ్లిపోయినవారు ఇప్పుడు ఒక్కొక్కరూ గుర్తుకు వస్తున్నారంటే.. కష్టంలో ఉన్నామనా? కష్టాన్ని తట్టుకుని ఉన్నామనా?-మాధవ్ శింగరాజు -
బాలీవుడ్ లో మరో సంచలనం
-
అండర్ వరల్డ్ నుంచి సల్మాన్‌కు వార్నింగ్స్.. ఆయనతో మూడేళ్లు ఉన్నా : సోమీ అలీ
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌పై ఆయన మాజీ ప్రియురాలు సోమీ అలీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తి సల్మాన్ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో తనను సల్మాన్ తీవ్రంగా కొట్టాడని కూడా ఆమె పేర్కొంది. అండర్ వరల్డ్ నుంచి సల్మాన్‌కు గతంలో బెదిరింపులు వచ్చాయని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది.బాలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తున్న సమయంలో దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ గురించి చాలామంది నటీనటులు మాట్లాడుతుండేవారని ఆమె చెప్పింది. అయితే, వారి పేర్తు ఎత్తకుండా 'అండర్ వరల్డ్' అని చెప్పేవారు. సల్మాన్‌తో సుమారు మూడేళ్ల పాటు గ్యాలెక్సీ అపార్ట్మెంట్లో తాను ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయని గుర్తుచేసుకుంది. ఓసారి అండర్ వరల్డ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపు కాల్ వచ్చినట్లు సోమీ అలీ తెలిపింది. అయితే, ఆ ఫోన్ కాల్ తానే లిఫ్ట్ చేసినట్లు ఆమె చెప్పింది. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనేది మాత్రం తనకు తెలయదని ఆ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఫోన్లో ఇలా వార్నింగ్ ఇచ్చాడు. 'సల్మాన్‌కు పలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఆయన ప్రియురాలిని కిడ్నాప్ చేయబోతున్నామని.' అన్నారు. ఆ కాల్ కట్ అయిన తర్వాత ఆమె చాలా భయపడిపోయినట్లు తెలిపింది. 'ఫోన్ కాల్ గురించి వెంటనే సల్మాన్‌తో చెప్పాను. నేను చాలా భయపడుతున్నానని చెప్పడంతో ఆయనలో కూడా కాస్త భయం మొదలైంది. అయితే, రెండురోజుల తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదని సల్మాన్ తెలిపారు. మరోసారి వార్నింగ్ ఫోన్ కాల్ రాలేదు. కానీ, ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే.. సల్మాన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇలాంటి విషయాలకు చాలా దూరంగా ఉండాలని ఆయన సూచించారు.' అని సోమీ అలీ చెప్పింది.సోమీ అలీ పాకిస్థానీ అమెరికన్ నటి అని తెలిసిందే. సుమారు ఎనిమిదేళ్లుగా సల్మాన్‌తో ఆమె రిలేషన్లో ఉన్నారని సమాచారం. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఆమెకు ప్రస్తుతం అక్కడ పెద్దగా ఛాన్సులు రావడంలేదు. -
అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్.. భారత్‌కు రప్పించే ప్రయత్నాలు
ముంబై: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఉన్నట్లు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్ కదలికలకు సంబంధించి అక్కడి పోలీసులు సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో అమెరికా అధికారులు ముంబై పోలీసులను అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనతో సహా పలు కేసుల్లో అన్మోల్ బిష్ణోయ్ (25) ప్రమేయం ఉన్న నేపథ్యంలో అతన్ని భారత్‌కు వేగంగా రప్పించేందుకు ముంబై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అతన్ని భారత్‌కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ.. ముంబై పోలీసులు గత నెలలో ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సల్మాన్ ఖాన్ కేసులో అభియోగాలను ఎదుర్కొనేందుకు అన్మోల్ బిష్ణోయ్‌ను తిరిగి భారతదేశానికి తీసుకురావాలనే తమ ఉద్దేశాన్ని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. అతడిని భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలను పోలీసులు వేగవంతం చేశారు.ఇక.. ఇటీవల జరిగిన బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితులతోనూ అన్మోల్ బిష్ణోయ్ టచ్‌లో ఉండటం గమనార్హం. అన్మోల్ బిష్ణోయ్ సోదరుడు గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న విషయం తెలిసిందే.అన్మోల్ బిష్ణోయ్‌పై ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డ్అన్మోల్ బిష్ణోయ్ సంబంధించిన సమాచారం అందించిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. ఏప్రిల్‌లో నటుడు సల్మాన్ ఖాన్ ముంబై నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో ప్రమేయం ఉన్నందున కారణంతో అన్మోల్ బిష్ణోయ్‌ను మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది. -
సల్మాన్ కంటే అతనే బెటర్.. నాకైతే నరకం చూపించాడు: మాజీ గర్ల్‌ఫ్రెండ్
బాలీవుడ్ సల్మాన్ ఖాన్‌పై ఆయన మాజీ ప్రియురాలు సోమీ అలీ షాకింగ్ కామెంట్స్ చేసింది. అతన్ని ప్రముఖ గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్ణోయ్‌తో పోల్చింది. అతనికంటే సల్మాన్ ఖాన్ చాలా ప్రమాదమని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా బాలీవుడ్లో తన ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవాలను పంచుకుంది. గతంలో సోమీ అలీ.. సల్మాన్‌తో దాదాపు ఎనిమిదేళ్ల పాటు రిలేషన్లో ఉన్నారు.సల్మాన్ ఖాన్ కంటే గ్యాంగ్‌స్టార్ బిష్ణోయ్ చాలా బెటర్ అని సోమీ అలీ అన్నారు. సల్మాన్ నాతో వ్యవహరించిన విధంగా.. మరెవరితోనూ ప్రవర్తించలేదని తెలిపింది. సంగీతా బిజ్లానీ, కత్రినా కైఫ్‌తో మంచిగా వ్యవహరించినట్లు.. నాతో అలా ఉండలేదని పేర్కొంది. గతంలో ఒకసారి ఐశ్వర్యరాయ్తోనూ అసభ్యకరంగా ప్రవర్తించాడని.. అతని వల్లే ఆమె భుజానికి గాయం కూడా అయిందని వెల్లడించింది. కానీ కత్రినాతో ఎలా వ్యవహరించాడో తనకు తెలియదని సోమీ చెప్పింది. ఒకసారి సల్మాన్ నన్ను కొడుతుంటే పనిమనిషి తలుపులు వేసి కాపాడిందని గుర్తు చేసుకుంది. అందుకే సల్మాన్ కంటే లారెన్స్ బిష్ణోయ్ బెటర్ అని సోమీ అలీ చెప్పింది.గతంలో నటి టబు తన పరిస్థితిని చూసి బాధపడిన సందర్భాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. నన్ను చూసి టబు ఏడ్చిందని.. కానీ ఆ సమయంలో నేను ఎలా ఉన్నానో కనీసం చూడటానికి కూడా సల్మాన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సల్మాన్ ఖాన్‌తో తాను పడిన కష్టాలు పూర్తిగా తన తల్లికి, కొంతమంది సన్నిహితులకు మాత్రమే తెలుసని సోమీ వెల్లడించింది. ప్రస్తుతం ఒక పుస్తకాన్ని రాసే పనిలో ఉన్నానని.. అందులో ప్రతి విషయాన్ని వివరిస్తానని సోమీ తెలిపింది. -
సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు.. అంతే రేంజ్లో దూకుడుగా పోలీసులు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి బెదిరింపు కాల్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. ఆయన్ను అంతం చేస్తామంటూ ఇప్పటికే పలుమార్లు కాల్స్ వచ్చాయి. దీంతో సల్మాన్ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటున్నారు. అక్టోబర్ 30న సల్మాన్‌ను రూ. 2కోట్లు డిమాండ్ చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు కొంత సమయం క్రితం అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం రూ. 5 కోట్లు కావాలని బెదిరింపులకు దిగిన కూరగాయల వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.గతంలో మాదిరే ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఒక వాట్సాప్స్ మెసేజ్ వచ్చింది. సల్మాన్‌ను చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన్ను ప్రాణాలతో వదిలేయాలంటే రూ. 2 కోట్లు ఇప్పించాలని మెసేజ్‌లో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు బాంద్రాకు చెందిన ఆజం మహ్మద్ ముస్తఫాను అరెస్ట్ చేశారు. 2022 నుంచి ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి మెసేజ్‌లు సల్మాన్‌కు వచ్చాయి. ముంబైలోని బాంద్రా వెస్ట్ గెలాక్సీ అపార్ట్మెంట్లోని అతని నివాసానికి సమీపంలో ఉన్న ఒక బెంచ్‌పై కూడా సల్మాన్‌ను బెదిరిస్తూ ఒక లేఖ కనుగొనబడింది. అప్పట్నించి ఈ కేసులో పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు.1998లో ఒక సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడారు. అయితే, కృష్ణజింకలను బిష్ణోయ్ తెగ ప్రజలు చాలా పవిత్రంగా చూస్తారు. వీటిని సల్మాన్ వేటాడటం ఆ వర్గానికి చెందిన వారికి నచ్చలేదు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకొని లారెన్స్ బిష్ణోయ్ ఒక గ్యాంగ్‌ను తయారు చేశాడు. అతన్ని అంతం చేసేందుకే ఉన్నామంటూ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశాడు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్నిసార్లు సల్మాన్‌పై హత్యాయత్నం కూడా చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరు వ్యక్తులు.. ఏకంగా సల్మాన్ ఫామ్ హౌస్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లు జరుగుతూనే ఉన్నాయి. -
నేనేంటో చూపిస్తా.. నటిని బెదిరించిన సల్మాన్ ఖాన్!
తనపై చేయి చేసుకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయని సల్మాన్ ఓ నటిని బెదిరించాడట.. దమ్ముంటే కొట్టి చూడు, తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూద్దువుగానీ అంటూ రెచ్చగొట్టాడట! ఈ ఆసక్తికర విషయం గురించి బాలీవుడ్ నటి ఇందిరా కృష్ట ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.సల్మాన్ బెదిరించాడుఆమె మాట్లాడుతూ.. తేరే నామ్ సినిమాలో నేను సల్మాన్‌ను కొట్టే సన్నివేశం ఒకటుంటుంది. సరిగ్గా ఆ సన్నివేశానికి ముందు సల్మాన్ నన్ను బెదిరించాడు. నువ్వు నన్ను చిన్నగా కొట్టినా సరే నేనేం చేస్తానో చూడు. ఎంత రచ్చ చేస్తానో నాకే తెలియదు అని బెదిరించాడు. నాకు చాలా భయమేసింది. ఆ సీన్ ఎలా పూర్తి చేయాలో అర్థం కాక ఆందోళన చెందాను. చేతులు వణికాయి. ఇంతలో సల్మాన్ అదంతా ప్రాంక్ అని చెప్పడంతో ఊపిరి పీల్చాను.ఆ ఫీలింగే రాదుఅతడితో కలిసి పని చేయడం నాకెంతో ఇష్టం. పెద్ద హీరోతో పని చేస్తున్న భావన రాదు. అంత కలివిడిగా ఉంటాడు అని చెప్పుకొచ్చింది. తేరే నామ్ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని దివంగత దర్శకుడు సతీశ్ కౌశిక్ డైరెక్ట్ చేశాడు. భూమిక చావ్లా హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఇందిర.. లేడీ విలన్ నీరజ అక్క మమత పాత్రలో నటించింది.చదవండి: హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్.. యూట్యూబర్‌కు భారీ ఊరట! -
సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు.. రూ.2 కోట్లు ఇవ్వకపోతే
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి బెదిరింపు కాల్స్.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య జరిగిన దగ్గర నుంచి బెదిరింపులు మరీ ఎక్కువైపోతున్నాయి. మొన్నటికి మొన్న రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని ఓ మెసేజ్ రాగా.. ఇప్పుడు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు మరో వాట్సాప్స్ మెసేజ్ వచ్చింది.(ఇదీ చదవండి: హత్య కేసులో స్టార్ హీరో దర్శన్‌కి మధ్యంతర బెయిల్)ఈ క్రమంలోనే వర్లీ పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాపు చేపట్టారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో హత్యమైన బాబా సిద్దిఖీ కొడుకు జీషన్ సిద్దిఖీని కూడా చంపేస్తామని బెదిరించాడు. ఇలా చేసిన 20 ఏళ్ల గుఫ్రన్ని అరెస్ట్ చేసిన కాసేపటికే సల్మాన్‌కి బెదిరింపులు రావడం హాట్ టాపిక్ అయిపోయింది.అప్పుడెప్పుడో కృష్ణజింకలని వేటాడిన కేసు ఇప్పటికీ సల్మాన్‌ఖాన్ వెంటాడుతూనే ఉంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. పలుమార్లు చంపుతామని బెదిరిస్తూనే ఉన్నారు. బిష్ణోయిల మందిరానికి వెళ్లి క్షమాపణలు చెబితే వదిలేస్తామని కూడా అన్నారు. కానీ భద్రత పెంచుకోవడం తప్పితే సల్మాన్ నుంచి క్షమాపణ గురించి స్పందన లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రేజీ సినిమా.. కండోమ్ కంపెనీపై కేసు పెడితే?) -
బాలీవుడ్ స్టార్ సల్మానఖాన్ కు మళ్లీ బెదిరింపులు
-
సల్మాన్ ఖాన్ కు మళ్లీ బెదిరింపులు
-
‘నాన్న హత్యపై సల్మాన్ ఖాన్ చాలా బాధపడ్డారు’
ముంబై: తన తండ్రి హత్య తర్వాత బాలీవుడ్ నటుడు, సిద్ధిఖీ కుటుంబానికి సన్నితుడైన సల్మాన్ ఖాన్ ప్రతిరోజూ నాకు ఫోన్ చేసి.. యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారని బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ తెలిపారు. అక్టోబర్ 12న బాబా సిద్ధిఖీని కొందరు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. అయితే హత్యకు లారెన్స్ బిష్ణోయ్ బాధ్యత వహించిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండటం వల్లే బాబా సిద్ధిఖీని టార్గెట్ చేశామని తెలిపారు. అయితే ఇటీవల జీషన్ సిద్ధిఖీ ఓ ఇంటర్వ్యులో తన తండ్రి మరణం తర్వాత సల్మాన్ ఖాన్ ఎలా మద్దుతుగా నిలిచారో పలు విషయాలు పంచుకున్నారు.‘‘నాన్న హత్య తర్వాత సల్మాన్ ఖాన్ ప్రతీరోజు రాత్రి క్రమం తప్పకుండా నా రాత్రి నాకు కాల్ చేసి బాగోగులు తెలుసుకుంటున్నారు. సల్మాన్ భాయ్.. మా నాన్న హత్య విషయంలో చాలా బాధపడ్డారు. మా నాన్న, సల్మాన్ భాయ్ నిజమైన అన్నదమ్ముల్లా చాలా సన్నిహితంగా ఉండేవారు. నాన్న చనిపోయిన తర్వాత సల్మాన్ భాయ్.. నేను రాత్రి సమయంలో ఎలా ఉన్నాను. నిద్ర పోతున్నానా లేదా అని ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. రాత్రి నేను నిద్ర పోకపోతే.. నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు. మా కుటుంబానికి ఆయన ఎంతో సపోర్ట్‌గా నిలిచారు’’ అని జీషన్ తెలిపారు.మరోవైపు.. జీషన్ సిద్ధిఖీ గత వారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గంలో చేరారు. అంతేకాక.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వాండ్రే ఈస్ట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా కూడా బరిలోకి దిగుతున్నారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే ఆరోపణలతో ఆగస్టులో ఆయన్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. అయితే తనపై వచ్చిన ఈ అభియోగాలను జీషన్ తోసిపుచ్చారు.చదవండి: బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీపై ట్రోలింగ్ షురూ! -
పప్పూ యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలు
పట్నా: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ విషయంలో దూరంగా ఉండకపోతే.. హత్య చేస్తామని బీహార్ ఎంపీ పప్పూ యాదవ్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. ఈ మేరకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోమవారం ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఆడియో బిహార్‌లో కలకలం రేపుతోంది.‘‘ఎంపీ పప్పూ యాదవ్ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నాం. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన విషయాల నుంచి ఆయన దూరంగా ఉండాలి. అలా ఉండకపోతే హత్య చేయడానికి కూడా వెనకాడము. అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ సిగ్నల్ జామర్లను డిసేబుల్ చేయడానికి గంటకు రూ.1 లక్ష చెల్లిస్తున్నారు. పప్పూ యాదవ్‌తో నేరుగా కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఆయన మాత్రం మా కాల్స్‌కు స్పందించటం లేదు’’ అని ఆడియోలో క్లిప్‌లో ఓ వ్యక్తి మాట్లాడారు.ఇక.. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలో ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ హత్యపై బిహార్‌లోని పూర్నియా నియోజకవర్గం ఎంపీ (స్వతంత్ర) పప్పూ యాదవ్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అనుమతి ఇస్తే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కేవలం 24 గంటల్లో అంతం చేస్తానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. సోమవారం వచ్చిన బెదిరింపులపై పప్పూ యాదవ్ బిహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.చదవండి: చొరబాట్లకు మమత సర్కారే కారణం: అమిత్‌షా -
అన్మోల్ బిష్ణోయ్ గురించి సమాచారమిస్తే రూ. 10 లక్షల రివార్డు
-
లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ను పట్టిస్తే రూ.10 లక్షలు
ముంబై: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అలాగే అన్మోల్ను పట్టించిన వారికి రూ. 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. కాగా గత ఏప్రిల్‌లో ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మీన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో అన్మోల్కు ప్రమేయం ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులు అన్మోల్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ ఫైరింగ్‌కు పాల్పడింది తామే అని అతను సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.కాగా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై బెదిరింపులు, మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్దిఖీ హత్య వంటి కారణాలతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మారుమోగుతోంది. బాబా సిద్దిఖీ హత్యతో అన్మోల్ బిష్ణోయ్ పేరు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. సిద్ధిఖీ హత్యకు ముందు సైతం షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారుఅన్మోల్ బిష్ణోయ్‌ని అలియాస్ భానుగా పిలుస్తారు. గత ఏడాది నకిలీ పాస్‌పోర్ట్‌తో భారత్ నుంచి పారిపోయిన అన్మోల్.. అనంతరం కెన్యా, కెనడాలో గుర్తించారు. ప్రస్తుతం అతడు కెనడాలో నివసిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబీ సింగర్ సిద్దూ మోసేవాల్ హత్య కేసులో అన్మోల్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. మరోవైపు లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నారు. -
సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామన్న కూరగాయల వ్యాపారి అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానంటూ కొద్దిరోజుల క్రితం బెదిరింపు మెసేజ్ పెట్టిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన షేక్ హుస్సేన్ (24)గా గుర్తించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో హుస్సేన్ కూడా అదే గ్యాంగ్‌కు సంబంధించిన వ్యక్తి అంటూ సల్మాన్ నుంచి రూ. కోట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ.. ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ చేశాడు.సల్మాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో బెదిరింపు మెసేజ్ చేసిన వ్యక్తి కూరగాయల వ్యాపారి షేక్ హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే తాను ఇలాంటి ప్లాన్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయినప్పటికీ అతన్ని పూర్తిగా విచారించిన తర్వాతే కోర్టులో హాజరుపరచనున్నారు.ముంబయి ట్రాఫిక్ పోలీసులకు కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక మెసేజ్ వచ్చిన విషయం తెలిసిందే.. సల్మాన్ ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ మెసేజ్‌ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. బిష్ణోయ్‌తో శతృత్వం ఆగాలన్నా, సల్మాన్ బతికుండాలన్నా ఐదు కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. అయితే, ఒకరోజు తర్వాత అతను మరో సందేశం ఇలా పంపించాడు. 'నేను కావాలని బెదిరింపులకు పాల్పడలేదు. అనుకోకుండా జరిగిపోయింది. క్షమించండి' అని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టి.. జంషెడ్పూర్ చెందిన ఓ కూరగాయల వ్యాపారి ఇదంతా చేసినట్లు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. -
‘సల్మాన్‌ను బెదిరించి తప్పు చేశాం’.. నిందితుడు మరో మెసేజ్
ముంబై: కొద్దిరోజు క్రితం ఓ నిందితుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరింపులకు పాల్పడ్డాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలని, ఇందుకోసం రూ.5కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముంబై పోలీసులకు మెసేజ్ చేశాడు. ఇప్పుడు ఆ నిందితుడే సల్మాన్ ఖాన్‌ను బెదిరించి తప్పు చేసినట్లు మరో వాట్సప్ మెసేజ్ పంపించాడు. ప్రస్తుతం ఈ అంశం బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది వారం రోజుల క్రితం సల్మాన్‌ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ హత్య జరిగింది. హత్యోదంతం తర్వాత అక్టోబర్ 18న ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ సందేశం వచ్చింది. సిద్ధిఖీని హత్య చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సల్మాన్‌కు వైరానికి ముగింపు పలకాలని, ఇందుకోసం రూ.5కోట్లు చెల్లించాలని, లేదంటే బాబా సిద్ధిఖీకి పట్టిన గతి నీకూ పడుతుందంటూ ఓ నిందితుడు బెదిరింపులకు దిగాడు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్‌కు హైసెక్యూరిటీ మధ్య భద్రత కల్పిస్తున్నారు. అంతేకాదు ఆ మెసేజ్ జార్ఖండ్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఈ తరుణంలో సోమవారం, ముంబై ట్రాఫిక్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. గతవారం సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన నిందితుడు మరో మెసేజ్ పంపించాడని, సల్మాన్ ఖాన్‌ను బెదిరించి తప్పు చేసినట్లు చెప్పాడని వెల్లడించారు. ప్రస్తుతం ఆ నిందితుడు కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. -
కోట్ల విలువైన ఆస్తిని అమ్మేసిన స్టార్ హీరో చెల్లెలు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ సీజన్-18కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయనకు బెదిరింపులు రావడంతో భద్రతను సైతం కట్టుదిట్టం చేశారు. బిగ్‌బాస్ సెట్ వద్ద దాదాపు 60 మందితో భద్రత ఏర్పాటు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ అనే రౌడీ షీటర్ నుంచి ఆయనకు ప్రాణహాని ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ తాజాగా తన ఇంటిని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఆయన సోదరి అర్పితా ఖాన్ శర్మ ముంబయిలోని ఖర్ ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ను రూ.22 కోట్లకు విక్రయించినట్లు బాలీవుడ్లో టాక్. 2017లో ఆ ఇంటిని ఆమె రూ.18 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ముంబయిలోని శివయ్య సినీవైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అపార్ట్‌మెంట్‌ను అమ్మినట్లు సన్నిహితులు తెలిపారు. ఆ ప్రాంతం పరిసరాల్లోనే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్లతో సహా పలువురు బాలీవుడ్ తారలు నివసిస్తున్నారు. -
ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్ ఖాన్
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని నడిరోడ్డుపై దుండగులు కాల్చి చంపడం కొన్నిరోజుల క్రితం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కి ఇతడు ఆప్తుడు కావడం వల్లే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సిద్దిఖీని చంపేశారనే టాక్ వినిపించింది. రెండు రోజుల క్రితం సల్మాన్‌ని చంపేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ మెసేజ్ రావడం కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇలా వరస సంఘటన కారణంగా సల్మాన్‌లో ప్రాణభయం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే కొత్త కారు కొన్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)1999లో కృష్ణ జింకలు వేటాడిన కేసులో సల్మాన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని చాలామంది మర్చిపోయారు కానీ బిష్ణోయ్ తెగకు చెందిన లారెన్స్ అనే కుర్రాడు మాత్రం మర్చిపోలేదు. ఎప్పటికప్పుడు సల్మాన్‌ని చంపేందుకు కుట్ర పన్నుతూనే ఉన్నాడు. గత రెండేళ్లలోనూ ఆ ప్రయత్నాలు చేశారు. బాబా సిద్దిఖీ మర్డర్, రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని తాజాగా బెదిరింపు మెసేజ్.. ఇలా బోలెడన్ని కారణాల వల్ల సల్మాన్ అప్రమత్తమయ్యాడు.సుమారు రూ.2 కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారును దుబాయ్ నుంచి ఆయన దిగుమతి చేసుకోనున్నాడట. త్వరలోనే ఇది సల్మాన్ గ్యారేజ్‌లో చేరనుందని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆయన ఎంపిక చేసుకున్న ఆ మోడల్ కారు మన దేశంలో దొరకదని సమాచారం. అందుకే అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.6 కోట్ల విలువైన మరో బుల్లెట్ ప్రూఫ్ కారు సల్మాన్ దగ్గరుంది. కానీ లేటెస్ట్ మోడల్లో ఎక్కువ ఫీచర్స్ ఉండటంతో ఈ కొత్త కారును కొనుగోలు చేశాడని సమాచారం.ఈ కారులో ఎవరున్నారనేది బయట నుంచి చూస్తే కనిపించదు. అలానే ఎలాంటి బులెట్‌ని అయినా సరే ఈ కారుకి ఉన్న గ్లాస్ అడ్డుకుంటుంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా)