ఇప్పుడు నా పక్కన హీరోయిన్‌గా చేస్తున్నావ్ కానీ, తర్వాత నాకు తల్లిగా కూడా నటిస్తావ్.. అంటూ కథానాయిక దియా మీర్జాను ఏడిపించాడట సల్మాన్ ఖాన్. వీరిద్దరూ తుమ్‌కో నా భూల్ పయేంగే (2002) అనే సినిమాలో తొలిసారి కలిసి నటించారు. ఆనాటి జ్ఞాపకాలను దియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది.
అప్పట్లో హీరోయిన్.. ఇప్పుడు తల్లి!
ఆమె మాట్లాడుతూ.. తుమ్‌కో నా భూల్ పయేంగే సినిమా షూటింగ్‌లో సల్మాన్‌కు తల్లిగా యాక్ట్ చేసిన నటి తన షాట్ కోసం ఎదురుచూస్తోంది. అప్పుడు సల్మాన్ నా దగ్గరకు వచ్చి.. ఆమె గతంలో అతడి సినిమాలో హీరోయిన్‌గా నటించిందన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అస్సలు నమ్మలేదు. దీంతో అతడు.. అవును, మొదట్లో నా పక్కన హీరోయిన్‌గా చేసిందని నొక్కి చెప్పాడు.
ఆ రోజు రాకూడదని కోరుకున్నా..
నీ వయసులో ఉన్న నటి నీకు తల్లిగా నటించడమేంటని షాకయ్యాను. అతడు మాత్రం.. ఏదో ఒక రోజు నువ్వు కూడా నా తల్లి పాత్రలో యాక్ట్ చేస్తావ్ అన్నాడు. అలాంటి రోజు రాకూడదని కోరుకున్నాను. ఈ సంఘటన నేను ఎన్నటికీ మర్చిపోలేను. కానీ సల్మాన్ చాలా సరదా మనిషి. అప్పట్లో సెట్‌లో ఆడవాళ్లు తక్కువగా ఉండేవాళ్లు. ఆ సమయంలో నన్నెంతో జాగ్రత్తగా చూసుకునేవాడు అని చెప్పుకొచ్చింది.
ఎవరీ దియా?
ఇకపోతే దియా మీర్జా.. రెహనా హై తేరే దిల్ మే, దమ్, తెహజీబ్, పరిణీత, దస్, ఫైట్ క్లబ్ మెంబర్స్ ఓన్లీ, లగే రహో మున్నా భాయ్, హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సంజు, థప్పడ్ వంటి చిత్రాల్లో నటించింది. చివరగా.. ఐసీ 814: ద కాందహర్ హైజాక్ అనే వెబ్ సిరీస్‌లో మెరిసింది.
Comments
Please login to add a commentAdd a comment