బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ కథ కంచికి చేరే సమయం ఆసన్నమైంది. ఈ వారమంతా టికెట్ టు ఫినాలే కోసం హౌస్‌మేట్స్ పోటీపడ్డారు. అనూహ్యంగా అవినాష్ ఈ టికెట్ టు ఫినాలే గెలిచి టాప్ 5కి చేరుకున్నాడు. అయితే ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడితేనే అది నెరవేరుతుంది.
ఓటింగ్‌లో నిఖిల్ టాప్
ఈ వారం రోహిణి తప్ప మిగతా ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఎప్పటిలాగే నిఖిల్ భారీ ఓటింగ్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. రెండో స్థానంలో గౌతమ్, మూడో స్థానంలో నబీల్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. చిట్టచివరి స్థానాల్లో తేజ, అవినాష్ ఉన్నారు.
తేజ ఎలిమినేట్!
ఈ ఇద్దరిలో తేజను శనివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్ చేసినట్లు ఓ వార్త బయటకు వచ్చింది. మొదట్లో బాగానే ఆడిన తేజకు ఈ వారం పెద్దగా కలిసిరాలేదు. పైగా మనవాడు అని చెప్పుకుతిరిగే గౌతమ్‌పైనే నిందలు వేయడం అతడికి మరింత మైనస్ అయింది. ఫలితంగా ఎలిమినేట్ అవక తప్పలేదు.
డబుల్ ఎలిమినేషన్
రెండో ఎలిమినేషన్ ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది. అవినాష్ ఆల్‌రెడీ ఫైనలిస్ట్ అని పక్కన పెడితే పృథ్వీని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మరి డబుల్ ఎలిమినేషన్‌లో బలయ్యే మరో కంటెస్టెంట్ ఎవరన్నది క్లారిటీ రావాలంటే సండే ఎపిసోడ్ షూటింగ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment