Bigg Boss 8 Telugu
-
పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్
ఈసారి బిగ్‌బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది సోనియా ఆకుల. అయితే హౌస్‌లో ఎక్కువ వారాలు ఉండకుండానే ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. గతనెలలో నిశ్చితార్థం చేసుకున్న ఈమె.. ఇప్పుడు గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. యష్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు బిగ్‌బాస్ 8లో పాల్గొన్న కంటెస్టెంట్స్ చాలామంది హాజరయ్యారు. నూతన వధూవరుల్ని దీవించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)శుక్రవారం రాత్రి రిసెప్షన్ జరగ్గా.. శనివారం వేకువజామున 3 గంటలకు అలా పెళ్లి జరిగింది. బిగ్‌బాస్ ఫ్రెండ్స్ పలువురు రిసెప్షన్ ఫొటోలు పోస్ట్ చేశారు. పెళ్లి ఫొటోలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆర్జీవీ తీసిన ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అలా బిగ్‌బాస్ 8లోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ నిఖిల్-పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ ఈమెపై విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది.బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడే తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. అతడికి ఆల్రెడీ పెళ్లి అయిందని, కాకపోతే తన భార్యకు విడాకులు ఇచ్చేశాడని.. త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. ఇప్పుడు నవంబర్ 21న నిశ్చితార్థం చేసుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంది. వివాహానికి హాజరైన వాళ్లలో జెస్సీ, అమర్ దీప్-తేజస్విని, బేబక్క, రోహిణి, టేస్టీ తేజ, కిరాక్ సీత తదితరులు ఉన్నాయి. బిగ్‌బాస్ 8 విన్నర్ నిఖిల్ మాత్రం మిస్ అయ్యాడు. మరి కావాలనే రాలేదా? లేకపోతే వేరే కారణాల వల్ల మిస్సయ్యాడో!(ఇదీ చదవండి: ఉపేంద్ర 'యూఐ' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) -
నిఖిల్ గెలుపు పై గౌతమ్ షాకింగ్ కామెంట్స్..
-
కావ్య యష్మీల పై క్లారిటీ ఇచ్చిన నిఖిల్
-
గతంలో కంటే రెట్టింపు పారితోషికం, అవేవీ ఎపిసోడ్లో వేయలేదు: గౌతమ్
అశ్వత్థామకు చావు లేదన్నది అందరికీ తెలుసు. కానీ ఈ అశ్వత్థామకు తిరుగులేదని నిరూపించాడు గౌతమ్ కృష్ణ. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో తనకు తాను అశ్వత్థామ అన్న బిరుదు ఇచ్చుకున్నాడు. అప్పుడు తనపై సెటైర్లు వేసినవాళ్లే.. ఎనిమిదో సీజన్‌కు వచ్చేసరికి చప్పట్లు కొట్టారు. గౌతమ్ మాట తీరు, ఆటతీరుకు ఫిదా అయ్యారు. ఈ సీజన్ రన్నరప్‌గా నిలిచిన్నప్పటికీ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న గౌతమ్ తాజాగా సాక్షి.కామ్‌తో ముచ్చటించాడు. ఆ విశేషాలు చూసేయండి..ట్రోలింగ్‌పై మీ అభిప్రాయం?గౌతమ్: గత సీజన్లో నేను కొన్ని పొరపాట్లు చేశాను. అందుకు నాపై ట్రోలింగ్ జరిగింది. తర్వాత నన్ను నేను కొత్తగా తీర్చిదిద్దుకుని ఎనిమిదో సీజన్లో అడుగుపెట్టాను. మొదటివారం ఎలిమినేషన్ అంచున నిలబడినప్పుడు బాధపడ్డాను. కానీ నాకు ఒక అవకాశం వచ్చిందన్నప్పుడు ధృడంగా నిలబడ్డాను, గట్టిగా ఆడాను. అశ్వత్థామ అంటే ట్రోల్ చేసినవారే మళ్లీ అదే పేరుతో పొగిడారు. నాకెంతో పాజటివిటీ దొరికింది. ఈ జర్నీని నేనెప్పటికీ మర్చిపోలేను.ఫినాలే వరకు రావడానికి మణికంఠ కారణమని భావిస్తున్నారా?గౌతమ్: లేదు. ఒక్క వారం మణికంఠ వల్ల సేవ్ అయ్యాను. కానీ ఫినాలే వరకు నా స్వయంకృషితో వచ్చాను.చిరంజీవి సతీమణి సురేఖగారిని ఎప్పుడు కలుస్తారు?గౌతమ్: మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని త్వరలోనే కలుస్తాను.గత సీజన్లో నాగార్జున గ్రూప్ గేమ్స్ తప్పన్నారు. ఈ సీజన్లో మాత్రం గ్రూప్ గేమ్స్ తప్పేం కాదని వెనకేసుకొచ్చారు. దీనిపై మీ అభిప్రాయం?గౌతమ్: నేనూ చాలా మీమ్స్‌లో చూశాను. ఫ్రెండ్స్‌గా ఉంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆడటం తప్పు కాదు. కానీ గ్రూప్‌గా ఉంటూ వేరేవాళ్లను టార్గెట్ చేయడం తప్పు. అది నాకు నచ్చలేదు.విన్నర్ అయినందుకు నిఖిల్‌ను అభినందించారా?గౌతమ్: ఫినాలే స్టేజీపై వెంటనే కంగ్రాట్స్ చెప్పాను. కానీ ఎపిసోడ్లో వేయలేదు. అలాగే నాగార్జునగారు కూడా నేను చరిత్ర సృష్టిస్తానని మెచ్చుకున్నారు. అది కూడా ఎపిసోడ్లో వేయలేదు.రెమ్యునరేషన్ సంతృప్తికరంగా ఉందా?గౌతమ్: గత సీజన్ కంటే రెట్టింపు పారితోషికం ఇచ్చారు.చదవండి: ప్రెగ్నెంట్ అని తెలియగానే షాకయ్యా..: రాధికా ఆప్టే -
బిగ్‌బాస్ 8: టాప్ 5 ఫైనలిస్టుల బ్యాక్‌గ్రౌండ్ ఇదే! (ఫోటోలు)
-
షో అయిపోగానే కావ్య దగ్గర వాలిపోతానన్న నిఖిల్.. ఇప్పుడేమో!
బిగ్‌బాస్ 8 ట్రోఫీ గెలిచిన నిఖిల్ చాలా సెన్సిటివ్. చిన్నచిన్న విషయాలకే ఎమోషనలైపోయి కంటతడి పెట్టుకుంటుంటాడు. హౌస్‌లో అందరితోనూ కలిసిమెలిసి ఉండేవాడు. ముఖ్యంగా మొదట్లో సోనియాతో, తర్వాత యష్మితో ఎక్కువ క్లోజ్ అయ్యాడు. కానీ ఒకానొక సందర్భంలో తను సింగిల్ కాదంటూ లవ్‌స్టోరీ బయటపెట్టాడు.హౌస్‌లో కన్నీళ్లుసీరియల్ నటి కావ్యతో ప్రేమలో ఉన్న విషయాన్ని ఆమె పేరు చెప్పకుండానే వెల్లడించాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు తనే నా భార్య అని తెలిసిపోయింది. నా అన్ని బ్రేకప్‌లను ఆమె మర్చిపోయేలా చేసింది. మా ప్రేమకు ఆరేళ్లు. మేము విడిపోయామా? అంటే నేనైతే ఆ ఎమోషనల్ బంధం నుంచి బయటకు రాలేదు. భవిష్యత్తులోనూ తనతోనే కలిసుంటా.. తనే నా భార్య అని ఫిక్సయిపోయా! షో అయిపోగానే తన దగ్గరికే వెళ్తాను. యూటర్న్?ఆమె కోప్పడుతుందని తెలుసు. అయినా వెళ్తా.. తిడితే పడతాను, కొడితే కొట్టించుకుంటాను.. పిచ్చి లేస్తే లేపుకెళ్లిపోతా.. షో అయిపోగానే నీ ముందు నిలబడతా.. అంటూ కావ్యపై ఉన్న ప్రేమను చెప్తూ ఏడ్చేశాడు. తాజాగా బిగ్‌బాస్ బజ్‌లో అడుగుపెట్టిన నిఖిల్‌ను యాంకర్ అర్జున్ అంబటి ఇదే ప్రశ్న అడిగాడు. ట్రోఫీ గెలవగానే డైరెక్ట్‌గా తన దగ్గరకే వెళ్తానన్నావు.. మరి వెళ్తున్నావా? అని ప్రశ్నించాడు. ఆలస్యంగానైనా..అందుకు నిఖిల్ బయటకు వెళ్లేదాక తెలియదు పరిస్థితి! అని చెప్పాడు. అప్పుడేమో వెంటనే వెళ్తానని ఇప్పుడేమో పరిస్థితులు చూసి చెప్తానంటున్నాడేంటని నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే ఆలస్యంగానైనా నిఖిల్.. కావ్య దగ్గరకు వెళ్లి తన ప్రేమను నిలబెట్టుకుంటాడేమో చూడాలి! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8 హైలైట్స్: ఈ విషయాలు గమనించారా?
ఎన్నో ట్విస్టులు, టర్నులతో బిగ్‌బాస్ 8 మొదలైంది. అన్లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ అంటూ షో మొదలుపెట్టాడు హోస్ట్ నాగార్జున. రానురానూ ఫన్ తగ్గిపోవడంతో వైల్డ్‌కార్డ్స్‌ను రంగంలోకి దింపాడు. అప్పటినుంచి షోపై హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్లుగానే కంటెస్టెంట్లు కూడా హోరాహోరీగా పోరాడారు. చివరకు నిఖిల్ విజేతగా నిలిచాడు. మరి 105 రోజుల జర్నీలో ఏమేం జరిగాయో హైటైల్స్లో చూసేద్దాం..⇒ సెప్టెంబర్ 1న బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభం⇒ లాంచింగ్ రోజు హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు.. వీరిని జంటలుగా పంపించిన బిగ్‌బాస్⇒ ప్రైజ్‌మనీని జీరోగా ప్రకటించిన నాగార్జున.. హౌస్‌మేట్సే దాన్ని సంపాదించాలని వెల్లడి⇒ రెండో వారం శేఖర్ బాషాను పంపించేసిన హౌస్మేట్స్⇒ అక్టోబర్6న రీలోడ్ ఈవెంట్ ద్వారా 8 మంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ⇒ ఈ ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ గత సీజన్స్‌లో వచ్చినవాళ్లే కావడం గమనార్హం⇒ పాతవారిని ఓజీగా, వైల్డ్‌కార్డ్స్‌ను రాయల్స్ క్లాన్‌గా విభజించిన బిగ్‌బాస్⇒ తొమ్మిదోవారంలో క్లాన్స్ తీసేసి అందర్నీ కలిపేసిన బిగ్‌బాస్⇒ ఈ సీజన్లో కెప్టెన్ పదవికి బదులుగా మెగా చీఫ్ పదవిని పెట్టారు⇒ రేషన్ కూడా కంటెస్టెంట్లే సంపాదించుకోవాలన్నారు, కిచెన్‌లో టైమర్ ఏర్పాటు చేశారు⇒ ఈ సీజన్లో జైలుకు వెళ్లిన ఏకైక కంటెస్టెంట్ మణికంఠ⇒ ఏడోవారంలో నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ వల్ల బతికిపోయిన గౌతమ్⇒ పదోవారంలో గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్⇒ 12 వారం.. ఎలిమినేట్ అయినవారితో నామినేషన్స్⇒ ఎవిక్షన్ షీల్డ్ గెలిచిన నబీల్⇒ పదమూడోవారంలో ఎవిక్షన్ షీల్డ్‌ను అవినాష్‌కు వాడిన నబీల్.. ఫలితంగా తేజ ఎలిమినేట్⇒ ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్⇒ బీబీ పరివారం వర్సెస్ మా పరివారం ఛాలెంజ్‌లో అన్ని గేముల్లోనూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లదే గెలుపు⇒ ఈ సీజన్ చిట్టచివరి టాస్క్ గెలిచి ప్రైజ్‌మనీకి రూ.1 యాడ్ చేసిన గౌతమ్⇒ దీంతో టోటల్ ప్రైజ్‌మనీ రూ.55 లక్షలకు చేరింది.⇒ తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇదే అత్యధిక ప్రైజ్‌మనీ⇒ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా రామ్‌చరణ్⇒ బిగ్‌బాస్ 8 విన్నర్‌గా నిఖిల్, రన్నరప్‌గా గౌతమ్⇒ తర్వాతి మూడు స్థానాల్లో నబీల్, ప్రేరణ, అవినాష్ ఉన్నారు.నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అవకపోయినా, నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడకపోయినా గౌతమ్, అవినాష్ ఫైనల్స్‌లో ఉండేవారే కాదు. అప్పుడు వీళ్లకు బదులుగా వేరే ఇద్దరికి ఫైనల్స్‌లో చోటు లభించేది!చదవండి: ఫినాలేలో గౌతమ్‌పై నాగ్ సెటైర్లు.. కానీ చివర్లో మాత్రం..! -
బిగ్ బాస్ ఆఖరి వారం విశ్లేషణ... తెలుగు బిగ్ బాస్‌లో విజేత కన్నడ నటుడు
భాషేదైనా భావం ముఖ్యమన్న విషయాన్ని నిరూపించింది ఈ సీజన్ బిగ్ బాస్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో విన్నర్ గా కన్నడ నటుడు నిఖిల్ విజేతగా నిలిచాడు. 22 మంది కంటెస్టెంట్స్ తో 105 రోజుల హోరాహోరీగా జరిగిన పోరాటంలో అజేయంగా నిలిచాడు. మొదటి ఎపిసోడ్ నుండీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తూనే వస్తున్నాడు నిఖిల్. ఓ దశలో ఫస్ట్ రన్నరప్ గౌతమ్ గట్టి పోటీ ఇచ్చినా చివరికి విజయం మాత్రం నిఖిల్‌నే వరించింది. ఫైనల్ ఎపిసోడ్ లో టాప్ 5 గా నిలిచిన అవినాష్, ప్రేరణ, ముందుగా ఎలిమినేట్ అయ్యి టాప్ 3లో నబీల్, గౌతమ్, నిఖిల్ నిలిచారు. ఈ ముగ్గురిలో విన్నర్గాల్ని ప్రకటించారు హోస్ట్ నాగార్జున. ఈ సీజన్లలో ప్రత్యేకత ఏంటంటే విన్నర్ పరభాషా నటుడవడం. ఆదివారం ప్రసారమైన గ్రాండ్ ఫినాలే యధావిధిగా ఆర్భాటంగా జరిగింది. ఈ సీజన్ లో పలు సెలబ్రిటీస్ తో పాటు ఫినాలేలో గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా రావడం ఎపిసోడ్ కే హైలైట్. ఇక ఈ సిజన్ విశ్లేషణకొస్తే.. 14మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ హౌజ్‌లోకి తర్వాత మరో 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో ఎంట్రీ ఇచ్చారు. దీంతో మొత్తంగా 22 మంది పార్టిసిపెంట్స్ తో 15 వారాలు ప్రేక్షకులను అలరించింది. బిగ్ బాస్ అనేది ప్రపంచ ప్రేక్షకాదరణ పొందిన కాన్సెప్ట్. అటువంటిది తెలుగులోనూ విశేష ఆదరణ లభించింది. ఇదే ఈ కార్యక్రమాన్ని భారత్‌లో నెం.1గా నిలబెట్టింది. అన్ని సీజన్లకు మాదిరిగానే ఈ సీజన్ లోనూ పార్టిసిపెంట్స్ మధ్య వాడి, వేడి టాస్కులతో సెగలు పుట్టించగా.. హోస్ట్ నాగార్జున వారాంతంలో వీరి ఆట తీరుపై విశ్లేషణతో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నం చేశారు. నత్తి మెదడు, మగళై, కుట్టి వంటి పదాలు ఈ సీజన్లో పార్టిసిపెంట్స్ మధ్య బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి సీజన్‌ని ఫాలో అయ్యే ప్రేక్షకులకు రొటీన్ టాస్కుల పరంగా కాస్తంత అసహనం కలిగించినా సెలబ్రిటీలతో సీజన్ కవర్ చేయడానికి బాగానే ప్రయత్నించారు. బిగ్ బాస్ టీవి షోనే అయినా దీని తాకిడి మాత్రం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. సోషల్ మీడియాలోనే పార్టిసిపెంట్స్ పరంగా గ్రూపులతో పాటు కార్యక్రమంలోని అంశాలపై రోజువారీ చర్చలు జరిగాయి. బిగ్ బాస్ కార్యక్రమానికి కావలసిందీ ఇదే. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటిదాకా ఎక్కువగా యాంకరింగ్ చేసింది నాగార్జునే. తన ఛరిష్మాతో ఇటు పార్టిసిపెంట్స్‌ను అటు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. పార్టిసిపెంట్స్ గొడవ ఓ ఎత్తయితే ఆ గొడవకు సంబంధించిన నాగార్జున విశ్లేషణ మరో ఎత్తు. దీని కోసమే చాలా మంది వెయిట్ చేసేవారు. మామూలుగా అపరిచితులతో ప్రయాణం చేసేటప్పుడు జరిగే చిన్నపాటి ఘర్షణ తలెత్తినా చుట్టూ పదిమంది గుమిగూడి గొడవ సద్దుమణిగేదాకా సినిమా చూసినట్టు చూస్తారు. అలాంటిది 22 మంది అపరిచితులను వంద రోజులకు పై ఓ ఇంట్లో పెట్టి వారి మధ్య టాస్కులు పెడితే ఆ బొమ్మ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతిరోజూ ఒకే స్క్రీన్ మీద 22కు పైగా సినిమాలను చూసినట్టుండేది.. అదే బిగ్ బాస్. ఈ సీజన్ తో బిగ్ బాస్ కార్యక్రమానికి కామా పడింది. మరో సీజన్ సినిమా కోసం ప్రేక్షకులు మరో 9 నెలలు వెయిట్ చేయాల్సిందే. వచ్చే సీజన్ వరకు ఈ సీజన్ వేడి మాత్రం చల్లారేదేలే. ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పటికీ అస్సలు తగ్గేదేలే. - హరికృష్ణ ఇంటూరు -
ఫినాలేలో గౌతమ్‌పై నాగ్ సెటైర్లు.. కానీ చివర్లో మాత్రం..!
కష్టపడు.. ఫలితం ఆశించకు అంటుంటారు. కానీ బిగ్‌బాస్ షోలో ఫలితం ఆశించి కష్టపడ్డా కొన్నిసార్లు ప్రతిఫలం దక్కదు. ఈ సీజన్లో వైల్డ్ ఫైర్‌లా మారిన గౌతమ్ కృష్ణ గత సీజన్లోనూ పాల్గొన్నాడు. అప్పుడు కూడా గ్రూప్ గేమ్స్ జోలికి వెళ్లకుండా సోలో బాయ్‌లా ఆడాడు. అయితే కొన్నిసార్లు నువ్వెంత ప్రయత్నించావన్నదానికి బదులు ఎన్ని గెలిచావన్నదే చూస్తారు. ఈ విషయంలో గౌతమ్ వెనకబడిపోయాడు.బెడిసికొట్టిన అశ్వత్థామ బిరుదుకానీ శివాజీ కపట నాటకాన్ని వేలెత్తి చూపించి హైలైట్ అయ్యాడు. అయితే బిగ్‌బాస్‌కు కూడా కొందరు ఫేవరెట్స్ ఉంటారు. వాళ్లనేమైనా అంటే ఆ కంటెస్టెంట్ గేటు బయట ఉండాల్సిందే! హోస్ట్ నాగార్జున కూడా అతడి నోరు నొక్కేసి నానామాటలన్నారు. చివరకు 13వ వారంలో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. అశ్వత్థామ 2.0 అంటూ తనకు తాను ఇచ్చుకున్న బిరుదు కూడా జనాలకు రుచించలేదు, ట్రోల్ చేశారు.దారి తప్పిన గౌతమ్అయితే ఎక్కడ తగ్గాడో అక్కడే నెగ్గాలనుకున్నాడు. మళ్లీ బిగ్‌బాస్ 8లో అడుగుపెట్టాడు. ఈసారి ఏదేమైనా వెనక్కు తగ్గకూడదని బలంగా ఫిక్సయ్యాడు. కానీ వచ్చినవారంలోనే క్రష్ అంటూ యష్మిపై ఫీలింగ్స్ బయటపెట్టడంతో జనం అతడిని తిరస్కరించాడు. వెంటనే ఎక్కడ తప్పు చేశానన్నది గ్రహించి తనను మార్చుకున్నాడు. కేవలం ఆటపైనే దృష్టిసారించాడు. తప్పు జరుగుతుంటే వేలెత్తి చూపించాడు. (చదవండి: ఆడు మగాడ్రా బుజ్జి.. గౌతమ్ కృష్ణ సంపాదన ఎంతంటే?)ఆ ఒక్క మాటతో విపరీతమైన నెగెటివిటీగ్రూప్ గేమ్స్ తప్పు కాదని హోస్ట్ చెప్తున్నా సరే అది తప్పని వాదించాడు. అతడి గుండెధైర్యానికి జనాలు ఫిదా అయ్యారు. అతడి ప్రవర్తన, మాటతీరుకు సెల్యూట్ చేశారు. గెలుపు ఖాయం అనుకుంటున్న సమయంలో నిఖిల్‌పై అనవసరంగా నోరు జారాడు. అమ్మాయిలను వాడుకుంటున్నావ్ అనడంతో గౌతమ్‌పై ఉన్న పాజిటివిటీ కాస్త తగ్గిపోయింది. అది ఎంత పెద్ద మాట అని నాగార్జున చెప్తున్నా కూడా అతడికి చెవికెక్కలేదు. వివరణ ఇస్తూనే పోయాడు. ఈ వ్యవహారం అతడికి మైనస్ అయింది.సెటైర్.. అంతలోనే ప్రశంసగౌతమ్ ఎదుటివారు చెప్పేది వినిపించుకోకుండా తన పాయింట్స్ తను చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు. ఫినాలేలో గౌతమ్ తండ్రి కూడా అలా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. అది చూసిన నాగ్.. ఎవరైనా మాట్లాడుతుంటే వినకుండా నీ వర్షన్ నువ్వు చెప్పే క్వాలిటీ మీ తండ్రి నుంచే వచ్చిందా? అని సెటైర్ వేశాడు. అయితే ఎక్కువగా తన చేతిలో తిట్లు తినే గౌతమ్‌ను చిట్టచివరిసారి మెచ్చుకున్నాడు నాగార్జున. గౌతమ్‌ను రన్నరప్‌గా ప్రకటించినప్పుడు.. గర్వించే కొడుకును కన్నారంటూ అతడి పేరెంట్స్‌ను ప్రశంసించాడు. అది చూసిన ఫ్యాన్స్.. ఇది కదా సక్సెస్ అంటే, నువ్వు జనాల మనసులు గెలిచేశావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.తెర వెనక 'బిగ్‌బాస్ 8' ఫినాలే హంగామా.. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు విజేతలు వీళ్లే.. (ఫొటోలు)
-
తెర వెనక 'బిగ్‌బాస్ 8' ఫినాలే హంగామా (ఫొటోలు)
-
బిగ్‌బాస్ 8 రన్నరప్‌గా గౌతమ్.. ఏమేం గెలుచుకున్నాడు? (ఫొటోలు)
-
బిగ్‌బాస్ విన్నర్‌గా నిఖిల్.. ప్రైజ్‌మనీతోపాటు ఏం సాధించాడంటే?
సరైనోడు, దమ్మున్నోడు, జెంటిల్మెన్.. ఇలాంటి ట్యాగులన్నీ నిఖిల్‌కు సరిగ్గా సరిపోతాయి. ఎంత కోపం వచ్చినా అది క్షణకాలం మాత్రమే! వంద రోజుల జర్నీలో అతడు కంట్రోల్ తప్పిన సందర్భాలను వేళ్లపై లెక్కపెట్టుకోవచ్చు. ఎవరెన్ని నిందలు వేసినా తనలో తను బాధపడ్డాడే తప్ప తిరిగి ఒక్కమాట కూడా అనలేదు. ఫిజికల్ టాస్కుల విషయానికి వస్తే అతడిని ఢీ కొట్టేవాడే లేడన్నంతగా రెచ్చిపోయాడు. నిందలు పడ్డ చోటే నిలబడ్డాడునిఖిల్ ఆటలో అడుగుపెడితే వార్ వన్‌సైడ్ అయిపోద్ది అన్న లెవల్లో ఆడాడు. ఈ క్రమంలో తనకు దెబ్బలు తగిలినా లెక్కచేయలేదు. కంటెస్టెంట్ల సూటిపోటి మాటల వల్ల హౌస్‌ను వీడాలనుకున్నాడు. కానీ తనను ప్రేమించిన ప్రేక్షకుల కోసం మాటలు పడ్డ చోటే నిలబడాలనుకున్నాడు. ఆటతోనే సమాధానం చెప్పాడు. వేలెత్తి చూపించినవారితోనే చప్పట్లు కొట్టేలా చేశాడు. (Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)సంపాదన ఎంత?సీరియల్ యాక్టర్‌గా పేరు గడించిన నిఖిల్ బిగ్‌బాస్ ప్రియుల మనసు గెలుచుకుని ఏకంగా టైటిల్ విజేతగా నిలిచాడు. రూ.55 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. దీనితోపాటు మారుతి డిజైర్ కారు అదనపు బహుమతిగా లభించనుంది. ఇకపోతే నిఖిల్ వారానికి రూ.2.25 లక్షల పారితోషికం తీసుకున్నాడట! ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ రూ.33,75,000 సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ. 88 లక్షలు వెనకేశాడు. చదవండి: కోరిక మిగిలిపోయిందన్న తేజ.. నాగార్జున బంపరాఫర్ -
ఆడు మగాడ్రా బుజ్జి.. గౌతమ్ కృష్ణ సంపాదన ఎంతంటే?
ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి, వేలెత్తిచూపించినవారే తలదించుకునేలా చేయాలి.. తిట్టినవారితోనే పొగిడించుకోవాలి.. ఇవన్నీ చేసి చూపించాడు గౌతమ్ కృష్ణ. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో అతడు ఏం కోల్పోయాడో దాన్ని ఈ సీజన్లో తిరిగి సంపాదించాడు. అప్పుడు మూటగట్టుకున్న నెగెటివిటినీ తన మాటతీరుతో, ఆటతీరుతో కడిగిపారేశాడు.(Bigg Boss 8: నబీల్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అన్నప్పుడు నవ్వినవాళ్లే ఈడు మగాడ్రా బుజ్జి అంటున్నారు! బిగ్‌బాస్ 8లో వైల్డ్‌కార్డ్‌గా వచ్చి వైల్డ్ ఫైర్‌లా మారాడు. టైటిల్ రేసులో ఉన్న నిఖిల్‌కు గట్టి పోటీనిచ్చాడు. గతంలో ఫైనల్స్‌కు రాకుండానే వెనుదిరిగిన గౌతమ్ ఇప్పుడేకంగా టాప్ 2లో చోటు దక్కించుకున్నాడు. వారానికి రూ.1.75 లక్షల చొప్పున సంపాదించాడు. అంటే బిగ్‌బాస్ హౌస్‌లో పారితోషికం రూపేణా పది వారాలకుగానూ దాదాపు రూ.17,50,000 వెనకేసినట్లు తెలుస్తోంది.(చదవండి: బిగ్‌బాస్: అందాల రాక్షసి ఎంత సంపాదించిందో తెలుసా?) -
బిగ్‌బాస్ 8 విజేతగా నిఖిల్.. ఏమేం గెలుచుకున్నాడు? (ఫొటోలు)
-
Bigg Boss 8: నబీల్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ 8వ సీజన్లో మరో ఎలిమినేషన్. వరంగల్ బిడ్డ, యూట్యూబర్ నబీల్ టాప్-5లో నిలిచినప్పటికీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో హౌస్ నుంచి స్టేజీపైకి వచ్చేశాడు. ఫినాలే వరకు వచ్చినా సరే విజేత కాలేకపోయిన ఇతడు రెమ్యునరేషన్ మాత్రం బాగానే సంపాదించాడు. ఇంతకీ ఎంత మొత్తం అందుకుంటాడనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే)14 మందితో సెప్టెంబరు 1వ తేదీన బిగ్‌బాస్ 8వ సీజన్ మొదలైంది. యూట్యూబర్ నబీల్ అఫ్రిది పెద్దగా అంచనాల్లేకుండానే హౌసులోకి వచ్చాడు. ఒక్కోవారం తనదైన ఫెర్ఫార్మెన్స్ ఇస్తూ నెగ్గుకొచ్చాడు. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పటికీ.. వాళ్లతో కూడా మంచి బాండింగ్ పెంచుకుంటూ ఇప్పుడు టాప్-5 ఫినాలే వరకు వచ్చాడు. కానీ విజేత రేసులో ఇతడు లేడని ఇప్పుడు ఎలిమినేట్ కావడంతో అర్థమైంది.ఫినాలే వరకు అంటే 15 వారాల పాటు నబీల్.. బిగ్‌బాస్ హౌసులో ఉన్నాడు. ఇకపోతే వారానికి రూ.2 లక్షలుగా నబీల్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ.30 లక్షల పారితోషికం అందుకున్నట్లే. ఏది ఏమైనా ఓ యూట్యూబర్‌గా హౌసులోకి అడుగుపెట్టి, ఫినాలే వరకు వచ్చి ఇంత మొత్తం రెమ్యునరేషన్‌గా అందుకోవడం విశేషమే. విజేత కానప్పటికీ మంచి మొత్తాన్ని అయితే అందుకున్నట్లేగా!(ఇదీ చదవండి: బిగ్‌బాస్: తేజకు నాగార్జున బంపరాఫర్.. అతడి పెళ్లికి..!) -
బిగ్‌బాస్: అందాల రాక్షసి ఎంత సంపాదించిందో తెలుసా?
అందాల రాక్షసి.. బిగ్‌బాస్ ప్రేరణకు అంకితమిచ్చిన ట్యాగ్‌లైన్ ఇది. ఈ అందాల భామకు ముక్కు మీద కోపం. ఎవరైనా ఒక్క మాటంటే దానికి పది మాటలు తిప్పి కొడుతుంది. తనను చులకన చేస్తే బుసకొట్టిన పాములా లేస్తుంది. టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడుతుంది. మగవాళ్లకు బలమైన పోటీ ఇస్తుంది. బుద్ధిబలం కూడా మెండు.విపరీతమైన నెగెటివిటీకానీ నోటిదురుసే ఎక్కువ! సిగ్గు లేదా? క్యారెక్టర్‌లెస్? ఆ ముఖం చూడు.. ఇలాంటి మాటలన్నీ తన నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాలే! మెగా చీఫ్ అయ్యాక నా మాటే శాసనం అన్నట్లుగా ప్రవర్తించింది. తిండి దగ్గర కూడా ఆంక్షలు పెట్టి అభాసుపాలైంది. విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. పారితోషికం ఎంతంటే?కానీ తప్పు ఎక్కడ జరుగుతుందో వెంటనే తనను తాను సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. అందుకే టాప్ 5లో నిలబడిన ఏకైక మహిళగా నిలిచింది. తనకు సూట్‌కేస్ ఆఫర్ చేసినా నిర్మొహమాటంగా నో చెప్పింది. ప్రేక్షకులు తనను ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు వెళ్తానని నిలబడింది. నాలుగో స్థానంలో వీడ్కోలు తీసుకుంది. ప్రేరణ వారానికి రూ.2 లక్షల చొప్పున పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ రూ.30 లక్షలు వెనకేసిందట!చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం.. -
బిగ్‌బాస్: తేజకు నాగార్జున బంపరాఫర్.. అతడి పెళ్లికి..!
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు నాగార్జున ఒక టీచర్‌లాగా! పొరపాట్లు చేస్తే సరిదిద్దుకోమని హెచ్చరిస్తాడు. మంచి చేస్తే చప్పట్లు కొడతాడు. బాధలో ఉంటే మోటివేట్ చేస్తాడు. సంతోషాన్ని నలుగురితో పంచుకోమంటాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నన్ని రోజులు కంటెస్టెంట్లకు గురువుగా, అండగా ఉండేది నాగార్జున ఒక్కరే!గత సీజన్లో..అయితే వీకెండ్లో నాగార్జున వేసుకొచ్చే షర్ట్స్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. పోయిన సీజన్లో షర్ట్ కావాలని శోభా శెట్టి ఇలా అడగ్గానే నాగ్ అలా ఇచ్చేశాడు. అమర్దీప్ అడిగితే మాత్రం అసలు లెక్కచేయలేదు. ఈ సీజన్లో టేస్టీ తేజ కూడా తనకు చొక్కా కావాలని సిగ్గు విడిచి అడిగాడు. సన్నబడితే షర్ట్ ఇస్తానని నాగ్ మాటిచ్చాడు. అందుకోసం తేజ కష్టపడ్డాడు కానీ ఫలితం లేకపోయింది. బరువు తగ్గకుండానే హౌస్ నుంచి వెళ్లిపోయాడు.నేను ఫిక్స్ చేస్తాతాజాగా ఫినాలేకు వచ్చిన తేజ మీ షర్ట్ దక్కలేదన్న కోరిక అలాగే మిగిలిపోయిందన్నాడు. అందుకు నాగ్ ముందు పెళ్లి ఫిక్స్ చేసుకో.. అప్పుడు నీకు పెళ్లి డ్రెస్ నేను ఫిక్స్ చేస్తా అని హామీ ఇచ్చాడు. ఊహించని బంపరాఫర్ తగలడంతో తేజ తెగ సంతోషపడిపోయాడు.చదవండి: కప్పు గెలిచేసిన నిఖిల్.. అడుగుదూరంలో ఆగిపోయిన గౌతమ్! -
Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే
టాప్-5లో ఉన్న అవినాష్.. ఫినాలే ఎపిసోడ్లో తొలుత ఎలిమినేట్ అయ్యాడు. ఈసారి బిగ్‌బాస్ హౌసులో కాస్తోకూస్తో ఎంటర్టైన్మెంట్ వచ్చింది అంటే అది ఇద్దరివల్లే. ఒకరు అవినాష్ కాగా మరొకరు రోహిణి. గతంలో వీళ్లిద్దరూ బిగ్‌బాస్‌లో పాల్గొన్నారు కానీ ఈసారి మాత్రం రెచ్చిపోయి మరీ తమదైన హాస్యంతో ఆకట్టుకున్నారు. ఫినాలేకి ముందు రోహిణి ఎలిమినేట్ కాగా.. ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్‌గా అవినాష్ నిలిచి టాప్-5లో అడుగుపెట్టాడు. కానీ ఫినాలేకి వచ్చిన గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్‌తో పోలిస్తే అవినాష్‌కి ఓటింగ్ శాతం తక్కువే! గతంలో నాలుగో సీజన్లోనూ అవినాష్.. వైల్డ్ కార్డ్గానే హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు. టాప్-7 వరకు వచ్చాడు కానీ ఫైనల్‌కు రాలేకపోయాడు. ఈసారి మాత్రం కొద్దిలో ఎలిమినేట్ అయ్యేవాడు. కానీ చాకచక్యంగా ఫినాలేలో అడుగుపెట్టేశాడు.అయితే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఐదో వారం.. బిగ్‌బాస్ హౌసులోకి అడుగుపెట్టిన అవినాష్ చివరివరకు ఉన్నాడు. దాదాపు 10 వారాల పాటు హౌసులో తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఒక్కో వారానికి రూ.2 లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే రూ.20 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లే! -
టాప్ 2కి మనీ ఆఫర్.. ఫైనల్‌గా నిఖిల్ విన్నర్!
బిగ్‌బాస్ ఫైనల్లో సూట్‌కేస్ ఆఫర్ చేయడమనేది గత కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ! అయితే మధ్యలోనే టెంప్ట్ అయి సూట్‌కేస్ తీసుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. దీనివల్ల విన్నర్ ఫుల్ ప్రైజ్‌మనీ అందుకోలేకపోతున్నాడు. పైగా ఈసారి కంటెస్టెంట్లకు చాలా హింట్స్ వెళ్లాయి.సూట్‌కేస్ ఆఫర్అసలు సిసలైన పోటీ నిఖిల్, గౌతమ్ మధ్యే అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అందుకే టాప్ 5 మెంబర్స్‌కు సూట్‌కేస్ ఆఫర్ చేయలేదు. కానీ ఎవరూ మొగ్గు చూపలేదట.. తర్వాత ముగ్గురు మిగిలినప్పుడు టెంప్ట్ చేసే ప్రయత్నం చేయగా ఎవరూ తలొంచలేదట!అడుగు దూరంలో ఆగిపోయిన గౌతమ్చివరి ప్రయత్నంగా టాప్ 2 అంటే నిఖిల్, గౌతమ్‌లకు సూట్‌కేస్ ఆఫర్ చేసినప్పటికీ తీసుకోవడానికి ఇద్దరూ వెనకడుగు వేశాడు. దీంతో విన్నర్‌కు రూ.55 లక్షల ప్రైజ్‌మనీ అందింది. మరి ఈ మొత్తం అందుకున్న కంటెస్టెంట్ ఎవరనేది ఆల్రెడీ లీకైపోయింది. గెస్టుగా వచ్చిన రామ్‌చరణ్.. నిఖిల్ మళయక్కల్ను విన్నర్‌గా ప్రకటించినట్లు సమాచారం. దీంతో గౌతమ్ కృష్ణ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
BB Telugu 8 Telugu: బిగ్‌బాస్ 8 విజేతగా నిఖిల్ మళియక్కల్
బిగ్‌బాస్ 8వ సీజన్ ఫినాలే షురూ. 100 రోజులకు పైగా ప్రేక్షకుల్ని అలరించిన ఈ రియాలిటీ షో.. తుది అంకానికి చేరుకుంది. టాప్-5లో నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్ ఉన్నారు. వీళ్లలో విజేత ఎవరనేది మరో మూడు గంటల్లో తేలుతుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి విజేతకు రూ.55 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వబోతున్నట్లు హోస్ట్ నాగార్జున స్వయంగా ప్రకటించాడు. ఈసారి విజేతగా నిలిచిన వాళ్లకు హీరో రామ్ చరణ్ ట్రోఫీ బహుకరించనున్నారు. -
బిగ్‌బాస్ ఫినాలేకు ముగ్గురు డుమ్మా.. ఆ కారణం వల్లేనా?
బిగ్‌బాస్ షో తమకు జీవితంలో వచ్చిన పెద్ద అవకాశం అని చాలామంది కంటెస్టెంట్లు చెప్తూ ఉంటారు. ప్రేక్షకులకు తమను దగ్గర చేసిన బిగ్‌బాస్ షోకు ఎప్పటికీ రుణపడి ఉంటామంటుంటారు. అయితే కొందరు మాత్రం ఈ రియాలిటీ షో వల్ల నెగెటివిటీ మూటగట్టుకున్నామని తిట్టిపోస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే నేడు బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ గ్రాండ్ ఫినాలే.నెగెటివిటీ మూటగట్టుకున్న హరితేజఅంటే ఈ సీజన్ విజేతను తేల్చే ఆఖరి రోజు. ఇలాంటి పెద్ద ఈవెంట్‌కు ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ వస్తారు. అదేంటో కానీ ఈసారి ఏకంగా ముగ్గురు డుమ్మా కొట్టేశారు. వారే విష్ణుప్రియ, నయని పావని, హరితేజ. విచిత్రంగా సీజన్ 1లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన హరితేజ ఈ సీజన్లో మాత్రం వైల్డ్‌కార్డ్‌గా అడుగుపెట్టి నెలరోజులకే బయటకు వచ్చేసింది. విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. బహుశా అందుకే గ్రాండ్ ఫినాలేను లైట్ తీసుకుని ఉండవచ్చు!నిరూపించుకోలేకపోయిన నయనిఅటు నయని పావని.. ఏడో సీజన్లో వైల్డ్‌కార్డ్‌గా వచ్చి వారం రోజులకే ఎలిమినేట్ అయిపోయింది. ఈ సీజన్లో తన సత్తా చూపించాలనుకున్నప్పటికీ అన్నింటికీ ఏడ్చేస్తూ మూడువారాలకే హౌస్ నుంచి వచ్చేసింది. బహుశా ఈ బాధతోనే తను రాకపోయి ఉండొచ్చు. ఇక విష్ణుప్రియ.. విన్నర్ అయ్యేంత దమ్మున్నా ఆటపై ఫోకస్ పెట్టకుండా పృథ్వీపై మనసు పారేసుకుంది. గౌతమ్‌పై విష్ణు చిన్నచూపుఅతడు ఛీ కొట్టినా, చులకనగా చూసినా అతడు మాత్రమే కావాలంటూ పిచ్చిగా ప్రవర్తించింది. మనసులోని భావాలను నిర్మొహమాటంగా వ్యక్తపరిచిన ఆమె నిజాయితీ మెచ్చిన జనాలు ఆమెను దాదాపు 100 రోజులు హౌస్‌లో ఉండనిచ్చారు. అయితే గౌతమ్‌పై మొదటి నుంచీ ద్వేషం పెంచుకున్న ఆమె షో నుంచి వెళ్లేటప్పుడు కూడా అతడిని అవమానించింది.ఆ కారణం వల్లే?అసలు నువ్వేం ఆడావో చూస్తానంటూ గడ్డిపోచలా తీసిపారేసింది. కానీ ఇప్పుడేకంగా అతడు టైటిల్ రేసులో ఉన్నాడు. ఆ దృశ్యం చూడలేకే విష్ణు రాలేదని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. మరికొందరేమో తనపై వచ్చిన నెగెటివిటీ తట్టుకోలేకే ఈ ఈవెంట్‌కు డుమ్మా కొట్టి ఉండొచ్చని భావిస్తున్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘బిగ్‌బాస్ సీజన్ 8’ గ్రాండ్ ఫినాలే...హైలెట్స్ (ఫొటోలు)
-
బిగ్‌బాస్ 8 ఫినాలే.. పోలీసులు ముందస్తు వార్నింగ్
బిగ్‌బాస్ 8వ సీజన్ ఫినాలే సాయంత్రం జరగనుంది. అయితే గతేడాది జరిగిన అనుభవాల దృష్ట్యా.. హైదరాబాద్ వెస్ట్ పోలీసులు పలు సూచనలు, వార్నింగ్స్ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో ఆంక్షలు విధించారు. స్టూడియో బయట భారీ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అభిమానులు ఎవరూ స్టూడియో దగ్గరకు రావొద్దని పోలీసులు తెలిపారు.(ఇదీ చదవండి: 'బిగ్ బాస్' విన్నర్ ప్రైజ్ మనీ రివీల్ చేసిన నాగ్.. హిస్టరీలో ఇదే టాప్)కార్యక్రమం పూర్తయిన అనంతరం ఊరేగింపులు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే బిగ్ బాస్ నిర్వహకులదే బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు. ఇవన్నీ ఎందుకంటే గతేడాది డిసెంబరు 17న బిగ్‌బాస్ 7వ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్‌ని ప్రకటించారు.పల్లవి ప్రశాంత్ బయటకొచ్చిన తర్వాత ఇతడి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తోటి కంటెస్టెంట్స్ కార్లపై దాడి చేయడంతో పాటు ఆ దారిలో వెళ్తున్న ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈసారి ర్యాలీలపై నిషేధం విధించారు.(ఇదీ చదవండి: చిరంజీవి ఇంటికి కుటుంబంతో పాటు వెళ్లిన 'అల్లు అర్జున్') -
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే ప్రోమో