ఒకరి గురించి ఒకరు రాసిన కంప్లైంట్లు చదవడంతోనే సగం ఎపిసోడ్ అయిపోయింది. యష్మి వెళ్లిపోతూ.. ఎవరేమనుకున్నా నిఖిల్ తన ఫ్రెండ్ అని బల్లగుద్ది చెప్పింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
నేను చెప్పేదే నిజం
నాగార్జున.. ప్రేరణను సేవ్ అయినట్లు ప్రకటించడంతో ఆమె ఎమోషనల్ అయింది. తర్వాత హౌస్‌మేట్స్ అందరూ తమపై వచ్చిన ఫిర్యాదుల చిట్టా చదివి వినిపించారు. తేజ.. తను మాట్లాడాలనుకుంది మాట్లాడి వెళ్లిపోతాడు, నేను చెప్పేదే నిజం అన్న మైండ్‌సెట్ నుంచి బయటకు రావాలని నబీల్, నిజాయితీగా ఉండు, అబద్ధం ఆడటం చాలాసార్లు చూశా.. అని పృథ్వీ కంప్లైంట్స్ చేశారు.
గౌతమ్‌పై వచ్చిన కంప్లైంట్స్..
అన్‌ప్రిడక్టబుల్‌గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను, త్వరగా ట్రిగ్గర్ అవడం నాకు నచ్చదు అని యష్మి గురించి ప్రేరణ ఫిర్యాదు చేసింది. నీ ఇండివిడ్యువాలిటీ కనిపించడం లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మారిపోతావు. అసలైన నువ్వు ఎవరనేది అర్థం కావట్లేదు.. అని రోహిణి పేర్కొంది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు, ఫుడ్ అందరితో షేర్ చేసుకో అని పృథ్వీ.. కొన్నిసార్లు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాడేమో అనిపిస్తుందని అవినాష్ .. గౌతమ్ గురించి అభిప్రాయపడ్డారు.
ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలీదు
నీకు అవినాష్ రక్షణ కవచంలా అనిపిస్తోంది.. అవినాష్, తేజతోనే ఎక్కువగా ఉంటున్నావ్ అని పృథ్వీ. ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తోందని తేజ రోహిణి గురించి రాసుకొచ్చారు. తను ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలియదు, నామినేషన్స్‌లో క్లారిటీ లేదు, ఆట పట్ల ఆసక్తి అంతకన్నా లేదు అని అవినాష్, మేమందరం కష్టపడి తనను మెగా చీఫ్ చేశాం. తనను గెలిపించినవారికంటే యూనివర్స్‌కే ఎక్కువ కృతజ్ఞత చూపిస్తుంది అని నబీల్.. విష్ణు గురించి కంప్లైంట్ చేశారు.
ఎక్కువ విని తక్కువ మాట్లాడాలి
నువ్వొక్కడివే బలవంతుడివని ఆలోచించడం మానేయ్.. ప్రతి ఒక్కరికీ టాలెంట్ ఉంది. కాబట్టి ఎవర్నీ తక్కువ అంచనా వేయకు అని రోహిణి.. గొడవ నీ గురించి కాకపోయినా నువ్వే గొడవ సృష్టిస్తున్నావ్.. అభ్యంతరకర పదాలతో అటాక్ చేస్తావ్.. అని గౌతమ్.. పృథ్వీ గురించి ఫిర్యాదు చేశారు. ఆటలో అయినా, చర్చలో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని నబీల్, మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు తన డిక్టేటర్ ప్రవర్తన నచ్చలేదని అవినాష్.. ప్రేరణకు చెప్పారు.
నబీల్‌పై ఫిర్యాదులు
కామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం చూపించాలని ప్రేరణ, నీ అరుపు ఎక్కువైందని యష్మి.. అవినాష్‌పై ఫిర్యాదు చేశారు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక నువ్వు మారిపోయి అందరితో బాగుండాలని ప్రయత్నిస్తున్నావని పృథ్వీ, ఒక్కోవారం ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు, పెద్ద విషయాల్ని వదిలేసి నిన్ను ప్రశ్నించినవారిని మాత్రం టార్గెట్ చేస్తున్నావని గౌతమ్.. నబీల్ గురించి తెలిపారు.
యష్మి ఎలిమినేట్
మనసులో మాట డైరెక్ట్‌గా చెప్పుంటే నా గేమ్ ఎఫెక్టయ్యేదే కాదు. ఈ జర్నీలో నువ్వు ఫైటర్ కన్నా సేఫ్ గేమర్‌గానే ఎక్కువ కనిపించావని యష్మి, అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావ్.. అతడి గేమ్ ప్లానేంటో తెలియదు, అందుకే తనను నమ్మలేనని ప్రేరణ.. నిఖిల్ గురించి రాసుకొచ్చారు. అనంతరం నాగార్జున.. నబీల్, పృథ్వీని సేవ్ చేసి యష్మి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నా మాటల వల్ల, ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడుంటే సారీ అంటూ యష్మి కన్నీటితో వీడ్కోలు తీసుకుంది.
నిఖిల్ నా ఫేవరెట్ ఫ్రెండ్
స్టేజీపైకి వచ్చాక ఆమెతో ఫ్రెండ్స్ ఎవరు? శత్రువులు ఎవరు? అన్న గేమ్ ఆడించాడు నాగ్. ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ తన ఫ్రెండ్స్ అంది. నిఖిల్ తన ఫేవరెట్ ఫ్రెండ్ అని, ఎవరేమన్నా తమ స్నేహం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. శత్రువుల లిస్ట్‌లో గౌతమ్, అవినాష్, రోహిణిని చేర్చింది. స్నేక్ అండ్ లాడర్ గేమ్‌లో గౌతమ్, నిఖిల్ పాములని మెజారిటీ హౌస్‌మేట్స్ అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకర్ని నామినేట్ చేయాలని యష్మిపై భారం వేశాడు నాగ్. దీంతో ఆమె గౌతమ్‌పై బిగ్‌బాంబ్ వేసింది.
Comments
Please login to add a commentAdd a comment