Yashmi Gowda
-
తన తప్పే లేదంటున్న యష్మి.. నిఖిల్‌పై ఫీలింగ్స్ గురించి..
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో యష్మి గౌడ పన్నెండోవారం ఎలిమినేట్ అయింది. హౌస్ నుంచి బయటకు వచ్చేసిన ఆమె నేరుగా బిగ్‌బాస్ బజ్‌లో అడుగుపెట్టింది. ఇక్కడ అంబటి అర్జున్.. యష్మి అనే నేను, అన్నీ నిజాలే చెప్తానంటూ తనతో ప్రమాణం చేయించాడు. ఎందుకు బయటున్నావని ఆలోచించావా? అని అడగ్గా.. హౌస్‌లో నా అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. చూసే జనాలకు అది ఫ్లిప్పులా అనిపిస్తుందేమో అని యష్మి సమాధానమిచ్చింది. గ్రూప్ గేమ్ ఆడావా? లేదా? ఈ ప్రవర్తనను ఉడుకుబోతుతనం అంటారని అర్జున్ సెటైర్ వేశాడు. గ్రూప్ గేమ్ ఆడావా? లేదా? నామినేషన్స్‌లో గ్రూప్‌గా చర్చించుకుని నామినేట్ చేశారా? లేదా? అని వరుస ప్రశ్నలు సంధించాడు. నిఖిల్‌పై నీ ఫీలింగ్ ఏంటనగా.. అతడు తనకు మంచి స్నేహితుడు అని చెప్పింది యష్మి.నేను ఏం చేసినా ఫీలింగ్స్ ఉన్నాయంటారుమీకు ఫీలింగ్స్ లేనప్పుడు గౌతమ్ టీషర్ట్ వేసుకుని నిఖిల్‌కు జెలసీ తెప్పించాలని ఎందుకనుకున్నావ్? అని క్వశ్చన్ చేశాడు. అందుకు యష్మి సమాధానం దాటవేస్తూ.. ఇప్పుడిదంతా జరిగింది కాబట్టి.. నేను కొంచెం నవ్వినా సిగ్గుపడుతుంది, ఫీలింగ్స్ ఉన్నాయంటారు. దానికి నేనేం చేయలేను అంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ నలుగురు ఫ్రెండ్స్.. గౌతమ్ శత్రువన్న యష్మి.. అతడిపైనే బిగ్‌బాంబ్
ఒకరి గురించి ఒకరు రాసిన కంప్లైంట్లు చదవడంతోనే సగం ఎపిసోడ్ అయిపోయింది. యష్మి వెళ్లిపోతూ.. ఎవరేమనుకున్నా నిఖిల్ తన ఫ్రెండ్ అని బల్లగుద్ది చెప్పింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నేను చెప్పేదే నిజంనాగార్జున.. ప్రేరణను సేవ్ అయినట్లు ప్రకటించడంతో ఆమె ఎమోషనల్ అయింది. తర్వాత హౌస్మేట్స్ అందరూ తమపై వచ్చిన ఫిర్యాదుల చిట్టా చదివి వినిపించారు. తేజ.. తను మాట్లాడాలనుకుంది మాట్లాడి వెళ్లిపోతాడు, నేను చెప్పేదే నిజం అన్న మైండ్‌సెట్ నుంచి బయటకు రావాలని నబీల్, నిజాయితీగా ఉండు, అబద్ధం ఆడటం చాలాసార్లు చూశా.. అని పృథ్వీ కంప్లైంట్స్ చేశారు. గౌతమ్‌పై వచ్చిన కంప్లైంట్స్..అన్‌ప్రిడక్టబుల్‌గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను, త్వరగా ట్రిగ్గర్ అవడం నాకు నచ్చదు అని యష్మి గురించి ప్రేరణ ఫిర్యాదు చేసింది. నీ ఇండివిడ్యువాలిటీ కనిపించడం లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మారిపోతావు. అసలైన నువ్వు ఎవరనేది అర్థం కావట్లేదు.. అని రోహిణి పేర్కొంది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు, ఫుడ్ అందరితో షేర్ చేసుకో అని పృథ్వీ.. కొన్నిసార్లు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాడేమో అనిపిస్తుందని అవినాష్ .. గౌతమ్ గురించి అభిప్రాయపడ్డారు. ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలీదునీకు అవినాష్ రక్షణ కవచంలా అనిపిస్తోంది.. అవినాష్, తేజతోనే ఎక్కువగా ఉంటున్నావ్ అని పృథ్వీ. ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తోందని తేజ రోహిణి గురించి రాసుకొచ్చారు. తను ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలియదు, నామినేషన్స్‌లో క్లారిటీ లేదు, ఆట పట్ల ఆసక్తి అంతకన్నా లేదు అని అవినాష్, మేమందరం కష్టపడి తనను మెగా చీఫ్ చేశాం. తనను గెలిపించినవారికంటే యూనివర్స్కే ఎక్కువ కృతజ్ఞత చూపిస్తుంది అని నబీల్.. విష్ణు గురించి కంప్లైంట్ చేశారు.ఎక్కువ విని తక్కువ మాట్లాడాలినువ్వొక్కడివే బలవంతుడివని ఆలోచించడం మానేయ్.. ప్రతి ఒక్కరికీ టాలెంట్ ఉంది. కాబట్టి ఎవర్నీ తక్కువ అంచనా వేయకు అని రోహిణి.. గొడవ నీ గురించి కాకపోయినా నువ్వే గొడవ సృష్టిస్తున్నావ్.. అభ్యంతరకర పదాలతో అటాక్ చేస్తావ్.. అని గౌతమ్.. పృథ్వీ గురించి ఫిర్యాదు చేశారు. ఆటలో అయినా, చర్చలో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని నబీల్, మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు తన డిక్టేటర్ ప్రవర్తన నచ్చలేదని అవినాష్.. ప్రేరణకు చెప్పారు.నబీల్‌పై ఫిర్యాదులుకామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం చూపించాలని ప్రేరణ, నీ అరుపు ఎక్కువైందని యష్మి.. అవినాష్‌పై ఫిర్యాదు చేశారు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక నువ్వు మారిపోయి అందరితో బాగుండాలని ప్రయత్నిస్తున్నావని పృథ్వీ, ఒక్కోవారం ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు, పెద్ద విషయాల్ని వదిలేసి నిన్ను ప్రశ్నించినవారిని మాత్రం టార్గెట్ చేస్తున్నావని గౌతమ్.. నబీల్ గురించి తెలిపారు.యష్మి ఎలిమినేట్మనసులో మాట డైరెక్ట్‌గా చెప్పుంటే నా గేమ్ ఎఫెక్టయ్యేదే కాదు. ఈ జర్నీలో నువ్వు ఫైటర్ కన్నా సేఫ్ గేమర్గానే ఎక్కువ కనిపించావని యష్మి, అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావ్.. అతడి గేమ్ ప్లానేంటో తెలియదు, అందుకే తనను నమ్మలేనని ప్రేరణ.. నిఖిల్ గురించి రాసుకొచ్చారు. అనంతరం నాగార్జున.. నబీల్, పృథ్వీని సేవ్ చేసి యష్మి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నా మాటల వల్ల, ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడుంటే సారీ అంటూ యష్మి కన్నీటితో వీడ్కోలు తీసుకుంది. నిఖిల్ నా ఫేవరెట్ ఫ్రెండ్స్టేజీపైకి వచ్చాక ఆమెతో ఫ్రెండ్స్ ఎవరు? శత్రువులు ఎవరు? అన్న గేమ్ ఆడించాడు నాగ్. ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ తన ఫ్రెండ్స్ అంది. నిఖిల్ తన ఫేవరెట్ ఫ్రెండ్ అని, ఎవరేమన్నా తమ స్నేహం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. శత్రువుల లిస్ట్‌లో గౌతమ్, అవినాష్, రోహిణిని చేర్చింది. స్నేక్ అండ్ లాడర్ గేమ్‌లో గౌతమ్, నిఖిల్ పాములని మెజారిటీ హౌస్మేట్స్ అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకర్ని నామినేట్ చేయాలని యష్మిపై భారం వేశాడు నాగ్. దీంతో ఆమె గౌతమ్‌పై బిగ్‌బాంబ్ వేసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
స్ట్రాంగ్ ఉమెన్.. ఆ తప్పుల వల్లే యష్మి ఎలిమినేట్!
యష్మి గౌడ.. స్ట్రాంగ్ ఉమెన్, టాప్ 5 కంటెస్టెంట్ అని అంతా అనుకున్నారు. ఆ రేంజ్లో ఉండేది యష్మి ఆట. తను టాస్క్‌లో దిగితే ఎలాగైనా గెలవాల్సిందే అన్నంత కసిగా ఆడేది. ఆడపులి అన్న సెల్ఫ్ ట్యాగ్ ఇచ్చుకున్న సోనియాకే చుక్కలు చూపించింది. తనలో ఫైర్ చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. కానీ తర్వాతి వారాల్లో యష్మి ఆట గాడితప్పింది.సంచాలక్‌గా వరస్ట్ప్లేయర్గా బెస్ట్ అనిపించుకున్నా సంచాలక్‌గా వరస్ట్ గేమ్స్ ఆడింది. ఎప్పుడైతే నిఖిల్‌పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టిందో అప్పటినుంచి తన డౌన్‌ఫాల్ మొదలైంది. అతడిని ఎవరైనా నామినేట్ చేసినా ఈవిడే తెగ ఫీలైపోయేది. అతడితో డ్యాన్స్ చేయడం కోసం విష్ణుప్రియతో విపరీతంగా గొడవపడింది.నిఖిల్ చుట్టూ గేమ్తన కోసం గేమ్ ఆడటం మానేసి ఎవరికోసమో పాకరిల్లడమేంటని ఫ్యాన్స్ సైతం హర్టయ్యారు. ఫ్రెండ్‌లా అయినా ఉండరా అంటూ అతడి వెంట పడ్డ యష్మి ఈ వారం నామినేషన్లో మాత్రం అతడిపై ఏ ఫీలింగ్స్ లేవని ప్లేటు తిప్పేయడం మరింత షాక్‌కు గురిచేసింది. ఇలా మాట మార్చడాల వల్ల ఆమె తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. పారితోషికం ఎంత?చివరకు తన ఏడుపు కూడా ఫేక్ అని జనాలు ముద్ర వేసే స్థాయికి దిగజారిపోయింది. ఫైనల్‌గా ఈ వారం ఎలిమినేట్ అయింది. ఇకపోతే యష్మి.. ఒక్కవారానికిగానూ రూ.2.50 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. 12 వారాలకుగానూ ఆమె రూ.30 లక్షలు వెనకేసిందన్నమాట!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అతడి నిజస్వరూపం బయటపడాలన్న యష్మి
ఒకరి పొరపాట్లను మరొకరు పేపర్‌పై రాయాలన్నాడు బిగ్‌బాస్. తన మీద వచ్చిన ఫిర్యాదు చదివిన కంటెస్టెంట్.. అది ఎవరు రాయాలో గెస్ చేయాల్సి ఉంటుంది. అలా తేజ. తనపై వచ్చిన కంప్లైంట్ చదివాడు. తను మాట్లాడదల్చుకుంది మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తను చెప్పేది మాత్రమే నిజమని భావిస్తాడు అని రాసుంది. ఇది కచ్చితంగా విష్ణుప్రియ, యష్మి రాసుంటారని తేజ అభిప్రాయపడ్డాడు.ఫిర్యాదుల గోలఅన్ప్రిడక్టబుల్గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను. చాలా త్వరగా ట్రిగ్గర్ అవుతుంది. అది నాకు నచ్చదు.. ఈ ఫిర్యాదు తనపై గౌతమ్ చేసి ఉంటాడని యష్మి గెస్ చేసింది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు.. ఫుడ్ విషయంలో అందరికోసం ఆలోచించు అని గౌతమ్‌కు ఫిర్యాదు వచ్చింది. ఇది విష్ణు, అవినాష్ కంప్లైంట్ చేసుంటారన్నాడు.నిజస్వరూపం చూపించాలిఆటపట్ల ఆసక్తి ఉన్నట్లు అనిపించలేదు, అందర్నీ నిరుత్సాహపరుస్తుంది అని అవినాష్.. విష్ణుప్రియపై కంప్లైంట్ చేశాడు. కామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం అందరికీ చూపించాలి అని యష్మి.. అవినాష్ గురించి రాసింది. ప్రోమోలో చివర్లో పృథ్వీ, యష్మి డేంజర్ జోన్లో ఉన్నట్లు చూపించారు. అయితే యష్మి ఎలిమినేట్ అన్న విషయం ఇదివరకే తెలిసిందే! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విన్నర్లు కాదు, పాములు.. గ్రూప్ గేమ్ తప్పు కాదన్న నాగ్..
విష్ణుప్రియ- రోహిణి, గౌతమ్-పృథ్వీల గొడవలు పరిష్కరించడానికి నాగార్జున తలప్రాణం తోకకొచ్చింది. గేమ్‌లో మిమ్మల్ని వెనక్కు లాగుతుందెవరు? అన్నప్పుడు గౌతమ్, నిఖిల్ పేర్లే ఎక్కువమంది చెప్పడం గమనార్హం. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..క్యారెక్టర్‌లెస్ అనలేదుగా: విష్ణునువ్వు జీరో, నీకు అర్హత లేదు.. అని నానామాటలన్నవారికి నీ విజయంతోనే సమాదానం చెప్పావంటూ నాగార్జున.. మెగా చీఫ్ రోహిణిని మెచ్చుకున్నాడు. ఆ వెంటనే రోహిణి, విష్ణును కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి వీళ్లిద్దరి గొడవకు సంబంధించిన వీడియో క్లిప్ చూపించాడు. క్యారెక్టర్ అని తన వ్యక్తిత్వం గురించి అన్నానే తప్ప క్యారెక్టర్‌లెస్ అనలేదంది విష్ణు. దీనికి నాగ్.. ఆ పదం వాడినప్పుడే నీ క్యారెక్టర్ కనిపించిందన్నాడు.నిఖిల్‌కు ట్రై చేశా అనలేదునిఖిల్కు ట్రై చేశా వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా.. అని విష్ణు నిజంగానే అందా? అని రోహిణిని అడిగాడు. అందుకామె అవునని తలూపింది. అదే తన ప్లానా? అంటే కాదని చెప్పింది. దీనిపై విష్ణు స్పందిస్తూ.. నిఖిల్, నేను కలిసి బయట ఓ షో చేశాం. తన పర్సనాలిటీ అంటే ఇష్టమని చెప్పానే తప్ప ట్రై చేశాననలేదు అని క్లారిటీ ఇచ్చింది. ఏ ప్లాన్ వర్కవుట్ అయిందని విష్ణు హౌస్‌లో ఉంటోందన్నావని రోహిణిని అడగ్గా.. పృథ్వీతో లవ్ ట్రాక్ వల్లే ఆమె హౌస్‌లో ఉంటుందనిపిస్తోందని రోహిణి అభిప్రాయపడింది. తర్వాత ఇద్దరూ క్షమాపణలు చెప్పుకున్నారు.గ్రూప్ గేమ్ ఆడితే తప్పేంటన్న నాగ్పృథ్వీ, గౌతమ్ గొడవ గురించి నాగ్ చర్చించాడు. వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేయాలని గ్రూప్ గేమ్ ఆడారని గౌతమ్ చెప్పగా.. అందులో తప్పేముందన్నాడు నాగ్. నా ఉద్దేశంలో తప్పేనంటూ హోస్ట్పైకే తిరగబడ్డాడు గౌతమ్. పెద్ద తప్పు చేసినవారినే నామినేట్ చేయాలే తప్ప వైల్డ్ కార్డ్ అన్న కారణంతో నామినేట్ చేయడం ముమ్మాటికీ తప్పేనని వాదించాడు. ఇంతలో పృథ్వీ.. అతడు ఇండివిడ్యువల్ ప్లేయర్ అని నిరూపించుకోవడానికి మమ్మల్ని బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు.నోర్మూయ్.. నాగ్ సీరియస్ఆట అయిపోయాక కెమెరాలతో మాట్లాడతావు, నీ ఆట ఎవరూ నొక్కలేరు అని నాగార్జున గౌతమ్‌పై సెటైర్లు వేశాడు. అప్పటికీ గౌతమ్ మాట్లాడుతూనే ఉండటంతో బీపీ తెచ్చుకున్న నాగ్.. నోర్మూయ్, నేను మాట్లాడేటప్పుడు మధ్యలోకి రాకు అని తిట్టిపోశాడు. మనిషి పైపైకి వెళ్లడం తప్పని పృథ్వీని సైతం హెచ్చరించాడు. అనంతరం హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించాడు.నిచ్చెన- పాముఆటలో మిమ్మల్ని ముందుకు తోస్తున్నదెవరు?(నిచ్చెన), వెనక్కు లాగుతుందెవరు?(పాము) చెప్పాలన్నాడు. రోహిణి.. అవినాష్ నిచ్చెన అని, పృథ్వీ పాము అని పేర్కొంది. అవినాష్.. తేజ నిచ్చెన, పృథ్వీ పాము అని తెలిపాడు. నబీల్.. పృథ్వీ నిచ్చెన, నిఖిల్ పాము అని పేర్కొన్నాడు. పృథ్వీ.. నబీల్ నిచ్చెన, గౌతమ్ పాము అన్నాడు. గౌతమ్.. రోహిణి నిచ్చెన, నిఖిల్ పాము అని చెప్పాడు.రెండు పాములునిఖిల్.. పృథ్వీ నిచ్చెన, గౌతమ్ పాము అంది. యష్మి.. ప్రేరణ నిచ్చెన, నిఖిల్ పాము అని తెలిపింది. తేజ.. అవినాష్ నిచ్చెన, విష్ణుప్రియ పాము అన్నాడు. విష్ణుప్రియ వంతురాగా పృథ్వీ వల్లే తనకు ఆక్సిజన్, కార్బండయాక్సైడ్ అందుతున్నాయంటూ.. చివరకు నబీల్‌కు నిచ్చెన ఇచ్చింది. రోహిణికి పాము ఇచ్చేసింది. ప్రేరణ.. రోహిణి నిచ్చెన, గౌతమ్ పాము అని పేర్కొంది. నిఖిల్, గౌతమ్‌కు పాముగా సమాన ఓట్లు పడ్డాయని, వీరిలో ఒకరిపై బిగ్‌బాంబ్ పడబోతుందన్నాడు నాగ్. నిఖిల్‌ను సేవ్ చేయడంతో నేటి ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: యష్మి ఎలిమినేట్!
బిగ్‌బాస్ షో నుంచి మరొకరు వెళ్లిపోయే సమయం వచ్చేసింది. ఈ వారం ప్రేరణ, పృథ్వీ, యష్మి, నిఖిల్, నబీల్ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో నిఖిల్ ఎప్పటిలాగే ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. తర్వాతి స్థానంలో నబీల్ ఉన్నాడు. ప్రేరణ, పృథ్వీ, యష్మి చివరి స్థానాల్లో ఉన్నారు. అయితే ఈ వారం పృథ్వీ, యష్మిలలో ఒకరు వెళ్లిపోతారనే టాక్ నడిచింది. అనుకున్నట్లుగానే యష్మి ఎలిమినేట్ అయిందట! సండే ఎపిసోడ్ షూటింగ్ పూర్తవగా యష్మిని ఎలిమినేట్ చేసినట్లు సోషల్ మీడియాలో లీకులు మొదలయ్యాయి. టాస్కులు ఆడేందుకు యష్మి బాగానే కష్టపడింది. కానీ సంచాలక్‌గా ఉన్నప్పుడే లేనిపోని తప్పులన్నీ చేస్తుంటుంది. సంచాలక్ అంటే అంపైర్ తప్ప ఆటగాడు కాదని ఎన్నటికీ తెలుసుకోలేని యష్మి నిన్నటి గేమ్‌లో కూడా రోహిణి కుండలో ఇసుక నింపుతూ పృథ్వీకి సపోర్ట్ చేసింది. ఈ టాస్క్ వల్ల యష్మిపై మరింత నెగెటివిటీ ఏర్పడింది. ఫలితంగా దమ్మున్న కంటెస్టెంట్ బయటకు రాక తప్పలేదన్నమాట!చదవండి: గతేడాదే రోహిణి కాలికి ఆపరేషన్.. ఇప్పుడదే కాలితో ఆ ఇద్దరి అహాన్ని తొక్కిపడేసింది! -
ఫ్రాక్చర్ అయిన కాలుతో గేమ్ ఆడి గెల్చిన రోహిణి.. ప్లేటు మార్చిన విష్ణు!
తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లోనే ఇదొక బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. రోహిణిని గడ్డిపరకలా తీసిపారేసింది విష్ణు.. అసలు పరిగెత్తడం వచ్చా.. అని వంకరగా చూస్తూ బాడీ షేమింగ్ చేశాడు పృథ్వీ. ఫ్రాక్చర్ అయిన కాలుతోనే గేమ్ ఆడి ఈ ఇద్దరినీ ఓడించి లేడీ టైగర్ అనిపించుకుంది రోహిణి. మరిన్ని విశేషాలు నేటి (నవంబర్ 22) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..యష్మి బకరామెగా చీఫ్ కంటెండర్లకు బిగ్‌బాస్ ఆటోలో ప్రయాణం అనే టాస్క్ ఇచ్చాడు. చివరి వరకు ఆటోలో ఉన్నవారు ఎక్కువ పాయింట్లు గెలుస్తారన్నాడు. యష్మి, పృథ్వీ, విష్ణు కలిసి. తేజ, రోహిణిని తోసేశారు. పృథ్వీ, విష్ణు కలిసి యష్మిని తోయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నీకు సపోర్ట్ చేస్తే నువ్వేమో తోశావ్.. అలాంటప్పుడు నాకు సాయం చేస్తానని ఎందుకన్నావ్? మీరిద్దరూ ఎలా ఆడతారో చూస్తా.. అని నిలదీసింది.నీ ఒంట్లో ఫైర్ లేదు: విష్ణుఅందుకు రోహిణి.. వాళ్లు ఆడరు, ఒకరికోసం ఒకరు కాంప్రమైజ్ అవుతారంది. ఇంకేం చూస్తావులే, దిగు అని విష్ణుప్రియకు చెప్పింది. దీంతో విష్ణుకు బీపీ వచ్చింది. నీది నువ్వు చూసుకో, నీ ఒంట్లో ఫైర్ లేదు, పక్కనోళ్ల గేమ్ గురించి మాట్లాడకు. నువ్వు జీరో అని చీప్‌గా మాట్లాడింది. రోహిణి కూడా నువ్వే జీరో అనడంతో.. నీకన్నా ఎక్కువ వారాలున్నానంది. ఎందుకున్నావో నీకూ తెలుసు, నీ ప్లాన్ వర్కవుట్ అయింది, అందుకే ఉన్నావని రోహిణి ఉన్నమాట అనేసింది. విష్ణు బండారం బట్టబయలుదీంతో విష్ణు.. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందని నోరు జారింది. ఆ మాటతో రోహిణి.. ఫస్ట్ నిఖిల్‌కు ట్రై చేశా, వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా అని నువ్వే కదా చెప్పావు అని తన బండారం బయటపెట్టేసింది. ఈ గొడవ చల్లారాక విష్ణుప్రియను తోసేసి పృథ్వీ గెలిచాడు. టాస్క్ అయ్యాక విష్ణు.. రోహిణితో మళ్లీ వాదనకు దిగింది. తనే ఒప్పని నిరూపించుకోవాలని చూసింది. కానీ తన దగ్గర పప్పులు ఉడకనివ్వలేదు రోహిణి. నోరు అదుపులో పెట్టుకోఫైర్ లేదు, జీరో, క్యారెక్టర్ అంటూ నోరు జారుతున్నావ్.. నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించింది. అనంతరం తెడ్డు మీద గ్లాస్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో రోహిణి గెలవగా పృథ్వీ, తేజ, విష్ణుప్రియ, యష్మి తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా చివరి స్థానాల్లో ఉన్న యష్మి, విష్ణుప్రియను గేమ్ నుంచి ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్... పృథ్వీ, తేజ, రోహిణికి ఫైనల్ గేమ్ పెట్టాడు. సంచాలక్ కూడా గేమ్ ఆడింది!ఈ ఛాలెంజ్‌లో కంటెండర్లు.. కుండను కిందపడకుండా చూసుకోవాలి. బజర్ మోగినప్పుడల్లా హౌస్‌మేట్స్‌లో ఒకరు.. మెగా చీఫ్ అవకూడదనుకుంటున్న కంటెస్టెంట్ కుండలో రెండుసార్లు ఇసుక పోయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో యష్మి సంచాలక్‌గా వ్యవహరించింది. సంచాలక్ అయినప్పటికీ మధ్యమధ్యలో తను వెళ్లి అందరి కుండలు బ్యాలెన్స్ చేస్తానంటూ కేవలం రోహిణి కుండలోనే పదేపదే ఇసుక పోయడం గమనార్హం.రోహిణి ఎమోషనల్ఈ గేమ్‌లో అద్భుతంగా ఆడిన రోహిణి.. తేజ, పృథ్వీలను మట్టికరిపించింది. ఫ్రాక్చర్ అయిన కాలుతో రెండున్నర గంటలపాటు కుండను బ్యాలెన్స్ చేసింది. నేను మెగా చీఫ్ అయ్యాను.. ఆడి గెలుచుకున్నా అంటూ రోహిణి ఏడ్చేసింది. ఇక టాస్క్ మధ్యలో రోహిణిని నిఖిల్ పొగుడుతుంటే అవసరమా? అంటూ కన్నెర్రజేసిన విష్ణు.. చివర్లో మాత్రం నువ్వు హీరో అని అరవడం డ్రామాలాగే కనిపించింది.బాధలో పృథ్వీఒక్కసారి కూడా మెగా చీఫ్ కాలేకపోయినందుకు పృథ్వీ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఇక చివరి మెగా చీఫ్ అయిన రోహిణి కోసం బిగ్‌బాస్ శివంగివే.. పాట ప్లే చేశాడు. బాడీ షేమింగ్ చేసిన పృథ్వీపై, జీరో అని హేళన చేసిన విష్ణుప్రియపై రోహిణి పైచేయి సాధించి తన సత్తా చూపించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీని ఓడించిన రోహిణి.. దెబ్బ అదుర్స్ కదూ!
మెగా చీఫ్ అవడానికి కంటెండర్లకు బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. అదే తెడ్డు మీద గ్లాస్. ఓ తెడ్డుపై నీళ్ల గ్లాసుల్ని తీసుకెళ్లి అవతల ఒడ్డుకు తీసుకెళ్లి కంటైనర్లు నింపుకోవాలి. మొదట అందరూ ఎవరి ఆటపై వారు దృష్టి సారించారు. అయితే విష్ణుప్రియ.. అవతలివారు ఆటలో ముందుకు పోకుండా తన తెడ్డుతో ఆ గ్లాసుల్ని పడగొట్టింది. గలీజ్ గేమ్దీంతో యష్మి.. ఇలా గలీజ్ ఆట ఆడాలంటే మొదటి నుంచే ఆడొచ్చు అని అసహనానికి లోనైంది. ఇక ఇప్పటివరకు పెట్టిన గేమ్స్‌లో ఎక్కువ పాయింట్లు తెచ్చుకున్న ముగ్గురికీ చివరి టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఆ టాస్క్‌లో తేజ, పృథ్వీ, రోహిణి పాల్గొన్నారు. ఇసుక కూజాల్ని కింద పడకుండా హోల్డ్ చేయాలి. ఈ గేమ్‌లో తేజ ఓడిపోగా చివర్లో పృథ్వీ, రోహిణి మిగిలారు.పృథ్వీని ఓడించిన రోహిణినువ్వు పరిగెత్తగలవా? అంటూ హేళన చేసిన పృథ్వీపై రోహిణి విజయం సాధించి మెగా చీఫ్ అయినట్లు సమాచారం. ఇది తెలిసిన అభిమానులు దెబ్బ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ పరాభవాన్ని పృథ్వీ తట్టుకుంటాడా? తన ఇగో హర్ట్ అయిందా? అనేది ఎపిసోడ్లో చూడాలి! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
క్యారెక్టర్ తెలుస్తోందన్న విష్ణు.. తన బండారం బయటపెట్టిన రోహిణి
హౌస్‌లో చివరిసారి చీఫ్ అయ్యేందుకు యష్మి, తేజ, విష్ణుప్రియ, పృథ్వీ, రోహిణి బాగానే కష్టపడుతున్నారు. వీరికి బిగ్‌బాస్ నేడు ఆటోలో ప్రయాణం అనే టాస్క్ ఇచ్చాడు. ఈ ఆటోలో చివరి వరకు ఉన్నవారికి ఎక్కువ పాయింట్లు లభిస్తాయి. టాస్క్ మొదలైందో, లేదో.. రోహిణిని తోసేయ్ అని విష్ణు పృథ్వీకి ఆర్డర్ వేసింది. అయితే అందరికంటే ముందు తేజ అవుట్ అయ్యాడు. తర్వాత రోహిణిని తోసేశారు. అందర్నీ తోసేసిన ప్రేమపక్షులుమీ ముగ్గురిలో ఎవరు ఎవర్ని తోసుకుంటారో చూస్తానని రోహిణి సవాల్ చేసింది. ఏముంది? ప్రేమపక్షులిద్దరూ కలిసి యష్మి అడ్డు తొలగించారు. నిన్ను తోయకుండా సపోర్ట్ చేశానంటూ ఏడ్చేసింది. ఇది గేమ్, ఎమోషనల్ అవకు అని పృథ్వీ అనడంతో యష్మి.. గ్రాటిట్యూడ్ ఉంది, సపోర్ట్ చేస్తానని ఎందుకన్నావ్? అంటూ నిలదీసింది. నన్నెలా పుష్ చేశావో ఇప్పుడు తనను (విష్ణును) తోసేసి పాయింట్లు తీసుకో అని ఛాలెంజ్ చేసింది. అందుకు రోహిణి.. వాళ్లెందుకు ఆడతార్రా గేమ్ అంది.నోరు జారిన విష్ణుదాంతో విష్ణు.. ఇందాక నుంచి మాట్లాడుతున్నావు.. ఫస్ట్ నీది నువ్వు చూసుకో, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని నోరు జారింది. ఆ మాటతో రోహిణిలో కోపం కట్టలు తెంచుకుంది. ఫస్ట్ నిఖిల్‌కు ట్రై చేశా.. అవలేదు, తర్వాత పృథ్వీకి ట్రై చేశా అన్నావు.. ఎవరు ప్లాన్ చేస్తున్నారు? అంటూ విష్ణు బండారం బయటపెట్టింది.నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడుతన గుట్టు రట్టవడంతో బిత్తరపోయిన విష్ణు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడకంటూ కవర్ చేయడానికి ప్రయత్నించింది. అంతా అయ్యాక కూడా మళ్లీ రోహిణితో మాట్లాడటానికి వెళ్లింది. అక్కడ కూడా లేని పాయింట్లు చెప్పడంతో రోహిణి.. క్యారెక్టర్ గురించి ప్రస్తావించావు.. ఏం మాట్లాడుతున్నావో నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చింది. నేనేదీ క్రియేట్ చేయలేదు, నువ్వు చెప్పిందే అక్కడ మళ్లీ చెప్పాను అంటూ ఇచ్చిపడేసింది. చదవండి: Bigg Boss 8.. ఇన్నాళ్లు ఎలాగోలా మిస్... ఈసారి మాత్రం తప్పదేమో! -
నా ప్రయాణం ముగిసింది.. ఓట్లు వేయొద్దు: నిఖిల్
చేయని తప్పుకు నిందలు పడటం ఎవరికైనా కష్టమే! అవతలివారిపై నోరుజారకుండా ఆచితూచి మాట్లాడే నిఖిల్.. అమ్మాయిలను గేమ్ కోసం వాడుకుంటాడని సీత పెద్ద నిందేసి వెళ్లిపోయింది. ఆ మాటను నిఖిల్ జీర్ణించుకోలేకపోతున్నాడు. తాను అలాంటి వ్యక్తిని కాదని కెమెరాలకు గోడు వెల్లబోసుకున్నాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 20) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నిఖిల్‌కు సారీ చెప్పిన యష్మిఆడవాళ్లను ట్రాప్ చేస్తున్నావ్.. ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నావ్ అని సీత ఇచ్చిన స్టేట్మెంట్ విని ప్రేక్షకులే కాదు హౌస్మేట్స్ కూడా షాకయ్యారు. తనవల్లే అలాంటి నిందలు వచ్చాయంటూ నిఖిల్‌కు యష్మి సారీ చెప్పింది. నా వల్లే ఇదంతా మొదలైంది.. మన ఇద్దరి గేమ్ పాడవుతుందంటే మనం మాట్లాడకుండా ఉండటమే నయమని చెప్పుకొచ్చింది. తర్వాత ఒంటరిగా కూర్చున్న నిఖిల్ బిగ్‌బాస్‌కు తన గోడు చెప్పుకున్నాడు. నాకు ఓటు వేయకండి: నిఖిల్ఒకర్ని తొక్కి ఆడాలని ఎన్నడూ అనుకోలేదు. నామినేషన్స్‌లో సీత చెప్పినట్లు స్ట్రాంగ్ మహిళల్ని అడ్డుపెట్టుకుని గేమ్‌లో గెలవాలనుకోలేదు. మనసుకు ఏమనిపిస్తే అదే చేశాను. ఎవర్నీ తొక్కాలనుకోలేదు. ఈ వారం నామినేషన్లో ఉన్నాను, హౌస్ నుంచి వెళ్లిపోవాలనిపిస్తోంది. ఇక్కడ నా ప్రయాణం అయిపోయింది. దయచేసి ప్రేక్షకులు ఎవరూ నాకు ఓటు వేయకండి.. నన్ను ఎలిమినేట్ చేయండి అని కోరుకున్నాడు. వెళ్లిపోతా అన్నందుకు క్షమించండిమరికాసేపట్లోనే మనసు మార్చుకుని.. నేనేంటో నిరూపించుకున్నాకే బయటకు వస్తాను. వెళ్లిపోతా అన్నందుకు క్షమించండి. కప్పు తీసుకునే బయటకు వస్తా అని తనకు తాను ధైర్యం చెప్పుకుని కెమెరాలతో మాట్లాడాడు. తర్వాత హౌస్మేట్స్ అందరూ సమావేశమై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ప్రేరణ.. ఎవరినైనా బాధపెట్టుంటే క్షమించమని కోరుతూ ఏడ్చేసింది. అది నా వ్యక్తిత్వం కాదుయష్మి మాట్లాడుతూ.. నిఖిల్ గేమ్కోసం అమ్మాయిలను వాడుకోలేదు అని క్లారిటీ ఇచ్చింది. నిఖిల్ మాట్లాడుతూ.. నన్ను తప్పు అని నిందవేసినచోటే నేనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాను. ఒకర్ని వాడుకుని గేమ్ ఆడే వ్యక్తిత్వం నాది కాదు అని తెలిపాడు. అనంతరం తేజ నిద్రపోయినందుకు చీఫ్ అవినాష్ పనిష్మెంట్ ఇచ్చాడు. షర్ట్ తీసేసి స్విమ్మింగ్ పూల్‌లో 10 సార్లు దూకాలన్నాడు. ఈ టాస్క్ పూర్తి చేస్తే యష్మి.. తేజకు ముద్దుపెడతానంది. ముద్దు కోసం తేజ ఆశఆశతో పూల్‌లో పదిసార్లు మునకేసిన తేజను కళ్లుమూసుకోమని పక్కనే నిలబడింది యష్మి. తీరా నిఖిల్ వచ్చి తేజ చెంపపై ముద్దుపెట్టాడు. ఆ విషయం తెలియని తేజ కుప్పిగంతులు వేశాడు. నీకంత సినిమాలేదు, నీకు కిస్ పెట్టింది నిఖిల్ అని నబీల్ అసలు విషయం బయటపెట్టాడు. అనంతరం ఈ సీజన్‌కే ఆఖరి మెగా చీఫ్ పోస్టును ప్రకటించాడు బిగ్‌బాస్. సమయానుసారం ఒక్కొక్కరి పేరుతో టీషర్ట్స్ గార్డెన్ ఏరియాలో వేస్తుంటాడు. మెగా చీఫ్ ఎవరంటే?ఆ టీషర్ట్‌ను చించకుండా భద్రంగా కాపాడుకున్నవారు కంటెండర్లవుతారు. అలా ఈ గేమ్‌లో ప్రేరణ, గౌతమ్, అవినాష్, నబీల్ ఓడిపోగా.. పృథ్వీ, తేజ, యష్మి, విష్ణుప్రియ కంటెండర్లయ్యారు. చివర్లో నిఖిల్, రోహిణి మాత్రమే మిగలగా.. వీరిలో ఎవరు కంటెండర్ అవ్వాలనేది హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. అంతటితో ఎపిసోడ్ ముగిసింది. అయితే రోహిణిని కంటెండర్ చేయగా చివరకు ఆవిడే మెగా చీఫ్ అయినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ల టార్గెట్.. ట్రోఫీకి మరింత దగ్గరైన నిఖిల్
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్ చేయిద్దాం అని బిగ్‌బాస్‌కు ఏ ముహూర్తాన అనిపించిందో కానీ ఇది ఒకరకంగా నిఖిల్‌కు ప్లస్సే అయింది. వచ్చినవాళ్లంతా.. నిఖిల్ ఆట గురించి కాకుండా పర్సనల్ టార్గెట్ చేశారు. సింహంలా ఉండే నిఖిల్‌ను పిల్లిలా మార్చి తనవైపు తిప్పుకున్న సోనియా కూడా అతడిని తప్పుపట్టింది.క్లారిటీ ఇవ్వకపోవడం తప్పే!యష్మి విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం తప్పని కుండ బద్ధలు కొట్టింది. సీత అయితే మరో అడుగు ముందుకేసి స్ట్రాంగ్‌గా ఉండే ఆడవారిని టార్గెట్ చేస్తున్నావని, వారిని గేమ్ కోసం వాడుకుంటున్నావంటూ నిందలేసింది. ఇది మరీ విడ్డూరం.. నిఖిల్‌తో డ్యాన్స్ చేయాలనుంది, నిఖిల్‌తో ఓ కలగన్నాను అంటూ యష్మినే అతడి వెంట పడింది. కనీసం ఫ్రెండ్‌లా అయినా ఉండమని అర్థించింది. అటు సీత కూడా నిఖిల్‌పై ఇష్టం చూపించింది. జీవితంలో క్షమించనన్న నిఖిల్వీరిని పెద్దగా పట్టించుకోని నిఖిల్.. మీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని ముక్కుసూటిగా చెప్పలేకపోయాడు. అదే అతడికి పెద్ద మైనస్ అయింది. అయితే యష్మితో కొన్ని సందర్భాల్లో ఫీలింగ్స్ పెట్టుకోవద్దన్నట్లు ఛూఛాయగా చెప్పినప్పటికీ అదంత హైలైట్ అవలేదు. ఫలితంగా 12వ వారం నామినేషన్స్‌లో సీత.. ఆడవారి ఎమోషన్స్‌తో ఆడుకుంటావ్ అని నిందేయడంతో నిఖిల్ చాలా హర్టయ్యాడు. ఆమెను జీవితంలో క్షమించనన్నాడు. ఆ బాధతో భోజనం కూడా తినకుండా నిద్రపోయాడు.నిఖిల్‌కు సింపతీబిగ్బాస్ హౌస్‌లో ఎవరినైనా టార్గెట్ చేస్తే ప్రేక్షకులు అస్సలు ఊరుకోరు. అతడిపై చాలా సింపథీ చూపిస్తారు.. అదీ ఓట్ల రూపంలో! ఈ నామినేషన్ ప్రక్రియతో నిఖిల్‌పై జనాల్లో సింపథీ వచ్చింది. పైగా నటి కావ్యతో ప్రేమస్టోరీ చెప్తూ.. తమ మధ్య దూరం వచ్చింది, కానీ ఈ జీవితానికి తనే భార్య అని ఏడ్చేయడంతో జనాలు తెగ కనెక్ట్ అయిపోయారు. నిఖిల్ ప్రేమ సఫలం కావాలని కోరుకున్నారు. అలా ఈ వారం నిఖిల్‌కు నెగెటివిటీ కంటే సింపథీయే ఎక్కువ వచ్చింది. దీంతో విన్నింగ్ రేస్‌లో గౌతమ్‌ను వెనక్కు నెట్టి మరీ ముందుకు దూసుకొచ్చేశాడు. మరి తర్వాతి వారాల్లో వీరిద్దరి గేమ్ ఎలా ఉంటుందో చూడాలి!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుతో యష్మి గొడవ.. చివరిసారి చీఫ్ అయిందెవరంటే?
బిగ్‌బాస్ ప్రతి సీజన్లో కెప్టెన్ అనే పదవి ఉండేది. ఈ పదవి పొందినవారు ఆ వారం నామినేషన్స్‌లోకి అడుగుపెట్టరు. అయితే ఈ సీజన్లో కెప్టెన్ పోస్టు ఉండదన్నాడు బిగ్‌బాస్.. కానీ అంతలో చీఫ్ అనే కొత్త పదవిని తీసుకొచ్చాడు. అయితే దీని ఉద్దేశం కూడా అదే! చీఫ్ అయినవారు ఆ వారం నామినేషన్స్‌లో ఉండరు. చివరి ఇమ్యూనిటీ ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవారిలో నిఖిల్, యష్మి, ప్రేరణ, అవినాష్, విష్ణుప్రియ, గౌతమ్, నబీల్ అంతా కూడా ఒకసారి చీఫ్ అయినవాళ్లే! తేజ, రోహిణి, పృథ్వీలకే ఇంతవరకు ఆ అవకాశం దక్కలేదు. ఇకపోతే బిగ్‌బాస్ తాజాగా హౌస్‌లో చీఫ్ పదవి కోసం పోటీపెట్టాడు. అయితే ఇది ఈ సీజన్లోనే చివరి చీఫ్ పోస్ట్ అని ప్రకటించాడు. దాంతో ఎలాగైనా దాన్ని గెలిచి ఒక్క వారమైనా ఇమ్యూనిటీ అందుకోవాలని కంటెస్టెంట్లు తెగ తహతహలాడారు.చీఫ్‌గా రోహిణి!బిగ్‌బాస్ సమయానుసారం టీషర్టు విసిరేస్తుంటాడు. తమ టీషర్ట్‌ను ఎవరైతే కాపాడుకుని బొమ్మకు తగిలిస్తారో వారే విజేతలుగా నిలుస్తారన్నాడు. ఈ గేమ్‌లో యష్మి, విష్ణుకు గొడవైనట్లు తెలుస్తోంది. యష్మి, రోహిణి, పృథ్వీ, విష్ణు, తేజ గెలిచి కంటెండర్లుగా నిలిచారు. హౌస్మేట్స్ మద్దతుతో రోహిణి చీఫ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వారం ఎలాగో నామినేషన్స్‌లో లేదు, వచ్చేవారం చీఫ్ పోస్టుతో మరోసారి సేవ్ అయిపోయింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అందరి టార్గెట్ కన్నడ బ్యాచ్.. నామినేషన్స్‌లో ఎవరెవరు?
బిగ్‌బాస్ 12వ వారం విచిత్రమైన పద్ధతిలో నామినేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఎలిమినేట్ అయినవాళ్లు హౌసులోకి వచ్చి ఈ వారం ఎవరెవరు నామినేట్ అవ్వాలనేది డిసైడ్ చేశారు. సోమవారం కొంతవరకు జరగ్గా.. మంగళవారం కూడా ఇదే కొనసాగింది. మణికంఠ, నైనిక, ఆదిత్య ఓం, కిర్రాక్ సీత వచ్చారు. తన పాయింట్లు చెప్పి రఫ్ఫాడించేశారు. ఇంతకీ బిగ్‌బాస్‌లో మంగళవారం(79వ రోజు) ఎపిసోడ్లో ఏమేం జరిగిందనేది చూద్దాం.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్‌గా అడుగుపెట్టిన శోభా శెట్టి)తొలుత హౌసులోకి వచ్చిన నైనిక.. నిఖిల్‌ని పలకరించి హగ్గు ఇచ్చింది. ఎక్కువగా ఆలోచించి బాధపడకు అని చెప్పింది. ఇక తన మొదటి నామినేషన్ నబీల్ పేరు చెప్పింది. 'నువ్వు వచ్చినప్పుడు ఏం చెప్పావ్ నబీల్.. షేర్ (సింహం) అన్నావ్ కదా! మరి అది ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయింది. గత కొన్నివారాలుగా నువ్వు కనిపించట్లేదు' అని అడిగింది. దీనికి సమాధానంగా.. నేను వచ్చిందే ఆ కప్పు కోసం.. ఖచ్చితంగా దాని కోసమే ఆడతా.. నేను ఎవరి గురించి వెనకాల మాట్లాడలే అని నబీల్ తనని తాను డిఫెండ్ చేసుకున్నాడు.నైనిక తన రెండో నామినేషన్ యష్మీకి వేసింది. ఒకప్పుడు యష్మీ ఇప్పుడు కనిపించట్లేదని, ఎప్పుడైతే నిఖిల్ వెంటపడటం మొదలుపెట్టావో అప్పటినుంచి యష్మీ మిస్ అయిపోయిందని చెప్పింది. దీనికి ఆన్సర్ ఇచ్చిన యష్మీ.. నేనెందుకు ఇలా అయిపోయానో నాకు అర్థం కావడం లేదు.. నేను బాగానే ఆడుతున్నా అంటూ యష్మీ ఏడ్చింది. ముందు యష్మీని తీసుకొస్తా.. కప్పు కొట్టడానికి ట్రై చేస్తానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: క్షమించమంటూ నిఖిల్ ఏడుపు.. అది చూసి మోసపోవద్దన్న కావ్య!)తర్వాత వచ్చిన మణికంఠ.. నిఖిల్‌ని నామినేట్ చేశాడు. నేను వెళ్లేటప్పుడే నీ గ్రాఫ్ పడిపోతుందని నీకు చెప్పా. కానీ నీకెలా తెలుసు అని నువ్వు అడిగావ్.. ఇప్పుడు నేనే చూసి వచ్చా అందుకే చెబుతున్నా.. నీ గ్రాఫ్ పడిపోయింది, నువ్వు ఇక్కడికి కనెక్షన్స్ పెట్టుకోవడానికి వచ్చావా? కప్పు కోసం వచ్చావా అనే క్లారిటీ నీకు లేకపోతే టైటిల్ గెలవడం చాలా కష్టం నిఖిల్ అని అన్నాడు. దీనికి నిఖిల్ వైపు నుంచి పెద్దగా సమాధానం ఏం రాలేదు. సైలెంట్‌గా ఉండిపోయాడు.రెండో నామినేషన్ నబీల్‌కి వేసిన మణికంఠ పెద్ద మోటివేషన్ ఇచ్చాడు. నాలుగు వారాలుగా నువ్వు నామినేషన్స్ నుంచి తప్పించుకుంటున్నావ్. త్యాగాలు చేస్తున్నావ్. సైలెంట్ అయిపోయావ్. ఇవన్నీ ఎందుకు. నిన్ను ఇష్టపడే వాళ్లు నీ గేమ్ చూడాలనుంకుంటారు.. నీ త్యాగాలు కాదు అని అన్నాడు. దీంతో ఇకపై నా ఆట చూపిస్తా అని నబీల్ సవాల్ చేశాడు.(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్‌కి విడాకులు ఇచ్చేసిన భార్య)అనంతరం హౌసులోకి వచ్చిన సీత.. విష్ణుప్రియని సూపర్ ఆడుతున్నావ్ అని మెచ్చుకుంది. ప్రేరణని నామినేట్ చేసింది. నువ్వు చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్. డిక్టేటర్లా బిహేవ్ చేశావ్. ఇదే విషయం నీ భర్త కూడా చెప్పారు. ఆయన చెప్పి వెళ్లిన కాసేపటికే కిచెన్ దగ్గర తేజతో దోస గురించి గొడవపడ్డావ్. నువ్వు చిరాకుగా మాట్లాడే మాటలు గుచ్చుకుంటున్నాయ్ అని చెప్పుకొచ్చింది. నేను వాటిని మార్చుకుంటానని ప్రేరణ చెప్పింది. సీత తన నెక్స్ట్ నామినేషన్ యష్మీకి వేసింది. నువ్వు నిఖిల్ వెంట పడటం మొదలుపెట్టిన తర్వాతి నుంచి నీ గేమ్ పోయింది. నిఖిల్ ఉంటేనే నువ్వు కనపడుతున్నావ్ అని గట్టిగానే క్లాస్ పీకింది.తర్వాత వచ్చిన ఆదిత్య ఓం.. కర్మ ఈజ్ బ్యాక్ అనే డైలాగ్‌తో హౌసులోకి వెళ్లాడు. యష్మిని మొదటగా నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా కన్నడ బ్యాచ్ గ్రూప్ గేమ్ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. మీరు ముందే ఫిక్సయి లోపలికి వచ్చినట్లున్నారు. ఎందుకంటే ప్రేరణ, నిఖిల్, పృథ్వీలను మీరు ఇప్పటివరకూ నామినేట్ చేయలేదు. వేరే వాళ్లని టార్గెట్ చేస్తున్నారు. వాళ్లు పెద్ద తప్పులు చేసినాసరే మీరు వదిలేస్తున్నారు. పక్షపాతంగా ఉంటున్నారు. ఫేవరిటిజం చూపిస్తున్నారు. న్యూట్రల్‌గా ఉన్నట్లు నటిస్తున్నారు. ఇది 12వ వారం అండి.. ఇంకెన్ని వారాలు చేస్తారని తన అసహనాన్ని వ్యక్తపరిచాడు.(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)ఆదిత్య మాటలపై స్పందించిన యష్మీ.. గ్రూప్ గేమ్ ఆడితే నా గేమ్ స్పాయిల్ అవుతుందని నాకు క్లారిటీ ఉందని చెప్పింది. గ్రూపిజం గురించి ఆదిత్యతో యష్మి కాస్త వాదన పెట్టుకుంది. కానీ చివరకు తను కొన్ని గేమ్స్‌లో ఫేవరెటిజం చూపించానని ఒప్పుకొంది. తర్వాత ప్రేరణని ఆదిత్య నామినేట్ చేశాడు. ఈమె కూడా గ్రూప్ గేమ్ ఆడుతోందనే కారణమే చెప్పాడు. దీంతో యష్మీని మీరు 12 వారాల్లో ఒక్కసారి కూడా ఎందుకు నామినేట్ చేయలేదు? అని ఆదిత్య అడిగాడు. అంతకంటే ఎక్కువ తప్పులు వేరే చోట కనిపించాయ్ అని ప్రేరణ అనేసరికి.. అవును మీకు నబీల్లో, నాలో, విష్ణుప్రియలో కనిపించాయ్, ప్రతిసారి మీకు మేమే కనిపిస్తామా? బయట జనాలు ఎలా నమ్ముతారు అని అడిగేసరికి ప్రేరణ సైలెంట్ అయిపోయింది.అలా ఈసారి నామినేషన్స్ కాస్త వెరైటీగా జరిగింది. కాకపోతే కన్నడ బ్యాచ్ ఫుల్ టార్గెట్ అయింది. ఇన్నాళ్లు గ్రూప్ గేమ్ ఆడుతూ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు కానీ ఈసారి మాత్రం వీళ్లు నలుగురిపై కత్తి వేలాడుతోంది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్ పూర్తయ్యేసరికి లిస్ట్‌లో యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, నబీల్ చేరారు.(ఇదీ చదవండి: నటి కస్తూరిపై మరిన్ని కేసులు) -
గ్రూప్ గేమ్ ఆడినోళ్లను మడతెట్టేశారు.. గౌతమ్‌పై ప్రేరణ కుళ్లు
బిగ్‌బాస్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చి వారితో నామినేషన్స్ వేయించాడు. వచ్చిన ప్రతిఒక్కరూ నిఖిల్ గ్యాంగ్పైనే విరుచుకుపడ్డారు. మరి ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి (నవంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..గౌతమ్‌పై ప్రేరణ కుళ్లుగత వారం అవినాష్, తేజ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే వీరికి బదులు గౌతమ్ ఉండాల్సిందని ప్రేరణ అభిప్రాయపడింది. వచ్చినవారమే గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సింది.. ఇప్పుడు ఏకంగా స్ట్రాంగ్ ప్లేయర్ అయి కూర్చున్నాడు. అదెలాగో నాకర్థం కావట్లేదు. ఈ వారం గౌతమ్, విష్ణుప్రియ, యష్మిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనుకున్నాను. అంతా రివర్స్‌లో జరుగుతోంది అని నబీల్‌తో ముచ్చట్లు పెట్టింది.వచ్చావా అక్క..తర్వాత బిగ్‌బాస్ ఆసక్తికర ఘట్టానికి తెరదీశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి ఇద్దర్ని నామినేట్ చేస్తారన్నాడు. మొదటగా సోనియా.. ప్రేరణను నామినేట్ చేసింది. వచ్చావా అక్క అని ప్రేరణ అనడంతో గొడవ పీక్స్‌కు వెళ్లింది. నాకు అక్క కాదు, నిఖిల్‌కు అక్కవి అని ప్రేరణ సంజాయిషీ ఇవ్వడంతో సోనియాకు మరింత తిక్క రేగింది. అతడికి అక్కను అని నువ్వెలా డిసైడ్ చేస్తావు? అంటూ గట్టిగా నిలదీసింది. అందుకు బదులుగా దాదాపు మూడునాలుగుసార్లు ప్రేరణతో సారీ చెప్పించుకుంది.తేజది తప్పయినప్పుడు యష్మిది కూడా తప్పేగా?అనంతరం నా పెద్ద కొడుకు నిఖిల్‌ను నామినేట్ చేస్తున్నా అంటూ నైస్‌గా మొదలుపెట్టి వైల్డ్‌గా మారిపోయింది. అప్పట్లో పృథ్వీని చిన్న కారణంతో నామినేట్ చేశావు. ఎప్పుడైనా కరెక్ట్ కారణంతో ఎవర్నైనా నామినేట్ చేశావా? యష్మి, ప్రేరణను ఎందుకు నామినేట్ చేయలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎవిక్షన్ షీల్డ్గేమ్లో తేజ ముందుగా ఎగ్ వేశాడని అతడిని వరస్ట్ కంటెస్టెంట్ అన్నావు.. మరి తేజ ఎగ్ వేసేవరకు ఆగి కావాలని యష్మి మరో గుడ్డు వేసింది. ఆమె చేసింది తప్పని ఎందుకు ఒప్పుకోవట్లేదు అని నిలదీసింది.ఆమె ముందు మాట్లాడు.. నిఖిల్‌కు సలహాఅతడి లవ్‌ట్రాక్ గురించి మాట్లాడుతూ.. యష్మి నీపై ఫీలింగ్స్ చూపించింది.. ఒక మహిళకు గౌరవమిచ్చేవాడివే అయితే.. ఆమె రిలేషన్షిప్ కోసం హౌస్‌కు రాలేదు, ఆమె ఏం చేస్తే అది పడటానికి రాలేదు అని తన వెనకాల మాట్లాడాల్సిన అవసరం లేదు. అవన్నీ తన ముందే చెప్పాలని గద్దించింది. తన మీద ఇష్టం లేనప్పుడు ఆమె జోలికి వెళ్లకూడదు అని తేల్చేసింది.ఏడ్చేసిన యష్మిసోనియా మాటలతో యష్మి కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు క్లారిటీగా చెప్పుంటే నీ జోలికే వచ్చేదాన్ని కాదని నిఖిల్‌పై మండిపడింది. నిఖిల్‌తో ఒక కలగన్నానే తప్ప తనపై నాకు పెద్ద ఫీలింగ్సే లేవని ప్లేటు తిప్పేసింది యష్మి. చివరగా సోనియా.. నువ్వు నీలా ఉండు నిఖిల్, నువ్వు గెలిస్తే సంతోషపడే మొదటి వ్యక్తిని నేనే అంటూ అతడి తలపై గాజు బాటిల్ పగలగొట్టింది.బేబక్కపై సెటైర్లుతర్వాత బేబక్క హౌస్‌లోకి వచ్చి అవతలివాళ్లను తక్కువ చేయడం నచ్చలేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. దీంతో అతడు.. ప్రేక్షకులు మాకు ఓట్లు వేసి ఇక్కడిదాకా ఉంచారు. మీకు ఓట్లు వేయకుండా ఎలిమినేట్ చేశారంటూ సెటైర్లు వేశాడు. చీఫ్‌గా ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేయలేదంటూ బేబక్క.. నిఖిల్‌ను నామినేట్ చేసింది.గ్రూప్ గేమ్ మానేస్తే బెటర్అనంతరం శేఖర్ బాషా హౌస్‌లో అడుగుపెట్టాడు. ప్రేరణలో చిన్నపిల్లల మనస్తత్వం ఎంతో నచ్చేవి. కానీ రానురానూ రూడ్‌గా మారిపోయింది.. కొందర్ని పురుగుల్ని చూసినట్లు చూస్తోందంటూ ఆమెను నామినేట్ చేశాడు. గ్రూప్ గేమ్ మానేస్తే బెటర్ అని సలహా ఇచ్చాడు. యష్మిని సైతం గ్రూపిజం కనిపిస్తోందంటూ నామినేట్ చేశాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గ్రూప్ గేమ్ బండారం బయటపెట్టిన బాషా.. నిఖిల్‌కు పెద్ద మైనస్
నిఖిల్ అంటే ఇష్టమని అతడి వెంట తిరిగింది యష్మి. తనకు అలాంటి ఫీలింగ్స్ లేవని నిఖిల్ క్లియర్‌గా చెప్పకుండా చెప్పీచెప్పినట్లు చెప్పి తప్పించుకున్నాడు. పైగా యష్మి.. గౌతమ్ షర్ట్ వేసుకున్నప్పుడు అలగడం, వేరే ఎవరితోనైనా డ్యాన్స్ వేస్తే కుళ్లుకోవడం, తనను హత్తుకుని ముద్దుపెట్టడం వంటివి చూసినప్పుడు నిఖిల్‌కు కూడా ఆమె అంటే ఇష్టముందేమో అన్న సంకేతాలు కనిపించాయి.ముసుగులో గుద్దులాటఈ ముసుగులో గుద్దులాట దేనికి? అసలు నీ అభిప్రాయమేంటి? అని నిఖిల్‌ను ముఖం పట్టుకుని అడిగేసింది సోనియా. అందుకతడు ఆ మ్యాటర్‌ను ఎప్పుడో కట్ చేశానని, యష్మిపై తనకలాంటి ఉద్దేశమే లేదన్నాడు. అయితే యష్మి మాత్రం అది అబద్ధమని, తనకు ఏదీ క్లారిటీగా చెప్పలేదని వాదించింది. దీంతో నిఖిల్‌కు ఈ ఎపిసోడ్ కొంత మైనస్‌గా మారేట్లు కనిపిస్తోంది.పురుగుల్ని చూసినట్లు చూస్తావుఇక బేబక్క.. మనుషుల్ని చాలా తక్కువ చేసి చూస్తుంటావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. ఆర్జే శేఖర్ బాషా.. ప్రేరణను నామినేట్ చేస్తూ అదిరిపోయే పాయింట్లు చెప్పాడు. అవతలివారిని కించపరిచేట్లుగా మాట్లాడతావ్.. కొన్నిసార్లు కొందర్ని పురుగుల్ని చూసినట్లు చూస్తావు.. పానీపట్టు టాస్క్‌లో నిఖిల్ నిన్ను, యష్మిని రఫ్‌గా హ్యాండిల్ చేశాడు. ఆ పాయింట్‌తో నువ్వు నిఖిల్‌ను నామినేట్ చేయొచ్చు. కానీ అది వదిలేసి నీ టీమ్ మెంబర్ అయిన గౌతమ్‌ను ఎందుకు నామినేట్ చేశావు? అని ప్రశ్నించాడు.నిఖిల్‌కు లేని బాధ నీకెందుకు?అటు యష్మిని సైతం నామినేట్ చేస్తూ.. అవినాష్.. రోహిణిని సేవ్ చేసి నిఖిల్‌ను నామినేట్ చేశాడు. అక్కడ నిఖిలే లైట్ తీసుకున్నాడు, కానీ నువ్వెందుకు బాధపడ్డావు? మీ ముగ్గురూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని జనాలకు తెలిసిపోయింది అంటూ యష్మిని నామినేట్ చేశాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అగ్గి రాజేసిన సోనియా.. నిఖిల్ వల్ల బ్యాడ్ అయ్యానన్న యష్మి
ఈసారి నామినేషన్స్ ప్రక్రియను బిగ్‌బాస్ వెరైటీగా ప్లాన్ చేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను హౌస్‌లోకి రప్పించి.. ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు. అలా మొదటగా సోనియా ఆకుల హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే నిఖిల్ బ్యాచులో పుల్లలు పెట్టింది. పృథ్వీని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నావ్ అంటూ ప్రేరణను నామినేట్ చేసింది.సిల్లీ రీజన్స్‌తో నామినేషన్ఇక నిఖిల్‌ను అయితే ఓ ఆటాడేసుకుంది. మొదట్లో పృథ్వీని ఎందుకు నామినేట్ చేశావ్? అని అడిగింది. అందుకతడు నిర్లక్ష్యంగా ఉన్నందుకు చేశానన్నాడు. అది విని అవాక్కైన పృథ్వీ.. ఆ కారణంతో నామినేట్ చేశావా? అని నోరెళ్లబెట్టాడు. మంచి పాయింట్లతో ఎప్పుడైనా నామినేట్ చేశావా? అని నిఖిల్‌ను నిలదీసింది. ఇక యష్మితో లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ.. యష్మి తన మనసులో ఫీలింగ్ చెప్పింది.. కానీ నువ్వు అంటూ సోనియా మాట్లాడుతుండగా.. మధ్యలో నిఖిల్ అందుకున్నాడు. నిఖిల్ జోలికే వెళ్లేదాన్ని కాదుతన ఫీలింగ్ చెప్పగానే అక్కడే కట్ చేసేశాను అని క్లారిటీ ఇచ్చాడు. అది అబద్ధమని యష్మి గట్టిగా అరిచింది. క్లారిటీగా తనకు చెప్పుంటే నిఖిల్ జోలికే వెళ్లేదాన్ని కాదంది. అతడి వల్ల తాను బ్యాడ్ అయ్యానంది. అలా సోనియా నిఖిల్ నెత్తిపై బాటిల్ పగలగొట్టి నామినేట్ చేసింది. మరి హౌస్‌లోకి ఇంకా ఎవరెవరు వచ్చారు? ఎవర్ని నామినేట్ చేశారు? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మి సీక్రెట్ ఖరీదు రూ.3 లక్షలు.. ఆరు దాటిందంటే పెగ్గు..
కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు కూడా వచ్చేస్తున్నారు. అలా యష్మి కోసం ఆమె సోదరితో పాటు శ్రీసత్య వచ్చారు. వచ్చీరావడంతోనే యష్మి నోటితోనే సీక్రెట్ బయటపెట్టించారు. సాయంత్రం ఆరుగంటల తర్వాత యష్మి ఏం చేస్తుందో మీకు తెలియదు సర్ అని హోస్ట్ నాగార్జునతో అన్నారు.సాయంత్రం ఆరు దాటితే..ఆ సీక్రెట్ ఏంటో బయటపెడితే ప్రైజ్‌మనీకి మరో రూ.3 లక్షలు యాడ్ చేస్తానని నాగ్ బంపరాఫర్ ఇచ్చాడు. దీంతో యష్మి క్షణం ఆలోచించకుండా మావా.. ఏక్ పెగ్‌లా.. అంటూ తను మద్యం తాగుతానన్న రహస్యాన్ని బయటపెట్టింది.. ఒక్క పెగ్ కాస్ట్ మూడు లక్షలా? అని అవినాష్ ఆశ్చర్యపోయాడు. శ్రీసత్య వెళ్లిపోయేముందు తనకు పాత యష్మి కావాలని అడిగింది.అవినాష్ కోసం కోన వెంకట్బిగ్బాస్కు వీరాభిమాని అయిన కోన వెంకట్ అవినాష్ కోసం వచ్చేశాడు. తన సినిమా టైటిల్స్‌ను హౌస్‌మేట్స్‌కు అంకితమిచ్చాడు. అలా పృథ్వీకి 'బలుపు', యష్మికి 'దేనికైనా రెడీ' అన్న టైటిల్స్ ఇచ్చాడు. అమర్దీప్.. వస్తే కప్పుతోనే రావాలని నిఖిల్‌కు బూస్ట్ ఇచ్చాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాకు నువ్వు కావాలి, అవసరమైతే లేపుకెళ్లిపోతా: నిఖిల్
హౌస్మేట్స్ తమ మొదటి ప్రేమకథ చెప్పాలన్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో ఫస్ట్ లవ్‌స్టోరీ చెప్తూ కొందరు సిగ్గుపడితే మరికొందరు ఎమోషనలయ్యారు. ముందుగా యష్మి మాట్లాడుతూ.. నేను టీవీ యాంకర్‌గా ట్రై చేసినప్పుడు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మొదట ఫ్రెండయ్యాడు.. తర్వాత ప్రేమించుకున్నాం. కానీ ఒకానొక సమయంలో నాకు ఫ్యామిలీనే ముఖ్యమనిపించింది. అప్పుడు మా మధ్య కూడా విభేదాలు వచ్చాయి. ఒప్పుకోలేకపోతున్నా..ప్రేమ మీద నమ్మకం పోయింది. మా నాన్న తప్ప ఇంకెవరూ వద్దనుకున్నాను. కానీ ఈరోజుకూ ఆయన నాకోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకో ఆయన్ను ఒప్పుకోలేకపోతున్నాను. కానీ ఈరోజుకూ నన్ను గైడ్ చేస్తూ ఫ్రెండ్‌గా ఉన్నాడు. మరో జన్మంటూ ఉంటే అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను.. అని యష్మి భావోద్వేగానికి లోనైంది.బాగోలేనని బ్రేకప్: తేజతేజ మాట్లాడుతూ.. నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నాం. ఓసారి ఇంటికెళ్లి రాగానే బ్రేకప్ చెప్పింది. తన పక్కన నేను బాగోలేనని వాళ్ల పేరెంట్స్ వద్దన్నారట! ఆమె పెళ్లికి కూడా వెళ్లాను. ఓసారి ఆమె సడన్‌గా కాల్ చేసి సారీ అంటూ ఏడ్చేసింది. నా లైఫ్‌లోకి వచ్చే అమ్మాయికి ఒకటే చెప్తున్నా.. మా అమ్మను ఎంత ప్రేమగా చూసుకుంటానో, తనను కూడా అంతే ప్రేమగా చూసుకుంటా అని బిగ్‌బాస్ షో సాక్షిగా మాటిచ్చాడు.పృథ్వీ లవ్ స్టోరీపృథ్వీ.. నేను, నా బెస్ట్ ఫ్రెండ్ ఒకే అమ్మాయిని ప్రేమించాం. ఇద్దరం ట్రై చేసుకుందాం, ఎవరికి పడితే వాళ్లకే ఆ అమ్మాయి సొంతం అని డీల్ మాట్లాడుకున్నాం. ఓసారి ఆమె దగ్గరకు వెళ్లి ఐ లవ్యూ చెప్తే నీ పేరేంటి? అని అడిగింది. కాలేజీలో నా పేరు అందరికీ తెలుసు.. అలాంటిది ఆమె నా పేరు అడిగేసరికి ఇన్సల్ట్ అనిపించింది. తర్వాత ఆమె నా ఫ్రెండ్స్ దగ్గర నెంబర్ తీసుకుని నాకు మెసేజ్‌లు చేసింది.మోసం చేశాడు: రోహిణిఓరోజు ప్రపోజ్ కూడా చేసింది. అంతా బాగానే సాగింది. త్వరగా పెళ్లి చేసుకుందామంది. నా కెరీర్ నాకు ముఖ్యం, పెళ్లికి సమయం పడుతుందని చెప్పేసరికి ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం అని తెలిపాడు. రోహిణి.. డైమండ్ రింగ్‌తో నాకు బాగా దగ్గరైన స్నేహితుడికి ప్రపోజ్ చేశాను. ఆర్థిక ఇబ్బందులున్నాయి. అవి క్లియర్ అయ్యాకే పెళ్లి చేసుకుందామన్నాడు. సరేనన్నాను. కట్ చేస్తే వేరే అమ్మాయితో రెండేళ్లుగా రిలేషన్లో ఉన్నాడు. అది నా దగ్గర దాచాడు. తర్వాత సిల్లీగా బ్రేకప్ చెప్పాడు అంటూ ఎమోషనలైంది.నా భార్య అని ఫిక్సయ్యా: నిఖిల్నిఖిల్ వంతు రాగా.. తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టినప్పుడే ఈ అమ్మాయి నా సొంతం అనిపించింది. అన్ని ప్రేమకథల్ని మరిపించేలా చేసింది. మాది ఆరేళ్ల రిలేషన్.. తను నా భార్య అని ఫిక్సయిపోయాను. కానీ ఫ్యామిలీ వల్ల మా మధ్య దూరం వచ్చింది. ఈ జన్మకు సరిపోయేటన్ని జ్ఞాపకాలనిచ్చింది. తిట్టు, కొట్టు..కోపంలో విడిపోయాం.. కానీ నా వల్ల కావట్లేదు. కచ్చితంగా తన దగ్గరకు వెళ్తా.. తిట్టు, కొట్టు, నువ్వు మళ్లీ ఒప్పుకునేవరకు నీ వెంటపడ్తాను. నాకు పిచ్చి లేసిందంటే మాత్రం లేపుకెళ్తాను. బిగ్‌బాస్ షో అయిపోగానే నీ కళ్ల ముందుంటాను. బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా క్షమించి దగ్గరకు తీసుకుంటుందో నువ్వూ అలాగే దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు నువ్వు కావాలి అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్‌కు హింట్లిస్తూనే హెచ్చరించిన తల్లి.. గౌతమ్ జోలికి మాత్రం..!
ఫ్యామిలీ వీక్ అంటేనే సంతోషం, దుఃఖం రెండూ కలగలసి ఉంటాయి. అయితే అవినాష్ మాత్రం దుఃఖాన్ని దాచేస్తూ సంతోషాన్ని పంచేందుకే ప్రయత్నించాడు. అటు నిఖిల్ తల్లి.. ఏమాత్రం సంకోచించకుండా చెప్పాల్సిన హింట్లన్నీ చెప్పేసింది. అవేంటో నేటి (నవంబర్ 13) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..యష్మికి హింట్ ఇచ్చిన తండ్రితండ్రిని చూడగానే యష్మి.. పప్పా అంటూ సంతోషంతో ఏడ్చింది. కూతుర్ని ఓదార్చిన ఆయన అందరితోనూ కలివిడిగా మాట్లాడారు. తర్వాత కూతురికి అవసరమైనన్ని హింట్లు ఇచ్చాడు. 'నువ్వు నీకోసమే ఆడాలి.. ఇండివిడ్యువల్ గేమ్ ఆడు.. టాస్కులు ఆడకుండా ఊరికే కూర్చుంటే నీపై బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. నువ్వు మనసులో అనుకుంది అందరికీ చెప్పేయకు.. నువ్వు చేయాలనుకుంది నేరుగా చేసేయు. కూతురి తరపున సారీఇన్నివారాలున్నావ్.. నిన్ను స్టేజీపై చూడాలనుంది. నీకోసమే ఆడితే కప్పు గెలుస్తావు.. నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకు అని చెప్పాడు. గారాలపట్టికి గోరుముద్దలు కూడా తినిపించాడు. నాన్నతో యష్మి డ్యాన్స్ చేస్తుంటే.. నబీల్‌కు తండ్రి గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. యష్మి తండ్రి ఆడిన గేమ్‌లో వచ్చిన రూ.21 వేలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. వెళ్లిపోయేముందు.. నా కూతురు ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే.. దయచేసి ఎవరూ ఏమనుకోవద్దు అంటూ కూతురి తరపున క్షమాపణలు చెప్పి ఓ మెట్టు పైకి ఎక్కేశాడు. .కుమిలిపోతున్న తేజఆయన వెళ్లిపోతుంటే యష్మితో పాటు తేజ కూడా ఏడ్చేశాడు. అందరి పేరెంట్స్ వచ్చినప్పుడల్లా కుమిలి కుమిలి ఏడుస్తున్న తేజను ఎలా ఓదార్చాలో హౌస్‌మేట్స్‌కు అర్థం కాలేదు. అతడి బాధను చూడలేకపోయిన గౌతమ్.. తన ఫ్యామిలీకి బదులుగా తేజ పేరెంట్స్‌ను పంపించమని బిగ్‌బాస్‌ను అభ్యర్థించాడు. అనంతరం నిఖిల్ తల్లి హౌస్‌లో అడుగుపెట్టింది. ఏయే కారణాల వల్ల నిఖిల్ గ్రాఫ్ పడిపోతుందో.. అవన్నీ పూసగుచ్చినట్లు చెప్పి మార్చుకోమని సూచించింది. నిఖిల్‌ను జాగ్రత్తపడమన్న తల్లిగ్రూప్ గేమ్ ఆడకు, ఇకపై ఇండివిడ్యువల్‌గానే ఆడు. నెల రోజులు మాత్రమే ఉంది. G (గౌతమ్)తో ఎక్కువగా ఫైట్, డిఫెన్స్‌కు వెళ్లొద్దు, నామినేషన్ దాకా అసలే వెళ్లొద్దు అని హింట్లు ఇచ్చింది. తప్పు చేస్తేనే నామినేట్ చేస్తున్నా అని నిఖిల్ సంజాయిషీ ఇవ్వగా.. నీతో జరిగిన దానికే మాత్రమే నామినేట్ చేయు, వేరే వాళ్ల గురించి చేయకు. Y(యష్మి)ని కొంచెం కంట్రోల్ చేయు. ఆమెకు దూరంగా ఉండుP (ప్రేరణ) అనే అమ్మాయి నుంచి కొంచెం దూరంగా ఉండు.. గ్రూపిజం ఆడకు.. నీకోసమే ఆడు అంటూ ఎవరూ ఇవ్వనన్ని హింట్లు ఇచ్చేసింది. తర్వాత ఆమె గేమ్ ఆడి మటన్ సంపాదించింది. తమకు నాన్‌వెజ్ రావడంతో హౌస్మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఆమె వెళ్లిపోయాక బిగ్‌బాస్ హౌస్మేట్స్ అందరికీ ఓ గంటసేపు నిద్రపోయే అవకాశం ఇచ్చాడు. ఈ సమయంలో అనూజ వచ్చి నిద్రలో ఉన్న అవినాష్‌ను హత్తుకుంది.భార్య కోసం డ్రెస్ మార్చుకున్న అవినాష్భార్యను చూడగానే దెబ్బకు నిద్రమత్తు వదిలింది. అనూజ బ్లాక్ డ్రెస్‌లో వచ్చిందని వెంటనే అతడు కూడా వెళ్లి డ్రెస్ మార్చుకున్నాడు. బిగ్‌బాస్ వీళ్లిద్దరికీ కంపారిబులిటీ టెస్ట్ పెట్టాడు. ఈ గేమ్ ద్వారా రూ.51,000 ప్రైజ్‌మనీ కావాలా? లేదా మూడుగంటలు కిచెన్ టైమింగ్ కావాలా? అని అడిగాడు. అందుకు వీళ్లు ప్రైజ్‌మనీని ఎంచుకున్నారు. ఇక ఈ దంపతుల కోసం బిగ్‌బాస్ పెద్ద జే ప్లాన్ చేశాడు. బిగ్‌బాస్ సర్ప్రైజ్యాక్షన్ రూమ్‌ను హార్ట్ షేప్ బెలూన్లతో నింపేసి డిన్నర్ డేట్ ఏర్పాటు చేశాడు. అది చూసి మురిసిపడ్డ అవినాష్.. ఇది తన జీవితంలోనే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఇంతలో బిగ్‌బాస్ అవినాష్ ముచ్చటపడినట్లుగా లైట్లు ఆఫ్ చేశాడు. దాంతో అతడు తన భార్యపై ముద్దుల వర్షం కురిపించాడు. చివరగా అనూజ నవ్వుతూ అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మికి హింట్ ఇచ్చిన తండ్రి.. ఆ తప్పు చేయొద్దంటూ..
మగళై.. ఈ పదం వింటే చాలు యష్మి ఒళ్లు పలకరించిపోతుంది. తండ్రి తనను ముద్దుగా మగళై అని పిలుస్తాడని యష్మి చెప్పినప్పుడు ఆమె ముఖం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగింది. తండ్రి పంపిన లెటర్ కొన్ని క్షణాలపాటు కళ్లముందు కనిపించి మాయమైనప్పుడు కన్నీళ్ల వరద పారింది. అలాంటిది తండ్రి తన కళ్లముందుకు నడుచుకుంటూ వస్తే.. ?ఆనందభాష్పాలుఫ్యామిలీ వీక్‌లో భాగంగా యష్మి తండ్రి హౌస్‌లో అడుగుపెట్టాడు. అతడిని చూడగానే యష్మిలో ఎమోషన్స్ కట్టలు తెంచుకున్నాయి. పప్పా అని గట్టిగా అరిచి నాన్నను ఆప్యాయంగా హత్తుకుంది. ఆయన కూడా కూతుర్ని దగ్గరకు తీసుకుని తన తప్పులు సరిదిద్దుతూ కొన్ని హింట్లు ఇచ్చాడు ఇండివిడ్యువల్ గేమ్ ఆడు.. బయట బ్యాడ్ అవుతున్నావు. నువ్వు ఇన్నిరోజులు ఉండి ఇంతవరకు వచ్చావు.. నిన్ను ఫినాలే స్టేజీపై చూడాలనుంది అని చెప్పాడు. కూతురి తరపున సారీహౌస్మేట్స్తో కూడా.. నా కూతురు ఆవేశంలో ఏమైనా అంటే తప్పుగా తీసుకోకండి.. అని కోరాడు. కూతురి కోసం తండ్రి క్షమాపణ చెప్పడం చూసి నెటిజన్లు సైతం ఎమోషనల్ అవుతున్నారు. ఎంతైనా తండ్రీకూతుర్ల అనుబంధం అన్నింటికంటే గొప్పదని కామెంట్లు చేస్తున్నారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మి, నిఖిల్‌ను బుక్ చేసిన తేజ.. దమ్ము లేదంటూ రెచ్చగొట్టిన పృథ్వీ
కంటెస్టెంట్ల ఫోటోపై పెయింట్ వేసి నామినేట్ చేయాలి. బజర్ మోగినప్పుడు ముందుగా బ్రష్ పట్టుకున్న వారికే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నామినేషన్స్ అంటేనే గొడవలు కాబట్టి దానికి ఏమాత్రం కొదవ లేదు. యష్మి తప్పును తన నోటితోనే చెప్పించాడు తేజ.. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో నేటి (నవంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..ఫేవరిటిజం స్పష్టంగా కనిపిస్తోందిముందుగా మెగా చీఫ్ ప్రేరణ.. గౌతమ్ ఫోటోకు పెయింట్ పూస్తూ ప్రతీది ఆడియన్స్ ఏమనుకుంటారు? అనేది ఆలోచిస్తూ అడుగు వేస్తున్నాడు. అందరితో కలవట్లేదు, టీమ్ స్పిరిట్ లేదు అని కారణాలు చెప్పింది. ఆ కారణాలు గౌతమ్‌కు ఏమాత్రం మింగుడుపడలేదు. టీమ్ వర్క్ అంటే.. ఓడినా, గెలిచినా కలిసి పోరాడటం.. అంతే తప్ప నీవల్ల ఓడిపోయాం అంటూ గుచ్చిగుచ్చిచెప్పడం టీమ్ మెంబర్ లక్షణం కాదు. ఇక్కడ ఫేవరిటిజం, గ్రూపిజం స్పష్టంగా కనిపిస్తోంది అని ప్రేరణపై మండిపడ్డాడు.నాది తప్పయితే యష్మిది కూడా తప్పే!తర్వాత బజర్ మోగగానే బ్రష్ పట్టుకున్న నిఖిల్.. తేజను నామినేట్ చేశాడు. ఎవిక్షన్ షీల్డ్ గేమ్‌లో అతడు కావాలని తప్పు చేశాడన్నాడు. దీనికి తేజ స్పందిస్తూ.. నేను తెలిసి తప్పు చేయలేదు. నేను గుడ్డు వేయడం తప్పయితే నా తర్వాత యష్మి చేసింది తప్పు కాదా? అని సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు నిఖిల్ సమాధానం దాటవేస్తుంటే.. నీకు మాట్లాడటానికి భయం.. అంటూ రెచ్చగొట్టాడు. దాంతో నిఖిల్.. ఆమెది తప్పు కాదు, నీదే తప్పు అన్నాడు. దమ్ము లేదుఇంతలో నిఖిల్ గ్యాంగ్ వీళ్లను ఆపేందుకు రాగా.. ముగ్గురూ నాపై అటాక్ చేస్తున్నారా? అని తేజ అన్నాడు. దాంతో పృథ్వీ.. ఆ ముగ్గురు ఎవరని అడిగారు. నువ్వు అడిగితే నేను చెప్పను అని తేజ అంటే.. నీకు పేర్లు చెప్పే దమ్ము లేదు అంటూ తేజపై రెచ్చిపోయాడు. తర్వాత గౌతమ్.. అవతలి వ్యక్తులను అగౌరవపర్చడం అలవాటైపోయిందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు.తల్లికి తేజ క్షమాపణలుదీని గురించి చర్చించే క్రమంలో.. నీ బెదిరింపులకు అందరూ భయపడతారేమో కానీ నేను కాదు అని గౌతమ్ అన్నాడు. నువ్వు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నావని పృథ్వీ ఆరోపించాడు. అనంతరం తేజ ముందుగా తన తల్లికి సారీ చెప్పాడు. నిన్ను హౌస్‌కు తీసుకొస్తానని చెప్పాను, కానీ ఆ మాటపై నిలబడలేకపోతున్నందుకు క్షమించమన్నాడు. ఇందుకు కారణమైన హౌస్‌మేట్స్‌కు థాంక్యూ చెప్పాడు. వరస్ట్ ప్లేయర్ అంటూతర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. ఆమె అభిప్రాయాన్ని గౌరవించకుండా నేను ఒక గుడ్డును పాము నోట్లో పెట్టాను. తర్వాత యష్మి కూడా ఆలోచించకుండా వెళ్లి మరో గుడ్డు పాము నోట్లో వేసింది. నేను చేసింది తప్పే.. అలాగే యష్మి చేసింది కూడా తప్పే! అన్నాడు. దీనిపై యష్మి.. తాను తప్పు చేయలేదని వాదించింది. ఈ క్రమంలో హే.. పో, కూర్చో అంటూ చిరాకుపడింది. వరస్ట్ ప్లేయర్ అంటూ తేజపై ముద్ర వేసింది. పృథ్వీ.. చీఫ్‌గా, సంచాలకుడిగా ఫెయిలయ్యావంటూ అవినాష్‌ను నామినేట్ చేశాడు.మాట తప్పావ్రోహిణి.. చీఫ్ కంటెండర్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి మాట తప్పావంటూ విష్ణుప్రియను నామినేట్ చేసింది. ఆ రోజు అందుకే ఏడ్చానని రోహిణి పేర్కొంది. దీనికి విష్ణు తలతిక్క సమాధానమిచ్చింది. తొక్కలో మాట ఇచ్చుండకపోతే నాకు ఈ సమస్య వచ్చేదే కాదు. ఇప్పుడు చెప్తున్నా.. నాకు అందరికంటే పృథ్వీయే ఎక్కువ అని ప్రకటించేసింది. ఇక ఈ వారం గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ర్యాంప్ ఆడించిన గౌతమ్, తేజ.. భయపడే రకం కాదు!
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ పది మంది మాత్రమే మిగిలారు. మీలో మీరు కొట్టుకు చావండి అంటూ బిగ్‌బాస్ నామినేషన్స్ ప్రక్రియ ఇచ్చాడు. నామినేట్ చేయాలనుకునే వ్యక్తి ఫోటోకు పెయింట్ వేసి పాడు చేయాలన్నాడు. అలా గౌతమ్.. పృథ్వీని, తేజ.. యష్మిని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో పెద్ద గొడవలే జరిగాయి.భయపడేదేలె..తనను నామినేట్ చేసిన పాయింట్ల గురించి పృథ్వీ చర్చ మొదలుపెట్టగా నీ మాటలకు వేరేవాళ్లు భయపడతారేమో.. నేను భయపడను అన్నాడు గౌతమ్. ఇక ఎవిక్షన్ షీల్డ్ టాస్క్‌లో జంటగా వెళ్లిన తేజ, యష్మి.. ఏకాభిప్రాయానికి రాకుండా ఎవరికి నచ్చిన వ్యక్తుల్ని వారు సైడ్ చేసేశారు. నాది తప్పే.. నీది కూడా తప్పేఅయితే మొదట తేజ ఆ పని చేయడంతో అందుకు తగ్గ పరిణామాల్ని ఎదుర్కొన్నాడు. కంటెండర్ రేసులో లేకుండా పోవడమే కాకుండా ఫ్యామిలీ వీక్ కూడా తనకు ఉండబోదని చెప్పాడు. ఏకాభిప్రాయానికి రాకముందే పాము నోట్లో తాను గుడ్డు వేయడం ఎంత తప్పో.. తను వేశాక కూడా యష్మి వచ్చి మరో గుడ్డు వేయడం అంతే తప్పు అని తేజ కుండబద్ధలు కొట్టి చెప్పాడు.ర్యాంప్ ఆడించారుఅది తప్పనుకుంటావో, ఒప్పనుకుంటావో నీ ఇష్టం అని యష్మి చెప్తుంటే అనుకోవడమేముంది.. అది తప్పే.. అని తేజ కౌంటరిచ్చాడు. నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను.. నా తర్వాత నీది కూడా తప్పే అని సమాధానమిచ్చాడు. దీంతో యష్మి నువ్వు చేసింది తప్పే.. అని అరిచింది. ప్రోమోలో అయితే గౌతమ్, తేజ ర్యాంప్ ఆడించినట్లు కనిపిస్తోంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియకు చుక్కలు చూపిస్తున్న ప్రేరణ.. బలైపోయిన తేజ!
ఎన్నాళ్లనుంచో చీఫ్ పోస్ట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్రేరణ కల ఎట్టకేలకు సాకారమైంది. మెగా చీఫ్ పదవిని అధిరోహించింది. అలా డ్యూటీ ఎక్కిందో లేదో తన పనితనం మొదలుపెట్టేసింది. అప్పుడే విష్ణుప్రియకు చుక్కలు చూపించేస్తోంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేయండి..మాట తప్పాడన్న కోపంతో..మెగా చీఫ్ గేమ్‌లో పృథ్వీ, నబీల్ ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని ముందుగానే డీల్ చేసుకున్నారు. కట్ చేస్తే నబీల్ను ఓడించమని నిఖిల్‌కు సూచించాడు పృథ్వీ. చేసిందంతా చేశాక తాను అలా అనలేదని మాట మార్చాడు. తను ఓడిపోవడంతో నబీల్ కూడా పృథ్వీని ఓడించాలని డిసైడయ్యాడు. ఈ క్రమంలో అతడు కూర్చున్న బాక్స్‌లో మూటలు వేశాడు. అయితే అవి తన మీద పడటం, అలాగే ఇచ్చిన మాట తప్పాడన్న కోపంతో పృథ్వీ.. నబీల్‌పై సీరియస్ అయ్యాడు. ఈ రౌండ్లో పృథ్వీ ఓడిపోయాడు.ప్రేరణ మెగా చీఫ్చివర్లో ప్రేరణ, రోహిణి ఇద్దరే మిగిలారు. విష్ణు, గంగవ్వ, అవినాష్, తేజ.. రోహిణికి సపోర్ట్ చేయగా మిగతా అందరూ ప్రేరణకు మద్దతిచ్చి ఆమెను చీఫ్ చేశారు. ఇకపోతే హరితేజ హౌస్‌లో ఉన్నవారందరిపైనా హరికథ చెప్పి అలరించింది. అనంతరం మెగా చీఫ్ అయిన ప్రేరణ మొదట విష్ణునే టార్గెట్ చేసినట్లు ఉంది. విష్ణును కప్బోర్డ్ ఖాళీ చేయమందట.. అలాగే విష్ణు బెడ్ దగ్గరున్న సామాను నీట్‌గా పెట్టుకోమని చెప్పింది. ఆమె వినకపోవడంతో ప్రేరణ వెళ్లి సర్దింది. ఇంట్లో చేయాల్సిన పనులు కూడా సరిగా చేయడం లేదని విష్ణును తప్పు పట్టింది.పాము- ఎగ్స్బిగ్బాస్ ఎవిక్షన్ షీల్డ్‌ను ప్రవేశపెట్టాడు. సమయానుసారం ఆకలిగా ఉన్న పాముకు గోల్డెన్ ఎగ్స్ ఇవ్వాలన్నాడు. ఎవరికి చెందిన గోల్డెన్ ఎగ్ పాముకు ఆహారమవుతుందో వారు ఎవిక్షన్ షీల్డ్‌కు దూరమవుతారు. మెగా చీఫ్ ప్రేరణ.. ఎవిక్షన్ షీల్డ్ రాకూడదనుకున్న ఐదుగురి ఎగ్స్ పాముకు ఆహారంగా పెట్టాలన్నాడు. అలా విష్ణుప్రియ, గంగవ్వ, పృథ్వీ, గౌతమ్, హరితేజ ఫోటోలున్న ఎగ్స్‌ను పాము నోట్లో వేసింది.అవినాష్‌పై ఎగిరెగిరి పడ్డ యష్మిఅనంతరం.. అవినాష్, నబీల్ను పిలిచి ఒక ఎగ్‌ను పాము నోట్లో పెట్టమన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయంతో యష్మి ఎగ్ తొలగించారు. అందుకు కారణం చెప్పమని యష్మి అడగ్గా.. నువ్వు వీక్ కాబట్టే నబీల్ నీకు సూట్‌కేస్ ఇచ్చాడు. అయినా ఈ వారం నీకు వచ్చిన అవకాశం సరిగా వాడుకోలేదని అవినాష్ అన్నాడు. ఆ మాటతో యష్మికి కోపం కట్టలు తెంచుకుంది. అందరూ అన్ని గేమ్స్ గెలవరు, స్ట్రాంగ్ ఉన్నవాళ్లు కూడా చాలా గేమ్స్‌లో ఓడిపోయారు.. నన్ను వీక్ అంటూ డీమోటివేట్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చింది.నిఖిల్ గేమ్‌ను అడ్డుకున్న గౌతమ్నిఖిల్, గౌతమ్ వంతు రాగా నిఖిల్ త్యాగం చేసేందుకు రెడీ అయ్యాడు. అందుకు గౌతమ్ ఒప్పుకోలేదు. ప్రేరణ ఎగ్ తీసేద్దామంటే నిఖిల్ ఒప్పుకోడు. చివరకు ఇద్దరూ కలిసి తేజను బలి చేశారు. విష్ణుప్రియ, పృథ్వీ వంతురాగా.. ప్రేరణ ఎగ్ తీసేశారు. తర్వాత రోహిణి, హరితేజ వంతు వచ్చింది. నిఖిల్ ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అవడానికి రెడీగా ఉన్నాడని రోహిణి అంటుంటే హరితేజ మాత్రం నామినేషన్స్‌లోకి రావట్లేదంటూ అవినాష్‌ను తీసేద్దామంది. అందుకు రోహిణి ఒప్పుకోలేదు. అటు హరితేజ కూడా వినకపోవడంతో తప్పని పరిస్థితిలో రోహిణి.. అవినాష్ ఎగ్‌ను పాము నోట్లో వేసింది.తేజ చేసిన పనికితేజ, యష్మి వంతు వచ్చింది. యష్మి.. ఎఫర్ట్స్ కనిపించడం లేదంటూ రోహిణి పేరు చెప్పగా తేజ.. నబీల్, నిఖిల్లో ఎవరైనా ఓకే అన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తేజ.. నబీల్, రోహిణి, నిఖిల్ అభిప్రాయాలు అడిగాడు. తనకు అక్కర్లేదని నిఖిల్ క్లియర్‌గా చెప్పడంతో మరో సెకన్ ఆలోచించకుండా అతడి ఎగ్‌ను పాము నోట్లో వేశాడు.నబీల్‌కు ఎవిక్షన్ షీల్డ్అది చూసిన యష్మి.. కావాలని రోహిణి ఎగ్ కూడా వేసేసింది. దీంతో నిఖిల్, పృథ్వీ, హరితేజ, విష్ణు.. అందరూ తేజపై పడి అరిచారు. ఏకాభిప్రాయానికి రాకుండా ఎగ్ ఎలా వేస్తావంటూ మండిపడ్డారు. కానీ ఏ ఒక్కరూ యష్మి ఎగ్ వేయడాన్ని తప్పుపట్టలేదు. చివర్లో నబీల్ ఎగ్ మాత్రమే మిగిలి ఉండటంతో అతడు ఎవిక్షన్ షీల్డ్ గెలుపొందినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: ఎవిక్షన్ షీల్డ్ గెలిచిన ఓరుగల్లు బిడ్డ
ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి లేదా ఎలిమినేషన్లో ఉన్నవారిని సేవ్ చేయడానికి బిగ్‌బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెడుతుంటాడు. అలా ఈసారి కూడా ఎవిక్షన్ షీల్డ్ తీసుకొచ్చాడు. ఈ షీల్డ్ గెలిచినవారు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా సేవ్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే అది ఒక్కవారమా? ఏంటనేది క్లారిటీ లేదు.ఆటలో ఐదుగుర్ని తీసేసిన మెగా చీఫ్అయితే ఎవిక్షన్ షీల్డ్‌కు అర్హత లేదనకున్న ఐదుగురురిని గేమ్‌లో నుంచి తీసేయాలని మెగా చీఫ్ ప్రేరణకు బాధ్యత అప్పగించాడు. అలా ప్రేరణ.. పృథ్వీ, గౌతమ్, గంగవ్వ, హరితేజ, విష్ణుప్రియలను సైడ్ చేసేసింది. మిగిలిన హౌస్మేట్స్ షీల్డ్ కోసం పోటీపడ్డారు.ఎవిక్షన్ షీల్డ్ఈ క్రమంలో నబీల్.. యష్మిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అవినాష్ వివరణ ఇస్తుండగా యష్మి ఒంటికాలిపై లేచింది. ఒకర్ని వీక్ అని చెప్పొద్దు.. స్ట్రాంగ్ ఉన్న ప్లేయర్స్ కూడా చాలా గేమ్స్‌లో ఓడిపోయారు అని పేర్కొంది. ఇకపోతే ఎవిక్షన్ షీల్డ్ చివరకు నబీల్ను వరించినట్లు తెలుస్తోంది. నబీల్‌కు మైనస్?అయితే ఇది అతడికి ఏరకంగా ప్లస్ అయ్యేట్లు లేదు. నామినేషన్లో ఉంటేనే జనాలు ఓట్లు గుద్దుతూ అతడికి అండగా ఉంటారు. ఇలా నామినేషన్స్‌లో లేకుండా ఉంటే అతడికి ఓట్లు వేసేవారందరూ మిగతా హౌస్‌మేట్స్‌కు ఓట్లు వేసే ఆస్కారం ఉంది. అలా తన ఓట్ బ్యాంక్ పడిపోయే ఆస్కారం ఉంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాపై ఎవరూ ఇంత సీరియస్ అవలేదు.. నాకు పృథ్వీ వద్దు: విష్ణు
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెండర్‌షిప్ బ్యాడ్జ్ కోసం పోటీలు జరిగాయి. అందులో భాగంగా ఓ గేమ్‌లో విష్ణును బురిడీ కొట్టించి పృథ్వీ గెలిచాడు. ఆ తర్వాత పృథ్వీ, విష్ణు మధ్య ఏదో వాదులాట జరిగినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ వెనకపడుతూ ఉంటే అలుసైపోతున్నానని భావించిన విష్ణు.. అతడితో మాట్లాడటమూ మానేసింది.సారీ చెప్పువేరేవాళ్లను హర్ట్ చేసేసి అతడు మాత్రం చాలా కూల్‌గా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తి నాకు వద్దు అని తన బాధను యష్మితో పంచుకుంది. దీంతో యష్మి.. పృథ్వీని పిలిచి సారీ చెప్పమని అడిగింది. అంతలోనే విష్ణు కలగజేసుకుంటూ నేనేమీ సారీ అడగలేదు అనగా పృథ్వీ కోపంగా నేను నీతో మాట్లాడట్లేదు అన్నాడు.ఇకపై పృథ్వీకి దూరంగా?ఎందుకంత కోపం? కూర్చుని మాట్లాడుకుందాం అని యష్మి చెప్తుంటే కూడా మళ్లీ వస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తనపై అంత కోపం చూపించడంతో హర్టయిన విష్ణు.. ఎవరూ నాపై ఇంత సీరియస్ అవలేదు.. ఇకపై ఈ వ్యక్తే లేడనుకుంటాను అని పృథ్వీని దూరం పెడుతున్నట్లు చెప్పింది.అక్కా అని పిలవకుఇక బిగ్‌బాస్ ఇచ్చిన ఫన్ టాస్క్‌లో అవినాష్, రోహిణి ఆయా పాత్రల్లో దూరేశారు. డైరెక్టర్ రోల్ చేసిన అవినాష్ ఏబీసీ అనే ట్రయాంగిల్ లవ్‌స్టోరీతో సినిమా చేస్తున్నట్లు చెప్పాడు. ఆడిషన్స్‌లో యష్మి, నిఖిల్, గౌతమ్ ఓ సీన్ చేసి చూపించారు. అక్కా అని పిలవకు అని యష్మి అరుస్తుంటే నేను అక్కా అనే అంటాను అని గౌతమ్ వాదించాడు. ఇంతలో నిఖిల్ అక్కా అని పిలవద్దు అంటోందిగా అని మధ్యలో దూరాడు. దీంతో గౌతమ్.. సరే నేను పిలవడం మానేస్తా.. మరి నువ్వు అక్కా అని పిలుస్తావా? అని అడిగాడు. ఈ డైలాగ్‌తో అందరూ నవ్వేశారు. బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి