
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌లో పద్నాలుగు మంది అడుగుపెట్టారు. ఒకరినొకరు నవ్వుతూ పరిచయం చేసుకున్నారు. కొందరు ఇంకా మొహమాటంగానే ఉన్నారు. మరికొందరేమో అప్పుడే అందరినీ కలుపుకునిపోయి మాట్లాడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన మరుసటి రోజే పోట్లాటకు దిగుతున్నారు.
అసలేమైందంటే.. ఈ సీజన్‌లో కెప్టెన్ ఉండడని నాగార్జున ముందే చెప్పేశాడు. అయితే కెప్టెన్ లేకుండా హౌస్‌ను ఓ ఆర్డర్‌లో పెట్టడం కష్టమే.. అందుకే చీఫ్ అనే పోస్టులను ప్రవేశపెట్టారు. చీఫ్‌గా ఎంపికవడం కోసం టాస్కులు పెట్టాడు. అలా ఇంట్లో ఉదయం కొన్ని టాస్కులు జరగ్గా అందులో నిఖిల్, నైనిక గెలిచారు. అందులో ఓడిన వారికి మరో ఛాన్స్ ఇస్తూ టాస్క్ పెట్టారు.
అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. యష్మి, అఫ్రిది, బేబక్క, శేఖర్ బాషా ఈ గేమ్‌లో ఉన్నారు. వీరిలో చీఫ్ అవ్వడానికి ఎవరు అనర్హులో నిఖిల్, నైనిక చెప్తే దాన్ని సదరు కంటెండర్ డిఫెండ్ చేసుకోవాలి. అలా బేబక్క, అఫ్రిదిలను పక్కన పెట్టేశాడు. వారి కంటే యష్మి బాధ్యతారాహహిత్యంగా ఉందని సోనియా అనడంతో గొడవ మొదలైంది. మధ్యలో నా పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నావంటూ సోనియాతో వైరానికి దిగింది. చూస్తుంటే యష్మి చీఫ్‌గా సెలక్ట్ చేసినట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment