bigg boss 8 telugu
ప్రధాన వార్తలు

'బిగ్‌బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్
తెలుగులో బిగ్‌బాస్ షో మొదలై వారం రోజులైంది. శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. అయితే ప్రారంభం నుంచి ఏ మాత్రం జోష్ లేకుండా సాగుతోంది. మరోవైపు మలయాళంలోనూ 7వ సీజన్ షురూ అయి దాదాపు నెలరోజులకు పైనే అయింది. అక్కడ కూడా సాదాసీదాగానే సాగుతున్న షో కాస్త ఇప్పుడు మోహన్ లాల్ కామెంట్స్ దెబ్బకు ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఓ లెస్బియన్ జంటని లేడీ కంటెస్టెంట్ అవమానించడమే దీనికి కారణం. ఇంతకీ అసలేమైంది?(ఇదీ చదవండి: Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..?)మలయాళ బిగ్‌బాస్ ప్రస్తుతం 7వ సీజన్ నడుస్తోంది. దీనికి మోహన్ లాల్ హోస్ట్. రీసెంట్గా వీకెండ్ ఎపిసోడ్లో ఈయన విశ్వరూపం చూపించాడు. లక్ష్మీ అనే కంటెస్టెంట్.. అదిలా-నూరా అనే లెస్బియన్ జంటపై దారుణమైన కామెంట్స్ చేసింది. 'అసలు మిమ్మల్ని ఈ హౌసులోకి ఎవరు రానిచ్చారు? మీకు ఇక్కడికి వచ్చేందుకు ఏ మాత్రం అర్హత లేదు' అని అనేసింది.దీంతో మోహన్ లాల్.. హౌస్‌మేట్ లక్ష్మీపై ఫుల్ ఫైర్ అయిపోయారు. 'అసలు హౌసులోకి రావడానికి అర్హత లేని వ్యక్తులు ఎవరు?' అని మోహన్ లాల్ ప్రశ్నించాడు. తన కామెంట్స్‌ని కవర్ చేసేందుకు లక్ష్మీ ప్రయత్నించగా.. 'వాళ్లని నా ఇంట్లోకి ఆహ్వానిస్తాను. ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు కాస్త ఆలోచించు. అసలు ఇలా మాట్లాడేందుకు నీకేం అర్హత ఉంది? వాళ్ల పక్కన ఉండలేకపోతే హౌస్ నుంచి వెళ్లిపో. గెటౌట్' అని మోహన్ లాల్ రెచ్చిపోయారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హౌస్టింగ్ అంటే ఇది అని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: మీదే తప్పు.. నాగార్జునకే ఝలక్ ఇచ్చిన మాస్క్ మ్యాన్)

అందరి టార్గెట్ ఒక్కడే.. 2వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?
బిగ్‌బాస్ హౌసులో రెండో వారం వచ్చేసింది. సెలబ్రిటీలతో పాటు ఎంట్రీ ఇచ్చిన కామనర్స్.. తొలివారం బాగానే లాక్కొచ్చారు కానీ ఇప్పుడు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్లలో వాళ్లే గొడవలు పెట్టేసుకుంటున్నారు. ఈసారి నామినేషన్స్ జరగ్గా.. ఇందులోనూ చాలావరకు సామాన్యులే ఉన్నారు. ఇంతకీ ఈసారి లిస్టులో ఎవరెవరు ఉన్నారు? మాస్క్ మ్యాన్ హరీశ్.. నిరహారదీక్ష సంగతేంటి?తొలి వీకెండ్లో మాస్క్ మ్యాన్ హరీశ్ నిజస్వరూపాన్ని నాగార్జున బయటపెట్టడంతో మనోడు బాగానే హర్ట్ అయిపోయినట్లు ఉన్నాడు. ఏం తినను, తాగను అంటూ నిరహారదీక్ష చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ విషయం బయటపడింది. రెండో రోజుల నుంచి ఏం తినట్లేదు కాస్త తినండి అని చెప్పి ప్లేటులో ఫుడ్ పెట్టుకుని శ్రీజ రాగా.. మొహమాటం లేకుండా హరీశ్ వద్దనేశాడు. ఇంకొన్నిరోజుల వరకు తినను, కనీసం నీరు కూడా తాగను, మీలాంటోళ్ల మధ్యలో ఉండదల్చుకోలేదు అని అన్నాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయే వరకు నేను ఏం తినను, తాగను అని క్లారిటీగా చెప్పేశాడు.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్)మరోవైపు శ్రీజ-మనీష్ వాదులాడుకున్నారు. నీ పనే అరవడం కదా అని శ్రీజతోనే మనీష్ అనేసరికి ఈమె హర్ట్ అయిపోయింది. పాయింట్ అవుట్ చేసేస్తున్నారని మూలకు వెళ్లి ఏడవడం నీ పని అని మనీష్‌కి ఇచ్చిపడేసింది. భరణి తన గురించి సంజన దగ్గర చాడీలు చెబుతున్నాడని హరీశ్.. రాము రాథోడ్‌తో చెబుతూ కనిపించాడు.సెల్ఫీష్ రూత్‌లెస్ ఇడియట్స్ అని తమ కామనర్స్నే మనీష్ తిట్టాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. కామనర్స్ అనేదానికి వీళ్లు ఓ గలీజ్ మార్క్, వరస్ట్ కామనర్స్ అంటూ ఇమ్మాన్యుయేల్‌తో చెబుతూ తెగ బాధపడిపోయాడు.ఇకపోతే ఈ వారం నామినేషన్స్ విషయానికొస్తే.. ఒక్కొక్కరు ఇద్దరిద్దరి పేర్లు చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. నామినేషన్ ప్రక్రియ బాగానే జరిగింది. అయితే దాదాపు ఎనిమిది మంది మాస్క్ మ్యాన్ హరీశ్ పేరు చెప్పారు. తర్వాత ఎక్కువమంది భరణి పేరు చెప్పారు. వీళ్లిద్దరితో పాటు మనీష్, ప్రియ, పవన్, ఫ్లోరా సైనీ కూడా లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈసారి సామాన్యుల నుంచి నలుగురు, సెలబ్రిటీల నుంచి ఇద్దరు నామినేట్ అయినట్లు టాక్. మరి ఈసారి ఎవరి వికెట్ పడుతుందనేది చూడాలి?(ఇదీ చదవండి: Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..?)

ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి
మేమే తోపు.. మేము చెప్పిందే కరెక్ట్ అంటూ విర్రవీగిన కామనర్లకు నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. అంతేకాదు, ఎవరూ సంజన మాట లెక్క చేయకపోవడంతో అందరూ కెప్టెన్ మాట వినాల్సిందేనని తేల్చి చెప్పాడు. ఇంకా బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఇంట్లో జరిగిన దొంగతనాల వీడియోలు ప్లే చేయడంతో అందరూ కాసేపు నవ్వుకున్నారు. తర్వాత మిరాయ్ హీరోహీరోయిన్ తేజ సజ్జ, రితికా స్టేజీపైకి వచ్చారు. ఇంటిసభ్యులను రెండు టీమ్స్‌గా డివైడ్ చేయగా వాటికి తేజ, రితిక లీడర్స్‌గా ఉన్నారు. రెచ్చిపోయిన భరణిహౌస్లో వాళ్లు ఓడిపోయినప్పుడల్లా స్టేజీపై వీళ్లతో డ్యాన్స్ చేయించాడు నాగ్ (Nagarjuna Akkineni). అలా గెస్టులుగా వచ్చినవారికి పనిష్మెంట్ ఇచ్చి పంపించాడు. అనంతరం టెనెంట్స్‌లో నుంచి ఒకరికి ఓనర్ అయ్యే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. ఇందుకోసం సెలబ్రిటీలు రెండు టీములుగా విడిపోయి ఫైట్ చేశారు. రెజ్లింగ్ పోటీలకు ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా కొట్టుకున్నంత పని చేశారు. భరణి అయితే దొరికిందే ఛాన్స్.. తన సత్తా ఏంటో చూపిస్తా అన్నట్లుగా రెచ్చిపోయి గేమ్ ఆడాడు.పర్మినెంట్ ఓనర్‌గా భరణిఆడ, మగ తేడా లేకుండా అందర్ని ఈడ్చి అవతల పారేశాడు. ఈ గేమ్‌లో భరణి, తనూజ, రాము రాథోడ్, శ్రష్టి ఉన్న రెడ్ టీమ్ గెలిచింది. వీళ్లలో ఎవరు ఓనర్ అవ్వాలనేది ఓడిన టీమ్ డిసైడ్ చేయాలన్నారు. సంచాలక్ ఫ్లోరా శ్రష్టికి ఓటేసింది. కానీ ఓడిన బ్లూ టీమ్‌లోని ఇమ్మాన్యుయేల్, సంజన, రీతూ చౌదరి, సుమన్ శెట్టి అందరూ భరణికి ఓటేశారు. దీంతో అతడు పర్మినెంట్ ఓనర్‌గా మారిపోయాడు. భరణిని ఓనర్‌గా ప్రకటించగానే కామనర్ల ముఖాలు మాడిపోయాయి. మాట మార్చిన ఇమ్మాన్యుయేల్అయితే మొన్నటిదాకా అమ్మాయిలకు ఇబ్బందవుతోంది, తనకు ఛాన్స్ వస్తే అమ్మాయిలను ఓనర్లను చేస్తానన్న ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు మాత్రం అవకాశం వచ్చినా సరే శ్రష్టి, తనూజలను కాదని భరణిని ఎంచుకోవడం గమనార్హం. భరణి.. తనూజను పర్సనల్ అసిస్టెంట్‌గా ఎంపిక చేసుకున్నాడు. చివర్లో డిమాన్ పవన్ సేవ్ అవగా శ్రష్టి వర్మ (Shrasti Verma) ఎలిమినేట్ అయింది. వెళ్లిపోయేముందు ఆమె ఓ టాస్క్ ఇచ్చారు. నమ్మకం మీద దెబ్బ కొట్టారుఅందులో భాగంగా జెన్యూన్‌గా ఉండే నలుగురు, కెమెరా ముందు యాక్ట్ చేసే నలుగురి పేర్లు చెప్పమన్నారు. అందుకామె రాము రాథోడ్, మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీశ్, ఫ్లోరా సైనీ జెన్యూన్ అంది. రీతూ కెమెరా ముందు నటించి తర్వాత వేరేలా ఉంటుందని పేర్కొంది. నమ్మకం మీద దెబ్బ కొట్టారు, ఒక్కసారి నమ్మకం పోతే మళ్లీ రాదంటూ తనూజ, భరణి పేర్లు చెప్తూ శ్రష్టి ఎమోషనలైంది. సంజనా పేరు ప్రస్తావించింది.. కానీ తను చాలా స్ట్రాంగ్ అని పేర్కొంది. ఇక వెళ్లిపోయేముందు తను చేసే క్లీనింగ్ టాస్క్.. ఇకపై సుమన్ శెట్టి చేయాలంటూ బిగ్‌బాంబ్ వేసింది.చదవండి: Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..?

డిప్రెషన్.. చనిపోవాలని చాలాసార్లు ట్రై చేశా..: హీరోయిన్
ఒకానొక సమయంలో జీవితంపై విరక్తి వచ్చి తనువు చాలించాలనుకున్నాను అంటోంది హీరోయిన్ మోహిని (Actress Mohini). తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిపోయిన ఆమె అక్కడే సెటిలైపోయింది. మోహిని- భరత్ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. తాజాగా తన వైవాహిక జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది మోహిని. డిప్రెషన్లో..నా పెళ్లయ్యాక భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నాను. కానీ, ఒకానొక సమయంలో నాలో తెలియని బాధ మొదలైంది. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. పోనీ, నా జీవితంలో ఏమైనా కష్టాలున్నాయా? అంటే ఏమీ లేవు. అంతా ఎప్పటిలాగే ఉంది. కానీ, నేను మాత్రం డిప్రెషన్ నుంచి బయటకు రాలేకపోయాను. ఆత్మహత్యకు ప్రయత్నించాను. అలా ఒక్కసారి కాదు, పలుమార్లు చనిపోయేందుకు ట్రై చేశాను. ఆ సమయంలోనే ఓ జ్యోతిష్యుడిని కలవగా నాపై చేతబడి జరిగిందని చెప్పాడు. దాన్నుంచి బయటపడ్డా..మొదట నవ్వుకున్నాను. కానీ ఆలోచిస్తే అదే నిజమనిపించింది. నా అంతట నేనుగా చనిపోవాలని ఎందుకు ప్రయత్నిస్తాను? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. తర్వాత ఆ భగవంతుడిని నమ్ముకుని దాన్నుంచి బయటపడ్డాను అని చెప్పుకొచ్చింది. కాగా మోహిని తెలుగులో ఆదిత్య 369 సినిమాతో పాపులర్ అయింది.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: ఏళ్ల తరబడి డిప్రెషన్లో.. ఆ బాధతోనే బిగ్‌బాస్‌కు.. ఎవరీ మాస్క్ మ్యాన్
బిగ్‌బాస్ న్యూస్

Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) మొదటి వారం పూర్తి అయిపోయింది. దీంతో ఫస్ట్ ఎలిమినేషన్ ద్వారా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Verma) హౌస్ నుంచి బయటకు వచ్చింది. కేవలం వారం రోజులు మాత్రమే ఆమె హోస్లో కొనసాగింది. మొదట ఫ్లోరా సైనీ(ఆషా షైనీ) ఎలిమినేషన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో శ్రష్టి వర్మను ఇంటి నుంచి పంపించేశారు. దీంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. అయితే, వారం రోజులకు ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ గురించి సోషల్‌మీడియాలో చర్చ జరుగుతుంది.బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మొదటి వారమే శ్రేష్టి వర్మ ఎలిమినేట్ కావడంతో ఆమె పెద్దగా లాభ పడింది లేదని చెప్పాలి. హౌస్‌లో ఆమె కేవలం వారంరోజులు మాత్రమే ఉండటంతో తను రెమ్యునరేషన్‌గా రూ. 2 లక్షలు మాత్రమే అందుకున్నట్లు తెలుస్తోంది. ఇతర కంటెస్టెంట్ల రెమ్యునరేషన్‌తో పోలిస్తే చాలా తక్కువని తెలుస్తోంది.బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో రీతూ చౌదరి, రాము రాథోడ్,సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్,సంజన, తనూజ గౌడ, ఫ్లోరా సైని, శ్రేష్టి వర్మ, డిమోన్ పవన్‌తో మొత్తం 9 మంది ఉన్నారు. వీరిలో అతి తక్కువ ఓట్లు శ్రేష్టి వర్మకు పడ్డాయి. దీంతో ఫస్ట్ ఎలిమినేషన్లో భాగంగా ఆమె బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ సందర్భంగా నిజాయితీగా ఉన్న నలుగురు పేర్లు చెప్పమని నాగార్జున కోరారు.. మనీశ్, హరీశ్, రాము రాథోడ్, ఆషా షైనీ అని శ్రష్టి తెలిపింది. కెమెరా ముందు నటించేవారు ఎవరనే ప్రశ్నకు.. భరణి, రీతూ చౌదరి, తనూజ, పేర్లు చెప్పింది.

బిగ్‌బాస్ హౌస్‌లో గుడ్డు గోల.. భరణిపై రెచ్చిపోయిన మాస్క్ మ్యాన్!
తెలుగు బుల్లితెర ప్రియుల్లో అత్యంత క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈనెల 7న 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఈ సారి భిన్నంగా కామన్ కేటగిరీ నుంచి ఏకంగా ఆరుగురిని పంపించారు. ఈ సీజన్లో బిగ్‌బాస్‌లో తొమ్మిది మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. అయితే ప్రారంభమైన మూడు రోజులకే నామినేషన్స్‌తో హౌస్‌ను హీటెక్కించారు బిగ్‌బాస్. తొలివారంలో ఏకంగా తొమ్మిదిమంది నామినేట్ అయ్యారు. ఈసారి నామినేషన్లలో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఉన్నారు.అయితే తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను బిగ్‌బాస్ మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈరోజు జరిగే ఎపిసోడ్లో కేవలం గుడ్డు కోసం హౌస్ సభ్యులంతా గొడవకు దిగారు. ఎవరు గుడ్డు తిన్నారు అంటూ హౌస్‌మేట్స్‌ను ప్రశ్నించగా.. నేనైతే తినలేదండి.. ప్రామిస్ అంటూ సంజనా గల్రానీ అన్నారు. నీవల్లే అందరికీ ప్రాబ్లం అంటూ సంజనాతో భరణి వాదించారు. దీంతో భరణిపై మాస్క్ మ్యాన్ హరీశ్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. మీరు టాపిక్‌ను డైవర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. నేను మీకంటే బాగా చేస్తానని మాస్క్ మ్యాన్ అన్నారు. దీంతో భరణికి, హరీశ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హౌస్మేట్స్ అంతా వీరిద్దరికీ నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ప్రోమో ఎపిసోడ్‌పై మరింత ఆసక్తిని పెంచేసింది. ఇంకెందుకు ఆలస్యం బిగ్‌బాస్ ప్రోమో చూసేయండి.Guddu Poyindhi!🥚😬Tenants are banned from the House🚫🏠Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/9FdoevSKDG— JioHotstar Telugu (@JioHotstarTel_) September 10, 2025

బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్స్.. బ్యాక్ గ్రౌండ్ డీటైల్స్ (ఫొటోలు)

మాట తూలి.. ఇప్పుడు సారీ చెప్పిన నవదీప్
బిగ్‌బాస్ షో మరో రెండు వారాల్లో మొదలవుతుంది. ఈసారి సామాన్యులకు ఎక్కువమందికి అవకాశం కల్పించేందుకు అగ్నిపరీక్ష పేరుతో ఓ షో ప్లాన్ చేశారు. గత నాలుగైదు రోజుల నుంచి పలు గేమ్స్ పెడుతూ టాప్-15 కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేశారు. అయితే సోమవారం ఎపిసోడ్లో ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న నవదీప్.. ఓ లేడీ కంటెస్టెంట్‌పై మాట తూలాడు. ఈ విషయమై విమర్శలు రావడంతో ఇప్పుడు క్షమాపణ చెప్పుకొచ్చాడు.సోమవారం టెలికాస్ట్ చేసిన ఎపిసోడ్లో కల్కి, షాకీబ్ అనే కంటెస్టెంట్స్ మధ్య చిన్న గేమ్ పెట్టారు. ఎవరికైనా ఫోన్ చేసి ఆన్లైన్ ద్వారా డబ్బులు వేయమని చెప్పారు. అయితే ఈ పోటీలో కల్కికి గేమ్ గురించి క్లియర్‌గా చెప్పారు. షాకీబ్‌కి మాత్రం సరిగా వివరించలేదు. దీంతో అతడికి తక్కువ డబ్బులు మాత్రమే పడ్డాయి. ఇది ఎవరికైనా అన్ ఫెయిర్ అనిపించిందా? అని కూర్చున్న కంటెస్టెంట్స్‌ని నవదీప్ అడగ్గా.. శ్రీజ చేయి ఎత్తింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌తో హాలీవుడ్ పవర్ హౌస్.. బిగ్ ప్లాన్ రెడీ)దీంతో శ్రీజని నవదీప్ స్టేజీపై రమ్మన్నాడు. అన్ ఫెయిర్ అని ఎందుకు అనిపించింది? అని ఈమెని అడగ్గా.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వారే గెలుస్తారని కల్కికి వివరంగా చెప్పారు, కానీ, అతడికి ఆ మాట చెప్పలేదని ధైర్యంగా అనేసింది. దాంతో నవదీప్ కోప్పడ్డాడు. నువ్వు అతిగా ఆలోచించొద్దు. బిగ్‌బాస్ అనేది చాలా భాషల్లో ఎన్నో సీజన్లు జరిగాయి. ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి అన్‌ఫెయిర్ అని చెప్పడానికి.. నీకంత సీన్ లేదు. ఇంకోసారి ఇలా చేయకు అంటూ ఆమెను చులకన చేసి మాట్లాడాడు.అయితే 'ఊరి నుంచి వచ్చావ్' అని నవదీప్ కామెంట్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఇప్పుడు తన ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు. ''ఊరి నుంచి వచ్చి' అన్న మాటకు ఫీలైన సున్నితమైన మనసులకు ప్రేమలో సారీ చెబుతున్నా. కుదిరితే క్షమించండి. ఐ లవ్యూ' అని నవదీప్ రాసుకొచ్చాడు. (ఇదీ చదవండి: ‘బిగ్‌బాస్’లో ప్రేమాయణం.. పెళ్లి చేసుకున్న జంటలివే)
బిగ్‌బాస్ గ్యాలరీ


బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్స్.. బ్యాక్ గ్రౌండ్ డీటైల్స్ (ఫొటోలు)
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత


రిషబ్ శెట్టి, ప్రగతిల పెళ్లిరోజు.. ప్రత్యేకమైన ఫోటోలు షేర్ చేసిన జోడి


ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు విజేతలు వీళ్లే.. (ఫొటోలు)


తెర వెనక 'బిగ్‌బాస్ 8' ఫినాలే హంగామా (ఫొటోలు)


బిగ్‌బాస్ 8 విజేతగా నిఖిల్.. ఏమేం గెలుచుకున్నాడు? (ఫొటోలు)


కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్నను దర్శించుకున్న బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ (ఫోటోలు)


జడలో మల్లెపూలు పెట్టి.. కళ్లు తిప్పుకోలేని అందంతో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)