
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెండర్‌షిప్ బ్యాడ్జ్ కోసం పోటీలు జరిగాయి. అందులో భాగంగా ఓ గేమ్‌లో విష్ణును బురిడీ కొట్టించి పృథ్వీ గెలిచాడు. ఆ తర్వాత పృథ్వీ, విష్ణు మధ్య ఏదో వాదులాట జరిగినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ వెనకపడుతూ ఉంటే అలుసైపోతున్నానని భావించిన విష్ణు.. అతడితో మాట్లాడటమూ మానేసింది.

సారీ చెప్పు
వేరేవాళ్లను హర్ట్ చేసేసి అతడు మాత్రం చాలా కూల్‌గా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తి నాకు వద్దు అని తన బాధను యష్మితో పంచుకుంది. దీంతో యష్మి.. పృథ్వీని పిలిచి సారీ చెప్పమని అడిగింది. అంతలోనే విష్ణు కలగజేసుకుంటూ నేనేమీ సారీ అడగలేదు అనగా పృథ్వీ కోపంగా నేను నీతో మాట్లాడట్లేదు అన్నాడు.

ఇకపై పృథ్వీకి దూరంగా?
ఎందుకంత కోపం? కూర్చుని మాట్లాడుకుందాం అని యష్మి చెప్తుంటే కూడా మళ్లీ వస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తనపై అంత కోపం చూపించడంతో హర్టయిన విష్ణు.. ఎవరూ నాపై ఇంత సీరియస్ అవలేదు.. ఇకపై ఈ వ్యక్తే లేడనుకుంటాను అని పృథ్వీని దూరం పెడుతున్నట్లు చెప్పింది.

అక్కా అని పిలవకు
ఇక బిగ్‌బాస్ ఇచ్చిన ఫన్ టాస్క్‌లో అవినాష్, రోహిణి ఆయా పాత్రల్లో దూరేశారు. డైరెక్టర్ రోల్ చేసిన అవినాష్ ఏబీసీ అనే ట్రయాంగిల్ లవ్‌స్టోరీతో సినిమా చేస్తున్నట్లు చెప్పాడు. ఆడిషన్స్‌లో యష్మి, నిఖిల్, గౌతమ్ ఓ సీన్ చేసి చూపించారు. అక్కా అని పిలవకు అని యష్మి అరుస్తుంటే నేను అక్కా అనే అంటాను అని గౌతమ్ వాదించాడు. ఇంతలో నిఖిల్ అక్కా అని పిలవద్దు అంటోందిగా అని మధ్యలో దూరాడు. దీంతో గౌతమ్.. సరే నేను పిలవడం మానేస్తా.. మరి నువ్వు అక్కా అని పిలుస్తావా? అని అడిగాడు. ఈ డైలాగ్‌తో అందరూ నవ్వేశారు.
Comments
Please login to add a commentAdd a comment