వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న 'పొలిమేర' నటి | Kamakshi Bhaskarla About Movie Opportunities | Sakshi
Sakshi News home page

Kamakshi Bhaskarla: ఒకే సమయంలో మూడు ప్రాజెక్టులు.. కష్టమైనా ఇష్టంగానే ఫీలవుతున్నా..

Published Thu, Mar 27 2025 8:51 PM | Last Updated on Thu, Mar 27 2025 8:51 PM

Kamakshi Bhaskarla About Movie Opportunities

కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) ఎంచుకునే భిన్న స్క్రిప్ట్‌లు ఎంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నవీన్ చంద్ర హీరోగా నటించిన సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేసుకుంది. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీతో బిజీగా ఉంది. మరో వైపు బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజ్ పోలిమేర మూడో పార్ట్ షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. 

తాజాగా కామాక్షి మాట్లాడుతూ.. ‘మూడు చిత్రాలలో నేను విభిన్న పాత్రలను పోషిస్తున్నాను. ఈ మూడు ప్రాజెక్టులు నా కెరీర్‌కు చాలా కీలకం కానున్నాయి. ఇలా ఒకే టైంలో మూడు ప్రాజెక్టులకు పని చేయడం కష్టమైనప్పటికీ, సినిమా పట్ల ఉన్న ప్యాషన్‌, ప్రేమ వల్ల కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. నాకు సినిమా సెట్లలో ఉండటమే నచ్చుతుంది’ అని పేర్కొంది.

ప్రతిసారి డిఫరెంట్ పాత్రలను పోషిస్తుండటంపై కామాక్షి స్పందిస్తూ.. ‘సినిమాలోని పాత్రకు కనెక్ట్ అవ్వడం, ఆ క్యారెక్టర్‌కు నిజాయితీగా పని చేయడం వల్ల యాక్టర్‌ తనలోని కొత్త కోణాలను ఆవిష్కరించుకోగలరు. సవాల్‌గా అనిపించే పాత్రలను ఎంచుకోవడం, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నటించే పాత్రలనే నేను ఎంచుకుంటూ వస్తున్నాను. స్క్రిప్ట్, డైరెక్టర్ విజన్‌కు అనుగుణంగానే పని చేస్తున్నాను. నా కోసం పాత్రలు రాసే దర్శకులకే క్రెడిట్ ఇస్తాను. నాలోని నటిని బయటకు తీసుకొచ్చేది వారే. ప్రతి పాత్ర ఒక కొత్త ప్రయాణం అని నమ్ముతాను’ అని తెలిపింది.

చదవండి: బెట్టింగ్‌ యాప్స్‌.. ఏడాదికి రూ.10 లక్షలిస్తామన్నారు: వాసంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement