
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించి ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి చాలాసార్లు వార్తలొచ్చాయి. కానీ అవన్నీ కేవలం రూమర్స్‌గానే మిగిలిపోయాయి. కొన్ని నెలల గ్యాప్ తర్వాత మళ్లీ ప్రభాస్ పెళ్లి గురించి మొదలైంది. త్వరలోనే ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నారని నెట్టింట తెగ వైరలవుతోంది. అంతేకాదు రెబల్ స్టార్ పెద్దమ్మ శ్యామలా దేవి అప్పుడే పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ అన్న పెళ్లి కోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తల నేపథ్యంలో తాజాగా ఆయన టీమ్ స్పందించింది. ప్రభాస్ మ్యారేజ్ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని కొట్టి పారేశారు. ఓ బిజినెస్‌మెన్ కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ వార్తలపై ఆయన టీమ్‌ను సంప్రదించగా.. ఎలాంటి ఊహగానాలు నమ్మవద్దని రెబల్ స్టార్ అభిమానులకు సూచించారు.
(ఇది చదవండి: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఏర్పాట్లలో శ్యామలా దేవి)
గతంలో ప్రభాస్ పెళ్లి గురించిన వచ్చిన రూమర్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అతను తన బాహుబలి నటి అనుష్క శెట్టితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత ఈ వార్తలను నటీనటులిద్దరూ ఖండించారు. తాము మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. ఆ తర్వాత దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి -2, ప్రశాంత్ నీల్‌తో సలార్ 2: శౌర్యంగ పర్వం సినిమాలను చేయనున్నారు.