rumours
-
ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట జూన్‌లో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తోంది బాలీవుడ్ భామ. దీంతో నెటిజన్స్ ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సోనాక్షి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆమె ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ కూడా తెగ వైరలవుతున్నాయి.ఈ సందర్భంగా తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించింది సోనాక్షి. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చింది. తాను ప్రస్తుతం గర్భవతిని కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం మేమిద్దరం సరదాగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నామని చెప్పింది. పెళ్లి తర్వాత తాను కొంత బరువు పెరగడంతో పాటు లావుగా కనిపిస్తున్నట్లు వెల్లడించింది. అందువల్లే తనను గర్భవతి అంటూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారని వివరించింది. ప్రస్తుతం తామిద్దరం వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నామని సోనాక్షి తెలిపింది.కాగా.. తన భర్త బర్త్ డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది బాలీవుడ్ హీరోయిన్. డిసెంబర్ 10న జరిగిన జహీర్ ఇక్బాల్ పుట్టిన రోజు వేడుకలో సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా కూడా హాజరయ్యారు. ఈ ఏడాది జూన్ 23న ఒక ప్రైవేట్ వేడుకలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు, సన్నిహితులు హాజరయ్యారు. వీరిద్దరి రిసెప్షన్ వేడుకలో రేఖ, సల్మాన్ ఖాన్, అదితి రావ్ హైదరీ, హుమా ఖురేషి, ఆదిత్య రాయ్ కపూర్ పాల్గొన్నారు. -
టీమిండియా స్టార్ సిరాజ్‌పై రూమర్లకు కారణం ఈ ఫొటోలే! (ఫొటోలు)
-
బిగ్‌బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే!
టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఐపీఎల్ మెగా వేలం-2025లో భారీ మొత్తమే దక్కింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని వదిలేసినా.. గుజరాత్ టైటాన్స్ పట్టుబట్టి మరీ కొనుగోలు చేసింది. రూ.12.25 కోట్లు వెచ్చించి సిరాజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది అతడు టైటాన్స్ జెర్సీలో దర్శనమివ్వబోతున్నాడు.ఇదిలా ఉంటే.. సిరాజ్ వ్యక్తిగత విషయానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్‌కు చెందిన ఓ నటితో అతడు డేటింగ్ చేస్తున్నాడనేది దాని సారాంశం. సదరు నటి పేరు మహీరా శర్మ అని, ఆమె హిందీ బిగ్‌బాస్ 13 కంటెస్టెంట్ అని సమాచారం.రూమర్లకు కారణం ఇదే!అయితే, సిరాజ్ గురించి ఇలాంటి వదంతులు పుట్టుకురావడానికి కారణం మాత్రం మహీరా ఇన్‌స్టా పోస్టులు. మహీరా తాను బ్లాక్ కలర్ డ్రెస్‌తో గ్లామరస్ లుక్‌లో కనిపిస్తున్న ఫొటోలను షేర్ చేయగా.. సిరాజ్ వాటిని లైక్ చేశాడు. లైక్ కొట్టినంత మాత్రానఅంతే.. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లతో వీరిద్దరి పేర్లను ముడిపెట్టి గాసిప్‌రాయుళ్లు తమకు నచ్చిన రీతిలో కథనాలు అల్లేస్తున్నారు. దీంతో సిరాజ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. లైక్ కొట్టినంత మాత్రాన ఇలాంటి అసత్యపు ప్రచారం చేయడం తగదని హితవు పలుకుతున్నారు. క్రికెట్‌కు- బాలీవుడ్‌కు విడదీయరాని అనుబంధంకాగా క్రికెట్‌కు- బాలీవుడ్‌కు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. నాటి క్రికెటర్ పటౌడీ అలీఖాన్ నుంచి జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వరకు బాలీవుడ్ నటీమణులను పెళ్లాడిన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు.గతంలో వీరిపై కూడా ఇలాంటి ప్రచారమేఇక భారత ఆల్‌రౌండర్, వేలంలో రూ. 23.75 కోట్లతో(కేకేఆర్) జాక్‌పాట్ కొట్టిన వెంకటేశ్ అయ్యర్ కూడా సిరాజ్ మాదిరే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. టాలీవుడ్ నటి ప్రియాంక జువాల్కర్ ఫొటోలకు లైక్ కొట్టినందుకు వచ్చిన చిక్కు అది. అయితే, ఇటీవలే అతడు పెళ్లి చేసుకోవడంతో రూమర్లకు చెక్ పడింది. శుబ్‌మన్ గిల్- సారా అలీఖాన్‌ల పేర్లు కూడా ఇలాగే వైరల్ అయ్యాయి.అంతేకాదు.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి గతంలో ఇలాంటి వార్తలే వచ్చాయి. నటి అనుపమా పరమేశ్వరన్ పేరుతో అతడిని ముడిపెట్టగా.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌ను పెళ్లాడిన బుమ్రా.. వదంతులు వ్యాప్తి చేసేవారి నోళ్లు మూయించాడు.ఆస్ట్రేలియా పర్యటనలోఇదిలా ఉంటే.. సిరాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాతో అక్కడికి వెళ్లాడు. ఇక ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన బుమ్రా.. జట్టుకు భారీ విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో గెలిచి ఆసీస్ గడ్డపై అతిపెద్ద విజయంతో చరిత్ర సృష్టించింది. ఈ టెస్టులో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2025: ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా..! View this post on Instagram A post shared by Tellychakkar Official ® (@tellychakkar) -
అక్కినేని హీరోతో పెళ్లి.. ఆ వార్తలపై స్పందించిన మీనాక్షి చౌదరి
ఇటీవల లక్కీ భాస్కర్‌తో హిట్ కొట్టిన బ్యూటీ మీనాక్షి చౌదరి. మరో మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ సరసన మెకానిక్ రాకీలో కనిపించనుంది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది.ఇటీవల వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి మెకానిక్ రాకీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇటీవల సుశాంత్‌ను మీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు గుంటూరు కారం భామను ప్రశ్నించారు.దీనికి మీనాక్షి చౌదరి స్పందిస్తూ..'అదంతా ఫేక్. నేను పెళ్లి చేసుకోవడం లేదు. గతనెల కూడా ఒక రూమర్ వచ్చింది. ఓ తమిళ నటుడి కుమారుడిని పెళ్లి చేసుకుంటున్నట్లు రాశారు. ప్రతినెల నాపై ఏదో ఒక రూమర్ వస్తోంది. అలాగే ఇప్పుడు నా పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ప్రస్తుతానికి నేను సింగిల్. ఇప్పుడైతే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు' అని అన్నారు. కాగా.. మెకానిక్ రాకీలో మరో హీరోయిన్గా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంశాలతో మెప్పిస్తున్న ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. తాజాగా మరో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. నవంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. -
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల పుకార్లకు చెక్..
-
'క' ఓటీటీ రిలీజ్‌పై రూమర్స్.. నిర్మాణ సంస్థ క్లారిటీ
గత వారం థియేటర్లలో రిలీజైన మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. తర్వాత అది హిట్ టాక్‌గా మారింది. అన్ని చిత్రాలకు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం కిరణ్ అబ్బవరం 'క' మూవీనే దీపావళి విన్నర్‌గా తేలింది.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)థియేటర్లలో సక్సెస్ఫుల్ ఆడుతున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అప్పుడే సోషల్ మీడియాలో తెగ రూమర్స్ వచ్చేస్తున్నాయి. నవంబర్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయిపోతుందనే పోస్టులు ఎక్కువగా కనిపించాయి. ఈటీవి విన్ ఓటీటీలోకి వస్తుందని తెగ హడావుడి చేస్తున్నారు.ఇప్పుడు ఈ పుకార్లపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చేసింది. 'క' మూవీని థియేటర్లలోనే చూడండి. ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే ప్రసక్తే లేదు అన్నట్లు ట్వీట్ చేసింది. సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పుడు ఈ రూమర్స్ రావడం పర్లేదు. కానీ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనేది కూడా వైరల్ చేసేయడం చేజేతులా వసూళ్లని అడ్డుకున్నట్లే. మరి ట్వీట్ చేసినట్లు నిర్మాత మాట మీద నిలబడతారో లేదో చూడాలి?(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?)#KA We are not coming to OTT any time soon..we want you all to experience our movie in theatres only. Please discard any fake news in this regards— srichakraas entertainments (@srichakraas) November 6, 2024 -
దివాళీ పార్టీలో మెరిసిన హీరోయిన్.. ప్రెగ్నెన్సీపై క్రేజీ కామెంట్స్!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రస్తుతం కుటుంబంతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ భర్తతో కలిసి దిపావళీ పార్టీలో తళుక్కున మెరిసింది. ముంబయిలో జరిగిన దివాళీ బాష్‌లో అనార్కలీ సూట్ ధరించి కనిపించింది. ఇద్దరు కలిసి తమ పెట్ డాగ్‌తో ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. గెస్ దిస్ అంటూ సోనాక్షి క్యాప్షన్ కూడా ఇచ్చింది.ఇది చూసిన నెటిజన్స్ సోనాక్షి సిన్హాను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోనాక్షి బేబీ బంప్‌తో ఉందంటూ ఇన్‌స్టాలో రిప్లై ఇస్తున్నారు. తన భర్త జహీర్ ఇక్బాల్‌తో కలిసి త్వరలోనే మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఏకంగా కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ గురించి ఇప్పటి వరకు సోనాక్షి నుంచి ఎలాంటి ప్రకటనైతే రాలేదు.(ఇది చదవండి: పెళ్లి జరిగిన ఇంటిని అమ్మేస్తున్న స్టార్ హీరోయిన్)కాగా.. ఈ ఏడాది జూన్ 23న హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వీరి పెళ్లి వేడుక ముంబయిలోని బాంద్రా ఏరియాలో ఉన్న సోనాక్షి అపార్ట్మెంట్లోనే జరిగింది. మరోవైపు సోనాక్షి ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్‌లో అనే చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
భార్యతో విడాకులు.. అలాంటివారే రూమర్స్ క్రియేట్ చేస్తారు: జయం రవి
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయం రవి విడాకుల తర్వాత తనపై వచ్చిన రూమర్స్‌పై తొలిసారి స్పందించారు. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.జయం రవి మాట్లాడుతూ.. 'మేము పబ్లిక్ డొమైన్లో ఉన్నాం. నేను బయట టీ తాగినా..ఏ చేసినా తెలిసిపోతుంది. ఎందుకంటే మేము సినిమా వ్యక్తులం. మమ్మల్ని ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. వారి అభిప్రాయాలు కూడా వెల్లడిస్తుంటారు. మేమైతే వాటిని అడ్డుకోలేం కదా. కొంతమంది పరిణితి చెందిన వారు ఇలాంటి రూమర్స్‌ను పట్టించుకోరు. పరిపక్వత లేని కొద్దిమంది మాత్రమే రూమర్స్ వ్యాప్తి చేయడం చేస్తుంటారు. కొంతమంది ఆ విషయంలో ఉన్న తీవ్రత అర్థం చేసుకోకుండా మాట్లాడతారు. కానీ నా గురించి నాకు పూర్తిగా తెలిసినప్పుడు ఇలాంటి వాటి గురించి తెలుసుకుని ఎందుకు బాధపడతాం' అని అన్నారు.(ఇది చదవండి: మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు: ఆర్తి)కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే తన అనుమతి లేకుండానే విడాకుల ప్రకటన విడుదల చేశారని ఆయన భార్య ఆర్తి ఆరోపించింది. అయితే ఆమె మాటల్లో ఎలాంటి నిజం లేదని జయం రవి క్లారిటీ ఇచ్చారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. -
విడాకులు క్యాన్సిల్! ధనుష్-ఐశ్వర్య మళ్లీ ఒక్కటి కానున్నారా? (ఫొటోలు)
-
టెలిగ్రామ్ సీఈవో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా?
టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ పాత ఫోటోలు ఆన్లైన్లో మళ్లీ తెరపైకి వచ్చాయి. తన రూపాన్ని మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని రూమర్స్ వ్యాపిస్తున్నాయి. అక్రమ లావాదేవీలు, పిల్లల అశ్లీల చిత్రాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మోసాలు వంటివాటిని టెలిగ్రామ్ అనుమతిస్తోందన్న ఆరోపణలపై ఇటీవల ఫ్రాన్స్‌లో దురోవ్ అరెస్టయ్యారు.రష్యాలో జన్మించిన పావెల్ దురోవ్ 2013లో టెలిగ్రామ్‌ను మెసేజింగ్ యాప్‌గా ప్రారంభించారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం దురోవ్ సంపద 15.5 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ.1.3 లక్షల కోట్లు. దుబాయ్‌కి చెందిన ఈ బిలియనీర్‌ను వారం రోజుల క్రితం పారిస్‌లో అదుపులోకి తీసుకున్నారు.దురోవ్ 2011 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. పలు సందర్భాల్లో ఆయన తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. దురోవ్ ఇటీవలి ఫొటోల్లో ఒత్తైన జుట్టు, టోన్డ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. చొక్కా లేకుండా దిగిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో ఉన్నాయి. అయితే దురోవ్ ఇటీవలి ఫొటోలు పాత ఫొటోలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.సోషల్ మీడియాలో వైరల్ఇలా దురోవ్ తాజా ఫొటోలను, పాత ఫొటోలను పోలుస్తూ ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆయన ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడన్న పుకార్లు నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. దీనిపై ఎవరికి తోచినట్లు వారు కామెంట్స్ చేస్తున్నారు. దురోవ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారని, లేదు విగ్ పెట్టుకున్నారని ఇలా తలో వాదన చేస్తున్నారు.Pavel Durov (Telegram CEO) before his hair transplant and plastic surgery. pic.twitter.com/TTb3am2Ddn— Creepy.org (@creepydotorg) September 1, 2024 -
అది వాళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారం: విజయసాయిరెడ్డి
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీకి కీలక నేతల వలసలు ఉండబోతున్నాయంటూ ఈ ఉదయం నుంచి టీడీపీ అనుకూల మీడియా తెగ హోరెత్తిస్తోంది. ఈ క్రమంలో ఐ-టీడీపీ, దాని అనుబంధ సోషల్ మీడియా విభాగాలు సైతం ఆ ప్రచారానికి కొన్ని పేర్లను జోడించి పోస్టులు వైరల్ చేస్తున్నాయి. అయితే..ఆ దుష్ప్రచారం తీవ్రంగా స్పందించారు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. వైఎస్సార్సీపీలో విధేయుడిగా.. నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తగా అంకితభావంతోనే పని చేస్తానని అన్నారాయన. వైఎస్ జగన్ నాయకత్వంలోనే తాను పని చేస్తానని స్పష్టం చేశారు.తాను ఎప్పటికీ వైస్సార్సీపీలోనే ఉంటానని.. మరో పార్టీలో చేరబోతున్నారంటూ ఒక వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారు. I wish to make it clear that I am a loyal, dedicated, and committed worker of the YSRCP. I will remain with YSRCP and work under the leadership of Sri @ysjagan Garu. I condemn the baseless speculation and misinformation being spread by a section of the media about me quitting…— Vijayasai Reddy V (@VSReddy_MP) August 28, 2024 -
హీరో భార్యపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. స్పందించిన నటి!
సెలబ్రిటీలపై రూమర్స్ రావడమనేది సహజం. వారిపై ఏదో ఒక రూమర్ రావడం.. దానికి మళ్లీ క్లారిటీ ఇవ్వడం ఇలా సర్వసాధారణంగా మారింది. తాజాగా బాలీవుడ్ హీరో భార్య, నటి పాత్రలేఖపై పలు ఊహగానాలు మొదలయ్యాయి. 2021లో రాజ్ కుమార్ రావును పెళ్లాడిన ఆమె ప్రస్తుతం గర్భంతో ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది.పాత్రలేఖ మాట్లాడుతూ..' నా కడుపులో ఉబ్బినట్లుగా కనిపించినప్పుడల్లా గర్భవతిని అయిపోతానా? నేను కూడా ఒక అమ్మాయినే కదా? నా జీవితంలో సంతోషంగా లేని రోజులు కూడా ఉన్నాయి. కానీ నా లైఫ్ కోరుకున్న విధంగా ఉండాలనుకున్నా. అయితే మొదటి నుంచి నాపై వస్తున్న రూమర్లను నేను పట్టించుకోను. అందుకే కామెంట్స్ కూడా చదవటం మానేశా. కేవలం ఫోటోలు మాత్రమే చూస్తున్నా. నేను ఎలాంటి దుస్తులు ధరించినా మీరు ఇలానే ఊహించుకుంటారా?' అని ఘాటుగానే ప్రశ్నించింది.తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలు అవాస్తమని పాత్రలేఖ కొట్టిపారేసింది. కాగా.. రాజ్ కుమార్ రావు ఇటీవలే స్త్రీ-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 15 ఏళ్ల డేటింగ్లో ఉన్న వీరిద్దరు 2021లో వివాహం చేసుకున్నారు. మరోవైపు పాత్రలేఖ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'ఐసీ 814: ది కాందహార్ హైజాక్'లో కనిపించనుంది. ఈ సిరీస్‌లో విజయ్ వర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. -
‘జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!’ ఎపిసోడ్లో ట్విస్ట్!
తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని, ఇంటికి మాత్రం వెళ్లబోనని తేల్చి చెప్పిన 34 ఏళ్ల టెక్కీ విపిన్ గుప్తా ఎపిసోడ్‌పై ఆయన భార్య శ్రీపర్ణ దత్త స్పందించారు. తాను భర్తను వేధించానంటూ వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. భార్య వేధిస్తుంది కాబట్టే ఆమె నుంచి తప్పించుకునేందుకు భర్త తిరుగుతున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు. తన భర్త గత కొంత కాలంగా కెరియర్ గురించి ఆందోళనకు గురైనట్లు చెప్పారు. గతంలో తన భర్తపై మిస్సింగ్ కేసు వేసిన శ్రీపర్ణ దత్తా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నా భర్త విపిన్ రెండుసార్లు ఉద్యోగం కోల్పోయాడు. దీంతో భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు తండ్రికి అనారోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్సకు డబ్బు అవసరం కావడంతో మానసికంగా కుంగిపోయాడు. ఉపశమనం పొందేందుకు తిరుమల దర్శనం అనంతరం నోయిడా వెళ్లినట్లు చెప్పారు. అన్నీ అవాస్తవాలేఈ సందర్భంగా తాను విపిన్‌ను వేధిస్తున్నానంటూ వచ్చిన ఆరోపణల్ని కొట్టిపారేశారు. ‘నేను నా భర్తను వేధిస్తే.. ఆయన ఆచూకీ కోసం సోషల్ మీడియాను ఎందుకు ఆశ్రయిస్తాను. నేను నా భర్తను ఎప్పుడూ వేధించలేదు. అదే జరిగితే, అతనిని వెతకాలని పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేస్తాను? ఆచూకి కోసం సోషల్ మీడియాలో పోస్ట్‌లు ఎందుకు పెడతాను’ అని ప్రశ్నించారు. మానసికంగా కృంగిపోయాడు కాబట్టే భర్తను పునరావాస కేంద్రానికి పంపించినట్లు ఆమె చెప్పారు.బెదిరింపులు ఎక్కువయ్యాయ్తన భర్త దొరికిన తర్వాత కూడా తనకు బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నాయని వాపోయారు శ్రీపర్ణ దత్త. నా భర్తను కిడ్నాప్ చేశామంటూ పలువురు డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనకు సైబర్ నేరస్తులు మెసేజ్‌లు పంపినట్లు వెల్లడించారు. భార్య పోరు పడలేకేగతవారం బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహించే ఐటీ ఉద్యోగి విపిన్ గుప్త ఇంటి నుంచి నోయిడా వెళ్లాడు. అయితే విపిన్ జాడకోసం ఆయన భార్య శ్రీపర్ణ దత్తా పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యల్ని చేపట్టారు. చివరికి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరుకు రప్పించగా, ఇంటికి వెళ్లేందుకు మాత్రం ఒప్పుకోలేదు. తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని పోలీసుల్ని కోరాడు. అయితే పోలీసులు విపిన్‌ను బుజ్జగించడంతో కష్టం మీద ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. భార్యే విపిన్ మానసిక సమస్యకు చికిత్స ఇప్పించేందుకు పునరావస కేంద్రానికి పంపించారు. -
నా భర్త నన్ను మోసం చేయలేదు.. షకీబ్ భార్య క్లారిటీ (ఫోటోలు)
-
టీడీపీ నేతల్లా పారిపోయే రకం కాదు: దేవినేని అవినాష్
విజయవాడ, సాక్షి: తనపై తెలుగు దేశం పార్టీ, దాని అనుకూల మీడియా చేస్తున్న ఉత్త ప్రచారంపై వైఎస్సార్సీపీ నేత, ఆ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం తనకు లేదంటూ ఓ వీడియో విడుదల చేశారాయన.‘‘నేను విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించానని వచ్చిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. నా నియోజకవర్గ ప్రజలకు , కార్యకర్తలకు 24 గంటలూ అందుబాటులోనే ఉన్నా. పనీపాటా లేని కొన్ని మీడియా సంస్థలు , టీడీపీ సామాజిక మాధ్యమాల్లో నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నేను దేనికి పారిపోవాలి...ఎందుకు పారిపోవాలి?.... నేను తప్పుచేశానని కోర్టు భావిస్తే.. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దమ్ముగా స్వీకరిస్తాం. తప్పుడు కేసులకు భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. సమస్యలొస్తే టీడీపీ నేతల్లా నేను పారిపోయేరకం కాదు. నా తండ్రి నాకు జన్మనివ్వడంతో పాటు ధైర్యాన్ని కూడా ఇచ్చారు. మా నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మా పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ. వైసీపీ కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటాం. మరోసారి చెబుతున్నా.. టీడీపీ , ఎల్లో మీడియా చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దు అంటూ ఆ వీడియో సందేశంలో కోరారాయన.టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పలువురు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. అందులో దేవినేని అవినాష్ పేరు కూడా ఉంది. మొన్నీమధ్యే వల్లభనేని వంశీ విషయంలోనూ అతి ప్రదర్శించిన ఎల్లో మీడియా.. ఇప్పుడు దేవినేని అవినాష్ విషయంలోనూ తప్పుడు రాతలతో అలాగే ప్రవర్తించింది. -
'ఐ యామ్ నాట్ సింగిల్'.. దసరా భామ ఆసక్తికర కామెంట్స్!
దసరా హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రస్తుతం రఘుతాత మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సుమన్‌కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్ తొలిసారి కోలీవుడ్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ.ఇదిలా ఉండగా కీర్తి సురేశ్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీరు సింగిల్‌గా ఉంటున్నారు కదా? అని ఆమెను ప్రశ్నించారు. దీంతో తన రిలేషన్షిప్ గురించి దసరా భామ నోరువిప్పారు. దీనికి బదులిస్తూ.. 'నేనేప్పుడు సింగిల్ అని చెప్పలేదుగా' అమటూ సమాధానమిచ్చింది.కాగా.. గతంలో ఆమె పెళ్లిపై చాలాసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ చేసిన కామెంట్స్ నెట్టంటి తెగ వైరలవుతున్నాయి. అయితే తాను సింగిల్ కాదని చెప్పడంపై.. ఇప్పటికే రిలేషన్లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే పరోక్షంగా హింట్ ఇచ్చిందని చెబుతున్నారు. మరోవైపు కీర్తి సురేశ్ బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుంది. బేబీ జాన్ సినిమాతో వరుణ్ ధావన్ సరసన నటించనున్నారు. -
గ్రీస్‌లో ఆదిపురుష్ భామ.. అతనితో డేటింగ్ నిజమేనా!
ఆదిపురుష్ భామ, బాలీవుడ్ నటి కృతి సనన్ తెలుగువారికి సుపరిచితమే. ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో సీతగా మెప్పించింది. అయితే ఈ మూవీ ఆశించినంత స్థాయిలో అభిమానులను అలరించలేకపోయింది. ఓం రౌత్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇటీవల క్రూ మూవీతో ఫ్యాన్స్‌ను అలరించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం గ్రీస్‌లో విహరిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న కబీర్ బహియాతో చిల్ అవుతోన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.గతంలో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పలుసార్లు రూమర్స్ వినిపించాయి. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లోనూ ఈ జంట పార్టీలో సందడి చేశారు. అప్పటి నుంచే వీరిద్దరిపై డేటింగ్లో ఉన్నారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే కబీర్‌తో రిలేషన్‌పై ఇప్పటివరకు కృతి సనన్ స్పందించలేదు. అయితే తాజాగా వీరిద్దరు జంటగా గ్రీస్‌లో కనిపించడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా కృతి సనన్ ఇటీవల తన పుట్టినరోజును కబీర్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.పదేళ్ల ఏజ్ గ్యాప్..అయితే ఈ జంట మధ్య వయసు అంతరం ఎక్కువగానే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కృతి సనన్ వయస్సు 34 ఏళ్లు కాగా.. కబీర్ బహియాకు వయస్సు 24 ఏళ్లు మాత్రమేనని తెలుస్తోంది. అంటే వీరిద్దరి మధ్య దాదాపు 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఇది చూస్తుంటే తనకంటే పదేళ్లు చిన్నవాడైన కబీర్‌తో ఆదిపురుష్ భామ ప్రేమాయణం నడిపిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే కృతి సనన్ దో పట్టి మూవీలో కనిపించనుంది. ఇందులో కాజోల్, షహీర్ షేక్ కూడా నటించారు. -
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. నటి ఏమన్నారంటే?
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం రఘు తాత. ఈ చిత్రానికి సుమన్‌కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో చిత్రయూనిట్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా వరుసగా ఈవెంట్లకు హాజరవుతున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి సురేశ్ అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'నాపై వచ్చే రూమర్స్‌పై క్లారిటీ ఇస్తే అదే నిజమనుకుంటారు. అందుకే వాటిపై నేను రియాక్ట్ అవ్వను. కేవలం నా సినిమాల ఎంపిక, నటనపై విమర్శలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తా. వాటితో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతా. నా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ గురించి ఎవరైనా కామెంట్స్ చేసినా పట్టించుకోను. వాళ్ల వ్యక్తిగత కారణాలతో చేసే కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు' అని తెలిపింది.కాగా.. గతంలోనూ కీర్తి సురేశ్ పెళ్లిపై చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. వాటిన్నింటినీ ఆమె తల్లిదండ్రులు సైతం కొట్టిపారేశారు. కాగా.. రఘుతాత చిత్రంలో పోరాటం చేసే మహిళ పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే టీజర్‌ను విడుదల చేయగా.. విద్యాభ్యాసం, ఉద్యోగంలో ఓ అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు పడిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. -
సానియాతో పెళ్లి?.. మీకు దమ్ముంటే ముందుకు రండి: షమీ వార్నింగ్ (ఫొటోలు)
-
కత్రినా కైఫ్‌కు ప్రెగ్నెన్సీ.. విక్కీ కౌశల్ ఏమన్నారంటే?
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రస్తుతం బ్యాడ్‌న్యూజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఓ సాంగ్ రిలీజ్ కాగా.. వీరిద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్లో అభిమానులను ఆకట్టుకుంది. ఆనంద్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా.. చిత్రబృందం ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా విక్కీ కౌశల్ ఢిల్లీ నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మరోసారి ఆయనకు మరోసారి అలాంటి ప్రశ్నే ఎదురైంది. మీ భార్య ప్రస్తుతం గర్భంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? అని విక్కీ కౌశల్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. 'ఇలాంటి విషయాన్ని అభిమానులతో పంచుకునేందుకు చాలా సంతోషిస్తాం.. ఏదైనా ఉంటే మీతోనే ముందుగా పంచుకుంటామని తెలిపారు. ప్రస్తుతానికైతే ఎలాంటి శుభవార్త లేదని.. అవన్నీ కేవలం రూమర్స్ అని కొట్టిపారేశారు.ఇప్పటికైతే బ్యాడ్ న్యూజ్ను ఎంజాయ్ చేయండి.. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మీతో తప్పకుండా పంచుకుంటాం అని నవ్వుతూ అన్నారు. కాగా.. ఇటీవల ముంబైలో జరిగిన అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహానికి విక్కీ, కత్రినా కైఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ బేబీ బంప్‌తో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. దీంతో తాజాగా మరోసారి విక్కీ కౌశల్ క్లారిటీ ఇచ్చారు. బ్యాడ్ న్యూజ్ జూలై 19, 2024న థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. డిసెంబర్ 9, 2021న రాజస్థాన్‌లోని ఈ జంట వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
అలాంటి డ్రెస్‌లో కత్రినా కైఫ్.. ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్!
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ బీటౌన్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరు. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన మెప్పించింది. తెలుగులోనూ వెంకటేశ్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. అయితే హీరో విక్కీ కౌశల్ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లాడింది. గతేడాది మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను అలరించింది. తాజాగా ఆమె ముంబయిలోని ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది.అయతే కత్రినా కైఫ్ వదులుగా ఉండే జాకెట్ ధరించిన విమానాశ్రయంలో కనిపించింది. అలా ఆమెను నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతిగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే వీటిపై విక్కీకౌశల్ స్పందించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. గత నెలలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌తో లండన్ వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.కాగా.. కత్రినా 'మెర్రీ క్రిస్మస్' తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు. మరోవైపు ఆమె భర్త విక్కీ కౌశల్, ట్రిప్తీ డిమ్రీతో కలిసి 'బాడ్ న్యూస్'లో కనిపించనున్నాడు. ఆ తర్వాత రష్మిక మందన్నతో 'ఛవా', సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ అండ్ వార్' చిత్రాల్లో నటించనున్నారు. ఇందులో రణబీర్ కపూర్, అలియా భట్ కూడా భాగం కానున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఈ చిన్నారి ఇప్పుడు టాప్ సెలబ్రిటీ.. కొడుకే తన ప్రపంచం (ఫొటోలు)
-
ఐకానిక్ భవనంపై టీడీపీ రచ్చ..
-
ప్రముఖ సింగర్‌పై రూమర్స్.. నాలుగో భర్తకు కూడా..!
హాలీవుడ్ ప్రముఖ నటి, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ విడిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. 2022లో బెన్ అఫ్లెక్‌ను పెళ్లాడిన నటి త్వరలోనే తమ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు హాలీవుడ్లో లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ జంట బెవర్లీ హిల్స్‌లోని ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్నారు. తాజాగా ఈ భవనాన్ని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం ఏడాది క్రితమే కొనుగోలు చేసిన బంగ్లా అమ్మకానికి పెట్టడంతో ఈ జంట డైవర్స్ తీసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.కాగా.. ఇప్పటికే జెన్నిఫర్ లోపెజ్ ముగ్గురి పెళ్లి చేసుకుని వారితో విడాకులు తీసుకున్నారు. బెన్ అఫ్లెక్ ఆమెకు నాలుగో భర్త కాగా.. ఈ బంధానికి ఎండ్ కార్డ్ పడడం ఖాయంగా కనిపిస్తోంది. 2021లో డేటింగ్ ప్రారంభించిన వీరిద్దరు.. ఆ తర్వాత 2022లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. దీంతో ఈ జంట కేవలం రెండేళ్లలోనే తమ వివాహాబంధానికి ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గత నెల రోజులుగా ఈ జంటపై విడాకుల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు తలెత్తినట్లు సమాచారం. బిజీ షెడ్యూల్ కారణంగానే వీరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. -
హీరామండి నటితో డేటింగ్.. స్పందించిన నటుడు..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. మనీషా కొయిరాలా, ఆదితిరావు హైదరీ, సోనాక్షి సిన్హా ప్రధానపాత్రల్లో నటించిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. పాకిస్తాన్లో లాహోర్‌లో జరిగిన స్వాతంత్య్రానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. అయితే సిరీస్‌లో షర్మిన్ సెగల్(ఆలంజేబ్) ప్రియుడిగా తహా షా బాద్షా నటించారు.అయితే తాజాగా అతను మరో నటితో డేటింగ్లో ఉన్నట్లు బాలీవుడ్లో రూమర్స్ మొదలయ్యాయి. హీరామండి నటి ప్రతిభా రంతాతో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో తనపై వస్తున్న వార్తలపై హీరామండి నటుడు తహా షా బాద్షా స్పందించారు. ఆమెతో పరిచయం కేవలం నటన వరకు మాత్రమేనని అన్నారు. ఆమెతో నా రిలేషన్ కేవలం షూట్ వరకే ఉంటుందని బాద్షా అన్నారు. ముందుగా నేను జీవితంలో స్థిరపడాలని.. ఆ తర్వాతే ప్రేమ, కుటుంబం గురించి ఆలోచిస్తానని వెల్లడించారు. కాగా.. ముంబయిలో ఇద్దరు కలిసి డిన్నర్ డేట్లో కనిపించడంతో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా వీటికి క్లారిటీ ఇచ్చేశాడు. హీరామండిలో తాజ్దార్ పాత్రలో మెప్పించాడు. షర్మిన్ సెగల్ ప్రియుడిగా.. స్వాతంత్ర్య ఉద్యమ కారుడిగా ఈ సిరీస్‌లో మెప్పించారు. ఇటీవల జరిగిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా తాహా షా బాదుషా సందడి చేశారు. ప్రతిభా రంతా హీరామండిలో షామా పాత్రలో కనిపించింది.