మెగా డాటర్ నిహారిక కొణిదెల టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెర యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత కొద్ది రోజులు యాక్టింగ్‌కు దూరంగా ఉన్న నిహారిక రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఓటీటీలో విడుదలైన డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
(ఇది చదవండి: భర్తతో విడాకులు? నిహారికను సూటిగా ప్రశ్నించిన జర్నలిస్ట్)
అయితే గత కొంతకాలంగా ఆమె డైవర్స్ తీసుకుంటున్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తరచుగా వార్తల్లో నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యతో దూరంగా ఉంటోందని.. త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వీటిపై ఇంతవరకు ఎవరూ కూడా స్పందించలేదు.
అయితే తాజాగా నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మీడియా వారిని పలకరించగా ఫోటోలకు ఫోజులిచ్చారు. భర్త జొన్నలగడ్డ వెంట నిహారిక లేకపోవడంతో మరోసారి డైవర్స్ రూమర్స్ ఊపందుకున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు నిహారిక లేకుండా చైతన్య తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం మరోసారి అనుమానాలకు తావిస్తోంది.
(ఇది చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్ నిశ్చితార్థం? నిహారిక ఏమందంటే?)
అంతే కాకుండా ఈ మధ్యకాలంలో నిహారి-చైతన్య జంటగా ఎక్కడా కనిపించకపోవడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం.. పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడం మరో కారణం. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతోనే ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment