niharika
-
అయ్యప్ప మాలలో ఉండి.. భార్యను
మేడిపల్లి: ఇంట్లో జరిగిన గొడవ చినికి చినికి గాలివానలా మారి.. ఓ ఇల్లాలి ప్రాణం తీసింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాపసింగారంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్‌కు చెందిన నిహారిక(35), శ్రీకర్‌రెడ్డి దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘట్కేసర్ మండలం ప్రతాపసింగారంలో నిహారికకు పుట్టింటి వారు ఓ ఇల్లు రాసివ్వగా...వీరు ఆ నివాసంలోనే ఉంటున్నారు. కాగా ఈ ఇల్లు రాసిచ్చిన విషయంలో నిహారిక, శ్రీకర్రెడ్డిల మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారు జామున ఇంటి విషయంపై మరోసారి గొడవ జరగడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరగ్గా..తోపులాటలో నిహారిక కింద పడిపోయింది. అప్పటికే ఆవేశంలో ఉన్న శ్రీకర్‌రెడ్డి పక్కనే ఉన్న బండరాయితో తలపై కొట్టడంతో నిహారిక అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఇచి్చన సమాచారంతో మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఆ విషయాన్ని మరచిపోయాను: చిరంజీవి
‘‘మా నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చక్కగా ఉంది. అందరూ కొత్త కుర్రాళ్లే అయినా చాలా బాగా నటించారు. సినిమా చూస్తున్నప్పుడు కొత్తవాళ్లు నటించారనే విషయాన్ని మరచిపోయాను. ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు చక్కగా పండాయి’’ అని హీరో చిరంజీవి అన్నారు. నూతన నటీనటులతో (నలుగురు హీరోయిన్లు, 11 మంది హీరోలు) యదు వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. తాజాగా ‘కమిటీ కుర్రోళ్ళు’ వీక్షించిన చిరంజీవి యూనిట్‌ని అభినందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ–‘‘ఈ చిత్రాన్ని సహజంగా చిత్రీకరించటం కోసం టీమ్ పడ్డ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. రీజనబుల్ బడ్జెట్లో తెరకెక్కించిన యదువంశీకి అభినందనలు. ఇటీవల విడుదలైన సినిమాల్లో ‘కమిటీ కుర్రోళ్ళు’ ముందంజలో ఉంటూ మంచి వసూళ్లు రాబడుతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు. చిరంజీవిని కలిసిన వారిలో నిహారిక, యదు వంశీతో పాటు చిత్ర నటీనటులున్నారు. -
నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థం ఏంటి?
విడాకుల తర్వాత మెగాడాటర్ నిహారిక కొణిదెల కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయిపోయింది. హీరోయిన్గా రీఎంట్రీ ఇస్తూనే..యాంకర్‌గాను ఓ షో చేస్తుంది. అలాగే నిర్మాతగాను మారి సినిమాలు, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నారు. అలాగే ఖాలీ సమయం దొరికనప్పుడల్లా ప్రెండ్స్‌తో కలిసి టూర్‌కి వెళ్తూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నా..పట్టించుకోకుండా తనకు నచ్చిన పనిని చేసుకుంటూ పోతుంది. అయితే ఆమె పర్సనల్ లైఫ్‌పై మాత్రం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇటీవల ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో..ఆల్రెడీ ప్రేమలో పడిందని పుకార్లు వినిపించాయి. నిహారిక మాత్రం వాటిపై స్పదించకుండా..నెట్టింత హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది. తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన ఓ స్టోరీ మరోసారి ఆమె పెళ్లి విషయంపై చర్చకు దారి తీసింది. అందులో ఏముందంటే.. ఓ ఏనుగుల జంట రెండు ముఖాలను దగ్గరగా పెట్టుకొని ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి. ఆ ఫోటోని నిహారిక ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. రెడ్ హార్ట్ సింబల్ పెట్టింది. అది చూసిన వారంత నిహారిక మరోసారి ప్రేమలో పడిందని.. అందుకే ఇలాంటి పోస్టులు పెడుతుందని చర్చించుకుంటుననారు. అయితే నిహారికలో మళ్లీ ప్రేమలో పడలేదని, ప్రస్తుతానికి ఆమె ఫోకస్ అంతా కెరీర్‌పైనే ఉందని మెగా ఫాన్స్ అంటున్నారు. తనకు ఏనుగులు అంటే ఇష్టమని.. అందుకే వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసి ఉంటారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. -
స్మైలీ లుక్స్‌తో గుంటూరు కారం హీరోయిన్.. కొత్త సినిమా పూజ కార్యక్రమంలో నిహారిక!
స్మైలీ లుక్స్‌తో గుంటూరు కారం హీరోయిన్ శ్రీలీల.. కొత్త సినిమా పూజ కార్యక్రమంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల.. ఆరెంజ్ డ్రెస్‌లో మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని.. గ్రీన్ డ్రెస్‌లో రీతూ భామ హోయలు.. బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంత్ లుక్ వైరల్ తన కూతురితో కలిసి హీరోయిన్ రంభ పోజులు View this post on Instagram A post shared by Rambha💕 (@rambhaindran_) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
Niharika Konidela Photos: నిహారిక కొణిదెల బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
శృతిహాసన్ స్టన్నింగ్ పోజులు.. పూనమ్ బజ్వా హాట్ లుక్స్!
►గోల్డ్ డ్రెస్‌లో శృతిహాసన్ స్టన్నింగ్ పోజులు ►బ్లూ కలర్ డ్రెస్సులో పూనమ్ బజ్వా హాట్ లుక్స్ ►ఎల్లో శారీలో ప్రియా భవానీశంకర్ హోయలు ►కలర్‌ఫుల్ డ్రెస్‌లో నిహారిక స్మైలీ లుక్స్ ►ఫుల్‌గా చిల్ అవుతోన్న ఆదా శర్మ ►గ్లామర్‌తో కవ్విస్తోన్న మీనాక్షి చౌదరి View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
గూగుల్ జాబ్‌నే వద్దనుకున్న ఈ ఇన్ఫ్లుయన్సర్ గురించి తెలుసా?
నిహారిక ఎన్ఎం (Niharika NM).. అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్. ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో చాలా పాపులర్ అయ్యారు. చాలా మంది సెలబ్రిటీలతో కలిసి రీల్స్ చేసిన ఆమె ఆమధ్య కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో కనిపించి మరింత పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఇంత పాపులర్ అయిన నిహారిక ప్రఖ్యాత అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ గూగుల్ (Google)లో జాబ్ వచ్చినా వద్దనుకుందని మీకు తెలుసా? తాజాగా జరిగిన మనీకంట్రోల్ క్రియేటర్ ఎకానమీ సమ్మిట్‌లో ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నేనే బ్రాండ్ కావాలనుకున్నా బెంగళూరులో జన్మించిన నిహారిక కాలిఫోర్నియాలోని చాప్మన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. గూగుల్ జాబ్‌ను వద్దనుకోవడం ఆవేశపూరిత నిర్ణయం కాదని, ఆ ఆఫర్‌ను తిరస్కరించే ముందు తమ కుటుంబమంతా కూర్చుని లాభనష్టాలను బేరీజు వేసుకున్నట్లు వివరించారు. కంటెంట్ క్రియేటర్‌గా ఇతర బ్రాండ్లకు మార్కెటింగ్ చేయడం కన్నా తానే బ్రాండ్ కావాలని కోరుకున్నానని అందుకే గూగుల్ జాబ్‌ను వద్దనుకున్నట్లు చెప్పారు. తాను ఆ ఉద్యోగంలో చేరి ఉంటే తన అమ్మ గర్వపడేదని చెప్పుకొచ్చిన నిహారిక.. అప్పటి వరకూ తన డ్రీమ్ కూడా అదేనని పేర్కొన్నారు. “ఆ ఉద్యోగం సంపాదించడం నా కల. అందుకోసం చాలా కష్టపడ్డాను. తీరా అది పొందినప్పుడు 'లేదు, ఇప్పుడు నాకు అది వద్దు' అని తిరస్కరించడం అంత సులభం కాదు. ఇది కుటుంబ నిర్ణయం” అని ఆమె వివరించింది. అందరికీ ఒకే సూత్రం సరిపోదు ఇక గూగుల్‌లో ఎంపిక గురించి మాట్లాడుతూ ‘అది చాలా విభిన్న ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. గూగుల్ ఇంటర్వ్యూను క్రాక్ చేయడానికి అందరికీ ఒకే సూత్రం సరిపోదు’ అన్నారు. తన లాగా కంటెంట్ క్రియేషన్‌లో అడుగుపెడుతున్న యువత కోసం కొన్న ఆచరణాత్మక సలహాలు కూడా ఇచ్చింది నిహారిక. ముందు చదువు పూర్తి చేయాలని, ఒక వేళ జాబ్ చేస్తున్నట్లయితే అది పూర్తిగా మానేయకుండా కొనసాగిస్తూ కంటెంట్ క్రియేషన్‌ను సైడ్ హస్టిల్గా కొనసాగించాలని సలహా ఇచ్చింది. -
ఒక్క పోస్ట్‌తో వారికి ఇచ్చిపడేసిన నిహారిక కొణిదెల!
సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలంటే జనాలకు చాలా ఇష్టం. వారి పర్సనల్ లైఫ్‌పై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. పెళ్లి చేసుకున్నప్పుడు చప్పట్లు కొట్టడం, విడాకులు తీసుకున్నప్పుడు నోటికొచ్చింది తిట్టేయడం నెటిజన్లకు అలవాటైపోయింది. అటుపక్కన ఉన్నవారు ఎంత బాధపడతారనే విషయం కూడా ఆలోచించడం లేదు. కొందరైతే హద్దులు మీరి మరీ సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇటీవలి కాలంలో విడాకుల వల్ల ట్రోలింగ్‌కు గురైనవారిలో నిహారిక కొణిదెల ఒకరు. తొలుత ఆమె చైతన్యతో విడిపోయినట్లు రూమర్స్ వచ్చాయి. ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. తర్వాత ఓ సమయం చూసుకుని ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు, విడాకులు తీసుకున్నారు. అయితే నిహారిక విడాకులకు ఆమె వ్యవహార శైలే కారణమని కొందరు లేనిపోని పుకార్లు సృష్టించారు. తనకున్న పబ్ అలవాట్ల వల్లే చైతన్య దూరం పెట్టాడని ఏదేదో రాసేశారు. అంతేకాదు, తనకు యూట్యూబర్ నిఖిల్‌కు లింక్ పెడుతూ వాళ్లను విమర్శించారు. తాజాగా ఆ వార్తలకు పరోక్షంగా ఘాటుగా సమాధానమిచ్చింది నిహారిక. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో నిఖిల్‌కు బర్త్‌డే విషెస్ చెప్పింది. 'యాంకరింగ్ నుంచి సహనటుడిగా మారావు. అక్కడి నుంచి నిర్మాతగా.. తర్వాత నా చిట్టి తమ్ముడిగా మారావు. మనం కలిసి చాలాదూరం ప్రయాణించాం. స్వచ్ఛమైన మనసు ఉన్నవాళ్లు కొందరే ఉంటారు. అందులో నువ్వు ఒకడివి. లవ్ యూ నిక్కు. గ్రేట్ బర్త్‌డే నానా..' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. దీనికి నిఖిల్ థాంక్యూ నిహా అని రిప్లై ఇచ్చాడు. నిఖిల్ తనకు తమ్ముడిలాంటివాడని పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చేసింది నిహారిక. చదవండి: రెండు వారాలకు షకీల ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా? -
నిహారిక.. సైక్లిస్ట్ శిఖరం
అనంతపురం: రేస్ అంటే బైక్, కారు మాత్రమే కాదు.. సైక్లింగ్ చేయడం కూడా సాహసమే.. కొందరు సైకిల్ తొక్కడం సరదాగా నేర్చుకుంటే.. మరికొందరు సాహసం చేయడానికి వెనుకాడడంలేదు. అందులో గార్లదిన్నె మండలం తిమ్మంపేటకు చెందిన నిహారిక సాహసోపేత సైక్లింగ్ చేస్తూ పర్వతాలపైకి కూడా దూసుకెళ్తోంది. చిన్నతనం నుంచి ఆమెకు సైక్లింగ్‌పై ఆసక్తి ఉంది.. తల్లిదండ్రులు కూడా ఆమెను నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించి, శిక్షణ ఇప్పించారు. ఆ స్ఫూర్తితో ముంబాయిలో సరదాగా సైక్లింగ్ నేర్చుకుని, దగ్రేట్ హిమాలయన్ అల్ట్రా రేస్‌ను పూర్తి చేసింది. 2020లో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించి, కన్నవారితోపాటు తెలుగువారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటుతోంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేటకు చెందిన భాస్కర్‌రెడ్డి, వాణి రెడ్డి దంపతులు 2005లో ముంబాయిలో వ్యాపారం చేయడానికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వీరికి నిహారిక రెడ్డి, లలిత్ సంతానం. కుమార్తె నిహారిక రెడ్డి చిన్నతనం నుంచి సైక్లింగ్‌పై ఆసక్తి పెంచుకోవడంతో తల్లిదండ్రులు కూడా ఆమె ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. దీంతో సైక్లింగ్ రేస్ అంటే సాహసోపేతమైనా అందులో తర్ఫీదు పొందింది. నిహారిక రెడ్డి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ముంబాయిలోనే చదివింది. ప్రస్తుతం అక్కడే ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (ఎంపీసీ) చదువుతోంది. చిన్నతనంలో ఎలాంటి అనుభవం లేక పోయినా దాదాపు 700 కిలో మీటర్లు సైక్లింగ్ చేసి, అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటగా 2020లో అండర్ – 15 లో ముంబాయి – హైదరాబాద్ 656 కిలో మీటర్లు సైక్లింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. ఆర్ఏఎంకు అర్హత.. నిహారికరెడ్డి 2022లో అండర్– 16 పుణె టు గోవా సైక్లింగ్ రేస్‌లో పాల్గొని, 652 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి చేసింది. కోచ్ కబీర్ డెక్కన్, హిమాలయన్, రేస్‌లు పూర్తి చేసి ఆర్ఏఎంకు అర్హత సాధించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ కబీర్ స్ఫూర్తితో ఆమె రోజూ 50 కిలో మీటర్లు సైక్లింగ్ చేస్తూ ఫిట్నెస్ను కాపాడుకుంటూ వస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 26,27 తేదీల్లో ఇన్స్పైర్ ఇండియా నిర్వహించిన భారత్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక రేస్ దగ్రేట్ హిమాలయన్ అల్ట్రా రేస్‌లో పాల్గొని, లేహ్ నుంచి ద్రాస్ వరకు మళ్లీ ద్రాస్ నుంచి లేహ్ వరకు మధ్యలో కార్గిల్ వరకు 600 కిలో మీటర్లు 36 గంటల్లో రేస్ పూర్తి చేయాలని లక్ష్యంతో పాల్గొంది. సముద్ర మట్టానికి 10,350 మీటర్లు ఎత్తు లో ఈ రేస్‌ను 39 గంటల్లో పూర్తి చేసి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆర్ఏఎం చేయడం లక్ష్యం ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక రేస్ అక్రాస్ అమెరికా (ఆర్ఏఎం) అల్ట్రా రేస్‌కు అర్హత సాధించి, స్వప్నం సాకారం చేసుకోవడమే లక్ష్యం. అందుకోసం రోజూ ఉదయం 5 గంటల నుంచి 7 వరకు దాదాపు 50 కిలో మీటర్లు సైక్లింగ్ చేస్తా. ఆదివారం దాదాపు 100 నుంచి 120 కిలో మీటర్లు సైక్లింగ్ చేస్తా. ఆర్ఏఎం రేసులో అమెరికా వెస్ట్ కోస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్ వరకు సుమారు 4,500 కిలో మీటర్లు దూరం ఉంటుంది. ఈ రేసులో పాల్గొనాలంటే డెక్కన్, హిమాలయన్ రేస్‌లు పూర్తి చేయాలి. – నిహారిక, సైక్లిస్ట్ -
నిహారికను తిట్టిన నెటిజన్‌కు సాయిధరమ్ తేజ్ వార్నింగ్
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి విమర్శలు గుప్పించడం పరిపాటిగా మారింది. చాలామంది ట్రోలర్లు ఇదే పనిగా పెట్టుకుని ఎప్పుడూ ఎవరో ఒకరిని విమర్శిస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా మెగా డాటర్ నిహారిక మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. విడాకుల వ్యవహారం తర్వాత ఇది పీక్స్‌కు వెళ్లింది. తను వెకేషన్‌కు వెళ్లినా, ఏదైనా పోస్ట్ పెట్టినా.. ఏం చేసినా సరే తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ నెగెటివిటినీ నిహారిక లైట్ తీసుకుని తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య సాయిధరమ్ తేజ్ 'సత్య' అనే షార్ట్ ఫిలిం చేసిన సంగతి తెలిసిందే! ఇందులో ఒక పాటను ఆగస్టు 15న విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించిన అప్డేట్లను సాయిధరమ్ తేజ్ ఎప్పటికప్పుడూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఓ పోస్ట్‌పై నిహారిక కొణిదెల స్పందిస్తూ.. ఈ పాట కోసం ఎంతో ఎదురుచూస్తున్నాను అని కామెంట్ చేసింది. దీనికి రిప్లైగా ఓ నెటిజన్.. వీటి మీద ఉన్న శ్రద్ధాసక్తులు కుటుంబం మీద లేకపాయె అని సెటైర్ వేశాడు. దీంతో సాయిధరమ్ తేజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నోరు అదుపులో పెట్టుకో, వెంటనే ఆ కామెంట్ డిలీట్ చేయ్ అని వార్నింగ్ ఇచ్చాడు. నిహారిక కోసం తేజ్ అండగా నిలబడడాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అయితే నెటిజన్ కామెంట్‌తో పాటు తేజ్ తన కామెంట్‌ను సైతం డిలీట్ చేశాడు. కానీ అప్పటికే అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: జైలర్‌లో డ్యాన్స్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫేమస్ అవ్వడానికి ముందే గదిలో శవమై.. -
ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్ ఆది.. పేరు విహారిక!
తనదైన పంచ్ డైలాగులతో ట్రెండింగ్ కమెడియన్‌గా మారాడు హైపర్ ఆది. జబర్ధస్త్ కామెడీతో షో అతని జీవితాన్ని మార్చేసింది. ఆ షోలో మొదటగా కంటెస్టెంట్‌గా వచ్చి, తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. ప్రస్తుతం మల్లెమాల ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న పలు టీవీ షోలలో ఆది పాల్గొంటూ తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు. పలు షోలలో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. (చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) తాజాగా ఓ టీవీ షోలో తన ప్రియురాలిని పరిచయం చేశాడు. తాను గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆమెను పరిచయం చేస్తానంటూ స్టేజ్‌పైకి పిలిచాడు. ‘ఇప్పటివరకు కంటెంట్ కోసం చాలా మందికి లైన్ వేసినట్లు చెప్పాను. కానీ నేను నిజంగా ప్రేమించింది ఒక అమ్మాయిని మాత్రమే. ఆమె ఇక్కడే ఉందంటూ ‘బేబీ ఒక్కసారి స్టేజ్‌పైకి రా’అని ఆది పిలవగా.. ఒక అమ్మాయితో నవ్వులు చిందిస్తూ స్టేజ్ మీదకు వచ్చింది. ఆ తర్వాత ఆది తనకు ‘ఐ లవ్ యూ విహారిక’ అంటూ ప్రపోజ్ చేశాడు. విహారిక కూడా ‘లవ్ యూ టూ ఆది’ అని చెప్పింది. అంతేకాదు ఇద్దరూ ఒకరి బుగ్గలను ఒకరు ముద్దాడారు. దీంతో షోలో ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ ఆ జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. విహారికతో ప్రేమాయణం నిజమేనా? హైపర్ ఆది పెళ్లిపై గతంలో చాలా సార్లు పలు రూమర్స్ వినిపించాయి. ఓ యాంకర్‌తో ఆది లవ్‌లో ఉన్నాడని త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్త ఆ మధ్య నెట్టింట చక్కర్లు కొట్టింది. తాజాగా ఆ యాంకర్ వర్షిణితో పెళ్లి అనే పుకార్లు వినిపించగా.. ఆమె కొట్టిపారేసింది. అయితే ఆది మాత్రం ఈ రూమర్స్‌పై ఎప్పుడూ స్పందించలేదు. పైగా తన పెళ్లిపై తానే పంచ్‌లు వేసుకుంటాడు. గతంలో కూడా తాను పెళ్లి చేసుకునేది ఈ అమ్మాయినే అంటూ పలు షోలలో కొంతమందిని పరిచయం చేశాడు. కాకపోతే అది స్కిట్లో భాగమే. కేవలం హైప్ కోసం ఆది అలా చెప్పేవాడు. ఇక తాజాగా ఆది పరిచయం చేసిన అమ్మాయి కూడా షోలో భాగమే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది అయితే ఆ అమ్మాయిని ఏ టీవీ షోలోనూ చూడలేదు. నిజంగానే ఆమె ఆది ప్రియురాలే కావొచ్చునని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమేది అనేది ఆ షో ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక తెలుస్తుంది. -
విడాకుల తర్వాత ఛిల్ మూడ్ లో నిహారిక
-
అమ్మాయిలు నాలుగు రకాలు అంటూ నిహారిక పోస్ట్
టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఇద్దరి అంగీకారంతో విడాకులు తీసుకున్నామని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు కూడా. విడాకుల మూడ్ నుంచి తను ఇప్పుడిప్పేడే సినిమా షూటింగ్లపైపు వెలుతుంది అని చెప్పవచ్చు. తాజాగా నిహారిక ఒక వీడియో షేర్ చేసింది. అందులో మహాతల్లి యూట్యూబ్ ఫేమ్ కూడా ఉంది. (ఇదీ చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై బేబమ్మ రియాక్షన్) వీడియోతో పాటు అమ్మాయిలు ఇలా ఉంటారు అంటూ వాయిస్ వస్తుంది. అందులో ప్రతి అమ్మాయిల గ్యాంగ్‌లో ఇలా నాలుగు రకాల అమ్మాయిలు ఉంటారని చెప్పుకొస్తూ... మొదట నిహారిక తనని తాను ఉద్దేశిస్తూ ఇలా చెప్పింది. ఒకరు ఎల్లప్పుడూ బెటర్ డ్రెస్సింగ్ వేసుకునేందుకు ఇష్టపడుతుంటారని చెప్పింది. మరోకరు ఏ డ్రెస్ వేసుకున్నా కాన్ఫిడెంట్‌గానే ఉంటారని చెప్పింది. మరొకరు.. కనీసం రెడీ అయ్యేందుకు కూడా ఆసక్తి చూపించరు అంటూ... చివరిగా ఓ 'మహాతల్లి' ఉంటుంది కానీ తనెప్పుడు కనిపించదని ఒక పన్నీ ఎమోజీని చూపుతుంది. నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత ఇలాంటి ఫన్నీ వీడియో పోస్ట్ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఆమె ఇప్పుడిప్పుడే విడాకుల మూడ్ నుంచి బయటపడుతున్నారని నెటిజన్లు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) (ఇదీ చదవండి: ‘డబుల్’ కిక్ ఇస్తున్న స్టార్ హీరోలు) -
నాకు ఏదైనా త్వరగా బోర్ కొడుతుంది, కంటెంట్ కోసం ప్రయత్నిస్తాను: నిహారిక
బెంగళూరుకు చెందిన నిహారిక ఇంజినీరింగ్, ఎంబీఏ చేసింది. అయితే తనలోని క్రియేటివిటీ ఆమెను వేరే మార్గం వైపు నడిపించింది. డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్న నిహారికాకు ‘డోన్ట్ జస్ట్ ఫాలో ట్రెండ్స్. సెట్ దెమ్’ అనే మాట అంటే చాలా ఇష్టం... ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు ‘ఇంజినీరింగ్ తప్ప ఏదైనా చేయాలి’ అని గట్టిగా అనుకుంది నిహారిక! పేరెంట్స్ ససేమిరా అన్నారు. దీంతో చదువు తప్పలేదు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు కంటెంట్ క్రియేటర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. సోషల్ లైఫ్ పెద్దగా లేని నిహారిక తన స్టడీరూమ్‌లో ఇంజినీరింగ్ పుస్తకాలు చదువుకుంటూనే, మరోవైపు కామెడీ స్కెచ్‌లు రాసేది. ‘మొదట్లో నన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకునేవారు కాదు. నన్ను అనుకరిస్తూ కామెంట్స్ పెట్టేవారు. అయితే వాటికి నేనెప్పుడు బాధ పడలేదు. స్వభావరీత్యా నేను చాలా సెన్సిటివ్ పర్సన్‌ని. అయితే కాలేజీలోకి అడుగు పెట్టిన తరువాత మరీ ఇంత సున్నితంగా ఉంటే బాగుండదు అనిపించింది. ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ప్రతిదానికి బాధ పడాల్సిన అవసరం లేదు. మానసికంగా దృఢంగా ఉండడం అనేది కంటెంట్ క్రియేటర్‌గా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు బాగా ఉపయోగపడింది. మొదట్లో వెక్కిరించిన వారే ఆ తరువాత మెచ్చుకునేవారు’ అంటుంది నిహారిక. చవకబారు విమర్శల మాట ఎలా ఉన్నా నిర్మాణాత్మక విమర్శను ఇష్టపడుతుంది. ‘కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మనల్ని మనం మెరుగు పెట్టుకోవడానికి నిర్మాణాత్మకమైన విమర్శ తోడ్పడుతుంది’ అంటుంది నిహారిక. ఇన్స్టాగ్రామ్ ‘రీల్స్’ ద్వారా నిహారిక పేరు ఎక్కడికో వెళ్లియింది. నిహారిక కంటెంట్‌కు తొలి ప్రేక్షకురాలు నిహారికానే! ప్రేక్షక స్థానంలో కూర్చున్నప్పుడు తాను ఆ కంటెంట్ ఎంజాయ్ చేయగలిగితేనే ప్రేక్షకుల్లోకి తీసుకువెళుతుంది. 2022లో తన తొలి షార్ట్–ఫార్మట్ కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగిచూసుకోలేదు. తన ఫస్ట్ వైరల్ వీడియో ‘లివింగ్ ఎలోన్ 101’పదమూడు రోజుల వ్యవధిలోనే 11 మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది. ‘ప్రేక్షకుల పెదాల మీద నవ్వులు పూయించే ఔషధం ఇంట్లో దొరకదు. జనాల్లోకి వెళ్లాలి. చిన్న ఎక్స్ప్రెషన్ నుంచి విలువైన మాట వరకు ఎన్నెన్నో బయటి ప్రపంచంలోనే దొరుకుతాయి’ అంటుంది నిహారిక. ‘నాకు ఏదైనా సరే త్వరగా బోర్ కొడుతుంది. దీని వల్ల నాకు జరిగిన మేలు ఏమిటంటే నా కంటెంట్‌ను ఇతరులు బోర్‌గా ఫీల్ కావడానికి ముందుగానే కొత్త కంటెంట్ కోసం ప్రయత్నిస్తాను’ అంటుంది నిహారిక ఎన్ఎం. View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) View this post on Instagram A post shared by Niharika Nm (@niharika_nm) -
అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక
ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఇద్దరి అంగీకారంతో నెలరోజుల కిందటే విడాకుల కోసం హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టు ఇటీవల వారిద్దరికి విడాకులు మంజూరు చేసింది. అయితే వీరి విడాకుల అంశంపై పలువురు నుంచి నెగటివ్ కామెంట్లు వస్తుండటంతో అఫిషియల్‌గా నిహారిక స్పందించింది. (ఇదీ చదవండి: సమంత కీలక నిర్ణయం.. షాక్‌లో అభిమానులు!) 'విడాకుల విషయంలో మేమిద్దరం పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలా సున్నితమైన విషయం. తామిద్దరం కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితంలో ప్రైవసీని కోరుకుంటున్నాం. ఇంతటి ఇబ్బంది సమయంలో నా వెంట ఫ్యామిలీ, స్నేహితులు పిల్లర్స్‌లా నిలబడ్డారు. అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.. మాపై నెగటివ్‌గా ప్రచారం చేయకండి. ఇలాంటి సమయంలో తమను దకయచేసి ఇబ్బంది పెట్టకండి. ఇది ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగత విషయం. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.' అని తెలిపింది. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
విడాకుల తరువాత నిహారిక మొదటి పోస్ట్.. ఎవరి కోసమంటే..
సినిమా రంగంలోని సెలబ్రెటీల గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాల గురించి అయితే చెప్పనవసరం ఉండదు. తాజాగా మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోవడంతో ప్రతి విషయం ఇప్పుడు వైరల్ అవుతూనే ఉంది. నిహారిక-చైతన్యల పెళ్లి 2020 డిసెంబర్ 9న గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. తాజాగా వారిద్దరి అంగీకారంతో కోర్టు నుంచి విడాకులు తీసుకున్నారు. (ఇదీ చదవండి: Niharika-Chaitanya Divorce: నిహారిక కోసం పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎవరంటూ..) పెళ్లి తర్వాత కూడా నిహారిక తన కెరీర్‌ను బిల్డప్ చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అంతకు ముందు అడపాదడపా సినిమాలు చేసిన నిహారిక, పెళ్లి తర్వాత నిర్మాతగా మారింది. ఈ మధ్యే సొంత బ్యానర్ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పేరు మీద హైదరాబాద్‌లో ఆఫీస్ ఓపెన్ చేసింది. అలా చైతన్యకు దూరంగా ఉన్నా తను ఏదో ఒక సినిమా పనిలో బిజీగానే ఉండేది. (ఇదీ చదవండి: ఆయనంటే భక్తి.. అందుకే మా అబ్బాయికి 'నీల్' అని పేరు పెట్టాం: కాజల్) అయితే నిహారిక విడాకుల విషయం మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత.. తను ఏమైనా నోరు విప్పుతుందా? అని అందరూ భావించారు. కానీ నిహారిక మాత్రం వాటిని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఆమె విడాకులకు సంబంధించిన వార్తలు వైరల్ అయిన కొద్దిసేపటికి తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒకరికి పుట్టిన రోజు విషెస్ చెబుతూ స్టోరీ షేర్ చేసింది. నిహారిక సినిమాలకు అమెరికా నుంచి ప్రమోషన్స్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఆమె బర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ విడాకుల వార్తల గురించి పలు రకాలుగా వార్తలు వస్తున్నా.. ఆమె స్పందించకపోవడంతో వీటిన లైట్ తీసుకున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నిహారిక-చైతన్యల విడాకులు.. ముందుగా పిటిషన్ వేసింది ఎవరంటూ..
ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఇద్దరి అంగీకారంతో నెలరోజుల కిందటే విడాకుల కోసం హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టు ఇటీవల వారిద్దరికి విడాకులు మంజూరు చేసింది. అయితే తాజాగా వీరద్దరిలో ఎవరు ముందుగా విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు..? నిహారిక తరుపున కోర్టులో పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎవరు..? అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో వెతకడం మొదలు పెట్టారు. (ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీకి దూరంగా అన్నా లెజినోవా?) ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరూ కూడా వేరుగానే ఉన్నారు కూడా. దీంతో మొదటగా విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది జొన్నలగడ్డ చైతన్యనే అని కోర్టు విడుదల చేసిన కాపీలో ఉంది. ఆపై నిహారిక తరుపున విడాకుల కోసం పిటిషన్ వేసింది అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర అని తెలుస్తోంది. అతను నాగబాబుకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టే విడాకుల విషయాన్ని గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. 2020 డిసెంబర్లో చైతన్య జొన్నలగడ్డ - నిహారికల వివాహం జరిగింది. వీరిద్దరి అంగీకారం మేరకు జూన్ 5న కోర్టు విడాకుల ఉత్తర్వులు జారీ చేసింది. జొన్నలగడ్డ చైతన్య గుంటూరు మాజీ ఐజీ జే ప్రభాకర్ రావు కుమారుడు అనే విషయం తెలిసిందే. -
అఫీషియల్: నిహారిక- చైతన్య డైవర్స్.. కోర్టు మెట్లెక్కిన మెగా డాటర్!
నాగబాబు కుమార్తె మెగాడాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతోందని గత కొంతకాలంగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. భర్తకు దూరంగా ఉంటున్న నిహారిక.. ఇటీవల వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్కు ఒంటరిగానే హాజరైంది. దీంతో విడాకుల రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిహారిక విడాకులపై వస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ డైవర్స్ కోసం కోర్టు మెట్లెక్కింది. తాజాగా ఆమె కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. హిందూ వివాహా చట్ట ప్రకారం మెగా డాటర్ కోర్టును ఆశ్రయించింది. (ఇది చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!) కాగా.. గత కొంతకాలంగా జొన్నలగడ్డ చైతన్య, నిహారిక విడివిడిగానే ఉంటున్నారు. ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంతో విడాకులు రూమర్స్ ఊపందుకున్నాయి. అంతేకాకుండా చైతన్య ఇటీవలే సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరలైన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక పిటిషన్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కాాగ.. 2020లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. చైతన్య ఇన్‌స్టా పోస్ట్ వైరల్? ఇటీవలే జొన్నలగడ్డ చైతన్య ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. 'ఈ స్థలం, నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. గత 10 రోజులుగా నా జీవితంలోకి వచ్చిన విపాసన ప్రక్రియ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్. మనం ఓ చోటుకి ఎలాంటి అంచనాల్లేకుండా వెళ్లి, అద్భుతమైన జ్ఞానంతో తిరిగొస్తుంటాం. ఇది అలాంటిదే' అని చైతన్య రాసుకొచ్చాడు. ముంబయిలోని గ్లోబల్ విపాసన పగోడా అనేది ఓ మెడిటేషన్ సెంటర్. ప్రస్తుతం చైతన్య అక్కడే ఉన్నాడు. ఇదే విషయాన్ని బయటపెట్టాడు. ఈ పోస్ట్ తర్వాత విడాకులు ఖాయమేనంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. (ఇది చదవండి: వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్లో నిహారిక.. ఆ ఫోటో అర్థం అదేనా?) -
మెగా డాటర్స్ VS మెగా అల్లుళ్లు... ఒక్క పోస్ట్ తో సోషల్ మీడియా షేక్...
-
వరుణ్, లావణ్య త్రిపాఠి కోసం వచ్చేస్తున్న స్టార్ హీరో
'మెగా' వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు నిన్నటి వరకు పలు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడదే అధికారికమైంది. నటుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిపెళ్లిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. రేపు (జూన్ 9)న హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగనుంది. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంత మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. (ఇదీ చదవండి: ట్రోలర్స్‌కు ఫోటోలతో కౌంటర్ ఇచ్చిన 'భీమవరం' బ్యూటీ) పుష్ప-2 షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్, వరుణ్ కోసం రేపు జరిగే ఎంగేజ్మెంట్ పార్టీకి తన కుటుంబంతో కలిసి హాజరవుతారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్, ఉపాసన ఈ నిశ్చితార్థంలో పాల్గొంటారు. ఇక వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి 'మిస్టర్', 'అంతరిక్షం' చిత్రాల్లో నటించారు. అయితే, అంతకంటే ముందే వీళ్లిద్దరికీ పరిచయం. నిహారిక, లావణ్య బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి పార్టీలు చేసుకునేవారు, కలిసి జిమ్ చేసేవారు. అలా నిహారిక ద్వారా వరుణ్-లావణ్య ఒకరికొకరు పరిచయం. అలా వీళ్లిద్దరూ కలిసి సినిమాల్లో నటించక ముందే ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. రేపు ఎంగేజ్ మెంట్ పూర్తయిన తర్వాత, పెళ్లి తేదీని ప్రకటిస్తారు. ఓ ఇంటర్వ్యూలో నాగబాబు చెప్పిన మాటల ప్రకారం చూస్తే, ఈ ఏడాదిలోనే వరుణ్-లావణ్య పెళ్లి ఉంటుంది. (ఇదీ చదవండి: విడాకులు తీసుకున్న నటి.. భర్త ఎమోషనల్ పోస్ట్!) -
తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!
మెగా డాటర్ నిహారిక కొణిదెల టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెర యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత కొద్ది రోజులు యాక్టింగ్‌కు దూరంగా ఉన్న నిహారిక రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఓటీటీలో విడుదలైన డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. (ఇది చదవండి: భర్తతో విడాకులు? నిహారికను సూటిగా ప్రశ్నించిన జర్నలిస్ట్) అయితే గత కొంతకాలంగా ఆమె డైవర్స్ తీసుకుంటున్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తరచుగా వార్తల్లో నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యతో దూరంగా ఉంటోందని.. త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వీటిపై ఇంతవరకు ఎవరూ కూడా స్పందించలేదు. అయితే తాజాగా నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మీడియా వారిని పలకరించగా ఫోటోలకు ఫోజులిచ్చారు. భర్త జొన్నలగడ్డ వెంట నిహారిక లేకపోవడంతో మరోసారి డైవర్స్ రూమర్స్ ఊపందుకున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు నిహారిక లేకుండా చైతన్య తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం మరోసారి అనుమానాలకు తావిస్తోంది. (ఇది చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్ నిశ్చితార్థం? నిహారిక ఏమందంటే?) అంతే కాకుండా ఈ మధ్యకాలంలో నిహారి-చైతన్య జంటగా ఎక్కడా కనిపించకపోవడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం.. పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడం మరో కారణం. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతోనే ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. -
భర్తతో విడాకులు? నిహారికను సూటిగా ప్రశ్నించిన జర్నలిస్ట్
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె ఇప్పుడు మళ్లీ హీరోయిన్గా రీఎంట్రీ ఇస్తుంది. కొంతకాలంగా డివర్స్ రూమర్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యతో దూరంగా ఉంటుందని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య కొంతకాలంగా విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయని,దీంతో విడిపోనున్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేయడంతో విడాకుల విషయంలో వీరిద్దరూ పరోక్షంగా హింట్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై నిహారికకు ప్రశ్న ఎదురైంది. ఆమె నటించిన 'డెడ్ పిక్సెల్స్' వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ జర్నలిస్ట్ నిహారికను.. మీరు మీ భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించగా నిహారిక.. సున్నితంగా ఆ ప్రశ్నను దాసివేసింది. సమాధానం చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. దీంతో నిహారిక విడాకుల రూమర్స్ నిజమేనంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. -
అవునా.. ఆ వార్త నావరకు రాలేదు: నిహారిక
సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్‌పై మెగా డాటర్ నిహారిక స్పందించారు. ఈ మధ్య కాలంలో కొంతమంది సోషల్ మీడియాలో మరాద్య లేనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె నటిగా మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఆమె ప్రధాన పాత్ర నటించిన ‘డెడ్ పిక్సెల్స్’అనే వెబ్ సిరీస్ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై స్పందించారు. యాక్టింగ్‌పై ఆసక్తితోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టానని, వెండితెర, ఓటీటీ.. ఏదైనా వందశాతం కష్టపడి పని చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ గురించి మాట్లాడుతూ..‘వాటిని నేను పెద్దగా పట్టించుకోను. (చదవండి: ఉపాసనపై కామెంట్స్.. ఓ వ్యక్తిని చితకబాదిన చెర్రీ ఫ్యాన్స్!) మొదట్లో సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌ని చూసేదాన్ని. బాధపడేదాన్ని. కానీ రాను రాను వాటిని పట్టించుకోవడం మానేశా. అంతేకాదు కొన్ని రూమర్స్ చూసి నవ్వుకుంటాను. సైరా సినిమా సమయంలో నాపై వచ్చిన మీమ్స్ చూసి పడి పడి నవ్వాను’ అని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక త్వరలోనే రామ్ చరణ్ ఐపీఎల్లో ఒక టీమ్ కొనుగోలు చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజమేనా? అని యాంకర్ ప్రశ్నించగా.. ‘అవునా.. ఏ టీమ్ కొంటున్నారు? ఏమో మరి నాకు అయితే తెలియదు. ఇంటర్వ్యూ అయ్యాక అన్నయ్యను అడగాలి’అని వివరించింది. -
అల్లు అర్జున్ పుష్ప-2లో నిహారిక!.. అలాంటి పాత్రలో మెగాడాటర్
మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. భర్తతో కొంతకాలంగా దూరంగా ఉంటున్న నిహారిక ప్రస్తుతం వర్క్‌పైనే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించిన నిహారిక ఈమధ్యే నటిగానూ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరకు సినిమాలు చేసిన నిహారిక ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పింది. అయితే విడాకుల రూమర్స్ నేపథ్యంలో మరోసారి నటిగా తనకు తాను పరీక్షించుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2లో నిహారిక కీలక పాత్రలో కనిపించనుందట. చదవండి: యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్ ఈ పాత్ర కోసం గతంలో సాయిపల్లవిని సంప్రదిస్తే ఆమె నో చెప్పిందట. ఇప్పుడు ఆ రోల్లో నిహారిక కనిపించనున్నట్లు సమాచారం. గిరిజన యువతిగా పుష్ప-2లో ఓ ముఖ్యమైన పాత్రలో మెగా డాటర్ మెస్మరైజ్ చేయనుందన్నమాట. -
విడాకులపై ఇన్‌డైరెక్ట్ హింట్ ఇస్తున్న నిహారిక?.. పోస్ట్ వైరల్
మెగాడాటర్ నిహారిక కొణిదెల.. పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై దృష్టి పెట్టిన ఆమె పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసి నిర్మాతగా మారింది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయితే కొన్నాళ్లుగా నిహారిక భర్త చైతన్యకు దూరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. చదవండి: నటి ఖుష్భూ కూతుర్ని చూశారా? గ్లామర్ షోతో రచ్చరచ్చ దీనికి తోడు భార్యభర్తలిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ఇద్దరూ పెళ్లి ఫోటోలను డిలీట్ చేయటంతో విడాకుల రూమర్స్ తెరమీదకి వచ్చాయి. దీనిపై నిహారికతో పాటు మెగా ఫ్యామిలీ కూడా సైలెంట్‌గా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. అంతేకాకుండా పెళ్లి తర్వాత యాక్టింగ్‌కి ఫుల్స్టాప్ పెట్టిన నిహారిక ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నిహారిక షేర్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. జిమ్‌లో వర్కవుట్ వీడియోను షేర్ చేస్తూ.. మనసుకు తగిలిన అన్ని గాయాలకు కాలమే సమాధానం చెబుతుంది అంటూ కొటేషన్‌ను యాడ్ చేసింది. దీంతో భర్త జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు నిహారిక ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే వృత్తిపరంగా బిజీ అయ్యేందుకు చూస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత -
విడాకుల రూమర్స్.. హీరోయిన్గా నిహారిక రీఎంట్రీ?
మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల రూమర్స్ హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యతో దూరంగా ఉంటుందని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య కొంతకాలంగా విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయని,దీంతో విడిపోనున్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేయడంతో విడాకుల విషయంలో వీరిద్దరూ పరోక్షంగా హింట్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై అటు చైతన్య కానీ, మెగా ఫ్యామిలీ కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే కెరీర్‌పై మరింత ఫోకస్ పెట్టిన నిహారిక సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి నిర్మాతగా మారింది. ఈమధ్య కాలంలో వరుస ఫోటోషూట్స్‌తో అలరిస్తుంది. ఈ క్రమంలో నిహారిక మళ్లీ హీరోయిన్గా రీఎంట్రీ ఇస్తుందా అనే సందేహం కలుగుతుంది. ఒక మనసు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఆమె పెళ్లి తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేసి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా విడాకుల రూమర్స్ నేపథ్యంలో నిహారిక ఫోటోషూట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
'యూ ఆర్ వెరీ స్పెషల్'.. నిహారిక పోస్ట్ వైరల్
గత కొంతకాలంగా మెగాడాటర్ నిహారిక కొణిదెల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. భర్త చైతన్య జొన్నలగడ్డతో మనస్పర్థల కారణంగా వీరి విడాకులు తీసుకోనున్నారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంతవరకు మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు. ఇప్పటికే చైతన్య.. నిహారికను అన్‌ఫాలో చేయడమే కాకుండా పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేశాడు. అయితే తాజాగా నిహారిక తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో చేసిన పోస్ట్ తెగ వైరలవుతోంది. తాజాగా నిహారిక బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యూ ఆర్ వెరీ స్పెషల్ అంటూ విషెస్ చెప్పింది నిహారిక. ప్రముఖ ఫోటోగ్రాఫర్ అరిఫ్ పుట్టినరోజు సందర్భంగా అతనితో దిగిన పిక్స్ షేర్ చేసింది. కాగా.. ఇప్పటికే నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా మారిన నిహారిక సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక మరో ముందడుగు వేసింది. తన ప్రొడక్షన్ బ్యానర్‌కు ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎప్పటి నుంచో సొంతంగా ఆఫీస్ నెలకొల్పాలని కలలు కన్న నిహారిక ఇటీవలే ఆ పని పూర్తిచేసింది. (ఇది చదవండి: అనుకున్న పని చేసేసిన నిహారిక.. కంగ్రాట్స్ అంటూ కామెంట్స్) -
విడాకుల రూమర్స్.. అదే సమస్య అంటూ ఓపెన్ అయిన నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. సినిమాల్లో కంటే ముందుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన నిహారిక యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై దృష్టి పెట్టిన ఆమె పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసి నిర్మాతగా మారింది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయితే కొన్నాళ్లుగా నిహారిక భర్త చైతన్యకు దూరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు భార్యభర్తలిద్దదరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, మొదట చైతన్య పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్ చేయడంతో విడాకుల రూమర్స్ తెరమీదకి వచ్చాయి. ఇక రీసెంట్గా నిహారిక కూడా ఒక్క ఫోటో మినహా పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్ చేసేసింది. నెట్టింట వీరి విడాకుల రూమర్స్ హాట్‌టాపిక్‌గా మారినా ఇంతవరకు స్పందించని నిహారిక హాట్ ఫోటోషూట్స్‌తో మాత్రం రచ్చ చేస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్న ఆమె లేటెస్ట్ ఫోటోలతో ఫిదా చేస్తుంది. తాజాగా డెనిమ్ అవుట్‌ఫిట్‌లో గ్లామర్ ట్రీట్‌తో ఎక్స్‌పోజింగ్‌లో నో కాంప్రమైజ్ అంటూ ఫోటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
అనుకున్న పని చేసేసిన నిహారిక.. కంగ్రాట్స్ అంటూ కామెంట్స్
గత కొంతకాలంగా మెగాడాటర్ నిహారిక కొణిదెల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. భర్త చైతన్య జొన్నలగడ్డతో మనస్పర్థల కారణంగా వీరి విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఇంతవరకు మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు. ఇప్పటికే చైతన్య నిహారికను అన్‌ఫాలో చేయడమే కాకుండా పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేశాడు. ఇప్పుడు భర్త బాటలోనే నిహారిక కూడా ఇప్పటికే అతన్ని ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయగా ఇప్పుడు చైతన్యతో దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసేసింది. దీంతో విడాకుల విషయంలో వీరిద్దరూ పరోక్షంగా హింట్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా మారిన నిహారిక సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక మరో ముందడుగు వేసింది. తన ప్రొడక్షన్ బ్యానర్‌కు ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎప్పటినుంచో సొంతంగా ఆఫీస్ నెలకొల్పాలని కలలు కన్న నిహారిక తాజాగా ఆ పని పూర్తిచేసింది.దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీంతో పలువురు నిహారికకు కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. -
భర్తతో విడాకుల రూమర్స్.. వైరల్ అవుతున్న నిహారిక పోస్ట్
మెగా డాటర్ నిహారిక విడాకుల రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2020లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య కొంతకాలంగా విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ పార్టీలకు జంటగా వెళ్లే నిహారిక-చైతన్యలు ఈమధ్య అస్సలు కనిపించడం లేదు.దీనికి తోడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, నిహారికతో ఉన్న ఫోటోలు సహా పెళ్లి ఫోటోలన్నింటిని చైతన్య డిలిటీ చేసేయడంతో నెట్టింట జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయ్యింది. విడాకుల వార్తల నేపథ్యంలో నిహారిక తాజాగా ఇన్‌స్టాలో ఓ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రోమోను షేర్ చేసింది. `డెడ్ పిక్సెల్స్`అనే టైటిల్ తో తెరకెక్కుతున్నఈ ప్రాజెక్ట్‌ను స్వయంగా నిహారిక నిర్మించడమే కాకుండా నటించిందట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
జైలు నుంచి బయటకొచ్చిన నిహారిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో నిందితురాలు నిహారికకు కోర్టు బెయిల్ మంజురు చేసింది. దీంతో ఆమె చర్లపల్లి జైలు నుంచి విడుదల కానుంది. ఈ కేసులో హరిహరకృష్ణ A1 , హరి స్నేహితుడు హాసన్ A2 కాగా, A3గా నిహారికపై పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ హత్య కేసులో.. నిహారిక ప్రేమే కారణమని నిందితుడు హరిహరకృష్ణ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా హత్య విషయం తెలిసి కూడా కావాలనే ఎవరికీ చెప్పకపోవడం.. నిందితుడికి తాము సాయం చేసినట్లు నిహారిక, స్నేహితుడు హసన్‌లు పోలీసులు ముందు అంగీకరించారు. అంతే కాకుండా యువతి హత్యానంతరం ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, సందేశాలను తొలగించి సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నం చేసింది. దీంతో నిహారిక, హరి స్నేహితుడు హసన్‌లు నిందితులుగా చేర్చి ఫిబ్రవరి 6వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులు ఇద్దరని హయత్‌నగర్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇటీవల నిహారిక బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
Naveen Case: నవీన్‌తో బ్రేకప్ అయ్యాకే హరి దగ్గరయ్యాడు: నిహారిక!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తులో ముందుకు పోయే కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్యకు.. నిహారిక ప్రేమే కారణమని నిందితుడు హరిహరకృష్ణ చెప్పగా, హత్య విషయం తెలిసి కూడా కావాలనే ఎవరికీ చెప్పలేదని.. నిందితుడికి తాము సాయపడ్డామని హరి ప్రియురాలు నిహారిక, స్నేహితుడు హసన్‌లు పోలీసులు ముందు ఒప్పుకున్నారు. నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక పోలీసుల ఎదుట నవీన్ నేరాన్ని అంగీకరిస్తూ.. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. కస్టడీ విచారణలో హరిహర కృష్ణ చెప్పింది ఇదే.. నేను ఇంటర్ 2017-2019 మధ్య దిల్షుక్ నగర్ లోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నా. నవీన్ నాకు సెకండ్ ఇయర్ లో పరిచయం. అప్పటి నుంచి ఇద్దరం మంచి స్నేహితులం. వేర్వేరు చోట్ల ఇంజినీరింగ్ చేస్తున్నప్పటికీ.. ఇద్దరం తరచూ కలుసుకునేవాళ్లం. గతంలో నవీన్, నిహారిక ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. అన్ని విషయాలు నాతో పంచుకునేవాళ్లు. అయితే.. నవీన్ మరో అమ్మాయితో తిరుగుతున్నాడని తెలిసి నిహారిక గొడవ పడింది. అతనితో మాట్లాడడం మానేసింది. నీహారిక అంటే నాకు కూడా ఇష్టం. అందుకే ఆమెతో చనువుగా వుండే వాడిని. వాళ్లిద్దరూ విడిపోయారని తెలిశాక.. కొన్ని నెలల కిందట ఆమెకు ప్రపోజ్ చేశా. ఆమె సరే అంది. అప్పటి నుంచి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. అయితే.. నవీన్ అప్పుడప్పుడు నిహారికకు కాల్ చేసి, మెసేజ్‌లు చేసేవాడు. అది నిహారికకు నచ్చేది కాదు. ఆ విషయం నాతో చెప్పుకుని బాధపడింది. నిహారికను ఇబ్బంది పెడుతున్నాడనే కోపంతో నవీన్‌ను చంపాలని మూడు నెలల కిందటే నిర్ణయించుకున్నా. రెండు నెలల కిందట ఓ షాపింగ్ మార్ట్‌లో కత్తి కొన్నాను. అలాగే వేలి ముద్రలు పడకూడదని ప్లాస్టిక్ గ్లౌజ్‌లు కొన్నా. వాటిని ఇంట్లో సజ్జపైన ఎవరికీ కనిపించకుండా ఓ బ్యాగులో దాచా. జనవరి 16వ తేదీన.. ఇంటర్ ఫ్రెండ్స్ అంతా కలుసుకోవాలని అనుకున్నాం. కుదిరితే అదే రోజు నవీన్ ను హత్య చేయాలని అనుకున్నా. కానీ ఆ రోజు అందరూ కలవడం కుదురలేదు. మళ్లీ.. ఫిబ్రవరి 17వ తేదీన నవీన్ నాకు కాల్ చేసి , హైదరాబాద్ వస్తున్నానని చెప్పాడు. ఆ రోజు నేను, నా మరోస్నేహితుడు ఇద్దరం కలిసి ఉప్పల్‌లో సినిమాకు వెళ్లాం. ఈలోపు నవీన్ ఎల్బీ నగర్లో ఉన్నా అని కాల్ చేశాడు. నా బైక్‌పై నేను, నా ఫ్రెండ్ వెళ్లి.. నవీన్‌ను పికప్ చేసుకున్నాం. నాగోల్‌లో భోజనం చేశాక.. నా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. నేను , నవీన్ మలక్ పేటలోని మా ఇంటికి వెళ్ళాం. ఆరోజు రాత్రి నవీన్ హాస్టల్ కు వెళ్తా అన్నాడు. నేను కూడా వస్తా అని చెప్పా. హత్యకు ఇదే ఛాన్స్ అనుకుని.. సజ్జపై దాచిన బ్యాగ్‌ను కూడా తీసుకెళ్లా. ఆరోజు నా ఫోన్ నుండి నవీన్.. నీహారికకు కాల్ చేసి ఆరు నుంచి ఏడు నిముషాలు మాట్లాడాడు. ఆ తరువాత రాత్రి 11 గంటలకు ఓఆర్ఆర్ దాటగానే.. ఈ టైం లో అంత దూరం వద్దు అనుకున్నాం. ఇద్దరం కలిసి మందు తాగాం. ఆ తర్వాత నిహారిక గురించి మాట్లాడాలని నవీన్‌తో చెప్పాను. ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నిహారికను నేను ప్రేమించుకుంటున్నామని, ఆమెను ఫోన్లు చేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడిగా. నవీన్ కోపంతో నన్ను కొట్టాడు. నవీన్ చంపాలనే కసి మీద ఉన్న నేను.. ఆ కోపంతోనే నవీన్‌ను తోసేసి గొంతు నులిమి చంపేశా. శ్వాస ఆగిపోయిందని గుర్తించి.. కత్తితో శరీర భాగాలను వేరు చేశా. శరీర భాగాలను వేరు చేసే టైంలోనూ నాలో ఆవేశం చల్లారలేదు. ఆ తర్వాత శవాన్ని ఎవరికీ కనబడకుండా చెట్లపొదల్లో పడేసాను. నవీన్ సెల్‌ఫోన్‌ను రోడ్డుపై పడేశా. శరీర భాగాలన్నీ ఓ బ్యాగులో వేసుకొని బ్రాహ్మణపల్లి వైపు వెళ్లాను. ఆ బ్యాగును రాజీవ్ గృహకల్ప వెనకాల చెట్లపొదల్లో పడేసాను. అక్కడి నుంచి బ్రాహ్మణపల్లిలో ఉన్న నా ఫ్రెండ్ హాసన్ ఇంటికి వెళ్లా. అక్కడ బట్టలు మార్చుకుని.. హసన్‌కు అసలు విషయం చెప్పా. హసన్ భయపడ్డాడు. నన్ను తిట్టి వెంటనే పోలీసులకు లొంగిపోవాలని చెప్పాడు. ఉదయం వెళ్లి లొంగిపోతా అని చెప్పా. రక్తంతో తడిసిన నా బట్టలను ఒక బ్యాగ్‌లో వేసి.. సాగర్ కాంప్లెక్స్ బస్ స్టాప్ వద్ద రోడ్డు పక్కన చెత్త కుప్పలో పడేశా. ఉదయం 10 గంటలకు నిహారిక కు ఫోన్ చేసి రోడ్డు మీదకి రమ్మన్నా. అప్పుడు నవీన్‌ను చంపేశానని నిహారికతో మొత్తం జరిగింది చెప్పా. ఆమె భయపడింది.. తిట్టింది. ఆ తర్వాత బైక్ ఇంట్లో పెట్టి.. వరంగల్‌కు వెళ్లా. మా నాన్నకి విషయం చెప్పడంతో.. లొంగిపోవాలని సూచించాడు. తిరిగి 24వ తేదీ హాసన్ ఇంటికి వెళ్లా. ఇంకా ఎందుకు పోలేదు అని నిలదీశాడతను. దీంతో నేరుగా నవీన్ శరీర భాగాలు పడేసిన ప్రాంతానికి వెళ్లి ఆ సంచిని తీసుకొని .. హత్య చేసిన స్పాట్ కి వెళ్లా. అక్కడే శరీర భాగాలన్నీ కాల్చేశా. ఆ తర్వాతే అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల ముందు లొంగిపోయా. నవీన్ దూరం అయ్యాకే.. హరి దగ్గరయ్యాడు! ఇక మరో ఇద్దరు నిందితులు హసన్, నిహారికలు సైతం నేరాన్ని అంగీకరించారు. నేరం గురించి తెలిసి కూడా భయంతో ఎవరికీ చెప్పలేదన్నారు. ఇక నవీన్ హత్య తర్వాత.. తనను హరి నాలుగుసార్లు కలిసినట్లు నిహారిక ఒప్పుకుంది. నవీన్ తాను ప్రేమించుకున్న మాట వాస్తవమేనని, అయితే తమ బ్రేకప్ అయ్యాక హరి తనకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడని చెప్పిందామె. నిహారిక కన్ఫెషన్ స్టేట్మెంట్.. ఇంటర్ చదువుతున్నప్పుడే నవీన్ నేను ప్రేమించుకున్నాం. నవీన్ నేను చాలాసార్లు మా ఇంట్లో కలుసుకునేవాళ్లం. నవీన్ నేను గొడవ పడితే హరిహరకృష్ణ మాకు సర్ది చెప్పేవాడు. నవీన్ తో నాకు గొడవ జరిగినప్పుడల్లా హరిహర కృష్ణతో చెప్పుకునే దాన్ని. నవీన్ నాకు దూరం అయ్యాక హరిహర కృష్ణ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత నవీన్ నాతో మాట్లాడానికి యత్నిస్తున్నాడని హరికి చెప్పా. నవీన్ కోపంతో రగిలిపోయేవాడు. కానీ, నేను అది సరదానేమో అనుకున్నా ఒక్కోసారి.. నవీన్‌ను చంపేసి నిన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తానని అనేవాడు. నేను తిడితే.. అదీ జోక్ అనేవాడు. ఒకరోజు వాళ్ల ఇంటికి తీసుకెళ్లి.. ఒక బ్యాగులో గ్లౌజులు, కత్తి చూపించాడు. నవీన్‌ను చంపేందుకే ఇవి అన్నాడు. అది నేను నమ్మలేదు. అలా మాట్లాడొద్దని తిట్టా. నవీన్‌తో మాట్లాడడం మానేశానని, ఇక అతను నన్ను మరిచిపోతాడని, మనం సంతోషంగా ఉందామని హరికి చెప్పా. హత్యకు రెండు రోజుల ముందు నుంచి ఇంటర్ ఫ్రెండ్స్ కలుస్తున్నట్లు హరి నాకు చెప్పాడు. నవీన్ గనుక ఈసారి కాల్ చేస్తే.. వేరే వాళ్లతో రిలేషన్షిప్లో ఉన్నట్లు చెప్పమన్నాడు. ఆరోజు హరి ఫోన్ నుంచే నవీన్ ఫోన్ చేశాడు. నేను హరి చెప్పినట్లే చెప్పా. ఎందుకు అలా చేస్తున్నావ్ అని నవీన్ అంటుండగానే నేను ఫోన్ కట్ చేశాను. కొద్దిసేపటి తర్వాత హరి నాకు ఫోన్ చేశాడు. నవీన్ ఇంక నీతో మాట్లాడడంట అని చెప్పాడు. నేను సరే అన్నాడు. ఆ ఉదయం హరి నన్ను కలవాలని మేసేజ్ చేశాడు. పాత బట్టలతో వనస్థలిపురం నాగార్జున స్కూల్ పక్కన ఉన్న గల్లీలో రోడ్డుమీదకు వచ్చాడు. ఆ అవతారం చూసి ఏంటని అడిగా. అప్పుడు నవీన్‌ను చంపిన విషయం చెప్పాడు. ఆ తర్వాత వరంగల్ వెళ్లేందుకు డబ్బులు కావాలంటే.. మనీ ఇచ్చా. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని డిసైడ్ అయ్యా. ఫిబ్రవరి 20వ తేదీ రోజున నేను కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళుతుండగా .. హరి నాకు ఫోన్ చేసి ఎల్బీనగర్ బస్ స్టాప్ లో కలిసాడు. నవీన్‌ను చంపిన ప్రాంతాలను తిప్పి చూపించాడు. ఈలోపు నవీన్ ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి ఆరాలు తీశారు. నాకు తెలియది చెప్పా. ఆ తర్వాత హరి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 23వ తేదీన ఫోన్ చేశాడు. ఆ తర్వాత హసన్ ఫోన్ చేసి హరి మిస్సయినాడని, వాళ్ళ అక్కాబావ మలక్ పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పాడు. ఫోన్లో ఏదైనా చాట్ ఉంటే డిలీట్ చెయమని సూచించాడు. ఆ తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా హసన్ మరో ఎవరికీ ఫోన్ చేయొద్దని చెప్పించాడు. ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం నేను, నా ఫ్రెండ్ ఎన్జీవోస్ కాలనీ బస్టాప్‌లో హరిని చూశాం. అక్కడ చాలాసేపు మాట్లాడి.. నేను పోలీసులకు లొంగిపోతాను అని చెప్పాడు. ఆపై విడిభాగాలను చంపిన స్థలంలోనే వేయమని హసన్, హరికి సూచించాడట. ఆ పని చేశాక.. బైక్ సర్వీసింగ్‌కు ఇచ్చాడు. నాకు ఫోన్ చేసి.. మా ఇంటికి వచ్చాడు. మా ఇంట్లో హరి స్నానం చేసినాడు. మా బావ అడ్వకేట్. ఆయనతో మాట్లాడాలని.. హరి చెప్పగా, అప్పుడు నేను మా బావ భూపాల్ రెడ్డిని పిలిచి నవీన్ మర్డర్ గురించి చెప్పాం. ఇది పెద్ద కేసు వెంటనే పోలీస్ స్టేషన్లో సరెండర్ కావాలని చెప్పాడు. ఆపై హరి అదే రోజున వెళ్లి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులకు, నవీన్ ఫ్రెండ్స్‌కు కావాలనే హత్య గురించి చెప్పలేదు. ఈ కేసులో దొరికే అవకాశమే లేదని హరి నాతో చెప్పాడు. హరిహరకృష్ణ చెప్పిన మాటల్ని నమ్మాను అని నిహారిక పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చింది. -
చంచల్‌గూడ జైలుకు నిహారిక
సాక్షి, క్రైమ్: నవీన్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. నవీన్ హత్య కేసులో పోలీసులు హాసన్, నిహారికలను అరెస్ట్ చేసి.. తాజా నిందితులుగా చేర్చి సోమవారం హయత్ నగర్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు పోలీసులు. ఈ కేసులో నిహారిక, హసన్‌లను ఏ2, ఏ3లుగా చేర్చారు. ఇక ఈ నిందితులిద్దరికీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన హయత్ నగర్ కోర్టు. దీంతో న్యాయమూర్తి నివాసం నుంచి నేరుగా నిహారికను చంచల్‌గూడ జైలుకు, హసన్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. హాసన్ ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు స్నేహితుడు కాగా, నిహారిక గర్ల్‌ఫ్రెండ్. ప్రేమ వ్యవహారం కారణంగానే నవీన్ హత్య జరిగింది. గత నెల 17న జరిగిన నవీన్‌ను అతి కిరాతకంగా హరిహరకృష్ణ హత్య చేశాడు. ఈ హత్య గురించి నిహారికకు కూడా తెలుసని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. హత్య జరిగిన తర్వాత.. ప్రియుడు హరిహరను గుడ్ బాయ్ అంటూ నిహారిక మెచ్చుకోవడం, ఆపై అవసరం ఉందని చెబితే రూ.1500 ట్రాన్స్ఫర్ కూడా చేసింది. నవీన్‌ను హత్య చేసిన ఘటనాస్థలానికి హరిహర, నిహారిక, హసన్ ముగ్గురు వెళ్లారని పోలీసులు తేల్చారు. మరోవైపు తన ఫోన్లోని సమాచారాన్ని తొలగించడం ద్వారా ఆధారాలను మాయం చేసేందుకు నిహారిక ప్రయత్నించిందని తెలుస్తోంది. -
Software Engineer Rakesh: భార్య వేధింపులు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి, హన్మకొండ: భార్య, అత్తింటివారి వేధింపులు తాళలేక సూసైడ్ నోట్ రాసి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజపల్లి గ్రామంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. రాజపల్లికి చెందిన కొండా రాకేశ్(28) హెచ్‌సీఎల్ కంపెనీలో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఫిబ్రవరి 2న ఎలుకుర్తి హవేలికి చెందిన దేవుళ్లపల్లి శంకర్ కుమార్తె నిహారికతో వివాహం జరిగింది. కొన్ని రోజులు వీరి సంసారం సాఫీగానే సాగింది. రాకేశ్ ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తుండడంతో రాజపల్లిలోనే ఉంటున్నారు. పల్లెటూరులో ఉండడం ఇష్టంలేని నిహారిక హైదరాబాద్ వెళ్దామని రాకేశ్‌తో తరుచూ గొడవ పడేది. వర్క్ ఫ్రం హోం పూర్తికాగానే వెళ్దామని సర్ధి చెప్పినా వినకుండా గొడవపడేది. ఈ విషయమై పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా వినని నిహారిక రాకేశ్‌తో సంసారం చేయడం ఇష్టంలేదని, పుట్టింటికి వెళ్లి అబార్షన్ చేయించుకుంటానని భర్త, అత్తమామలతో గొడవపడి చీపురుతో కొట్టి వెళ్లిపోయింది. చదవండి: (ప్రేమ వివాహం.. ఆపై కులం తక్కువని..) ఈ క్రమంలో వీడియోకాల్ చేసి రాకేశ్‌ను దుర్భాషలాడుతూ నువ్వు చస్తే నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని అబార్షన్ చేయించుకుంటానని నిహారిక వేధించింది. ఇదే విషయమై ఆమె తల్లిదండ్రులు సైతం మానసికంగా వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాకేశ్ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ములుగు ఫ్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకటరాజ్యం ఫిర్యాదు మేరకు రాకేశ్ భార్య నిహారిక, అత్తమామలు దేవుళ్లపల్లి శంకర్, అరుణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: (Doctor Death Mystery: ‘అశ్లీల చిత్రాలతో బెదిరించి చంపేశాడు’) -
‘ఒక్కడు’లో మహేశ్ చెల్లెలు ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుంది?
చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్లుగా ఎదిగినవారు చాలామంది టాలీవుడ్లో ఉన్నారు. రాశి, శ్రీదేవి, మీనా లాంటి హీరోయిన్లు.. చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చిన వారే. అయితే చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన అందరూ హీరోయిన్గా మారుతారని గ్యారెంటీ లేదు. పెద్దయ్యాక సినిమాలకు గుడ్‌బై చెప్పి, పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. అలాంటివారిలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ నిహారిక కూడా ఒక్కరు. నిహారిక అంటే ఎవరు గుర్తుపట్టరు కానీ ఆమె నటించిన ఓ సినిమా పేరు చెబితే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. గుణశేఖర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా గుర్తింది కదా? ఈ మూవీలో ‘ఒరేయ్ అన్నయ్యా..’ అంటూ మహేశ్‌ను ఆటపట్టించిన అల్లరి చెల్లి ఆశ గుర్తొచ్చిందా? ఆ అల్లరి పిల్లనే బేబీ నిహారిక. ఆమె అప్పుడు బేబీ కానీ ఇప్పుడు మాత్రం..ఇద్దరు పిల్లల తల్లి. వెంకటేశ్ ‘ప్రేమించుకుందాం రా’, మోహన్ బాబు ‘యమజాతకుడు’తో పాటు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన నిహారిక.. ‘ఒక్కడు’ చిత్రం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా చదువుపైనే దృష్టి సారించింది.పదేళ్ల క్రితం పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది.ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు. అసలు నిహారిక సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు? ఒక్కడు మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? ఆమెది ప్రేమ వివాహామా? లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా? ప్రస్తుతం నిహారిక ఏం చేస్తున్నారు? మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? తదితర విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోపై ఓ లుక్కేయండి. -
భర్తతో నిహారిక రొమాంటిక్ ఫోటో లీక్
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా రాణిస్తుంది. ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్న నిహారిక పేరు మరోసారి హాట్‌టిపిక్‌గా మారింది. భర్తతో నిహారిక లిప్‌లాక్ ఫోటో ఒకటి బయటికొచ్చింది. విడిపోని బంధం అంటూ నిహారిక భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. గత కొంతకాలంగా నిహారిక పర్సనల్ లైఫ్‌కి సంబంధించి రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి చెక్ పెట్టేందుకే నిహారిక ఇలాంటి ఫోటోతో సమాధానమిచ్చిందంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఇంత బోల్డ్ అవసరమా అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఈ ఫోటోను నిహారిక షేర్ చేయలేదు. అంతేకాకుండా ఇది లేటెస్ట్ పిక్ కూడా కాదు. నిహారిక కొణిదెల పేరుతో ఎవరో ఓ అకౌంట్‌ను క్రియేట్ చేసి ఈ బోల్డ్ పిక్‌ను షేర్ చేశారు. కాసేపట్లో ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. -
మరోసారి వార్తల్లో నిలిచిన నిహారిక.. బ్యాక్ టూ ఇన్‌స్టా
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్గా మారింది. మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యామిలీ సహా పర్సనల్ విషయాలు షేర్ చేసేది.అయితే ఇటీవలె జిమ్‌లో ఆమె షేర్ చేసిన ఓ వీడియోపై విపరీతంగా ట్రోల్స్ రావడంతో సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన నిహారిక సడెన్‌గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేసేసింది. దీనిపై అప్పట్లో నెట్టింట తెగ చర్చ నడిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పబ్ ఇన్సిడెంట్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన నిహారిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 8వారాల ఇన్స్టాగ్రామ్ బ్రేక్ నుంచి నేను నేర్చుకున్న పాఠాలు ఇవే.. 1. ''ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు 2.ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకోను 3.ఇప్పుడు నేను నిజంగా రీఫ్రెష్ అయ్యాను. పోస్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను'' అంటూ నిహారిక చేసిన పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇక వెల్కం బ్యాక్ నిహారిక.. నిన్ను చాలా మిస్సయ్యాం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
పబ్ ఇన్సిడెంట్ తర్వాత తొలిసారి భర్తతో కనిపించిన నిహారిక
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఫుడింగ్ అండ్ మింక్ పబ్ రైడ్‌లో నిహారిక ఉండటం సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో నిహారికతో పాటు బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురు ప్రముఖుల పిల్లలు ఉండటం అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. చదవండి: హీరోయిన్ మాట్లాడుతుంటే చై ఏం చేస్తున్నాడో చూడండి.. అయితే ఆ ఇన్సిడెంట్ తర్వాత నిహారిక బయట పెద్దగా కనిపించలేదు. దీనికి తోడు అంతకుముందే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడంతో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లయ్యింది. అయితే ఈ వివాదం తర్వాత తొలిసారిగా నిహారిక తన భర్తతో కలిసి ఓ ఈవెంట్లో కనిపించింది. ‘హలో వరల్డ్ ‘పేరుతో నిహారిక నిర్మిస్తున్న ఓ వెబ్‌సిరీస్ ఓపెనింగ్ ఈవెంట్లో భర్తతో కలిసి సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: లీకైన నిహారిక న్యూలుక్ ఫోటోలు.. నెట్టింట వైరల్ View this post on Instagram A post shared by Chaitanya Jv (@chaitanya_jv) -
లీకైన నిహారిక న్యూలుక్ ఫోటోలు.. నెట్టింట వైరల్
మెగా డాటర్ నిహారిక కొణిదెల గుర్తించి పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఒక మనసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మెగా డాటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయినా వెబ్‌సిరీస్‌లు, సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. 2020, డిసెంబర్9న చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకొని అటు ఫ్యామిలీ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. చదవండి: హీరోయిన్ మాట్లాడుతుంటే చై ఏం చేస్తున్నాడో చూడండి.. అయితే గత కొన్ని రోజులుగా నిహారిక పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడం, ఆ తర్వాత పబ్ ఇన్సిడెంట్‌తో వార్తల్లో నిలిచిన నిహారిక తాజాగా తన లుక్‌ని మార్చేసింది. షార్ట్ హెయిర్‌తో ట్రెండీగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట లీక్ అయ్యాయి. న్యూ హెయిర్‌తో క్యూట్ లుక్స్‌తో నిహారిక ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: బన్నీకి ఇష్టమైన ఫుడ్ ఇదే.. రివీల్ చేసిన స్నేహారెడ్డి -
నిహారికపై వస్తున్న వార్తలపై నాగబాబు స్పందన..
బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ బయటపడటం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు మాత్రమే ఉన్నారు. చదవండి: డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు: నటి హేమ ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో నిహారిక ఉండటం, పోలీసుస్టేషన్‌కు తరలించిన వ్యవహారంపై నాగబాబు స్పందించారు. 'నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారు. అనుమానాలకు తావివ్వకుండా నేను స్పందిస్తున్నా. నిహారికపై అనవసర ప్రచారాలు చేయవద్దు. ' అని నాగబాబు తెలిపారు. కాగా ఈ పబ్‌కు హాజరైన వారిలో ఐదుగురు విదేశీయులు కూడా ఉన్నారని సమాచారం. పబ్‌లో పాల్గొన్న 142 మంది వివరాలను పోలీసులు వెల్లడించారు. వీరిలో 99 మంది యువకులు, 33 మంది యువతులు పబ్‌లో పాల్గొన్నారు. 142 మంది అడ్రస్‌లు, ఇంటి నెంబర్లు తీసుకుని పోలీసులు నోటీసులు జారీ చేశారు. చదవండి: డ్రగ్స్ కేసులో నాగబాబు కుమార్తెకు నోటీసులు -
Niharika Gonella: తెలంగాణ బాక్సర్ నిహారిక శుభారంభం
National Boxing Championship: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళా బాక్సర్ గోనెళ్ల నిహారిక శుభారంభం చేసింది. హిస్సార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో 63–66 కేజీల విభాగం తొలి రౌండ్లో నిహారిక 5–0తో డాలీ సింగ్ (బిహార్)పై నెగ్గింది. 2015లో ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో నిహారిక భారత్‌కు రజత పతకం అందించింది. నిహారిక సోదరి నాగనిక ప్లస్ 81 కేజీల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. చదవండి: క్వార్టర్ ఫైనల్లో సింధుకు చుక్కెదురు -
'ఆ వార్తలు బాధాకరం..ఈనెల 10న ఫ్లాట్ ఖాళీ చేస్తున్నాం'
-
ఎలా మోయగలిగావ్?
ఆపద కాలం ఉంటుంది. కానీ ఆదుకోలేని కాలం ఒకటి ఉంటుందని మొదటిసారిగా చూస్తున్నాం. ఒక కోడలు.. అపస్మారక స్థితిలో ఉన్న తన మామగారిని వీపు పైన మోసుకుంటూ ఆసుపత్రులకు తిరిగిన ఫొటోలు వారం రోజులుగా నెటిజన్ల చేత బరువైన ఒక దీర్ఘ శ్వాసను తీయిస్తున్నాయి. ఏమైనా ఆ కోడలు నీహారిక ప్రయత్నం ఫలించలేదు. కరోనా ఆయన్ని తీసుకెళ్లిపోయింది. ‘‘ఎలా మోయగలిగావ్?’’ అన్నారట.. ఆసుపత్రి బెడ్డుపై ఉండగా ఆ ఫొటోలు చూసిన ఆమె మామగారు. అవే ఆయన ఆఖరు మాటలు. ‘‘ఎవరూ సహాయానికి రాలేదు. ఎవరికీ ఇలా జరగకూడదు’’. ప్రస్తుతం కరోనా చికిత్స పొందుతున్న నీహారిక ఆవేదన ఇది. ఎవరూ సహాయానికి రాలేదని ఆమె ఎవరినీ నిందించడం లేదు. ఎవరికీ ఇలా జరగకూడదని మాత్రమే ఆమె కోరుకుంటోంది. ‘ఇలా’ అంటే?! తన మామగారు తుళేశ్వరదాసుకు జరిగినట్లుగా! ఆయనకు ఈ నెల 2 న కరోనా పాజిటివ్ వచ్చింది. ఆసుపత్రికి ఆటో ఎక్కించడం కోసం.. స్పృహలో లేని మామగారిని వీపుపై మోసుకుంటూ వెళ్తున్న నీహారిక ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలను ఆసుపత్రి సిబ్బంది ఒకరు తుళేశ్వరదాసుకు చూపించినప్పడు ఆయన అన్నమాటే.. ‘‘ఎలా మోశావ్?’’ అని. ∙∙ అస్సాంలో ఉంటుంది వీళ్ల కుటుంబం. నగావ్ జిల్లాలోని రహా పట్టణం పక్కన బటిగావ్ గ్రామంలో ఉంటారు. నీహారిక మామ తుళేశ్వరదాసుకు 75 ఏళ్లు. ఊళ్లోనే వక్కలు అమ్ముతుంటాడు. నీహారిక భర్తకు పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో చిన్న ఉద్యోగం. నీహారిక కొడుక్కి ఆరేళ్లు. ‘దేవుడా.. కరోనా కాదు కదా..’ అని అనుకునే లోపే మామగారి ఆరోగ్యం విషమించడంతో నీహారిక కాలూచెయ్యీ ఆడలేదు ఆ రోజు! భర్త ఊళ్లో లేడు. కొడుకు చిన్నపిల్లాడు. ఇల్లు కదలొద్దని పిల్లవాడికి జాగ్రత్తలు చెప్పి, నీహారిక ఆటో మాట్లాడుకొచ్చింది. రహా ఆరోగ్య కేంద్రం అక్కడికి 2. కి.మీ. దూరంలో ఉంది. పేషెంట్‌ని తీసుకెళ్లడానికి ఆటోని ఒప్పించ గలిగింది కానీ.. ఇంటివరకు ఆటో రావడానికే వీల్లేని విధంగా మట్టి దిబ్బల దారి. నీహారికకు మిగిలిన దారి ఒక్కటే. చీర కొంగును నడుముకు బిగించి, మామగారిని భుజాలపై ఆ ఎడుగు దిగుడు దిగుళ్లలో ఆటో వరకు మోసుకుంటూ వచ్చి భద్రంగా ఆటోలో పడుకోబెట్టింది. ఆరోగ్య కేంద్రం దగ్గర మళ్లీ మామగారిని తన వీపు మీద మోసుకుంటూ లోపలికి తీసుకెళ్లడమే! సాయానికి వచ్చిన వారే లేరు. కరోనా అని నిర్థారణ అయింది. ‘‘ఇక్కడ లాభం లేదు, నగావ్‌లోని కోవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్లండి’’ అన్నారు. నగావ్ ఆసుపత్రి అక్కడికి 21 కి.మీ.! అంబులెన్స్ లేదు. ప్రైవేటు వ్యానులో మామగారిని నగావ్ తీసుకెళ్లింది. ఆ ఆసుపత్రిలోంచి, వ్యాన్‌లోకి మళ్లీ తన వీపు మీద మోస్తూనే!! ఆ సమయంలోనే ఒకరు నీహారిక పడుతున్న పాట్లను ఫొటో తీసినట్లున్నారు. తర్వాత కొద్ది గంటల్లోనే అవి సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. నీహారికకు ఆ సంగతి తెలీదు. ∙∙ నగావ్‌లోని కోవిడ్ ఆసుపత్రి తీసుకెళ్లాక, అక్కడ కూడా నీహారిక తన మామగారిని వాహనం నుంచి దింపి మోసుకెళ్లవలసి వచ్చింది! పేషెంట్ పరిస్థితిని చూడగానే ‘‘ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు. నగావ్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లండి’’ అని వైద్యులు చెప్పారు. అక్కడ కూడా మామగారిని మోస్తూనే ఆసుపత్రి మెట్లను ఎక్కిదిగవలసి వచ్చింది నీహారికకు. ‘‘మా మామగారి బరువు నాకు కష్టం కాలేదు. కానీ ఆసుపత్రి నుంచి ఆసుపత్రికి తిరుగుతున్నప్పుడు మానసికంగా చాలా కుంగిపోయాను’’ అని ఆ తర్వాత తనను కలిసిన పత్రికా ప్రతినిధులతో చెప్పింది నీహారిక. ‘‘బహుశా ఆ రోజు నేను కనీసం రెండు కి.మీ.ల దూరమైనా ఆయన్ని ఎత్తుకుని నడిచి ఉంటాను’’ అని 24 ఏళ్ల నీహారిక ఆనాటి ఒంటరి ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. జూన్ 7 రాత్రి ఆయన చనిపోయారు. తర్వాత టెస్ట్ చేయించుకుంటే నీహారికకూ పాజిటివ్! ∙∙ ‘‘తల్లిదండ్రులైనా, అత్తమామలైనా, అపరిచితులే అయినా.. మనం ఒకరికొకరు సహాయం చేసుకోగల పరిస్థితులు లేకపోడం దురదృష్టం. మనిషి ఒంటరితనాన్ని ఇంకో మనిషి మాత్రమే పోగొట్టగలరు’’ అంటోంది నీహారిక. మామగారు తనను కూతురిలా చూసుకునేవారట. ‘‘అందుకేనేమో ఆయన్ని మోసేంత శక్తి నాకు వచ్చినట్లుంది’’ అంటోంది దిగులుగా. ఆసుపత్రి నుంచి ఆసుపత్రికి.. వాహనం ఎక్కి దిగిన ప్రతిసారీ తన మామగారు తుళేశ్వరదాసును వీపుపై మోసుకెళుతున్న నీహారిక. ఆసుపత్రిలో నీహారిక, ఆమె మామ తుళేశ్వరదాసు -
విషాదం: పొగిడారు, ఫొటోలు తీశారే తప్ప..
కరోనా అనుమానంతో కొందరు అయినవాళ్లకే దూరంగా ఉంటున్న ఈ రోజుల్లో.. తండ్రిలాంటి మామను కాపాడుకోవాలన్న ఆ కోడలి తాపత్రయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అస్సాంలో నిహారికా దాస్ అనే మహిళ.. కరోనా పాజిటివ్ సోకిన మామను మీపు మీద మోసుకుంటూ రెండు కిలోమీటర్లు వెళ్లిన ఫొటోలు వారం రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఉత్తమ కోడలిగా, ఈ కరోనా కష్టకాలంలో మనిషికి మనిషి సాయం అంటూ ఆమె స్టోరీపై కథనాలు వెలువడ్డాయి. కానీ, పాపం ఆమె పడ్డ కష్టం వృథా అయ్యింది. ఆమె మామ చనిపోవడంతో పాటు కరోనా సోకిన ఆమె ఇప్పుడు చికిత్స తీసుకుంటోంది. గువాహటి: నిహారికా దాస్.. ఆదర్శ కోడలు ట్యాగ్ లైన్‌తో దేశం మొత్తం ప్రశంసలు అందుకుంది. ఓ మీడియా ఛానెల్ ఆమెను ఫోన్ ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించినప్పుడే.. తన ఫొటోలు, వీడియోలు వైరల్ అయిన విషయం ఆమెకు తెలిసిందట. అంతేకాదు ఆ సంతోషంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె మామకు ఆ ఫొటోల్ని చూపించి ఆమె సంబుర పడింది కూడా. ‘నన్ను మోసేంత గుండె ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అని ఆ పెద్దాయన చెప్పిన మాటల్ని మీడియాతోనూ పంచుకుంది నిహారిక. అయితే ఆమె ఆనందం ఎంతోసేపు నిలవలేదు. పరిస్థితి క్షీణించి ఆమె మామ కన్నుమూశాడు. ‘‘మా ఫొటోలు షేర్ చేయడంతో పాటు మనిషికి మనిషి సాయం చేసుకోవాలనే సందేశం ఇవ్వడం బాగుంది. కానీ, నా విషయంలోనే అది జరగనందుకు బాధగా ఉంది. నా కష్టం చూసి చుట్టూ చేరి ఫొటోలు తీశారే తప్ప.. సాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ ఫొటోలు చూడగానే నేను ఒంటరిననే భావన కలిగింది. నా గుండె భారంగా అనిపించింది. తల్లిదండ్రులే కాదు.. అయినవాళ్లు, కానీవాళ్లు అనే తేడా లేకుండా ఎవరికైనా సాయం అందించడం మనిషి కర్తవ్యం. అది నెరవేరనంత వరకు మానవత్వం గురించి ఎంత మాట్లాడుకున్నా వ్యర్థమే” - నిహారికా దాస్ ఏం జరిగిందంటే.. రహా ఏరియాలో తులేశ్వర్ దాస్ పోకవక్కలను అమ్ముతుంటాడు. అతని కొడుకు సిలిగురి(వెస్ట్ బెంగాల్)లో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో ఆ ఇంట్లో తులేశ్వర్, కోడలు నిహారికా దాస్ ఉంటున్నారు. జూన్ 2న తులేశ్వర్ ఆరోగ్యం క్షీణించగా.. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిహారిక ప్రయత్నించింది. అయితే ఆ పరిస్థితి చూసి ఆటో, రిక్షా వాలాలు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మరోదారి లేక ఆమె భుజాన వేసుకుని నాగావ్ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లింది. ఆ టైంలో అంతా ఆమెను ఫొటోలు, వీడియోలు తీశారు. తులేశ్వర్, నిహారికలను టెస్ట్ చేసిన డాక్టర్లు ఇద్దరికీ పాజిటివ్ సోకిందని చెప్పారు. తులేశ్వర్ పరిస్థితి చూసి హాస్పిటల్ తరలించాలని చెప్పారు. అయితే వయసు మళ్లిన మామగారిని ఒంటరిగా వదిలేసేందుకు ఆమె మనసు ఒప్పుకోలేదు. దీంతో ఓ మినీ వ్యాన్ మాట్లాడుకుని అక్కడికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లింది నిహారికా. తులేశ్వర్ పరిస్థితి విషమించడంతో జూన్ 5న గువాహటి మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు. చివరికి సోమవారం రాత్రి కరోనాతో పోరాడుతూ తులేశ్వర్ కన్నుమూయగా.. నిహారిక ట్రీట్మెంట్ కొనసాగుతోంది. -
నిహారిక: కరోనా బాధితులకు అన్నదానం
-
అల్లుడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు.. ఏంటో తెలుసా!
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లి జొన్నలగడ్డ చైతన్యతో గత డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం నిహారిక-చైతన్య తమ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. భర్తతో గడిపిన ప్రత్యేక క్షణాలను నిహారిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా నాగాబాబు తన ఒక్కగానొక్క అల్లుడికి ఓ లగ్జరీ గిఫ్ట్‌ను అందించారు. అల్లుడు చైతన్యకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. రేంజ్ రోవర్ డిస్కవర్ తెలుపు రంగు కారును అల్లుడికిస్తూ.. నిహారిక, చైతన్యలను సర్ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని నాగబాబు శనివారం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. నా అల్లుడికి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ అంటూ ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఈ మేరకు కూతురు నిహారిక, చైతన్యకు కారును డెలివరీ చేస్తున్న ఫోటోను షేర్ చేశారు. దీని ఖరీదు దాదాపు 70 లక్షలు ఉంటుదని అంచనా. అయితే వాస్తవానికి ఇది ఉగాదికి ఇవ్వాల్సిన కానుక అని.. కానీ కాస్త ఆలస్యం అయ్యిందని నాగబాబు తన యూట్యూబ్ చానల్లో తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. -
‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అంటున్న నిహారిక
విజయ్ సేతుపతి, నిహారిక జంటగా ఆర్ముగ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’. తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని రావూరి అల్లికేశ్వరి సమర్పణలో డాక్టర్ రావూరి వెంకటస్వామి తెలుగులో ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ– ‘‘విజయ్‌సేతుపతి నటన హైలైట్. ఇంతకు ముందు చేయని పాత్రలో నిహారిక కనిపిస్తారు. మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ’’ అన్నారు. -
అన్నవరం లో నిహారిక చైతన్య ప్రత్యేక పూజలు
-
వైభవంగా నిహారిక-చైతన్య వివాహం
-
నా మనసు యాక్టింగ్ మీదనే: నిహారిక
నిహారిక లిరా దత్... ‘పాతాల్ లోక్’తో ఆకాశానికి ఎగసిన నటి. ఓటీటీ ఖాతా ఉన్న ప్రతి వీక్షకుడు ‘సారా మాథ్యూస్’గా ఆమెకు అభిమాన ఇల్లు కట్టాడు. పుట్టి పెరిగింది ఢిల్లీలో. తండ్రి.. అభిజిత్ దత్. యాక్టర్, రైటర్, ఫిల్మ్‌మేకర్. తల్లి.. పియూ దత్. రిటైర్డ్ టీచర్, థియేటర్ ప్రొఫెషనల్. నిహారికకు ఒక అక్క.. అవలోకిత దత్..కూడా ఫిల్మ్‌మేకర్. ఆ కుటుంబ నేపథ్యాన్ని బట్టి అర్థమయ్యే ఉంటుంది నిహారికది నటనావారసత్వం అని! లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమెన్‌లో డిగ్రీ పూర్తి చేసిన నిహారిక నటన తప్ప ఇంకే రంగం గురించి ఆలోచించలేదు. అందుకే ముంబై వెళ్లి ‘డ్రామా స్కూల్ ఆఫ్ ముంబై’లో చేరింది. నటనలో మెలకువలు నేర్చుకుంది. థియేటర్లో తన ప్రతిభను పరీక్షించుకుంది. ‘ది బిజేర్ మర్డర్ ఆఫ్ మిస్టర్ టస్కర్’లో లీడ్ రోల్ దక్కింది. పుష్పవల్లి, ఫైనల్ సొల్యుషన్’లలోనూ అలరించింది. అవన్నీ ఒకెత్తు.. ‘పాతాల్ లోక్’ ఒకెత్తు. అందులో జర్నలిస్ట్ సారా మాథ్యూస్‌గా నటించిన నిహారికను ప్రత్యేకంగా గుర్తించడం మొదలుపెట్టింది ఓటీటీ ప్రపంచం. నటనతోపాటు గానమూ ఆమెకు ప్రాణమే. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది. పుస్తకాలు, ప్రయాణాలు ఆమెను సేదతీర్చే ఇతర వ్యాపకాలు. ఆ ప్రతిభకు అందిన ప్రశంసలే ఆమెకు అమెజాన్‌లో ‘డై ట్రైయింగ్’ అనే వెబ్ సిరీస్‌లో అవకాశాన్నిచ్చాయి. తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ‘మ్యూజిక్ టీచర్’ అనే వెబ్ మూవీలోనూ ప్రధాన భూమిక పోషించింది. ‘‘అమ్మా, నాన్నా ఏ లోటు రాకుండా చూసుకున్నారు. నా మనసు యాక్టింగ్ మీదనే ఉందని తెలిసి థియేటర్‌ను పరిచయం చేశారు. నా లక్ష్యానికి దారి చూపించారు. నా బెస్ట్ క్రిటిక్స్ మా పేరెంట్సే. వాళ్ల కాంప్లిమెంట్సే నాకు అవార్డ్స్. నన్ను చూసి గర్వపడ్తుంటారు వాళ్లు. ఇంతకన్నా నాకేం కావాలి? మంచి నటిని అనిపించుకోవాలన్న ఆశ తప్ప జీవితం మీద కంప్లయింట్స్ లేవు’ అంటుంది నిహారిక లిరా దత్. -
వయసు చిన్న.. మనసు పెద్ద
వలస కార్మికుల కోసం ఎంతోమంది తమకు చేతనైన సాయం చేస్తున్న కథనాలు మన చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. ఎంతోమంది తమ ఉదాత్త మనసు చాటుకుంటూ వలస కార్మికులకు చేతనైన సాయం చేస్తున్నారు. వారి జాబితాలో ఇప్పుడు నోయిడాలో నివసిస్తున్న 12 ఏళ్ల అమ్మాయి నిహారికా ద్వివేదీ చేరింది. నిహారిక స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ప్రతిరోజూ న్యూస్‌ఛానెళ్లలో వలస కార్మికుల కష్టాలు, వారి దయనీయ కథనాలు చూస్తూ చలించిపోయింది. కొందరికైనా తన వంతు సాయం చేయాలనుకుంది. తమ నివాస ప్రాంతంలోనూ వలకార్మికులు ఉన్నారు. వారు సొంత ప్రాంతాలకు వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా తన దృష్టికి వచ్చిన ముగ్గురు వలస కార్మికుల గురించి తెలుసుకుంది. రెండేళ్లుగా పిగ్గీబ్యాంకులో తను దాచుకున్న డబ్బు ఎంత ఉందో లెక్క కట్టింది. పిగ్గీ బ్యాంకులో 48 వేల 530 రూపాయల ఉన్నాయి. ఆ డబ్బులతో తమ ప్రాంతంలో ఉన్న ఆ ముగ్గురు వలస కార్మికులను వారి సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌కి విమానంలో పంపింది. ఈ 12 ఏళ్ల నిహారిక సున్నిత మనసుకు అందరూ అభినందనలు తెలుపుతున్నారు. చిన్న వయసులో పెద్దమనసును చాటుకుంటున్న నిహారికకు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. నిహారిక మాట్లాడుతూ ‘ఆ ముగ్గురు వలస కార్మికుల్లో ఒకరు క్యాన్సర్ జబ్బుతో బాధపడుతున్నారు. అలాంటి వారు వెయ్యికి పైగా కిలోమీటర్లు ప్రయాణించి వాళ్ల స్వస్థలానికి చేరుకోవాలి. అది తలుచుకుంటే బాధగా అనిపించింది. మా అమ్మనాన్నలతో మాట్లాడి నా పిగ్గీ బ్యాంక్ మనీతో వారిని సొంతప్లేస్కు పంపించాలనుకుంటున్నట్టు చెప్పాను. వాళ్లు ఆనందంగా ఒప్పుకున్నారు. దాంతో ఆ కార్మికులు సురక్షితంగా, తక్కువ సమయంలో వాళ్ల తమ సొంత ఊళ్లకు చేరారు. ఇది నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది’ అని వివరించింది నిహారిక. -
ట్రావెల్ గాళ్.. సోలో జర్నీ
సిటీలోని ఇక్ఫై బిజినెస్ స్కూల్లో బీబీఏ గ్రాడ్యుయేషన్ చేస్తూ... శంకర్‌పల్లిలో నివసించే నిహారికా మోహన్ తండ్రి వ్యాపారి. అమ్మ గతంలో టీచర్‌గా పనిచేసి మానేసి ప్రస్తుతం గృహిణిగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం వరకూ నిహారిక గురించి ఇంతకు మించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. అయితే టూర్ల మీద ఆమెకు ఉన్న అభిరుచి ఆమెకు కొత్త ఇమేజ్ను ఏర్పరుస్తోంది. తెలంగాణలో ట్రావెల్ వీడియోలు రూపొందిస్తున్న తొలి టీనేజర్‌గానే కాకుండా దక్షిణాదిలో సోలో జర్నీ చేస్తూ చానెల్ నిర్వహిస్తున్న మొదటి యువతిగా తనకు వస్తున్న స్పందనతో నిహారిక మరింత జోరుగా జర్నీ చేసేస్తోంది. ఈ క్రేజీగాళ్ పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే... ది 18తో... నాకు చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఎదో వెళ్లొచ్చామా అన్నట్టు కాకుండా మంచి జ్ఞాపకంలా ఉండాలనుకుంటాను. అందుకే నేను వెళ్లిన ప్రాంతాన్ని వీడియో తీయడం అలవాటుగా మారింది. ఎక్కడో ఉన్న ప్రదేశాలని వెతుక్కుంటూ వెళ్లడం కాదు, మన దగ్గర ఉన్న వాటిని సందర్శించాలి అనుకున్నాను. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అందమైన స్పాట్స్‌కి వెళ్లాను. నాకు సోలోగా వెళ్లడం ఇష్టం. వయసుకు తగ్గట్టుగా ది 18 పేరుతో ఓ చానెల్ ప్రారంభించాను. ఏడాది పాటు వీడియోస్ తయారు చేశాను. నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల అన్నింటికన్నా ట్రావెల్ వీడియోస్ ఎడిటింగ్, ఫిల్మింగ్ బాగా అనిపించేవి. అదే సమయంలో యూట్యూబ్‌లో అప్పటికే బాగా అనుభవం ఉన్న సీఏపీడీటీకి చెందిన శరత్ అంకిత్ నన్ను కలిశారు. ఇద్దరం కలిసి ట్రావెల్ వీడియోస్ ప్లాన్ చేశాం. అక్కడ నుంచి మా జర్నీ ప్రారంభమైంది. ప్రయాణాలనేవి మామూలే కానీ... అమ్మాయిలు ఒంటరిగా జర్నీ చేయడం అనేది అడ్వంచరస్ అని కూడా అనిపిస్తుంది కదా. అందుకే సోలో గాళ్ ట్రావెలింగ్‌ని ఎంచుకుని ‘గాళ్ ఆన్ వీల్స్’ స్టార్ట్ చేశాం. అందరికీ బాగా నచ్చింది. దానికే బాగా ప్రశంసలు వచ్చాయి. స్పందన చాలా బాగుంది. నేను దీన్ని కొనసాగించగలనా? తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? వంటి సందేహాలు చాలా వచ్చాయి. ప్రకృతి ఒడిలో.... మొదటి నుంచి కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్నా, అక్కడి సంస్కృతులను అధ్యయనం చేయడమన్నా అమితమైన ఆసక్తి. ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ చారిత్రాత్మకంగా, సంస్కృతి పరంగా విశిష్టత కలిగిన వాటిని తెలుసుకొని వెళతాను. ఇప్పటి వరకు నేను వెళ్లిన ప్రాంతాల్లో తిరుమల మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది. ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగానే కాకుండా అద్భుతమైన ప్రకృతి సంపదకి నిలయం. ఇప్పటికీ సహజమైన ప్రకృతితో కనువిందు చేస్తుంది తిరుమల. అంతేకాకుండా ట్రావెలింగ్‌ని ఆస్వాదించాలంటే కచ్చితంగా కోస్తా తీరం వెళ్లాల్సిందే. నా జర్నీలో భాగంగా కాకినాడ, భద్రాచలం వెళ్లాను. గోదావరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిసరాలు మనస్సుని కట్టిపడేశాయి. పచ్చని ప్రకృతితో ఒడిలో ఒంటరిగా సేదతీరడం ఒక మధుర జ్ఞాపకంలా మిగిలి పోయింది. ఈ విధంగా మరెన్నో ప్రాంతాలకు వెళ్లి నా అభిరుచులను నెరవేర్చుకోవడం ఆనందంగా ఉంది. తదుపరి ఇతర రాష్ట్రాల ప్రయాణంలో భాగంగా కర్ణాటక వెళ్తున్నాను. బ్యాలెన్స్ చేసుకుంటూ... మా కాలేజ్‌లో అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. 75 శాతం తప్పకుండా ఉండాలి. కాబట్టి చాలా వరకూ వారాంతపు సెలవుల్లో టూర్లు వెళ్లి వస్తున్నా. ఎడిటింగ్ డబ్బింగ్ వంటి పన్లన్నీ కాలేజ్ నుంచి వచ్చేశాక నేరుగా ఆఫీసుకి వెళ్లిపోయి సాయంత్రాలలో చేసుకుంటున్నా. రాత్రి పూట ఇంటికి తిరిగివెళుతున్నా. యూ ట్యూబ్ వాళ్లు విభిన్న ప్రాంతాల్లో నిర్వహించిన 5 ఈవెంట్స్‌కి ఆహా్వనం అందుకున్నా. అలాగే టూర్లు వెళ్లే వారికి వీలైనంత హెల్ప్‌ఫుల్‌గా, అదే సమయంలో ఎంటర్టైనింగ్గా కూడా నా వీడియోస్ ఉండాలి. ఆంధ్రా, తెలంగాణ కలిపి 4 భాగాలు, 6 వీడియోస్ పోస్ట్ చేశాను. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెల్‌కి నేను ప్రాధాన్యం ఇస్తాను. కాలేజ్ స్టూడెంట్‌గా ఉన్న నాకు ఒక కాలేజ్ ఫెస్ట్‌లో ప్రసంగించమని ఆహ్వానం రావడం నా లైఫ్‌లో క్రేజీ మూమెంట్‌గా చెప్పాలి. నా లాంటి సాధారణ అమ్మాయి కూడా తలచుకుంటే ఏదో ఒకటి సాధించగలదనే విషయం లైఫ్‌లో అని అందరికీ అర్థమవ్వాలి. గతంలో ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండేదాన్ని కాదు. నేనేమీ సాధించలేక పోతున్నాననే ఒక నిస్పృహ నాలో ఉండేది. అయితే ఈ వర్క్ స్టార్ట్ చేశాక అంతా మారిపోయింది. నాకు 20 ఏళ్లంటే ఎవరూ నమ్మరు. నేను బాగా కష్టపడుతున్నానంటున్నారు. అయితే నేనేం చేస్తున్నాను అనేదానిపై నాకు పూర్తి స్పష్టత ఉంది. -
ఎంత పని చేశావు నిహారికా
‘ఎంత పని చేశావు నిహారికా.. నీ బాగు కోసమే కదమ్మా మందలించింది. బాగా చదువుకోమని చెప్పినందుకే ప్రాణాలు తీసుకుని మాకు కడుపుకోత మిగిల్చావు కదమ్మా’ అంటూ ఆ తండ్రి దుఃఖించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. రెండు రోజుల క్రితం ఎల్ఎల్సీలో దూకి గల్లంతైన విద్యార్థిని నిహారిక(15) మృతదేహం గురువారం పైకి తేలడంతో పోలీసులు, గజ ఈగతాళ్ల సాయంతో బయటకు తీశారు. కళ్లు, ముక్కు, నోరు, చేతులను చేపలు స్వల్పంగా తినేయడం చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న నిన్ను ఈ స్థితిలో చూడాల్సి వస్తుందని అనుకోలేదంటూ తండ్రి వాసుబాబు గుండెలు బాధుకున్నాడు. సాక్షి, ఎమ్మిగనూరు రూరల్(కర్నూలు): ప్రకాశం జిల్లా కొనికి గ్రామానికి చెందిన వాసుబాబు, వెంకటరమణమ్మ పదిహేనేళ్ల ఏళ్ల కిత్రం ఎమ్మిగనూరుకు వలసవచ్చి పొలాలు కౌలుకు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలోని సోమప్ప నగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి సీతామహాలక్ష్మీ, నిహారిక(15), వర్థిని సంతానం. నిహారిక స్థానిక రవీంద్ర స్కూల్లో పదో తరగతి చదువుతోంది. మార్కులు తక్కువ వస్తున్నాయని తెలిసి మూడు రోజుల క్రితం తల్లిదండ్రులు మందలించారు. బాగా చదువుకోవాలని సూచించారు. మందలించడాన్ని అవమానంగా భావించి మంగళవారం ఉదయం ఎల్ఎల్సీ వద్దకు వెళ్లి సైకిల్ గట్టుపై పెట్టి కాలువలో దూకేసింది. సైకిల్‌ను ఆధారంగా చేసుకొని పోలీసులు, అగ్నిమాపక పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టిన బాలిక మృతదేహం కనిపించలేదు. ప్రభుత్వాసుపత్రి వద్ద రోదిస్తున్న బాలిక తల్లి, కుటుంబ సభ్యులు రెండు రోజులైనా మృతదేహం కనిపించకపోవటంతో సైకిల్ పెట్టి ఎక్కడికైనా వెళ్లిందేమోనని, తమ కుమార్తె బతికే ఉంటుందని తల్లిదండ్రులు ఆశతో ఎదురుచూశారు. గురువారం ఉదయం చెరువులో బాలిక మృతదేహం ఉండటాన్ని గమనించిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీయించారు. బాలిక కళ్లు, ముక్కు, నోరు, చేతులను చేపలు తినివేయడాన్ని చూసిన తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. చెరువు వద్దకు టౌన్ సీఐ వి. శ్రీధర్, ఎస్ఐ శరత్‌కుమార్‌రెడ్డి, ఫైర్ ఎస్ఐ మోహన్‌బాబులు చేరుకొని బాలిక మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు టౌన్ సీఐ తెలిపారు. -
తళుక్కుమన్న తులిప్
సాక్షి, సిటీబ్యూరో: తులిప్ పుష్పాలు తళుక్కుమన్నాయి. వైవిధ్యభరితమైన రూపాల్లో కనువిందు చేశాయి. జూబ్లీహిల్స్‌లోని పార్క్‌వ్యూ ఎన్‌క్లేవ్‌లో నిర్వహించిన తులిప్ పుష్పాల పండగ అదరహో అనిపించింది. నగరానికి చెందిన ఫ్లోరల్ బొటిక్ చాంప్స్ ఫ్లవర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన తులిప్ పుష్పాల పండగ చూపరులకు ఆహ్లాదకర అనుభూతిని అందించింది. ఈ సందర్భంగా నిర్వాహకురాలు చిత్రాదాస్ లగడపాటి మాట్లాడుతూ.. నగరంలో తొలిసారిగా 10 వేల తులిప్ పూల పండగను ఏర్పాటు చేయడం సంతోషాన్ని అందించిందన్నారు. ఈ పూలు ఉద్యానాలతో పాటు ఇంటికీ అందాన్ని పెంచుతాయంటూ.. వాటి గురించిన విశేషాలను సందర్శకులకు వివరించారు. ఫ్లవర్ ఫెస్ట్‌ని సందర్శించిన వారిలో ప్రముఖ సినీనటి నిహారిక, సిటీ సోషలైట్స్ పద్మా రాజగోపాల్, పద్మజారెడ్డి, మంజులారెడ్డి, జ్యోత్స్న, కామిని షరాఫ్ తదితరులు ఉన్నారు. -
‘సూర్యకాంతం’ ప్రీ రిలీజ్ వేడుక
-
పనిమనషి
తిన్న కంచం నుంచి వేసుకునే బట్టల దాకా శుభ్రం చేయాలి. వంట గది నుంచి తోట పని దాకా మనకు తోడవ్వాలి. రోజంతా ఇంటి బాధ్యతలతో పాటు మన బాగోగులూ చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో సమానంగా అంతకు మించీ మనతో ఉంటున్న తననెందుకు పనిమనిషి అంటున్నాం? మనమనిషి అనుకోలేమా? ఈ ప్రశ్నలకు సమాధానం అందరి దగ్గరా లేకపోవచ్చు కానీ కొందరి దగ్గర ఉంది. ఆ కొందరిలో ఒకరి గురించి తెలుసుకుందాం. అందరికీ ఆ సమాధానాన్ని చేరువ చేద్దాం. ‘‘దీదీ... కుక్కర్ ఏదీ... తోమడానికి వేయలేదు?’’‘‘పాచి వాసన పోవట్లేదని నేను కడిగేశాలే’’ఆ సమాధానంతో అపరాధభావానికి లోనైంది రాధ. మిగిలిన గిన్నెలు కడిగేసి.. ఇల్లు ఊడ్చి.. తుడవడానికి సన్నద్ధమైంది. తుడిచే గుడ్డ కనిపించలేదు. అంతా వెదికింది. ఎక్కడా లేదు.‘‘దీదీ.. తుడిచే గుడ్డ కనిపించడం లేదు?’’‘‘ఇవ్వాళ్టి నుంచి దీంతో తుడువు...’’ అంటూ మాప్ కర్రను తెచ్చిచ్చింది.‘‘దీంతోనా?’’ చూపుల్లో ఆశ్చర్యం... స్వరంలో కుతూహలంతో రాధ.ఈలోపు ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు లేచి ఏడుపు అందుకున్నాడు. చేతిలో పని పడేసి గబగబా వచ్చి ఉయ్యాల్లోంచి పిల్లాడిని తీసి ఎత్తుకుంది రాధ.. పంటి బిగువున పాపాయి బరువును భరిస్తూ!గబగబా వచ్చిన యజమానురాలు..‘‘నేను ఎత్తుకుంటాలే’’ అంటూ బిడ్డను తీసుకుంది రాధ చేతుల్లోంచి!యజమానురాలి ఊహించని చర్యకు విస్తుపోతూ.. ‘‘దీదీ.. బాబుకి నా చేతుల్లో నిద్రపడుతుంది.. నేను పడుకోబెడ్తాలే’’ అంది.‘‘నేను చూసుకుంటానన్నాను కదా...’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది యజమానురాలు. ఆమె కొత్తగా ఉండడంతో దిగులు పడుతూనేబాల్కనీలోకి వెళ్లింది రాధ. బట్టలు ఉతకడానికి. నల్లా కింద బకెట్ పెట్టి... నల్లా విప్పింది. ఆ చప్పుడికి మళ్లీ లోపలి నుంచి పరిగెత్తుకొచ్చింది యజమానురాలు.‘‘ఏం చేస్తున్నావ్?’’‘‘బట్టలుతుకుదామని నల్లా తిప్పాను దీదీ...’’ అమాయకంగా రాధ.‘‘నల్లా కట్టేసి.. బట్టల్ని వాషింగ్ మెషీన్లో వెయ్’’ యజమానురాలి ఆర్డర్. ‘‘అదేంటి దీదీ? మీరే చెప్తారు కదా ఎప్పుడూ..వాషింగ్ మెషీన్లో బట్టలేస్తే సరిగ్గా మురికి వదలదని?’’ అడుగుతుంది అదే అమాయకత్వంతో.‘‘ఇప్పుడు చెప్తున్నా కదా.. వెయ్! వాడకుండా దాన్నలా మూలన పెట్టి పాత సామాన్లకుఅమ్మేయడానికా?’’ అంటూ లోపలకు వెళ్లిపోతుంది యజమానురాలు.దీదీ వింతగా కనపడ్తోంది ఆ రోజెందుకో మరి రాధకు.పనైపోయాక అటూ ఇటూ తచ్చాడుతుంటుంది రాధ.. ‘‘యే.. ఇంకా ఇంటికెళ్లవా?’’ అడుగుతుంది యజమానురాలు.‘‘వెళ్తా దీదీ..’’‘‘వెళ్లేప్పుడు ఈ పళ్లు తీసుకెళ్లు.. ఎప్పటి నుంచో పడున్నాయిక్కడ’’ డైనింగ్ టేబుల్ మీదున్న పళ్లబుట్టను చూపిస్తూ యజమానురాలు.‘‘అయ్యో... దీదీ.. ఇవి ఈరోజు పొద్దున తీసుకున్నవే... తాజా పళ్లు’’ అంటుంది చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ రాధ.‘‘చెప్పింది చెయ్... తీసుకెళ్లమన్నా కదా.. తీసుకెళ్లు అంతే.. ఆ.. రేపు రానక్కర్లేదు.. సెలవ్ తీసుకో’’ అంది యజమానురాలు.రాధ మనసు కీడు శంకించి ఏదో అనబోతుండగా.. కాలింగ్ బెల్ మోగింది. గబగబా వెళ్లి తలుపు తీసింది రాధ. ఎదురుగా ఓ అమ్మాయి.‘‘ఎవరు కావాలి?’’ అంది రాధ.‘‘నన్ను రమ్మన్నారు’’ అని ఆ అపరిచితురాలు సమాధానం చెప్తూండగానే... ‘‘ఆ.. ఆ.. నేనే రమ్మంది... లోపలికి రా..’’ అంటూ పిలుస్తుంది యజమానురాలు.‘‘రేపట్నుంచి పనిలోకి వస్తావా?’’ అడుగుతుంది యజమానురాలు లోపలికి వచ్చిన ఆ అమ్మాయితో.‘‘దీదీ.. నేనేమై పోవాలి?’’.. ఆందోళనతో రాధ. ‘‘నీతో కాదులే రాధా.. నువ్వాగు’’ అని రాధను వారిస్తూ కొత్త అమ్మాయితో ‘‘పాచి వాసన రాకుండా గిన్నెలు తోమాలి, ఇల్లు ఊడ్చి, తుడవాలి, బట్టలు.. అన్నీ చేయాలి. రేపటి నుంచి వచ్చేయ్’’ బాధ్యత అప్పజెప్పేస్తుంది యజమానురాలు. ‘‘మరి వంట? ఎంతమందికి వండాలి?’’ కొత్త అమ్మాయి ప్రశ్న. ‘‘వంట పని నేను, రాధ చూసుకుంటాంలే..’’ అని ఆమెతో చెప్పి.. ‘‘యే... రాధా.. నాకు హెల్ప్ చేస్తావ్ కదా?’’ అడుగుతుంది నవ్వుతూ యజమానురాలు. రాధా కళ్లల్లో చెమ్మ... ఆనందంతో!‘‘రాధా.. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నన్నెంత శ్రద్ధగా చూసుకున్నావ్? మరి నువ్ గర్భిణిగా ఉంటే నేనూ అంతే శ్రద్ధగా నిన్ను చూసుకోవాలా లేదా?’’ రాధను దగ్గరకు తీసుకుంటూ చెప్తుంది యజమానురాలు! ఇది ఒక యాడ్. విమెన్స్ డే సందర్భంగా విడుదలైంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ని.. ముఖ్యంగా ఇంటి పనుల్లో సహాయపడ్తున్న మహిళలను గౌరవించమని... మనుషులుగా చూడమని చెప్తున్న యాడ్. బాగుంది.. యాడ్.. అలా ఉండాలన్న ఊహా.. చాలా బాగుంటుంది. కానీ ప్రాక్టికల్‌గా అలా ఉండ దు. ఎన్ని ఇళ్లల్లో పనమ్మలకు వేరు టీ కప్పు.. సప రేట్ టిఫిన్ ప్లేట్లుండవ్? నిజంగా జరిగే పని కాదు.అలా ఎందుకు అనుకోవడం? నిజంగా జరిగిన సంఘటనల ప్రేరణతోనే ఆ యాడ్ పుట్టి ఉండొచ్చు కదా! అలాంటి రియల్ లైఫ్ యజమానురాలిని ఇక్కడ పరిచయం చేసుకుందాం.ఆమె పేరు... నిహారికా రెడ్డి. హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడ, ఇంజనీర్స్ కాలనీలో నివాసం. బొటిక్ నడిపిస్తుంది. కొన్నాళ్ల కిందట నాగమ్మ అనే అమ్మాయి నిహారిక వాళ్లింట్లో డొమెస్టిక్ హెల్పర్‌గా చేరింది. పెళ్లికాని పిల్ల. స్వస్థలం.. కరీంనగర్ జిల్లాలోని సబ్బితం అనే పల్లె. నిహారికను అక్కా... అని ఆప్యాయంగా పిలుస్తూ ఇంటి పనుల్లో సహాయంగా ఉండేది. నిహారికా ఆ అమ్మాయిని బుజ్జీ అంటూ అంతే ప్రేమగా చూసుకునేది. నిహారిక దగ్గర చేరిన ఆర్నెల్లకు నాగమ్మ అస్వస్థతకు గురైంది. నిహారికే ఆసుపత్రిలో చూపించింది. కిడ్నీ సమస్య అని తేలింది. వయసుతోపాటు కిడ్నీలు పెరగక రెండు కిడ్నీలు పాడైపోయాయని చెప్పారు వైద్యులు.కిడ్నీ మార్పిడి ఒక్కటే పరిష్కారమని, అప్పటివరకు డయాలసిస్ చేయించాలని సూచించారు. ఈ విషయాన్ని గ్రామంలో ఉన్న నాగమ్మ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది నిహారిక. అప్పటికే నాగమ్మ తండ్రి పక్షవాతంతో, తల్లి డయాబెటీస్‌తో బాధపడ్తున్నారు. నాగమ్మ ఇద్దరు అక్కల పెళ్లిళ్లయిపోయి అత్తగారిళ్లల్లో ఉన్నారు. అన్నదమ్ములు చదువుకుంటున్నారు. తమ బిడ్డ ఆరోగ్యం కోసం రూపాయి ఖర్చు పెట్టలేమని నిస్సహాయతను వ్యక్తం చేశారు నాగమ్మ తల్లిదండ్రులు. దాంతో ఆమె బాధ్యతను నిహారికే తీసుకుంది. దక్కన్ ఆసుపత్రిలో చేర్పించింది. నాగమ్మ కోసం తను స్వయంగా ఆరు లక్షల రూపాయలను వెచ్చించింది. కిడ్నీ మార్పిడి ప్రయత్నం కోసం ఫండింగ్కూ వెళ్లింది. దురదృష్టం.. నాగమ్మ బతకలేదు. ఆర్థికంగా అండగానే కాదు.. రాత్రింబవళ్లు కంటికి రెప్పలా.. కన్నబిడ్డలా నాగమ్మను చూసుకుంది నిహారిక. అప్పటికే ఆమెకు ఇద్దరు చిన్నపిల్లలు. అర్ధరాత్రి ఆసుపత్రికి పరుగెత్తాల్సి వచ్చేది. తెలిసిన వాళ్లను ఇంట్లో పిల్లలకు తోడుగా ఉంచి నాగమ్మను తీసుకుని హాస్పిటల్ వెళ్లేది. ‘‘ఇంత చేసినా ఆ అమ్మాయిని కాపాడుకోలేకపోయాననే బాధ. బుజ్జీ గురించి నేను పడిన ఆరాటమంతా గొప్పకోసం కాదు. ఓ మనిషిగా నా బాధ్యత అది. డొమెస్టిక్ హెల్పర్స్ మనకు స్లేవ్స్ కారు. మనం ఇంకో చోట వర్క్ చేయడానికి ఎలా వెళ్తామో... వాళ్లు మన ఇంట్లో వర్క్ చేయడానికి వస్తారు. మన బాస్ మనల్ని ఇల్ ట్రీట్ చేస్తే మనమెంత హర్ట్ అవుతామో.. సేమ్ మనం ఇల్ ట్రీట్ చేస్తే డొమెస్టెక్ హెల్పర్స్ కూడా అంతే హర్ట్ అవుతారు. సొసైటీలో ఒకరి మీద ఒకరం ఆధారపడి ఉంటాం. పనులూ అంతే. మనమెక్కడో కంట్రిబ్యూట్ చేయాలంటే మన సొంత పనుల్లో ఎవరో ఒకరు మనకు సహాయపడాల్సిందే. పరస్పర సహాయ సహకారాలతోనే సమాజం.. దాని అభివృద్ధి. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే మనుషుల మధ్య తేడాలుండవ్. అందరినీ గౌరవించగలుగుతాం’’ అంటుంది నిహారికా రెడ్డి. ప్రస్తుతం నీహారిక దగ్గర లక్ష్మి అనే హెల్పర్ పదేళ్ల నుంచి పనిచేస్తోంది. ‘‘లక్ష్మీ అక్కా’’ అని పిలుస్తుంది ఆమెను. లక్ష్మీ తన యజమానురాలు నిహారిక గురించి ఏం అంటుందంటే.. ‘‘ఆమె పెద్దబ్బాయి పుట్టినప్పటి నుంచి ఆమె దగ్గరే పనిచేస్తున్నా. అక్కా.. అనే పిలుస్తది. ఎందుకమ్మా అక్కా అంటావ్... అంటే ‘నాకు అక్క లాంటిదానివే లక్ష్మక్కా నువ్వు’ అంటుంది. వాళ్లింట్లో మనిషిలాగే చూస్తుంది. ఒంట్లో బాగాలేకపోయినా.. డబ్బు అవసరం ఉన్నా అన్నిటికీ అమ్మలా ఆదుకుంటుంది’’ అని చెప్తుంది. ఇదొక్క ఉదాహరణే కాదు.. డొమెస్టిక్ హెల్పర్స్‌కు జీవిత బీమా చేసి, పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న యజమానులూ ఉన్నారు. వీళ్లంతా యాడ్ ఫిల్మ్స్‌కే కాదు.. రియల్ లైవ్స్కీ స్ఫూర్తే. – సరస్వతి రమ -
రికార్డుల విహారిక..
హిమాయత్‌నగర్: పెట్రోల్ ధర పెరిగిందంటే అది అమలులోకి వచ్చేలోగా బండిలో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాం. మరుసటిరోజు ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ బైక్‌ను బయటికి తీస్తాం. అంతేగాని ఇంధనంతో నడిచే వాహనాలను పక్కనబెట్టి కొన్నిరోజులు సైకిల్‌పై పనులు చూసుకుందామని ఎవరూ అనుకోరు. చిన్నప్పుడు సైకిల్ కోసం ఇంట్లో నానా యాగీ చేసి కొనిపించుకుంటారు. కొత్త సైకిల్ ముచ్చట తీర్చుకున్న బాల్యాన్ని గుర్తు చేసుకోవడానికైనా సైకిల్ తొక్కిన సంఘటనలు ప్రస్తుత కాలంలో చాలా అరుదు. అలాంటిది సైకిల్ సవారీ చేస్తూ రికార్డుల మోత మోగిస్తున్నారు నగరవాసి నిహారిక. ఇంటి వద్ద సరదాగా ప్రారంభించిన సైక్లింగ్ ఇప్పుడామెను అంతర్జాతీయ వేదికలపై విజేతగా నిలిపింది. అంతేకాదు.. ‘అడెక్స్ క్లబ్ పర్సియన్’ నిర్వహించే ‘బ్రేవెట్’ సైక్లింగ్‌లో పోటీపడి అవార్డుల పంట పండిస్తున్నారామె. సిటీ నుంచి ఫస్ట్ విన్నర్ నగరంలోని ఈసీఐఎల్ నివాసముండే నిహారిక హైటెక్‌సిటీలోని ఓ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సరదా కోసం స్టార్ట్ చేసిన సైక్లింగ్‌లో ఇప్పుడు ఆమె రికార్డుల రారాణిగా వెలుగొందుతున్నారు. నిహారిక ఇంటివద్ద సరదాగా సైకిల్ తొక్కడం ప్రారంభించించారు. అదీ ఫిట్నెస్ కోసం రోజుకు ఒకటి రెండు కి.మీ చొప్పున తొక్కేవారు. అలా ఆ ప్రయాణం కాస్తా 100 కి.మీ తొక్కే దిశగా సాగింది. ఈమె ప్రతిభను గుర్తించిన స్నేహితుడు.. ‘బ్రేవెట్’లో పాల్గొంటే మంచి గుర్తింపుతో పాటు అవార్డులు సైతం గెలుచుకోవచ్చని సలహా ఇచ్చాడు. అంతే.. స్నేహితుడి సలహాతో పోటీలో పాల్గొన్న నిహారిక రికార్డులు బద్దలుకొడుతోంది. ‘బ్రేవెట్’ నిర్వహించే కాంటెస్ట్‌లో 2015లో సైక్లింగ్ పోటీల్లో పాల్గొంది నిహారిక. హైదరాబాద్ వేదికగా జరిగిన ‘సూపర్ ర్యాండొనెస్’ టైటిల్ పోటీల్లో 200 కి.మీ.లో సక్సెస్ అయిన నిహారిక.. తర్వాత 300 కి.మీ., 400 కి.మీ., 600 కి.మీ. పూర్తి చేసిన మొట్టమొదటి హైదరాబాద్ మహిళగా రికార్డు సాధించారు. దీంతో ఆమెను బ్రేవెట్ ‘సూపర్ ర్యాండొనెస్–2015–16’ టైటిల్‌తో సత్కరిచింది. ఇంత వరకు ఏ మహిళా ఈ రికార్డును నెలకొల్పకపోవడం గమనార్హం. ఘాట్రోడ్డులోవెయ్యి కి.మీ. మామూలు రోడ్డుపై సైకిల్ తొక్కాలంటే చాలా కష్టపడాలి. అటువంటిది ఘాట్ రోడ్డులో సైకిల్ అంటే కత్తి మీద సామే. అదీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి కి.మీ. ఘాట్ రోడ్డులో సైకిల్‌ను తొక్కి సరికొత్త రికార్డును నమోదు చేశారు నిహారిక. తమిళనాడులోని తిరుచురాపల్లి నుంచి కన్యాకుమారి వరకు వెయ్యి కి.మీ. మేర సైక్లింగ్ చేసిన నిహారిక.. ఈ ప్రయాణంలో 650 కి.మీ. ఘాట్ రోడ్డు, మరో 350 కి.మీ.హైవేపైనాసాగింది. సౌతిండియా నుంచి ఈ రికార్డును నెలకొల్పిన ఏకైక మహిళగా నిహారిక రికార్డును సొంతం చేసుకున్నారు. 24 గంటల్లో 360 కి.మీ రైడ్ ‘ఫ్లషీ’ సంస్థ 2018–19 సంవత్సరానికి నిర్వహించిన 360 కి.మీ పోటీల్లో నిహారిక తన టీమ్ మురగన్, గణేష్, బద్రితో కలసి పాల్గొన్నారు. ఈ పోటీని కూడా నిహారికే లీడ్ చేయడం విశేషం. ఇందులో 24 గంటల్లో 360 కి.మీ. తొక్కాల్సి ఉంటుంది. అలా ఆమె బెంగళూరు నుంచి గండికోట రోడ్డు మార్గంలో సైక్లింగ్ చేసి రికార్డు సొంతం చేసుకున్నారు. అన్ని రికార్డులనూ బ్రేక్ చేస్తా సైక్లింగ్‌లో మన సత్తా ఎంటో ప్రపంచానికి తెలియాలి. ‘బ్రేవెట్’ తరఫున పాల్గొన్న ప్రతి ఈవెంట్లోను నాది ఓ రికార్డు ఉంటుంది. ఇలాంటి రికార్డులు ఎన్ని ఉన్నా అన్నింటినీ బ్రేక్ చేసేందుకు ఎదురు చూస్తున్నా. త్వరలోనే ఆ ఘనతను సాధించి మహిళా శక్తి ఏంటో చూపిస్తా. – నిహారిక ట్రిపుల్ ఎస్ఆర్ టైటిల్ విజేతగా.. 2017–18లో ‘బ్రేవెట్’ కాంటెస్ట్‌లో మళ్లీ పాల్గొన్నారు నిహారిక. ఏడాది పాటు 4,500 కి.మీ. సైకిల్ తొక్కి రికార్డు నమోదు చేశారు. వేలమంది పోటీపడిన ఈ కాంటెస్ట్‌లో ‘ట్రిపుల్ సూపర్ ర్యాండొనెస్’ టైటిల్ విజేతగా నిలిచారు. ఈ రికార్డును దేశంలో ఇంతవరకూ ఎవరూ నమోదు చేయకపోవడంతో ఆ ఘనతను సాధించిన మొట్టమొదటి భారతీయురాలిగా ఈమె నిలిచింది. -
అలా స్నేహం.. ప్రేమ.. పెళ్లి: నిహారికా
శ్రీనగర్‌కాలనీ (హైదరాబాద్): వారి ప్రాంతాలు వేరు.. భాష వేరు.. కానీ.. ఆ ఇద్దరినీ ప్రేమ కలిపింది.. సినిమా ఇండస్ట్రీలో పరిచయం.. ప్రేమ.. పెళ్లి.. ఒకరి కోసం ఒకరు.. అన్నట్లుగా జీవిస్తున్నారు. వారెవరో కాదు.. అందరికీ సుపరిచితమైన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నిహారికారెడ్డి, రచయిత, దర్శకుడు కన్నన్ డీఎస్ (దొరస్వామి) దంపతులు. వీరిద్దరి పరిచయం.. ప్రేమ..పెళ్లి.. తదితర విషయాలను రేపు ప్రేమికుల రోజు సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. అవి వారి మాటల్లో.. కన్నన్.. మాది తిరువణ్నామలై (అరుణాచలం). బీఎస్సీలో ఉన్నప్పుడే కాలేజీలో థియేటర్లో చురుకుగా పాల్గొనేవాడిని. నేను బాస్కెట్‌బాల్ ప్లేయర్‌ని కూడా. ఎంఎస్సీ కంప్యూటర్స్, ఎం.ఏ. ఎంఫిల్ థియేటర్ ఆర్ట్స్ చేశాను. యూనివర్సిటీలో కొత్తవారికి నేనే ట్రైనింగ్ ఇచ్చేవాడిని. అలా కమల్‌హాసన్ సత్యం–శివం– సుందరం సినిమాకి స్క్రిప్ట్‌లో వర్క్ చేశాను. ఈ తర్వాత కుమార్ అనే ఫ్రెండ్ ద్వారా రచయిత విజయేంద్రప్రసాద్ పరిచయమయ్యారు. అలా ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ సినిమాలకు కథతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. స్వీయ దర్శకత్వంలో సారాయి వీర్రాజు చిత్రాన్ని చేశాను. ప్రస్తుతం తమిళంలో విజయ్– అట్లీ చిత్రానికి, మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ చిత్రాలకు పనిచేస్తున్నాను. మొదట భయపడ్డారు: నిహారికారెడ్డి కన్నన్‌తో పెళ్లంటే మొదట పెద్దమ్మ, పెద్దనాన్న భయపడ్డారు. గడ్డంతో విలన్లా ఉన్నాడని అన్నారు. మన ప్రాంతం, మన భాష కాదన్నారు. చాలా మంది కన్నన్ గురించి చెప్పడంతో పాటు నా ఇష్టాన్ని గౌరవించారు. ఆ తర్వాత రెండు నెలలకే పెళ్లి చేసుకున్నాం. అప్పుడు నాకు 18 ఏళ్లే. నా జీవితంతో మరిచిపోలేని సంఘటన నా పెళ్లి. మా వివాహానికి రాజమౌళి, క్రిష్, వీవీ వినాయక్, కీరవాణి, అజయ్, కృష్ణుడు, మెహర్ రమేష్, కళ్యాణి మాలిక్, తేజ వచ్చారు. మొత్తానికిమా వాడితో గడ్డం తీయించావు. మంచోడు.. కానీ మొండోడు అని ఆయన గురించి అంతా నవ్వుతూ అనేవారు. ప్రేమ మార్పునుతీసుకొస్తుంది: కన్నన్ చిన్నప్పుడు అమ్మ ప్రేమను చూస్తాం. పెద్దయ్యాక మన మేనరిజంలో మార్పు వస్తుంది. చాలా టెంపర్‌గా ఉండే నన్ను ప్రేమ మార్పు తీసుకువచ్చింది. మాకు మొదట పాప పుట్టింది. పూర్ణజ్ఞాన అని తనికెళ్ల భరణి పెట్టారు. మేము పూర్ణజ్ఞాన ఐశ్వర్యగా పిలుస్తున్నాం. తర్వాత బాబు పుట్టాడు. నాకు చెగువేరా అనే చాలా ఇష్టం. దాంతో యశో చెగువేరా అని పెట్టాం. నాకు నిహారిక.. పిల్లలు.. సినిమానే ప్రపంచం. ప్రస్తుతం ‘సైరా’ చేస్తున్నాను. యాత్ర చిత్రంలో నిహారికారెడ్డి నిహారికారెడ్డి.. మాది అనంతపురం జిల్లా కదిరి. నా చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది. నాన్న మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. పెద్దమ్మ, పెదనాన్న నాకు అన్నీ అయి పెంచారు. ఆటుపోట్ల మధ్య నా జీవితం సాగింది. ఇంటర్ తర్వాత హైదరాబాద్ వచ్చాను. చాలా కష్టాలను చవిచూశాను. దర్శకుడు తేజ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఈ క్రమంలో ఓసారి ప్రసాద్ ల్యాబ్స్‌లో నేను నటించిన ‘నిన్ను కలిశాక’ చిత్ర ప్రివ్యూలో ఓ ఫ్రెండ్ కన్నన్ను నాకు పరిచయం చేశాడు. అలా ఆ సినిమా ప్రివ్యూ చూశాం. ఆ తర్వాత నిత్యం ఫోన్లోమాట్లాడుకునే వాళ్లం. అలా స్నేహం.. ప్రేమ.. పెళ్లి: కన్నన్ నేను చాలా టెంపర్ మనిషిని. ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ కాని వ్యక్తిత్వం నాది. గడ్డంతో చాలా మాస్‌గా ఉండేవాడిని. సినిమాల్లోకి వచ్చాక సెట్లో వర్క్‌లో సీరియస్‌గా ఉండేవాడిని. నన్ను చూసి నీకు జీవితంలో పెళ్లి కాదు అనేవారు. నేను కూడా సన్యాసం తీసుకుందాం.. పెళ్లీ.. గిళ్లీ లేకుండా ఉందామనుకున్నా. సినిమాటోగ్రాఫర్ సమీర్‌రెడ్డి నన్ను అఘోరా అని పిలుస్తాడు. సినిమానే లోకంగా జీవించేవాడిని. దర్శకుడు తేజ ఆఫీస్ దగ్గర నిహారికను చాలాసార్లు చూశాను. ఓసారి నేనే పలకరించా. ఆ తర్వాత ప్రసాద్ ల్యాబ్స్‌లో కలిశాం. అలా స్నేహితులమయ్యాం. ఓ రోజు ఇంటికి భోజనానికి రమ్మని నిహారిక పిలిచింది. అప్పుడే పెళ్లి ప్రస్తావన తెచ్చా. నాకు ఇష్టమే.. కానీ పెద్దమ్మ, పెదనాన్నదే తుది నిర్ణయమని చెప్పింది. తర్వాత మా కుటుంబికులతో మాట్లాడాను. పెద్ద కూతురిలాచూసుకుంటారు: నిహారికారెడ్డి కన్నన్ నన్ను ఓ పెద్ద కూతురిలా చూసుకుంటాడు. పెళ్లి తర్వాత నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. నా ప్రతీ విజయంలో కన్నన్ వెన్నుదన్నుగా ఉన్నారు. మా మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినా అవి తాత్కాలికమే. మా ఇంటికి వచ్చిన చాలా మంది నన్ను పొగడుతుంటారు. నిన్ను అమ్మా అని పిలుస్తూ ఓ కూతురిలా కన్నన్ చూసుకుంటాడని అంటుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే నాకు చాలా ఇష్టం. ‘యాత్ర’ మూవీలో నటించా. నాకు ఈ చిత్రం రెండో ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. చిత్రం ఘన విజయం సాధించడం చాలా సంతోషంగా అనిపించింది. వైఎస్సార్ పాలన చూడాలని ఆంధ్రా ప్రజలు కోరుకుంటున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్‌తో పాటు అవకాశాలు వస్తే సినిమాల్లో సైతం నటించడానికి సిద్ధంగా ఉన్నాను. -
‘సాక్షి’ ఈ సీక్రెట్లన్నీ బ్రేక్ చేసింది!!
రెహమాన్.. రెహమాన్ సిస్టర్ కేటీఆర్.. కేటీఆర్ సిస్టర్ వరుణ్ తేజ్.. వరుణ్ తేజ్ సిస్టర్ ఆకాశ్.. ఆకాశ్ సిస్టర్ నలుగురు సిస్టర్స్ కట్టిన నాలుగు రాఖీలివి! నలుగురు బ్రదర్స్ ‘అనురాగ బంధన్’ లివి! అల్లరికి అనుపల్లవి.. చెల్లెలు. చెల్లెలి హరివిల్లు.. అన్నయ్య. ఎక్కడైనా ఇంతే కదా. కొత్త ఉందా ఇక్కడేమైనా?! ఎస్.. ఉంది. రెహమాన్ అంటే మ్యూజిక్కే కదా? ప్రేమను పంచే మ్యాజిక్ కూడా ఉందట! కేటీఆర్ అంటే... ఐటీ స్టార్ కదా? పిల్లల మధ్య ట్వింకిల్ ట్వింకిల్ స్టార్ అట! వరుణ్ తేజ్ అంటే.. ఆరడుగులు కదా? ఆటపట్టిస్తే ఇప్పటికీ చిన్నపిల్లాడేనట! ఆకాశ్ అంటే.. పోరడు కదా? చెల్లి విషయంలో పెద్దోడు అట! చెల్లెళ్లనడిగి.. ‘సాక్షి’ ఈ సీక్రెట్లన్నీ బ్రేక్ చేసింది. ‘రాఖి’ంగ్ ఇంటర్వ్యూలు చేసుకొచ్చింది. తమ్ముడు కాదు నాన్న రాఖీ దక్షిణాది సంప్రదాయం కాకపోయినా మెల్లిగా మనం అడాప్ట్ చేసుకున్నాం. కుల, మతాలకు అతీతంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ అక్కాతమ్ముళ్ల (రైహానా, ఏఆర్ రెహమాన్) అనుబంధం గురించి తెలుసుకోవాలని ఉంది... రైహానా: మేం ఎప్పుడూ రాఖీ పండగ చేసుకోలేదు. తమ్ముడికి రాఖీ కట్టింది లేదు. అయితే ‘నీకు ఎప్పుడూ తోడుగా నేను ఉన్నా’ అని చెప్పే పండగ కాబట్టి మాకు తోడుగా ఉన్న మా తమ్ముడి గురించి ఇష్టంగా మాట్లాడాలని ఉంది. తమ్ముడు అనేకంటే రెహమాన్‌ని ‘మా నాన్న’ అంటే బాగుంటుందేమో. తమ్ముడు ఎంతో బాధ్యతగా ఉంటేనే ‘నాన్న’ అనాలనిపిస్తుంది. మీ తోడబుట్టినవాళ్లు ఎంతమంది? నేను పెద్దదాన్ని. నాకు, రెహమాన్‌కి ఒక ఏడాది తేడా. ఆ తర్వాత ఇద్దరు చెల్లెళ్లు. ఒక చెల్లెలు నాకన్నా తొమ్మిదేళ్లు, మరో చెల్లెలు ఐదేళ్లు చిన్న. మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. ఆయన పోయాక మాకు ‘బ్రెడ్ అండ్ బటర్’ ఇచ్చింది మా తమ్ముడే. అందుకే ‘నాన్న’ అన్నాను. తోడబుట్టినవాడు ఇలా ఉంటే ఆ అక్కాచెల్లెళ్లు ఎంత ‘ప్రొటెక్టివ్’గా ఫీలవుతారో మాటల్లో చెప్పక్కర్లేదు. చిన్నప్పుడు రెహమాన్‌గారికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొనివ్వడానికి మీ అమ్మగారు నగలు అమ్మేవారట. అది నిజమే. రెహమాన్‌కి మార్కెట్లో ఏ కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చినా కొనుక్కోవాలని ఉండేది. అది కావాల్సిందే అని మొండి పట్టు పట్టేవాడు. రెండు మూడు రోజులు అన్నం కూడా మానేసేవాడు. చివరికి అమ్మ నగలు అమ్మి కొనిచ్చేది. రెహమాన్ కూడా చాలా బాధ్యతగా ఉండేవాడు. దాని మీద బాగా ప్రాక్టీస్ చేసేవాడు. టీనేజ్లోనే మీ తమ్ముడు సంపాదించడం మొదలుపెట్టారు. అప్పుడు తనకోసం ఏమైనా దాచుకునేవారా? 14, 15 ఏళ్ల వయసుప్పుడే సంపాదన మొదలైపోయింది. దాదాపు ఖాళీగా ఉండేవాడు కాదు. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసేవాడు. రోజుకి వెయ్యి రూపాయలు దాకా వచ్చేవి. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం అమ్మకిచ్చేసేవాడు. ఆ తర్వాత లెక్కలు కూడా అడిగేవాడు కాదు. ఓ రెండు మూడేళ్ల క్రితం వరకూ అంతే. ఇప్పుడు మా మరదలు (రెహమాన్ భార్య) చూసుకుంటోంది. ఇప్పుడు రెహమాన్‌గారు గంభీరంగా కనిపిస్తారు. చిన్నప్పుడు తన సిస్టర్స్‌తో ఎలా ఉండేవారు? నాకు, తనకీ వయసు వ్యత్యాసం ఏడాదే కాబట్టి మేం ఇద్దరం ఎక్కువగా ఆడుకునేవాళ్లం. క్యారమ్స్ బాగా ఆడేవాళ్లం. పిల్లలందరిలానే గొడవలు పడేవాళ్లం. అయితే జీవితం తెలిసే కొద్దీ ఆ అల్లరంతా పోయింది. అయితే చిన్నప్పటి నుంచి కొంచెం మెచ్యూర్డ్‌గా ఉండేవాడు. మెల్లిగా రెహమాన్ బ్యూటిఫుల్ పర్సన్‌గా మారడం చూశాను. రాను రాను డివైన్ పర్సన్‌ని చూస్తున్నాను. ప్రతిరోజు తన లైఫ్‌ని చూసి ఏదోటి నేర్చుకోవచ్చు. తన ఫోకస్ అమేజింగ్. మీ తమ్ముడు సంగీతదర్శకుడిగా ఈ స్థాయిలో పేరు తెచ్చుకుంటారని ఊహించారా? ఒకవేళ ఊహిస్తే దానికి కారణం ఏంటి? తమిళనాడులో మంచి పేరు తెచ్చుకుంటాడనుకున్నాను. ఒక్కోసారి ఇండియాలో బాగా పాపులర్ అవుతాడనుకునేదాన్ని. కానీ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటాడని మాత్రం ఊహించలేదు. రెహమాన్ బాగా పైకొస్తాడని నేను ఎందుకు నమ్మానంటే.. అప్పట్లో తను క్రియేట్ చేసిన మ్యూజిక్ నేనెక్కడా వినలేదు. ఆ ట్యూన్స్ నాకు కొత్తగా అనిపించేవి. వినసొంపుగా ఉండేవి. నేరుగా హృదయాన్ని తాకినట్లుగా అనిపించేది. హిందూ మతం నుంచి ముస్లిమ్ మతానికి మారాలని రెహమాన్‌గారు అనుకున్నాక మీ అందరూ కూడా మారడం మీ యూనిటీని తెలియజేస్తోంది... యాక్చువల్‌గా మా కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా అమ్మగారిని ‘సూఫిజమ్’ చాలా ప్రభావితం చేసింది. రెహమాన్ కూడా ప్రభావితుడయ్యాడు. ఆ భగవంతుడి నుంచి వాళ్లకు ఓ పిలుపు అందింది. దాంతో మారారు. అయితే నేను మాత్రం ఆ తర్వాత ఎప్పటికో దేవుడి నుంచి కబురు వచ్చిందనే భావన కలిగినప్పుడు మాత్రమే మారాను. ‘నేను మారాను. నువ్వు మారాలి’ అని రెహమాన్ ఎప్పుడూ అనలేదు. నా జర్నీలో నాకెదురైన అనుభవాలే మార్పుకి కారణం అయ్యాయి. మీరు గాయనిగా, సంగీతదర్శకురాలిగా ఉన్నారు. ఈ జర్నీకి రెహమాన్‌గారి సాయం ఎంతవరకూ ఉంది? తన హెల్ప్ ఉంది. ముందు కోరస్ పాడించేవాడు. ఆ తర్వాత గాయనిగా అవకాశం ఇచ్చాడు. అలాగే తను చేసే మ్యూజికల్ షోస్‌కి తీసుకెళుతుంటాడు. అయితే యూస్, ఇతర విదేశాల్లో జరిగినప్పుడు వెళ్లను. నా అంతట నేను విదేశాల్లో సంగీత కచేరీలు నిర్వహిస్తుంటాను. తమ్ముడు ఉన్నాడు కదా.. చూసుకుంటాడులే అనుకోకుండా నేను కీబోర్డ్ , గిటార్, డ్రమ్స్.. ఇలా అన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ‘ఏండా తలైల ఎన్న వెక్కలే’ అనే సినిమా కూడా నిర్మించాను. మీ తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్స్‌లో మీరు మరచిపోలేనిది? డబుల్ క్యాసెట్ టేప్ రికార్డర్. అది కొనిచ్చినప్పుడు రెహమాన్ వయసు 21. చెన్నైలో బర్మా బజార్ ఫేమస్. అక్కడికివెళ్లి కొనుక్కొచ్చాడు. ఆ టేప్ రికార్డర్లో బోలెడన్ని పాటలు విన్నాను. నేను పాడుతూ రికార్డ్ చేసేదాన్ని. మిగతా ఇద్దరి చెల్లెళ్లకు ఓ దారి చూపించారా? వాస్తవానికి క్యాసెట్స్ అమ్మకం జోరుగా ఉన్నప్పుడు నాకు క్యాసెట్ బిజినెస్ అప్పజెప్పాడు. క్యాసెట్స్ పోయి సీడీలు వచ్చాక మానేశాం. ఆ తర్వాత నేను నా వర్క్‌తో బిజీ అయ్యాను. నా రెండో చెల్లెలు రెహమాన్ మ్యూజిక్ కాలేజీ చూసుకుంటోంది. ఇంకో చెల్లెలు ప్లేబ్యాక్ సింగర్. రెహమాన్ ట్యూన్స్‌కి, బయటవాళ్లకు పాడుతుంటుంది. మీ అబ్బాయి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతదర్శకుడిగా సక్సెస్ అవ్వడంతో పాటు హీరోగానూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. మేనమామ హెల్ప్ ఉందా? చిన్నప్పుడు పక్కనే కూర్చోబెట్టుకొని కీ బోర్డ్ ప్రాక్టీస్ చేయించేవాడు. అలా రెహమాన్ తనని గైడ్ చేసేవాడు. ఐదారేళ్ల వయసప్పుడే రెహమాన్ ట్యూన్‌కి జీవీ పాడాడు. ‘జెంటిల్‌మేన్’ సినిమాలో ‘చికు బుకు చికు రైలే’ చిన్నపిల్లాడి గొంతు జీవీదే. అలాగే ‘బొంబాయి’లో ‘కుచ్చి కుచ్చి కూనమ్మా’ పాడాడు. పెద్దయ్యాక కూడా పాడాడు. ఆ తర్వాత వేరే మ్యూజిక్ డైరెక్టర్స్‌కి కూడా పాడటం మొదలుపెట్టాడు. ఫైనల్లీ తన మేనమామలా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అంతవరకూ సక్సెస్ అవుతాడనుకున్నాను. హీరోగా మాత్రం నేనూహించలేదు. అయితే జీవీకి అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉంది. హీరోగానూ సక్సెస్‌ఫుల్‌గా వెళుతున్నాడు. అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లను రెహమాన్‌గారు గ్రాండ్‌గా చేశారా? బావగార్లతో ఎలా ఉంటారు? మా పెళ్లిళ్లకు హాజరైన ప్రతి ఒక్కరూ ‘చాలా ఘనంగా చేశారు’ అన్నారు. నేను వేరే చెప్పక్కర్లేదనుకుంటా. బావగార్లతో రెహమాన్ రాసుకుని పూసుకుని ఉండడు. మాట్లాడే నాలుగు మాటలు బాగా మాట్లాడతాడు. ఎక్కువగా దైవత్వం గురించి మాట్లాడతాడు. అసలు మీ అందరికీ టైమ్ కేటాయించేంత తీరిక మీ తమ్ముడికి ఉంటుందా? అమ్మని బాగా చూసుకునే మంచి కొడుకు అనిపిస్తోంది.. ఎప్పుడూ బిజీ. రోజూ ఫోన్ చేసుకోవడం లాంటివి ఉండవు. ‘తిన్నారా? ఏం చేస్తున్నారు’ అనేవి అడక్కపోయినా ఓవరాల్‌గా మా అందరికీ ఏం కావాలో అవన్నీ చూసుసుంటూ ఉంటాడు. అంతకు మించి ఏం కావాలి? ఇక అమ్మ విషయానికొస్తే.. బిజీగా ఉంటాడు కాబట్టి రోజూ కలవలేడు. అమ్మ నాతోనే ఉంటుంది. తమ్ముడు ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకుంటాడు. ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేదంటే మంచి మంచి డాక్టర్స్‌తో ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే మా అందరి విషయంలో ‘హీ ఈజ్ వెరీ కేరింగ్’. అంతా బాగానే ఉంది.. గూగుల్‌లో ఎంత వెతికినా పెద్దయ్యాక మీరంతా దిగిన ఒక్క ఫ్యామిలీ ఫొటో కూడా లేదేంటి? దానికి కారణం ఉంది. ఒకసారి మేమంతా కలసి ఓ గ్రూప్ ఫొటో దిగాం. ఆ తర్వాత ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పటినుంచి దిగడం మానేశాం. ఇది మా తమ్ముడి సెంటిమెంట్. అందుకే చిన్నప్పుడు మేం దిగిన ఫొటోలు ఉంటాయోమో కానీ పెద్దయ్యాక మా ఫొటోలు ఉండవు. ఫైనల్లీ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు ఏదైనా సలహా ఇస్తారా? ‘నాకిది చేయలేదు. నాతో ఇలా ఉండలేదు’ అని కంప్లైంట్ చేయకూడని బంధం ఇది. ఒకరి మంచిని మరొకరు కోరుకోవాలి. ఒకరి నుంచి ఒకరు ఏమీ ఆశించకూడదు. నేను మాత్రమే కాదు.. నా తోడబుట్టినవాళ్లు బాగుండాలని కోరుకోవాల్సిన బంధం ఇది. అక్కాచెల్లెళ్లకు అన్నతమ్ముళ్లు భరోసాగా నిలవాల్సిన బంధం ఇది. మా జీవితంలో ఈ బంధం చాలా పటిష్టంగా ఉంది. అక్కాచెల్లెళ్లందరికీ అది దక్కాలని కోరుకుంటున్నాను. రెహమాన్‌గారి విజయానికి కారణాలేంటి? ఫ్యూర్లీ తన టాలెంట్. వర్క్ మీద తనకున్న ఫోకస్. మ్యూజిక్ మినహా వేరే దేని మీదా దృష్టి ఉండదు. ఎప్పుడూ వినయంగా ఉంటాడు. నా తమ్ముడి సక్సెస్‌కి ప్రతిభ, పని మీద ఏకాగ్రత, వినయం.. వీటికి ఆ దేవుడి ఆశీస్సులు కూడా తోడయ్యాయి. ఫాదర్ ఫిగర్ అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని తెలిపే రాఖిలాంటి పండగ బహుశా మనకే సొంతమేమో! నాకు తెలిసీ ప్రపంచంలో ఇలాంటి కల్చర్ ఇంకా ఎక్కడా లేదనుకుంటా. మన దేశంలో ఈ రాఖి అంటే తెలియని వాళ్లుండరేమో. మేమూ ఈ కాన్సెప్ట్‌లోనే పెరిగాం. బ్రదర్ అంటే మన దగ్గర అమ్మాయిలకు ఫాదర్ ఫిగరే. ఎస్పెషల్లీ ఎల్డర్ బ్రదర్. నాక్కూడా అంతే. రామన్న (కేటీఆర్) ఫాదర్ ఫిగరే. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హిమ్ లైక్ మై ఫాదర్. పైగా మా నాన్న ఎప్పుడూ బిజీయే కాబట్టి, రామన్ననే ఆయన ప్లేస్ తీసుకున్నాడు. ప్రతీదీ ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం చిన్నప్పటి నుంచి. ఇష్టాఇష్టాల నుంచి చదువు, కెరీర్ వరకు.. అన్నీ! ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి.. ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లడం వరకు అన్నీ రామన్నతో డిస్కస్ చేశాను. అయితే డెసిషన్ విషయంలో నాకు ఫుల్ ఫ్రీడమ్ ఉండేది. ఉంటుంది కూడా. ఏది మంచి ఏది చెడు జడ్జ్ చేస్తాడు కాని నిర్ణయం నన్నే తీసుకోమంటాడు. బోరింగ్ బ్రదర్ అండ్ బోరింగ్ సిస్టర్ రామన్న నాకన్నా మూడేళ్లు పెద్ద. మోర్ లైక్ ఫ్రెండ్స్‌లాగే ఉంటాం. నిజం చెప్పాలంటే మేమిద్దరం బోరింగ్ బ్రదర్ అండ్ సిస్టర్. చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనూ గొడవపడలేదు. ఒక వస్తువునే ఇద్దరం కావాలని పట్టుపడలేదు. దేని కోసం డిమాండ్ కూడా లేదు. అలాగే క్వశ్చనింగ్ కూడా లేదు. రామన్న ఏది చెబితే అది చేయడమే. అయితే పెళ్లయి వెళ్లిపోతుంటే ‘‘హమ్మయ్య ఈ గయ్యాళి వెళ్లిపోతుంది’’ అని మాత్రం అనుకుని ఉంటాడు (నవ్వుతూ). ‘‘మీ ఆయన్ని సతాయించకు’’అని చెప్పాడు. తన కూతురు అలేఖ్య అచ్చం నా పోలికే అని చెప్తుంటాడు. ‘‘నీలాగే గయ్యాళి’’ అంటుంటాడు (నవ్వుతూ). రామన్న ఉన్నాడు అనే ధీమానే రాఖీ కడితే గిఫ్ట్స్ లాంటి సీనేం ఉండదు పెద్దగా. చిన్నప్పుడు అమ్మో, నాన్నో.. రామన్న జేబులో డబ్బులు పెడితే.. నేను రాఖీ కట్టగానే అవి నాకు ఇచ్చేవాడు. ఇప్పుడు అయితే రాఖీ కన్నా నా ప్రతి బర్త్‌డేకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటాడు. పిల్లల బర్త్‌డేలకు కూడా. రామన్న నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అంటే.. నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా.. రామన్న ఉన్నాడు అన్న ధీమానే. నా లైఫ్‌లో నేను మరిచిపోలేనిది అంటే.. నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు.. రామన్న నా దగ్గర ఉండడం. అప్పుడు మేం యూఎస్‌లో ఉన్నాం. వాడు పుట్టగానే వాడిని చేతుల్లోకి తీసుకున్నాడు. రామన్నకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలతో చాలా సరదాగా ఉంటాడు. వాళ్లతో బాగా ఆడ్తాడు. మా బర్త్‌డేలకు, పిల్లల బర్త్‌డేలకు తప్పకుండా కలుసుకుంటాం. నేను రామన్నకు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ లాస్ట్ ఇయర్ ఆయన బర్త్‌డే రోజు మొదలుపెట్టిన గిఫ్ట్ ఎ హెల్మెట్ చాలెంజ్. ఎవ్రీ ఇయర్ రామన్న బర్త్‌డేకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటా. బట్ లాస్ట్ ఇయర్ ఆయనకే తెలియకుండా సర్ప్రైజింగ్ ఆయన బర్త్ డే రోజు వెళ్లి హెల్మెట్ ప్రెజెంట్ చేశాను. ఆ చాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నట్టు కూడా చెప్పాను. చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఈ రోజు కూడా హెల్మెట్ ఇస్తాను. నేను స్టార్ట్ చేసిన ఈ చాలెంజ్ రెస్పాన్స్ చాలా బాగుంది. హెల్మెట్ పెట్టుకోవడం మీద అవేర్నెస్ వచ్చేంత వరకు ప్రతియేడు రామన్న బర్త్‌డే నుంచి రాఖీ వరకు ఈ క్యాంపెయిన్ చేస్తూనే ఉంటాను. చాలా ప్యాషనేట్‌గా ఉంటాడు.. ఇద్దరం అన్ని విషయాలు చాలా ఓపెన్‌గానే మాట్లాడుకుంటాం. విల్ డిస్కస్ ఎవ్రీ థింగ్. కాని ఏ విషయం మాట్లాడినా ఎండ్ అయ్యేది మాత్రం పాలిటిక్స్ దగ్గరే. ఏది చెప్పినా వింటాడు. నిరుత్సాహ పర్చడు. చేసేద్దాం అంటాడు. చాలా ప్యాషనేట్‌గా ఉంటాడు. ఏదైనా పని మొదలుపెడితే పట్టుదలగా పూర్తి చేస్తాడు. నాకూ పట్టుదల ఎక్కువే. ఇద్దరం ఒకరి నుంచి ఒకరం అడ్వయిజెస్ తీసుకుంటాం. నేను చేసే వంటలంటే రామన్నకు చాలా ఇష్టం. ఇది చేయకు.. అది చేయకు ఒక్క రామన్ననే కాదు.. మా ఇంట్లో ఏ విషయంలోనూ ఎవరూ వెనక్కి లాగలేదు. లాగరు కూడా. ఇంజనీరింగ్ చేస్తానన్నా.. అమెరికా వెళ్తానన్నా.. చివరకు పాలిటిక్స్‌లోకి రావడాన్ని కూడా ఎవరూ అడ్డుకోలేదు. అడ్డు చెప్పలేదు. ఎంకరేజింగ్‌గానే ఉంటారు. అందరూ ఇండువిడ్యువాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు.. రెస్పెక్ట్ చేస్తారు. రిస్ట్రిక్షన్స్ ఎప్పుడూ లేవు. రాఖీ.. బ్రదర్స్ అందరికీ నా రిక్వెస్ట్... అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్లది రక్తసంబంధం. ఎవరి లైఫ్‌లో వాళ్లు ఎంత బిజీగా ఉన్నా అక్క, చెల్లెళ్ల కోసం టైమ్ కేటాయించండి. ఎందుకంటే ఆడపిల్ల తను లైఫ్‌లో ఎంతబాగా సెటిల్ అయినా ప్రతి అన్నా, తమ్ముడు తన పట్ల కేర్ తీసుకోవాలని, కన్సర్న్ చూపించాలని కోరుకుంటారు. సో.. దయచేసి వాళ్లతో టైమ్ స్పెండ్ చేయండి. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫైట్ చేసే స్పిరిట్‌నే పెంపొందించారు తప్ప పిరిగా అన్న వెనకాలో.. నాన్న వెనకాలో దాక్కునే తత్వాన్ని నూరిపొయ్యలేదు. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలనే చెప్పారు. ఆ ధైర్యాన్నే ఇచ్చారు. నిజానికి మా ఇంట్లో నాకు గాని, రామన్నకు గాని మా అమ్మే ఇన్సిపిరేషన్. అమ్మ ఓపిగ్గా లేకపోతే నాన్న జర్నీ ఇంత సాఫీగా సాగేది కాదు. సో.. షి ఈజ్ అవర్ స్ట్రెన్త్. అన్నాచెల్లెళ్లం ఎలా ఉండాలో కూడా అమ్మను చూసే నేర్చుకున్నాం. నా పిల్లలకూ అదే చెప్తా.. మా అమ్మ నన్నెప్పుడూ అణగిమణిగి ఉండాలని ఆర్డర్ చేయలేదు. అలాగే రామన్నకు మగపిల్లాడు అని ప్రివిలేజెస్ ఇవ్వలేదు. అంటే నన్ను తక్కువా చేయలేదు.. రామన్నను ఎక్కువా చేయలేదు. ఇద్దరినీ ఈక్వల్‌గానే చూసింది. సర్దుకుపోవడం, ఒకరంటే ఒకరు గౌరవంగా ఉండడం ఇద్దరికీ నేర్పింది. నేనూ నా పిల్లలకు అదే చెప్తా. నాకు ఇద్దరు అబ్బాయిలే. అందరూ సమానమనే చెప్తా. ‘‘నువ్వు చెప్పింది అందరూ వినాలి అని అనుకోవద్దు. ఎవరి అభిప్రాయాలు, ఇష్టాఇష్టాలు వాళ్లకు ఉంటాయి. గౌరవించాలి. పర్సనల్స్పేస్ ఇవ్వాలి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా సున్నితంగా ఆలోచించాలి. బాలెన్సింగ్‌గా ఉండాలి’’ అనే చెప్తుంటా. కళ్యాణలక్ష్మిని సరిగ్గా అర్థం చేసుకోవాలి... మా నాన్న చేసిన దాంట్లో నాకు బాగా నచ్చిన విషయం.. ప్రతి గర్భిణీ స్త్రీకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం. నెలలు నిండే వరకు కూడా పనిచెయ్యక తప్పని పరిస్థితులన్న మహిళలకు ఇదెంతో మేలు చేస్తుంది. గర్భవతి అని నిర్థారణ అయి, బిడ్డ పుట్టిన మూడు నెలల వరకు ప్రతి నెలా వాళ్లకు వెయ్యి రూపాయలు వచ్చేలా చేసే స్కీమ్ ఇది. అలాగే అంగన్ వాడీలో ప్రతి రోజూ ఒక పూట పోషక విలువలతో కూడి భోజనం ఇవ్వడం. ఈ పథకానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తగ్గించినా కూడా నాన్న ఈ స్కీమ్ రన్ అయ్యేలా చేస్తున్నారు. ఇవి చాలా మంచి స్కీమ్స్. కళ్యాణ లక్ష్మిని చాలా మంచి తప్పుగా అర్థం చేసుకున్నారు కాని.. సీఎమ్గారు చాలా విజన్‌తో దాన్ని స్టార్ట్ చేశారు. పేదరికం వల్ల తెలంగాణలో అమ్మాయిలకు చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. అందుకే పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత ఆ అమ్మాయి పెళ్లికి సహాయపడే ఈ కళ్యాణ లక్ష్మి పథకం వల్ల అమ్మాయిలు కనీసం పద్దెనిమిదేళ్లు వచ్చే వరకన్నా చదువుకునే వీలు కలుగుతోంది. బాల్య వివాహాలూ కాస్త అయినా ఆగుతాయని ఆశ. అమ్మాయి భవిష్యత్‌ను బాగు చేసే పథకమే ఇది. ఆయన ఏ పని చేసినా నెక్స్›్ట ఎలక్షన్స్ వరకే కాదు.. నెక్స్›్ట జనరేషన్ వరకు ఉంటుంది. లిక్కర్విషయంలో కూడా ఆయన అదే చేస్తున్నారు. దాన్ని తగ్గించేందుకు ఆయన స్టెప్ బై స్టెప్ చర్యలు తీసుకుంటున్నారనుకుంటున్నాను. మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ రాఖీ పండగని ఎలా చేసుకుంటారు? నిహారిక: దసరా, దీపావళిలా ఫుల్‌గా చేయకపోయినా బాగానే చేసుకుంటాం. బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి, కాళ్లు మొక్కి డబ్బులు గుంజడం (నవ్వుతూ ). చిన్నప్పటి నుంచి రాఖీ ఎప్పుడూ మిస్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ అయితే వరుణ్ అన్న ‘ఫిదా’ షూటింగ్ కోసం నిజామాబాద్‌లో ఉన్నాడు. నేను వరుణ్ అన్నకు రాఖీ కట్టాకే మిగతా అన్నలకు కడతాను. నైట్ అంతా జర్నీ చేసి నిజామాబాద్ వెళ్లి అన్నకు రాఖీ కట్టి మళ్లీ రిటర్న్ వచ్చి చరణ్ (రామ్‌చరణ్) అన్నకు కట్టాను. ఒకవేళ వేరే కంట్రీలో ఉంటే ఏం చేయలేం. నెక్ట్స్ స్క్రిప్ట్స్ వినేప్పుడు కూడా రాఖీ అప్పుడు షెడ్యూల్స్ లేకుండా చూడాలి. ఎందుకంటే నాకు లాస్ కదా. పైసల్ ఇవ్వకుండా తప్పించుకుంటాడు (నవ్వుతూ). వరుణ్: మా జనరేషన్స్‌లో కజిన్స్ ఎక్కువ. చరణ్ అన్న వాళ్ల ఇంటికి నిహా వెళ్లడం, సుష్మితా వాళ్లు మా ఇంటికి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మెమరబుల్గానే సెలబ్రేట్ చేసుకుంటాం. అందరం కలిసి బయటకు వెళ్తాం. సినిమాల్లోకి వచ్చాక బయటకి వెళ్లడం తగ్గిపోయింది. ఆ రోజు షూటింగ్స్ లేకపోతే కచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే. ఎక్కువ సేపు జరుపుకునే ఫెస్టివల్ కాదు కూడా. రాఖీ కట్టించుకున్న తర్వాత టైమ్ స్పెండ్ చేస్తుంటాం. మిస్ అవ్వకుండా పాటిస్తాం. రాఖీ కట్టేప్పుడు అన్నయ్య ఇలా ఉండాలి అని ఏదైనా కోరుకుంటారా? నిహారిక: రాఖీ రోజే ప్రొటెక్ట్ చేయాలని కోరుకోం. అన్న నన్నెప్పుడూ ప్రొటెక్ట్ చేస్తుంటాడు. చెల్లి పుట్టగానే బ్రదర్స్‌కి ఒక బాధ్యత వచ్చేస్తుంది. సెకండ్ ఫాదర్ లాగా మారిపోతారు. నాన్నకు అన్నీ చెప్పలేం కదా. అన్నయ్యకు చెబుతాం. అలా అని అన్నయ్యకు కూడా మొత్తం చెప్పం అనుకోండి (నవ్వుతూ). వరుణ్: నేను ఒక్కరోజు పండగల్ని పెద్దగా నమ్మను. తను నీకు ఆ ఒక్క రోజు చెల్లెలు కాదు కదా. జీవితాంతం చెల్లెలే. లైఫ్‌లాంగ్ తనను ప్రొటెక్ట్ చేస్తుండాలి. రాఖీ అనేది ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ సెలబ్రెట్ చేసుకోవడానికి ఓ రోజు అన్నట్టు నేను ఫీల్ అవుతాను. చిన్నప్పటి నుంచి అల్లరిగా ఉంటారు. కానీ కొంత వయసు వచ్చేప్పటికి కొంచెం ప్రొటెక్టెడ్‌గా అయిపోతారు. మీ అన్న అలా మారారని ఎప్పుడు అర్థం అవ్వసాగింది? నిహారిక: అది మెల్లిగా అర్థం అవుతుంది. చిన్నప్పుడు పిచ్చి పిచ్చిగా కొట్టుకున్నాం. అమ్మా నాన్న దగ్గర ఊరికే కంప్లైంట్ చేసుకోవడం నుంచి మెల్లిగా మెచ్యూర్డ్ అవ్వడం గమనించాను. నేను కాలేజ్‌లో కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో ఉండేదాన్ని. అన్నయ్య అప్పుడు వైజాగ్‌లో యాక్టింగ్ కోర్స్‌లో ఉన్నాడు. 5–6 నెలలు చూడలేదు. అప్పుడు మిస్ అయ్యాను. ఆ తర్వాత నుంచి అన్నయ్యలో కొంచెం ప్రొటెక్టీవ్నెస్ కనిపించేది. అది కూదా గుడ్ వేలోనే. మరీ ఓవర్‌గా, రెస్ట్రిక్షన్లా కూడా కాదు. ఇంకో ప్లస్ ఏంటంటే.. ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్తున్నాను అంటే త్వరగా ఇంటికి వచ్చేయ్ అంటారు. అదే అన్నతో అయితే ఈజీగా బయటకు వెళ్లోచ్చు. అన్నయ్యతో ఉన్నావా? అని ఇంకే అడగరు. వరుణ్: ఆ ట్రాన్స్ఫర్మేషన్ అందరికీ జరుగుతుంది అనుకుంటున్నాను. నేను, మా చెల్లెలు ఊరికే కొట్టుకోవడం, గొడవపడటం తప్ప కూర్చొని స్వీట్‌గా మాట్లాడటం ఎప్పుడూ లేదు. నా విషయంలో తను ఎంత ప్రొటెక్టివ్‌గా ఉందో నా కెరీర్ స్టార్ట్ అయిన తర్వాతే తెలుసుకున్నా. చరణ్ అన్న, నేను కూడా ఎక్కువ గొడవలు పడేవాళ్లం. ఎక్కువ తిట్టేవాడు.. కొట్టేవాడు. సడెన్‌గా చరణ్ అన్న యాక్టర్ అయ్యాక నన్ను ఫాదర్‌లా చూసుకోవడం స్టార్ట్ చేశాడు. నేను యాక్టర్‌ని అయ్యాక అది అర్థం అయింది. నిహారిక: నాకు తెలిసిన ఫ్రెండ్స్‌లో కొందరు ‘మా అన్నయ్య అన్నింటికీ అడ్డంకులు పెడతాడు. వాడికి వాళ్ల ఫ్రెండ్స్ ఎక్కువ’ అనేవాళ్లు. నా అన్న మాత్రం అలా కాదు. నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు ‘ఎక్కడికి వెళ్తున్నావు’ అని అన్నయ్య అడిగేవాడు. అప్పుడు చిరాకుగా అనిపించేది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది.. ఒకవేళ అది కూడా అడగకపోతే ఇంకా అల్లరి పిల్లలా తయారయ్యేదాన్ని అని. మీ ఇంట్లో ఎవరికి వాళ్లు మీ కెరీర్‌తో బిజీ. ఈ బిజీ వల్ల వచ్చే గ్యాప్‌ని ఎలా ఫిల్ చేస్తారు? నిహారిక: ఇప్పుడు అన్న కొంచెం ఖాళీ దొరికినా నా ఆఫీస్‌కి రా. సెట్స్‌కి రా అంటాడు. వాళ్ల ఫ్రెండ్స్‌తో నన్ను కలుపుకుంటాడు. అందుకే అంత గ్యాప్ రాదు. ఒక వారం వరకూ ఓకే. వారం దాటి కలవకపోతే మాత్రం ఇద్దరికీ ‘మిస్సింగ్’ అనే అలారం మోగిపోతుంది. వెంటనే కలుస్తాం. బ్రదర్ అండ్ సిస్టర్ అంటే ఎక్కువ శాతం టామ్ అండ్ జెర్రీలా ఉంటారు. మరి మీ ఇంట్లో టామ్ ఎవరు జెర్రీ ఎవరు? నిహారిక: నేను జెర్రీ.. అన్నయ్య టామ్. ఆ ప్రోగ్రామ్‌కి ఇన్స్పైర్ అయ్యి, అన్న చేతులు గీరేసేదాన్ని. అప్పుడు వాడు హీరో అవు తాడు అని తెలియదు కదా. ఇప్ప టికీ ఆ గీతలు వాడి చేతుల మీద ఉంటాయి. అన్న కోసం నాకు చాక్లెట్స్ లంచం ఇచ్చేవాళ్లు - నిహారిక రాఖీ అనగానే బ్రదర్ సిస్టర్ని ప్రొటెక్ట్ చేయాలి. భరోసా ఇవ్వాలి అంటాం. మరి సిస్టర్స్ బ్రదర్స్‌కి ఏం చేయాలి. నిహారిక : మేం కూడా ఏమైనా చేయాలా? (పెద్దగా నవ్వుతూ). చిన్నప్పటి నుంచి చాకిరీ చేస్తూనే ఉంటాం కదా. సోఫాలో కూర్చొని చిటికేస్తే మేమే కదా వాటర్ బాటిల్ అయినా ఏదైనా అందించేది. పరిగెత్తిస్తారు కదా. ఇలా సంవత్సరం అంతా చేస్తూ రాఖీ రోజు గుర్తు చేస్తుంటాం హాలో.. నువ్వు కూడా బాధ్యతగా ఉండూ అని. రాఖీ రోజు వరుణ్ మీకు గిఫ్ట్స్ ఇస్తుంటారా? నిహారిక: ఏది పడితే అది తీసుకుంటాను. అప్పటి మైండ్‌సెట్‌కి తగ్గట్టుగా అడుగుతా. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇలాంటి పండగలప్పుడు అడగాలనిపించదు. కానీ మాములు టైమ్‌లో చంపుతుటాను. మీ అన్నయ్యకు మీరిచ్చిన వాటిలో బెస్ట్ గిఫ్ట్స్ ఏదైనా? వస్తువు కొని ఇస్తే ప్రేముంటుందని నేను అనుకోను. నేను నా టైమ్ తీసుకొని నా సొంతంగా చేసినవి ఇవ్వడానికి ఇష్టపడతాను. అలాంటి గిఫ్ట్స్ ఇవ్వడంవల్ల మనం ఎంత స్పెషలో తెలియజేస్తాం. అలా ఇవ్వడం వల్ల నాకు ఎక్కువ సంతృప్తి ఉంటుంది. గిఫ్ట్స్ కంటే అన్నయ్యతో స్పెండ్ చేసే స్పెషల్ మూమెంట్స్‌ని చాలా ఇష్టపడతాను. బయట మీ అందరికీ కనిపించే వరుణ్ వేరు.. మా ఇంట్లో ఉండే వరుణ్ వేరు. చాలా ఏడిపిస్తాడు. చాలా ఫన్నీ. ఈ విషయం మీ అందరికీ తెలుసో.. లేదో. అన్న బెస్ట్ కంపెనీ. అలాంటి ఇంకెన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను. గిఫ్ట్స్ అన్నీ ఏదో పాయింట్లో ఇరిగిపోతాయి.. అరిగిపోతాయి. స్పెండ్ చేసిన టైమే బెస్ట్ అని నా ఫీలింగ్. నిహారిక మీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్? వరుణ్: తను గిఫ్ట్స్ ఎక్కువ ఇవ్వదు కానీ బాగా చూసుకుంటుంది నన్ను. ఒకసారి తను సొంతంగా నా బర్త్‌డేకి నా ఫోట్స్ అన్నీ కలిపి ఓ పెద్ద గిఫ్ట్ తయారు చేసి ఇచ్చింది. అది ఇప్పటికీ నా రూమ్‌లోనే ఉంది. మీరు షేర్ చేసుకున్న బెస్ట్ మూమెంట్స్ వరుణ్: మా ఫ్యామిలీలో ఒక స్పెషల్ మూమెంట్ అని ఉండదు. అన్నీ కలిపి ఉంటాయి. నాకు నిహారిక ఒక్కతే కాదు.. చరణ్ అన్న వాళ్ల సిస్టర్స్ కూడా క్లోజ్. మా కజిన్స్ అందరం ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి అందరం రెగ్యులర్‌గా కలుస్తాం. మీట్ అవుతుంటాం. సంక్రాంతికి బయటకు వెళ్తుంటాం. బెంగళూర్‌లో ఫామ్ హౌస్ ఉంది. నిహారిక తన షూటింగ్స్‌కి రమ్మంటుంది కానీ నా బిజీ వల్ల కుదరడం లేదు. సాధారణంగా ఏ అమ్మాయి అన్నయ్యని అయినా అబ్బాయిలు విలన్‌గా ఫీలవుతారు. మీ అన్నయ్య ఎంతమందికి విలన్ అయ్యారు? నిహారిక: మా అన్న ఒక లైన్ చెప్పాడు. అది తనెక్కడో చదివాడట. అదేంటంటే.. ఏ చెల్లైనా అన్నయ్యకు గర్ల్ ఫ్రెండ్ ఉందంటే అర్థం చేసుకుంటుందట. అదే అన్నయ్యకు ఆ చెల్లి వచ్చి నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంటే అస్సలు అర్థం చేసుకోడట. దానికి కారణం చెప్పాడు. చెల్లెలికి ప్రేమంటే ఏంటో తెలుసు. కానీ అన్నయ్యలకు అబ్బాయిలంటే ఏంటో తెలుసు అన్నాడు. నిజమే కదా అనిపించింది. హిస్టరీ చూస్తే ఇదే నిజం అని అర్థమవుతుంది. సినిమాల్లో కూడా చెల్లెలు వదినా అని వెంటనే ఒప్పుకుంటుంది. అన్నయ్య మాత్రం సింపుల్ రిజెక్షన్. అది కూడా ప్రొటెక్షనేలే. నాకు తెలిసి మా అన్న ఎవరికీ విలన్ అవ్వలేదనే అనుకుంటున్నాను. ఎప్పుడూ హీరోనే. ఇద్దరూ సినిమా ఫీల్డ్‌లోనే ఉన్నారు. ఒకరి వర్క్‌ని ఇంకొకరు ఎలా కాంప్లిమెంట్ లేదా క్రిటిసైజ్ చేసుకుంటారు? నిహారిక: 5 ఏళ్ల క్రితం అయితే చెత్తగా చేశావు.. బాగా చేశావులే అని అనుకునేవాళ్లం అనుకుంటున్నాను. బావున్నా బాలేకున్నా డీటైల్డ్‌గా చెప్తాను నేను. ప్రతి సినిమాకు యాక్టర్‌గా గ్రో అవుతుంటారనే అనుకుంటాను. డ్రెస్సింగ్, మేకప్ విషయంలో కామెంట్ చేస్తుంటాను. వరుణ్: చెల్లి సినిమాలను బాగానే క్రిటిసైజ్ చేస్తుంటాను. నిహా మాత్రం అంతగా చెప్పదు. చరణ్ అన్న దగ్గరకు వచ్చినప్పుడు అన్న చెప్పేది వింటాను. ఎందుకంటే మా అందరిలో సీనియర్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. చరణ్ అన్న, నేను సినిమాల గురించి కూడా బాగా మాట్లాడుకుంటాం. ఐడియాస్ పంచుకుంటాం. నిహా, నేను సేమ్ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి హ్యాపీ. తను డాక్టరో లేక ఇంజనీరో అయ్యింటే తన వర్క్ నాకు అర్థం అవ్వదు. ఆ టాపిక్ కూడా నేను మాట్లాడలేను. సినిమాల్లోకి వెళ్తున్నాను అనగానే అన్నయ్య రియాక్షన్ ఏంటి? నిహారిక: వాట్!! నిజంగానా అన్నాడు. మీరు ముందు హింట్స్ ఇవ్వలేదా? నిహారిక: నేను సినిమాల్లోకి వెళ్లాలనుకున్నాక ఇంట్లో గంతులేస్తున్న టైమ్‌లో అన్నయ్య ఇంట్లో లేడు. యాక్టింగ్ ట్రైనింగ్‌లో ఉన్నాడు. సో 6–7 నెలలు లేకపోయే సరికి వాడికి కొత్తగా అనిపించింది. మా ఫ్యామిలీలో ఎవరూ వద్దని చెప్పలేదు. నేను సీరియస్‌గా ఉన్నానా? లేదా ఇండస్ట్రీ నుంచి వచ్చే నెగటివ్, పాజిటివ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా? లేదా అని చూశారు. అందరికంటే చిన్నదాన్ని, చిన్నపిల్ల అని భయపడ్డారు. హ్యాండిల్ చేయగలుగుతుందా? అని కొంచెం ఆలోచించారు. నా కాన్ఫిడెన్స్ చూసి అన్నయ్యకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది మైండ్‌లో ఫిక్స్ అయిందన్న మాట అనుకున్నాడు. ఇలానే ఉండాలని నిబంధనలేమైనా? నిహారిక: లేదు. కానీ నీకేదైనా పని చేయాలనిపించినప్పుడు నీ వెనక 8–9 మంది ఉన్నారు. సో ఏది చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పారు. నిన్ను ఎవరూ ఏమీ అనరు. చిరంజీవిగారు. నాగబాబు, పవన్‌కళ్యాణ్, చరణ్.. ఇలా అన్ని పేర్లు వస్తాయి అన్నారు. నాకూ ఆ విషయంలో క్లారిటీ ఉంది. వరుణ్: కొన్నిసార్లు ఓవర్ ప్రొటెక్షన్ పొసెసివ్‌నెస్ అయిపోతుంది. అది చాలా సన్నటి గీత. బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. మా నాన్న కూడా చాలా ఫ్రీడమ్ ఇస్తూనే కొన్ని నిబంధనలు పెట్టారు. నేను కూడా ఆ లైన్లోనే ఉన్నాను అనుకుంటున్నాను. మా చెల్లి సైడ్ నుంచైతే ఏం కంప్లైంట్స్ లేవు. తను హ్యాండిల్ చేయగలదు అని నమ్మకం వచ్చిన తర్వాత ఫ్రీ హ్యాండెడ్‌గా ఉంటున్నాం. ఇంట్లో వాళ్ళు వద్దన్నా నేనే మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తాను. (నవ్వుతూ) మీ అన్నయ్య రిలేషన్షిప్స్ నాన్నగారికి తెలియ కుండా దాచిపెట్టడం. నిహారిక: నేను, అన్నయ్య ఒకే కాలేజ్‌లో చదువుకోలేదు. కానీ 5 వరకూ ఒకే స్కూల్. అన్నయ్యను లైక్ చేసే అమ్మాయిలు తెలుసు కానీ అన్నయ్య లైక్ చేసిన అమ్మాయిలు తెలియదు. చాలా మంది చాక్లెట్స్ తెచ్చి ఇచ్చేవారు. బ్రేక్ టైమ్‌లో అన్న క్లాస్‌కి వెళ్తే ‘హే వరుణ్ చెల్లి’ అని చాక్లెట్స్ ఇచ్చేవాళ్లు. చాక్లెట్స్ వస్తున్నాయి కదా అనుకున్నే దాన్ని. అది లంచం అని తర్వాత తెలిసింది. వరుణ్: నేను అసలు అమ్మాయిలతో మాట్లాడేవాడ్ని కాదు. అమ్మాయిలంటే శత్రువులు అని అనుకునేవాడ్ని. అలా ఎందుకు అనుకున్నానో కూడా సరిగ్గా తెలియదు. మా క్లాస్‌లో అమ్మాయిలందరూ కూడా చెల్లితో క్లోజ్‌గా ఉండేవాళ్ళు. వాళ్లు ఇచ్చిన చాక్లెట్స్ తీసుకునేది కానీ నాతో చెప్పమన్నది మాత్రం చెప్పలేదు. మీ చరణ్ అన్న ఇచ్చిన గిఫ్ట్స్ ఏమైనా? నిహారిక: ఒకసారి అనుకోకుండా నాక్కావల్సింది ఇచ్చాడు. నేను ట్రిప్‌కి వెళ్తున్నాను. కొత్త కళ్లజోడు కొనుక్కుందాం అనుకున్నాను. దార్లో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వెళ్తుంటే చరణ్ అన్న కార్ కనిపించింది. హాయ్ చెప్పేదాం అని వెళ్లాను. అన్న క్యారవ్యాన్ బాగా ఫేమస్. నువ్వేంటి సడెన్‌గా ఇలా? అన్నాడు. ఏం లేదు.. కళ్లజోడు కొనుక్కుందాం అని అన్నాను. నేనుండగా నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కోవడమా అని చెప్పి పర్స్‌లో నుంచి డబ్బులు తీసి ఇచ్చాడు. మా ఫ్రెండ్స్ ‘నీ హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి డబ్బులు బయటకు రావడానికి పెద్దగా ఇష్టపడవనుకుంటా’ అని ఆటపట్టించారు. ఊహించకుండా వచ్చిన గిఫ్ట్ కాబట్టి అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎప్పుడైనా స్కూల్ అవుటింగ్స్లో హెల్ప్ చేశారా? వరుణ్: మా నాన్నగారి మితిమీరిన ప్రేమ వల్ల చిన్నప్పుడు స్కూల్ అవుటింగ్స్ ఒకటి కూడా వెళ్లలేదు నేను. మహా అంటే ఒక్కసారి అనుకుంటాను. అందరికీ ఉంటుంది కదా బయటకు వెళ్లాలని. నిహారిక టైమ్ వచ్చేసరికి ఆయన కొంచెం ఫ్రీగా ఉండేవారు. తనే చాలా సార్లు వెళ్లింది. నేను గొడవపడేవాణ్ని నన్ను ఆపేశారు... తనను పంపుతున్నారని (నవ్వుతూ). ఇద్దరికీ సీరియస్ గొడవలేమైనా అయ్యాయా? వరుణ్: నాకు గొడవలను ఎక్కువగా లాగడం ఇష్టం ఉండదు. ఎప్పుడో ఒకసారి కోప్పడుంటాను కానీ పెద్దగా మాట్లాడుకోలేనంత గొడవలు ఎప్పుడూ జరగలేదనుకుంటాను. మీరిచ్చిన బెస్ట్ గిఫ్ట్స్ ఏంటి? వరుణ్: అవతలి వాళ్లకు ఏది నచ్చుతుంది అని ఆలోచించి గిఫ్ట్ తీసుకోవడంలో చాలా వీక్. కానీ నాకు గుర్తున్నదైతే యాక్టర్ అయ్యాక నా సంపాదనతో తనకో వాచ్ కొనిచ్చాను. డబ్బులిస్తాను కావాల్సింది కొనుక్కో అంటాను. నాన్నకి తెలియకుండా మీ ఇద్దరూ చేసిన పనులు... వరుణ్: కొన్ని సార్లు లేట్ నైట్స్ బయట ఉండాల్సి వస్తుంటుంది. ఆ విషయం నాన్నకు చెప్పాలంటే భయం. అప్పుడు చెల్లి కవర్ చేస్తుంటుంది. అలా నాన్నకు అబద్ధాలు చెప్పి బయట తిరిగేవాళ్లం. మీ పాకెట్ మనీని మీ అన్న కొట్టేసేవారా? నిహారిక: అబ్బే. కిడ్డీ బ్యాంక్ ఉండేది కానీ పొరపాటున రూపాయి వేసేదాన్ని కాదు. వరుణ్ అన్నకు కాయిన్స్ కలెక్షన్ ఉండేది. అన్నీ మంచిగా సెట్ చేసుకునేవాడు నేను చిందరవందర చేసేదాన్ని. తర్వాత నాకు తెలిసిన విషయమేంటంటే నాకు కాయిన్స్ అంటే ఎలర్జీ అని. దాంతో వాటి జోలికి వెళ్లడం మానేశాను. రాఖీ విలువ తెలిసింది రాఖీ అనగానే మీకు గుర్తొచ్చే సంఘటన ఏంటి? పవిత్ర: చిన్నప్పటి నుండి అన్నయ్యకు రాఖీ కడుతూనే ఉన్నా. అయితే దాని గురించి పెద్దగా అవగాహన లేదు. రాఖీ కట్టి వాడిచ్చే డబ్బులో, గిఫ్టో తీసుకునేదాన్ని. నా ఐదవ తరగతి తర్వాత అమ్మ నాకు రాఖీ పండగ గురించి, దాని విశిష్టత గురించి చెప్పింది. గుర్తున్న సంఘటన అంటూ ఏమీ లేదు. అయితే చిన్నప్పుడు అన్నయ్య రాఖీ కట్టించుకోను అని అల్లరి చేసేవాడు. ఆకాశ్: (నవ్వుతూ). నేను ఎందుకు కట్టించుకోను అనేవాణ్ణి అంటే రాఖీ స్టైల్‌గా ఉండేది కాదు. అందుకే పారిపోయేవాణ్ణి. అంతే కానీ చెల్లి మీద ప్రేమ లేక కాదు. కానీ కొంచెం పెద్దయ్యాక రాఖీ విలువ గురించి అమ్మ చెప్పింది. అందుకే అడిగి మరీ కట్టించుకుంటున్నాను. పవిత్రకు ఎలాంటి గిఫ్ట్స్ అంటే ఇష్టం? ఆకాశ్: నేను ఏం ఇచ్చినా తీసుకుంటుంది. గిఫ్ట్స్ తీసుకోవటం అంటే తనకి చాలా ఇష్టం (నవ్వుతూ). పవిత్ర: లాస్ట్ ఇయర్ కృష్ణుడి బొమ్మ ఇచ్చాడు. అమ్మకు కృష్ణుడంటే చాలా ఇష్టం. అందుకే అన్నయ్య ఇవ్వగానే దేవుని మందిరంలో పెట్టి అమ్మకు చూపించాను. అమ్మ చాలా సంతోషించింది. నేను నైన్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు బెంగళూర్ నుండి ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆకాశ్: పవిత్రకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలనే విషయం గురించి నాకు చిన్నప్పటి నుండి ప్లాన్ ఉంది. మెల్లిగా ఒక్కోటి ఇస్తూ వస్తున్నాను. ఇక బ్యాగ్ విషయానికి వస్తే.. నేను బెంగళూర్‌లో కోచింగ్‌లో ఉన్నాను. ఆ టైమ్‌లో రాఖీ పండగ వచ్చింది. నెక్ట్స్ ఇయర్ కాలేజీకి వెళ్తుంది కదా. మంచి స్టైలిష్ బ్యాగ్ కొందామనిపించి, కొన్నాను. ఏమిచ్చినా తీసుకుంటుంది కాబట్టి మంచి చెల్లెలు అనుకోవాలి. ఈ రోజు కూడా మంచి గిఫ్ట్ ఉంది. కానీ సర్ప్రైజ్. పవిత్ర: నేను ఎవర్నీ ఏమీ అడగను. ఎవరన్నా ఇస్తే వద్దనను. నచ్చితే వాడుకుంటాను. నచ్చకపోతే పక్కన పెడతాను కానీ ఎవరినీ నొప్పించను. కానీ ఈ రోజు ఏమిస్తాడో చూడాలి. (అన్న వైపు చూస్తూ). ఆకాష్‌కి మాత్రమే రాఖీ కడతారా? బయట ‘రాఖీ బ్రదర్స్’ ఎవరైనా ఉన్నారా? పవిత్ర: రాఖీ పండగ రోజు అన్నయ్యకు రాఖీ కట్టి బ్లెస్సింగ్స్ తీసుకోవటం కంపల్సరీ. సాయంత్రం టేబుల్ మీద బోలెడన్ని స్వీట్స్, రాఖీలు ఉంటాయి. అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ దాదాపు ఐదారుగురు వచ్చి రాఖీలు కట్టించుకుంటారు. కట్టిన తర్వాత అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. మీ ఇద్దరూ పర్సల్ విషయాలు షేర్ చేసుకుంటారా? పవిత్ర: మాకసలు వ్యక్తిగత విషయాలంటూ ఉండవు. ఎందుకంటే నేను ఏం ఉన్నా మా అమ్మా నాన్నలిద్దరికీ చెప్పేస్తాను. ఆకాశ్ విషయానికి వస్తే మా అమ్మను చాటుగా గదిలోకి తీసుకెళ్లి, నేను చాలా పర్సనల్ విషయం మాట్లాడుతున్నాను నువ్వు రావద్దు అంటాడు. కానీ పది నిమిషాల తర్వాత అమ్మ అసలు విషయం చెప్పేస్తుంది. అలాంటప్పుడు ఇక పర్సనల్స్ ఏముంటాయి? మొదటి సినిమా చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలుంటాయి. ఆ టైమ్‌లో ఆకాశ్‌కి ఎలాంటి ధైర్యం ఇచ్చారు. ఆ సినిమా రిజల్ట్ మీకు తెలిసిందే. ఆ టైమ్‌లో మీరిచ్చిన సపోర్ట్? పవిత్ర: సినిమా షూటింVŠ టైమ్‌లో తనే చాలా ధైర్యం చెప్పేవాడు. షూటింగ్ ఇక్కడ జరగలేదు. చాలా దూరంలో ఉన్నాడు.. ఎలా ఉన్నాడో ఏమో అని మేం కంగారు పడేవాళ్లం. రోజూ ఏదో ఒక టైమ్‌లో ఫోన్ చేసి షూటింగ్ చాలా బాగా జరుగుతుంది, నేను హ్యాపీగానే ఉన్నానని చెప్పేవాడు. తనకు చిన్నప్పటి నుండి మూవీస్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే సినిమా చేశాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తను 100 పర్సెంట్ న్యాయం చేశాడు. రివ్యూస్ ఎలా వచ్చినా తను డల్ అవ్వటం ఉండదు. ఆకాశ్: నేను డల్‌గా ఉన్నాను అనిపిస్తే అమ్మా, చెల్లి ఆ టాపిక్ గురించి మాట్లాడరు. ఫస్ట్ ఎక్కడికైనా వెళ్దాం అని స్టార్ట్ చేస్తారు ఇద్దరూ. ఎందుకు డల్‌గా ఉన్నావ్ అని అడగరు. తర్వాత నిదానంగా నేనే ఎందుకు అలా ఉన్నాను అనే విషయం చెప్తాను. అన్నయ్యా అంటారు రాఖీ కట్టరు – పవిత్ర మీ చెల్లెలు ఇప్పుడు స్కూల్ నుండి కాలేజ్‌కి వెళుతుంది. చిన్న భయం లాంటిది ఏమైనా? ఆకాశ్: అస్సలు లేదండి. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ నా స్కూల్‌కి వచ్చేది. అమ్మను చూడగానే టీచర్ అది చేయలేదు.. ఇది చేయలేదు అని నన్ను తిట్టేది. తర్వాత అమ్మ పవిత్ర క్లాస్‌కి వెళ్లేది. టీచర్ వెంటనే పాప బాగా చదువుతుంది.. ఎంత మంచి అమ్మాయో అని చెప్పేవారు. తను చిన్నప్పటి నుండి అంతే. అందుకని తను కాలేజీకి వెళ్లినా నాకు దిగులు అనిపించింది. పైగా పవిత్రకు మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది. అందుకని చాలా రిలాక్స్‌గా ఉంటాను. మా ఇద్దరికీ మంచి లక్షణాలు ఉన్నాయంటే అవి మొత్తం అమ్మ నేర్పినవే. పవిత్ర ఎలాంటి కెరీర్లో సెటిల్ అవ్వాలనుకుంటోంది? ఆకాశ్: తనిప్పుడు బీబీఏ చదువుతోంది. చదువు అయిపోగానే ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకోవాలి అని చెప్పాను. టెన్త్ అయిపోగానే ప్రొడక్షన్లోకి వచ్చేస్తానని నాన్నకు చెప్పేసింది. అప్పటినుండి ఆయన బిజినెస్‌కి సంబందించిన బుక్స్ తెచ్చిస్తుంటారు. ప్రొడక్షన్లోకి రావాలనుకుంటున్నారు. మీ నాన్నగారు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో మీ ఇద్దరికీ తెలుసు. ఎలాంటి ఇన్పుట్స్ తీసుకుంటారు? పవిత్ర: మేం చిన్నప్పటినుండి డాడీని చూస్తూ పెరిగాం. నాకు అన్నీ తెలుసు. ఏదైనా మూవీలో లాస్ వచ్చినా ఆ నష్టం దేనివల్ల వచ్చిందో తెలుసు. కానీ నేను ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడటం టూ ఎర్లీ అవుతుంది. నా వయసు సరిపోదు. కాలేజీలో మీరు డైరెక్టర్ పూరీ డాటర్ అని అందరికీ తెలుసా? పవిత్ర: యాక్చువల్లీ నేను చాలా రిజర్వ్డ్గా ఉంటాను. అయితే అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాను. కానీ నా గురించి చాలా తక్కువమందికి తెలుసని చెప్పాలి. నా గ్యాంగ్‌లో కూడా ఓ పది, పన్నెండుమందికి తెలుసు నేను ఏంటి అని. నా ఎమోషన్స్‌ని నేను సాధ్యమైనంతవరకూ బయట పెట్టను. నా మనసుకు ఎంతో దగ్గరయిన అతి కొద్ది మందితో మాత్రమే నేను ఓపెన్ అవుతాను. డ్రగ్స్ ఇష్యూ అప్పుడు చాలా ఎమోషనల్‌గా రియాక్ట్ అయినట్లు అనిపించింది.. పవిత్ర: ఎందుకంటే మా నాన్న ఏంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన సిగరెట్ కాలుస్తారు. దాని గురించి రాయమనండి. లేని దానికి ఇలా రిచ్ హౌస్ మెయింటైన్ చేస్తున్నాడు, వేరే ఏదో హౌస్ ఉంది అని మా అమ్మను ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతుంటే ఎంత బాధగా ఉంటుంది. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏదైనా అనేయడమేనా? పాపులార్టీ కోసం ఏదైనా రాసేయడమేనా? ఎవరేం అన్నా.. అందులో నిజం ఉందా లేదా అనేది జనం చూడాలి. (కళ్లలో వస్తున్న నీళ్లను ఆపుకుంటూ) నేను సోషల్ మీడియాలో ఆ పోస్టు పెట్టిన తర్వాత ‘మీ నాన్న ఎలాంటి వాడో నీకు తెలియదు. నువ్వు మీ నాన్నని చాలా వెనకేసుకు వస్తున్నావు. ఆయనకు చాలా అలవాట్లు ఉన్నాయి, డ్రగ్స్ తీసుకుంటాడు’ అని చాలా మెసేజ్‌లు వచ్చాయి. నేను ప్రతి దానికి సమాధానం చెప్తూనే ఉన్నాను నా ఇన్‌స్టాగ్రామ్‌లో. నాకు వచ్చిన ప్రతి మెసేజ్‌కి రిప్లై చేస్తూ ఫైట్ చేశాను. ఆకాశ్: పవిత్ర నాకు అప్పటిదాకా ఒకలా తెలుసు. ఆ తర్వాతే నేను పవిత్ర ఏంటో రియలైజ్ అయ్యాను. తన కెపాసిటీ ఏంటో నాకు ఆ రోజు తెలిసింది. పవిత్రను అప్రిషియేట్ చేస్తూ, నాకు చాలా కాల్స్ వచ్చాయి. అప్పుడు నేను డాడీతోనే ఉన్నాను. ఆ టైమ్‌లో పవిత్ర డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. పవిత్రకు చాలా మంది అన్నలున్నట్లే ఆకాశ్‌కి చాలామంది చెల్లెళ్లున్నారా? ఆకాశ్: నాకు ముగ్గురు చెల్లెళ్లున్నారు. మా సాయిరామ్ బాబాయి కూతుళ్లు అనన్య, రెహన్యా ఉన్నారు. వాళ్లతో పాటు చాలా మంది నన్ను అన్నయ్య అంటారు. పవిత్ర: అన్నయ్య అంటారు కానీ రాఖీ కట్టరు.. కట్టించుకోడు (నవ్వుతూ). అన్నా, చెల్లెళ్ల మీద ఓ భారీ ఎమోషనల్ సినిమా వచ్చిందనుకుందాం. ఏం చేస్తారు? ఆకాశ్: ఏమో స్క్రిప్ట్ నచ్చితే అప్పుడు ఆలోచిద్దాం. పవిత్ర: అన్నయ్య ఏ పాత్ర ఇచ్చినా బాగా చేస్తాడు. అందులో డౌటే లేదు. పవిత్ర ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? ఆకాశ్: కాంప్లిమెంట్ అంటూ ఏం లేదు. అమ్మకి , చెల్లెలికి స్పెషల్‌గా ‘మెహబూబా’ షో వేశాం. సినిమా అయిపోగానే అమ్మ నన్ను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. చెల్లి తన ఫ్రెండ్స్ అందరితో ఫుల్ పార్టీ చేసుకుంది. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలంటే నీ డ్రీమ్ రోల్? ఆకాశ్: ఒక్కటనేం లేదు. చాలా ఉన్నాయి. జేమ్స్‌బాండ్, కౌబాయ్ ఇలా చాలెంజింగ్ పాత్రలు ఏవైనా సరే చేయాలని ఉంది. అన్ని జోనర్స్ టచ్ చేయాలనేది నా డ్రీమ్. నాన్న పెద్ద డైరెక్టర్, అన్నయ్య యాక్టర్. చూడటానికి అందంగా ఉంటానుగా ఎందుకు యాక్టింగ్ చేయకూడదు అని ఎప్పుడైనా అనిపించిందా? పవిత్ర: ఫస్ట్ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదు. ప్రొడక్షన్ అంటే చాలా ఇష్టం. ప్రొడక్షన్లో సక్సెస్ అయ్యాక అప్పటికి ఎవరైనా ఆఫర్ ఇస్తే చేస్తా. ఎందుకు చేస్తాను అంటున్నానంటే ‘మెహబూబా’ రిలీజ్ తర్వాత నాకు రెండు సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. అమ్మను దాదాపు రెండు వారాలు బతిమాలారు.. ఆ సినిమా టీమ్ వాళ్లు. అన్నయ్య గురించి బాగా ఎమోషనల్‌గా ఫీలయిన సందర్భం ఏదైనా? పవిత్ర: అన్నయ్య మొదటి సినిమా ఓపెనింగ్ కులు మనాలీలో జరిగింది. ఆ ఓపెనింగ్‌కి వెళ్లాలనుకున్నాను. కానీ నాకు కాలేజ్ ఉంది. అయినా సరే వెళ్లాలనుకుని అమ్మను అడిగాను. అక్కడ వెదర్ బాగా లేదని నాన్న వద్దన్నారు. అలా సినిమా మొదటి రోజున అన్నయ్యను మిస్సయినందకు బాధ అనిపించింది. ‘మెహబూబా’ మూవీ చేద్దామని నాన్న చెప్పగానే ఆకాశ్ ఎంత కష్టపడ్డాడో నాకే తెలుసు. ఆ సినిమా స్టార్టవ్వటానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే తను బ్యాంకాక్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని, ఇంట్లోనే డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. తన ఫ్రెండ్స్ దగ్గర వీటి గురించి డిస్కస్ చే సేవాడు. అందుకే ఫస్ట్ డే షూటింగ్లో తన ఎగై్జట్‌మెంట్ చూడాలనుకున్నాను. అది జరగనందుకు కొంచెం ఎమోషన్ అయ్యాను. ఫైనల్లీ.. మా సమక్షంలో మీ అన్నయ్యకు రాఖీ కట్టండి.. ఆకాశ్: మరి కాళ్ల మీద కూడా పడాలి. అలా ఎందుకు అడిగానంటే రాఖీ కడుతుంది కానీ కాళ్ల మీద పడదు. పవిత్ర: ఈసారి నీ ఆశ నెరవేరుతుంది అంటూ అన్నకు రాఖీ కట్టి, కాళ్ల మీద పడిన పవిత్రను తనదైన స్టైల్లో ఆకాశ్ సరదాగా ఆశీర్వదించాడు. -
తల్లిదండ్రులపై కోపంతో యువతి ఆత్మహత్య
సాక్షి, విజయవాడ: ఆవేశం, అనాలోచిత నిర్ణయాలతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. క్షణికావేశంలో యువత తీసుకుంటున్న నిర్ణయాలు తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన విజయవాడలోని సింగ్‌నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగంపల్లి నిహారిక అనే యువతి బెంగళూరులో మల్టీమీడియా పూర్తి చేసి, ప్రస్తుతం తల్లిదండ్రులతో నగరంలోనే ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు నిహారిక తల్లిదండ్రులను డబ్బులు అడిగింది. అయితే అందుకు వారు నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. నిహారిక తల్లి గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ కాగా, తండ్రి గన్నవరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హ్యాపీ వెడ్డింగ్ : సంగీత్ కంటిన్యూస్
మెగా వారసురాలు నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం హ్యాపీ వెడ్డింగ్. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు లక్ష్మణ్ కర్య దర్శకుడు. సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్, పాకెట్ సినిమా బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతమందిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీద ట్రైలర్‌ను రిలీజ్ చేయించారు. రేపు తొలి సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ‘దీంతన.. తోంతన..’ అంటూ సాగే ఓ ఫంక్షన్ సాంగ్‌ను రేపు (గురువారం) ఉదయం రిలీజ్ చేయనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
పెళ్లి కుదిరాక...
‘‘పెళ్లి కుదిరిన రోజు నుంచి పెళ్లి జరిగే వరకూ రెండు కుటుంబాల మనసుల్లో ఏం జరుగుతుందో మా సినిమాలో చూపించాం’’ అంటున్నారు ‘హ్యాపి వెడ్డింగ్’ చిత్రబృందం. సుమంత్ అశ్విన్, నిహారికా జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా నిర్మిస్తున్న చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు తమన్ రీ–రీకార్డింగ్ చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూవీ క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌తో కలసి ఈ సినిమా చేస్తున్నాం. లక్ష్మణ్ విజన్ ఉన్న దర్శకుడు. ఇప్పుడీ ప్రాజెక్ట్‌లోకి తమన్ ఎంటర్ అయ్యారు. తనదైన రీ–రికార్డింగ్‌తో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నారు. త్వరలోనే సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
బిజినెస్‌ను పండిస్తోంది
లండన్ బిజినెస్ స్కూల్లో చదివి, ఢిల్లీలో పెద్ద ఉద్యోగం చేసి.. రోటీన్ లైఫ్‌తో విసుగెత్తిపోయి, సొంత ఊరికి వెళ్లి వ్యవసాయం మొదలుపెట్టిన ఈ అమ్మాయి.. సేంద్రియ ఎరువులతో వంటింటి దినుసులను సాగు చేస్తూ లాభాల పంట పండించుకుంటోంది! నీహారిక భార్గవ పాతికేళ్ల అమ్మాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మారుమూలనున్న పహర్‌పూర్వ గ్రామం ఆమెది. భారతీయ పురాతన నగరం ఖజురహోకి 15 కి.మీ. దూరంలో ఉంటుంది పహర్‌పూర్వ. కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన వాతావరణంలో పెరిగింది నీహారిక. లండన్‌లోని కాస్ బిజినెస్ స్కూల్లో మార్కెటింగ్‌లో కోర్సు చేసింది. కొద్ది నెలలు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఆమె అదే ఉద్యోగంలో కొనసాగి ఉన్నా, అలాంటి మరొక కంపెనీకి మారి ఉద్యోగం చేస్తూ ఉన్నా.. ఆమె గురించి ఇంత మంది చెప్పుకునేవాళ్లు కాదు. ‘జీవితం అంటే ఇది కాదు’ అనిపించిందో రోజు నిహారికకు! ‘నిద్రలేచామా, ఆఫీస్కెళ్లామా, ఉద్యోగం చేసుకున్నామా, నెల ఆఖరున జీతం తీసుకున్నామా.. అనేది కాదు జీవితం. ఉద్యోగం కంటే గొప్పగా మరేదైనా చేయాలి’ అనుకుంది. ‘నేనిది చేశాను, ఇది నేను సాధించిన విజయం’ అనేటట్లు ఉండాలి అనుకుంది. ఆ అనుకోవడమే ‘ద లిటిల్ ఫార్మ్ కంపెనీ’ ఆవిర్భావానికి కారణమైంది. ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు తన మదిలో రూపుదిద్దుకున్న చిట్టి వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించడానికి.. పుట్టిన నేలను వదిలి ఎక్కడికో పరుగులు తీయాల్సిన అవసరం ఏ మాత్రం లేదనుకుంది నీహారిక. సొంతూర్లో కొంత పొలం ఉంది. ఆ పొలమే తన వ్యాపారానికి గొప్ప వనరు అనుకుంది. ఆ పొలంలో పండించిన పంటలే తన పరిశ్రమకు ముడిసరుకు అని తీర్మానించుకుంది. మనిషి పుట్టినప్పటి నుంచి పోయే వరకు ప్రతి రోజూ తప్పకుండా చేసే పని మూడు పూటలా తినడమే. ఏ పని చేసినా చేయకపోయినా వంట గదిలో స్టవ్ వెలగక తప్పదు. అందుకే నేరుగా వినియోగదారుల ఇంటి డైనింగ్ టేబుల్ మీదకు వెళ్ల గలిగితే ఇక ఆ వ్యాపారానికి తిరుగుండదనుకుంది. పంట.. వంట ద లిటిల్ ఫార్మ్ కంపెనీ ఉత్పత్తులకు ముడి సరుకును నీహారిక తమ పొలంలోనే సహజ పద్ధతుల్లో పండిస్తోంది. ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నమాట. పచ్చళ్ల కోసం పండించే కూరగాయలు, పండ్లు మాత్రమే కాదు.. వాటిలో వాడే ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, అల్లం, పచ్చిమిర్చి వంటివన్నీ తన పొలంలోనే పండిస్తోంది. సోడియం తక్కువగా ఉండే ఉప్పు, సల్ఫర్ వేయని బెల్లం తయారవుతోంది. వాటితో పచ్చళ్లు, జామ్‌లు, మార్మలేడ్లు (జామ్‌లు) తయారు చేస్తోంది. చెరకు రసం మాత్రం బయటి రైతుల నుంచి తీసుకుంటోందామె. ఆమె కంపెనీకి ఆర్గానిక్ ఫుడ్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. నీహారిక దగ్గర పదిహేను మంది మహిళలు, ముగ్గురు మగవాళ్లు పని చేస్తున్నారు. పొలంలో కాయలను కోసిన తర్వాత వెంటనే నీటితో శుభ్రం చేయడం, ఎండలో ఆరబెట్టడం, ముక్కలు తరగడం జరిగిపోతాయి. పండ్లు, కాయలను కోసిన తరవాత రెండు గంటల్లో పచ్చడి, జామ్‌ల ప్రాసెస్‌లోకి వెళ్లిపోతాయి. ఆరబెట్టడానికి మెషీన్లలో వేడి చేయరు, ఎండకు ఆరాల్సిందే. పొడుల కోసం గ్రైండర్ తప్ప మరే యంత్రమూ ఉండదు ఆ యూనిట్లో. ‘మా ఉత్పత్తులను ఒకసారి రుచి చూసిన వాళ్లు మరోసారి మా ప్రొడక్ట్స్ కావాలని అడిగేటట్లు నాణ్యత పాటించటమే మా బిజినెస్ ఫిలాసఫీ’ అంటుందామె. నీహారిక యూనిట్ స్థాపించిన పహర్‌పూర్వ మధ్యప్రదేశ్‌లో బాగా వెనుకబడిన ప్రాంతం. అక్కడ మరే పరిశ్రమా లేదు. దాంతో కాలుష్యమూ లేదు. నీహారిక పరిశ్రమ స్థానికంగా ఉపాధి కల్పనకు పెద్ద అవకాశంగా మారింది. ప్రభుత్వం అడవికి సమీపంలో ఉన్న నాలుగు వందల ఎకరాలను లిటిల్ ఫార్మ్‌కి లీజుకిచ్చింది. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం, ఆ పంటతో సహజమైన పద్ధతుల్లో వంట చేయడం నీహారిక ప్రాజెక్ట్ ఉద్దేశం. ఇప్పుడామె విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో యూనిట్ విస్తరణలో నిమగ్నమైంది. రెండేళ్లలోనే లాభాలు ‘గృహిణి ఇంట్లో వంట చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ వంటను తినేది ఇంట్లో వాళ్లు, ఇంటికొచ్చిన బంధువులు, స్నేహితులే అయి ఉంటారు. అందుకే గృహిణి వంటను అంత జాగ్రత్తగా చేస్తుంది. మన ఆహారోత్పత్తులను తినే వాళ్లు కూడా మనకు బంధువులు, స్నేహితులే. ఆ బంధువులతో బాంధవ్యాన్ని ఎల్లకాలం కొనసాగేటట్లు ఉండాలి మన ఆతిథ్యం. మన అతిథులు మన వినియోగదారులే’ అని చెప్తుంది నీహారిక తన ఉద్యోగులతో. అంత అంకితభావంతో చేయడం వల్లనే రెండేళ్లు కూడా నిండని కంపెనీ బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాట పట్టింది. – మంజీర -
సైరాకి సై
డాడీ... పెదనాన్న చిరంజీవిని నిహారిక అలానే పిలుస్తారు. మెగా బ్రదర్ తనయ నిహారిక తన పెదనాన్నకు అంత క్లోజ్. చిన్నప్పటి నుంచి ఆయన నటన చూస్తూ పెరిగిన నిహారిక ఇప్పుడు ఏకంగా పెదనాన్న సినిమాలో నటించే అవకాశం కొట్టేశారని టాక్. ముందే వెబ్ సిరీస్ ‘ముద్దపప్పు ఆవకాయ్ ’తో నటి అయ్యి, ‘ఒక మనసు’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చారు నిహారిక. ఆ సినిమాలో మంచి నటనతో అందరి మనసులు గెలుచుకున్నారు. ఈ సినిమా రిలీజయ్యాక అటు కోలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. ‘ఒరు నల్ల నాళ్ పార్తు సొల్రేన్’ అనే తమిళ సినిమాలో యాక్ట్ చేశారు. ఇప్పుడు ‘సైరా’కి సై అన్నారట. ఇందులో ఓ మంచి రోల్ కొట్టేశారని టాక్. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సురేఖ సమర్పణలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న సినిమా ‘సైరా’. ఇందులో నయనతార కథానాయిక. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్‌సేతుపతి నటిస్తున్న ఈ సినిమాలో నిహారిక నటిస్తే ఆమెకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఖాయం. -
నిహారికకు రజతం
రోహ్తక్: జాతీయ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి గోనెళ్ల నిహారిక రజత పతకం సాధించింది. జూనియర్ ప్రపంచ చాంపియన్ అయిన నిహారిక ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. 69–75 కేజీల వెయిట్ కేటగిరీలో శుక్రవారం జరిగిన మహిళల పసిడి పతక పోరులో నిహారిక (తెలంగాణ) 0–5తో ఆస్థా పహ్వా (ఉత్తరప్రదేశ్) చేతిలో ఓడిపోయింది. 45–48 కేజీల వెయిట్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జి. రమ్యకు కూడా రెండో స్థానం దక్కింది. ఫైనల్లో నీతు (హరియాణా) 5–0తో రమ్య (ఏపీ)పై గెలిచింది. పురుషుల 46–49 కేజీల వెయిట్ కేటగిరీ ఫైనల్లో ఆర్. సాయి కుమార్ (ఏపీ) రజతాన్ని గెలుచుకున్నాడు. -
ఈ బేటీ... అన్నింట్లో మేటి!
ఇష్టంతో నేర్చుకున్నా... నాకు వ్యవసాయ పనులంటే ఎంతో ఇష్టం. అమ్మనాన్నలతో చేలోకి వెళ్లి పనులు నేర్చుకున్నా. ట్రాక్టర్ నడపాలని ఉన్నప్పటికీ మొదట్లో భయపడ్డా. కానీ ఓ సారి ట్రాక్టర్ స్టార్ట్ చేసి నడిపాను. భయం పోయింది. అప్పటి నుంచి ట్రాక్టర్‌తో అన్ని పనులు చేయడం నేర్చుకున్నా. సరదాగా నేర్చుకున్న పనితో నాన్నకు సాయపడుతున్నా. నీహారికది జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండలం, శంకరాంపల్లి. కాలేజిలో చదువుకునే అమ్మాయిలంటే పుస్తకాలే ప్రపంచంగా, మోడరన్‌గా జీవించాలనుకుంటారు. నిహారిక ఖాళీ దొరికినప్పుడల్లా అరక కట్టడం, ఎడ్లబండి తోలడం మొదలు.. ట్రాక్టర్, ఆటో, బైక్ నడుపుతుంది. నిహారిక కుటుంబ నేపథ్యం... చిగురు పెంటయ్య–సునీత దంపతులకు ముగ్గురు కూతుళ్లు. ఒక కొడుకు. మూడో కుమార్తె నిహారిక వరంగల్లులో డిగ్రీ ప్రథమ సంవత్సరం. ఆరు ఎకరాల మేర భూమి సాగుచేస్తూ సంతానాన్ని చదివిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. నాన్నతోపాటు నాగలి పట్టింది నిహారిక అమ్మనాన్నలతో పొలం వద్దకు వెళ్తుండేది. ఎనిమిదో తరగతిలో ఉండగా.. నాన్నతో కలిసి నాగలి దున్నడం నేర్చుకుంది. కూలీలతో కలిసి పొలానికి వెళ్లి దున్నడంలాంటి పనులు చేస్తుండేది. దీంతో గొర్రు కొట్టడం, విత్తనాలు నాటడం, స్పేయ్రర్తో మందు పిచికారీ చేయడం, ఎరువులు వేయడంలాంటి పనులు కూడా నేర్చుకుంది. పెద్దనాన్న చంద్రయ్య బైక్‌తో డ్రైవింగ్ నేర్చుకుంది. ఇంతలో పెంటయ్య ట్రాక్టర్ కొన్నాడు. తండ్రితో కలిసి అప్పుడప్పుడు ట్రాక్టర్ మీద వెళ్లిన నిహారిక దానిని ఎలా నడపాడో తెలుసుకుంది. కొద్దిరోజుల్లోనే ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. దున్నడం, లెవలింగ్, గొర్రు కొట్టడం, పంట పొలాల్లో కేజీవీల్స్ వేయడం లాంటి ట్రాక్టర్‌కి సంబంధించిన ప్రతి పనిని నేర్చేసుకుంది. గత నాలుగేళ్లుగా ట్రాక్టర్‌తో చేయాల్సిన పనులన్నింటిలో నిష్ణాతురాలైంది. పెంటయ్యకు కొడుకు ఉన్నప్పటికీ, అతడు చిన్నవాడు. దాంతో నిహారిక ఇంటికి పెద్ద కొడుకులా అన్ని పనులు చేస్తోంది. చదువులో... ఆటలోనూ... మేటి! నిహారిక ఇంటిపనులు, వ్యవసాయ పనులకే పరిమితం కాలేదు. చదువు, ఆటల్లోను రాణిస్తుంది. టెన్త్ క్లాస్‌లో ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. ఇంటర్ సీఈసీ పూర్తి చేసి, ప్రస్తుతం వరంగల్‌లో డిగ్రీ చదువు తోంది. ఇంటి వద్ద ఎన్ని పనులు చేసినప్పటికీ చదువులో ఏ మాత్రం వెనుకంజవేయడం లేదు. నిహారిక ఆటల్లోనూ రాణిస్తోంది. అథ్లెటిక్స్‌లో మండల, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభతో బహుమతులు పొందింది. గత ఏడాది అక్టోబర్‌లో రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో రన్నింగ్ విభాగంలో 400 మీటర్లలో గోల్డ్ మెడల్, 800 మీటర్లలో సిల్వర్ మెడల్ సాధించింది. – చీర్ల శ్రావణ్‌రెడ్డి, కాటారం, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఆసక్తి చూసి కాదనలేకపోయా... అమ్మాయి కదా తనకు ఈ పనులు నేర్పించడం ఎందుకని మొదట్లో అందరిలాగే నేనూ అనుకున్నా. సెలవు వస్తే చాలు నాతో పొలానికి వచ్చేది. తను ట్రాక్టర్ నడపడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి కూతురు ఉండటం ఆనందంగా ఉంది. – చిగురు పెంటయ్య, నిహారిక తండ్రి -
సాక్షి సలాం..!
-
'నిహారికతో పెళ్లా.. ఆ అమ్మాయినే చేసుకుంటా'
సినీ పరిశ్రమలో రూమర్లకు కొదవలేదు. రోజుకో వార్త తెలుగు సినీపరిశ్రమలో హల్చల్ చేస్తుంది. అందులో అగ్రహీరోల ఇళ్లలోని వార్తలు అంటే ఇక అంతే. గత కొంతకాలంగా టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తున్న వార్త మెగా బ్రదర్, జబర్థస్త్ కామెడీ షో ఫేం నాగబాబు కుమార్తె నిహారికా పెళ్లిగురించే. గతంలో రెండుసార్లు నిహారిక పెళ్లి టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. మొదట నిహారిక బావ సాయి ధరమ్‌తేజ్‌ను పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు హల్చల్ చేశాయి. కొద్ది రోజులకు అది వాస్తవం కాదని తేలినా, మరికొద్దిరోజుల కిందట బాహుబలి ప్రభాస్‌తో నిహారిక పెళ్లి అంటూ మరో వార్త వినిపించింది. దీనిపై స్పందించిన రెండుకుటుంబాలు అటువంటిది ఏమీలేదని కొట్టిపడేశాయి. ఇప్పుడు తాజగా మరో వార్త వైరల్ అయింది. అతి త్వరలో యువ హీరో నాగ శౌర్యతో నిహారిక వివాహమని, ఇరు కుటుంబ సభ్యుల నడుమ చర్చలు నడుస్తున్నాయని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, నాగ శౌర్య నటించిన చిత్రం ‘ఛలో’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య ఆతిథిగా హాజరయ్యారు. దీంతో ఈవార్తలు మరింత జోరందుకున్నాయి. అయితే వీటన్నింటిపై స్పందించిన నాగశౌర్య, నిహారికతో తన పెళ్లి అంటూ వచ్చిన వార్తలను ఖండించారు. తన స్నేహితుల ద్వారా తాను ఈవార్త విన్నానని , వాటిలో ఏమాత్రం నిజం లేదని మరో మూడు లేదా నాలుగేళ్లు వరకూ తనకు పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని కేరీర్ మీద శ్రద్దపెట్టానని తెలిపాడు. పెళ్లి విషయానికి వస్తే కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని వివరణ ఇచ్చారు. -
ఆమె నాకెప్పుడూ స్పెషలే!
తమిళసినిమా: నటి గాయత్రి తనకెప్పుడూ స్పెషలే అని అన్నారు నటుడు విజయ్‌సేతుపతి. వీరిద్దరూ కలిసి నడువుల కొంచెం పక్కత్తు కానోమ్ చిత్రంలో నటించారు. ఆ తరువాత ఒకటి రెండు చిత్రాల్లో నటించడంతో విజయ్‌సేతుపతి నటి గాయత్రికి సిఫారసు చేస్తున్నారనే ప్రచారం జరిగింది. చిన్న గ్యాప్ తరువాత తాజాగా ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ చిత్రంలో కలిసి నటించారు. నటుడు గౌతమ్‌కార్తీక్, తెలుగు నటి ( నాగబాబు కూతురు) నిహారిక కూడా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా ఆర్ముగకుమార్ సొంతంగా నిర్మించి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి రెండవ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశాన్ని స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర హీరోల్లో ఒకరైన విజయ్‌సేతుపతి మాట్లాడుతూ ఆర్ముగకుమార్ తనకు చాలా కాలంగా తెలుసన్నారు. వర్ణం చిత్రంలో తాను నటించడానికి కారణం ఈయనేనని చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా ప్లాన్‌గా అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కించారని తెలిపారు. చిత్రం ఆద్యంతం వినోదాన్ని అందించే విధంగా ఉంటుందని తెలిపారు. ఇందులో మరో హీరోగా నటించిన గౌతమ్‌కార్తీక్ తన ప్రతిభపై నమ్మకంతోనే కష్టపడి నటిస్తున్నారని అన్నారు. ఎలాంటి ఇగో లేని నటుడని పేర్కొన్నారు. ఇక నటి గాయత్రి తనకెప్పుడూ స్పెషలేనని అన్నారు. మంచి ప్రతిభ, తెలివి ఉన్న నటి అని పేర్కొన్నారు. అలాంటి వారికి సక్సెస్ ఆలస్యంగా వస్తుందనుకుంటా. ఈ ఏడాది గాయత్రికి బాగుంటుందని భావిస్తున్నానన్నారు. అందరూ సహకరించారు కాగా ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న నటి నిహారిక మాట్లాడుతూ విజయ్‌సేతుపతి, గౌతమ్‌కార్తీక్ వంటి సక్సెస్ఫుల్ హీరోలతో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. తనకు తమిళ భాష తెలియకపోయినా, దర్శకుడు, హీరోలిద్దరూ ఎంతగానో సహకరించారని చెప్పారు. దీంతో కొత్తనటిననే ఫీలింగే కలగలేదని అన్నారు. -
మలేషియా స్టార్ నైట్‌లో ఆడియో రిలీజ్
సినీరంగంలో వారసులుగా అమ్మాయిలు రావటం చాలా అరుదు. గతంలో కృష్ణ వారసురాలిగా మంజుల వెండితెరకు పరిచయం అయ్యే ప్రయత్నం చేసినా అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేఖత రావటంతో విరమించుకున్నారు. మెగా డాటర్ నిహారిక విషయంలోనే ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే ఫ్యామిలీ సపోర్ట్ తో నిహారిక హీరోయిన్ గా పరిచయం అయ్యింది. యాంకర్ గా బుల్లితెర మీద సత్తా చాటి ఒక్క మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో నటిగా మంచి మార్కులు సాధించినా.. కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. ప్రస్తుతం తన రెండో సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, యంగ్ హీరో గౌతమ్ కార్తీక్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ‘ఒరు నల్ల నాల్ పాతు సోల్రేం’ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఆడియోను మలేషియాలో నడిగర్ సంఘం నిర్వహిస్తున్న స్టార్ నైట్ లో రిలీజ్ చేయనున్నారు. -
‘పంచ్’ పడకముందే రెండు పతకాలు
గువాహటి: ఆతిథ్య భారత్‌కు ప్రపంచ మహిళల యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పోటీలు ప్రారంభంకాకముందే రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఆదివారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన ‘డ్రా’ను శనివారం తీశారు. ప్లస్ 81 కేజీల విభాగంలో నేహా యాదవ్... 81 కేజీల విభాగంలో అనుపమలకు నేరుగా సెమీఫైనల్లోకి ‘బై’ లభించింది. దాంతో వీరిద్దరికి కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి. మరోవైపు 75 కేజీల విభాగంలో తెలుగమ్మాయి గోనెళ్ల నిహారికకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. క్వార్టర్ ఫైనల్లో నిహారిక ప్రత్యర్థిగా జార్జియా ఒకానర్ (ఇంగ్లండ్) లేదా యు జియటెంగ్ (చైనా) ఉండే అవకాశముంది. భారత్‌కే చెందిన జ్యోతి (51 కేజీలు), నీతూ (48 కేజీలు)లకు కూడా తొలి రౌండ్లో ‘బై’ లభించింది. -
మెగా డాటర్ ‘నాన్నకూచి’
సక్సెస్ఫుల్ వెబ్ సీరీస్ ముద్దపప్పు ఆవకాయతో నటిగా పరిచయం అయిన మెగా డాటర్ నిహారిక, తరువాత యాంకర్, హీరోయిన్గా ప్రూవ్ చేసుకుంది. అయితే డిజిటల్ మీడియాలో ఘనవిజయం సాదించిన, నిహారిక వెండితెర మీద మాత్రం సక్సెస్ సాదించలేకపోయింది. దీంతో మరోసారి వెబ్ సీరీస్ లో అలరించేందుకు రెడీ అవుతోంది. తండ్రి నాగబాబుతో కలిసి ‘నాన్న కూచి’ అనే ఫీచర ఫిలిం చేస్తోంది నిహారిక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఫిలిం టీజర్‌ను అక్టోబర్ 29 ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ద్వారా ఎనౌన్స్ చేశారు. ఈ ఫిలింలో నాగబాబు, నిహారికలు తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు. Trailer of #Nannakoochi series is out on Oct 29th @ 11am! The cutest father daughter duo! Stay tuned..😁😁😁 pic.twitter.com/x1LKJ3Hae9 — Varun Tej (@IAmVarunTej) 28 October 2017 -
మెగా డాటర్ 'హ్యాపీ వెడ్డింగ్'
స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన భామ నిహారిక. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ భామ ముందు యాంకర్ గా బుల్లితెర మీద సత్తా చాటి.. తరువాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ పరిచయం అయ్యింది. అయితే తొలి సినిమా నిరాశపరచటంలో లాంగ్ గ్యాప్ తీసుకున్న నిహారిక తన రెండో సినిమా ను గత జూన్ లో ప్రారంభించింది. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించనుంది. సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కుతున్న హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో నిహారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సమర్పణలో పాకెట్ సినిమా సంస్థ నిర్మిస్తోంది. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. -
క్వార్టర్స్‌లో బాక్సర్ నిహారిక
ఇస్తాంబుల్ (టర్కీ): అహ్మద్ కామెర్ట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి గోనెళ్ల నిహారిక శుభారంభం చేసింది. బుధవారం జరిగిన జూనియర్ మహిళల 75 కేజీల విభాగం తొలి రౌండ్లో లౌరా మమెద్కులియెవా (రష్యా)పై నిహారిక గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 57 కేజీల విభాగంలో ఓల్గా వాజ్నియాక్ (ఉక్రెయిన్)పై శశి చోప్రా నెగ్గగా... 51 కేజీల విభాగంలో జాన్సాయా అబోరైమోవా (కజకిస్తాన్) చేతిలో దీపా కుమారి ఓడిపోయింది. టర్కీ బాక్సింగ్ సమాఖ్య ఆధ్వరంలో ప్రతి ఏడాదీ జరిగే ఈ టోర్నీలో వివిధ దేశాల అగ్రశ్రేణి బాక్సర్లు పాల్గొంటారు. ఈసారి ఆతిథ్య టర్కీతోపాటు భారత్, రష్యా, కజకిస్తాన్, టర్కీ, మంగోలియా, థాయ్‌లాండ్, ఉక్రెయిన్, తజికిస్తాన్, అర్మేనియా, బల్గేరియా, ఆస్ట్రేలియాల నుంచి 90 మంది మహిళా బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
జీవనాధారం కోసం చెన్నై వస్తే..
తమిళసినిమా: గ్రామాల నుంచి రకరకాల కారణాలతో ప్రజలు చెన్నై వస్తుంటారు. అందులో చాలావరకు జీవనాధారం వెతుక్కుంటూ వచ్చే వారే అధికం. అలా పల్లెటూరు నుంచి వచ్చిన ముగ్గురు యువకులు బతువుదెరువు కోసం చెన్నై వచ్చి డబ్బు కోసం ఎలాంటి పనికైనా సిద్ధపడే ఒక ముఠా చేతుల్లో చిక్కుకుంటారు. ఆ ముఠా అసలు రూపం తెలిసిన తరువాత ఈ ముగ్గురు ఏం చేశారన్నదే ఉన్నాల్ ఎన్నాల్ చిత్రం అని ఆ చిత్ర దర్శకుడు ఏఆర్.జయకృష్ణ పేర్కొన్నారు. శ్రీశ్రీ గణేశ్ క్రియేషన్ పతాకంపై రాజేంద్రన్సుబ్బయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఏఆర్.జయకృష్ణ, జగా, ఉమేశ్ కథానాయకులుగా నటిస్తున్నారు. వారికి జంటగా లుబ్నా, నిహారిక, సహానా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో రాజేశ్, రామచంద్రన్, రవిమరియ, ఢిల్లీ గణేశ్, ఆర్.సుందరరాజన్, నెల్లైశివ తదితరులు నటిస్తున్నారు. కాగా ఒక కీలక పాత్రలో నటి సోనియాఅగర్వాల్ నటిస్తున్నారు. మహ్మద్ రిశ్వాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యుల్ షూటింగ్ జరుపుకుంటోందని దర్శకుడు వెల్లడించారు. -
వాళ్లను ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి
చెన్నై: ఈ తరం నటీనటులు కొత్తదనం కోసం ఆరాట పడుతున్నారనిపిస్తోంది. చాలా ఏళ్ల క్రితం నడిగర్ తిలగం శివాజీగణేశన్ నవరాత్రి చిత్రంలో తొమ్మిది పాత్రల్లో నటించి చరిత్ర సృష్టించారు. ఆ తరువాత విశ్వనటుడు కమల్‌హాసన్ దశావతారం చిత్రంలో పది పాత్రలు పోషించి ఆ రికార్డును బద్దలు కొట్టారు. తాజాగా వారి బాటలో నటుడు విజయ్ సేతుపతి పయనించడానికి సాహసిస్తున్నారు. ఆయన 8 గెటప్‌లలో నటిస్తున్న చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. వరుస విజయాలను అందుకుంటున్న విజయ్ సేతుపతి తాజాగా నటిస్తున్న చిత్రాలలో ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్లు ఒకటి. ఇందులో ఆయనతోపాటు యువ నటుడు గౌతమ్ కార్తీక్ నటిస్తున్నారు. నాయకిగా టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక నటిస్తున్నారు. నవ దర్శకుడు ఆర్ముగ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ట్రైబల్ నాయకుడిగా నటిస్తున్నారట. ఆయన నగరానికి రావడంతో జరిగే సంఘటనలే చిత్ర కథ. అయితే చిత్రం రెండవ భాగం అంతా అడవుల్లోనే జరుగుతుందని, షూటింగ్ చివరి దశకు చేరుకుందని దర్శకుడు తెలిపారు. -
కొత్త కథ... కొత్త క్యారెక్టర్
‘ఒక మనసు’ చిత్రంతో తనలో మంచి నటి ఉందని నిరూపించు కున్నారు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారిక. ఆమె లీడ్ రోల్లో నటిస్తోన్న రెండో చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. రవిదుర్గా ప్రసాద్ దర్శకత్వంలో ఎం.ఆర్. ఎంటర్ టైన్మెంట్స్–కవిత కంబైన్స్ పతాకాలపై మరిసెట్టి రాఘవయ్య, బండారు బాబీ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మారుతి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో శ్రీకాంత్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మెహర్ రమేష్, నాగబాబు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఈశ్వర్ రెడ్డి, మెహర్ రమేష్, ప్రభుదేవా, రాహుల్ బోస్ వంటి ప్రతిభావంతుల వద్ద దర్శకత్వ శాఖలో చేసిన రవి దుర్గాని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. సరికొత్త కథాంశంతో సినిమా ఉంటుంది. నీహారిక పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ కీలక పాత్రలో నటిస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మధు పొన్నాస్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నండూరి రాము. -
నిహారిక రెండో సినిమా మొదలైంది..!
'ఒక మనసు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన మెగా వారసురాలు నిహారిక కొణిదల. నిహారిక తెరంగేట్రంపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. అయితే అభిమానుల నుంచి వ్యతిరేకత వచ్చినా మెగా హీరోలు మాత్రం నిహారికకు అండగా నిలిచారు. కానీ నిహారిక తొలి ప్రయత్నం విఫలమైంది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ మెగా బ్యూటీ తన రెండో సినిమాను స్టార్ట్ చేసింది. ఇన్నాళ్లు మంచి కథ కోసం వెయిట్ చేసిన నిహారిక, రవి దుర్గా ప్రసాద్ చెప్పిన కథ నచ్చడంతో సినిమాను స్టార్ట్ చేసింది. ఈ సినిమాతో దుర్గా ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ రోజు(శుక్రవారం) ఉదయం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టడంతో షూటింగ్ మొదలైంది. రాఘవయ్య, బాబీ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నిహారికను చెల్లెలిగా భావిస్తా: సాయిధరమ్
హైదరాబాద్: వరుసకు మరదలైన నటుడు నాగబాబు కుమార్తె నిహారికతో తనకు త్వరలో వివాహం జరగనుందని వచ్చిన వార్తలను హీరో సాయిధరమ్ తేజ్ ఖండించారు. నిహారికను తాను చెల్లెలిగా భావిస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ప్రతినిధితో ఓ ప్రకటన విడుదల చేశారు. నిహారికను పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు తనను బాధించాయని తెలిపారు. చిన్నతనం నుంచి ఒకే కుటుంబలో కలిసిమెలిసి పెరిగామని ఒకరినొకరం అన్నాచెల్లెళ్లుగా భావిస్తామని వివరించారు. ఒక అమ్మాయికి సంబంధించిన సున్నితమైన వార్తలను ఇచ్చే ముందు ధ్రువీకరించుకోవాలని కోరారు. ఆధారం లేని వార్తలు ఎదుటివారి మనో భావాలను దెబ్బతీస్తాయని చెప్పారు. -
సోషల్ మీడియాలో ‘మెగా’ పెళ్లి వార్త వైరల్
మెగాస్టార్ ఫ్యామిలీకి చెందిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నాగబాబు కుమార్తె నిహారిక, హీరో సాయి ధరమ్ తేజ్‌లకు త్వరలో వివాహం జరగనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వార్తపై ఇప్పుడు యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాగా చిరంజీవి సోదరి విజయదుర్గ కుమారుడే ధరమ్ తేజ్. బావా మరదళ్లు అయిన సాయి ధరమ్ తేజ్, నిహారిక పరస్పరం ఇష్టపడుతున్నారని, దాంతో ఈ పెళ్లికి కుటుంబసభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా నిహారిక హీరోయిన్గా ధరమ్ తేజ్ నిర్మాణ సారధ్యంలో ఓ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నాడట. కాగా నిహారిక, సాయి ధరమ్ తేజ్ చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగారని, అంతేతప్ప, వారిద్దరి మధ్య సహజంగానే ఇంటిమసీ అనేది ఉంటుందని, పెళ్లివార్త ఊకార్లే అని కొందరు వాదిస్తుండగా, మరోవైపు ’మెగా’ ఫ్యాన్స్ మాత్రం కన్ఫ్యూజింగ్లో ఉన్నారు. అయితే దీనిపై మెగాస్టార్ ఫ్యామిలీ క్లారిటీ ఇస్తే తప్ప, అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది. కాగా బుల్లితెర యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన నిహారిక.. రామరాజు దర్శకత్వంలో 'ఒక మనసు' అనే చిత్రం ద్వారా హీరోయిన్గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. కొంత గ్యాప్ ఇచ్చిన ఆమె .. మరాఠిలో విజయం సాధించిన హ్యాపీజర్నీ అనే సినిమాను తెలుగు రీమేక్ చేయడానికి రెడీ అవుతోంది. అన్న చెల్లెల్ల మధ్య జరిగే కథగా తెరకెకెక్కనున్న ఈ సినిమాలో.. నిహారిక దెయ్యంగా నటించనుంది. అలాగే ఓ తమిళ చిత్రంలో నిహారిక నటించనున్నట్లు తెలుస్తోంది. -
విజయ్ సేతుపతితో మెగా డాటర్
యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన తరువాత హీరోయిన్ గానూ అదృష్టాన్ని పరీక్షించుకున్న మెగా వారసురాలు నిహారిక. మెగా అభిమానులకు షాక్ ఇస్తూ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక, తొలి సినిమా ఒక్క మనసుతో నటిగా గుర్తింపు తెచ్చుకున్నా సక్సెస్ మాత్రం సాధించలేకపోయింది. దీంతో తన రెండో సినిమా ఎంపికకు చాలా సమయం తీసుకుంది. టాలీవుడ్లో హీరోయిన్గా నటించేందుకు మెగా అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన మెగా డాటర్ కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. కోలీవుడ్‌లో మంచి విజయాలు సాధిస్తున్న విజయ్ సేతుపతి సరసన నిహారిక హీరోయిన్గా నటించనుంది. అరుముగ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కడలి ఫేం గౌతమ్ కార్తీక్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు 'నాన్నకూచి' అనే వెబ్ సీరీస్‌లో తండ్రి నాగబాబుతో కలిసి నటిస్తోంది నిహారిక. మరి కోలీవుడ్‌లో అయిన నిహారికకు, హీరోయిన్గా సక్సెస్ వస్తుందేమో చూడాలి. -
నిహారిక... డాటరాఫ్ నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికకి నాన్నంటే విపరీతమైన ప్రేమ. తండ్రిని ఎవరైనా ఓ మాట అంటే అస్సలు భరించలేరట! రియల్ లైఫ్‌లో ఈ తండ్రీకూతుళ్ల గురించి బాగా తెలిసినవాళ్లు ఇలా అంటుంటారు. రేపు ‘నాన్న కూచి’ చూసిన తర్వాత ప్రేక్షకులకి కూడా తెలుస్తుం దంటున్నారు నిహారిక. రీల్ లైఫ్‌లోనూ నాగబాబు డాటర్‌గా నిహారిక నటిస్తున్న సినిమా ‘నాన్న కూచి’. నిహారిక ముఖ్యతారగా నటించిన ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్ సిరీస్ తీసిన ప్రణీత్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. నిహారిక మాట్లాడుతూ – ‘‘నాన్నతో నటించడానికి భయపడలేదు. హీ ఈజ్ వెరీ కూల్. ఇంట్లో మేం ఎలా ఉంటామో.. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రల్లోనే నటిస్తున్నాం. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... చాలామంది వెబ్ సిరీస్ అనుకున్నారు. కానీ, ఇది ఫీచర్ ఫిల్మ్’’ అన్నారు. అన్నట్టు... ఈ సినిమాకి నిర్మాత ఎవరో కాదు, నిహారికే. వెండితెరపై తొలి చిత్రం ‘ఒక మనసు’ తర్వాత ఆమె నటిస్తున్న రెండో సిన్మా ఇది. -
నాన్నకు అన్నకు ప్రేమతో
-
‘చిరు’ వేడుకలో నిహారిక
నాచారం: నాచారంలోని సాధన మానసిక వికలాంగుల పాఠశాలలో ఆదివారం మెగాస్టార్ పుట్టినరోజును వేడుకగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నాగబాబు తనయ నిహారిక, హాస్యనటుడు వేణుమాధవ్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు ఎం.సందీప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిహారిక కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం, వృద్ధాశ్రమంలో పండ్లు పంచారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. తమ పెదనాన్న పుట్టిన రోజును ఇంతమంది మధ్య నిర్వహించడం ఆనందంగా ఉందని నిహారిక పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జీ బండారి లకా్ష్మరెడ్డి, బస్వరాజ్ శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి సాయిజెన్ శేఖర్, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. -
సందడిగా చిరు పుట్టినరోజు
-వేడుకలకు హాజరైన హీరోయిన్ నిహారిక, వేణుమాధవ్ నాచారం తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు ఎం.సందీప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నాచారంలోని సాధన మానసిక వికలాంగుల పాఠశాలలో మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగబాబు కూతురు, హీరోయిన్ నిహారిక, ప్రముఖ హాస్యనటుడు వేణుమాదవ్, కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జీ బండారి లకా్ష్మరెడ్డి, బస్వరాజ్ శ్రీనివాస్ హాజరయ్యారు. మానసిక వికలాంగులైన విద్యార్థుల మధ్య హీరోయిన్ నిహారిక కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అనంతరం విద్యార్థులకు అన్నదానం చేశారు. సాధన వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల అవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ... పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను మానసిక వికలాంగుల మద్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు అన్నదానం, పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమన్నారు. సాధన మానసిక వికలాంగుల పాఠశాలను నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని నిహారిక అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి సాయిజెన్ శేఖర్, రాజేష్ గౌడ్, చిరంజీవి అభిమానులు జాఫర్, శ్రీనివాస్‌గౌడ్, సాయి, నిఖిల్, శివ, వెంకటేష్, రవి, మధు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
దెయ్యం పాత్రలో మెగా వారసురాలు
మెగా వారసురాలిగా భారీ అంచనాల మధ్య టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్ నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా, పలు టివి షోస్‌కు వ్యాఖ్యతగా సుపరిచితురాలైన నిహారిక సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈ స్టార్ వారసురాలు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన 'ఒక్క మనసు' నిరాశపరచటంతో ఇక నిహారిక నటిగా కంటిన్యూ అవుతుందా.. లేదా..? అన్న టాక్ కూడా వినిపించింది. అలాంటి అనుమానాలకు ఫుల్స్టాప్ పెడుతూ త్వరలోనే తన రెండో సినిమాను పట్టాలెక్కించడానికి నిహారిక రెడీ అవుతుందట. మరాఠిలో విజయం సాధించిన హ్యాపీజర్నీ అనే సినిమాను తెలుగు రీమేక్ చేయడానికి రెడీ అవుతోంది. అన్న చెల్లెల్ల మధ్య జరిగే కథగా తెరకెకెక్కనున్న ఈ సినిమాలో.. నిహారిక దెయ్యంగా నటించనుంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
ఒక మనసు తరువాత చీకటి ప్రేమకథ..?
ఇప్పటి వరకు మనసుకు హత్తుకునే అందమైన ప్రేమకథలను అందించిన దర్శకుడు రామరాజు ఇప్పుడు రూటు మారుస్తున్నాడు. ఇటీవల మెగా వారసురాలు నిహారికను హీరోయిన్గా పరిచయం చేస్తూ ఒక మనసు సినిమా తెరకెక్కించిన రామరాజు, తన నెక్ట్స్ సినిమాను మాత్రం ఓ మాస్ మాసాలా ఎంటర్టైనర్గా మలిచే ఆలోచనలో ఉన్నాడట. వరుసగా మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు, ఒక మనసు లాంటి ఆర్టిస్టిక్ సినిమాలను అందించిన రామరాజు తన నెక్ట్స్ సినిమా కోసం మాస్ ప్రేమ కథను రెడీ చేశాడు. ఒక మనసు సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన మధుర శ్రీధర్ రెడ్డి ఈ సినిమాను కూడా నిర్మించడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాకు చీకటి ప్రేమకథ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. -
ధనుష్ హీరోగా ఒక మనసు రీమేక్..?
మెగా వారసురాలు నిహారిక హీరోయిన్గా తెరంగేట్రం చేసిన సినిమా ఒక మనసు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం మంచి వసూళ్లనే సాధిస్తోంది. దీంతో పరభాష నటులు ఇప్పుడు ఈ సినిమా రీమేక్ మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఈ తరహా చిత్రాలను ఇష్టపడే తమిళ ప్రేక్షకుల కోసం ఒక మనసు సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు ఓ స్టార్ హీరో. ఇటీవల ఒక మనసు సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూసిన తమిళ హీరో ధనుష్, ఆ సినిమాను తమిళ్లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ మేరకు ఒక మనసు సినిమా దర్శక నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నాడు. ముఖ్యంగా నాగశౌర్య పాత్ర, నేపథ్యం.. నచ్చిన ధనుష్ తానే స్వయంగా ఆ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. తన సొంతం నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
'ఒక మనసు' మూవీ రివ్యూ
టైటిల్ : ఒక మనసు జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : నాగశౌర్య, నిహారిక, రావూ రమేష్, ప్రగతి సంగీతం : సునీల్ కశ్యప్ దర్శకత్వం : రామరాజు నిర్మాత : మధుర శ్రీధర్ రెడ్డి ఇటీవల కాలంలో సార్ట్ వారసుల హవా బాగా కనిపిస్తుండటంతో అదే బాటలో మెగాఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చింది కొణిదల నీహారిక. నాగబాబు కూతురిగా, పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న నీహారిక, తొలిసారిగా ఒక మనసు సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. మరి వెండితెర మీద మెరసిన తొలి మెగా వారసురాలు ఆకట్టుకుందా..? హీరోయిన్ గా సక్సెస్ కొట్టాలన్న నీహారిక కల నెరవేరిందా..? కథ : సూర్య (నాగశౌర్య) రాజకీయ నాయకుడు కావాలన్న ఆశతో విజయనగరంలో సెటిల్మెంట్స్ చేస్తూ తిరిగే అబ్బాయి. సూర్య మామయ్య ఎమ్మెల్యే కావటంతో ఏ రోజుకైనా సూర్యను కూడా ఎమ్మెల్యేగా గెలిపించాలని కలకంటుంటాడు సూర్య తండ్రి (రావు రమేష్). విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో హౌస్ సర్జన్‌గా చేస్తున్న సంధ్య (నీహారిక), సూర్యని తొలి చూపులోనే ఇష్టపడుతుంది. తరువాత ఆ ఇద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది. అదే సమయంలో తన రాజకీయ అవసరాల కోసం ఓ పెద్ద సెటిల్మెంట్ ఒప్పుకున్న నాగశౌర్య చిక్కుల్లో పడతాడు. నమ్మకద్రోహం కారణంగా కోర్టు కేసులో ఇరుక్కుని మూడేళ్లపాటు జైలులో ఉంటాడు. ఆ తరువాత బెయిల్ వచ్చినా కేసు మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరోసారి సంధ్యకు దగ్గరవుతాడు సూర్య. కానీ తన తండ్రి కలను నెరవేర్చటం కోసం ఈ సారి సంధ్యకు శాశ్వతంగా దూరం కావలసిన పరిస్థితి వస్తుంది. మరి సూర్య నిజంగానే సంధ్యను దూరం చేసుకున్నాడా.? సూర్య వదిలి వెళ్లిపోవటానికి సంధ్య అంగీకరించిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇప్పటి వరకు లవర్ బాయ్ పాత్రల్లో కనిపించిన నాగశౌర్య ఈ సినిమాలో కాస్త పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో తండ్రి కల, అమ్మాయి ప్రేమకు మధ్య నలిగిపోయే వ్యక్తిగా మంచి నటన కనబరిచాడు. తొలిసారిగా వెండితెర మీద మెరిసిన నిహారిక పరవాలేదనిపించింది. లుక్స్ పరంగా హుందాగా కనిపించిన నిహారిక, నటన పరంగా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. తండ్రి పాత్రలో రావూ రమేష్ మరోసారి ఆకట్టుకున్నాడు. కొడుకు భవిష్యత్తు కోసం తపన పడే తండ్రిగా రావూ రమేష్ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. ఫ్రెండ్ పాత్రలో అవసరాల శ్రీనివాస్, చిన్న కామెడీ పాత్రలో వెన్నెల కిశోర్ తమ పరిధి మేరకు మెప్పించారు. సాంకేతిక నిపుణులు : నీహారికను హీరోయిన్గా ఎంచుకొని సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేసిన దర్శకుడు రామరాజు, మరోసారి తన మార్క్ పోయటిక్ టేకింగ్ తో ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ స్లో నారేషన్ కాస్త ఇబ్బంది పెట్టినా.. రిచ్ విజువల్స్, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి, సినిమా చాలా వరకు హీరో హీరోయిన్ల మధ్య మాటలతోనే నడిపించిన దర్శకుడు, డైలాగ్స్ పై మరింతగా దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సునీల్ కశ్యప్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం, రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం ఆకట్టుకుంటాయి. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫి చాలా బాగుంది. వైజాగ్ బీచ్ అందాలను, అరకు పచ్చదనాన్ని మరింత అందంగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫీ మెయిన్ స్టోరీ ప్రీ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : స్లో నారేషన్ డైలాగ్స్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
నీహా అని పిలిస్తే పలికేది కాదు!
మహా గ్రంథాలను వర్ణించగలం గానీ... ప్రేమను నిర్వచించలేం. అదొక అంతులేని అగాథం... అందుకోలేని ఆకాశం. ఇంత క్లిష్టమైన ప్రేమను రెండున్నర గంటల సినిమాగా చూపించేందుకు ఎందరో ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అందులో రామరాజు ఒకరు. ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ వంటి హృదయాన్ని హత్తుకునే సినిమా రూపొందించిన రామరాజు... ఇప్పుడు ‘ఒక మనసు’ అంటూ... మరో ప్రణయకావ్యాన్ని తెరకెక్కించారు. నేడు విడుదల కానున్న ఈ చిత్రవిశేషాలను రామరాజు ఇలా చెప్పారు... స్వార్థం తెలీనిది, షరతుల్లేనిదే స్వచ్ఛమైన ప్రేమ. నీ మీద ప్రేమ చావదు.. మరొకరి మీద ప్రేమ పుట్టదంటారు నిజమైన ప్రేమికులు. ఒక మనసు కథలో చెప్పిందిదే. ప్రేమ అనేది ఒక స్థితి (కండీషన్). ఇది ఒక గంటా, ఒక రోజా, ఒక నెలా అనేదాన్ని బట్టి ప్రేమ లోతు చెప్పొచ్చు. ఇదే ప్రేమ జీవితాంతం నిలుపుకుంటుందిసంధ్య. ఈ పాత్రను నీహారిక అద్భుతంగా చేసింది. కథ పరంగా కథానాయకుడి పాత్ర కంటే సంధ్య పాత్రకే కాస్త ప్రాధాన్యం ఉంటుంది. సంధ్య పాత్రలో నిహారిక, సూర్య క్యారెక్టర్లో నాగశౌర్య వాళ్ల నటనతో దర్శకుడిగా నా ఊహలకు రూపమిచ్చారు. నా గత చిత్రం లాగే ఓ మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. నీహారిక అనగానే మొదట కొంచెం టెన్షన్ ఉండేది. మెగా కుటుంబం నుంచి వస్తోన్న అమ్మాయి కదా, చాలా అబ్జెక్షన్స్ ఉంటాయేమో అనుకున్నా. కానీ ‘సంధ్య’ పాత్రకు ఆమె కరెక్ట్ అనిపించి, తన తల్లిదండ్రుల సమక్షంలో కథ వినిపించా. దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే ఇంతటితో వదిలేద్దాం అని చెప్పా. కానీ, ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఆమె ‘సంధ్య’ పాత్రలో ఎలా లీనమైందంటే.. సెట్లో ‘నీహా’ అని పిలిస్తే పలికేది కాదు.. సంధ్య అంటేనే పలికేది. నాగశౌర్య అప్ కమింగ్ యువ రాజకీయ నాయకునిగా ‘సూర్య’ పాత్రలో కనిపిస్తాడు. తన పాత్రకి వందశాతం న్యాయం చేశాడు. సమాజంలోనే కాదు.. మన జీవితాల్లో కూడా రాజకీయం ఉందనే విషయం తన పాత్ర ద్వారా చెప్పాం. నా దృష్టిలో కమర్షియల్ చిత్రమంటే భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించడం కాదు. తక్కువ బడ్జెట్లో చేసిన చిత్రాలు బాక్సాఫీస్‌లో మంచి వసూళ్లు రాబడితేనే అది అసలైన కమర్షియల్ చిత్రం. ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ చిత్రం కంటే ‘ఒక మనసు’ వేగంగా సాగుతుంది. ఈ సినిమా తర్వాత మధుర శ్రీధర్‌రెడ్డి బ్యానర్లోనే ఓ ప్రేమకథా చిత్రం చేయబోతున్నా. -
గ్లామర్ పాత్రలు చేయను
‘‘నేటి తరం హీరోయిన్లు గ్లామర్, యాక్టింగ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. పాత్ర డిమాండ్‌ను బట్టి వారు నటిస్తారు. నా వరకు నేను గ్లామర్ పాత్రల్లో నటించేందుకు ఇష్టపడటం లేదు. నేను కథ ఎంపిక చేసుకునేటప్పుడు నాన్నగారిని (నటుడు నాగబాబు), మెగా అభిమానులను దృష్టిలో పెట్టుకుంటాను. వాళ్లు చూడటానికి ఇబ్బంది పడే పాత్రల్లో నటించను’’ అని కథానాయిక నీహారిక స్పష్టం చేశారు. నాగశౌర్య, నీహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో‘మధుర’ శ్రీధర్‌రెడ్డి నిర్మించిన ‘ఒక మనసు’ ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నీహారిక పలు విశేషాలు చెప్పారు. స్వచ్చమైన ప్రేమకథతో తీసిన సినిమా ‘ఒక మనసు’. ప్రేమకథా చిత్రాలంటే ‘మరోచరిత్ర’, ‘గీతాంజలి’ వంటి వాటిని చెబుతారందరూ. ఆ రెండు చిత్రాల తర్వాత ఇకపై ‘ఒక మనసు’ను గుర్తు పెట్టుకుంటారు. ప్రేమకథ అంటే పిల్లలతో కలిసి చూడ్డానికి తల్లిదండ్రులు, పెద్దలతో కలిసి చూడ్డానికి పిల్లలూ ఇబ్బంది పడతారు. ఇందులో అటువంటి సన్నివేశాలు ఉండవు హీరోయిన్గా రావాలనుకున్నప్పుడు చాలా కథలు విన్నా. ఏదీ నచ్చలేదు. ‘ఒక మనసు’ చిత్రంలోని సంధ్య పాత్ర వినగానే మనసుకు నచ్చి ఓకే చెప్పేశా. నా కుటుంబ సభ్యులు, మెగా అభిమానులందరికీ నా పాత్ర నచ్చుతుంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా హీరోయిన్స్‌గా నాకంటే ముందు వేరే కుటుంబాల నుంచి వచ్చిన వారు కొనసాగలేకపోయారు. తొలుత ప్రొడక్షన్ వ్యవహారాలు చూసిన నాకు యాక్టింగ్ ఎందుకు చేయకూడదు? అనిపించి, నాన్నగారికి చెబితే ఆయన ఆలోచించి సరే అన్నారు. ఆ తర్వాత పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్‌కల్యాణ్, అన్నయ్యలు అందరితో మాట్లాడాను. ఇండస్ట్రీలోని ప్లస్‌లు, మైనస్‌లు వారు చెప్పారు. ఫైనల్‌గా ‘ఇది నీ లైఫ్.. నీకు కరెక్ట్ అనిపించింది చెయ్’ అని ప్రోత్సహించారు పెదనాన్న చిరంజీవిగారి ఇమేజ్ వల్ల నా ఫస్ట్ చిత్రానికి ఇంత అటెన్షన్ ఉందే కానీ, రెండో చిత్రానికి ఉండదు. ఫస్ట్ సినిమాలో ఎలా నటించానా? అని చూసేందుకు అభిమానులు వస్తారు. సరిగ్గా నటించకపోతే రెండో చిత్రానికి రారు. సినిమా బాగాలేకపోతే నా సొంత అన్నయ్య చిత్రమే నేను రెండోసారి చూడను. టాలెంట్‌ను నిరూపించుకుని ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలి ఎక్కువకాలం ఇండస్ట్రీలో ఉండాలని ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయను. ఎన్ని సినిమాలు చేశాం అని కాదు.. ఎన్ని మంచి చిత్రాలు చేశామన్నదే నాకు ముఖ్యం. మంచి పాత్రలు వస్తే తమిళ, కన్నడం, మలయాళ భాషల్లో నటిస్తాను. నటన పరంగా నాకు రోల్‌మోడల్ పెదనాన్నగారే. కమల్‌హాసన్‌గారు, కాజోల్ అంటే ఇష్టం నాగశౌర్య మంచి కోస్టార్. మొదట్లో కామ్‌గా ఉండేవాడు. ఆ తర్వాత మంచి ఫ్రెండ్ అయ్యాడు. కొన్ని సన్నివేశాల్లో నటించేందుకు ఇబ్బంది పడుతుంటే తను బాగా సపోర్ట్ చేశాడు. రామరాజుగారి దర్శకత్వంలో నటించడం చాలా కంఫర్టబుల్ అనిపించింది. -
ఈ సినిమా చూశాక కచ్చితంగా మార్పు వస్తుంది!
బుల్లితెర వ్యాఖ్యాతగా నటుడు నాగబాబు కూతురు నీహారిక ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆమె కథానాయికగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఒక మనసు’. రామరాజు దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నీహారిక ప్రత్యేకంగా మాహిళాభిమానులు కలిశారు. ‘‘నా మొదటి సినిమాకే మంచి సబ్జెక్ట్ దొరకడం నా లక్. ఈ చిత్రం తర్వాత ఆడపిల్లల ప్రేమల్లో కచ్చితంగా మార్పు వస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉంటుంది. నేనే సినిమా చేసినా అభిమానులు ఇబ్బందిపడే విధంగా ఉండదు’’ అని చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
నిహారికకు ఏమైంది?
మెగా వారసురాలుగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావడానికి సిద్ధమవుతోంది నిహారిక. రామరాజు దర్శకత్వంలో 'ఒక మనసు' అనే అందమైన ప్రేమ కథలో హీరోయిన్ గా కనిపిస్తుంది నాగబాబు ముద్దుల తనయ. ఈ మధ్యే అట్టహాసంగా ఆ సినిమా ఆడియో రిలీజ్ జరుపుకుంది. నిహారికకు జంటగా నాగశౌర్య నటించాడు. జూన్ 24న సినిమా రిలీజ్ డేట్ అనుకున్నారు. అందుకు తగ్గట్లే పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేస్తున్నారు. త్వరలో ప్రమోషన్ హంగామా మొదలు పెట్టాలనుకుంటున్నారు దర్శకనిర్మాతలు. అయితే ఇక్కడే అసలు సమస్య వస్తోంది చిత్ర యూనిట్‌కి. టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ...షూటింగ్ ముగిసిన తర్వాత నిహారిక ఎందుకో ఈ సినిమా యూనిట్ కి దూరంగా ఉంటూ వస్తోందంట. మొదట విడుదల చేసిన ట్రైలర్ కి డబ్బింగ్ చెప్పడానికి కూడా నిహారిక చాలా టైమ్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు సినిమా డబ్బింగ్ విషయంలో కూడా అదే సమస్యను ఎదుర్కొంటుందట చిత్ర యూనిట్. ఈ సినిమా డబ్బింగ్‌కి ఎప్పుడు రమ్మని పిలిచినా ... నిహారిక ఏదో వంక చెప్పి తప్పించుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందిప్పుడు. మెగా డాటర్ ఇమేజ్ తో తమ సినిమాకు మరింత మైలేజీ వస్తుందన్న దర్శక నిర్మాతల ఆశలను.. నిహారిక వ్యవహరిస్తున్న తీరు డిసప్పాయింట్ చేస్తోందని సమాచారం. మరికొద్ది రోజులు ఆగి .. నిహారిక డబ్బింగ్ కి రాకపోతే కనుక.. మరో డబ్బింగ్ ఆర్టిస్ట్ తో వాయిస్ చెప్పించాలని డిసైడ్ అయ్యారట. అయితే ఆ రూమర్లపై నిహారిక కూడా ఇంతవరకూ స్పందించలేదు. -
ఒక మనసు కోసం?
మెగాబ్రదర్స్‌లో ఒక్కరైన నాగేంద్రబాబు కుమార్తె నీహారిక ‘ఒక మనసు’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో నాగశౌర్యతో ఆమె జతకట్టారు. మధుర ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 24న విడుదలవుతోంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మెగా హీరోల చేతుల మీదుగా ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా ఫస్ట్ లుక్ నుంచి ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు అనూహ్య స్పందన రావడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘ప్రేమ, కుటుంబం, బాధ్యతలు వంటి విలువలను ఈ చిత్రంలో చూపించాం. నాగశౌర్య, నీహారిక నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి మనసుని ఈ చిత్రం అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు చెప్పారు. -
ఆ ప్రశ్నతో నన్ను మాట్లాడనివ్వకుండా చేసింది : నాగబాబు
‘‘తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా దొరకరు. నాగబాబు ధైర్యం చేసి నీహారికను హీరోయిన్ని చేశారు. హీరోయిన్ అవు తుందని, కాదని ఇలా ఇంట్లో తర్జనభర్జన జరుగుతున్నప్పుడు నాగశౌర్యతో సినిమా చేస్తోందని మీడియా ద్వారా తెలిసింది. అరె.. బన్నీ సరసన హీరోయిన్గా చేస్తే బాగుంటుందనిపిం చింది. సరిగ్గా అప్పుడే ‘సరైనోడు’ స్టార్ట్ అయింది. ఇది మా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడే అందరికీ చెబుతున్నా’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. మెగా ఫ్యామిలీ వారసు రాలిగా నాగబాబు కుమార్తె నీహారిక వెండితెరపై తెరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ఒక మనసు’. నాగశౌర్య, నీహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో రామ్‌చరణ్ ఈ చిత్రం బిగ్ సీడీని ఆవిష్కరించారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ- ‘‘చిరంజీవిగారు వేసిన బాటలో మేం కష్టపడు తున్నాం. నీహా మా కన్నా ఎక్కువ కష్టపడుతోంది. తెలుగు పరిశ్రమకు ఆహ్వానం పలుకుతున్నా. నీహాకు ఎలాంటి కోస్టార్ దొరుకుతాడో అని ఎదురుచూశా. నాగశౌర్య స్వచ్ఛమైన తెలుగబ్బాయిలా ఉంటాడు. నీహాను చూశాక తమ ఇంటి అమ్మాయిలా అందరూ అనుకుంటారు’’ అన్నారు. ‘‘నేను ‘కంచె’ సినిమా చేస్తున్నప్పుడు ‘మల్లెల తీరంలో..’ చూశాను. మా చెల్లి మంచి దర్శకుని చేతిలో పడిందని హ్యాపీగా ఉంది. ఈ రోజు ఉన్న హీరోల్లో నాగశౌర్య మంచి నటుడు. నీహారికను చిన్నప్పుడు ‘ఏమవుతావు’ అని అడిగితే ఐఏఎస్, డాక్టర్ అవుతాననేది. ఇప్పుడు మాతో పాటే సినిమాల్లోకి వచ్చేసింది. కొత్తలో తన మీద నమ్మకం ఉండేది కాదు. నెమ్మదిగా నాకు కూడా నమ్మకం కుదిరింది’’ అని వరుణ్‌తేజ్ చెప్పారు. నాగ బాబు మాట్లాడుతూ- ‘‘నీహారికకు మంచి కథ ఇచ్చారు. ఇంతమంది హీరోలున్న ఫ్యామిలీ నుంచి నీహారిక హీరోయిన్గా వెళుతుందని చెప్పగానే అందరూ ప్రోత్సహించారు. నీహారిక మాస్ కమ్యూనికేషన్ చేశాక సినిమాల్లోకి ఎంటరవుతానంటూ, ‘హీరోలు వస్తున్నప్పుడు ఏమీ మాట్లాడరేం? ఆడపిల్లలు వస్తున్నప్పుడే మాట్లాడతారేం?’అని ప్రశ్నించింది. నన్ను మారు మాటాడకుండా చేసింది. అందుకే నీహారికను తనకు ఇష్టమైన రంగంలోకి పంపించాను. ప్రతి పేరెంట్ కూడా తమ కూతుళ్లు కన్న కలలను సాకారం చేసుకోవడానికి ప్రోత్స హించాలని కోరుతున్నా. ఆడపిల్లలను అబ్బాయిల కన్నా ఎక్కువగా లేక సమానంగా ప్రోత్సహించండి’’ అని నాగబాబు చెప్పారు. నీహారిక మాట్లాడుతూ- ‘‘రామరాజు గారు స్క్రిప్ట్ నెరేట్ చేస్తుంటే అలా వినాలనిపించింది. నేను ఈ సినిమాలో కొన్ని సీన్స్‌లో బాగా యాక్ట్ చేశానంటే నాగశౌర్య కారణం. అమ్మ ప్రేమను వర్ణించడం ఎవరి తరం కాదు. కానీ, ఈ సినిమా మాత్రం అమ్మ ప్రేమంత స్వచ్ఛంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘రామరాజుగారి వల్లే మేమింత బాగా యాక్ట్ చేయగలిగాం’’ అని నాగశౌర్య అన్నారు. ఈ వేడుకలో నీహారిక తల్లి పద్మజ, చిరంజీవి కుమార్తె సుస్మిత పాల్గొన్నారు. -
పవన్ పేరిట గొడవ చేయొద్దు: అల్లు అర్జున్
హైదరాబాద్: చిరంజీవి తర్వాత తనకు పవన్ కల్యాణ్ అంటే ఇష్టం అని సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు. నాగేంద్రబాబు కుమార్తె నిహారిక నటించిన 'ఒక మనసు' చిత్రం ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడారు. ఫంక్షన్స్ లో అభిమానులు గొడవ చేయడం వల్ల తాము ఇబ్బందిపడుతున్నాం అని అల్లు అర్జున్ చెప్పారు. ఫంక్షన్స్ లో అభిమానులు పవన్ కల్యాణ్ పేరు మీద గొడవ చేయొద్దని.. పవన్ కల్యాణ్, తాము ఒకటే కుటుంబం అని అన్నారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్స్ తనను చాలా బాధపెట్టాయని అల్లు అర్జున్ చెప్పారు. -
'ఒక మనసు' మూవీ స్టిల్స్
-
మెగా వేడుక
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మొదటి హీరోయిన్ నీహారిక. మెగా బ్రదర్ ముద్దుల తనయ అయినా నీహా ఇప్పటికే బుల్లితెరపై తన టాలెంట్‌ని నిరూపించేసుకున్నారు. ‘ఒక మనసు’ ద్వారా వెండితెరకు పరిచయం కానున్నారు. రామరాజు దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుకకు ముహూర్తం ఖరారైంది. సునీల్ కశ్యప్ స్వరపరిచిన ఈ చిత్రం పాటల వేడుక ఈ నెల 18న ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్‌తేజ్ ముఖ్యఅతిథులుగా విచ్చేయనున్నారు. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
మెగాభినేత్రి
పుట్టినప్పుడు మూడున్నర కిలోలట! వెరీ హెల్దీ బేబీ. మెగాస్టార్... చేతుల్లోకి ఎత్తుకుంటే తదేకంగా చిరంజీవినే చూస్తూ ఉండిపోయిందట... పసి నీహారిక. ఇప్పుడు చిరంజీవి తదేకంగా చూసే సందర్భం వచ్చేసింది! మెగా కుటుంబంలో మొట్టమొదటి హీరోయిన్గా నీహారిక సినిమా రాబోతోంది. నీహారిక అంటే గెలాక్సీ. అంటే పాలపుంత. పద్మజకు నీహారిక ఎప్పుడూ స్టారే. మరి నీహారికకు? మమ్మీ ఈజ్ హర్ గెలాక్సీ. మదర్స్‌డే స్పెషల్ నీహారిక: నిన్ను ఇంటర్వ్యూ చేస్తానమ్మా.. నిజాలే చెప్పాలి. పద్మజ: ఏమడుగుతావో అడుగు. అన్నీ నిజాలే చెబుతా. నీహా: ఓకే.. రెడీయా.. ముందుగా నేను పుట్టినప్పుడు నీకెలా అనిపించిందో కొంచెం షేర్ చేసుకోవా? పద్మజ: ఫస్ట్ అబ్బాయి (వరుణ్ తేజ్) పుట్టాడు కాబట్టి, రెండోసారి పాపే పుట్టాలని నేనూ, మీ నాన్న అనుకున్నాం. అదే జరిగింది. నువ్వు పుట్టినప్పుడు మొదలైన ఆనందం మీ నాన్నకి ఇంకా తీరలేదు. పుట్టినప్పుడు నీ వెయిట్ మూడున్నర కేజీలు. ముద్దుగా ఉండేదానివి. ‘ఈ రోజు నలుగురు పుట్టారు. అందరికన్నా మీ పాపే క్యూట్‌గా ఉంది’ అని నర్సులు అన్నారు. ఆ రోజు నువ్వెలా ఉన్నావో అలా నా మనసులో ప్రింట్ అయిపోయింది. ఇంకో విషయం చెప్పనా? ఏడో రోజు నిన్ను ఉయ్యాలలో వేసినప్పుడు మీ పెదనాన్న (చిరంజీవి) ఎత్తుకుంటే, చాలాసేపు ఆయన్నే చూస్తూ ఉండిపోయావు. మా బావగారిని నువ్వెందుకలా చూశావో అర్థం కాలేదు. నీహా: చిన్నప్పుడు వరుణ్ అన్నయ్య, నేనూ చేసిన అల్లరి గురించి... అన్నయ్యే ఎక్కువ అల్లరి చేసేవాడు కదూ..? పద్మజ: ఏం కాదు... నువ్వే. చిన్నప్పుడు ఇద్దరూ బాగా కొట్టుకునేవాళ్లు. పెద్దయ్యాక ప్రేమగా ఉంటున్నారు. పైగా నీ గొంతేమో పెద్దది. నీహా: నన్నంటున్నావ్.. నీ గొంతు కూడా అంతే కదమ్మా. ఆ మాటకొస్తే మనింట్లో మన నలుగరిదీ పెద్ద గొంతే. కాకపోతే.. అన్నయ్య, నాన్న ఎక్కడ వాడాలో అక్కడ వాడతారు. మనిద్దరం మాత్రం ఏదైనా గట్టిగా మాట్లాడేస్తాం. అందుకే కదమ్మా ఇంట్లో మనిద్దరం రహస్యాలు మాట్లాడుకోవాలంటే తలుపులేసేసుకుంటాం. అవునూ.. మీ మమ్మీకీ, నా మమ్మీకి పిల్లల్ని పెంచే విషయంలో తేడా ఏంటి? పద్మజ: మీ అమ్మమ్మ మన దగ్గరే ఉండేది. తనే నన్ను పెంచింది. నేనూ నీలానే బాగానే అల్లరి చేసేదాన్నట. అందుకే నీ అల్లరికి తట్టుకోలేక ఎప్పుడైనా తిడితే, ‘ఊరుకో. నువ్వింతకంటే ఎక్కువే అల్లరి చేశావ్’ అని మా అమ్మ అనేది. మా అప్పుడు స్కూల్స్‌లో టూర్స్, బోల్డంత మంది ఫ్రెండ్స్, కంప్యూటర్లు.. ఇలా ఏవీ ఉండేవి కాదు. స్కూలు, ఇల్లు అంతే. ఇప్పుడేమో అంతా ఫాస్ట్. టూర్స్‌కి వెళతారు. ఫ్రెండ్స్‌తో సినిమాలకెళతారు. ఎక్కడికీ వెళ్లనివ్వకుండా మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టుకోవడం నాకిష్టం ఉండదు. బయటకు పంపించినా, మీరిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేదాకా టెన్షన్. ఆ తేడా తప్ప పెంపకం విషయంలో మా అమ్మకీ, మీ అమ్మకీ వేరే ఏ తేడా లేదు. నీహా: నన్నూ, అన్నయ్యని పెంచడానికి ఇబ్బంది పడ్డావా? పద్మజ: నేనేం ఇబ్బందిలా ఫీలవ్వలేదు. మీ ఇద్దరు తప్ప నాకు వేరే ఆలోచన ఉండేది కాదు. మీరు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నేను మీ కళ్ల ముందు ఉండాల్సిందే. ఎప్పుడైనా లేకపోతే వరుణ్ ఫోన్ చేసి, ‘నేను వస్తానని తెలుసు కదా.. ఇంట్లో ఎందుకు లేవు’ అని అరిచేసేవాడు. నీహా: మా చిన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఎవరికీ ఇచ్చేదానివి కాదట.. నువ్వే పెంచావట... అందుకే అమ్మా.. ‘ఐ కాంట్ గెట్ ఎ బెటర్ మమ్మీ. లవ్ యు లాట్’. పద్మజ: మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్లేదాన్ని కాదు. మీ ఇద్దరూ ఇంటి నుంచి బయటికెళ్లేటప్పుడు, నాకు ముద్దు పెట్టి, బై చెప్పి వెళ్లేవాళ్లు. చిన్నప్పుడు మొదలైన ఆ అలవాటు ఇప్పటికీ ఉండటం నాకు హ్యాపీగా ఉంది నీహా. నీహా: నన్ను ఫస్ట్ డే స్కూల్‌కి పంపించినప్పుడు ఏడ్చానా? పద్మజ: ప్రీ కేజీలో ఆ రోజు నీతో పాటు చేరిన పిల్లలం దరూ దాదాపు ఏడ్చారు. నువ్వు కూడా ఏడుస్తావేమోనని భయపడుతూ, నీవైపు చూశా. అప్పుడు నువ్వు నన్ను చూసి, ‘అమ్మా.. నువ్వెల్లిపో.. వెల్లిపో’ అని ముద్దు ముద్దుగా అన్నావు (మురిపెంగా చూస్తూ). నీహా: నేనలా మాట్లాడిన వాటిలో నీకు బాగా గుర్తున్నవి ? పద్మజ: చిన్నప్పుడు నువ్వేదైనా చెప్పాలంటే.. ‘చూడు.. చూడు.. అమ్మా.. చూడు.. చూడు’ అనేదానివి. ముందు ఆ మాటలు అని, ఆ తర్వాతే విషయం చెప్పేదానివి. ఇప్పటికీ నీకా అలవాటు పోలేదు. నీహా: ఓహో.. అందుకేనా ఇప్పుడు కూడా ఏదైనా చెప్పే ముందు ‘అమ్మా.. చూడు.. చూడు’ అని నేనంటే చిన్నప్పటిది గుర్తుకొచ్చి నవ్వుతుంటావ్? అది సరే... అమ్మా నాలో నీకు నచ్చని విషయాలు, నచ్చినవి? పద్మజ: నీకు కోపం ముక్కు మీద ఉంటుంది. ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా పోతుంది కాబట్టి, నేను సీరియస్‌గా తీసుకోను. ఆ కోపం అంటే నాకు నచ్చదు. నచ్చే విషయాలంటే.. నేనేదైనా విషయానికి బాధపడితే.. చాలా మెచ్యుర్డ్‌గా మాట్లాడతావ్. అప్పటివరకూ బాధపడిన నేను ‘ఇంత చిన్న విషయానికి బాధపడ్డామా’ అనుకుంటాను. నీహా.. నువ్వంత మెచ్యుర్డ్‌గా మాట్లాడటం, బోల్డ్‌గా ఉండటం నాకు నచ్చుతుంది. నీహా: నీకో కాంప్లిమెంట్ అమ్మా... నువ్వు యంగ్‌గా కనిపిస్తావ్... చాలా ప్రౌడ్‌గా ఉంది.. పద్మజ: అందుకేనా.. నాకన్నా నువ్వే బాగున్నావని ఏడిపిస్తుంటావ్? మీ అన్నయ్య కాలేజ్‌కి నేను వెళ్లినప్పుడు, తనేమన్నాడో నీకు గుర్తుండే ఉంటుంది. కాలేజీలో ‘మీ సిస్టరా?’ అని అడిగారట. అందుకని వరుణ్ ఇంటికొచ్చి ‘అమ్మా.. నువ్వు కాలేజీకి వస్తే రా కానీ, చుడీదార్లు వేసుకోకు.. చీరలు కట్టుకుని రా’ అన్నాడు (నవ్వుతూ). ⇒మా అమ్మచెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటా. నాకెలాంటి అబ్బాయి సూట్ అవుతాడో మా అమ్మకు బాగా తెలుసు. అందుకే డెసిషన్ తనదే. ⇒మా ఇద్దరి రిలేషన్షిప్ మదర్, డాటర్‌లా ఉండదు. కోపం వచ్చినప్పుడు బాగా గొడవపడతాం. ఆ కోపం కాసేపే. ఆ తర్వాత నేను ‘సారీ అమ్మా’ అనేస్తాను. మేమిద్దరం అటు ఫ్రెండ్స్ కాదు.. ఇటు ఎనిమీస్ కాదు. మేం ‘ఫ్రెనిమీస్’ అంటాను. నీహా: నీకింకో కాంప్లిమెంట్ కూడా.. నువ్వు సింపుల్‌గా ఉన్నా చాలా బాగుంటావమ్మా. ఒక మామూలు హౌస్‌వైఫ్ ఎలా ఉంటుందో అలానే ఉంటావ్. పద్మజ: నాక్కూడా ఇలా ఉండటమే ఇష్టం నీహా. మీ నాన్నగారికి కూడా నేనిలా ఉండటమే ఇష్టం కదా. నీహా: అవును. అన్నయ్యకు కూడా నువ్విలానే ఉండటం ఇష్టం. నిన్ను చుడీదార్లు వేసుకోవద్దంటాడు. చీరలే కట్టుకోమంటాడు. బొట్టు పెట్టుకోమంటాడు. ఎప్పుడైనా నువ్వు పోనీటైల్ వేసుకున్నా, ఊరుకోడు. జడేసుకోమంటాడు. పద్మజ: అవును. వరుణ్ మరీ పర్టిక్యులర్‌గా ఉంటాడు. నేను కూడా ఇలా ఉండటానికే ఇష్టపడతాను. నీహా: నేను హీరోయిన్ అవుతానని ఊహించావా? పద్మజ: వరుణ్ హీరో అవుతాడని అనుకున్నాను. నాకూ ఇంట్రస్టే. కానీ, నీ గురించి ఏమీ అనుకోలేదు. నువ్వు డాక్టర్ అవ్వాలనుకునేదానివి. కానీ, నాకు తెలుసు నువ్వు కావని. ఒకేచోట కుదురుగా ఉండటం నీవల్ల కాని పని. నువ్వు డాక్టర్ అయితే.. నాలుగు గంటలు ఆపరేషన్ చేయాలంటే రెండు గంటలు చేసి, మిగతా సగం వదిలేస్తావనుకుంటుంటాను (నవ్వుతూ). మీ నాన్నగారి అమ్మమ్మ నిన్ను ఐఏఎస్‌గా చూడాలనుకునేది. కానీ, నీకు బీఏ మాస్ కమ్యూనికేషన్ చేయాలని ఉండేది. నీ ఇష్టాన్ని కాదనలే దు. అందుకే హీరోయిన్ అవుతానంటే ఓకే చెప్పాం. ఓకే చెప్పే ముందు నేనూ, నాన్న చాలా డిస్కస్ చేసుకున్నాం. నీహా: మీ ఇద్దరూ ఏం డిస్కస్ చేసుకున్నారో చెప్పవా ప్లీజ్.. పద్మజ: (నవ్వుతూ). మేమిద్దరం ఒకటే అనుకున్నాం. ‘భవిష్యత్తులో మన అమ్మాయి ఏ విషయంలోనూ ఫీల్ కాకూడదు. ఇప్పుడు కనుక తన ఇష్టాన్ని కాదంటే.. రేపు తను ఫీలవుతుంది. పెళ్లయ్యాక హీరోయిన్గా ఎలాగూ చేయలేదు. టీవీ షోస్ అయితే ఎప్పుడైనా చేయొచ్చు. అందుకే ఇప్పుడు చేయనిద్దాం’ అనుకున్నాం. నీహా: అవునమ్మా.. పెళ్లయ్యాక నేను సినిమాలు చేయను. నువ్వు నీ పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకున్నావో నేనూ అలానే చూసుకుంటాను. నేనే పని చేసినా ఫుల్‌గా కాన్సన్ట్రేట్ చేస్తా. అందుకే మ్యారీడ్ లైఫ్‌ని నీలానే లీడ్ చేస్తాను. నీహా: ఇంతకీ అన్నయ్య ఫస్ట్ సినిమా అప్పుడా.. ఇప్పుడు నేను యాక్ట్ చేసిన నా ఫస్ట్ సినిమా (ఒక్క మనసు) రిలీజ్ అవుతుంటే ఎగ్జయిట్ అవుతున్నావా? పద్మజ: అన్నయ్య సినిమా అప్పుడు ఎగ్జయిట్మెంట్, టెన్షన్ ఉండేది. నీ సినిమాకి ఇంకా ఎక్కువ ఉంది. దానికి కారణం మన మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మొదటి హీరోయిన్‌వి నువ్వే. ఏదైనా జరిగితే నిన్ను అనరు.. నన్ను అనరు. ఫ్యామిలీని అంటారు. అందుకే, మంచి యాక్ట్రెస్ అనిపించుకుంటావా? లేదా? అని టెన్షన్. నీహా: అవును. నేను కూడా ఆ విషయం గురించి ఆలోచించాను. ‘కొణిదెల మెగా ఫ్యామిలీ’ అనే పేరు మా డాడీ చిరంజీవిగారిది. నేను మంచి సినిమా చేసినా, చెడ్డ సినిమా చేసినా అది ఫ్యామిలీకే వస్తుంది. అందుకే ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని, నిర్ణయాలు తీసుకుంటా . పద్మజ: నువ్వు టాలెంటెడ్ నీహా. అందుకే ఎంకరేజ్ చేశాం. బయట ఫ్యాన్స్ సినిమాలు చేయొద్దన్నా.. వేరేవాళ్లు వద్దన్నా.. నీ కోరిక తీరలేదంటే... భవిష్యత్తులో నువ్వు ఎవర్నీ అడగవ్. ‘నా కోరికను ఎందుకు కాదన్నారు’ అని నన్నూ, నాన్ననే అడుగుతావ్. అందుకే ఒప్పుకున్నాం. నీహా: బిహైండ్ మై సక్సెస్ ఎవరో కాదు.. నువ్వే అమ్మా. పద్మజ: ఏం చేసినా నువ్వు కమిటెడ్‌గా చేయడం నాకూ ఆనందంగా ఉంది. టీవీ షోస్ చేసేటప్పుడు గంటల తరబడి నిలబడి, ఆ తర్వాత కాళ్ల నొప్పులతో బాధపడతావ్ కదా.. అప్పుడు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంటుంది. నీహా: అన్నయ్య, నా విషయంలో నీకేదైనా బాధ? పద్మజ: ఏ బాధా లేదు. మీ ఇద్దరూ చాలా బాగా పెరిగారు. మీకు బయటి ఫుడ్ పెట్టకూడదని మీ చిన్నప్పుడు చైనీస్ వంటకాలు కూడా నేర్చుకున్నాను. నేను చేసే బిర్యాని, నాన్‌వెజ్ కర్రీస్ అంటే నీకిష్టం. ఇప్పుడేమో ఇద్దరూ డైటింగ్ అంటూ తినడం మానేశారు. నువ్వేమో నాన్‌వెజ్ మానేశావ్. చిన్నప్పుడు మీ ఇద్దరూ స్కూల్ నుంచి ఇంటికి రాగానే ‘ఏం తింటారు’ అని అడిగేదాన్ని. ఇప్పుడు బయట నుంచి రాగానే, మీ అన్నయ్యను అలా అడిగితే.. ‘తింటావా అని మాత్రం అడక్కు’ అంటాడు. మీ ఇద్దరూ ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం కొంచెం బాధగా ఉంది. నీహా: కరెక్టే అమ్మా.. చిన్నప్పుడు ఏ టైమ్‌లో పడితే ఆ టైమ్‌లో ఏది పడితే అది తినడానికి అడిగేదాన్ని కదా.. పద్మజ: చిన్నప్పుడు మ్యాంగో సీజన్ కానప్పుడు మ్యాంగో జ్యూస్ అడిగేదానివి. ఒకసారి రాత్రి 12 గంటలకు మైసూ ర్పాక్ కావాలని మారాం చేసావ్. అప్పటికప్పుడంటే ఎలా? నాకు చేయడం రాదు. చిన్నప్పుడు ఎవరో చేస్తుంటే చూసా. అది గుర్తు తెచ్చుకుని చేసిస్తే, తిన్నావ్. నీహా: పెదనాన్న (చిరంజీవి), బాబాయ్ (పవన్ కల్యాణ్) పెద్ద హీరోలయ్యారు కదా.. మరి.. నాన్న... పెద్ద హీరో కానందుకు బాధపడ్డావా? పద్మజ: నాకే బాధా లేదు. మరి.. నీ సంగతేంటి నీహా? నీహా: డాడీ (పెదనాన్న చిరంజీవిని నీహా అలానే పిలుస్తారు), బాబాయ్ పెద్ద హీరోలయ్యారు. నాన్నగారి నటన డిఫరెంట్‌గా ఉంటుంది. నాన్న మెయిన్ ఫోకన్ యాక్టింగ్‌పైన కాదు. ఆయనలో మంచి రైటర్ ఉన్నాడు. నేను యూ ట్యూబ్‌లో చేసిన వెబ్ సిరీస్‌కి రైటింగ్ విషయంలో నాన్న హెల్ప్ తీసుకున్నాను. నాన్న ‘సీతామాలక్ష్మి’ సీరియల్ కథ రాస్తున్నారు. రైటింగ్ విషయంలో నాన్న హెల్ప్ తీసుకుంటా కాబట్టి, ఆయన ఫుల్ టైమ్ ఆర్టిస్ట్ కాకపోవడం ఆనందంగా ఉంది. స్వార్థం అనుకోవద్దమ్మా ప్లీజ్. నీహా: ఫైనల్‌గా ఒక్క మాట చెప్పమ్మా.. నాలాంటి కూతురు ఉన్నందుకు నీకెలా అనిపిస్తోంది? పద్మజ: చాలా ప్రౌడ్‌గా ఉంది. చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటావ్. అలాగే, ‘ఇది తప్పమ్మా.. చేయొద్దు’ అంటే చేయవు. అది ఇంకా ఇంకా ఇష్టం. నీహా: నేనూ, అన్నయ్యా మా ప్రేమను నీకెంత ఇచ్చామో తెలియదు కానీ, నువ్వు మాత్రం హండ్రెడ్ పర్సంట్కన్నా ఎక్కువే ఇచ్చావమ్మా. ఎప్పటికీ నువ్వే మా అమ్మ కావాలి. - డి.జి. భవాని -
ఆ ఒక్క... మనసు కథ!
మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కుమార్తె నీహారిక హీరోయిన్గా తెరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర వ్యాఖ్యాతగా అందర్నీ ఆకట్టుకున్న ఆమె హీరోయిన్గా చేస్తున్న తొలి చిత్రం ‘ఒక మనసు’ ఫస్ట్‌లుక్‌ను ఉగాది సందర్భంగా విడుదల చేశారు. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఎ. అభినయ్, డా. కృష్ణా భట్టలతో కలిసి ‘మధుర ’ శ్రీధర్ నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ 6 అందమైన మెలొడీలం దించారు. ఈ నెల చివర్లో పాటలను, వేసవి స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చే స్తున్నాం’’ అని తెలిపారు. -
జనగామ సీఐ భార్య మృతి
ఫిట్స్‌తో మృతిచెందినట్టు వైద్యుల వెల్లడి విచారణ జరిపించాలని కోరిన మృతురాలు బంధువులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు జనగామ : జనగామ సీఐ శ్రీనివాస్ సతీమణి ముసికె ఆశాజ్యోతి నిహారిక(30) ఆదివారం అర్ధరాత్రి మృతి చెందింది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఫిట్స్ రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన నిహారికను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రకి తరలించగా.. చికిత్స చేస్తుండగానే మృతిచెందింది. శ్రీనివాస్ జనగామ సీఐగా పది రోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్నారు. రూరల్ పోలీస్టేషన్ క్వార్టర్లో భార్యతో కలిపి నివాసం ఉంటున్నారు. కొమురవెల్లి జాతర బందోబస్తుకు ఆదివారం రా త్రి సీఐ అక్కడకు వెళ్లారు. అదే రోజు రాత్రి సీఐ అక్క ధర్మావతి, మేనల్లుడు పల్ల శివకృష్ణ వచ్చా రు. రాత్రి వరకు వారితో ఉన్న సీఐ శ్రీనివాస్ ఆ తర్వాత కొమురవెల్లి వెళ్లారు. అర్ధరాత్రి 12.30 గంటలకు నిహారిక శబ్ధం చేసుకుంటూ మంచంపై నుంచి కింద పడిపోవడంతో ఆడబిడ్డ ధర్మావతి మేల్కొని శ్రీనివాస్‌కు ఫోన్ చేసింది. వెంటనే ఆమె ను పోలీస్ రక్షక్ వాహనంలో ఏరియా ఆస్పత్రికి తరలించగా, ఆర్ఎంవో సుగుణాకర్‌రాజు పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. నిహారిక చికిత్స పొందుతూ 1.30 గంటలకు మృతి చెందింది. అప్పటికే భర్త, సీఐ శ్రీని వాస్ ఆస్పత్రికి చేరుకున్నారు. నిహా రిక ఫిట్స్ కారణంగానే మృతి చెందినట్టు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు మృతురాలి సోదరుడు రం జిత్కుమార్ తన సోదరి మృ తిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసినట్లు జనగామ ఎస్ఐ శ్రీని వాస్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన సీఐ శ్రీనివాస్‌కు మహబూబాబాద్‌కు చెం దిన ఆశాజ్యోతి నిహారికతో 2009లో వివాహమైం ది. వీరికి ఆరేళ్ల కుమారుడు సన్ని ఉన్నాడు. నిహారి క మృతి వార్త తెలుసుకున్న బంధువులు జనగామ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. నిహారిక మృతదేహానికి తహసీల్దార్ చెన్నయ్య శవపంచనామా చేయగా, వీడియో పర్యవేక్షణలో వైద్య నిపుణులు పోస్టుమార్టం నిర్వహించారు. అంతకు ముందు మృతదేహాన్ని సిటీ స్కానింగ్ తీయించారు. కాగా, ఈ విషయమై డీఎస్పీ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా తన భార్యకు ఫిట్స్ వస్తుందని సీఐ శ్రీనివాస్ తన అనుమతితో ఆస్పత్రికి తీసుకువెళ్లాడని చెప్పారు. మృతురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, ఫోరెనిక్స్ రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి విచారణ కొనసాగిస్తామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని సీఐ స్వ గ్రామం బెల్లంపల్లికి తీసుకువె ళ్లారు. -
మెగాహీరోయిన్ కోసం అఖిల్ వెయిటింగ్ ?
-
'మెగా' హీరోయిన్ ముద్దపప్పు-ఆవకాయ
మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ వచ్చేసింది. వచ్చే దీపావళికి... కొణిదెల వారమ్మాయి తెరపై సందడి చేయనుంది. నాగబాబు కుమార్తె నిహారిక తొలి చిత్రం.... శరవేగంగా తెరకెక్కుతోంది. నిహారిక, ప్రతాప్, వర్ష, అదితి తదితరులు నటిస్తున్న ఆ చిత్రం పేరు ముద్దపప్పు-ఆవకాయ. పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న వెబ్ సిరీస్ టీజర్‌ను గురువారం నాగబాబు విడుదల చేశారు. తొలిసారిగా ఈ చిత్రాన్ని యూట్యూబ్ ద్వారా విడుదల చేయబోతున్నారు. ముద్దపప్పు ఆవకాయలో నిహారిక 'ఆశా' పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఆ టీజర్ యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. అలాగే ‘ఏ ఫర్ ఆశ, ఏ ఫర్ అర్జున్’. ‘ఆశ ఎవరు?, అర్జున్ ఎవరు?’ అంటూ హీరోయిన్ కాజల్, మంచు లక్ష్మి, నాని, సాయిధరమ్‌తేజ్, సందీప్ కిషన్ తదితరుల ద్వారా ఆసక్తికరంగా రూపొందించిన ప్రొమో వీడియోలు ప్రేక్షకుల్లో ఇప్పటికే ఎంతో ఉత్కంఠని రేకెత్తించాయి. కాగా నిహారిక ...ఓ ఛానల్లో ప్రసారమయ్యే చిన్న పిల్లల డాన్స్ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. -
'మెగా' హీరోయిన్ ముద్దపప్పు-ఆవకాయ
-
నిహారిక..నేనున్నా..!
⇒ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగు.. ⇒ సర్కార్ తరపున సాయం అందించేందుకు కృషి.. ⇒ భరోసనిచ్చిన సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితాసబర్వాల్ పెగడపల్లి : ‘నిహారిక బాధపడకు... త్వరలో నీవు సంపూర్ణ ఆరోగ్యం పొందుతావు... నీకు కావాల్సిన సాయాన్ని ప్రభుత్వం తరపునా అందేలా కృషిచేస్తా..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తి గత కార్యద ర్శి స్మితాసబర్వాల్ డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్న నిహారికకు భరోసానిచ్చింది. పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన సిగిరి కళావతి కూతురు నిహారిక(17) ఇంటర్ చదివింది. ఏడేళ్లుగా డయాబెటీస్‌తో బాధపడుతోంది. వ్యాధి నివారణ కోసం డయాబెటీస్ హోమిక్స్ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి చికిత్స పొందుతోంది. హైదరాబాద్‌లోని మేక్ ఏ విష్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో నిహారిక పాల్గొంది. స్మితాసబర్వాల్ అంటే తనకు ఇష్టమని, ఆమెతో మాట్లాడాలని ఉందని తన కోరికను వెల్లడించింది. దీంతో ఫౌండేషన్ చొరవతో మంగళవారం స్మితాసబర్వాల్ పెగడపల్లికి వచ్చారు. నిహారికను పరామర్శించి ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడారు. సుమారు గంటపాటు వారితో గడిపారు. కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మందులకు నెలకు రూ.5వేలు ఖర్చు అవుతున్నాయని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని, తమను ఆదుకోవాలని నిహారిక తల్లి కళావతి వేడుకుంది. దీంతో స్మితాసబర్వాల్ ‘వ్యాధి ఉందని బాధపడకుండా ముందుకు సాగితే విజయం సాధిస్తావు’ అని నిహారికకు ఆత్మస్థయిర్యం నింపారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి సివిల్స్‌లో తర్ఫీదుపొంది మంచి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిచారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తాను చేస్తానని భరోసానిచ్చారు. స్వయం ఉపాధి కోసం వృత్తివిద్యలో శిక్షణ పొందాలని, ఏదైనా తాత్కాలిక ఉద్యోగం ఇప్పిస్తానని తల్లి కళావతికి సూచించారు. ఆమె వెంట జగిత్యాల సబ్‌కలెక్టర్ కృష్ణభాస్కర్, మేక్ ఏ విష్ ఫౌండేషన్ డాక్టర్ పుష్పదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు వసంత, ఎంపీపీ సత్తయ్య, సర్పంచి రాజు ఉన్నారు. -
వారసురాలి ఎంట్రీపై ఒత్తిడిలో 'మెగా'ఫ్యామిలీ!
టాలీవుడ్ ఇండస్ట్రీకి వారసులు రావడం చాలా కామన్. హిస్టరీని తీసుకుంటే హీరోలు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టుల తనయులు హీరోలు అయ్యారు. కానీ, వారి కుమార్తెలు మాత్రం హీరోయిన్లు అవ్వడం ఎప్పుడో గానీ జరగదు. తాజాగా ఈ జాబితాలోకి నటుడు నాగబాబు కుమార్తె నీహారిక చేరిందన్న వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుందన్న విషయం అందరికీ విదితమే. వ్యాఖ్యాతగా ఇప్పటికే బుల్లితెరపై బోల్డంత పాపులార్టీ తెచ్చుకున్న 'మెగా' ఫ్యామిలీ అమ్మాయి నీహారిక ఇప్పుడు వెండితెర ఆరంగేట్రం చేసేందుకు సిద్దమైంది. మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు హీరోలుగానే వెండితెరకు పరిచయం అయ్యారు...అవుతున్నారు కూడా. అయితే నాగబాబు కూతురు నీహారిక వెండితెరకు పరిచయం అవుతుందనే వార్తలు గతంలోనే జోరుగా వినిపించాయి. అక్కినేని అఖిల్ సరసన నటించబోతోందని వార్తలొచ్చాయి కూడా.అఖిల్, నీహారిక ఇద్దరు కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించిన విషయం తెలిసిందే. తర్వాత ఏమైందో తెలియదు కానీ నీహారిక తెరంగేట్రం గురించి ఎటువంటి వార్తలు బయటికి రాలేదు. దీనికి అసలు కారణం పెదనాన్న చిన్నాన్నలు, నీహారికని సినిమాలో నటించవద్దని చెప్పడంతో తన ప్రయత్నాలు మానుకొందని తెలిసింది. దీనితో నీహారిక వెండితెరకు బదులుగా బుల్లితెరపై దర్శనమిచ్చింది. ఓ చానల్లో రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుటికే ఆమె తండ్రి నాగబాబు పలు టీవీ షోలకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన్నే ఆదర్శంగా తీసుకొని నీహారిక బుల్లితెర ప్రేక్షకుల్ని తనదైన శైలిలో మెప్పిస్తోంది. యువ హీరో నాగశౌర్యతో కలిసి వెండితెరకు పరిచయం అవబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ రూటే సపరేటు.. అన్ని సినీ పరిశ్రమల్లోకెల్లా తెలుగు చిత్ర పరిశ్రమ రూటే సపరేట్ అని చెప్పనక్కర్లేదు. నీహారిక సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయబోతుందంటూ ప్రకటించిన మెగా ఫ్యామిలీపై అభిమానులు మండిపడుతున్నారు. నిహారికను సినిమాల్లోకి రానివ్వద్దని మెగా ఫ్యామిలీపై అభిమానులు ఒత్తిడి తీసుకొస్తున్నారట. అయితే తన కూతురు పద్ధతిగా కనిపించే పాత్రలు మాత్రమే చేస్తుందంటూ నాగబాబు వివరణ ఇచ్చుకున్నారని ఇండస్ట్రీలో టాక్. మెగా ఫ్యామిలీపైనే అభిమానులు ఒత్తిడి తెచ్చారంటేనే పరిస్థితి ఏంటన్నది అర్థమవుతోంది. అయితే నాగబాబు మాత్రం తన కుమార్తె ఎంట్రీపై సుముఖంగా ఉన్నారు. అభిమానులకు కూడా ఆయన నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. లక్ష్మీ.. వెరీ లక్కీ.. అయితే, ఈ విషయంలో ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మీ చాలా లక్కీ అని చెప్పవచ్చు. మూవీ ఎంట్రీ ఇవ్వడంతోనే నంది అవార్డు గెలుచుకుని, దిగ్విజయంగా ఆమె తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. వారసురాళ్ల ఎంట్రీ విషయానికి వస్తే... ఇక ప్రేక్షకులే మాకు దేవుళ్లు.. వారు లేనిదే మేము లేము అనే నటులకు...వారి అభిమతాన్ని కూడా లెక్కలోకి తీసుకున్న సందర్భాలున్నాయి. గతంలో సూపర్‌స్టార్ కృష్ణ కూతురు మంజుల సినిమా ఎంట్రీ ఇచ్చినప్పుడూ ఆయన్ ఫ్యాన్స్ ఇలాగే రియాక్ట్ అయ్యారు. దాంతో తనకు ఇష్టం లేకపోయినా మంజుల కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టిందన్న విషయం తెలిసిందే. ఫ్యాన్స్ ఒత్తిడి వల్లే తన కుమార్తె ఆ నిర్ణయం తీసుకుందని కృష్ణ స్వయంగా ప్రకటించారు. ఇక్కడ మాత్రం పూర్తిగా భిన్నం కేవలం నటీనటుల కూతుళ్ల విషయానికొస్తే.. కోలీవుడ్‌లో కమల్ హాసన్ కుమార్తెలు శ్రుతీహాసన్, అక్షరా హాసన్, అర్జున్ కుమార్తె ఐశ్వర్య, శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి, రాధ పెద్ద కుమార్తె కార్తీక, చిన్నకూతురు తులసీ కూడా వెండితెరపై నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్లో గోవిందా కూతురు టీనా అహుజా, అనిల్‌కపూర్ తనయ సోనమ్ కపూర్, శతృఘ్నసిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా, సునీల్ శెట్టి గారాలపట్టి అతియాశెట్టి ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. కానీ టాలీవుడ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అలాగే నటీనటులు, దర్శకులు, నిర్మాతలు కూడా తమ వారసురాళ్లను తెరకు పరిచయం చేయటానికి ఆసక్తి చూపించడం లేదు. చిత్ర పరిశ్రమలో ఉన్న సాధకబాధకాల కారణంగానే వారు అనాసక్తత చూపిస్తున్నారు. కుటుంబసభ్యులే కాకుండా అభిమానులు కూడా వారసురాళ్ల వెండితెర ఎంట్రీకి అంతగా ఇష్టపడటం లేదు. అదే ఇప్పుడూ నిహారిక విషయంలో బయటపడిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
పసిడి పోరుకు నీహారిక
►మరో నలుగురు కూడా ►ప్రపంచ జూనియర్ బాక్సింగ్ తైపీ: భారత అమ్మాయిలు తమ పంచ్ పవర్‌తో ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో అదరగొట్టారు. ఐదు విభాగాల్లో ఫైనల్‌కు చేరుకొని కనీసం ఐదు రజతాలను ఖాయం చేసుకున్నారు. 70 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ గోనెల్ల నీహారికతోపాటు సోనియా (48 కేజీలు), సవిత (50 కేజీలు), మన్దీప్ సంధూ (52 కేజీలు), సాక్షి (54 కేజీలు) పసిడి పోరుకు అర్హత సాధించారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో నిహారిక పంచ్‌ల వర్షం కురిపించి తన ప్రత్యర్థి యు యువాన్ (చైనా)ను రెండో రౌండ్లో నాకౌట్ చేసింది. శనివారం జరిగే ఫైనల్స్‌లో అనస్తాసియా సిగయెవా (రష్యా)తో నీహారిక తలపడుతుంది. -
నిహారికకు పతకం ఖాయం
ప్రపంచ జూనియర్ బాక్సింగ్ తైపీ : ప్రపంచ జూనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కనీసం రెండు కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. హర్యానా బాక్సర్ సోనియా సాక్షి (48 కేజీలు), తెలంగాణ బాక్సర్ గొన్నెల నిహారిక (70 కేజీలు) తమ విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకొని పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 3-0తో సెరికోవా జానా (కజకిస్తాన్)పై గెలుపొందగా... నిహారికకు నేరుగా ‘బై’ లభించింది. నిహారిక సోదరి గొన్నెల నాగనిక (+ 80 కేజీలు)తోపాటు భారత్‌కే చెందిన సవిత (50 కేజీలు), మన్దీప్ కౌర్ (52 కేజీలు), నిషా (60 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
కిడ్స్ కా ఖలేజా
-
కిడ్స్ కా ఖలేజా
తెగిపడ్డ నింగి చుక్కలైనా.. తెగువ నేర్చి తరగని కీర్తి సంపాదిస్తున్నారు వాళ్లు. చెత్తకుండీల దగ్గర అనాథలైన బతుకులు.. బాలసదనం ఆసరాతో భవిష్యత్తుపై భరోసా పొందుతున్నాయి. కలలు కనే కన్నవారు కాదనుకున్నా..! అభాగ్యులం మేం కాదు.. మా విజయాలకు మురిసే భాగ్యం వాళ్లు కోల్పోయారంటున్నారు ఆ ఆడపిల్లలు. అన్ని విద్యల్లో ఆరితేరుతున్నారు. ఆత్మరక్షణ కోసం కుంగ్‌ఫూ నేర్చుకుంటున్నారు.. లలిత కళల్లో రాణిస్తున్నారు. ప్రోత్సహించే పేగుబంధం కరువైనా.. అవార్డులు గెలుచుకుంటున్నారు. నుదిటి రాతను గేలి చేసి గాలికి వదిలేసిన తల్లిదండ్రుల కాఠిన్యాన్ని మరచిపోయి.. అన్నింటా దూసుకుపోతున్న బాలసదనం బంగారు బిడ్డలను సాక్షి సిటీప్లస్ తరఫున స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ స్టార్ రిపోర్టర్లుగా పలకరించారు. రామ్: హాయ్ తల్లులూ.. ఎలా ఉన్నారు. పిల్లలు: హాయ్.. వి ఆర్ ఫైన్. లక్ష్మణ్: పుట్టినరోజుకు రావడం తప్ప మిమ్మల్నందరినీ ఇలా స్పెషల్‌గా కలుసుకుని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మౌనిక: మాకూ చాలాహ్యాపీగా ఉంది. లక్ష్మణ్: ముందుగా కేంద్ర ప్రభుత్వం నుంచి బాలశ్రీ అవార్డులందుకున్న నిహారిక, శాంతిప్రియలతో మొదలుపెడదాం. చెప్పమ్మా నిహారిక.. నీకు ఈ అవార్డు ఎందుకొచ్చింది? నిహారిక: పెయింటింగ్‌లో వచ్చింది సార్. లక్ష్మి (బాలసదనం ఇన్చార్జ్): నేను చెబుతాను సార్. నిహారిక మా దగ్గరికి వచ్చేసరికి నాలుగు రోజుల పిల్ల. చేతులు వంకరగా ఉన్నాయని తల్లి ఎక్కడో వదిలేసి వెళ్లింది. ముందుగా అలా మా దగ్గరకు వచ్చిన పిల్లలను శిశువిహార్‌లో చేరుస్తాం. తర్వాత చదువుకునే వయసుకు బాలసదన్‌కు వచ్చేస్తారు. అలా వచ్చిన అమ్మాయే నిహారిక. రామ్: అవునా.. నువ్వు బాలరత్న అవార్డు తీసుకుంటుంటే.. చూసి మురిసే అదృష్టాన్ని పోగొట్టుకుందమ్మా నిన్నుకన్న తల్లి. లక్ష్మణ్: వైకల్యం ప్రతిభకు అడ్డుకాదని నిహారికను చూసి అందరూ గర్వపడాలి. అన్ని అవయవాలు బాగున్నవారు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలి. లక్ష్మి: అవును సార్. లక్ష్మణ్: మీకు అమ్మానాన్న లేరన్న భావన ఎప్పుడూ రానివ్వకండి. చక్కని చదువు, అన్ని రకాల సదుపాయాలు, అద్భుతమైన భవిష్యత్తు.. ఇలా మీకు అన్నీ ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే మీరే మరో పది మందికి నీడనివ్వగలరు. మా చిన్నతనంలో ఇలా సాయం చేసేవారు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. రామ్: ఇక్కడ ర్యాంక్‌లు, అవార్డులు తెచ్చుకున్న విద్యార్థులతో పాటు కరాటే, కుంగ్‌ఫూ నేర్చుకుంటున్న పిల్లలు కూడా ఉన్నారని విన్నాం. లక్ష్మణ్: మీరు ఎప్పటి నుంచి ఇలాంటి విద్యలు నేర్చుకుంటున్నారు? ఎవరు నేర్పిస్తున్నారు? మధుస్మిత: ఏడాదిగా నేర్చుకుంటున్నాం సార్. మా మాస్టార్ పేరు కళ్యాణ్. మాకు ఉచితంగా నేర్పిస్తున్నారు. రామ్: అవునా.. ఎక్కడ కళ్యాణ్? కళ్యాణ్: నేను సర్. లక్ష్మణ్: నువ్వు చాలా గ్రేటయ్యా. కళ్యాణ్: నేను దీన్ని ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. డబ్బున్నవారు ఎలాగైనా, ఎక్కడైనా నేర్చుకోగలరు. వీళ్లకు నేర్పిస్తే వీరి జీవితాలకు ఉపయోగపడుతుంది. నాకూ గుర్తింపు ఉంటుంది కదా సార్. అస్మియ: ఎవరూ ఉన్నా.. లేకున్నా ఆడపిల్లకు రక్షణ కరువైందన్న వార్తలు రోజూ వింటూనే విన్నాం కదా సార్. లక్ష్మణ్: అస్మియ.. కుంగ్‌ఫూ నేర్చుకోక ముందు, తర్వాత నీలో మార్పు? అస్మియ: భయం పోయింది సార్. ఎవరైనా దాడి చేస్తే సమర్థంగా ఎదుర్కోగలనన్న నమ్మకం వచ్చింది. రామ్: ఆత్మరక్షణకు కావాల్సిన శారీరక స్థైర్యం అందరికీ ఉండాల్సిందే. ముఖ్యంగా ఆడపిల్లలకు ఎక్కువ ఉండాలి. లక్ష్మణ్: మీలో స్కేటింగ్ రాణులు కూడా ఉన్నారట! లక్ష్మి: అవును సార్. అందరూ ఉన్నారు. సాహసాలు, ఆటలు, పాటలు అన్నిట్లో ఉన్నారు. రామ్: మార్కుల గురించి చెప్పండి మేడమ్? లక్ష్మి: గతేడాది పదో తరగతిలో ఇద్దరు విద్యార్థులు 90 శాతం మార్కులు సాధించారు. ఇలా మెరిట్‌తో పాసైనవారిని దాతలు ముందుకొచ్చి చదివిస్తున్నారు. మా దగ్గరున్న చిన్నారుల్లో ఎనిమిది మంది కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్నారు. లక్ష్మణ్: వావ్.. చాలా గ్రేట్. అయితే మా పిల్లలు చాలా లక్కీ. చూడండి తల్లులూ మీరు కూడా మంచి మార్కులు తెచ్చుకుంటే ఇలాంటి స్కూల్స్‌లో చదువుకోవచ్చు. అమ్మానాన్న అందరూ ఉన్న పిల్లలు కూడా ఇలాంటి స్కూళ్ల గడప తొక్కలేకపోతున్నారు. రామ్: చదువులైపోయాక వీరి భవిష్యత్తు ఏంటి మేడమ్? లక్ష్మి: ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలొచ్చి సెటిల్ అయినవారు ఉన్నారు. విద్యార్హతకు తగ్గట్టు ప్రభుత్వమే ఉద్యోగం ఇస్తుంది. ఇల్లు కూడా ఇస్తుంది. లక్ష్మణ్: ఉద్యోగం తర్వాత? లక్ష్మి: ఇంకేం ఉంటుంది సార్? పెళ్లి. రామ్: మేం అప్పుడప్పుడు పేపర్లలో చదువుతుంటాం. చాలా గ్రాండ్‌గా చేస్తారు కదమ్మా ! లక్ష్మి: మా అమ్మాయిల పెళ్లిళ్లకు కలెక్టర్లు, కమిషనర్లు, మంత్రులు.. ఇలా ఎందరో వీఐపీలు హాజరవుతారు (నవ్వుతూ...) లక్ష్మణ్: మరి సంబంధాలు ఎవరు చూస్తారు? లక్ష్మి: అమ్మాయి కావాలని అబ్బాయిలే క్యూలో ఉంటున్నారు సార్.. రామ్: ఎందుకు రారు.. మా అమ్మాయిలకు ఏం తక్కువని? లక్ష్మణ్: లాంఛనాల సంగతేంటి మేడమ్? లక్ష్మి: ఉద్యోగం, ఇల్లు, ఇంట్లోకి కావాల్సిన వస్తువులూ అన్నీ మేమే ఇస్తాం. రామ్: కన్నవారు కూడా ఇవ్వలేనన్ని ఇస్తున్నారు. ఇంకా ఏం కావాలి మా తల్లులకు. లక్ష్మణ్: మహిళా శిశు సంక్షేమ శాఖలో అడుగుపెట్టిన ఏ ఆడపిల్లయినా మామూలు అమ్మాయని అనిపించుకోవద్దు. ఎవరికి వారు దీటుగా ముందుకెళ్లాలి. మీరేంటో నిరూపించుకోవాలి. మీ వెనుక ప్రభుత్వాధికారులున్నారు.. మాలాంటి ప్రజలున్నారు. మీ అందరికీ శుభం కలగాలని కోరుతున్నాను. రామ్: బాయ్ అమ్మలూ... థ్యాంక్యూ సార్.... -
కూల్ అండ్ లవ్లీ.. నిహారిక
నేను పక్కా హైదరాబాదీనంటోంది నటుడు ప్రదీప్, సరస్వతిల గారాలపట్టి డాక్టర్ నిహారిక. నాలుగేళ్ల వయసులోనే యాంకరింగ్ చేసిన నిహారిక బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. తండ్రి వారసత్వంగా వచ్చిన నటన నిహారికను పలు సినిమాల్లో నటించేలా చేసింది. యాంకరింగ్‌తో పాటు సీరియల్స్‌లో లీడ్ రోల్స్ పోషిస్తోంది. నటనను ప్రవృత్తిగా స్వీకరించిన నిహారిక వృత్తిపరంగా డెంటిస్ట్. సంప్రదాయానికి ప్రతీకగా కనిపించే ఈ అమ్మాయి.. ఆధునికతనూ సాదరంగా ఆహ్వానిస్తుంది. సిటీలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు.. మీ నిహారిక అంటూ పలు ముచ్చట్లు సిటీప్లస్‌తో పంచుకుంది. నాలుగేళ్ల వయసులోనే నా కెరీర్ మొదలైంది. అమ్మానాన్న ఇద్దరూ నటులే. వారి నటవారసత్వం నాకు లభించడం వరంగా భావిస్తున్నాను. దూరదర్శన్‌లో యాంకరింగ్‌తో నా కెరీర్ మొదలైంది. డీడీలో ప్రసారమైన బ్యాన్బ్యాంగ్తో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు అందుకున్నాను. తర్వాత 8 ఏళ్ల వయసులో డీడీలోనే ‘స్వరభారతి సుస్వరహారతి’ ప్రోగ్రామ్‌కు బెస్ట్ యాంకర్‌గా మరోసారి నంది అవార్డు అందుకున్నాను. తర్వాత పెళ్లిపందరి, మందాకిని, ప్రార్థన, పెళ్లి చూపులు, మరోచరిత్ర వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాను. ప్రస్తుతం శశిరేఖాపరిణయంలో లీడ్ రోల్(శారద) పోషిస్తున్నాను. స్టైల్ సూత్ర, హంగామా అన్లిమిటెడ్, 24 క్రాఫ్ట్స్, షో రీల్, సౌత్ జంక్షన్ , టోటల్ టాలీవుడ్ ప్రోగ్రామ్స్‌కు యాంకర్‌గా చేస్తున్నాను. డీడీ నేషనల్లో మ్యూజిక్ ప్రోగ్రామ్స్‌కు ప్రయోక్తగా పని చేస్తున్నాను. అలాగే.. నేనున్నాను, కుచ్చికుచ్చి కూనమ్మ, వన్స్‌మోర్, దేవస్థానం సినిమాల్లో నటించాను. ఈవెంట్ మేనేజింగ్ ఈవెంట్ మేనేజింగ్ కూడా చేస్తుంటాను. కార్పొరేట్ సంస్థల కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించే క్రియేటివ్ స్ట్రాటజీ కంపెనీ (క్రెస్ట్)కి సీఈవోగా వ్యవహరిస్తున్నాను. ఆంధ్రాబ్యాంక్, ఎస్బీఐ తదితర కార్పొరేట్ సంస్థలకు ఈవెంట్ ఆర్గనైజ్ చేశాను. సరిగమల్లోనూ కాస్త పట్టుంది. పలు రియాల్టీ షోల్లో నా గొంతు సవరించాను కూడా. భలే సరదా హైదరాబాద్‌తో నా అనుబంధం మాటల్లో చెప్పలేను. కర్ణాటకలోని రాయచూర్‌లో మెడిసిన్ చేసిన ఐదేళ్లు సిటీని ఎంతో మిస్సయ్యానన్న ఫీలింగ్ కలిగేది. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటుంది. సిటీలో చక్కర్లు కొట్టడం అంటే మహాసరదా. మా తమ్ముడు నితీష్‌తో సిటీలోని గల్లీగల్లీ తిరుగుతుంటాను. మంచి సినిమా అయితే రిలీజైన వారంలోనే చూసేస్తాను. అమ్మానాన్నతో కలసి వెళ్తుంటాను. ఒక్కోసారి నేను, నాన్న ఇద్దరమే వెళ్లి సినిమాలు చూస్తుంటాం. జీవితాన్నిచ్చింది.. హిందీ, ఉర్దూ కలగలసిన హైదరాబాదీ స్లాంగ్‌లో ఓ మజా ఉంటుంది. ఆ భాషలో ఓ కమాండ్ ఉంటుంది. చార్మినార్ దగ్గర, శిల్పారామంలో ఎంతసేపైనా షాపింగ్ చే యొచ్చు. అక్కడ దొరకని ఐటం అంటూ ఉండదనుకోండి. గోల్కొండ కోట చూస్తే కాస్త గర్వంగా ఫీలవుతుంటాను. కోటపై నుంచి సిటీ వ్యూ భలే బాగుంటుంది. రాత్రి వేళలో ఐస్‌క్రీమ్ కోసం తమ్ముడితో కలసి బైక్ మీద వెళ్తుంటాను. హుస్సేన్‌సాగర్ వెళ్తే.. ముసురుకున్న చీకట్లలో.. వెన్నెల పరుచుకున్నట్టు కనిపించే బుద్ధుడి విగ్రహం ఎంతసేపైనా చూస్తూ ఉండిపోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే హైదరాబాద్‌కు మించిన కూల్ అండ్ లవ్లీ ప్లేస్ మరెక్కడా ఉండదు. జన్మనిచ్చింది అమ్మానాన్నలైతే.. జీవితాన్నిచ్చింది మాత్రం హైదరాబాదే. - శిరీష చల్లపల్లి