Naveen Murder Case Updates: Harihara Krishna Lover Niharika Reddy Arrest And Sent TO Chanchalguda Jail - Sakshi
Sakshi News home page

నవీన్‌ కేసు: చంచల్‌గూడ జైలుకు సైకో ప్రియురాలు నిహారిక

Published Tue, Mar 7 2023 7:52 AM | Last Updated on Tue, Mar 7 2023 11:13 AM

Naveen case Updates: Lover Niharika Sent TO Chanchalguda Jail - Sakshi

సాక్షి, క్రైమ్‌: నవీన్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది న్యాయస్థానం. నవీన్ హత్య కేసులో పోలీసులు హాసన్‌, నిహారికలను అరెస్ట్‌ చేసి.. తాజా నిందితులుగా చేర్చి సోమవారం హయత్‌ నగర్ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు  పోలీసులు. ఈ కేసులో నిహారిక, హసన్‌లను ఏ2, ఏ3లుగా చేర్చారు.

ఇక ఈ నిందితులిద్దరికీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన హయత్‌ నగర్‌ కోర్టు. దీంతో న్యాయమూర్తి నివాసం నుంచి నేరుగా నిహారికను చంచల్‌గూడ జైలుకు, హసన్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. 

హాసన్‌  ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు స్నేహితుడు కాగా, నిహారిక గర్ల్‌ఫ్రెండ్‌. ప్రేమ వ్యవహారం కారణంగానే నవీన్‌ హత్య జరిగింది. గత నెల 17న జరిగిన నవీన్‌ను అతి కిరాతకంగా హరిహరకృష్ణ హత్య చేశాడు.  ఈ హత్య గురించి నిహారికకు కూడా తెలుసని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. 

హత్య జరిగిన తర్వాత.. ప్రియుడు హరిహరను గుడ్‌ బాయ్‌ అంటూ నిహారిక మెచ్చుకోవడం, ఆపై అవసరం ఉందని చెబితే రూ.1500 ట్రాన్స్‌ఫర్‌ కూడా చేసింది. నవీన్‌ను హత్య చేసిన ఘటనాస్థలానికి హరిహర, నిహారిక, హసన్‌ ముగ్గురు వెళ్లారని పోలీసులు తేల్చారు. మరోవైపు తన ఫోన్‌లోని సమాచారాన్ని తొలగించడం ద్వారా ఆధారాలను మాయం చేసేందుకు నిహారిక ప్రయత్నించిందని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement